ముస్లింలపై లండన్‌లో సంచలన లేఖలు | Anti Muslim Letters Circulated in London | Sakshi
Sakshi News home page

ముస్లింలపై లండన్‌లో సంచలన లేఖలు

Published Sun, Mar 11 2018 5:38 PM | Last Updated on Tue, Oct 16 2018 6:01 PM

Anti Muslim Letters Circulated in London - Sakshi

Punish a Muslim Day

లండన్ ‌: ముస్లింలకు వ్యతిరేకంగా లండన్‌లో సంచలనాత్మక లేఖలు బయటకు వచ్చాయి. ముస్లింలపై దాడులకు సిద్ధం కండి అని ఉపదేశిస్తూ గుర్తు తెలియని వ్యక్తులు కొందరు ఆ లేఖలను విడుదల చేశారు. వచ్చే నెల (ఏప్రిల్‌) 3న తమ పిలుపునందుకొని 'ముస్లింను శిక్షించండి' కార్యక్రమం (పనిష్‌ ఏ ముస్లిం డే)లో పాల్గొనాలని ఆ లేఖల్లో ఉపదేశించారు. పైగా వీటిని ఆన్‌లైన్‌లో కూడా చెక్కర్లు కొట్టించారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసు అధికారులు ఒక్కసారిగా ఉలిక్కిపడి దర్యాప్తును వేగవంతం చేశారు.

పోలీసుల వివరాల ప్రకారం పనిష్‌ ఏ ముస్లిం డే అనే పేరిట విడుదల అయిన లేఖలను కొందరు వ్యక్తులు లండన్, యార్క్‌షైర్‌, మిడ్‌ల్యాండ్‌ నగరాల్లో పంచి పెట్టారు. దీంతో ఈ కేసును బ్రిటన్‌లో ఉగ్రవాద కేసులను విచారించే దర్యాప్తు సంస్థకు అప్పగించారు. తీవ్రవాద కార్యకలాపాలకు వ్యతిరేకంగా పని చేసే నిఘా సంస్థ ఈ పత్రాలపై దర్యాప్తును చేపట్టినట్టు, సమాజానికి హాని కల్గించే ఇలాంటి తాము సహించబోమని, కొన్ని ముస్లిం వ్యతిరేక గ్రూపులపై కూడా ప్రత్యేక నిఘా ఉంచుతున్నట్లు పోలీసు అధికారులు వెల్లడించారు. కలకలం సృష్టించిన ఆ లేఖల్లో ముస్లింలపై భౌతిక దాడులు చేయాలని, ముస్లిం మహిళల హిజాబ్‌లను తొలగించాలని, యాసిడ్‌ దాడులు కూడా చేయాలని పేర్కొన్నారు. అంతేకాదు, ఈ దాడులకు పాల్పడిన వారికి వారు చేసిన దాడి తీవ్రతను బట్టి బహుమతులు కూడా ఇస్తామని ఆ లేఖల్లో ప్రచురించడం గమనార్హం.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement