panchangam
-
ప్ర‘పంచాంగం’
విశ్వంలో ఏదైనా చక్రగతిలోనే తప్ప సరళరేఖలో సాగదు; మానవజీవితమూ దీనికి మినహాయింపు కాదు. పగటిని రాత్రి అనుసరిస్తుంది; సూర్యుని చంద్రుడూ, నక్షత్రాలూ అనుసరిస్తాయి. మనిషి జీవితంలోనూ సుఖాల వెలుగును వెన్నంటే కష్టాల చీకట్లూ ఉంటాయి. జీవపరిణామక్రమంలో మనిషిలో మెదడు అభివృద్ధి చెంది ఆలోచన పదునెక్కినకొద్దీ అతణ్ణి అమితంగా తికమక పెట్టిన వాటిలో ఈ చక్రగమనం ఒకటి. మనుగడ పూర్తిగానూ, నేరుగానూ ప్రకృతివనరులపై ఆధారపడిన ఆదిమకాలంలో వేడి, వర్షం, చలి చక్రగతిని ఎందుకు అనుసరిస్తాయన్నది, కడుపు నిండిన తర్వాత కలిగే జిజ్ఞాస కాదు; కడుపు నింపుకోవడంతో ముడిపడిన చిక్కుప్రశ్న. ఈ ఋతుపరివర్తనలో అతని చుట్టూ ఉన్న పరిసరాలు మారిపోయి; తను ఆహారం కోసం ఆధారపడిన కొన్ని రకాల జంతువులు అదృశ్యమై, కొత్తవి అడుగుపెడుతున్నాయి! దీనిని అర్థంచేసుకోడానికీ, దీనికి ఎవరు కారణమో తెలుసుకోడానికీ సమయం పట్టింది. పెరిగి తరిగే చంద్రకళలే కారణమనుకుని వాటిని కాలానికి అన్వయించుకుని ఋతుచక్రానికి కాలచక్రాన్ని జోడించుకున్నాడు. అలా కాలగణనంలో చాంద్రమానం అడుగుపెట్టి ఇప్పటికీ ఒక సంప్రదాయంగా కొన సాగుతోంది. ఆ క్రమంలోనే రేపు, అంటే చైత్ర శుక్ల పాడ్యమి నాడు మనం జరుపుకొంటున్నది స్వస్తిశ్రీ చాంద్రమాన క్రోధి నామ సంవత్సర ఉగాది. ఉగాదిని ఇప్పుడు మనం ఒక పండుగగానే భావిస్తాం; గడిచిన ఏడాది ఎదురైన కష్టనష్టాలూ, ఆశాభంగాల పాత దుస్తులు విడిచేసి కొత్త ఆశలూ, ఉత్సాహాల ఉడుపులు ధరించే సందర్భమను కుంటాం; ఆరు రుచుల సమ్మేళనంగా జీవితాన్ని సంకేతించేదిగా గుర్తుపెట్టుకుంటాం; పంచాంగ శ్రవణానికీ, కవితా శ్రవణానికీ కూడా చెవులు అప్పగిస్తాం. నూతనశోభకు, శుభానికి తలుపు తెరిచేలా తోచే ఏ సందర్భమైనా పండుగే. అయితే, ఉగాది పేరిట కొత్త సంవత్సర ప్రారంభాన్ని పండుగగా మలచడం వెనుక ఎంతో కథ ఉంది; అంతుబట్టని కాలచక్రపు తిప్పుళ్ళకు బిత్తరపోయి, తిరిగి నిలదొక్కుకోడానికి బతుకు చేసే పెనుగులాట ఉంది; కాలగమనాన్ని అర్థం చేసుకోవడానికి పడిన అంతులేని వైజ్ఞానిక ప్రయాస ఉంది; మనం అనాగరికునిగా పొరబడే ఆదిమానవుణ్ణే తొలి ఖగోళ వేత్తగా రూపించి నిరూపించే అద్భుత నేపథ్యం ఉంది. తప్పులు, సవరణల రూపంలో సాగిన ఆ కాలగణనం కసరత్తులోకి తొంగిచూసినప్పుడు నాటి మానవుల ఆరాటపోరాటాలతో పాటు మరెన్నో ఆసక్తికర విషయాలు మన కళ్లను మెరుపులా తాకి ఆశ్చర్యం గొలుపుతాయి. చంద్రుని వృద్ధిక్షయాల ఆధారంగా కాలాన్ని గణించడం, యాభైవేల సంవత్సరాల క్రితమే పాతరాతియుగంలో మొదలైనట్టు శాస్త్రవేత్తలు నిరూపించారు. అప్పటి గుహాచిత్రాలలో కనిపించిన పొడవాటి దండాన్ని చంద్రకళల ఆధారంగా కాలాన్ని కొలిచే సాధనంగా గుర్తించారు. ఇప్పటికీ పన్నెండు రాశులలో ఒకటిగా ఉన్న మేషరాశిని సూచించే పొట్టేలు బొమ్మతో సహా వివిధ జంతు వుల బొమ్మలు ఆ దండంపై ఉన్నాయి. అనంతరకాలంలో పురోహితులు, మాంత్రికులు, పాలకులు ధరించే దండాలకు అదే మాతృక అయినట్టు తేల్చారు. చంద్రునితో ఋతువుల మార్పును ముడి పెట్టి చాంద్రమానానికి అలా తెరదీయడం గొప్ప ముందడుగే కానీ; ఋతుచక్రానికి, చాంద్రమానంలోని మాసచక్రానికి పొంతన కుదరకపోవడంతో, ఋతుపరివర్తనకు సూర్యుడు కారణమన్న ఎరుక పుట్టి సౌరమానం అడుగుపెట్టింది. భూమి తనచుట్టూ తాను తిరుగుతూ; ఇరవైమూడున్నర డిగ్రీల ఒంపుతో సూర్యుని చుట్టూ కూడా తిరుగుతోందన్న గ్రహింపు లేని ఆ కాలంలో కూడా సంవత్స రానికి 300 నుంచి 400 రోజులను లెక్కగట్టడాన్ని నేటి శాస్త్రవేత్తలు అబ్బురంగానే పరిగణిస్తారు. చాంద్రమానం సంవత్సరానికి 354 రోజులను లెక్కిస్తే, మరింత నిర్దుష్టమైన సౌరమానం 365 పైచిలుకు రోజులను లెక్కించింది. రెంటిమధ్యా ఉన్న 11 రోజుల పైచిలుకు తేడాను సరిపెట్టి రెండు మానాలనూ సమన్వయించడం ఖగోళ పండితులకు పెద్ద సవాలే అయింది. రోమన్, జూలి యన్, గ్రెగేరియన్ లాంటి ఎన్ని కాలగణన పద్ధతులు వచ్చినా ఇలాంటి సమస్యలు నేటికీ అపరిష్కృతంగానే ఉన్నాయని ‘కేలండర్ కథ’ అనే పుస్తకంలో డా. మహీధర నళినీమోహన్ అంటారు. మనదేశానికి చెందిన భాస్కరాచార్యులు సహా ప్రపంచవ్యాప్తంగా ఎందరో ఖగోళపండితులు సంవత్సరానికి 365 రోజుల పైచిలుకును సక్రమంగానే గుర్తించారు. కానీ అందులో ప్రకృతి సిద్ధంగా ఉన్న భిన్నాంకం వారి మేధకు లొంగేది కాదు. చాంద్రమానంలో భాగమైన నెలకు 29 రోజుల పైచిలుకు లెక్కా అలాంటిదే. భూభ్రమణంలో ఒంపు వల్ల కాలగణనంలో ఏర్పడే ఆ వైవిధ్యమే లేనప్పుడు ఋతుపరివర్తనే అంతరించి మరింత విషమసమస్య తలెత్తే మాటా