
ప్రతీకాత్మక చిత్రం
జగద్గిరిగుట్ట: మాయమాటలు చెప్పి ఓ వ్యక్తి, బాలికపై పలుమార్లు లైంగిక దాడి చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. జగద్గిరిగుట్ట పరిధిలోని ఎల్లమ్మబండకు చెందిన బాలిక (15), తల్లిదండ్రులు డ్యూటీకి వెళ్లగా.. ఇంట్లో ఆన్‌లైన్ క్లాసులు వింటూ ఒంటరిగా ఉంటున్నది. అదే క్రమంలో ఇంటి యజమాని కుమారుడు మధుసూదన్ రెడ్డి (27) బాలికపై పలుమార్లు లైంగిక దాడి చేశాడు.
దీనిని వీడియోలో చిత్రీకరించాడు. విషయం ఎవరికైనా చెబితే సోషల్ మీడియాలో పెడతానని బాలికను భయపెట్టాడు. మనోవేదనకు గురైన బాలిక ఈనెల 12న విషం తాగి ఆత్మహత్యా యత్నం చేసింది. బాలికను చికిత్స నిమిత్తం గాంధీ హాస్పిటల్‌కు తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
(చదవండి: చిన్నారి వైద్యం కోసం వెళ్తూ..)
Comments
Please login to add a commentAdd a comment