
లండన్: బ్రిటన్ ప్రధానమంత్రి రేసులో ముందంజలో ఉన్నారు మాజీ ఆర్థిక మంత్రి, భారత సంతతి వ్యక్తి రిషి సునాక్. ఈ క్రమంలో ఆయనపై పలు విమర్శలు వస్తున్నాయి. ఆర్థికంగా ఇబ్బందుల్లో తరుణంలో దేశాన్ని నడిపించటంలో ఆయన అత్యంత ధనవంతుడంటూ పలు వాదనలు వచ్చాయి. తాజాగా వాటిని ఖండించారు రిషి సునాక్. కఠిన సవాళ్లను ఎదుర్కోవటంలో తనకు అపార అనుభవం ఉందని, ప్రస్తుత సమయంలో దేశాన్ని ముందుకు నడిపించగలనని ధీమా వ్యక్తం చేశారు. తాను ప్రజలను వారి బ్యాంకు ఖాతాల ద్వారా కాకుండా వారి ప్రవర్తనను భట్టి అంచనా వేస్తానని, ఇతరులు సైతం అలాగే చేస్తారని నమ్ముతున్నానన్నారు.
దేశంలో నెలకొన్న ఆర్థిక ఇబ్బందులపై ఓ వార్తా సంస్థతో మాట్లాడుతూ పలు విషయాలు వెల్లడించారు రిషి సునాక్. ‘కరోనా మహమ్మారితో లక్షల మంది ప్రజలు ప్రభావితమవుతారని ముందే అంచనా వేశాము. అది దేశాన్ని ఓ మెట్టు వెనక్కి లాగుంతదని ఊహించాం. ప్రధానిగా బాధ్యతలు చేపడితే ద్రవ్యోల్బణం కట్టడికే నా తొలి ప్రాధాన్యం. కానీ, ఇతరుల్లా పన్నుల‍్లో కోత విధిస్తానని నేను చెప్పను. ఆర్థికంగా దేశాన్ని బలోపేతం చేయటంలో ద్రవ్యోల్బణం కట్టడికే తొలి ప్రాధాన్యం ఇవ్వాలని గుర్తుంచుకోవాలి.’ అని పేర్కొన్నారు.
ప్రధాని రేసులో ఉన్న తన ప్రత్యర్థులపై విమర్శలు గుప్పించారు రిషి సునాక్. పన్నులను తగ్గించవచ్చు కానీ, ఒక బాధ్యాతాయుత వ్యక్తిగా అలా చేయబోనన్నారు. ఎన్నికల్లో గెలిచేందుకు ట్యాక్స్‌లు తగ్గించనని, ఎన్నికల్లో గెలిచి పన్నుల‍్లో కోతవిధిస్తానని పరోక్షంగా విమర్శించారు. బుధవారం నిర్వహించిన తొలి రౌడ్‌లో ఆరుగురు అభ్యర్థుల‍్లో రిషి సునాక్ ముందుంజలో. కన్జర్వేటివ్ పార్టీలో తనకు 88 ఓట్లు వచ్చాయి. తన ప్రత్యర్థి పెన్ని మోర్డాంట్‌కు 67, విదేశాంగ మంత్రి లిజ్ ట్రస్‌కు 50 ఓట్లు వచ్చాయి.
ఇదీ చూడండి: Rishi Sunak Old Video: బ్రిటన్ పీఎం రేసులో భారత సంతతి రిషి.. పాత వీడియోతో విమర్శలు
Comments
Please login to add a commentAdd a comment