లండన్ కాలమాన తెలుగు క్యాలెండర్ ఆవిష్కరిస్తున్న టీఈఎన్‌ఎఫ్
లండన్ : లండన్ కాలమాన ప్రకారం గంటల పంచాంగంతో రూపొందించిన మొట్టమొదటి తెలుగు క్యాలెండర్‌ను తెలంగాణ ఎన్నారై ఫోరమ్(టీఈఎన్‌ఎఫ్) ఆవిష్కరించింది. దాదాపు 2 దశాబ్దాలుగా తెలుగువారు పండుగలు, గృహ ప్రవేశాలు వంటి శుభకార్యాలకు శుభ ఘడియలు, దుర్ముహుర్తాలు సరిగ్గా తెలియక ఎంతో శ్రమ పడేవారు. భారత కాలమాన ప్రకారం చేసుకోవడం లేదా పండితులకు ఫోన్ చేసి అడగడం, ఇలాంటి కష్టాలను దూరం చేయాలనే సంకల్పంతో తెలంగాణ ఎన్నారై ఫోరమ్ ముందడుగు వేసింది.
యూకే తెలుగు బ్రాహ్మణ సంఘం సహకారంతో ప్రముఖ సిద్ధాంతి ములుగు రామలింగేశ్వర శర్మ ద్వారా లండన్ కాలమాన ప్రకారం పూర్తి స్థాయిలో తెలుగు పంచాంగ క్యాలెండర్ ను తయారు చేశారు. లండన్ ఎంపీ వీరేంద్ర శర్మ చేతలు మీదుగా ఈ కాలెండర్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎంపీ వీరేంద్ర శర్మ మాట్లాడుతూ.. ఇంతటి గొప్ప కార్యక్రమం లో భాగస్వామ్యం అయినందుకు సంతోషంగా ఉందన్నారు. భారతీయ సంస్కృతి, సంప్రదాయాలు యావత్ ప్రపంచానికి ఆదర్శమని కొనియాడారు.
తెలంగాణ ఎన్నారై ఫోరమ్ అధ్యక్షులు ప్రమోద్ అంతటి మాట్లాడుతూ.. యూకే కాలమాన ప్రకారం క్యాలండర్ తీసుకురావడంలో సంస్థ ఫౌండర్ చైర్మన్ గంప వేణుగోపాల్ ఎంతో శ్రమించారని కొనియాడారు. ఈ కాలెండర్ ప్రచురణలో సహకరించిన స్పాన్సర్లకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని, సంస్కృతి ప్రచారంలో భాగంగా సహకారంతో ఉచితంగా పంపిణి చేస్తున్నట్లు తెలిపారు. ఈ ఆవిష్కరణ కార్యక్రమంలో గంప వేణుగోపాల్, ప్రమోద్ అంతటి, రంగు వెంకట్, కూర రవికుమార్, రాజు కొయ్యడ , మీనాక్షి అంతటి, గంప జయశ్రీలు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment