హైదరాబాద్ : జగద్గిరిగుట్ట పోలీసు స్టేషన్ పరిధిలో ఓ బాలిక, బాలుడు అదృశ్యం అయ్యారు. ఏడుకొండలు, సుశీల దంపతుల పిల్లలైన లక్ష్మి కల్యాణి (14), పునీత్ (8) శనివారం సాయంత్రం ఇంటి సమీపంలోని ఓ ఆలయానికి వెళ్లారు. రాత్రి అయినా తిరిగి రాకపోవడంతో తల్లిదండ్రులు ఆందోళనతో చుట్టుపక్కల ప్రాంతాల్లో వెతికారు. ఆచూకీ లభించకపోవడంతో ఆదివారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. లక్ష్మి తన వెంట తీసుకెళ్లిన సెల్‌ఫోన్ నంబర్ ఆధారంగా వారి జాడ తెలుసుకునేందుకు పోలీసులు దర్యాప్తు చేపట్టారు.