londan
-
రతన్ టాటా గౌరవార్థం: లండన్‌లో..
దేశం కోసం వేలకోట్లు ఉదారంగా దానం చేసిన దివంగత పారిశ్రామిక దిగ్గజం రతన్ టాటాను ప్రపంచ దేశాలు సైతం గౌరవిస్తాయి. ఈ గౌరవంతోనే ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ క్యాంపస్‌లో నిర్మించనున్న భవనానికి 'రతన్ టాటా' పేరు పెట్టనున్నట్లు ప్రకటించారు. ఈ భవన నిర్మాణ పనులు 2025లో ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ఈ భవనాన్ని రాడ్‌క్లిఫ్ అబ్జర్వేటరీ క్వార్టర్లో.. టాటా గ్రూప్, సోమర్విల్లే కాలేజ్, ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ నిర్మించనున్నాయి. దీని ద్వారా బోధన, విద్యాకార్యకలాపాల నాణ్యతను మెరుగుపరుస్తారు. ఇది అవసరమైన పరిశోధనలకు నిలయంగా ఉంటుంది.సోమర్విల్లే కాలేజ్, రతన్ టాటా మధ్య దశాబ్ద కాలంగా ఉన్న స్నేహం వల్ల ఈ ప్రాజెక్ట్ సాధ్యమైంది. దీనిని లండన్‌కు చెందిన ఆర్కిటెక్ట్ మోరిస్ కో డిజైన్ చేయనున్నట్లు సమాచారం. రతన్ టాటా పేరుతో భవనాన్ని నిర్మించానికి లండన్ యూనివర్సిటీ తీసుకున్న నిర్ణయం ఎంతోమంది భారతీయుల హృదయాలను గెలుచుకుంది.రతన్ టాటా పేరుతో భవన నిర్మాణం ప్రకటన తరువాత, సోమర్విల్లే కళాశాల ప్రిన్సిపాల్ బారోనెస్ రాయల్ మాట్లాడుతూ.. ఈ భవనం గత దశాబ్దంలో అనేక సంభాషణలు, ఆశలు, కలల ఫలం. టాటాతో మా సుదీర్ఘ అనుబంధానికి చిహ్నం అని అన్నారు. ఇది ఒక గొప్ప వ్యక్తి, సోమర్విల్లే ప్రియమైన స్నేహితుడి జీవితానికి శాశ్వత వారసత్వంగా నిలుస్తుందని అన్నారు. ఈ సందర్భంగా టాటా సన్స్ చైర్మన్ ఎన్ చంద్రశేఖరన్ మాట్లాడుతూ.. సోమర్విల్లే కళాశాలతో ఈ సహకారం రతన్ టాటా విలువలకు నివాళి అని అన్నారు. -
అది ఫేక్ న్యూస్.. అంబానీ బుక్ చేసుకోలేదు
జులై 12న అనంత్ అంబానీ, రాధిక మర్చెంట్ వివాహం ముంబైలో ఎంతో వైభవంగా జరిగింది. అంబానీ ఇంట జరిగిన ఈ వేడుకలకు ప్రముఖ సెలబ్రిటీలు, పారిశ్రామిక దిగ్గజాలు, ఇతర దేశాల ప్రముఖులు హాజరయ్యారు. వీరి పెళ్ళికి సుమారు ఐదు వేలకోట్ల రూపాయలు ఖర్చు అయినట్లు సమాచారం.అనంత్, రాధికల వివాహానంతరం లండన్‌కు వెళ్లనున్నట్లు పలు మీడియా సంస్థలు ఇటీవల నివేదించాయి. అయితే వారు అక్కడ ఉండటానికి ప్రముఖ 7 స్టార్ లగ్జరీ హోటల్ & గోల్ఫింగ్ ఎస్టేట్ స్టోక్ పార్క్‌ను రెండు నెలలకు బుక్ చేసుకున్నట్లు పుకార్లు వచ్చాయి. కానీ ఇందులో ఎటువంటి నిజం లేదని స్టోక్ పార్క్ తన సోషల్ మీడియా ఖాతాలో అధికారికంగా వెల్లడించింది.సాధారణంగా మేము ప్రైవేట్ విషయాలపై స్పందించము. కానీ ఇటీవల వస్తున్న పుకార్లలో ఎటువంటి నిజం లేదని మీడియాలలో వస్తున్న పుకార్లలో నైజం లేదని స్టోక్ పార్క్ వెల్లడించింది. మొత్తానికి అంబానీ లండన్‌లో స్టోక్ పార్క్ బుక్ చేయలేదని స్పష్టమైపోయింది. View this post on Instagram A post shared by Stoke Park (@stokepark) -
ఖరీదైన భవనం కొనుగోలు చేసిన సీఈఓ.. ధర ఎంతంటే..?
భారత్‌కు చెందిన వ్యాక్సిన్ తయారీ సంస్థ సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా సీఈఓ అదర్ పూనావాలా లండన్‌లో ఓ విలాసవంతమైన భవనాన్ని కొనుగోలు చేసినట్లు సమాచారం. దాదాపు రూ.1,446 కోట్లు వెచ్చించి ఆ భవనాన్ని సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఒప్పందం ఖరారైనట్లు కంపెనీ వర్గాలు ధ్రువీకరించాయని కొన్ని మీడియా కథనాలు వెల్లడించాయి. భారత్‌లో విస్తృతంగా పంపిణీ చేసిన కరోనా వ్యాక్సిన్ కొవిషీల్డ్‌ను సీరం ఇన్స్టిట్యూట్ తయారు చేసిన విషయం తెలిసిందే. కొన్ని మీడియా కథనాల ప్రకారం.. లండన్‌లోని హైడ్ పార్క్ ప్రాంతంలో ఉన్న అబెర్కాన్వే హౌస్‌ను పూనావాలా కొనుగోలు చేశారు. ఈ భవనం 1920 నాటిది. దీని విస్తీర్ణం 25 వేల చదరపు అడుగులు. పోలండ్‌కు చెందిన దివంగత వ్యాపారవేత్త జాన్ కుల్జిక్ కుమార్తె డొమినికా కుల్జిక్ నుంచి అదర్ పూనావాలా దీన్ని కొనుగోలు చేసినట్లు మీడియా సంస్థలు వెల్లడించాయి. సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియాకు చెందిన యూకే అనుబంధ సంస్థ సీరం లైఫ్ సైన్సెస్ ఈ భవనాన్ని సొంతం చేసుకోనున్నట్లు సమాచారం. లండన్‌లో ఈ ఏడాది అత్యంత ఖరీదైన ఇంటి కొనుగోలుగా ఇది నిలవనున్నట్లు సమాచారం. లండన్‌లో ఇది రెండో అత్యంత ఖరీదైన ఇల్లుగా రికార్డుల్లో ఉండనుందని పలువురు రియల్ ఎస్టేట్ ఏజెంట్లు తెలిపారు. అయితే తాజా కొనుగోలుతో పూనావాలా కుటుంబం లండన్‌కు మకాం మార్చే అవకాశాలేమీ లేవని సీరం లైఫ్ సైన్సెస్‌కు చెందిన ఓ కీలక పదవిలోని వ్యక్తి తెలిపారు. ప్రస్తుతానికి కంపెనీ కార్యకలాపాలకు ఇది కేంద్రంగా ఉంటుందని చెప్పారు. అంతర్జాతీయ వ్యాపార విస్తరణకు ఈ భవనాన్ని గెస్ట్హౌజ్గా వినియోగించుకోనున్నట్లు వివరించారు. ఇదీ చదవండి: ‘పురుషుల కంటే మహిళలే బెటర్..!’ లండన్‌లో ఇప్పటి వరకు అత్యంత ఖరీదైన భవనంగా 2-8ఏ రట్లాండ్ గేట్ నిలిచింది. సౌదీ మాజీ యువరాజు సుల్తాన్ బిన్ అబ్దులాఅజిజ్కు చెందిన ఎస్టేట్ దీన్ని 2020 జనవరిలో 210 మిలియన్ పౌండ్లు(రూ.2100 కోట్లు)కు కొనుగోలు చేసినట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. అయితే, దీని వాస్తవ కొనుగోలుదారుడు చైనాకు చెందిన స్థిరాస్తి సంస్థ ఎవర్‌గ్రాండ్ వ్యవస్థాపకుడు ‘హుయ్ కా యాన్’గా గుర్తించినట్లు గత ఏడాది ఓ మీడియా సంస్థ వెల్లడించింది. ఈ ఏడాది పునావాలా కొనుగోలు చేసిన భవనం కాకుండా రెండో ఖరీదైన భవనం కొనుగోలుగా హనోవర్లాడ్జ్ (రూ.1180 కోట్లు) నిలిచింది. -