నిజమే. మొత్తంమీద అప్పటినుంచీ ఇప్పటివరకూ కేవల చాంద్రమానం, కేవల సౌరమానం; చాంద్ర– సౌరమానాల సమన్వయం అనే మూడు పద్ధతులూ అమలులో ఉన్నాయి. విశేషమేమిటంటే, కాల గణనానికి అనుసరించిన పద్ధతుల్లోనూ, ఆ క్రమంలో ఎదురైన సమస్యల పరిష్కారంలో సాఫల్య, వైఫల్యాలలోనూ ప్రపంచానుభవం ఒక్కలాంటిదే. కనుక ‘పంచాంగం’ అనే మాటను ‘ప్రపంచాంగం’గానూ చెప్పుకోవడంలో తప్పులేదు. పైన చెప్పిన సౌర, చాంద్రమానాల సమన్వయాన్నే ‘యుగం’ అంటారని ‘జనకథ’ అనే పుస్తకంలో రాంభట్ల కృష్ణమూర్తిగారి వివరణ. అధికమాసాలను పాటించడం ఇందులో భాగమే. అప్పుడు కూడా రెండు మానాల సమన్వయం అయిదేళ్ళకోసారే సాధ్యమవుతుంది. అదే అసలైన ‘యుగాది’. ఇప్పుడు ‘ఉగాది’ పేరుతో ఏటా జరుపుకొంటున్నాం. -
హీరోను దుమ్మెత్తిపోసిన నెటిజన్లు.. సైలెంట్‌గా ఉండమని కామెంట్లు..
R Madhavan Gets Trolled For Claiming ISRO Used Hindu Calendar For Mars Mission: దక్షిణాది భాషల్లోనే కాకుండా బాలీవుడ్‌లోనూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటుడు మాధవన్. ఆయన తాజాగా నటించి, దర్శకత్వం వహించిన చిత్రం రాకెట్రీ. ప్రముఖ ఇస్రో శాస్త్రవేత్త నంబి నారాయణ్ జీవితాన్ని ఆధారంగా చేసుకుని తెరకెక్కింది ఈ చిత్రం. బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్, స్టార్ హీరో సూర్య కీలక పాత్రల్లో నటించిన ఈ మూవీ తెలుగు, తమిళం, హిందీ, ఇంగ్లీషు భాషల్లో జులై 1న ప్రేక్షకుల ముందుకు రానుంది. దీంతో ప్రమోషన్లో భాగంగా చిత్రబృందం మీడియా సమావేశాలకు హాజరవుతోంది. ఈ క్రమంలోనే మాధవన్ చేసిన వ్యాఖ్యలు నెట్టింట ట్రోల్స్ ఎదుర్కొంటున్నాయి. ఓ ప్రెస్ మీట్లో అంతరిక్షంలోకి రాకెట్‌ను ప్రయోగించినప్పుడు, అది అంగారక కక్ష్యలోకి చేరేందుకు ఇస్రోకు పంచాగం ఉపయోగపడిందని మాధవన్ అన్నాడు. 'ఇస్రోవాళ్లు పంచాంగం చూసి పెట్టిన ముహుర్త బలం వల్లే భారత మార్స్ మిషన్ అవాంతరాలను అధిగమించి కక్ష్యలోకి చేరింది. గ్రహాల స్థితిగతులన్నీ పంచాంగాల్లో నిక్షిప్తమై ఉంటాయి.' అని మాధవన్ వ్యాఖ్యలు చేశాడు. ఈ వీడియో నెట్టింట్లో వైరల్ కాగా నెటిజన్స్ ట్రోలింగ్‌తో ఏకిపారేస్తున్నారు. (చదవండి: చై-సామ్ బాటలో మరో టాలీవుడ్ జంట ?) When panjakam plays a important role in Mars mission #Madhavan #MarsMission #science #technology #sciencefiction pic.twitter.com/tnZOqYfaiN — கல்கி (@kalkyraj) June 23, 2022 'సైన్స్ అందరికీ అర్థమయ్యే విషయం కాదు. అలా అని సైన్స్ తెలియకపోవడం కూడా పెద్ద సమస్య కాదు. కానీ అసలు విషయం తెలుసుకోకుండా ఇలా మాట్లాడే బదులు సైలెంట్‌గా ఉండటం మంచిది', 'మీరు మాట్లాడే దాంట్లో ఏమైనా అర్థం ఉందా ?', 'ఇవేం పిచ్చి మాటలు' అంటూ వరుస కామెంట్లతో నెటిజన్లు దుమ్మెత్తిపోశారు. అయితే ఈ ట్రోలింగ్‌పై తాజాగా మాధవన్ స్పందించాడు. 'పంచాంగాన్ని తమిళంలో పంచాంగ్ అని అనడం నా తప్పే. ఈ విమర్శలకు నేను అర్హుడినే. నేను అజ్ఞానినే. అయితే ఈ మాటల వల్ల మనం కేవలం 2 ఇంజిన్ల సహాయంతో మార్స్ మిషన్‌లో విజయం సాధించామనే నిజం కాకుండా పోదు. ఇది ఒక రికార్డు. వికాస్ ఇంజిన్ ఒక రాక్‌స్టార్.' అని ట్వీట్ మాధవన్ ట్వీట్ చేశాడు. (చదవండి: 'నువ్వే కావాలి' నటుడికి నిర్మాత బెదిరింపులు.. పోలీసులకు ఫిర్యాదు) 🙏🙏I deserve this for calling the Almanac the “Panchang” in tamil. Very ignorant of me.🙈🙈🙈🤗🚀❤️Though this cannot take away for the fact that what was achieved with just 2 engines by us in the Mars Mission.A record by itself. @NambiNOfficial Vikas engine is a rockstar. 🚀❤️ https://t.co/CsLloHPOwN — Ranganathan Madhavan (@ActorMadhavan) June 26, 2022 (చదవండి: 9 సార్లు పిల్లలను కోల్పోయిన స్టార్ హీరోయిన్..) -
Sakshi Cartoon: దీంట్లో పెట్రోల్ ధరల తగ్గుదల గురించి ఉండదయ్యా! వెళ్లు!
దీంట్లో పెట్రోల్ ధరల తగ్గుదల గురించి ఉండదయ్యా! వెళ్లు! -
శ్రీ శుభకృతు నామ సంవత్సరం రాశి ఫలితాలు
-
ఉగాది 2022: శ్రీ శుభకృత్ నామ సంవత్సర కర్తరీ నిర్ణయం
డొల్లు కర్తరీ ప్రారంభం: 04–05–2022, రా.12:04లకు అనగా (05/05) శుభకృత్‌నామ సంవత్సర వైశాఖ శుద్ధ చవితి బుధవారం రాత్రి తెల్లవారితే గురువారం మృగశిరా నక్షత్రం రోజున రవి భరణి నక్షత్రం మూడవ పాదంలో ప్రవేశించడంతో డొల్లుకర్తరీ ప్రారంభం అవుతుంది. పెద్ద కర్తరీ ప్రారంభం: 11–05–2022, రా.10:04లకు శుభకృత్ నామ సంవత్సర వైశాఖ శుద్ధ దశమి తత్కాల ఏకాదశి బుధవారం ఉత్తరఫల్గుణీ నక్షత్రం రోజున రవి కృత్తికలో ప్రథమపాదంలో ప్రవేశించడంతో పెద్దకర్తరీ ప్రారంభం అవుతుంది. ‘మృద్దారు శిలాగృహకర్మాణి వర్జయేత్’ మట్టి, కర్ర, రాయి ఉపయోగించి చేయు గృహకర్మలు ప్రారంభించడానికి కర్తరీకాలం సరైనది కాదు. పై సూత్రం ఆధారంగా దీనికి వాస్తుకర్తరీ అని పేరు. శంఖుస్థాపన, ద్వారం ఎత్తుట, పాకలు, షెడ్లు, పెంకుటిళ్ళు, పైకప్పు నిర్మాణ పనులు ప్రారంభించడం శ్రేయస్కరం కాదు. కర్తరీ పూర్తి (త్యాగం): 29–05–2022, ఉ.7:37లకు వైశాఖ బహుళ చతుర్దశి ఆదివారం కృత్తికా నక్షత్రం రోజున రవి రోహిణి నక్షత్రం రెండవ పాదంలో ప్రవేశించడంతో కర్తరీకాలం పూర్తవుతుంది. మూఢమి వివరములు శుక్ర మూఢమి: (15–09–2022 నుంచి 1–12–2022 వరకు) మూఢమి ప్రారంభం: 15–9–2022 శుభకృత్ నామ సంవత్సరం భాద్రపద బహుళ పంచమి గురువారం రోజున శుక్రుడు రవి నుండి ప్రాగస్తం (అనగా తూర్పుదిశగా అస్తమించడం వలన) మూఢమి ప్రారంభం అయినది. మూఢమి అంత్యం: 1–12–2022 మార్గశిర శుద్ధ అష్టమి రోజున శుక్రుడు రవి నుండి పశ్చాదుదయం (అనగా పశ్చిమ దిశగా ఉదయించడం) వలన మూఢమి పూర్తవుతుంది. నోట్: మూఢమికి ముందు కొన్ని రోజులు గ్రహాలకు వృద్ధత్వం అని పేరు. మూఢమి తరువాత బాలత్వం అని పేరు. ఆ రోజులలో శుభకార్యములు చేయరాదు. మకర సంక్రాంతి పురుష లక్షణమ్: 14–01–2023, రా.గం.2:14లకు (ఘ.49–01) స్వస్తిశ్రీ చాంద్రమాన శ్రీ శుభకృత్ నామ సంవత్సరం హేమంత ఋతువు పుష్య మాసం బహుళ సప్తమి తత్కాల అష్టమి శనివారం రాత్రి తెల్లవారితే ఆదివారం చిత్తా నక్షత్రం రెండవ పాదం కన్యారాశి సుకర్మయోగం బాలవకరణం తులాలగ్నం సమయంలో రవి మకరరాశి ప్రవేశం. సూ.ఉ.6:38. సూ.అ.5:40. దినప్రమాణం 27:36. -
ఉగాది 2022: నవనాయక ఫలితాలు (2022– 2023)
రాజు – శని శని రాజు అయిన సంవత్సరంలో విచిత్ర వర్షాలు కురిసి పంటలు సామాన్యంగా ఫలిస్తాయి. రాజక్రోధం అధికమై యుద్ధాలు, చోరభయం కలుగుతాయి. రెండవ పంటలు, పర్వత పంటలు బాగా పండుతాయి. ధరలు సరిగా ఉండవు. స్వల్పవర్షాలు కురుస్తాయి. జనులు కపట స్వభాంతో సంచరిస్తారు. అధర్మమార్గంలో నడుచుకుంటారు. తక్కువస్థాయి ప్రజలు సుఖపడతారు. ఇది సహజ శని లక్షణం. అయితే శని స్వక్షేత్ర సంచారి కావడం వల్ల వివాహాది శుభకార్యాలు జరుగుతాయి. రాజవాహన ఫలములు అశ్వం రాజవాహనం– భూకంపాది ఉపద్రవాలు. రాజయుద్ధం, వర్షాభావం, పంటలు తగ్గడం, ఆహార ధాన్యాల కొరత, ధాన్యాదుల ధరలు పెరుగుదల, దుర్భిక్షం, జనహాని, ధనహాని కలుగుతాయి. మంత్రి–గురు గురువు మంత్రిగా ఉన్న సంవత్సరం అధిక ధాన్యపంటలు, సంపదలు, అధిక వర్షాలు, వృక్షాలు, çపంటలు బాగా ఫలిస్తాయి. భూమి గోకులంలా ఉంటుంది. సువృష్టితో భూమి సస్యసంపూర్ణమవుతుంది. భూమి సంపూర్ణ జలాలతో ఉంటుంది. రాజులు సమరోత్సాహం చూపుతారు. గ్రంథాతర వచనం: గోవులు అధిక క్షీరములు ఇచ్చును. ధాన్యము బాగా ఫలించును. క్షేమ, ఆరోగ్య, సుభిక్షములు కలుగును. సేనాధిపతి–బుధ మేఘాలకు వాయుబాధ ఎక్కువై కష్టంతో వర్షిస్తాయి. సస్యాలు కూడా దానికి తగినట్లుగానే ఫలిస్తాయి. ప్రజలు కామాచార పరాయణులై ఉంటారు. సస్యాధిపతి – రవి సూర్యుడు పూర్వ సస్యాధిపతి కావడం వల్ల ఈతిబాధలతో పూర్వ సస్యములు పీడింపబడును. ఉలవలు, శనగలు, కందులు, వేరుశనగ, ఎర్రధాన్యములు, మిర్చి, వక్కలు సమృద్ధిగా ఉత్పత్తి అయి ధరలు తగ్గి ఉంటాయి. తక్కిన ధాన్యములకు ధరలు పెరుగుతాయి. బంగారం, వెండి ధరలలో ఒడిదుడుకులు ఉంటాయి. అని ఇతర గ్రంథ వచనం. ధాన్యాధిపతి –శుక్రుడు అతివృష్టి సుభిక్షము మంచి పంటలు ప్రజలకు ఆరోగ్యము లభించును. అర్ఘాధిపతి–బుధుడు మంచి వర్షాలు కురుస్తాయి. ధరలు బాగుంటాయి. మంచి పంటలు పండుతాయి. పాషండులు, ఇంద్రజాలికులు, యువకులు దుçష్టులుగా పెరుగుతారు. మేఘాధిపతి –బుధుడు మేఘగర్జనలు పిడుగుపాటులు గాలితో కూడిన వర్షములు వచ్చును. మధ్య దేశమునందు మంచి వర్షము వచ్చును. సర్వత్ర మధ్యస్థాయి వృష్టి సస్యములుండును అని గ్రంథాంతరము. రసాధిపతి – కుజుడు కుజుడు రసాధిపతిగా ఉన్నప్పుడు జీలకర్ర, ఉప్పు, నెయ్యి, తైలము, బెల్లము మొదలగునవి ధరలు పెరగవు. నీరసాధిపతి – రవి : రత్నములు మణులు చందనము వెండి, బంగారము, రాగి మొదలగు ధాతు లోహములకు ధరలు తగ్గును. రాష్ట్ర, రాజ, ప్రజాక్షోభములు జననాశము జరుగునని గ్రంథాంతర వచనము. -
Ugadi 2022: శ్రీ శుభకృత్‌నామ సంవత్సర పండుగలు
