
ప్రతీకాత్మక చిత్రం
కువైట్ : ఓ ఇంటి యాజమాని తన ఇంట్లో పని చేస్తున్న భారత మహిళపై దాడికి పాల్పడ్డాడు. ఆ మహిళ తలకు, చేతులకు గాయాలయ్యాయి. అయితే యాజమాని సోదరే బాధిత మహిళను ఆస్పత్రిలో చేర్పించారు. ఆస్పత్రిలో కోలుకుంటున్న ఆ మహిళ కువైట్‌లోనే పనిచేస్తోన్న తన సోదరుడితో కలిసి దాడి గురించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. అలాగే తనపై జరిగిన దాడికి సంబంధించిన మెడికల్ రిపోర్ట్‌ను కూడా ఫిర్యాదుతో పాటు అందజేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందింతుడి కోసం గాలిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment