attack on Woman
-
పోలీసుల కళ్లెదుటే నడిరోడ్డుమీద మహిళపై కత్తులతో దాడి
చండీగఢ్: పంజాబ్ ఫిరోజ్‌పుర్‌లోని బజ్ చౌక్‌లో అత్యంత దారుణ ఘటన వెలుగుచూసింది. 50 ఏళ్ల మహిళపై నలుగురు వ్యక్తులు కత్తులతో దాడి చేశారు. బైక్‌పై వచ్చి పట్టపగలే నడిరోడ్డుపై ఈ కిరాతక చర్యకు పాల్పడ్డారు. పోలీసులు అక్కడే ఉన్నా ఏమీ చేయలేక భయంతో పారిపోయారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. దుండగుల దాడిలో తీవ్రంగా గాయపడిన మహిళ రోడ్డుపైనే కుప్పకూలింది. స్థానికులు ఆమెను ఆస్పత్రికి తరలించారు. అయితే ఈమె ఓ హత్య కేసుకు సంబంధించి కోర్టులో వాంగ్మూలం ఇచ్చి ఇంటికి తిరిగివస్తున్నట్లు తెలుస్తోంది. ఈక్రమంలోనే నలుగురు వ్యక్తులు కత్తులతో బైక్‌పై వెళ్లి వెనకాల నుంచి దాడి చేశారు. ఈ ఘటనకు సంబంధించి ఓ నిందితుడ్ని పోలీసులు అరెస్టు చేశారు. పారిపోయిన పోలీసులు.. మహిళపై దాడి జరిగిప్పుడు ఇద్దరు పోలీసులు అక్కడే ఉన్నారని, కానీ కత్తులు చూసి భయంతో వారు వాహనంలో పారిపోయారని ప్రత్యక్షసాక్షులు తెలిపారు. విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన వీరిపై చర్యలు తీసుకోవాలని బాధితురాలి కుటుంబసభ్యులు డిమాండ్ చేశారు. చదవండి: ఒక్క రూపాయి చిల్లర ఇవ్వని కండక్టర్.. కోర్టుకెళ్లిన ప్రయాణికుడు.. ఎంత పరిహారం వచ్చిందంటే? -
పార్లమెంట్ వేదికగా మహిళా ఎంపీపై దాడి.. వీడియో వైరల్
డాకర్: పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో అనూహ్య సంఘటన జరిగింది. ఓ మహిళా చట్ట సభ్యురాలిపై మరో ఎంపీ చేయి చేసుకున్నాడు. ఇష్టారీతిన దాడి చేశాడు. ఈ సంఘటన ఆఫ్రికాలోని సెనెగల్ దేశంలో బడ్జెట్ సమావేశాల సందర్భంగా జరిగింది. ప్రస్తుతం ఆ దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. అధికార కూటమి బెన్నో బాక్ యకార్(బీబీవై)కి చెందిన మహిళా చట్టసభ్యురాలు అమి డైయే గ్నిబీపై.. ప్రతిపక్ష ఎంపీ మస్సాటా సాంబ్ చేయి చేసుకున్నాడు. దాడి చేసిన క్రమంలో పార్లమెంట్లో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. ఇరు పక్షాల ఎంపీలు కుర్చీలు, పేపర్లు విసురుకున్నారు. తనపై దాడి చేసిన సాంబ్పై కుర్చీ విసిరి పడిపోయారు గ్నిబీ. ఇరువురిని వేరు చేసేందుకు మరికొంత మంది ఎంపీలు ప్రయత్నించారు. అధికార, విపక్షాల మధ్య మాటల యుద్ధం మొదలైన క్రమంలో సమావేశాలను వాయిదా వేశారు. అధ్యక్షుడు మాకి సాల్ మూడోసారి ఎన్నికను గ్నీబి వ్యతిరేకించారు. మరోవైపు.. సాంబ్ చేసిన వ్యాఖ్యలను తప్పుపట్టిన క్రమంలో ఆయన ఆమె వద్దకు వచ్చి దాడి చేసినట్లు స్థానిక మీడియా పేర్కొంది. ఈ ఏడాది జులైలో జరిగిన ఎన్నికల్లో అధికార కూటమికి మెజారిటీ రాకపోవటంతో అధికార, ప్రతిపక్షాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. తీవ్ర విమర్శలు గుప్పించుకుంటున్నారు నేతలు. ❗*Chaos in Senegal Parliament after MP Slaps Female Colleague* The brawl began when opposition member Massata Samb walked over and slapped Amy Ndiaye Gniby - an MP of the ruling coalition - during a budget presentation, TV footage showed. pic.twitter.com/9Y074xSVTS — Daniel Marven (@danielmarven) December 2, 2022 ఇదీ చదవండి: మస్క్లో ప్రవహించే రక్తం సగం చైనాదే!.. ఎలన్ మస్క్ పుట్టుకపై తీవ్ర వ్యాఖ్యలు -
ఉస్మానియా ఆస్పత్రిలో మహిళపై దాడి
సాక్షి, హైదరాబాద్: ఉస్మానియా ఆస్పత్రిలో ఓ మహిళపై దాడి చేసిన ప్రైవేటు అంబులెన్స్ డ్రైవర్ ఆరీఫ్‌ను అఫ్జల్‌గంజ్ పోలీసులు అరెస్టు చేశారు. ప్రైవేటు అంబులెన్స్ డ్రైవర్లు ఆస్పత్రి ప్రధాన గేటు ఎదుట, మార్చురీ వద్ద తిష్టవేసి రోగులను ముక్కుపిండి మరీ అధిక డబ్బులు వసూలు చేస్తుంటారు. ఈ క్రమంలో గురువారం రాత్రి ఆస్పత్రి ఆవరణలో ఫరీనా (45) అనే మహిళతో డ్రైవర్‌కు స్వల్ప వివాదం చోటు చేసుకుంది. దీంతో అతను ఆమెపై దాడి చేసి, పక్కనే ఉన్న సెక్యురిటీతో కర్ర తీసుకొని కొట్టాడు. ఈ సంఘటనను గుర్తు తెలియని వ్యక్తి వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో అది వైరల్‌గా మారింది. అఫ్జల్‌గంజ్ పోలీసులు ఆరీఫ్‌ను అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేశారు. ఆస్పత్రిలో తిష్టవేసి రోగులకు ఇబ్బందులు కలిగించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ నాగేందర్ తెలిపారు. చదవండి: ‘చీకోటి’ కేసులో ఓ మంత్రి, ముగ్గురు ఎమ్మెల్యేలు? వాట్సాప్ చాట్లు వెలుగులోకి -
Shocking: పట్టపగలు ఇంట్లో ప్రవేశించి.. మహిళను..
సాక్షి, బనశంకరి(కర్ణాటక): పట్టపగలు ఇంట్లోకి చొరబడిన దుండగుడు ఒంటరి మహిళను కత్తెరతో పొడిచి చంపాడు. ఈ ఘటన బనశంకరిపోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. యారబ్నగర 16 వ క్రాస్ నివాసి టైలరింగ్ చేస్తున్న అఫ్రినా ఖానం (28) హతురాలు. భర్త లాలూఖాన్ తో జీవిస్తోంది. ఆమెకు ఐదు, మూడేళ్లు వయసు గల ఇద్దరు పిల్లలు ఉండగా వీరిని తమ పుట్టింటికి పంపించింది. భార్య ప్రవర్తనపై అనుమానం వచ్చిన భర్త గొడవపడేవాడు. ఇతడు ఒక టింబర్డిపోలో పనిచేసేవాడు. మంగళవారం సైతం గలాటా జరిగింది. భర్త పనికి వెళ్లిపోయిన కొంతసేపటికి ఒక వ్యక్తి వచ్చి అఫ్రినాతో గొడవకు దిగాడు. కొంతసేపటికి అక్కడే ఉన్న కత్తెర తీసుకుని ఆమె పొడవడంతో తీవ్రగాయాలతో చనిపోయింది. దుండగుడు ఆమె మృతదేహంపై బట్టలు కుప్పగా వేసి నిప్పంటించి వెళ్లిపోయాడు. మంగళవారం సాయంత్రం ఇంట్లో నుంచి పొగలు వస్తుండగా స్థానికులు చూసి ఆమె సోదరికి, భర్తకు ఫోన్ చేశారు. వారు వచ్చి తలుపులు పగులగొట్టి ఇంట్లోకి వెళ్లగా పరుపు, మృతదేహంపై బట్టలు కాలిపోయాయి. బనశంకరి పోలీసులు చేరుకుని పరిశీలించారు. హంతకుని ఆచూకీ లభించిందని త్వరలోనే అరెస్ట్‌చేస్తామని దక్షిణ డీసీపీ హరీశ్ పాండే తెలిపారు. -
పార్కింగ్ విషయంలో గొడవ.. మహిళ చీర లాగి, దుర్భాషలాడుతూ
సాక్షి,సైదాబాద్: వాహనం పార్కింగ్ విషయమై జరిగిన గొడవలో ఓ మహిళ చీర లాగి, దుర్భాషలాడుతూ దాడికి పాల్పడ్డారు. సైదాబాద్ పోలీసుల కథనం ప్రకారం.. నాందేడ్‌కు చెందిన ఓ మహిళ, భర్తతో కలిసి పూర్ణోదయాకాలనీ రహదారిపై టీ స్టాల్ నడుపుతున్నారు. కొంతకాలం క్రితం వీరి టీ స్టాల్‌కు దగ్గరలోనే పూసలబస్తీకి చెందిన తన్నీరు శ్రీనివాస్ టిఫిన్ సెంటర్ ఏర్పాటు చేశాడు. ఈ క్రమంలో టీ స్టాల్ దంపతుల కుమారుడు తన బైక్‌ను టిఫిన్ సెంటర్ ముందు నిలపగా, యజమాని కుమారుడు కింద పడేశాడు. చదవండి: బ్లేడ్‌తో చేయి కోసుకుని, తల పగులగొట్టుకొని, కప్పు పెంకులు నమిలి.. ఎందుకిలా చేశావని ప్రశ్నించినందుకు అతడిపై టిఫిన్ సెంటర్ యజమాని, అతడి కుమారులు దాడి చేశారు. తన కుమారుడిపై దాడిని అడ్డుకొనేందుకు వచ్చిన తల్లిపై కూడా దాడి చేయగా ఆమె రోడ్డుపై పడిపోయింది. అయినా వదలకుండా ఆమె చీరలాగి కొట్టేందుకు యత్నించగా స్థానికులు అడ్డుకున్నారు. బాధితుల ఫిర్యాదు మేరకు దాడికి పాల్పడిన తన్నీరు రామారావు, రమేష్, రాజులపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: నదిలో పడిన బస్సు.. 32 మంది మృతి మహిళలతో అసభ్యకర డ్యాన్స్: ముగ్గురి అరెస్టు నాగోలు: ఓ రియల్ ఎస్టేట్ సంస్థ వార్షికోత్సవంలో మద్యం తాగి, డీజే ముసుగులో మహిళలతో అసభ్యకర నృత్యాలు చేయించిన ముగ్గురు నిర్వాహకులపై ఎల్బీనగర్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఎల్బీనగర్ పోలీసుల కథనం ప్రకారం... ల్యాండ్ మార్క్ రియల్ ఎస్టేస్ సంస్థ 5 వార్షికోత్సవం సోమవారం రాత్రి నాగోలులోని ఓ గార్డెన్స్‌లో జరిగింది. కంపెనీ ఉద్యోగుల సమావేశం పూర్తయ్యాక మద్యం తాగి, డీజే పాటల హోరులో మహిళలతో అసభ్యకరంగా నృత్యాలు చేయించారు. స్థానికులు ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన పోలీసులు సదరు రియల్ ఎస్టేట్ సంస్థ ఆర్గనైజర్ పి.రవీందర్‌రెడ్డి, ఈవెంట్ ఆర్గనైజర్ వరదరాజన్, డీజే ఆపరేటర్ కడారి దిలీప్‌కుమార్‌ను అరెస్టు చేసి డీజేను స్వా«దీనం చేసుకున్నారు. కేసు దర్యాప్తులో ఉంది. -
యువతిపై దాడి చేస్తూ వీడియో చిత్రీకరణ
నెల్లూరు(క్రైమ్): తనను దూరంగా ఉంచడాన్ని జీర్ణించుకోలేని ఓ వ్యక్తి ఓ యువతిపై దాడి చేసి చిత్రహింసలకు గురిచేశాడు. పైగా ఆ వ్యవహారాన్ని స్నేహితుడి ద్వారా వీడియో తీయించాడు. ఆ వీడియో బుధవారం సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పోలీసులు సుమోటోగా కేసు నమోదు చేశారు. గంటల వ్యవధిలోనే ఇద్దరు నిందితులను అరెస్ట్ చేశారు. ఘటనకు సంబంధించిన వివరాలను శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా ఎస్పీ సీహెచ్ విజయారావు బుధవారం మీడియాకు వెల్లడించారు. నెల్లూరు రామకోటయ్యనగర్‌కు చెందిన పల్లాల వెంకటేష్, కె.శివకుమార్ స్నేహితులు. వెంకటేష్ టిప్పర్ డ్రైవర్. కుటుంబ కలహాల నేపథ్యంలో భార్య అతనిని విడిచి వెళ్లిపోయింది. ఈ నేపథ్యంలో వెంకటేష్ ఓ యువతితో సన్నిహితంగా ఉండేవాడు. అయితే అతని ప్రవర్తన నచ్చక ఆమె అతనిని దూరంగా ఉంచుతూ వచ్చింది. దీనిని అతను జీర్ణించుకోలేకపోయాడు. సుమారు మూడు నెలల కిందట మాట్లాడుకుందామని యువతిని కొత్తూరు సమీపంలోని నిర్జన ప్రదేశానికి తీసుకెళ్లి అమానుషంగా ప్రవర్తించాడు. కర్రతో, చేతులతో విచక్షణ రహితంగా దాడి చేశాడు. గాజులు పగిలి రక్తస్రావం అవుతున్నా కనికరించలేదు. బాధిత యువతి తనను వదిలేయాలని కన్నీటి పర్యంతమైనా పట్టించుకోకుండా దాడి చేస్తూ ఆ వ్యవహారాన్ని స్నేహితుడు శివకుమార్ ద్వారా వీడియో తీయించి పైశాచికానందం పొందాడు. అయితే ఈ ఘటనపై పోలీసులకు ఎలాంటి ఫిర్యాదు అందలేదు. గంటల వ్యవధిలో నిందితుల అరెస్ట్ మూడు నెలల అనంతరం బుధవారం వాట్సాప్, ట్విట్టర్, పలు చానళ్లలో యువతిని చిత్రహింసలు పెడుతున్న వీడియో వైరల్ అయింది. దీనిపై ఎస్పీ విజయారావు స్పందించి.. నిందితుల కోసం మూడు ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపారు. సాంకేతికత సాయంతో వీడియోలోని నిందితులను గుర్తించి, తెగచర్లలో వారిని అరెస్ట్ చేశారు. నిందితులిద్దరిపై రౌడీషీట్లు తెరుస్తున్నట్టు ఎస్పీ తెలిపారు. ఏడు రోజుల్లోపు చార్జ్‌షీటు వేసి శిక్షపడేలా చేస్తామని చెప్పారు. గంటల వ్యవధిలోనే నిందితులను అరెస్ట్‌చేసిన నగర డీఎస్పీ శ్రీనివాసులరెడ్డి, వేదాయపాళెం ఇన్స్పెక్టర్ రామకృష్ణ తదితరులను ఎస్పీ విజయారావు అభినందించారు. -
రెండో పెళ్లికి ఒప్పుకోలేదని దారుణం..
సాక్షి, పశ్చిమగోదావరి : పెళ్లికి నిరాకరించిందనే కోపంతో ఓ వ్యక్తి దారుణానికి ఒడిగట్టాడు. యువతిపై కత్తితో దాడి చేసి తీవ్రంగా గాయపరిచాడు. ఈ ఘటన పోడూరు మండలం కవిటం గ్రామంలో బుధవారం ఉదయం చోటుచేసుకుంది. వివరాలు.. సుధాకర్‌రెడ్డి అనే వివాహితుడు కొవ్వూరి తేజశ్రీ (20)ని రెండో పెళ్లి చేసుకుందామనుకున్నాడు. ఆమె ససేమిరా అనడంతో కక్ష పెంచుకున్నాడు. బుధవారం ఆమెపై కత్తితో విచక్షణారహితంగా దాడి చేశాడు. అనంతరం తానూ పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. ఇద్దరినీ పాలకొల్లు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ ప్రారంభించారు. తేజశ్రీ పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం. -
పెళ్లికి నిరాకరించిందని దాడి!
సాక్షి, పశ్చిమగోదావరి(పెనుగొండ) : పెళ్లికి నిరాకరించడంతో యువతిపై చాకుతో దాడి చేసి ఆపై తానూ ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడో యువకుడు. ఈ సంఘటన స్థానికంగా సంచలనం రేపింది. పోలీసుల కథనం ప్రకారం మార్టేరుకు చెదిన గ్రంధి మణికుమార్(28), రామోజు శాంతకుమారి(22) మార్టేరులోని ఒక ప్రైవేటు షాపులో పనిచేసేవారు. మణికుమార్ ఆమెను పెళ్లి చేసుకోవాలని వేధించేవాడు. ఇందుకు శాంతకుమారి నిరాకరిస్తూ వస్తోంది. మంగళవారం పెనుగొండ గాంధీ బొమ్మల సెంటరుకు పనిమీద వచ్చిన యువతిపై మణికుమార్ చాకుతో దాడి చేశాడు. ఈ దాడిలో యువతి చేతికి స్వల్ప గాయం కావడంతో పెనుప్రమాదం తప్పింది. ఆమెపై దాడికి పాల్పడిన మణికుమార్ అనంతరం తానూ గొంతు కోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. గాయపడిన ఇద్దరినీ స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. ఆసుపత్రిలో మణికుమార్ కోలుకుంటున్నాడు. యువతి ఫిర్యాదు మేరకు పెనుగొండ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
బట్టలూడదీసి పబ్ డ్యాన్సర్‌ను కొట్టారు..!
హైదరాబాద్: ఆమె పొట్టకూటి కోసం నగరానికి వచ్చింది. ఇద్దరు పిల్లలు, తల్లిదండ్రులను పోషించుకునేందుకు ఓ బార్లో డ్యాన్సర్‌గా చేరింది. తోటి డ్యాన్సర్లు, నిర్వాహకులు అసాంఘిక కార్యకలాపాలు, వ్యభిచారం చేయాలని ఆమెపై తీవ్ర ఒత్తిడి చేశారు. దానికి ఒప్పుకోకపోవడంతో ఆ యువతి ఒంటిపైనున్న బట్టలూడదీసి విచక్షణారహితంగా దాడి చేశారు. బీర్ సీసాలను పగలగొట్టి చేయి, ఛాతీపై తీవ్ర గాయాలు చేశారు. ఈ దారుణ ఘటన హైదరాబాద్‌లోని పంజగుట్ట పోలీస్‌స్టేషన్ పరిధిలో శుక్రవారం అర్ధరాత్రి చోటు చేసుకుంది. వివరాలు... గుంటూరు జిల్లా సంగడికుంట కాలనీకి చెందిన జి.హరిణి(26) బతుకుదెరువు కోసం కుటుంబంతో కలసి నగరానికి వచ్చింది. యూసుఫ్‌గూడలోని కృష్ణానగర్‌లో ఉంటూ మొదట్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా చేసేందుకు యత్నించింది. సరైన అవకాశాలు రాకపోవడంతో ఐదునెలల క్రితం బేగంపేటలోని లిస్బన్ క్లబ్లో డ్యాన్సర్‌గా చేరింది. మొదట్లో బాగానే సాగినప్పటికీ కొద్దిరోజుల నుండి తోటి డ్యాన్సర్లు, ఓ మధ్యవర్తి వ్యభిచారం చేయాలని ఆమెపై ఒత్తిడి చేయసాగారు. తాను అసాంఘిక కార్యకలాపాలు చేయనని, పొట్టకూటి కోసమే డ్యాన్సర్‌గా చేస్తున్నానని హరిణి స్పష్టం చేసింది. దీంతో ఆమెపై వారు కోపం పెంచుకున్నారు. శుక్రవారం అర్ధరాత్రి 1 గంటకు పబ్ మూసేయగానే మధ్యవర్తి సయ్యద్ మాజీద్ హుస్సేన్ అలియాస్ సయీద్(30), తోటి డ్యాన్సర్లు ఎర్రబెల్లి సంధ్య అలియాస్ రితిక(24), జెక్క శ్రావణి అలియాస్ స్వీటీ(20), ఎస్.రేఖ అలియాస్ మధు(25), కొడాలి విజయారెడ్డి అలియాస్ విజ్జు(24)లు ఓ కస్టమర్ వద్దకు వెళ్లాలని ఆమెపై తీవ్రంగా ఒత్తిడి చేశారు. దీనికి హరిణి ఒప్పుకోకపోవడంతో ఒంటిపై బట్టలు ఊడదీసి విచక్షణారహితంగా దాడి చేశారు. బీర్ సీసాలను పగలగొట్టి చేయి, ఛాతీపై తీవ్ర గాయాలు చేశారు. ఆ యువతి అరుస్తూ వారి నుండి తప్పించుకుని బయటకు వచ్చి ‘100’కు ఫోన్ చేసింది. దీంతో వారు మరింత రెచ్చిపోయి పోలీసులకు ఫోన్ చేస్తావా.. అంటూ ఆమె సెల్‌ఫోన్‌ను గుంజుకొని పగలగొట్టారు. పట్టించుకోని పోలీసులు సమాచారం తెలుసుకున్న పంజగుట్ట ఎస్సై, సిబ్బంది అక్కడకు చేరుకుని తనను కాపాడకపోగా, దాడి చేసినవారికి వత్తాసు పలికారని బాధితురాలు ఆరోపించింది. ‘‘అమ్మాయిని కాపాడండి.. స్టేషన్‌కు తీసుకువెళ్లండి..’అని పబ్‌లోని కస్టమర్లు అన్నప్పటికీ పట్టించుకోకుండా, స్టేషన్‌కు వచ్చి ఫిర్యాదు చెయ్యి, అప్పుడు చూద్దాం’అన్నారని బాధితురాలు వాపోయింది. పోలీసుల ముందే నిందితులు తనను పచ్చిబూతులు తిట్టారని, కొట్టడానికి వచ్చారని ఆవేదన వ్యక్తం చేసింది. 10 రోజులక్రితం ఇదే తరహా ఫిర్యాదు చేసేందుకు పోలీసుస్టేషన్‌కు వెళ్లగా పోలీసులు పట్టించుకోలేదని, పైగా చాలా చులకనగా మాట్లాడారని బాధితురాలు తెలిపింది. పొట్టకూటి కోసం నగరానికి వచ్చామని, తన తండ్రికి కళ్లు కనిపించవని, తల్లి పొలం పనులకు వెళుతోందని రోదిస్తూ తెలిపింది. పబ్‌లో కూడా వేతనం ఉండదని, డ్యాన్స్ చేస్తుండగా కస్టమర్లు ఇచ్చే డబ్బులతోనే కుటుంబాన్ని పోషించుకుంటున్నానని తెలిపింది. ఆమె ఆరోపణలు నిజమైతే చర్యలు తీసుకుంటాం: ఏసీపీ బాధితురాలు చేసిన ఆరోపణలు నిజమైతే సదరు సిబ్బందిపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని పంజగుట్ట ఏసీపీ తిరుపతన్న తెలిపారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నామని నలుగురు మహిళలను అరెస్టు చేసి వారిపై కేసు నమోదు చేశామన్నారు. ప్రధాన నిందితుడు సయీద్ తప్పించుకున్నాడని, అతన్ని కూడా త్వరలోనే పట్టుకుంటామన్నారు. -
ఆఫీస్ నుంచి తిరిగి వెళ్తుండగా..
చండీగడ్ : హరియాణాలో దారుణం చోటుచేసుకుంది. ఓ వివాహితపై యాసిడ్దాడి జరిగింది. ఈ ఘటన అంబాలాలోని సెక్టార్ 7లో గురువారం సాయంత్రం చోటుచేసుకుంది. వివరాలు.. లేబర్ డిపార్ట్మెంట్లో ఉద్యోగం చేస్తున్న కవిత (31) ఆఫీస్ నుంచి ఇంటికి వెళ్తుండగా.. బైక్‌పై వచ్చిన ఇద్దరు దుండగులు ఆమెపై యాసిడ్ విసిరారు. ఈ దాడిలో కవిత ముఖం, కుడి కన్ను, ఉదర భాగంపై తీవ్ర గాయాలయ్యాయని పోలీసులు తెలిపారు. బాధితురాలికి 60 శాతం కాలిన గాయాలయ్యాయనీ, ఆమె పరిస్థితి విషమంగా ఉందని సివిల్ ఆస్పత్రి డాక్టర్ సంజయ్ తెలిపారు. మెరుగైన చికిత్స కోసం ఆమెను చంఢీగడ్‌లోని జీఎంసీహెచ్ ఆస్పత్రికి తరలించారు. దృశ్యాలున్నాయి.. కానీ దాడికి సంబంధించిన దృశ్యాలు సీసీటీవీలో నమోదయ్యాయని పోలీసులు తెలిపారు. కానీ కెమెరా క్వాలిటీ సరిగా లేనందున దృశ్యాలు అస్పష్టంగా నమోదయ్యాయనీ వెల్లడించారు. నిందితులిద్దరూ హెల్మెట్ ధరించారనీ, బైక్‌పై వెనక కూర్చున్న వ్యక్తి మహిళపై యాసిడ్ విసిరాడని తెలిపారు. దాడికి సంబంధించిన కారణాలు తెలియాల్సి ఉంది. దాడి జరిగిన సమయంలో కవిత భర్త లడఖ్‌లో ఉన్నారు. ఆయన డాక్టర్‌గా సేవలందిస్తున్నారు. -
ఆటవిక చర్య.. నగ్నంగా మహిళ ఊరేగింపు
అర్రా : బిహార్‌లో అమానుష ఘటన చోటుచేసుకుంది. ఓ యువకున్ని చంపిందనే నెపంతో కొందరు వ్యక్తులు ఓ మహిళపై దాడి చేశారు. అంతటితో ఆగక నగ్నంగా ఆమెను ఊరేగించారు. ఈ ఆటవిక ఘటన భోజ్‌పూర్ జిలాల్లోని బహియా పోలీస్‌స్టేషన్ పరిధిలో మంగళవారం జరిగింది. వివరాలు.. దామోదర్‌పూర్‌కు చెందిన విమలేష్ సా సోమవారం నుంచి ఆచూకీ లేకుండా పోయాడు. ఓ రైల్వే స్టేషన్ సమీపంలో మంగళవారం ఉదయం అతని మృతదేహం లభించింది. విషయం తెలుసుకున్న మృతుని గ్రామస్తులు అక్కడికి చేరుకున్నారు. విమలేష్ మృతికి దగ్గర్లో ఉన్న రెడ్‌లైట్ ఏరియాలో ఉండే మహిళలు కారణం కావొచ్చని ఆగ్రహించారు. అక్కడ నివాసముండే ఓ మహిళను ఇంట్లో నుంచి బయటకు లాగి ఆమెపై రాక్షసంగా దాడి చేశారు. వస్త్రాలు విప్పదీసి ఆమెను నగ్నంగా ఊరేగించారు. సమాచారం అందుకున్న ఎస్పీ అవకాశ్ కుమార్ అక్కడకు చేరుకుని గాల్లోకి కాల్పులు జరిపి వారిని చెదరగొట్టారు. భారీ స్థాయిలో పోలీసు బలగాల్ని దించి ఘర్షణలను అదుపు చేశారు. మహిళతో అసభ్యంగా ప్రవర్తించిన వారిపై కేసు నమోదు చేశామని ఎస్పీ తెలిపారు. పరారీలో ఉన్న నిందితులను త్వరలోనే పట్టుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. -
మహిళను తన్నిన ఎంపీపీ గోపీ అరెస్టు!
సాక్షి, నిజామాబాద్: మహిళను కాలితో తన్ని అవమానించిన దర్పల్లి ఎంపీపీ ఇమ్మడి గోపీని పోలీసులు సోమవారం అరెస్టు చేశారు. మహిళపై అనుచితంగా ప్రవర్తించి దాడి చేసినందుకు ఆయనపై కేసు నమోదు చేశారు. భూతగాదాల విషయమై గొడవ జరగడంతో ఎంపీపీ ఇమ్మడి గోపీ దౌర్జన్యపూరితంగా వ్యవహరించాడు. మహిళ చెప్పుతో కొట్టడంతో విచక్షణ కోల్పోయిన అతను.. ఆమెను కడుపులో తన్నాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్ అయిన సంగతి తెలిసిందే. ఇందల్ వాయి మండలం గౌరారంకు చెందిన ఒడ్డె రాజవ్వ దర్పల్లి ఎంపీపీ ఇమ్మడి గోపి వద్ద వ్యవసాయ భూమి, అందులోని మరో ఇంటిని కొనుగోలు చేసింది. ఒప్పందం ప్రకారం డబ్బులు ఇచ్చిన తర్వాత కూడా ఇంకా అదనంగా నగదు ఇవ్వాలని ఇమ్మడి గోపి డిమాండ్ చేస్తున్నారని రాజవ్వ ఆరోపించారు. ఈ మేరకు కుటుంబ సభ్యులు, బంధువులతో కలిసి ఇందల్ వాయిలో నివాసం ఉంటున్న ఎంపీపీ గోపి ఇంటి వద్దకు వచ్చి గొడవకు దిగారు. అమ్మిన ఇంటిని అప్పగించకుండా, తాళాలు వేసి తమకు ఇవ్వకపోవడం బాధిత రాజవ్వకు ఆగ్రహం తెప్పించింది. మాటామాటా పెరిగి ఆగ్రహంతో బాధిత మహిళ రాజవ్వ, ఎంపీపీ గోపిపై చెప్పుతో దాడి చేశారు. వరండాపైన ఉన్న గోపి కింద ఉన్న రాజవ్వను గట్టిగా కాలితో తన్నాడు. దీంతో మహిళ కింద పడిపోయారు. పక్కనే ఉన్న రాజవ్వ బంధువు గోపిని అడ్డుకున్నారు. బాధిత మహిళ రాజవ్వ వివరాల ప్రకారం.. ‘ఇందల్ వాయి వద్ద జాతీయ రహదారి పక్కనే గోపికి చెందిన 1125 గజాల స్థలం, అందులోని ఇల్లు కూడా 50 లక్షలకు ఇస్తాను అని చెప్తే 33 లక్షల 72 వేలకు ఒప్పందం కుదిరింది. డబ్బు మొత్తం చెల్లించి రిజిస్ట్రేషన్ కూడా పూర్తయ్యాక 11 నెలలుగా ఇల్లు వ్యవసాయ భూమి ఖాళీ చేయలేదు. ఎంపీపీ గోపి అదనంగా డబ్బులు చెల్లించాలని గోపి డిమాండ్ చేస్తున్నారు. కొనుగోలు చేసిన ఇంటికి వచ్చి ఇంట్లోని సామానును గోపి బయట పడేశారు. పోలీసులు అక్కడే ఉన్నా ప్రేక్షక పాత్ర పోషించడం విమర్శలకు దారి తీస్తోంది. మాజీ నక్సలైట్ ను అని తమతో పెట్టుకోవద్దని గోపి బెదిరిస్తున్నారని బాధితురాలు ఆరోపిస్తున్నారు. మా కొడుకులకు ఏం జరిగినా ఎంపీపీదే బాధ్యత. ఎస్సై, సీఐ, సీపీ, కలెక్టర్, ఎమ్మెల్యేలను కలిసి సమస్య చెప్పుకుంటే డబ్బులు చెల్లించి కొనుగోలు చేశారు కనుక, అదే ఇంట్లో ఉండాలని చెప్పారు. కానీ మాకు అన్యాయమే జరిగిందంటూ’ ఆవేదన వ్యక్తం చేశారు. -
అధికారం ఉంది.. తంతా!