బ్రిటన్ ప్రధాని ఇంట.. దీపావళి సంబరాలు
లండన్: లండన్ వేదికగా దీపావళి సంబరాలు ఊపందుకున్నాయి. సాక్షాత్తు ప్రధాని నివాసం అధికారిక భవనంలో వేడుకలకు ఘనంగా ఏర్పాట్లు జరుగాయి. దీపావళి వేడుకలకు హిందూ బంధువులను ప్రధాని రిషి సునాక్ భార్య అక్షతా మూర్తి ఆహ్వానించారు. చీకటిపై వెలుతురు విజయ సూచకంగా దీపాలను వెలిగిస్తున్న ఫొటోలను ప్రధాని రిషి సునాక్ అధికారిక ఖాతాలో పంచుకున్నారు. అక్షతా మూర్తి దీపాలను వెలిగిస్తుండగా.. ఆమె చుట్టూ జనం గుమిగూడి ఉన్న ఫొటోలను ట్విట్టర్లో పంచుకున్నారు. యూకే, ప్రపంచమంతటా దీపావళి వేడుకలను పురస్కరించుకుని శుభాకాంక్షలు తెలిపారు. Tonight Prime Minister @RishiSunak welcomed guests from the Hindu community to Downing Street ahead of #Diwali – a celebration of the triumph of light over darkness. Shubh Diwali to everyone across the UK and around the world celebrating from this weekend! pic.twitter.com/JqSjX8f85F — UK Prime Minister (@10DowningStreet) November 8, 2023 చీకటిపై వెలుతురు, చెడుపై మంచి విజయసూచకంగా దీపావళి పండుగను హిందువులు ఈ ఏడాది నవంబర్ 12న జరుపుకుంటారు. ఇరు దేశాల నాయకులు రిషి సునాక్, ప్రధాని మోదీ ఇటీవల టెలిఫొన్లో సంభాషించుకున్నారు. స్వేచ్ఛా, వాణిజ్య ఒప్పందంపై పురోగతి దిశగా అడుగులు పడ్డాయని పేర్కొన్నారు. వరల్డ్ కప్ సందర్భంగా భారత్‌కు రిషి సునాక్ శుభాకాంక్షలు తెలిపారు. ఇదీ చదవండి: నేను భారతీయురాలినైతేనా..? నితీష్ వ్యాఖ్యలపై అమెరికా సింగర్ ఫైర్ -
రెండేళ్ల క్రితమే మృతి.. ఇప్పటికీ ప్రతినెలా ఇంటి రెంట్ చెల్లిస్తున్న మహిళ!
లండన్: రెండేళ్ల క్రితమే మృతి చెందిన ఓ మహిళ నుంచి ఇప్పటికీ ఇంటి రెంటు తీసుకుంటున్నారు ఆ ఇంటి యజమాని. ఈ సంఘటన బ్రిటన్ రాజధాని లండన్‌లో వెలుగు చూసింది. ఇంతకీ ఏం జరిగింది. మృతి చెందిన మహిళ నుంచి ఇంటి రెంటు ఎలా తీసుకోగలుగుతున్నారు? అనే అంశాన్ని తెలుసుకున్న పోలీసులు అవాక్కయ్యారు. లండన్, పెఖమ్ నగరంలోని ఓ అపార్ట్ మెంట్లో 61 ఏళ్ల శీలా సెలియోవన్ అనే మహిళ అస్తికలను గుర్తించారు పోలీసులు. మూడో అంతస్తులో ఉంటున్న ఆమె ఇంటి తలుపులు బద్ధలు కొట్టి లోపలికి వెళ్లిన పోలీసులకు ఆమె ఎముకలు మాత్రమే కనిపించాయి. డెంటల్ రికార్డ్స్ ప్రకారం బాధితురాలిని గుర్తించారు పోలీసులు. ఆమె మరణానికి ఎలాంటి అనుమానాస్పద కారణాలు కనిపించలేదన్నారు. 2019, ఆగస్టులో ఆమె మృతి చెంది ఉండవచ్చని భావిస్తున్నారు. రెండేళ్లుగా కనిపించకపోయినా.. అవివాహిత అయిన 61 శీలా కుటుంబం దక్షిణాఫ్రికాలో ఉంటోంది. ఆమె మృతి చెందినట్లు 2022, ఫిబ్రవరిలో గుర్తించినట్లు డైలీ మెయిల్ నివేదించింది. 2019, అక్టోబర్‌లో ఆమె ఫ్లాట్ నుంచి కుల్లిపోయిన వాసన విపరీతంగా వచ్చినట్లు ఇరుగు పొరుగువారు తెలిపారు. పోలీసులకు ఫిర్యాదు చేశారు. రెండు సార్లు ఆమె ఫ్లాట్ వద్దకు వచ్చినా తెరిచేందుకు సరైన కారణం లేదని తిరిగి వెళ్లిపోయారు పోలీసులు. ఆమెను చివరి సారిగా 2019, ఏప్రిల్‌లో చూసినట్లు స్థానికులు తెలిపారు. అదే ఏడాది ఆగస్టులో చివరిసారిగా ఇంటి రెంటు చెల్లించారు శీలా. ఆ తర్వాత చెల్లించకపోవటం వల్ల ఆమె యూనివర్సల్ క్రెడిట్ పేమెంట్స్ నుంచి ఆటోమెటిక్‌గా రెంట్ పే చేసేందుకు హౌసింగ్ గ్రూప్ అంగీకరించింది. ఆ తర్వాత 2020, మార్చి నుంచి ప్రతి నెలా యజమానికి ఆటోమేటిక్‌గా రెంటు అందుతోంది. అయితే.. ఆమెను పలకరించేందుకు ఏ ఒక్కరు ప్రయత్నించకపోవటం గమనార్హం. 2020, జూన్‌లో గ్యాస్ తనిఖీల్లో భాగంగా అధికారులు ఫ్లాట్‌కు వెళ్లగా.. ఎవరూ స్పందించలేదు. దీంతో శీలా ఉండే ఇంటికి గ్యాస్ కనెక్షన్ తొలగించారు. ఆమె ఫ్రిడ్జ్‌లో ఉన్న ఆహారపదార్థాలపై తేదీల ఆధారంగా ఆమె 2019, ఆగస్టులో చనిపోయి ఉంటారని అధికారులు అంచనా వేశారు. ఆమె 2019, ఆగస్టు 14న టెలిఫోన్ ద్వారా వైద్యుడితో మాట్లాడారు. తనకు ఇబ్బందిగా ఉందని, ఒక్కోసారి శ్వాస తీసుకోలేకపోతున్నట్లు తెలిపింది. ఆ తర్వాతి రోజు వైద్యుడిని కలవాల్సి ఉంది. కానీ ఆమె హాజరవ్వలేదు. ఇదీ చూడండి: స్విమ్మింగ్‌పూల్ సింక్‌హోల్‌లో పడి వ్యక్తి మృతి.. వీడియో వైరల్! -
ఆ విమర్శలకు ‘రిషి సునాక్’ చెక్.. రికార్డ్సే ముఖ్యమటా!
లండన్: బ్రిటన్ ప్రధానమంత్రి రేసులో ముందంజలో ఉన్నారు మాజీ ఆర్థిక మంత్రి, భారత సంతతి వ్యక్తి రిషి సునాక్. ఈ క్రమంలో ఆయనపై పలు విమర్శలు వస్తున్నాయి. ఆర్థికంగా ఇబ్బందుల్లో తరుణంలో దేశాన్ని నడిపించటంలో ఆయన అత్యంత ధనవంతుడంటూ పలు వాదనలు వచ్చాయి. తాజాగా వాటిని ఖండించారు రిషి సునాక్. కఠిన సవాళ్లను ఎదుర్కోవటంలో తనకు అపార అనుభవం ఉందని, ప్రస్తుత సమయంలో దేశాన్ని ముందుకు నడిపించగలనని ధీమా వ్యక్తం చేశారు. తాను ప్రజలను వారి బ్యాంకు ఖాతాల ద్వారా కాకుండా వారి ప్రవర్తనను భట్టి అంచనా వేస్తానని, ఇతరులు సైతం అలాగే చేస్తారని నమ్ముతున్నానన్నారు. దేశంలో నెలకొన్న ఆర్థిక ఇబ్బందులపై ఓ వార్తా సంస్థతో మాట్లాడుతూ పలు విషయాలు వెల్లడించారు రిషి సునాక్. ‘కరోనా మహమ్మారితో లక్షల మంది ప్రజలు ప్రభావితమవుతారని ముందే అంచనా వేశాము. అది దేశాన్ని ఓ మెట్టు వెనక్కి లాగుంతదని ఊహించాం. ప్రధానిగా బాధ్యతలు చేపడితే ద్రవ్యోల్బణం కట్టడికే నా తొలి ప్రాధాన్యం. కానీ, ఇతరుల్లా పన్నుల్లో కోత విధిస్తానని నేను చెప్పను. ఆర్థికంగా దేశాన్ని బలోపేతం చేయటంలో ద్రవ్యోల్బణం కట్టడికే తొలి ప్రాధాన్యం ఇవ్వాలని గుర్తుంచుకోవాలి.’ అని పేర్కొన్నారు. ప్రధాని రేసులో ఉన్న తన ప్రత్యర్థులపై విమర్శలు గుప్పించారు రిషి సునాక్. పన్నులను తగ్గించవచ్చు కానీ, ఒక బాధ్యాతాయుత వ్యక్తిగా అలా చేయబోనన్నారు. ఎన్నికల్లో గెలిచేందుకు ట్యాక్స్‌లు తగ్గించనని, ఎన్నికల్లో గెలిచి పన్నుల్లో కోతవిధిస్తానని పరోక్షంగా విమర్శించారు. బుధవారం నిర్వహించిన తొలి రౌడ్లో ఆరుగురు అభ్యర్థుల్లో రిషి సునాక్ ముందుంజలో. కన్జర్వేటివ్ పార్టీలో తనకు 88 ఓట్లు వచ్చాయి. తన ప్రత్యర్థి పెన్ని మోర్డాంట్‌కు 67, విదేశాంగ మంత్రి లిజ్ ట్రస్‌కు 50 ఓట్లు వచ్చాయి. ఇదీ చూడండి: Rishi Sunak Old Video: బ్రిటన్ పీఎం రేసులో భారత సంతతి రిషి.. పాత వీడియోతో విమర్శలు -
17 ఏళ్ల వైవాహిక బంధానికి ముగింపు.. గ్రాండ్‌గా విడాకుల పార్టీ
లండన్: మన సమాజంలో పురుషుడు విడాకులు తీసుకోవడాన్ని చాలా తేలికగా తీసుకుంటారు. అదే మహిళ విడాకులు కోరితే.. బయటి వాళ్ల సంగతి పక్కన పెట్టండి ముందు ఆమె కుటుంబ సభ్యులే అంగీకరించరు. ముందు నచ్చచెప్పడం.. తర్వాత బెదిరించడం చేస్తారు. అప్పటికి కూడా వినకపోతే.. ఆమెను వెలి వేస్తారు. చిన్న చూపు చూస్తారు. విడాకులు తర్వాత ఆమెకు జీవితమే లేదన్నాట్లు ప్రవర్తిస్తారు. తాజాగా ఓ మహిళ విడాకులు వచ్చిన సందర్భంగా ఘనంగా పార్టీ ఏర్పాటు చేసింది. ప్రస్తుతం ఈ విడాకుల పార్టీకి చెందిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆ వివరాలు.. భారతదేశానికి చెందిన సోనియా గుప్తా చాలా స్వతంత్ర భావాలు గల మహిళ. మనసుకు నచ్చినట్లు జీవించేది. ప్రయాణాలను చాలా ఇష్టపడేది. హాయిగా సాగిపోతున్న సోనియా జీవితానికి పెళ్లితో బ్రేక్ పడింది. 2003లో సోనియా వివాహం జరిగింది. పెద్దలు కుదిర్చిన పెళ్లి. వివాహం అనంతరం ఆమె భర్తతో కలిసి లండన్ వెళ్లింది. ఇక ఆమె జీవితం పూర్తిగా మారిపోయింది. (చదవండి: ముసలోడు మామూలోడు కాదు.. ఆ చీటీలో ఏం రాశాడంటే..) అత్తారింట్లో ఊపిరాడలేదు.. అత్తారింట్లో అడుగుపెట్టిన సోనియాకు అడుగడుగునా ఆంక్షలే. ఊపిరాడేది కాదు. దానికి తోడు భార్యభర్తల మధ్య బంధం పెద్దగా బలపడలేదు. తమ ఇద్దరికి సెట్ అవ్వదని సోనియాకు అర్థం అయ్యింది. అందుకే ఆ బంధం నుంచి విడిపోవాలని భావించింది. కానీ ఆమె కుటుంబ సభ్యులు విడాకులు అనే మాట వింటూనే ఉగ్రరూపం దాల్చారు. అలాంటివి ఏం కుదరవని తేల్చి చెప్పారు. భర్తతో కలిసి ఉండాల్సిందేనని సోనియాను ఆదేశించారు. ఈ సందర్భంగా సోనియా మాట్లాడుతూ.. ‘‘నేను నాలా ఉండాలనుకున్నాను. పెళ్లికి ముందు నేను చాలా చురుగ్గా.. సరదాగా ఉండేదాన్ని. అత్తింటి వాతావరణంలో నేను ఇమడలేకపోయాను. నరకంలా తోచేది. కలిసి ఉండలేను.. విడిపోతాను అన్నాను. కానీ నా కుటుంబ సభ్యులు అందుకు అంగీకరించలేదు. నాకు ఎవరు మద్దతు ఇవ్వలేదు. నా మానసిక ఆరోగ్యం గురించి కూడా ఎవరు పట్టించుకోలేదు’’ అని తెలిపారు. (చదవండి: రాజ్‌కుంద్రాకు బెయిల్: భర్తతో శిల్పా విడిపోతుందా?) ఆ ఇద్దరే నాకు బలం.. ‘‘ఆ సమయంలో నా ఇద్దరు మిత్రులు మిఖాల్, షాయ్ నాకు మద్దతుగా నిలిచారు. ఈ సమస్య నుంచి బయటపడే మార్గం చూపారు. అలానే విడాకుల విషయంలో నాకు ఏషియన్ సింగిల్ పేరెంట్ నెట్వర్క్ నుంచి మద్దతు కూడా లభించింది. ఇక మూడేళ్ల సుదీర్ఘ పోరాటం తర్వాత నాకు విడాకులు లభించాయి. 