house owner
-
ఆరున్నర లక్షల కరెంటు బిల్లు.. అవాక్కైన ఇంటి యజమాని!
సాక్షి, యాదాద్రి జిల్లా: ఇంట్లో రెండు బల్బులు, రెండు ఫ్యాన్లు ఉన్నప్పుడు, సాధారణంగా కరెంట్ బిల్లు ఎంత వస్తుందో ఆలోచించండి. మహా అయితే.. రేయింబవలు వేసిన 400 నుంచి 500 మించి రాదు. మహా అయితే వెయ్యి రూపాయలు వస్తుందేమో. కాకపోతే ఓ ఇంటికి ఎంత బిల్ వచ్చిందో తెలిస్తే షాక్ అవుతారు. మండుటెండలో ఇంటి కరెంట్ బిల్లు చూసిన యజమానికి చెమటలు పట్టడమే కాకుండా.. ఒక్కసారిగా గుండె ఆగిపోయినంత పని అయ్యింది. ఈ ఘటన యాదాద్రి భువనగిరి జిల్లాలో వెలుగు చూసింది.జిల్లాలోని ఆత్మకూరు(ఎం) మండలం రహీంఖాన్‌పేట గ్రామానికి చెందిన డీ పరశురాములు ఇంటికి విద్యుత్తు బిల్లు రీడింగ్ తీసేందుకు సోమవారం ట్రాన్స్‌కో సిబ్బంది వచ్చారు. ప్రతి నెలా గృహజ్యోతి పథకం కింద 200 యూనిట్లలోపు సబ్సిడీ వర్తించే సర్వీస్ నంబర్.. సోమవారం మీటర్ రీడింగ్‌ను స్కాన్ చేస్తుండగా ఒక్కసారిగా రూ.6,72,642 బిల్లు వచ్చింది.రీడింగ్ ఒక్కసారిగా 5,40,927 యూనిట్లు వాడినట్టు రావడంతో ఇంటి యాజమాని అవాక్కయ్యాడు. గృహజ్యోతి కింద సబ్సిడీ వస్తున్న విద్యుత్తు బిల్లు ఏకంగా రూ.6,72,642 రావడం ఏంటని ట్రాన్స్‌కో సిబ్బందిని ప్రశ్నించాడు. ఈ విషయమై ట్రాన్స్‌కో ఏఈ ప్రభాకర్‌రెడ్డిని వివరణ కోరగా.. రీడింగ్ తీస్తున్న సమయంలో హై ఓల్టేజ్ వచ్చినట్టయితే రీడింగ్ జంప్ అయ్యి పెద్ద మొత్తంలో బిల్లు వచ్చే అవకాశం ఉంటుందని తెలిపారు. అధిక బిల్లు వచ్చిన మీటర్‌ను టెస్టింగ్ కోసం పంపినట్టు ఆయన పేర్కొన్నారు. -
పనిపిల్లపై యజమాని కుటుంబం దాష్టీకం
గురుగ్రామ్: పదమూడేళ్ల పనిపిల్ల పట్ల ఓ ఇంటావిడ దారుణంగా ప్రవర్తించింది. హరియాణాలోని గురుగ్రామ్ పట్టణంలోని సెక్టార్ 51 పరిధిలో ఈ ఘటన చోటుచేసుకుంది. పనికి కుదిర్చిన వ్యక్తితో కలిసి ఎట్టకేలకు తల్లి.. ఆమె కూతురుని విడిపించుకుంది. తాను అనుభవించిన చిత్రహింసను కూతురు ఏడుస్తూ చెప్పడంతో తల్లి పోలీసులకు ఫిర్యాదుచేశారు. పోలీసులకు అందిన ఫిర్యాదు ప్రకారం.. బిహార్‌కు చెందిన ఈమె తన కూతురును జూన్ 27వ తేదీన ఒకావిడ ఇంట్లో పనికి కుదిర్చింది. ఇంట్లో ఉంచుకుని, పనికి నెలకు రూ.9,000 జీతం ఇచ్చేలా ఒప్పందం కుదర్చుకుంది. ‘‘ మొదట్లో రెండు నెలలు మాత్రమే నా కుతురుకు జీతం ఇచ్చారు. ఆ తర్వాత చిల్లిగవ్వ ఇవ్వలేదు. ఇంటి పని అంతా చేయించుకుని ఇష్టమొచి్చనట్ట కొట్టేవారు. పెంపుడు కుక్కతో కరిపించేవారు. యజమాని ఇద్దరు కుమారులు నా బిడ్డను లైంగికంగా వేధించారు. బలవంతంగా బట్టలూడదీసి ఫొటోలు, వీడియోలు తీసేవారు. అసభ్యంగా తాకేవారు. యజమానురాలు ఇనుప కడ్డీ, సుత్తితో కొట్టి చిత్రహింసలు పెట్టేది. బయటకు తప్పించుకునిపోకుండా గదిలో బంధించేవారు. కట్టేసి అరవకుండా నోటికి టేప్ అంటించారు. చేతులపై యాసిడ్ పోశారు. విషయం బయటకు పొక్కితే చంపేస్తామని బెదిరించేవారు. నా బిడ్డకు రెండు రోజులకు ఒకసారి భోజనం పెట్టేవారు. ఇంతటి దారుణాలు తెలిశాక స్థానిక వ్యక్తితో కలిసి ఎట్టకేలకు ఆ బిడ్డను విడిపించుకున్నా’’ అని టీనేజర్ తల్లి వాపోయారు. -
గుండె గు‘బిల్లు’!.. ఖాళీగా ఉన్న ఇంటికి రూ. 7,97,576 కరెంట్ బిల్లు
సాక్షి, ఉప్పల్: ప్రతి నెల రూ. 200 నుంచి రూ. 300 వరకు వచ్చే విద్యుత్ బిల్లు ఏకంగా రూ. 7,97,576 రావడంతో ఇంటి యాజమానుల గుండె ఆగినంత పనైంది. ఇదేమని విద్యుత్ అధికారులను ప్రశ్నిస్తే డీడీ కట్టి మీటర్‌ను చెక్ చేయించుకోవాలని, లేని పక్షంలో వచ్చిన బిల్లు కట్టాల్సిందేనని గద్దించారు. ఈ సంఘటన ఉప్పల్ ఏఈ పరిధిలో హైకోర్డు కాలనీలో చోటు చేసుకుంది. బాధితురాలు చెప్పిన వివరాల ప్రకారం... ఉప్పల్ హైకోర్టు కాలనీకి చెందిన పాశం శ్రీదేవి పేరిట రెండు మీటర్లు ఉన్నాయి. గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న ఖాళీ పోర్షన్‌కు ఉన్న విద్యుత్ మీటరుకు ప్రతి నెల రూ. 300లోపు మిని మం బిల్లు వచ్చేది. అయితే మే నెలకు సంబంధించి జూన్‌లో వచ్చిన బిల్లు ఆన్లైన్లో చెక్ చేయగా ఏకంగా రూ. 7,97,576లు రావడంతో ఇంటి యాజమానుల గుండె ఆగినంత పనైంది. వెంటనే విద్యుత్ అధికారులను సంప్రదిస్తే నిర్లక్ష్య సమాధానం చెబుతూనే మీటరు టెస్టింగ్‌కు డీడీ కట్టుకొని చెక్ చేయించుకోవాల్సిందిగా లేని పక్షంలో వచ్చిన బిల్లు కట్టాల్సిందేనంటూ చేతులు దులిపేసుకున్నారు. దీంతో చేసేది లేక రూ. 150 డీడీ కట్టి మౌలాలిలో మీటర్ చెక్ చేయించారు. మీటరు డిఫెక్ట్ ఉన్నట్లు రిపోర్టులో రావడంతో ఊపిరి పీల్చుకున్నారు. దీనిపై వివరణ కోసం మాట్లాడేందుకు యత్నించగా ఉప్పల్ సర్కిల్ ఏడీఈ బాలకృష్ణ అందుబాటులోకి రాలేదు. చదవండి: పాలమూరులో ‘అవతారపురుషుడి’ హల్చల్ -
ఇంటి ఓనర్ పాడు పని.. అమ్మాయిలకు తెలియకుండా.. ఫ్లాట్‌లో
జైపూర్: ఓ ఇంటి యజమాని పాడు పని చేశాడు. అమ్మాయిలకు రెంట్ ఇచ్చిన ఫ్లాట్‌లో వాళ్లకు తెలియకుండానే రహస్యంగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేశాడు. బెడ్రూం, బాత్రూంలో స్పై కెమెరాలు పెట్టి తరచూ వాళ్ల అశ్లీల దృశ్యాలను వీక్షించాడు. ఫ్లాట్‌లో షార్ట్ సర్క్యూట్ కారణంగా కరెంట్ పోవడంతో అమ్మాయిలు ఎలక్ట్రిషన్‌ను పిలిపించగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. అతను వైర్లు పరిశీలిస్తుండగా ఐదారు సీక్రెట్ కెమెరాలు కన్పించాయి. దీంతో కంగుతిన్న ముగ్గురు అమ్మాయిలు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారు యజమానిని ఏఫ్రిల్ 27న అరెస్టు చేసి కోర్టులో ప్రవేశపెట్టారు. న్యాయస్థానం నిందితుడికి మే 15 వరకు జ్యుడీషియల్ కస్టడీ విధించింది. చదవండి: నడుస్తున్న ట్రక్కు నుంచి మేకల చోరీ.. ఆ తర్వాత కారుపై జంప్.. ధూమ్ సినిమాను తలపించిన దొంగతనం రాజస్థాన్ ఉదయ్‌పూర్‌లో ఈ ఘటన జరిగింది. ఇంటి యజమాని పేరు రాజేంద్ర సోని. సీసీటీవీల వ్యాపారం చేస్తున్నాడు. కంప్యూటర్ సైన్స్ విభాగంలో ఎంటెక్ చేసిన ఇతడు ఐటీ నిపుణుడు. స్పై కెమెరాలు ఎలా ఇన్స్టాల్ చేయాలో బాగా తెలుసు. అందుకే అమ్మాయిలు సెలవుల్లో ఇంటికి వెళ్లినప్పుడు డూప్లికేట్ కీ ఉపయోగించి ఫ్లాట్‌లో సీసీ కెమెరాలు ఫిక్స్ చేశాడు. ఉచిత వైఫై అందిస్తానని చెప్పి రూటర్ కూడా ఇన్స్టాల్ చేశాడు. విచారణలో నేరాన్ని అంగీకరించాడు. ఇలా సీక్రెట్‌గా వీడియోలూ చూడటం తన బలహీనత అని చెప్పుకొచ్చాడు యజమాని. చాలా కాలంగా ఇలా చేస్తున్నట్లు తెలిపాడు. కాగా.. ఈ ముగ్గురు అమ్మాయిలు 8 నెలల క్రితం ఈ ఫ్లాట్‌ను అద్దెకు తీసుకున్నట్లు తెలుస్తోంది. సీసీ కెమెరాలను ఇన్ని రోజులు గమనించలేకపోయామని వారు ఆందోళన వ్యక్తం చేశారు. చదవండి: పెళ్లికూతురు ముందు పరువు పోగొట్టుకున్న పెళ్లికొడుకు.. పాపం ప్యాంటు ఊడి ఇబ్బందిగా.. -
ఇంటర్లో తక్కువ మార్కులొచ్చాయని ఇల్లు అద్దెకివ్వని ఓనర్.. ఎక్కడో తెలుసా?
మంచి ఉద్యోగం రావాలంటే బాగా చదువుకోవాలి, మంచి మార్కులు తెచ్చుకోవాలని చిన్నప్పటి నుంచి వింటూనే ఉన్నాము. అయితే ఇప్పుడు మంచి మార్కులుంటేనే ఇల్లు అద్దెకు లభిస్తుంది. వినటానికి ఇది కొత్తగా అనిపించినా ఇది అక్షరాలా నిజం. ఈ సంఘటన ఇటీవల బెంగళూరులో వెలుగులోకి వచ్చింది. బెంగళూరులో వెలుగులోకి వచ్చిన సంఘటనలో హౌస్ బ్రోకర్, హౌస్ ఓనర్, రెంట్ కోసం వచ్చిన వ్యక్తికి మధ్య జరిగిన సంభాషణ ట్విటర్ అకౌంట్ ద్వారా వైరల్ అయింది. ఇందులో 'మీ మార్కులు మీ జీవితాన్ని నిర్ణయిస్తాయో లేదో తెలియదు కానీ బెంగళూరులో అద్దెకి ఉండాలంటే మాత్రమే నిర్ణయించేది మీ మార్కులే' అని శుభ్ అనే వ్యక్తి ట్విటర్ ద్వారా షేర్ చేశారు. సెకండ్ ఇయర్ ఇంటర్మీడియట్లో 76 శాతం మార్కులు వచ్చాయనే కారణంతో బెంగళూరులో ఒక ఇంటి ఓనర్ మా కజిన్‌కు ఇల్లు అద్దెకు ఇవ్వలేదని, ఇది అస్సలు నమ్మలేకపోతున్నానని శుభ్ ట్వీట్ చేశారు. నిజానికి యోగేష్ అనే వ్యక్తి అద్దె ఇంటికోసం బ్రోకర్ ని సంప్రదించాడు. అతడి ప్రొఫైల్ యాక్సెప్ట్ చేసిన హౌస్ ఓనర్ లింక్డ్ఇన్, ట్విట్టర్ వంటి ఫ్రొఫైల్స్ తో పాటు పదవతరగతి, ఇంటర్ మార్క్స్ కార్డ్స్, పాన్, ఆధార్ కార్డుతో పాటు 150 నుంచి 200 పదాల్లో తన గురించి ఇంట్రో రాసి పంపాలని చెప్పాడు. (ఇదీ చదవండి: ఎగిరే కారు వచ్చేసిందండోయ్! రూ. 6.5 లక్షలతో ఇంటికి తీసుకెళ్లొచ్చు..) హౌస్ ఓనర్ చెప్పినవన్నీ యోగేష్ చేశారు. అయితే ఇంటర్లో 76 శాతం మార్కులు వచ్చాయనే కారణంగా ఇల్లు అద్దెకు ఇవ్వడం కుదరదని చెప్పాడు. ఈ సంభాషణకు సంబంధించిన సమాచారం మొత్తం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ ట్వీట్ ఇప్పటికి 15 లక్షల మందికి పైగా చూసారు. కొంతమంది రాబోయే రోజుల్లో బెంగళూరులో అద్దె ఇంటికోసం ఎంట్రన్స్ ఎగ్జామ్ ఏమైనా పెడతారేమో అంటూ కామెంట్ చేసాడు. "Marks don't decide your future, but it definitely decides whether you get a flat in banglore or not" pic.twitter.com/L0a9Sjms6d — Shubh (@kadaipaneeeer) April 27, 2023 ఇలాంటి ఆసక్తికరమైన విషయాలు ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి సాక్షి బిజినెస్ చూస్తూ ఉండండి. ఈ కథనంపై మీ అభిప్రాయాలను, సందేహాలను తప్పకుండా మాతో పంచుకోండి. -
టు లెట్.. టేక్ కేర్
హిమాయత్‌నగర్: నగరంలోని ఇల్లు ఎవరిదైనా అద్దెకు ఉందని యాడ్ కనిపిస్తే చాలు. క్షణాల్లో కొత్త ఫోన్ నంబర్ నుంచి ఇంటి యజమానికి ఫోన్ వస్తుంది. ‘నేను ఆర్మీలో అధికారిని, మీ ఇల్లు అద్దెకు ఉన్న విషయాన్ని ఇప్పుడే వెబ్సైట్లో చూశాను. మీ ఇల్లు నాకెంతో నచ్చింది’, అంటూ మోసాలకు పాల్పడుతున్నారు. ఆర్మీ అధికారులంటే ప్రజల్లో ఉన్న ఓ గొప్ప నమ్మకాన్ని సైబర్ నేరగాళ్లు క్యాష్ చేసుకుంటున్నారు. మీరు ముందుగా మా అకౌంట్‌కు కొంత డబ్బు పంపండి అది ఓకే అయితే వెంటనే మీకు ఏడాదికి సరిపోయే ఇంటి అద్దె డబుల్ చెల్లిస్తామంటూ మాయ మాటలు చెప్తూ లక్షల రూపాయిలు కాజేస్తున్నారు. కేవలం ఆర్మీ అధికారులు మోసం చేయరనే ఒక నమ్మకంతో అమాయక ప్రజలు లక్షల పోగొట్టుకుంటూ సైబర్‌క్రైం పోలీసుస్టేషన్ మెట్లు ఎక్కుతున్నారు. నమ్మకాన్ని రెట్టింపు చేస్తూ కొట్టేస్తున్నారు ఆర్మీలో పనిచేసే అధికారుల ఇల్లు అద్దె అంతా కూడా ఆర్మీనే చెల్లిస్తుంది. ఆరు నెలల నుంచి ఏడాదికి సరిపోయే అద్దెతో పాటు ఆరు నెలల అడ్వాన్స్ ముందుగానే మీ అకౌంట్లో పడుతుందని చెబుతున్నారు. దీనికి ఇంటి యజమాని ఓకే చెప్పడంతో పథకాన్ని రచిస్తున్నారు. ముందుగా మీకొక లింకు పంపుతాము దానికి కేవలం రూ. 5 పంపండి మీకు రూ. 10 వస్తాయి మా ఆర్మీ నుండంటూ సూచిస్తున్నారు. వెంటనే వాళ్లు పంపిన లింకుకు రూ. 5 పంపగానే రూ. 10 వస్తున్నాయి. ఆ తర్వాత నెల అద్దె రూ. 12 వేలు ఉంటే రెండునెలలవి రూ. 24 వేలు పంపమంటున్నారు. అవి పంపినప్పటి నుంచి సైబర్ కేటుగాళ్ల డ్రామా మొదలవుతుంది. ఏదో టెక్నికల్ సమస్య ఉందంటూ మళ్లీ పంపాలని కాజేస్తున్నారు. ఇదే తరహాలో వారం క్రితం ఓ గృహణి పలు దఫాలుగా వారు చెప్పిన లింకుకు ఒక్కరోజులో రూ. 12 లక్షలు పంపింది. ఇంకా ఇంకా అడగడంతో అప్పటికి ఆమె మోసపోయినట్లు గ్రహించి సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశారు. కాగా ఆర్మీ అధికారుల పేర్లు చెబుతూ ఈ దందా చేస్తున్నవారంతా కూడా రాజస్థాన్, యూపీకి చెందిన వారిగా సైబర్‌క్రైం పోలీసులు గుర్తించారు. (చదవండి: దయచేసి ఆ గుర్తులను తొలగించండి.. టీఆర్ఎస్ విజ్ఞప్తి) -
ఒంటరిగా ఉన్న యువతి ఇంట్లోకి వెళ్లి.. పిస్తోల్‌తో బెదిరించి..
బనశంకరి(బెంగళూరు): ఇంట్లో అద్దెకు ఉండే యువతిని పిస్తోల్‌తో బెదిరించి అత్యాచారానికి పాల్పడిన ఇంటి యజమానిని ఆదివారం అశోక్‌నగర పోలీసులు అరెస్ట్ చేశారు. బిహార్‌కు చెందిన అనిల్ రవి శంకర్‌ప్రసాద్ నిందితుడు. టైల్స్ వ్యాపారం కోసం ఇతను నగరంలో ఉంటున్నారు. ఇతని ఇంట్లో పశ్చిమ బెంగాల్‌కు చెందిన యువతి గత మార్చి నుంచి బాడుగకు ఉంటోంది. ప్రైవేటు కాలేజీలో డిగ్రీ చదువుతున్న యువతి ఇంటికి తరచూ స్నేహితులు వస్తుండటంతో అనిల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సమయంలో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. కొద్దిరోజుల క్రితం యువతి స్నేహితుడితో కలిసి ఉండటాన్ని గమనించిన ఇంటి యజమాని కేసు పెట్టిస్తానని బెదిరించాడు. ఏప్రిల్ 11న యువతి ఇంటిలోకి వచ్చిన అనిల్ తన లైసెన్స్ రివాల్వర్‌తో వచ్చి బెదిరించి అత్యాచారం చేశాడు. ఈ ఘటనపై బాధితురాలు తల్లిదండ్రులతో కలిసి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆదివారం ఇంటి యజమానిని పోలీసులు అరెస్ట్ చేసి విచారణ చేస్తున్నారు. చదవండి: ప్రేమను చంపుకోలేక.. ప్రాణం తీసుకుంది -
చేనేత కార్మికుడి మృతి.. ఇంటి యజమాని అమానుషం
జనగామ: అనారోగ్యంతో మరణించిన చేనేత కార్మికుడి మృతదేహాన్ని ఇంట్లోకి తీసుకువచ్చేందుకు యజమాని నిరాకరించిన విషాద ఘటన గురువారం జనగామ జిల్లా కేంద్రం వీవర్స్ కాలనీలో జరిగింది. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. కాలనీకి చెందిన మండల శంకర్(60) నాలుగున్నర దశాబ్దాలుగా చేనేత వృత్తిని నమ్ముకుని అద్దింట్లో ఉంటూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. రెండేళ్ల పాటు కరోనాతో నమ్ముకున్న వృత్తి నట్టేట ముంచేయగా, ప్రస్తుతం పెరిగిన నూలు ధరలతో పట్టుచీర వ్యాపారం అట్టడుగు స్థాయికి పడిపోయింది. చీరల తయారీ, అమ్మకాలు మందగించడంతో కొన్ని నెలలుగా కుటుంబ పోషణ భారంగా మారింది. దీంతో మానసికంగా కుంగిపోయిన శంకర్ అనారోగ్యం పాలై ఇంటి వద్దనే మృతిచెందాడు. కార్మికుడు మృతి చెందడంతో అద్దె ఇంటి యజమాని మృతదేహాన్ని తీసుకువచ్చేందుకు నిరాకరించడంతో అక్కడే ఉన్న బంధువుల ఖాళీ స్థలంలో చివరి మజిలీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రభుత్వం మానవత్వంతో బాధిత కుటుంబాన్ని ఆదుకోవాలని కౌన్సిలర్ గుర్రం భూలక్ష్మినాగరాజు విజ్ఞప్తి చేశారు. మృతునికి భార్మ నిర్మల, నలుగురు కూతుళ్లు, ఒక కుమారుడు ఉన్నారు. -
‘ఎంజీఎం’ బాధితుడి మృతదేహాన్ని ఇంట్లోకి అనుమతించని ఓనర్
హసన్‌పర్తి: నిమ్స్‌లో చికిత్స పొందుతూ శుక్రవారం రాత్రి మృతిచెందిన వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిలో ఎలుకల దాడి బాధితుడు కడార్ల శ్రీనివాస్ (37) మృతదేహాన్ని ఇంట్లోకి తీసుకెళ్లేందుకు యజమాని నిరాకరించాడు. హనుమకొండలోని కుమార్‌పల్లిలో అద్దెకు ఉంటున్న ఇంటికి తీసుకురాగా యజమాని అభ్యంతరం చెప్పాడు. తన ఇంట్లోకి తీసుకు రావద్దని చెప్పడంతో భీమారంలోని ఆయన సోదరుడి ఇంటికి తీసుకెళ్లి అంత్యక్రియలు పూర్తి చేశారు. హనుమకొండ ఆర్డీఓ వాసుచంద్ర, శ్రీనివాస్ మృతదేహానికి నివాళులర్పించారు. అంత్యక్రియల కోసం కుటుంబానికి రూ. 20 వేల ఆర్థిక సాయం అందించారు. శ్రీనివాస్ కుటుంబంలో ఒకరికి ఉద్యోగంతోపాటు డబుల్ బెడ్రూం ఇల్లు మంజూరు చేస్తామని ఎమ్మెల్యే అరూరి రమేశ్ తెలిపారు. ఈ అంశంపై వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావుతో మాట్లాడినట్లు చెప్పారు. -
ఫోన్లో ఎంటర్ చేయగానే లక్ష రూపాయలు మాయం!