ఇందల్వాయి(నిజామాబాద్ జిల్లా): అతడు అధికార టీఆర్ఎస్ పార్టీ ప్రజా ప్రతినిధి.. దాదాపు ఏడాది కింద ఓ మహిళకు తన ఇంటిని అమ్మాడు.. ఆమె డబ్బులన్నీ కట్టేసింది.. రిజిస్ట్రేషన్ కూడా పూర్తయింది.. అయినా ఇంటిని స్వాధీనం చేయలేదు.. ఆ మహిళ ఇంటికెళ్లి నిలదీసినందుకు బలంగా కాలితో తన్నాడు! నిజామాబాద్ జిల్లా ఇందల్వాయి మండలం గౌరారానికి చెందిన ఇమ్మడి గోపి దాష్టీకమిదీ. 33 లక్షలకు అమ్మి.. 90 లక్షలు కావాలంటూ.. గోపి ధర్పల్లి ఎంపీపీగా కొనసాగుతున్నారు. ఆయనకు ఇందల్వాయిలోని సర్వే నెం.1107లో 1,125 గజాల స్థలంలో రెండు పోర్షన్లతో కూడిన ఇల్లు (3–8–11/3) ఉంది. 11 నెలల క్రితం ఈ ఇంటితో సహా స్థలాన్ని గౌరారానికి చెందిన ఒడ్డె రాజవ్వ, గంగారాం దంపతులకు రూ.33.72 లక్షలకు విక్రయించాడు. విడతల వారీగా మొత్తం డబ్బులు తీసుకొని రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చాడు. నెల క్రితం ఇంటి చుట్టూ ప్రహరీ నిర్మించేందుకు రాజవ్వ ఇసుక, ఇటుక తరలించగా.. గోపి అడ్డుకున్నాడు. రూ.90 లక్షలకు ఇంటిని అమ్మానని, మిగతా రూ.56 లక్షలు కడితేనే ఇంటిని స్వాధీనం చేస్తానని ఆయన అన్నట్లు రాజవ్వ, ఆమె కుమారుడు ఆరోపిస్తున్నారు. తాను మాజీ నక్సలైట్‌నని, తన చేతుల్లో అధికారం ఉందని, ఎవరూ ఏమి చేయలేరంటూ బెదిరించాడంటూ వారు పోలీసులను ఆశ్రయించారు. అయితే సివిల్ తగాదాలు కోర్టులో తేల్చుకోవాలని పోలీసులు సూచించడంతో బాధితులు స్థానిక ఎమ్మెల్యేకు, కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. పోలీస్ ఉన్నతాధికారులకు వద్దకు వెళ్లగా.. చివరకు ఎంపీపీపై బెదిరింపుల చట్టం కింద కేసు నమోదైంది. చెప్పుతో కొట్టడంతో.. రాజవ్వ కుటుంబీకులు ఆదివారం తమ కులస్తులతో కలిసి ఇందల్వాయిలోని తాము కొన్న ఇంటి వద్దకు చేరుకున్నారు. తాళం పగలగొట్టి లోపన ఉన్న వస్తువులు, వంట సామగ్రిని బయటకు పడేసి, తమకు న్యాయం చేయాలంటూ ఇంటి మందు బైఠాయించారు. ఈ క్రమంలో ఎంపీపీ గోపికి, రాజవ్వ కుటుంబీకుల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. దీంతో కోపోద్రిక్తురాలైన రాజవ్వ గోపిని చెప్పుతో కొట్టింది. దీంతో అతడు రాజవ్వను కాలితో బలంగా తన్నాడు. కిందపడిన రాజవ్వ అస్వస్థతకు గురవడంతో చికిత్స కోసం జిల్లా కేంద్ర ఆస్పత్రికి తరలించారు. దీనిపై ఇరుపక్షాలు ఒకరిపై ఒకరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. స్థల వివాదంపై వివరణ కోరగా ఎంపీపీ స్పందించేందుకు నిరాకరించారు. మాకు ప్రాణ భయం ఉంది: రాజవ్వ తమ వద్ద గోపి రూ.33 లక్షలు తీసుకొని, ఇంటిని, స్థలాన్ని అప్పగించడం లేదని రాజవ్వ పేర్కొంది. ‘‘నేను మాజీ నక్సలైట్‌ను.. నా చేతిలో అధికారం ఉంది. మీరు నన్ను ఏమి చేయలేరు అని బెదిరిస్తున్నాడు. అతడి నుంచి మాకు ప్రాణ భయం ఉంది. నా భర్త దుబాయిలో కష్టపడి సంపాదించిన డబ్బుతో ఇంటిని కొన్నా. అధికారులు, ప్రజాప్రతినిధులు మాకు న్యాయం చేయాలి’’అని ఆమె గోడు వెల్లబోసుకుంది. గోపిని అరెస్ట్ చేయాలి ఎంపీపీ దాడి విషయం తెలిసి వడ్డెర జేఏసీ రాష్ట్ర కన్వీనర్ దండి వెంకటి తదితరులు ఇందల్వాయికి చేరుకుని నిరసన తెలిపారు. ఎంపీపీపై నిర్భయ చట్టం కింద కేసు నమోదు చేసి, వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. గోపిని టీఆర్ఎస్ నుంచి సస్పెండ్ చేయాలని, లేకపోతే ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. సోమవారం ప్రజాసంఘాలతో కలిసి ‘చలో ఇందల్వాయి’నిర్వహించనున్నట్లు తెలిపారు. మరోవైపు కాంగ్రెస్ ఇందల్వాయి బంద్‌కు పిలుపునిచ్చింది. -
బెంగళూరులో చైన్‌స్నాచర్ల దుర్మార్గం
-
కువైట్‌లో భారత మహిళపై దాడి
కువైట్ : ఓ ఇంటి యాజమాని తన ఇంట్లో పని చేస్తున్న భారత మహిళపై దాడికి పాల్పడ్డాడు. ఆ మహిళ తలకు, చేతులకు గాయాలయ్యాయి. అయితే యాజమాని సోదరే బాధిత మహిళను ఆస్పత్రిలో చేర్పించారు. ఆస్పత్రిలో కోలుకుంటున్న ఆ మహిళ కువైట్‌లోనే పనిచేస్తోన్న తన సోదరుడితో కలిసి దాడి గురించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. అలాగే తనపై జరిగిన దాడికి సంబంధించిన మెడికల్ రిపోర్ట్‌ను కూడా ఫిర్యాదుతో పాటు అందజేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందింతుడి కోసం గాలిస్తున్నారు. -
ప్రేమోన్మాది ఘాతుకం
శృంగవరపుకోట: ప్రేమోన్మాదంతో కళ్లు మూసుకుపోయిన ఓ యువకుడు తనతో వివాహేతర సంబంధం పెట్టుకున్న మహిళ నిర్లక్ష్యం చేస్తున్నందున ఆమెపై దాడికి యత్నించడమే గాకుండా... అడ్డుకున్న వ్యక్తి చేతి వేళ్లు నరికిన సంఘటన శృంగవరపుకోట పట్టణంలో గురువారం రాత్రి చోటు చేసుకుంది. కలకలం రేపిన సంఘటనకు సంబంధించి ఎస్ఐ తెలిపిన వివరాలిలా ఉన్నాయి. ఎస్.కోట పట్ణణంలో నడబండ ప్రాంతంలో నివాసం ఉంటున్న నానిగిరి నాగరాజు అనే యువకుడు మెకానిల్ డిప్లొమా పూర్తిచేసి మూడేళ్ల క్రితం స్థానిక ఆర్టీసీ డిపోలో ఔట్ సోర్సింగ్ విభాగంలొ శ్రామిక్ గా పనిచేస్తున్నాడు. అదే సమయంలో డిపోలో వున్న వాటర్ ప్లాంట్ దుకాణంలో గంట్యాడ మండలం కొండతామరాపల్లికి చెందిన ఓ వివాహితతో పరిచయం పెంచుకుని ఆమెతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. ఆ వివాహిత భర్త, కుమార్తె ఏడేళ్ల క్రితమే చనిపోగా ఆమె ఒంటరిగా జీవిస్తోంది. ఆ మహిళ ఇటీవలే వాటర్‌ప్లాంట్‌లో పని మానేసి ఆకులడిపో వద్ద ఆదిమూలం మధు అనే యువకుడు ప్రారంభించిన ఐస్‌క్రీమ్ పార్లర్లో పనికి కుదిరింది. ఇటీవల ఆమె నాగరాజును నిర్లక్ష్యం చేస్తుండటంతో తట్టుకోలేక పగ పెంచుకుని గురువారం సాయంత్రం 6 గంటల సమయంలో పార్లర్‌కు వెళ్లి ఆమెపై దాడి చేశాడు. ఇంతలో దుకాణం యజమాని మధు అడ్డుకునే ప్రయత్నం చేయగా కుడిచేతి నాలుగు వేళ్లు తెగిపడ్డాయి. స్థానికులు హుటాహుటిన మధును స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి చేర్చారు. హత్యకు పాల్పడిన నాగరాజు పోలీసు స్టేషన్లో లొంగిపోయాడు. ప్రాధమిక చికిత్స అనంతరం మధును విశాఖ కేజీహెచ్‌కు తరలించారు. ఎస్‌కోట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
ముస్లింలపై లండన్‌లో సంచలన లేఖలు
లండన్ : ముస్లింలకు వ్యతిరేకంగా లండన్‌లో సంచలనాత్మక లేఖలు బయటకు వచ్చాయి. ముస్లింలపై దాడులకు సిద్ధం కండి అని ఉపదేశిస్తూ గుర్తు తెలియని వ్యక్తులు కొందరు ఆ లేఖలను విడుదల చేశారు. వచ్చే నెల (ఏప్రిల్) 3న తమ పిలుపునందుకొని 'ముస్లింను శిక్షించండి' కార్యక్రమం (పనిష్ ఏ ముస్లిం డే)లో పాల్గొనాలని ఆ లేఖల్లో ఉపదేశించారు. పైగా వీటిని ఆన్లైన్లో కూడా చెక్కర్లు కొట్టించారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసు అధికారులు ఒక్కసారిగా ఉలిక్కిపడి దర్యాప్తును వేగవంతం చేశారు. పోలీసుల వివరాల ప్రకారం పనిష్ ఏ ముస్లిం డే అనే పేరిట విడుదల అయిన లేఖలను కొందరు వ్యక్తులు లండన్, యార్క్‌షైర్, మిడ్‌ల్యాండ్ నగరాల్లో పంచి పెట్టారు. దీంతో ఈ కేసును బ్రిటన్‌లో ఉగ్రవాద కేసులను విచారించే దర్యాప్తు సంస్థకు అప్పగించారు. తీవ్రవాద కార్యకలాపాలకు వ్యతిరేకంగా పని చేసే నిఘా సంస్థ ఈ పత్రాలపై దర్యాప్తును చేపట్టినట్టు, సమాజానికి హాని కల్గించే ఇలాంటి తాము సహించబోమని, కొన్ని ముస్లిం వ్యతిరేక గ్రూపులపై కూడా ప్రత్యేక నిఘా ఉంచుతున్నట్లు పోలీసు అధికారులు వెల్లడించారు. కలకలం సృష్టించిన ఆ లేఖల్లో ముస్లింలపై భౌతిక దాడులు చేయాలని, ముస్లిం మహిళల హిజాబ్‌లను తొలగించాలని, యాసిడ్ దాడులు కూడా చేయాలని పేర్కొన్నారు. అంతేకాదు, ఈ దాడులకు పాల్పడిన వారికి వారు చేసిన దాడి తీవ్రతను బట్టి బహుమతులు కూడా ఇస్తామని ఆ లేఖల్లో ప్రచురించడం గమనార్హం. -
చనిపోయినట్లు నటించి ప్రాణాలు కాపాడుకున్న యువతి
-
యువతికి గుండు కొట్టించారు..వరంగల్‌లో దారుణం!
సాక్షి, వరంగల్: వరంగల్ అర్బన్ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. ప్రేమ వివాహం చేసుకుందనే కారణంతో తల్లిదండ్రులే ఓ యువతికి గుండు కొట్టించారు. పైడిపల్లిలో పెద్దలను ఎదిరించి ప్రవీణ్ అనే యువకుడిని గత నెల 28న బాధిత యువతి ప్రేమ వివాహం చేసుకుంది. పోలీసుల సహకారంతో వారు ఈ నెల 22న స్వగ్రామానికి వచ్చారు. కూతురి ప్రేమ వివాహం నచ్చని తల్లిదండ్రులు.. ఆమెను భర్త ఇంటి నుంచి బలవంతంగా తీసుకొచ్చారు. అంతటితో ఆగకుండా ఆమెకు గుండుకొట్టించి బంధువుల ఇంట్లో ఉంచారు. విషయం తెలుసుకున్న భర్త ప్రవీణ్ పోలీసులను ఆశ్రయించాడు. ప్రవీణ్ ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. -
మనుషులు కారు..!
-
కార్తీక్‌ను పెట్రోల్ పోసి తగలబెట్టాలి: బంధువులు
సాక్షి, హైదరాబాద్: ప్రేమించలేదని సంధ్యారాణిపై పెట్రోల్ పోసి సజీవ దహనం చేసిన నిందితుడు కార్తీక్‌పై తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. సంధ్యారాణి ప్రాణాలను పొట్టనబెట్టుకున్న కిరాతకుడు కార్తీక్‌ను కఠినంగా శిక్షించాలని సంధ్యారాణి కుటుంబసభ్యులు డిమాండ్ చేస్తున్నారు. అతన్ని కూడా పెట్రోల్ పోసి తగలబెట్టాలని గట్టిగా కోరుతున్నారు. సంధ్యారాణి సజీవ దహనం నేపథ్యంలో నగరంలో మహిళల భద్రతపైనా ఆందోళన వ్యక్తమవుతోంది. పోలీసులు మాత్రం దీనిని ప్రత్యేక ఘటనగా చూడాలని, నగరంలో మహిళల భద్రతకు ఇది ముడిపెట్టకూడదని అంటున్నారు. ప్రేమోన్మాది కార్తీక్ నిప్పంటించడంతో తీవ్రంగా గాయపడిన బాధితురాలు సంధ్యారాణి తుదిశ్వాస విడిచిన సంగతి తెలిసిందే. గురువారం జరిగిన దాడి తర్వాత 80 శాతం కాలిన గాయాలతో గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆమె పరిస్థితి విషమించడంతో శుక్రవారం ఉదయం 7.20 గంటల ప్రాంతంలో కన్నుమూసింది. దీంతో హత్యాయత్నం కేసును హత్య కేసుగా మార్చిన లాలాపేట్ పోలీసులు నిందితుడు కార్తీక్‌ను అరెస్టు చేశారు. ఈ కేసులో ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక చట్టంలోని వాటితోపాటు మరికొన్ని సెక్షన్లు జోడించారు. -
నిర్భయ చట్టం ప్రయోగించండి
సాక్షి, విశాఖపట్నం/పెందుర్తి: విశాఖ జిల్లాలో దళిత మహిళను వివస్త్రను చేసి దాడికి పాల్పడిన కేసులో నిందితులపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ నిరోధక చట్టంతోపాటు నిర్భయ చట్టం కింద కూడా కేసులు నమోదు చేయాలని జాతీయ ఎస్సీ కమిషన్ రాష్ట్ర ప్రభుత్వానికి సూచించింది. బాధితులకు న్యాయం జరగకపోతే అధికారులపై చర్యలు తప్పవని హెచ్చరించింది. విశాఖ జిల్లా పెందుర్తి మండలం జెర్రిపోతులపాలెం గ్రామాన్ని గురువారం సందర్శించిన కమిషన్.. బాధితుల నుంచి ఘటన వివరాలను సేకరించింది. 40 ఏళ్ల క్రితం 14 మంది దళితులకు కేటాయించిన 80 సెంట్ల స్థలాన్ని ఇప్పుడు వేరొకరికి ఇవ్వడం ఏమిటని బాధితులు కమిషన్ దృష్టికి తెచ్చారు. సస్పెన్షన్‌కూ వెనుకాడం దళిత మహిళపై దాడికి పాల్పడ్డ నిందితులను 24 గంటల్లోగా అరెస్ట్ చేయాలని ఈ సందర్భంగా జాతీయ ఎస్సీ కమిషన్ సభ్యుడు కె.రాములు విశాఖ జిల్లా పోలీస్ యంత్రాంగాన్ని ఆదేశించారు. రెవెన్యూ అధికారుల ఉదాసీన వైఖరిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దాడికి గురైన బాధిత మహిళకు రూ.8 లక్షల పరిహారాన్ని చెల్లించాలని, 25 శాతం సొమ్మును ఈరోజు(గురువారం) రాత్రిలోగా ఇవ్వాల న్నారు. దాడికి గురైన మహిళ లేదా ఆమె కుమార్తెకు ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని సూచించారు. ఎస్సీ కార్పొరేషన్ ద్వారా రుణ సౌకర్యం కూడా కల్పించాలని ఆదేశించారు. తన ఆదేశాలను పట్టించుకోకుంటే బాధ్యులైన ప్రతి ఒక్కర్ని సస్పెండ్ చేసేందుకు కూడా వెనుకాడబోనన్నారు. ‘మా స్థలాలు మాకివ్వమని అధికారులతోపాటు స్థానిక ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి వద్దకు వెళితే పట్టించుకోలేదు. మేం అక్కడ ఉండగానే స్థానిక వైస్ ఎంపీపీకి ఫోన్ చేసిన ఎమ్మెల్యే... మీరు ఇళ్లు కట్టుకోండి. మిమ్మల్ని ఎవరూ అడ్డుకోలేరని వారికి అభయం ఇచ్చారు. మా స్థలంలో టీడీపీ నేతలు తవ్వకాలు చేపడుతుంటే అడ్డుకున్నాం. అంతే.. అంతా కలబడి నా దుస్తులు చింపేసి దారుణంగా కొట్టారు. ’ – జాతీయ ఎస్సీ కమిషన్ ఎదుట బాధిత దళిత మహిళ ఆక్రోశం. -
మళ్లీ అదే తీరు
వైఎస్ఆర్ జిల్లా , బద్వేలు అర్బన్ : స్థానిక సిద్దవటం రోడ్డులోని సుమిత్రానగర్‌లో ఓ యువకుడు ఉన్మాదిగా ప్రవర్తిస్తుండటంతో మహిళలు బెంబేలెత్తుతున్నారు. అతనిపై చర్యలు తీసుకోవాలని ఆ ప్రాంతానికి చెందిన మహిళలు ఆదివారం స్థానిక అర్బన్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. వివరాల్లోకి వెళితే.. కొంత కాలంగా నాగరాజు అనే వ్యక్తి మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తూ భయభ్రాంతులకు గురి చేస్తున్నాడు. గత నెలలో రమణమ్మపై లైంగిక వేధింపులకు పాల్పడి దాడికి యత్నించడంతో.. సదరు మహిళతోపాటు స్థానిక మహిళలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అప్పట్లో పోలీసులు అరెస్టు చేసి కోర్టులో హాజరు పరచగా రిమాండ్‌కు పంపారు. అనంతరం కొన్ని రోజుల క్రితం బెయిల్‌పై వచ్చిన ఆ యువకుడు ఆదివారం రాత్రి గతంలో ఫిర్యాదు చేసిన మహిళతోపాటు రేణుక, కళావతిపై దాడి చేశాడు. ‘నా పైనే ఫిర్యాదు చేస్తారా, మీ అంతు చూస్తా’ అంటూ వీరంగం సృష్టించినట్లు మహిళలు ఫిర్యాదులో పేర్కొన్నారు. అతని ప్రవర్తన వలన ఒంటరిగా తిరగలేకున్నామని, గతంలో పోలీసులకు ఫిర్యాదు చేసినా మళ్లీ అదే విధంగా వ్యవహరిస్తున్నాడని మహిళలు వాపోతున్నారు. పోలీసుస్టేషన్‌కు ఫిర్యాదు చేసేందుకు వచ్చిన మహిళలు (ఇన్సెట్) ఉన్మాదిగా ప్రవర్తిస్తున్న నాగరాజు (ఫైల్) -
రేషన్ అడిగిన మహిళపై దాడి
హైదరాబాద్: రేషన్ సరుకులు అడిగిన మహిళపై ఓ రేషన్ డీలర్ దాడికి పాల్పడ్డాడు. ఈ సంఘటన మీర్పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని జనప్రియ అపార్ట్మెంట్లోని రేషన్ షాపు వద్ద బుధవారం ఉదయం చోటుచేసుకుంది. స్థానిక కాలనీకి చెందిన మహిళ బియ్యం కోసం షాపుకు రాగా, ఆమెకు రేషన్ ఇచ్చేందుకు నిరాకరించడంతో పాటు డీలర్ ఆమెపై దాడి చేశాడు. దీంతో ఆగ్రహించిన స్థానికులు రేషన్ షాపు ముందు ధర్నాకు దిగారు. -
వదంతులతో బేజారు
మన్యంలో అనవసర అలజడులు అపరిచిత వ్యక్తుల సంచారంపై కలకలం దాడులకు పాల్పడుతున్న సంఘటనలు పుకార్లేనంటున్న పోలీసులు పాడేరు: విశాఖ మన్యంలోని గిరిజన గ్రామాల్లో దొంగల సంచారంపై వదంతులు వ్యాపిస్తున్నాయి. జి. మాడుగుల, చింతపల్లి, జీకేవీధి మండలాల్లోని గిరిజన గ్రామాల్లో దొంగల సంచారిస్తున్నారనే వదంతులపై ఇటీవల ప్రచారం ఎక్కువైంది. 15 రోజులుగా మన్యంలో ఇవే పుకార్లు. ఈ నేపథ్యంలో గిరి జన గ్రామాల్లో అపరిచిత వ్యక్తులు కనిపిస్తే అనుమానాలు రెట్టింపవుతున్నాయి. జి.మాడుగుల మండలం కోరాపల్లి పంచాయతీ కుమ్మరిపుట్టులో గత వారం ఇదే అనుమానంతో గ్రామస్తులు ఓ మహిళపై దాడి చేసి హతమార్చిన ఘటన చోటు చేసుకుంది. రావికమతం మండలంలోని గిరిజన ప్రాంతమైన కల్యాణపులోవలో కొంతమంది మంగళవారం ఒక మహిళ అనుమానాస్పదంగా సంచరిస్తుండటంతో దాడి చేసి కొత్తకోట పోలీసులకు అప్పగించారు. పిల్లలను ఎత్తుకెళ్ళేందుకే దొంగలు సంచరిస్తున్నారనే అనుమానాలు గిరిజనుల్లో ఎక్కువైంది. వదంతుల నేపథ్యంలో అనుకోని విధంగా రోజుకొక సంఘటన మన్యంలో జరుగుతోంది. కార్లలో ఎవరైనా పర్యాటకులు వచ్చినా సరే కలకలం రేగుతోంది. ఇవి వదంతులేనని పోలీసు అధికారులు చెబుతున్నారు. గ్రామాల్లో చోరీలు గానీ, దొంగలు పిల్లలను ఎత్తుకెళ్ళిపోవడం వంటి ఘటనలు జరగలేదంటున్నారు. ఏ పోలీసు స్టేషన్లో కూడా ఎటువంటి కేసులు నమోదు కాలేదని ఉదహరిస్తున్నారు. వదంతులను పుట్టిస్తున్నారని, వీటిని ప్రజలు నమ్మకూడదని, అనుమానితులు, అపరిచిత వ్యక్తులు గ్రామాల్లోకి వచ్చినట్లైతే వెంటనే ఆయా మండలాల పోలీసులకు సమాచారం అందించాలని స్థానిక సీఐ ఎన్.సాయి ప్రజలకు విజ్ఞప్తి చేశారు. అంతుచిక్కని గిరిజనుడి హత్య...: జి.మాడుగుల మండలం మారుమూల ప్రాంతమైన పినకిల్తారి గ్రామంలో వంజరి పోతురాజు (45) అనే అవివాహితుడైన ఒక గిరిజనుడు గత ఆదివారం రాత్రి హత్యకు గురయ్యాడు. సామాన్య గిరిజనుడైన వంజరి పోతురాజును తల, మొండెం వేరు చేసి కిరాతకంగా హత్య చేశారు. తల భాగాన్ని పట్టుకుపోయారు. 4 రోజులైనా పోతురాజు హత్యకు గల కారణాలు అంతుచిక్కడం లేదు. హత్యకు గురైన పోతురాజు తలభాగం ఆచూకీ కూడా పోలీసులకు లభించ లేదు. ఈ సంఘటన గిరిజనుల్లో భయాందోళనలు రేకెత్తిస్తోంది. -
స్నానాల గదిలో బంధించారు..
హైదరాబాద్ : తనకు రావాల్సిన చిట్ డబ్బులు అడిగిన ఓ మహిళ పట్ల అసభ్యకరంగా ప్రవర్తించడమే కాకుండా ఆమెను బాత్రూంలో నిర్బంధించి హింసించిన వ్యక్తిని జూబ్లీహిల్స్ పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... హైదరాబాద్ యాదగిరినగర్‌లో నివసించే నర్సింహులు కొంత కాలంగా చిట్స్ వ్యాపారం చేస్తున్నాడు. అదే బస్తీకి చెందిన మహాలక్ష్మి నర్సింహులు వద్ద చిట్ వేసి ఇటీవలే పాడుకుంది. కాగా నర్సింహులు ఆమెకు రూ.3.80 లక్షలు ఇవ్వాల్సి ఉంది. కానీ నర్సింహులు డబ్బులు ఇవ్వకపోగా, కొన్ని రోజుల నుంచి ఆమెకు అసభ్యకర సందేశాలు పంపిస్తూ ఇంటికి రావాలని వేధిస్తున్నాడు. రెండు రోజుల క్రితం మహాలక్ష్మి డబ్బుల కోసం నర్సింహులు ఇంటికి వెళ్లగా తన కుటుంబ సభ్యులతో కలసి ఆమెపై దాడి చేసి, తర్వాత ఆమెను స్నానాల గదిలో బంధించారు. కష్టపడి నిందితుల చెర నుంచి తప్పించుకున్న బాధిత మహిళ మంగళవారం రాత్రి జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు నర్సింహులును బుధవారం అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. నర్సింహులుతో పాటు ఆయన భార్య ఉమ, కొడుకు అఖిల్, అల్లుడు శ్రీధర్‌పై కూడా కేసులు నమోదు చేశారు. -
ఉన్మాది చేతిలో మహిళ హతం
చీరాల టౌన్(ప్రకాశం): ఉన్మాది గొడ్డలితో ఒక మహిళను కిరాతకంగా నరికి చంపాడు. ఈ సంఘటన ప్రకాశం జిల్లా చీరాలలోని వడ్డె నాగేశ్వరరావునగర్లో సోమవారం రాత్రి 9 గంటలకు జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. భర్త నుంచి విడాకులు తీసుకొని తల్లితో కలిసి ఉంటున్న పిచ్చుల మల్లిక(33)ను పక్కింటికి చెందిన కన్నెమ్రెడ్డి వెంకటేశ్వర్లు(అలియాస్ చిన్నా) గొడ్డలితో నరికి చంపాడు. జులాయిగా తిరిగే చిన్నా మల్లికతో చిన్నచిన్న తగాదాలు పెట్టుకునేవాడు. ఈ నేపథ్యంలో సోమవారం రాత్రి పిండి రుబ్బుతున్న మల్లికపై వెనుక నుంచి వచ్చి దాడి చేసి హతం చేశాడు. అనంతరం అక్కడి నుంచి తప్పించుకొని వెళ్లాడు. విషయం తెలిసిన పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని గొడ్డలిని స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. మృతురాలు మల్లికకు పదేళ్ల కుమార్తె ఉంది. -
మహిళపై అత్యాచారం, ఆపై ఆటవికంగా హత్య
ముజఫర్‌నగర్: ఉత్తరప్రదేశ్‌లో ఓ మహిళపై ఆటవిక దాడి జరిగింది. గుర్తు తెలియని కొందరు ఓ మహిళపై అత్యాచారం చేసి రాక్షసంగా రాళ్లతో కొట్టి చంపారు. ముజఫర్ నగర్ జిల్లాలోని షుకర్తల్లో 48 ఏళ్ల మహిళ మతదేహాన్ని పోలీసులు ఆదివారం గుర్తించారు. రాళ్లతో కొట్టినట్లుగా ఉంది. అక్కడే పగిలిపోయిన గాజులు కూడా ఉన్నాయి. దీన్నిబ్టటి ఆమెపై దుండగులు ముందు అత్యాచారం చేసి అనంతరం హత్యచేసినట్లుగా భావిస్తున్నారు. సదరు మహిళ కొన్నేళ్లుగా అదే ప్రాంతంలో నివసిస్తోందని పోలీసులు తెలిపారు. మతదేహాన్ని పోస్ట్‌మార్టంకు పంపించారు. -
మహిళా ప్రయాణికురాలిపై దాడి
సాక్షి, ముంబై: పశ్చిమ రైల్వే మార్గంలోని గోరేగావ్ స్టేషన్లో సోమవారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తి ఓ మహిళ ప్రయాణికురాలిపై దాడి చేశాడు. ఈ ఘటనలో తలకు బలమైన గాయం కావడంతో రైల్వే పోలీసులు ఆమెను నాలాసొపారాలోని అలైన్స్ ప్రైవేటు ఆస్పత్రిలో చేర్పించారు. అమెరికా యువతిపై దాడి, మహిళ ఫొటో జర్నలిస్టుపై సామూహిక అత్యాచారం ఘటనలు తాజాగా ఉండగానే మరో సంఘటన చోటుచేసుకోవడం పోలీసులకు సవాల్‌గా మారింది. దీంతో మహిళల భద్రతా అంశం మరోసారి తెరమీదకు వచ్చింది. పోలీసులు కథనం ప్రకారం...నాలాసోపారా వాసి రూపాలి షిండే(28) గోరేగావ్‌లోని ఓ ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం చేస్తోంది. సోమవారం రాత్రి విధులు ముగించుకుని గోరేగావ్ స్టేషన్‌కు చేరుకుంది. రాత్రి 8.30 గంటల ప్రాంతంలో రైలు ఎక్కుతున్న సమయంలో వెనుక నుంచి ఓ ఆగంతకుడు రూపాలి తలపై పదునైన ఆయుధంతో కొట్టడం ప్రారంభించాడు. అప్పటికే రైలు కదలడంతో సహచరులు ఆమెను వెంటనే రైలులోకి లాక్కున్నారు. దీంతో పెను ప్రమాదం తప్పింది. కేకలు వేయడంతో చీకటిని అదునుగా చేసుకుని దాడి చేసిన వ్యక్తి వెంటనే అక్కడి నుంచి పారిపోయాడు. తలకు బలమైన గాయం కావడంతో రక్తంతో తడిసిపోయింది. నాలాసోపారాలో రైలు దిగిన తర్వాత జరిగిన విషయం రైల్వే పోలీసులకు చెప్పారు. వీరు కేసు నమోదుచేసి ఈ విషయాన్ని గోరేగావ్ పోలీసులకు చేరవేశారు. రూపాలి ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగా ఉందని వైద్యులు చెప్పారు. ఆ ఆగంతకుడు ఎవరు..? ఎందుకు దాడి చేశాడు, రూపాలితో ఏమైన పాత కక్షలున్నాయా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.