17 ఏళ్ల వైవాహిక బంధం నుంచి నాకు విముక్తి లభించింది’’ అని తెలిపారు. విడాకుల పార్టీ ఇవ్వడానికి కారణం ఇదే.. విడాకులు వచ్చిన సందర్భంగా సోనియా గుప్తా తన లండన్ నివాసంలో గ్రాండ్ పార్టీ ఏర్పాటు చేసింది. ఇక స్నేహితులతో కలిసి తన సంతోషాన్ని సెలబ్రేట్ చేసుకుంది. ఆమె ధరించిన డ్రెస్ మీద ఫైనల్లీ డివోర్స్డ్ అనే ట్యాగ్ ధరించింది. స్నేహితులను కూడా మంచి దుస్తులు ధరించి వచ్చేలా ప్రోత్సాహించారు. (చదవండి: విడాకుల ప్రకటన.. వైరలవుతోన్న శిఖర్ ధావన్ పోస్ట్) ఈ సందర్భంగా సోనియా మాట్లాడుతూ.. "నేను థీమ్‌ను రంగురంగులగా, ప్రకాశవంతంగా, యునికార్న్‌లతో నిండి ఉండేలా ఎంచుకున్నాను. ఎందుకంటే నేను కూడా నా జీవితం ఇలానే ఉండాలని భావించాను. 10 సంవత్సరాల తర్వాత నా జీవితంలోకి సంతోషం తిరిగి వచ్చింది. ఈ మాత్రం సెలబ్రెషన్స్‌కు, మ్యాజిక్కు నేను అర్హత కలిగి ఉన్నానని అనుకుంటున్నాను’’ అని తెలిపారు. సోనియా కోరుకున్నట్లే, విడాకుల పార్టీలో ప్రతి ఒక్కరూ ఆనందించడానికి బౌన్సీ కాసిల్, గులాబీ, ఊదా రంగులతో నిండిన అలంకరణలు, ఇంద్రధనస్సు, యునికార్న్ థీమ్‌తో పాటు కస్టమ్ కేక్ ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ఈ విడాకుల సంబరాన్ని సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. చదవండి: 'విడాకుల తర్వాత జీవితం ఇలా'.. ఫోటో షేర్ చేసిన సుమంత్ -
65 రోజుల తర్వాత భార్యని కలిసిన సూర్య.. ఏం చేశాడంటే?
లండన్: టీమిండియా యువ సంచలనం సూర్యకుమార్ యాదవ్ దాదాపు 65 రోజుల తర్వాత తన సతీమణి దేవిషా శెట్టిని కలుసుకున్నాడు. దీంతో సూర్య ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. దాదాపు రెండు నెలల తర్వాత భార్యాభర్తలు కలుసుకోవడంతో ఇద్దరూ డ్యాన్స్ చేస్తూ పరస్పరం తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఆ వీడియోను సూర్య తన ఇన్స్టాగ్రామ్ రీల్స్‌లో పోస్ట్ చేశాడు. ప్రస్తుతం సూర్యకుమార్ ఇంగ్లండ్ పర్యటనలో ఉన్న విషయం తెలిసిందే. దీంతో ఐపీఎల్ స్టార్ తన భార్యతో కలిసి లండన్ వీధుల్లో చక్కర్లు కొడుతున్నాడు. చదవండి:IPL 2021: పంజాబ్ కింగ్స్‌లోకి ఆసీస్ యువ పేసర్ ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియోలో తెగవైరల్ అవుతోంది. కాగా సూర్యకుమార్ యాదవ్ గత నెలలో జరిగిన శ్రీలంకతో వన్డే, టి20 సిరీస్‌కు ముందు బయోబబుల్ కోసం తన ఫ్యామిలీని వదిలి వచ్చాడు. అనంతరం అక్కడ నుంచి మళ్ళీ ఇంగ్లాండ్ పర్యటనకు వెళ్తూ 10 రోజులు మళ్ళీ క్వారంటైన్లో ఉన్నాడు. ఈ క్రమంలోనే దేవిషాకు రెండు నెలల పాటు దూరంగా ఉన్నాడు.అయితే, ఇప్పుడు ఆమె కూడా లండన్‌కు చేరుకోని, తన క్వారంటైన్ గడువును పూర్తి చేసుకుంది. తాజాగా తన భర్తను కలుసుకుంది. దీంతో ఈ జంట లండన్ వీధుల్లో తెగ ఎంజాయ్ చేస్తుంది. చదవండి:Mohammed Siraj: సిరాజ్ ఎంపిక, విజయంలో ఆయన పాత్రే కీలకం! View this post on Instagram A post shared by Surya Kumar Yadav (SKY) (@surya_14kumar) -
కరోనా: ఆ టీకా ఒక్క డోసుతో 80 శాతం మరణాల రేటు తగ్గుదల!
లండన్: ప్రపంచ వ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతున్నాయి. అయితే పలు దేశాలు టీకాలు పంపిణీ చేస్తూ కరోనా కట్టడికి ప్రయత్నాలు చేస్తున్న విషయం తెలిసిందే. తాజాగా ఆస్ట్రాజెనికా కరోనా వ్యాక్సిన్ ఫస్ట్ డోస్‌తో 80 శాతం మరణాలు తగ్గే అవకాశం ఉందని పబ్లిక్ హెల్త్ ఇంగ్లాడ్ పేర్కొంది. అంతే కాకుండా ఫైజర్ బయోటెక్ ఫస్ట్ డోస్‌తో 80శాతం, రెండో డోస్‌తో 97శాతం కోవిడ్ మరణాలు తగ్గుతాయని వెల్లడించింది. ఏప్రిల్ నెలలో కరోనా సోకి 28 రోజుల అనంతరం మృతి చెందిన బాధితులపై బ్రిటన్‌లో రియల్ వరల్డ్ సెట్టింగ్ సంస్థ అధ్యయనం చేపట్టింది. ఈ అధ్యయనం ప్రకారం.. ఎటువంటి టీకా తీసుకోని వారితో పోల్చితే ఒక డోసు ఆస్ట్రాజెనికా వ్యాక్సిన్ తీసుకున్న వారిలో 55 శాతం, ఒక డోసు ఫైజర్ టీకా తీసుకున్న వారిలో 44 శాతం మంది మరణించకుండా సురక్షితంగా కోవిడ్ నుంచి బయటపడినట్లు తెలిపింది. అయితే వ్యాక్సిన్ తీసుకోవడం వల్ల 80 శాతం మరణాలు తగ్గుతాయని కూడా పేర్కొంది. అదేవిధంగా ఫైజర్-బయోటెక్ వ్యాక్సిన్ రెండో డోస్ తీసుకోవడం వల్ల 69శాతం మరణాలు తగ్గడంతో పాటు 97 శాతం సురక్షితమని ఈ అధ్యయనం వివరించింది. ఫైజర్-బయోటెక్ రెండు డోస్‌లు తీసుకున్న 80సంవత్సరాల వయసు వారిలో 93శాతం ఆస్పత్రిలో చేరే అవసరం ఉండదని తెలిపింది. ఇక ఇంగ్లండ్ ప్రధానమంత్రి బోరిస్ జాన్సన్ దేశంలో లాక్డౌన్ ఆంక్షలను మరింత సడలించడానికి సిద్ధమయ్యారు. ఈ క్రమంలో కరోనా వ్యాక్సిన్‌ను దేశ ప్రజలకు వేగంగా అందిస్తే కోవిడ్ నియంత్రణ మెరుగవుతుందని రియల్ వరల్డ్ సెట్టింగ్ అధ్యయన సంస్థ అభిప్రాయపడింది. (చదవండి: కోవిడ్ సంక్షోభం: భారత్‌కు మద్దతుగా ట్విటర్ భారీ విరాళం) -