బాలానగర్: ఇంటిని అద్దెకు ఇస్తానని ఆన్లైన్లో పోస్ట్‌పెట్టిన వ్యక్తి రూ.లక్ష పోగొట్టుకున్న ఘటన బాలానగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. సీఐ ఎండీ వాహిదుద్దీన్ వివరాల ప్రకారం.. బాలానగర్ డివిజన్‌కు చెందిన గన్ను తిరుపతయ్య సాయినగర్‌లోని ఫ్లాట్‌ను అద్దెకు ఇవ్వడానికి నోబ్రోకర్ డాట్ కమ్‌లో 2వ తేదీన పోస్ట్ చేయగా.. నేను మీ ఇంటిని అద్దెకు తీసుకుంటానని ఓ వ్యక్తి రిప్లే ఇచ్చాడు. నెలకు రూ.15 వేల అద్దె 3 నెలల అడ్వాన్స్‌గా ఇవ్వాలని తిరుపతయ్య కోరగా గుర్తు తెలియని ఆ వ్యక్తి గూగుల్ పే నుంచి మీ అకౌంట్ వివరాలు పంపాలని కోరగా బాధితుడు పంపాడు. కాసేపటి తర్వాత మీ దగ్గర నుంచి నాకు మెసేజ్ రాలేదని ఓసారి రూ.45 వేలు ఎంటర్ చేసి చూపండి అని చెప్పగా తిరుపతయ్య అదే విధంగా చేయగా రెండు దఫాలుగా రూ.45 వేలు, మరోసారి రూ.10 వేలు తిరుపతయ్య అకౌంట్ నుంచి డెబిట్ అయినట్లు మెసేజ్ వచ్చింది. దీంతో మోసపోయినట్లు గ్రహించి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. -
దారుణం: కాళ్లు చేతులు కట్టేసి.. నోట్లో చీర కొంగు కుక్కి..
సాక్షి, అల్వాల్: నల్లాలు పని చేయడం లేదని ఇంట్లోకి పిలిచి ఇంటి యజమానురాలిని చార్జింగ్ కేబుల్‌తో కాళ్లు చేతులు కట్టేసి నోట్లో చీర కొంగు కుక్కి ల్యాప్‌టాప్ కేబుల్‌ను గొంతుకు బిగించి దారుణంగా హత్య చేసిన సంఘటన అల్వాల్ పరిధిలో గురువారం వెలుగులోకి వచి్చంది. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. కానాజీగూడ సత్యసాయి కాలనీకి చెందిన మంగతాయారు(75) కుమారుల్లో ఒకరు ఆర్మీలో కల్నల్‌గా పనిచేస్తుండగా, మరొకరు అమెరికాలో ఉంటున్నారు. కుమార్తె ఆమె ఇంటికి సమీపంలోనే ఉంటోంది. మంగతాయారు కుమారుడు ఫోన్ చేయగా స్విచ్ ఆఫ్ రావడంతో సమీపంలో ఉన్న సోదరికి ఫోన్ చేశాడు. కుమార్తె ఇంటికి వెళ్లి చూడగా తాళం వేసి ఉండటంతో చుట్టు పక్కల వాకాబు చేసినా ఫలితం లేకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు మంగతాయారు ఇంటికి వెళ్లి వివరాలు సేకరించారు. ఈ క్రమంలో మూడో అంతస్తులో అద్దెకు ఉంటున్న రాజేష్‌ను ప్రశి్నంచగా ముక్తసరిగా సమాధానం చెప్పి ఇంట్లోకి వెళ్లి తలుపులు వేసుకున్నాడు. దీంతో అనుమానం వచి్చన పోలీసులు అతడి ఇంట్లో గాలించగా బాత్రూమ్లో మంగతాయారు కాళ్లు చేతులు కట్టి పడేసి విగతజీవిగా పడిఉంది. దీంతో అతడిని అదుపులోకి తీసుకుని విచారించగా నేరం అంగీకరించాడు. సాఫ్ట్వేర్ ఉద్యోగిగా పని చేస్తున్న రాజేష్‌కు గతంలో పలుమార్లు భార్యతో గొడవలు జరిగాయి. ఈ క్రమంలో మంగతాయారు జోక్యం చేసుకొని అతడిని మందలించిందని తెలిసింది. అయితే 10 రోజుల క్రితం అతడి భార్య పుట్టింటికి వెళ్లిపోవడంతోపాటు రాజేష్‌కు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు. దీంతో మానసికంగా కుంగిపోయిన రాజేష్ బుధవారం మధ్యాహ్నం ఇంటి టెర్రస్ పై మొక్కలు చూసేందుకు వెళ్తున్న మంగతయారును నల్లాలు పనిచేయడం లేదని ఇంట్లోకి పిలిచి ల్యాప్‌టాప్ కేబుల్ వైర్ గొంతుకు బిగించి దారుణంగా హత్య చేశాడు. మృతదేహాన్ని బాత్రూంలో పారవేశాడు. అనంతరం ఆమె చేతికి ఉన్న నాలుగు బంగారు గాజులను తీసుకొని వెళ్లి ప్రైవేటు ఫైనాన్స్‌లో కుదువపెట్టి డబ్బులు తీసుకొని అప్పులు తీర్చుకున్నాడు. రాత్రి వరకు ఏమీ తెలియనట్లు ఇంట్లోనే ఉన్నాడు. డబ్బుల కోసమే వృద్ధురాలిని హత్య చేశాడా మరేదైనా కారణాలు ఉన్నాయా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: మణప్పురం సంస్థకు రూ.30 లక్షలు టోకరా మాజీ కార్పొరేటర్ దారుణ హత్య.. ఖండించిన సీఎం -
దారుణం: కరోనా సోకిందని ఖాళీ చేయించారు..
పాలకుర్తి (వరంగల్ రూరల్): కరోనా వచ్చిన వారిపై ప్రేమచూపకున్నా.. వారిని హేళనగా చూడొద్దని, అలాంటి వారిని ఆదరించాలని ఎంత చెప్పినా.. కొంతమంది మారడంలేదు. అందుకు ఉదాహరణే ఈఘటన. సొంత ఇల్లు లేకపోవడంతో జనగామ జిల్లా పాలకుర్తి మండల కేంద్రంలో కిరాయి ఇంట్లో నివాసముంటున్న ఈగ సుగుణమ్మ అనే వృద్ధురాలకి కరోనా సోకింది. దీంతో ఇంటి యజమాని ఆమెను బయటకు వెళ్లిపోవాలని చెప్పడంతో దిక్కుతోచిని స్థితిలో పడింది. దీంతో స్పందించిన స్థానిక వార్డు సభ్యుడు వీరమనేని హన్మంతరావు సదరు వృద్ధురాలిని ప్రభుత్వ ఆస్పత్రిలోని ఐసోలేషన్ వార్డులో చేర్పించారు. అయితే సుగుణమ్మకు ఇద్దరు కుమారులు ఉండగా.. ఒకరు హన్మకొండలో నివాసం ఉంటున్నాడు. మరో కుమారుడు కుటుంబ కలహాల నేపథ్యంలో వేరుగా ఉంటున్నట్లు సమాచారం. -
కరోనా భయంతో వృద్ధురాలిని గెంటివేసిన ఇంటి యజమాని
జగ్గయ్యపేట అర్బన్: కరోనా వచ్చిందని 65 ఏళ్ల వృద్ధురాలిని ఇంటి యజమాని అమానుషంగా నడిరోడ్డు మీదకు నెట్టేసిన ఘటన కృష్ణా జిల్లా జగ్గయ్యపేటలో శనివారం చోటుచేసుకుంది. బొజ్జ సామ్రాజ్యం అనే వృద్ధురాలు పట్టణ శివారులోని పద్మావతినగర్‌లోని అద్దె ఇంట్లో నివసిస్తోంది. ఉన్న ఒక్కగానొక్క కొడుకు గతంలో ఇంటిని అమ్మేసి కన్న తల్లిని ఒంటరిగా వదిలేసి ఆ డబ్బు తీసుకుని వెళ్లిపోయాడు. అప్పటి నుంచి ఆమె అద్దె ఇంట్లో ఉంటూ పెన్షన్ డబ్బుతో జీవనం వెళ్లదీస్తోంది. ఆమెకు కరోనా సోకిందన్న సమాచారం తెలుసుకున్న ఇంటి యజమాని సామాన్లతో సహా బయటకు గెంటేశాడు. దిక్కుతోచని స్థితిలో వృద్ధురాలు ఆరుబయట దీనావస్థలో పడి ఉండటంతో విషయం తెలుసుకున్న స్థానిక సచివాలయ మహిళా సంరక్షణ కార్యదర్శి పోలీస్ స్టేషన్‌కు సమాచారం ఇచ్చారు. ఎస్ఐ చినబాబు సిబ్బందితో ఘటనా స్థలానికి వెళ్లి ఇంటి యజమానిని హెచ్చరించి తిరిగి ఆమెను ఇంటిలోకి చేర్చారు. మున్సిపాలిటీ సిబ్బంది ద్వారా ఇల్లు, పరిసరాలు శానిటేషన్ చేయించారు. వెంటనే ఎస్ఐ ఈ విషయాన్ని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే సామినేని ఉదయభాను దృష్టికి తీసుకెళ్లారు. దీంతో వృద్ధురాలిని స్థానిక గురుకుల పాఠశాలలో నూతనంగా ఏర్పాటు చేసిన ఐసోలేషన్ సెంటర్లో చేర్చుకుని వైద్య సేవలందించాలని ఆయన అధికారులను ఆదేశించారు. -
ఆన్లైన్ క్లాసులు వింటున్న బాలికపై అత్యాచారం
జగద్గిరిగుట్ట: మాయమాటలు చెప్పి ఓ వ్యక్తి, బాలికపై పలుమార్లు లైంగిక దాడి చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. జగద్గిరిగుట్ట పరిధిలోని ఎల్లమ్మబండకు చెందిన బాలిక (15), తల్లిదండ్రులు డ్యూటీకి వెళ్లగా.. ఇంట్లో ఆన్లైన్ క్లాసులు వింటూ ఒంటరిగా ఉంటున్నది. అదే క్రమంలో ఇంటి యజమాని కుమారుడు మధుసూదన్ రెడ్డి (27) బాలికపై పలుమార్లు లైంగిక దాడి చేశాడు. దీనిని వీడియోలో చిత్రీకరించాడు. విషయం ఎవరికైనా చెబితే సోషల్ మీడియాలో పెడతానని బాలికను భయపెట్టాడు. మనోవేదనకు గురైన బాలిక ఈనెల 12న విషం తాగి ఆత్మహత్యా యత్నం చేసింది. బాలికను చికిత్స నిమిత్తం గాంధీ హాస్పిటల్‌కు తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. (చదవండి: చిన్నారి వైద్యం కోసం వెళ్తూ..) -
కానిస్టేబుళ్లకు కరోనా సోకిందని..
మహబూబాబాద్ రూరల్: కరోనా లాక్డౌన్ సమయంలో విధులు నిర్వర్తించిన తమకు ఇప్పుడు వైరస్ సోకపోవడంతో పట్టించుకునే వారే లేకుండా పోయారని జిల్లాకు చెందిన స్పెషల్ పార్టీ పోలీసు కానిస్టేబుళ్లు సారంగపాణి, కృష్ణ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు సోమవారం సాయంత్రం వారు వెల్లడించిన వివరాలిలా ఉన్నాయి. జిల్లా పోలీసు కార్యాలయంలోని ప్రత్యేక పోలీసు దళంలో పనిచేస్తున్న సుమారు 20 మంది కానిస్టేబుళ్లకు కరోనా సోకగా, హోం ఐసోలేషన్‌లో ఉండి చికిత్స తీసుకోవాలని వైద్య, ఆరోగ్యశాఖ అధికారులు సూచించారని తెలిపారు. అయితే, తమలో ఒకరు అద్దె ఇంట్లో ఉంటుండగా, యజమాని కుటుంబంలో వివాహం ఉండడంతో లోనకు రావొద్దన్నారని చెప్పారు. ఇంకొకరి ఇంట్లో చిన్న పిల్లలు ఉండడంతో వెళ్లలేకపోతున్నట్లు తెలిపారు. అయితే, తా మిద్దరం ఆస్పత్రిలో ఉంటామంటే రెండు రోజుల అనంతరం వసతి చూపిస్తామని వైద్యాధికారులు చెప్పారని పేర్కొన్నారు. దీంతో దిక్కుతోచక జిల్లా కేంద్రంలోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయ సమీపాన గుట్టల ప్రాంతంలో తలదాచుకుంటున్నామని తెలిపారు. అధికారులు స్పందించి తాము ఆస్పత్రిలో చికిత్స పొందేలా చూడాలని వేడుకున్నారు. కాగా, ఇద్దరు కానిస్టేబుళ్లు గుట్టల్లో ఆశ్రయం పొందున్న విషయం సామాజిక మాధ్యమాల్లో ప్రచారం కావడంతో ఎస్పీ కోటిరెడ్డి రంగంలోకి దిగారు. ఇంటి యజమానులతో పాటు కానిస్టేబుళ్లతో చర్చించగా వారు సోమవారం రాత్రి పొద్దుపోయాక ఇళ్లకు చేరుకున్నారు. -
భర్తకు కరోనా పాజిటివ్.. అమానవీయం..
ఆల్కాట్‌తోట యాళ్లవారి వీధిలో ఓ వ్యక్తికి కరోనా సోకింది. దీంతో ఆమె భార్యను ఆమె అద్దెకుంటున్న ఇంటి యజమాని, స్థానికులు లోపలికి వెళ్లనీయకుండా ఇంటికి తాళాలు వేసేశారు. దీంతో ఆమె ఆరుబయటే ఆ రాత్రంతా ఉండాల్సిన పరిస్థితి. చివరికి పోలీసులు, అధికారులు జోక్యం చేసుకోవడంతో ఎట్టకేలకు ఆమెను లోపలికి అనుమతించారు. కిర్లంపూడి మండలం శృంగరాయునిపాలెంలో కరోనా మహమ్మారి దెబ్బకు ఓ వృద్ధురాలు మృతి చెందింది. ఆమెను చూసేందుకు, అంత్యక్రియలు నిర్వహించేందుకు ఎవరూ ముందుకు రాలేదు. దీంతో ఆ మండలంలోని అధికారులే దహన సంస్కారాలు చేయించాల్సిన పరిస్థితి. ఈ రెండు అమానవీయ సంఘటనలు జిల్లాలో గురువారం చోటు చేసుకున్నాయి. కరోనా మహమ్మారి మనుషుల్లో భయాన్ని నింపడమే కాదు.. మానవత్వాన్ని కొంచెమైనా లేకుండా చేస్తోందనేందుకు ఈ సంఘటనలే నిదర్శనం.. తూర్పుగోదావరి ,ఆల్కాట్‌తోట(రాజమహేంద్రవరం రూరల్): భర్తకు కరోనా పాజిటివ్. ఆయనను బొమ్మూరు కోవిడ్ కేర్ సెంటర్‌కు తరలించి, భార్య ఇంటిలోనే ఉంటోంది. ఆమె బయటకు వెళ్లి వస్తుందన్న కారణంతో ఆమె ఉంటున్న ఇంటి యజమాని ఇంటికి తాళం వేశారు. పోనీ పక్కవీధిలో ఉన్న సొంతింటికి వెళ్లి తలదాచుకుందామనుకుంటే అక్కడా స్థానికులు ఆమెను అడ్డుకున్నారు. చివరికి చేసేదేం లేక తాను అద్దెకు ఉంటున్న ఇంటి ముందే ఆరుబయట కూర్చోవలిసిన దుస్థితిని బుర్రిలంక సచివాలయ హెల్త్ సెక్రటరీ కల్యాణి ఎదుర్కొంది. ఆల్కాట్‌తోట యాళ్లవారివీధిలో జరిగిన ఈ సంఘటనపై టూటౌన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కళ్యాణిని అడ్డుకున్న వారిపై కేసు నమోదు చేసి, ఆమెను తన ఇంటిలోకి వెళ్లేలా చర్యలు చేపట్టారు. ఆల్కాట్‌తోట ప్రాంతం యాళ్లవారివీధికి చెందిన బుర్రిలంక సచివాలయ హెల్త్ సెక్రటరీ కళ్యాణి అద్దె ఇంటిలో ఉంటోంది. బుర్రిలంక గ్రామంలో కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో ఆమె వైద్యసేవలు అందిస్తోంది. ఈలోపు ఆమె భర్తకు కరోనా పాజిటివ్ రావడంతో హోమ్ ఐసోలేషన్‌లో ఉండేలా వైద్యాధికారుల నుంచి అనుమతులు తీసుకుంది. స్థానికులు అభ్యంతరం చెప్పడంతో అతడిని బొమ్మూరు కోవిడ్ కేర్‌సెంటర్‌కు తరలించారు. ఆమె మాత్రం అద్దె ఇంటిలోనే హోమ్ క్వారంటైన్లో ఉంది. అయితే కళ్యాణి ఇంటి నుంచి బయటకు వెళ్లి రావడంతో ఇంటి యజమాని ఆమె లేని సమయంలో ఇంటికి తాళం వేశారు. ఈలోపు ఇంటికి చేరుకున్న కళ్యాణి తాళం వేసి ఉండడంతో ఇంటి యజమానితో మాట్లాడగా.. ఇక్కడ ఉండడానికి వీల్లేదని తెలిపారు. దీంతో పక్కవీధిలో ఉన్న తన సొంతింటికి వెళ్లింది. అక్కడ కూడా స్థానికులు రానివ్వకపోవడంతో ఆమె అద్దెకుంటున్న ఇంటికి వచ్చి బుధవారం రాత్రి నుంచి అక్కడే కూర్చుని ఉంది. గురువారం ఉదయం కూడా వర్షంలోనే కూర్చొని తన బాధను వీడియో తీసి వాట్సప్ గ్రూపుల్లో పెట్టి తనకు న్యాయం చేయాలని అధికారులను వేడుకుంది. టూటౌన్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో అర్బన్ జిల్లా దక్షిణమండల డీఎస్పీ ఎం.వెంకటేశ్వర్లు, టూటౌన్ ఎస్సైలు లక్ష్మీ, అశోక్ సిబ్బందితో సంఘటన స్థలానికి చేరుకుని స్థానికులతో మాట్లాడారు. కళ్యాణి ఇంటిలో ఉంటే తమకు ఎటువంటి ఇబ్బందులు లేవని, బయట తిరగడం వల్ల అభ్యంతరం వ్యక్తం చేశామని స్థానికులు డీఎస్పీ వెంకటేశ్వర్లకు వివరించారు. దీంతో డీఎస్పీ నగరపాలకసంస్థ అధికారులతో మాట్లాడి ఆ ఇంటిని శానిటైజేషన్ చేయించి కళ్యాణిని ఇంటిలోకి పంపించారు. కళ్యాణి ఫిర్యాదు మేరకు టూటౌన్ ఎస్సై లక్ష్మీ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
చికెన్ తిన్న తర్వాతే స్పృహ తప్పింది....
