హైదరాబాద్ : జీహెచ్ఎంసీ ఎన్నికల నేపథ్యంలో జగద్గిరిగుట్టలో 15 మంది రౌడీ షీటర్లను మంగళవారం పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి 3 ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం వారిని పోలీస్ స్టేషన్కి తరలించారు. రౌడీ షీటర్ల నుంచి స్వాధీనం చేసుకున్న ఆయుధాలకు అనుమతి లేదని పోలీసులు చెప్పారు.
ఫిబ్రవరి 2వ తేదీన జీహెచ్ఎంసీ ఎన్నికలు జరగనున్నాయి. అయితే ఈ ఎన్నికలు శాంతియుతంగా నిర్వహించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుంది. అందులోభాగంగా నగరంలోని పలువురు రౌడీ షీటర్లను పోలీసులు అదుపులోకి తీసుకుంటున్నారు.