చరిత్ర సృష్టించిన రష్మీ సామంత్
లండన్ : భారత్‌కు చెందిన రష్మీ సామంత్ ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో జరిగిన విద్యార్థి ఎన్నికల్లో విజయం సాధించిన తొలి భారత మహిళగా చరిత్ర సృష్టించారు. లినారె కాలేజ్‌లో ఎమ్మెస్సీ చదువుతున్న రష్మీ మొత్తం 3,708 ఓట్లకుగానూ, 1,966 ఓట్లు సాధించారు. 2021–22 సంవత్సరానికి ఆమె విద్యార్థి యూనియన్ అధ్యక్షురాలిగా పని చేయనున్నారు. సిలబస్ డీకాలనైజేషన్, డీకార్బొనైజింగ్ అనే రెండు ప్రధానాంశాలను ఆమె తన మేనిఫెస్టోలో చేర్చి విద్యార్థుల ఆదరణ చూరగొన్నారు. బేమ్ (బ్లాక్, ఏసియన్, మైనారిటీ, ఎత్నిక్) వర్గానికి చెందిన ఆమె బలహీన వర్గాలకు చెందిన వారి సమస్యలను అర్థం చేసుకున్నట్లుగా విజన్ స్టేట్మెంట్లో పేర్కొన్నారు. కోవిడ్ నేపథ్యంలో విద్యార్థులకు అవసరమైన మౌళిక సదుపాయాలను ఏర్పాటు చేస్తానని కూడా తన స్టేట్మెంట్లో పేర్కొన్నారు. ఉపాధ్యక్షురాలిగా దేవికా అనే మరో బారతీయురాలు ఎన్నికయ్యారు. -
ఎయిడ్స్ బాధితులకు శుభవార్త
లండన్: 3.7 కోట్ల మంది. ప్రపంచవ్యాప్తంగా ఎయిడ్స్‌తో బాధపడుతున్న వారి సంఖ్య ఇది. వీరందరికీ కచ్చితంగా ఇది శుభవార్తే. బతికున్నన్నాళ్లు వ్యాధిని భరిస్తూ.. మందులు వాడుతూ ఉండాల్సిన అవసరం లేదని భారతీయ సంతతి శాస్త్రవేత్త డాక్టర్ రవీంద్ర గుప్తా నిరూపించారు. లండన్‌కు చెందిన ఓ వ్యక్తి హెచ్ఐవీ నుంచి బయటపడినట్లు.. పూర్తిస్థాయి చికిత్స సాధ్యమైనట్లు చెబుతున్నారు. అయితే 1980ల్లో గుర్తించిన ఈ ప్రాణాంతక వ్యాధి నుంచి మనిషి బయటపడటం ఇది రెండోసారి మాత్రమే. ఇలాంటి విజయాలు మరిన్ని సాధించిన తర్వాతే శాశ్వత పరిష్కారం లభించిందని చెప్పగలమని ఆయన అంటున్నారు. అమెరికాకు చెందిన తిమోతీ బ్రౌన్ అనే వ్యక్తి 12 ఏళ్ల కింద ఎయిడ్స్‌ను జయించి రికార్డు సృష్టించగా.. లండన్ రోగి రెండో వ్యక్తి అని సియాటెల్‌లో జరిగిన ఓ అంతర్జాతీయ సదస్సులో రవీంద్ర ప్రకటించారు. ఎయిడ్స్ వైరస్‌కు సహజమైన నిరోధకత కలిగిన వ్యక్తి తాలూకూ ఎముక మజ్జ నుంచి సేకరించిన మూలకణాలను చొప్పించడం ద్వారా ఇద్దరికీ చికిత్స జరిగింది. అప్పటి నుంచి ఇప్పటివరకు పన్నెండేళ్ల కింద బెర్లిన్ పేషెంట్‌గా ప్రపంచానికి పరిచయమైన తిమోతీ బ్రౌన్ జర్మనీలో చికిత్స తీసుకున్నాడు. అప్పటి నుంచి ఇప్పటివరకు యాంట్రీ రెట్రోవైరల్ మందులు వాడకున్నా అతడి శరీరంలో వైరస్ ఛాయలేవీ లేవు. లండన్ రోగి విషయానికొస్తే.. ఈయనకు 2003లో వ్యాధి సోకింది. 2012లో హడ్కిన్స్ లింఫోమా (ఒక రకమైన రక్త కేన్సర్) బారిన కూడా పడ్డాడు. రవీంద్ర గుప్తా అప్పట్లో యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ లండన్‌లో పనిచేస్తుండేవారు. 2016లో తీవ్ర అనారోగ్య పరిస్థితుల మధ్య లండన్ పేషెంట్ తన వద్దకొచ్చాడని.. చివరి ప్రయత్నంగా మూలకణ చికిత్సకు ఏర్పాట్లు చేశామని రవీంద్ర తెలిపారు. జన్యుక్రమంలో సీసీఆర్ 5, డెల్టా 32 అనే రెండు మార్పుల కారణంగా హెచ్ఐవీ వైరస్ సోకని ఓ వ్యక్తి మూలకణాలను లండన్ పేషెంట్‌కు ఎక్కించారు. కొంతకాలం పాటు కొత్త మూలకణాలను రోగి శరీరం నిరోధించిందని.. ఆ తర్వాత పరిస్థితిలో మార్పులు మొదలయ్యాయి. మూడేళ్లపాటు మూలకణాలను ఎక్కించాక గత 18 నెలలుగా లండన్ పేషెంట్ యాంటీ రెట్రోవైరల్ మందులు తీసుకోవడం ఆపేసినా శరీరంలో వైరస్ ఛాయల్లేవని రవీంద్ర వివరిస్తున్నారు. సులువేం కాదు.. మూలకణాల ద్వారా హెచ్ఐవీకి చికిత్స కల్పించడం అంత ఆషామాషీ వ్యవహారమేమీ కాదు. ఉత్తర యూరప్ ప్రాంతంలో అతికొద్ది మందిలో మాత్రమే సీసీఆర్ 5 జన్యుమార్పు ఉండటం దీనికి కారణం. రోగి, దాతల మూలకణాలు కచ్చితంగా సరిపోయినప్పుడే చికిత్స చేయగలరు. దాత మూలకణాలను అడ్డుకునేందుకు రోగి శరీరంలోని రోగ నిరోధక వ్యవస్థ చేసే ప్రయత్నాలను తట్టుకుని నిలవగలగడం కష్టసాధ్యమైన పని. రోగి, దాత మూలకణాల పోటీ కాస్తా వైరస్ తొలగిపోయేందుకు కారణమవుతుందని రవీంద్ర అంచనా వేస్తున్నారు. దీని ఆధారంగా హెచ్ఐవీకి సమర్థమైన చికిత్స అందించేందుకు ప్రయత్నాలు చేస్తున్నామని అంటున్నారు. -
జొకోవిచ్‌కు ఝలక్
ఏటీపీ వరల్డ్ టూర్ ఫైనల్స్ టోర్నీ విజేత జ్వెరెవ్ లండన్: ఈ ఏడాదిని గొప్ప విజయంతో ముగించాలని ఆశించిన సెర్బియా టెన్నిస్ స్టార్, ప్రపంచ నంబర్‌వన్ నొవాక్ జొకోవిచ్‌కు నిరాశ ఎదురైంది. పురుషుల టెన్నిస్ సీజన్ ముగింపు టోర్నమెంట్ ఏటీపీ వరల్డ్ టూర్ ఫైనల్స్‌లో ఐదుసార్లు మాజీ చాంపియన్ జొకోవిచ్ ఈసారి రన్నరప్ ట్రోఫీతో సరిపెట్టుకున్నాడు. భారత కాలమానం ప్రకారం ఆదివారం అర్ధరాత్రి దాటాక జరిగిన ఫైనల్లో 21 ఏళ్ల జర్మనీ యువతార అలెగ్జాండర్ జ్వెరెవ్ 6–4, 6–3తో జొకోవిచ్‌ను ఓడించి ఈ ప్రతిష్టాత్మక టోర్నీ టైటిల్‌ను తొలిసారి గెల్చుకున్నాడు. సెమీస్‌లో రెండో సీడ్ రోజర్ ఫెడరర్ (స్విట్జర్లాండ్)పై సాధించిన విజయం గాలివాటమేమీ కాదని ఫైనల్లో టాప్ సీడ్ జొకోవిచ్‌ను ఓడించి జ్వెరెవ్ నిరూపించాడు. ‘ఈ విజయాన్ని ఎలా వర్ణించాలో తెలియడంలేదు. నా జీవితంలోనే అతి పెద్ద విజయమిది. అత్యుత్తమ ఆటగాళ్లతో పోటీపడి గెలిచినందుకు అద్భుతంగా అనిపిస్తోంది’ అని ఈ సీజన్‌ను నాలుగో ర్యాంక్‌లో ముగించిన జ్వెరెవ్ వ్యాఖ్యానించాడు. హావిజేత జ్వెరెవ్‌కు 25 లక్షల 9 వేల డాలర్ల ప్రైజ్‌మనీ (రూ. 17 కోట్ల 96 లక్షలు), 1300 ర్యాంకింగ్ పాయింట్లు... రన్నరప్ జొకోవిచ్‌కు 14 లక్షల 32 వేల డాలర్ల ప్రైజ్‌మనీ (రూ. 10 కోట్ల 25 లక్షలు), 1000 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. హాఈ టోర్నీ లీగ్ దశ మ్యాచ్‌లో జ్వెరెవ్ 4–6, 1–6తో జొకోవిచ్ చేతిలో ఓడిపోయాడు. ఫైనల్లో విజయంతో లీగ్ దశ ఓటమికి బదులు తీర్చుకున్నాడు. హాఅజేయంగా ఫైనల్‌కు చేరిన జొకోవిచ్ ఈ క్రమంలో ఒక్కసారి కూడా సర్వీస్‌ను కోల్పోలేదు. అయితే ఫైనల్లో జ్వెరెవ్ తన తడాఖా చూపించాడు. ఏకంగా నాలుగుసార్లు జొకోవిచ్ సర్వీస్‌ను బ్రేక్ చేశాడు. అంతేకాకుండా 10 ఏస్‌లు కూడా సంధించాడు. హా 80 నిమిషాలపాటు సాగిన టైటిల్ పోరులో తొలి సెట్ తొమ్మిదో గేమ్‌లో జొకోవిచ్ సర్వీస్‌ను బ్రేక్ చేసిన జ్వెరెవ్ 5–4తో ఆధిక్యంలోకి వెళ్లాడు. పదో గేమ్‌లో తన సర్వీస్‌లో మూడు ఏస్‌లు సంధించి గేమ్తోపాటుసెట్ను 6–4తో దక్కించుకున్నాడు. హారెండో సెట్ బ్రేక్ పాయింట్లతో మొదలైంది. తొలి గేమ్‌లో జొకోవిచ్ సర్వీస్‌ను జ్వెరెవ్... రెండో గేమ్‌లో జ్వెరెవ్ సర్వీస్‌ను జొకోవిచ్ బ్రేక్ చేశారు. మూడో గేమ్‌లో జొకోవిచ్ సర్వీస్‌ను మళ్లీ బ్రేక్ చేసిన జ్వెరెవ్ ఆ తర్వాతతన సర్వీస్‌ను నిలబెట్టుకొని 3–1తో ముందంజ వేశాడు. ఆ తర్వాత తొమ్మిదో గేమ్‌లో జొకోవిచ్ సర్వీస్‌ను కళ్లు చెదిరే బ్యాక్‌హ్యాండ్ షాట్‌తో బ్రేక్ చేసి సెట్‌తోపాటు మ్యాచ్‌ను సొంతం చేసుకున్నాడు. హా 2008లో జొకోవిచ్ (21 ఏళ్లు) తర్వాత ఏటీపీ వరల్డ్ టూర్ ఫైనల్స్ టైటిల్ గెలిచిన పిన్న వయస్కుడిగా జ్వెరెవ్ గుర్తింపు పొందాడు. హా జర్మనీ తరఫున బోరిస్ బెకర్ (1995లో) తర్వాత ఏటీపీ వరల్డ్ టూర్ ఫైనల్స్ టైటిల్ నెగ్గిన రెండో జర్మన్ ప్లేయర్ జ్వెరెవ్ కావడం విశేషం. హాఆండీ అగస్సీ (1990లో) తర్వాత టాప్ సీడ్, రెండో సీడ్ క్రీడాకారులను ఓడించి ఏటీపీ వరల్డ్ టూర్ ఫైనల్స్ గెలిచిన మరో ప్లేయర్ జ్వెరెవ్. -
బ్రిటన్ పార్లమెంటు భవనం వద్ద కారు బీభత్సం
-
రమేష్‌కు ఆర్పీఎస్ లండన్ అవార్డు
వనపర్తి: జిల్లా కేంద్రంలోని నవీన ఫొటోపార్లర్ రమేష్‌కు ఆర్పీఎస్ (రాయల్ ఫొటోగ్రఫీ సొసైటీ) లండన్ అవార్డు ప్రకటించింది. ఇటీవల చైనా దేశంలో నిర్వహించిన అంతర్జాతీయ ఫొటో పోటీల్లో బ్లాక్ అండ్ వైట్ విభాగంలో ఈ ఫొటోగ్రాఫర్ పది ఫొటో లు పంపించగా వాటిలో వాటర్ క్వీరీర్కు సంబంధించిన ఫొటోలకు ఆర్పీఎస్ రిబ్బన్ (తృతీయ) బహుమతి ప్రకటించారు. అలాగే మార్చిలో బెంగుళూరులో నిర్వహించిన పోటీల్లో బెస్ట్ రూరల్ లైఫ్ అవార్డు, ఢిల్లీలో నిర్వహించిన పోటీల్లో హానరబుల్ మేన్‌టేన్ ఆఫ్ మెరిట్ రిబ్బన్ అవార్డు లభించింది. -
లండన్ కాలమాన తెలుగు క్యాలెండర్ ఆవిష్కరణ
లండన్ : లండన్ కాలమాన ప్రకారం గంటల పంచాంగంతో రూపొందించిన మొట్టమొదటి తెలుగు క్యాలెండర్‌ను తెలంగాణ ఎన్నారై ఫోరమ్(టీఈఎన్ఎఫ్) ఆవిష్కరించింది. దాదాపు 2 దశాబ్దాలుగా తెలుగువారు పండుగలు, గృహ ప్రవేశాలు వంటి శుభకార్యాలకు శుభ ఘడియలు, దుర్ముహుర్తాలు సరిగ్గా తెలియక ఎంతో శ్రమ పడేవారు. భారత కాలమాన ప్రకారం చేసుకోవడం లేదా పండితులకు ఫోన్ చేసి అడగడం, ఇలాంటి కష్టాలను దూరం చేయాలనే సంకల్పంతో తెలంగాణ ఎన్నారై ఫోరమ్ ముందడుగు వేసింది. యూకే తెలుగు బ్రాహ్మణ సంఘం సహకారంతో ప్రముఖ సిద్ధాంతి ములుగు రామలింగేశ్వర శర్మ ద్వారా లండన్ కాలమాన ప్రకారం పూర్తి స్థాయిలో తెలుగు పంచాంగ క్యాలెండర్ ను తయారు చేశారు. లండన్ ఎంపీ వీరేంద్ర శర్మ చేతలు మీదుగా ఈ కాలెండర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎంపీ వీరేంద్ర శర్మ మాట్లాడుతూ.. ఇంతటి గొప్ప కార్యక్రమం లో భాగస్వామ్యం అయినందుకు సంతోషంగా ఉందన్నారు. భారతీయ సంస్కృతి, సంప్రదాయాలు యావత్ ప్రపంచానికి ఆదర్శమని కొనియాడారు. తెలంగాణ ఎన్నారై ఫోరమ్ అధ్యక్షులు ప్రమోద్ అంతటి మాట్లాడుతూ.. యూకే కాలమాన ప్రకారం క్యాలండర్ తీసుకురావడంలో సంస్థ ఫౌండర్ చైర్మన్ గంప వేణుగోపాల్ ఎంతో శ్రమించారని కొనియాడారు. ఈ కాలెండర్ ప్రచురణలో సహకరించిన స్పాన్సర్లకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని, సంస్కృతి ప్రచారంలో భాగంగా సహకారంతో ఉచితంగా పంపిణి చేస్తున్నట్లు తెలిపారు. ఈ ఆవిష్కరణ కార్యక్రమంలో గంప వేణుగోపాల్, ప్రమోద్ అంతటి, రంగు వెంకట్, కూర రవికుమార్, రాజు కొయ్యడ , మీనాక్షి అంతటి, గంప జయశ్రీలు పాల్గొన్నారు. -
లండన్‌లో ఉగాది ఉత్సవాలు
లండన్ : యునైటెడ్ కింగ్డం ప్రవాస తెలుగు సంఘం నిర్వహించిన ఉగాది వేడుకలు ఘనంగా జరిగాయి. తూర్పు లండన్‌లో జరిగిన ఈ వేడుకల్లో వెయ్యి మందికిపైగా ప్రవాస తెలుగు కుటుంబాలు పాల్గోన్నాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అథిదిగా ఎయిర్ ఇండియా యూకే హెడ్ తార నాయుడు, ఈస్ట్ హోం పార్లమెంట్ సభ్యుడు స్టీఫెన్ టిమ్మిస్ పాల్గోన్నారు. ఆ సంధర్బంగా జరిగిన పలు సంప్రదాయ కార్యక్రమాలు, పంచాంగ శ్రవణం, చిన్నారులచే సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. వివిధ విభాగాల్లో ప్రతిభ చూపించిన చిన్నారులను, సామాజిక సేవకు శ్రీకారం చుట్టిన తెలుగు ప్రముఖలను సత్కరించారు. హిల్ సొసైటి ఫౌండర్, బ్రిటిష్ రాణి అవార్డు గ్రహిత సత్యప్రసాద్ కోనేరు, డాక్టర్. రామకృష్ణ మదీనాలు గౌరవ పురస్కారాలు పొందారు. ఈ సందర్భంగా వైస్ ప్రెసిడెంట్ రాజ్ ఖుర్బూ మాట్లాడుతూ.. ఆంధ్ర, తెలంగాణ ప్రవాసులను ఏకతాటిపైకి తీసుకురావాలన్న లక్ష్యంతోనే ఉగాది వేడుకలను నిర్వహిస్తున్నామని అన్నారు. ఈకార్యక్రమానికి కళ్యాణి గాదెల వ్యాఖ్యాతగా వ్యవహరించారు. యుక్తా ట్రస్ట్ శ్రీమతి డా. అనితరావు, డా.వెంకట పద్మ కిల్లి, ఉపాధ్యక్షుడు రాజ్ కుర్బా, ప్రధాన కార్యదర్శి సత్యప్రసాద్ మద్దసాని, కోశాధికారి నరేంద్ర మున్నలూరి, మీడియా కార్యదర్శి రుద్రవర్మ, ప్రజా సంబంధాల కార్యదర్శి బలరాం విష్ణుబొట్ల, సాంస్కృతిక కార్యదర్శి పూర్ణిమ చల్లా, కృష్ణ సనపల, సమాచార ఐటి ప్రతినిధులు అమర్నాధ్ రెడ్డి, కార్తిక్ రెడ్డిలు ఈ కార్యక్రమంలో పాల్గోన్నారు. -
ముస్లింలపై లండన్‌లో సంచలన లేఖలు
లండన్ : ముస్లింలకు వ్యతిరేకంగా లండన్‌లో సంచలనాత్మక లేఖలు బయటకు వచ్చాయి. ముస్లింలపై దాడులకు సిద్ధం కండి అని ఉపదేశిస్తూ గుర్తు తెలియని వ్యక్తులు కొందరు ఆ లేఖలను విడుదల చేశారు. వచ్చే నెల (ఏప్రిల్) 3న తమ పిలుపునందుకొని 'ముస్లింను శిక్షించండి' కార్యక్రమం (పనిష్ ఏ ముస్లిం డే)లో పాల్గొనాలని ఆ లేఖల్లో ఉపదేశించారు. పైగా వీటిని ఆన్లైన్లో కూడా చెక్కర్లు కొట్టించారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసు అధికారులు ఒక్కసారిగా ఉలిక్కిపడి దర్యాప్తును వేగవంతం చేశారు. పోలీసుల వివరాల ప్రకారం పనిష్ ఏ ముస్లిం డే అనే పేరిట విడుదల అయిన లేఖలను కొందరు వ్యక్తులు లండన్, యార్క్‌షైర్, మిడ్‌ల్యాండ్ నగరాల్లో పంచి పెట్టారు. దీంతో ఈ కేసును బ్రిటన్‌లో ఉగ్రవాద కేసులను విచారించే దర్యాప్తు సంస్థకు అప్పగించారు. తీవ్రవాద కార్యకలాపాలకు వ్యతిరేకంగా పని చేసే నిఘా సంస్థ ఈ పత్రాలపై దర్యాప్తును చేపట్టినట్టు, సమాజానికి హాని కల్గించే ఇలాంటి తాము సహించబోమని, కొన్ని ముస్లిం వ్యతిరేక గ్రూపులపై కూడా ప్రత్యేక నిఘా ఉంచుతున్నట్లు పోలీసు అధికారులు వెల్లడించారు. కలకలం సృష్టించిన ఆ లేఖల్లో ముస్లింలపై భౌతిక దాడులు చేయాలని, ముస్లిం మహిళల హిజాబ్‌లను తొలగించాలని, యాసిడ్ దాడులు కూడా చేయాలని పేర్కొన్నారు. అంతేకాదు, ఈ దాడులకు పాల్పడిన వారికి వారు చేసిన దాడి తీవ్రతను బట్టి బహుమతులు కూడా ఇస్తామని ఆ లేఖల్లో ప్రచురించడం గమనార్హం. -
నన్ను అలా చూడకండి.. ప్లీజ్ : ప్రీతి