చందానగర్: అనుమానాస్పద స్థితిలో ఓ కుటుంబంలోని తల్లి, కూతురు, కొడుకు స్పృహ కోల్పోయారు. ఇంటి యజమానే చికెన్‌లో మత్తుమంది కలిపి ఆపై లైంగిక దాడికి పాల్పడి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. చందానగర్ పీఎస్ పరిధిలో ఈ ఘటన జరిగింది. బాధితులు ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. సీఐ రవీందర్ తెలిపిన వివరాల ప్రకారం... మహారాష్ట్రలోని షోలాపూర్ కు చెందిన ఓ కుటుంబం కొద్ది సంవత్సరాల క్రితం బతుకుదెరువు కోసం నగరానికి వచ్చింది. శేరిలింగంపల్లిలోని సందయ్యనగర్‌లో బాధిత మహిళ (35), భర్త, కూతురు (15) కొడుకు (10) నివాసం ఉంటున్నారు. వీరు కూలీ పనులు చేస్తూ జీవనం కొనసాగిస్తున్నారు. వీరి ఇంటి యజమాని అయిన గంగాధర్ ‡(45) మసీద్‌బండలో ఉంటూ టైలర్‌గా పని చేస్తున్నాడు. సందయ్యనగర్ లోని తన ఇంటిలోని ఒక పోర్షన్ వీరికి అద్దెకు ఇవ్వగా.. మిగతా పోర్షన్లు ఖాళీగా ఉన్నాయి. ఇటీవల ఇంటిని యజమాని అమ్మకానికి పెట్టాడు. ఈ క్రమంలో మంగళవారం గంగాధర్ తన అసిస్టెంట్లు నగేష్ (48), గణేష్(40)తో కలిసి వచ్చాడు. చికెన్ తీసుకువచ్చి అద్దెకుంటున్న మహిళకు వండిపెట్టమని ఇచ్చారు. సదరు మహిళ చికెన్ వండి ఇవ్వగా.. వారు తిన్న తర్వాత మిగిలిన చికెన్‌ను ఆమెకు ఇచ్చారు. అదే రోజు సాయంత్రం 4 గంటల ఆ చికెన్ తిన్న తల్లి, కుతురు, కొడుకు సృహ కోల్పోయారు. కూలీ పనులు ముగించుకొని రాత్రి 9 గంటలకు భర్త ఇంటికి వచ్చాడు. వచ్చే సరికి భార్య, కూతురు, కొడుకు స్పృహతప్పి పడి ఉన్నారు. ఆందోళన చెందిన అతను స్థానికుల సహాయంతో ఉస్మానియా ఆస్పత్రికి తరలించి చికిత్స చేయించగా స్పృహలోకి వచ్చారు. చికెన్ తిన్న తర్వాత తాము స్పృహ కోల్పోయామని భర్తతో మహిళ చెప్పింది. చికెన్‌లో మత్తు మందు కలిపి ఇచ్చి అనంతరం తల్లి, కూతరుపై లైంగిక దాడికి పాల్పడి ఉంటారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీంతో బాధితులు బుధవారం చందానగర్ పోలీస్‌స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఇంటి యజమానిని, అసిస్టెంట్లను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. బాధితులకు పరీక్షలు చేయించామని రిపోర్ట్స్ వచ్చాకే మత్తు మందు కలిపి అత్యాచారానికి పాల్పడ్డారా..? లేదా...? అన్న విషయం తెలుస్తుందని ఇన్స్పెక్టర్ తెలిపారు. తల్లీకూతుళ్లు ఉస్మానియాలో, కొడుకు నిలోఫర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. చికెన్ తిన్న తర్వాతే స్పృహ తప్పింది.... ఇంటి యజమాని గంగాధర్, నగేష్, గణేష్‌లు మంగళవారం సాయంత్రం వచ్చి చికెన్ వండి ఇవ్వమని ఇచ్చారని బాధిత మహిళ తెలిపింది. మిగిలిన చికెన్ ఇవ్వగా కూతురు, కొడుకుతో పాటు తాను తిన్నామని తెలిపింది. కొద్ది సేపటికే కళ్లు తిరిగి స్పృహ కోల్పోయామని ఆ తర్వాత ఏమి జరిగిందో తెలియదన్నారు. గత మూడు రోజులుగా వారు ఇక్కడికి వస్తున్నారని, వారితో గుర్తు తెలియని అమ్మాయిలు వస్తున్నారని చెప్పింది. రూ.20 వేలు ఇస్తామని పోలీసులకు చెప్పవద్దని మధ్యవర్తులచే ముగ్గురు వ్యక్తులు చెప్పించారని పేర్కొంది. -
కరోనా బాధితురాలిపై అమానుషం
-
కరోనా బాధితురాలిపై అమానుషం
సాక్షి, తిరుపతి: రాష్ట్రవ్యాప్తంగా కరోనా వైరస్ కేసులు పెరుగుతున్నాయి. ఇటువంటి క్లిష్ట సమయంలో కొంతమంది కరోనా బాధితుల పట్ల అమానవీయంగా ప్రవర్తిస్తున్నారు. తాజగా తిరుపతిలో కరోనా వైరస్ బాధితురాల పట్ల ఓ ఇంటి యజమాని అమానుషంగా వ్యహరించారు. కరోనా వైరస్ నుంచి పూర్తిగా కోలుకొని వచ్చిన చంద్రకళ అనే మహిళను తమ ఇంట్లోకి అనుమతించకుండా అడ్డుకున్నారు. దీంతో దిక్కుతోచని స్థితిలో ఉన్న చంద్రకళ తన ఇద్దరు కుమార్తెలతో నడిరోడ్డు మీద ఇంటి యజమాని అనుమతి కోసం పడిగాపులు కాశారు. చంద్రకళ కొన్నేళ్ల నుంచి తన భర్త, ఇద్దరు పిల్లలతో సుందరయ్య నగర్‌లోని ఓ ఇంట్లో అద్దెకు ఉంటున్నారు. ఇటీవల చంద్రకళకు కరోనా వైరస్ పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. దీంతో ఆమెతోపాటు కుటంబం మొత్తం క్వారంటైన్‌కు వెళ్లారు. 14 రోజులపాటు క్వారంటైన్‌ను పూర్తి చేసుకున్న తర్వాత వారికి నెగటివ్‌గా రిపోర్టు వచ్చింది. అనంతరం ఇంటికి వచ్చిన వారి పట్ల ఇంటి యజమాని వ్యవహరించిన తీరుతో బాధితులు కన్నీరుమున్నీరయ్యారు. -
కొడుకు మృతి.. ఇంట్లోకి రావొద్దన్న ఇంటి యజమాని
తంగళ్లపల్లి(సిరిసిల్ల): సభ్యసమాజం తలదించుకునేలా మానవత్వం మంటకలిసింది. ఈ సంఘటన తంగళ్లపల్లి మండలకేంద్రంలో చోటుచేసుకుంది. తంగళ్లపల్లిలోని రెడ్డివాడలో అద్దె ఇంట్లో నివాసముంటున్న మ్యాన అమిత్ (27) గురువారం ఉదయం సిరిసిల్ల ప్రభుత్వ ఆసుపత్రిలో గుండెపోటుతో మృతిచెందాడు. మృతదేహాన్ని ఇంటికి తీసుకువస్తే ఇళ్లు శుద్ధి చేసుకోవాలనే ఉద్దేశంతో ఇంటి యజమాని అనుమతించలేదు. గత్యంతరం లేక అమిత్ కుటుంబసభ్యులు సిరిసిల్ల ప్రభుత్వ ఆసుపత్రి నుంచి నేరుగా తంగళ్లపల్లి ఊరి చివరికి శ్మశానం వద్దకు మృతదేహాన్ని తరలించారు. బాధిత కుటుంబసభ్యుల వివరాల ప్రకారం మ్యాన అమిత్ తండ్రి సుదర్శన్ గతంలో మృతిచెందగా తల్లి సువర్ణతోపాటు తన సోదరులతో కలిసి మండలకేంద్రంలో ఓ ఇంట్లో పదినెలలుగా అద్దెకు ఉంటున్నారు. టెక్స్టైల్ పార్కులో మరమగ్గాల కార్మికుడిగా పనిచేస్తూ కుటుంబాన్ని పోషించేవాడు. తల్లి మ్యాన సువర్ణ బీడీల పనిచేస్తోంది. గురువారం తెల్లవారుజామున అమిత్ ఉన్నట్టుండి అస్వస్థతకు గురికావడంతో ఆరోగ్యం అతడిని హుటాహుటిన సిరిసిల్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. చికిత్స అందిస్తుండగానే అమిత్ గుండెపోటుకు గురై తుదిశ్వాస విడిచాడు. కన్నీరుమున్నీరైన కుటుంబసభ్యులు దహనసంస్కారాలు నిర్వహించేందుకు తంగళ్లపల్లి అద్దె ఇంటికి తీసుకురావడానికి ఏర్పాట్లు చేస్తుండగా ఇంటి యజమాని ఇంట్లోకి తీసుకురావడానికి అనుమతించలేదు. ఎంత ప్రధేయపడినా ఒప్పుకోలేదు. దీంతో దిక్కుతోచని స్థితిలో సిరిసిల్ల ప్రభుత్వ ఆసుపత్రి నుంచి ఆటోలో తంగళ్లపల్లి ఊరిచివర శ్మశానవాటిక వద్దకు తీసుకువచ్చారు. అక్కడి నుంచే అమిత్‌కు అంతిమయాత్ర నిర్వహించాల్సి వచ్చింది. గూడు లేని పక్షులవలే వారి పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. మనసున్న చాలా మందిని కంటతడి పెట్టించింది. అమిత్ కుటుంబానికి ప్రభుత్వం తరఫున చేయూత అందించాలని అంతేకాకుండా ఉండడానికి గూడు కల్పించాలని తంగళ్లపల్లివాసులు కోరుతున్నారు. చలించిపోయిన పోలీసులు అక్కడే మానేరు వాగు ఒడ్డున పికెటింగ్ నిర్వహిస్తున్న సీఐ సర్వర్, పోలీస్ సిబ్బంది అమిత్ కుటుంబసభ్యుల పరిస్థితి చూసి చలించిపోయారు. సీఐ సర్వర్ రూ.10 వేలు, పోలీస్ సిబ్బంది అందరూ కలిసి మరో రూ.5 వేలు ఆర్థికసాయం అందించారు. -
కరోనా నుంచి కోలుకొని ఇంటికి.. ఊహించని షాక్
సాక్షి, శ్రీకాళహస్తి: మహమ్మారి కరోనా వైరస్ నుంచి కోలుకున్నాననే ఆనందం కాసేపైనా ఆమెకు లేకుండా పోయింది. కనీస దయ, జాలి, కరుణ లేకుండా నిర్దాక్షిణ్యంగా ఇంటి నుంచి బయటకి వెళ్లగొట్టాడు తను అద్దెకుంటున్న బిల్డింగ్ యజమాని. ఈ అమానవీయ ఘటన శ్రీకాళహస్తిలో చోటుచేసుకుంది. శ్రీకాళహస్తి తహశీల్దార్ కార్యాలయంలో అటెండర్‌గా విధులు నిర్వరిస్తున్న ఓ మహిళా ఉద్యోగికి కరోనా పాజిటివ్‌గా తేలింది. అయితే చికిత్స అనంతరం కరోనా నుంచి పూర్తిగా కోలుకొని డిశ్చార్జ్ అయ్యి కోటి ఆశలతో తను అద్దెకుంటున్న ఇంటికి చేరుకుంది. కానీ ఆ మహిళను ఇంటి యజమాని అడ్డుకున్నాడు. అమె అద్దెకుంటున్న ఇంటికి తాళం వేసి బయటకు వెళ్లగొట్టాడు. దీంతో ఈ ఊహించని పరిణామం ఏర్పడటంతో ఏం చేయాలో పాలుపోక నడిరోడ్డుపై సదరు మహిళ నిల్చునే పరిస్థితి ఏర్పడింది. అయితే తమ సహోద్యోగి పరిస్థితి తెలుసుకున్న శ్రీకాళహస్తి తహశీల్దారు ఆమెకు వేరొకచోట బస ఏర్పాటు చేశారు. ఈ ఘటనపై స్థానికులు మహిళా ఉద్యోగికి అండగా నిల్చోగా ఇంటి యజమాని తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చదవండి: కలతచెంది.. కాలినడకన బయలుదేరి.. డాక్టర్ దంపతులపై పూల వర్షం -
‘నువ్వు పిసినారివి రా’..