లండన్: తనను ఒక వెనుకబడిన మైనారీటి వర్గానికి చెందిన మహిళగా గుర్తించడం నచ్చట్లేదని, అది ప్రజలను కించపరిచడమేనని బ్రిటిష్ మాజీ కేంద్ర మంత్రి, భారత సంతతి మహిళ ప్రీతి పాటిల్ అసహనం వ్యక్తం చేశారు. కన్జర్వేటివ్ పార్టీ తరఫున బ్రిటిష్ కేబినెట్లో చోటుదక్కించుకున్న మొదటి భారతీయ మైనారీటి మహిళగా గుర్తింపు పొందిన ప్రీతి పాటిల్ తనను ఒక వర్గానికి పరిమితం చేసి మాట్లాడటం.. ఆ వర్గాన్ని అవమానించే విధంగా ఉందని, అది ప్రజలను మోసం చేసి లబ్ధి పొందేవిధంగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. ‘నేను బ్రిటిష్లోనే పుట్టి పెరిగాను, నన్ను మొదట బ్రిటిష్ మహిళగా గుర్తించండి’ అని ఆమె కోరారు. బ్రిటిష్ కేబినెట్లో ఇంటర్నేషనల్ డెవలప్మెంట్ మినిస్ట్రీ పదవిలో ఆమె సేవలందించారు. గత ఏడారి నవంబర్‌లో తన మీద వచ్చిన ఆరోపణలకు బాధ్యత వహిస్తూ ఆమె రాజీనామా చేశారు. తనను అలా చూడడం ఏంతో ఉద్వేగానికి గురిచేసిందని, సహచర కేబినెట్ మంత్రులకు, పార్టీ ఎంపీలందరికీ తనని మొదట బ్రిటిష్ మహిళగానే చూడాలని, తనను ఒక వర్గానికి పరిమితం చేసి వేరుగా చూడొద్దని ఆమె విజ్ఞప్తి చేశారు. -
విజయ్ మాల్యాకు బెయిల్ పొడిగింపు
లండన్: దేశద్రోహం కేసులో విచారణ ఎదుర్కొంటున్న విజయ్ మాల్యాకు యూకే న్యాయస్థానం బెయిల్‌ను పొడిగించింది. ఏప్రిల్ 2 వరకు తాజా బెయిల్ పొడిగింపు వర్తిస్తుందని లండన్‌లోని వెస్ట్‌మినిస్టర్ మేజిస్ట్రేట్ కోర్టు న్యాయమూర్తి వెల్లడించారు. గురువారం సాయంత్రం ఈ కేసులో చివరి వాదనలు జరగాల్సి ఉన్నప్పటికీ డిఫెన్స్ లాయరు.. భారత ప్రభుత్వం కేసును కొట్టేయాలని డిమాండ్ చేయటంతో ఎటూ తేలకుండానే కేసు వాయిదా పడింది. భారత ప్రభుత్వం ఇచ్చిన సాక్ష్యాధారాలు అంగీకారయోగ్యంగా లేవంటూ మాల్యా తరపు న్యాయవాది వాదించారు. అయితే కేసు తర్వాతి విచారణ ఎప్పుడు జరుగుతుందనేది స్పష్టం కాకపోయినా మూడు వారాల తర్వాతే ఉంటుందని తెలుస్తోంది. ఏప్రిల్ 2017లో దేశద్రోహం కేసులో స్కాట్లాండ్ యార్డ్ పోలీసులు మాల్యాను అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచారు. -
వీడియో పోలీస్...
ఈయన లండన్‌లో గస్తీ తిరిగే ఓ పోలీస్ కానిస్టేబుల్. కుర్రాడు స్మార్ట్‌గా ఉన్నాడు కదా..! కానీ మనం చెప్పుకోబోయేది అతగాడి గురించికాదు. అతడి కుడి భుజం దగ్గర ఉన్నదే ఓ అగ్గిపెట్టెలాంటి పరికరం.. దాని గురించే. ఈ పెట్టె ధరించడం ద్వారా ఆధారాలు సులభంగా దొరుకుతాయని, బాధితులకు న్యాయం త్వరగా అందుతుందని, పోలీసుల్లో అవినీతి తగ్గుతుందని మెట్రోపాలిటన్ పోలీస్ సర్వీస్ విభాగం నమ్ముతోంది. ఆ నమ్మకంతోనే నగరంలో పైలట్ ప్రాజె క్టు కింద పలువురు పోలీ సులకు వీటిని తగిలిం చింది. ఇంతకీ టేజర్ కంపెనీ తయారు చేసిన ఈ పెట్టె ఏంటంటారా.. ఇదొక బాడీ కెమెరా. ఇది తగిలించుకున్న పోలీసు.. నేర ఘటనా స్థలానికి వెళ్లినప్పుడు అక్కడ ప్రతి అంశాన్నీ ఇది వీడియో తీస్తుంది. వీడియోతోపాటే ఆడియో కూడా రికార్డైపోతుంది. ఫలితంగా కేసు విచారణ దశలో ఎలాంటి ఆధారాలూ మిస్ కాకుండా ఉంటాయని వీటిని ప్రవేశపెట్టారు. -
ఇతడు రంగుల్ని ‘వింటాడు’!
తల మీద కెమెరా యాంటెన్నాను బిగించుకుని, రంగు రంగుల టైని పరిశీలిస్తున్న ఇతడు లండన్‌కు చెందిన మ్యుజీషియన్, ఆర్టిస్టు నీల్ హార్బిసన్. రంగుల టైని తదేకంగా చూస్తున్నా.. వాస్తవానికి ఆ రంగులు ఇతడికి కనిపించవు. యాక్రోమెటాప్సియా అనే కలర్ బ్లైండ్నెస్ సంబంధ సమస్య కారణంగా ఇతడి జీవితం బ్లాక్ అండ్ వైట్ అయిపోయింది. నలుపు, తెలుపు తప్ప ఇతర రంగులేవీ కనిపించవు. అయితే కంటికి కనిపించకున్నా ఆయా రంగుల్ని ఈ ఐబోర్గ్ కెమెరా యాంటెన్నాతో వినగలగడం ఇతని ప్రత్యేకత! ఎలా వింటాడంటే... యాంటెన్నాకు ముందువైపు కెమెరా రంగుల ఫ్రీక్వెన్సీని పసిగడుతుంది. ఆ సమాచారానికి అనుగుణంగా యాంటెన్నా వెనకవైపున వైబ్రేషన్లు పుట్టిస్తుంది. వైబ్రేషన్లు పుర్రె ఎముకల ద్వారా మెదడును చేరతాయి. వైబ్రేషన్ స్థాయిలను బట్టి కళ్ల ముందున్న రంగులను ఇత డు తెలుసుకుంటాడు. హార్బిసన్కు 21 ఏళ్ల వయసులో పదేళ్ల క్రితమే ఈ ఐడియా వచ్చింది. మరో వ్యక్తి సాయంతో దీనిని తయారుచేసి అప్పటి నుంచి వాడుతున్నాడు. అయితే యాంటెన్నాను మరింత అభివృద్ధిపర్చి పుర్రె లోపల అమర్చుకునే వైఫై కనెక్టర్ చిప్‌ను తయారుచేసిన హార్బిసన్ ఇప్పుడు దానిని తలలో అమర్చుకునేందుకు సిద్ధమవుతున్నాడు. వైఫై చిప్‌తో రంగుల్ని మరింత బాగా వినగలుగుతానని, మొబైల్ ఫోన్ల నుంచి వైఫై చిప్‌కు ఫొటోలను పంపి వాటిని చూడకుండానే వింటానని అంటున్నాడు.