భోపాల్: దొంగతనం అంటే మాటలా..? ముందుగా దానికి ఓ పక్కా ప్లాన్ ఉండాలి. దానికి అనుగుణంగా స్కెచ్ గీసుకోవాలి. అలా చేస్తే గానీ అనుకున్న పని అవ్వదు. సరిగ్గా ఓ దొంగ ఇలానే చేశారు. పక్కా ప్లాన్‌తో ఇంట్లోకి ప్రవేశించాడు. అయితే అక్కడ దొంగకి విచిత్రమైన పరిస్థితి ఎదురైంది. వివరాల్లోకి వెళితే.. మధ్యప్రదేశ్‌లోని ఇండోర్ ప్రాంతంలో ఓ దొంగ రాత్రంతా ఎంతో కష్టపడి ప్రభుత్వ సంస్థలో ఇంజనీర్‌గా పనిచేస్తున్న పర్వేష్‌సోని ఇంట్లోకి అతికష్టం మీద కిటికీలు తొలగించి ప్రవేశించాడు. తీరా లోపలికి వెళ్లి చూస్తే షాక్‌కు గురయ్యాడు. ఇళ్లు మొత్తం వెతికినా దోచుకెళ్లడానికి కావాల్సిన విలువైన వస్తువులు ఏమీ లేకపోవడంతో నిరుత్సాహపడ్డాడు. ఇంతవరకు తాను పడిన కష్టానికి ఫలితం దక్కనందుకు కోపంతో ఇంటి యజమానికి ఒక లేఖ రాసి టేబుల్ మీద పెట్టి వెళ్లిపోయాడు. ఆ లేఖలో ‘నువ్వు చాలా పిసినారివిరా.. కనీసం కిటికీ తొలగించడానికి పడిన శ్రమకు కూడా తగిన ఫలితం దక్కలేదు. ఈ రాత్రంతా వృథా అయ్యింది’ అని హిందీలో రాసి వెళ్లిపోయాడు. గురువారం ఉదయం పర్వేష్ ఇంట్లో పనికి వచ్చిన మహిళ ఇంటిలోని వస్తువులన్నీ కిందపడి ఉండటంతో షాక్ అయ్యింది. టేబుల్ మీద ఉన్న లేఖ చూసి వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేసింది. లేఖను స్వాధీనం చేసుకున్న పోలీసులు.. చేతిరాత పరిశీలన నిపుణులకు పంపారు. పర్వేశ్ ఇల్లు జాయింట్ కలెక్టర్, న్యాయమూర్తి ఇంటికి దగ్గరలో ఉండడంతో కేసుని సీరియస్‌గా తీసుకుని, సీసీ టీవీ పుటేజ్‌ని కూడా పరిశీలిస్తున్నారు. -
ఓయోతో ఇంటి యజమానులకు ఆదాయం
సాక్షి, హైదరాబాద్: పర్యాటకులకు విభిన్న రకాల బస సదుపాయాలను అందించే ఆన్లైన్ ఆధారిత సంస్థ ఓయో నగరంలోని భవన యజమానులకు ఆదాయవనరుగా మారిందని ఓయో ప్రతినిధులు ఓ ప్రకటనలో తెలిపారు. నగరవాసి ఐటి ఉద్యోగి అరవింద్ తన 30 ఏళ్ల నాటి భవనాన్ని ‘ఓయో 15141 టౌన్‌విల్లా గెస్ట్ హౌజ్’గా మార్చడం ద్వారా హోటల్ పరిశ్రమకు పరిచయం అవడంతో పాటు అనూహ్యమైన ఆదాయాన్ని కూడా పొందుతున్నారు. అలాగే మహ్మద్ హబీబ్ మొయినుద్దీన్ కూడా తన నివాసాన్ని స్పాట్ ఆన్ 47525 డెక్కన్ లాడ్జ్‌గా మార్చి తగిన ప్రతిఫలాన్ని అందుకుంటున్నారు. ఇలాగే మరెందరో ఓయోతో ప్రయోజనం పొందారని వివరించారు. ‘మాస్టర్ క్లాసెస్’ టూర్ ప్రస్తుతం హైస్కూల్ విద్యను అభ్యసిస్తూ భవిష్యత్తులో మెడిసిన్ చదవాలని ఆశిస్తున్న విద్యార్థుల కోసం వెస్టిండీస్‌కు చెందిన జారŠజ్స్ యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ మెడిసిన్ దేశవ్యాప్తంగా ‘మాస్టర్ క్లాసెస్ ఫర్ హైస్కూలర్స్’ టూర్ నిర్వహిస్తోంది. నగరంలోని శ్రీనిధి ఇంటర్నేషనల్ స్కూల్ నుంచి ఈ కార్యక్రమం బుధవారం ప్రారంభం కానుందని నిర్వాహక సంస్థ ప్రతినిధులు ఓ ప్రకటనలో తెలిపారు. నగరంతో పాటు బెంగుళూరు, ముంబయి, ఢిల్లీలోనూ ఈ కార్యక్రమం ఉంటుందన్నారు. నగరంలో ఈ టూర్‌కి అసిస్టెంట్ ప్రొఫెసర్ ఆఫ్ న్యూరోసైన్స్ డా.కేశవకుమార్ మందలనేని శ్రీకారం చుట్టారని వివరించారు. -
బాలికపై ఇంటి యజమాని లైంగికదాడి
సనత్‌నగర్: ఓ బాలికపై ఇంటి యజమాని లైంగికదాడికి పాల్పడిన సంఘటన ఎస్సార్‌నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో గురువారం చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. మహమూబ్‌నగర్ కోస్గి ప్రాంతానికి చెందిన ఓ కుటుంబం బతుకుదెరువు నిమిత్తం మూడేళ్ల క్రితం నగరంలోని బల్కంపేట ప్రాంతానికి వచ్చి స్థిరపడింది. భర్త చనిపోవడంతో భార్య ఇళ్లల్లో పనిచేస్తూ కుమార్తెను (10)ను చదివిస్తోంది. స్థానిక దాసారం బస్తీలో ఉంటున్న వీరు బుధవారం ఇల్లు ఖాళీ చేసి బల్కంపేట బీజేఆర్నగర్ ప్రాంతంలోని మరో ఇంట్లో అద్దెకు దిగారు. గురువారం ఉదయం తల్లి పనిలోకి వెళ్లగా బాలిక ఒంటరిగా ఉండటాన్ని గుర్తించిన ఇంటి యజమాని నిమ్మగడ్డ రామ్‌ప్రసాద్ నామెను ఇంట్లోకి తీసుకెళ్ళి లైంగికదాడికి పాల్పడ్డాడు. బాధితురాలు ఈ విషయం తల్లికి చెప్పడంతో ఆమె ఎస్సార్‌నగర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు పరారీలో ఉన్న రామ్‌ప్రసాద్ కోసం గాలిస్తున్నారు. -
హౌస్ ఓనర్‌కు ముందుగానే అభినందనలు
సినిమా: హౌస్ ఓనర్ చిత్రానికి విడుదలకు ముందే అభినందనలు వర్షిస్తున్నాయని ఆ చిత్ర దర్శకురాలు, నటి లక్ష్మీరామకృష్ణన్ ఆనందంలో తేలిపోతున్నారు. కమర్శియల్‌గా విజయం సాధించిన చాలా చిత్రాలు కొన్నాళ్లే ప్రేక్షకుల్లో గుర్తుంటాయి.అలా చాలాకాలం గుర్తిండిపోయే చిత్రాలు కొన్నే ఉంటాయి. అలాంటి వాటిలో దర్శకురాలు లక్ష్మీరామకృష్ణన్ చిత్రాలు కచ్చితంగా చోటు చేసుకుంటాయని చెప్పవచ్చు.అలా ఈమె తెరకెక్కించిన ఆరోహణం, అమ్మణి చిత్రాల తరువాత తాజాగా దర్శకత్వం వహించిన చిత్రం హౌస్ ఓనర్. నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం గురించి దర్శకురాలు లక్ష్మీ రామకృష్ణన్ తెలుపుతూ హౌస్ ఓనర్ చిత్రం జనరంజకంగానే కాకుండా, అందరినీ ఆలోచింపజేసే చిత్రంగా ఉంటుందన్నారు. చిత్రాన్ని తనకు సన్నిహితులు, విశ్లేషకులు అయిన కొంది మందికి ప్రదర్శించినట్లు తెలిపారు. చిత్రం చూసిన వారందరూ చక్కని సందేశంతో కూడిన కమర్శియల్ అంశాలతో కూడిన చిత్రం అని అభినందించడం సంతోషంగా ఉందన్నారు. ఇందులో ఆడుగళం కిశోర్ ప్రధాన పాత్రలో నటించగా, నటి విజీ చంద్రశేఖర్ కూతురు లవ్లీన్ను కథానాయకిగా పరిచయం చేసినట్లు చెప్పారు. తన నటన ఆమె తల్లి విజీ చంద్రశేఖర్, నటి సరిత గర్వపడేలా ఉంటుందన్నారు. నటన అనేది కుటుంబం సొత్తు అన్నట్టుగా లవ్లీన్ నటించిందని అన్నారు. నటి శ్రీరంజని కూడా మంచి పాత్రను పోషించినట్లు చెప్పారు. ఇక సంగీతదర్శకుడు జిబ్రాన్ సంగీతం చిత్రానికి అదనపు ఆకర్షణగా నిలిస్తుందని అన్నారు. హౌస్ఓనర్ చిత్రాన్ని సమ్మర్ స్పెషల్‌గా విడుదల చేయనున్నట్లు లక్ష్మీరామకృష్ణన్ తెలిపారు.