ఏప్రిల్ 2022 చైత్ర మాసం 2 ఉగాది, వసంత నవరాత్రులు ప్రారంభం 3 ఉమ, శివ, అగ్నిపూజ 4 ఉత్తమ మన్వాది, సౌభాగ్య గౌరీవ్రతం 5 గణేశపూజ 6 నాగపూజ, శ్వేతవరాహకల్పం, శ్రీ పంచమి 8 సూర్యపూజ 9 భవానీ యాత్ర, అశోక రుద్రపూజ 10 శ్రీరామనవమి 11 ధర్మరాజ దశమి 12 విష్ణు డోలోత్సవం, మతత్రయ ఏకాదశి, రుక్మిణీపూజ 13 వామన ద్వాదశి 14 దమనోత్సవం, మేష సంక్రమణం 15 శైవచతుర్దశి, కర్దమక్రీడ 26 మతత్రయ ఏకాదశి 29 మాస శివరాత్రి, శివసన్నిధి స్నానం మే 2022 వైశాఖ మాసం 1 ధర్మఘటాది దానం 3 అక్షయతదియ, చందనోత్సవం, బలరామ జయంతి 4 నాగ చతుర్థి 6 శంకరజయంతి 8 గంగోత్పత్తి, విద్యారణ్య జయంతి 9 అపరాజితాదేవి పూజ 10 చండికాదేవిపూజ 11 వాసవీ జయంతి 12 మతత్రయ ఏకాదశి 13 పరశురామ ద్వాదశి 14 నృసింహ జయంతి 15 వృషభ సంక్రమణం 18 పార్థివ కల్పం 24 చండికాదేవి పూజ 25 హనుమజ్జయంతి 26 మతత్రయ ఏకాదశి 28 మాసశివరాత్రి జూన్ 2022 జ్యేష్ఠ మాసం 05 ఆరణ్యకగౌరీ వ్రతం 07 శుక్లాదేవీ పూజ 08 బ్రహ్మాణీదేవి పూజ 09 దశపాపహర దశమి, సేతుబంధన రామేశ్వర ప్రతిష్ఠ 11 రామలక్ష్మణద్వాదశి 14 సావిత్రీవ్రతం 15 మిథున సంక్రమణం 21 త్రిలోచన పూజ 24 మతత్రయ ఏకాదశి 25 కూర్మజయంతి 27 మాసశివరాత్రి ఆషాఢ మాసం 30 చంద్రదర్శనం, సీతారామ రథోత్సవం జూలై 2022 1 పూరీ జగన్నాథ రథోత్సవం 4 స్కంధ పంచమి 5 కుమారషష్ఠి 7 మహిషాసురమర్దినీపూజ 8 ఐంద్రీదేవి పూజ 9 మహాలక్ష్మీ వ్రతారంభం 10 తొలి ఏకాదశి, శయన ఏకాదశి 11 వాసుదేవ ద్వాదశి, చాతుర్మాస్య వ్రత ప్రారంభం 17 కర్కాటక సంక్రమణం, దక్షిణాయన పుణ్యకాలం 18 సంకల్పాలకు దక్షిణాయనం 27 మాసశివరాత్రి శ్రావణ మాసం 30 చంద్రదర్శనం ఆగస్టు 2022 1 దూర్వాగణపతివ్రతం 2 నాగపంచమి 3 సూర్యషష్ఠి 5 వరలక్ష్మీ వ్రతం 6 కౌమారీదేవి పూజ 8 మతత్రయ ఏకాదశి 9 దామోదర ద్వాదశి, పవిత్రారోపణం 12 రాఖీపూర్ణిమ, యజుర్వేదోపాకర్మ 15 సంకట చతుర్థి 19 స్మార్త శ్రీకృష్ణాష్టమి 20 కౌమారీదేవీ పూజ 23 స్మార్త ఏకాదశి 25 మాస శివరాత్రి 26 సర్వేషాం అమావాస్య 27 పోలా వ్రతం భాద్రపద మాసం 28 శైవమౌనవ్రతం 29 కల్కి జయంతి 30 సువర్ణగౌరీ వ్రతం 31 శివాచతుర్థి 31 వినాయకచవితి సెప్టెంబర్ 2022 1 ఋషిపంచమి 4 కేదారవ్రతం 6 మతత్రయ పరివర్తన ఏకాదశి 7 వామనజయంతి 9 అనంత వ్రతం 11 మహాలయ పక్ష ప్రారంభం 12 ఉండ్రాళ్ళ తద్ది 18 వ్యతీపాత మహాలయం 21 మతత్రయ ఏకాదశి 22 యతి మహాలయం 24 శహత మహాలయం 24 మాస శివరాత్రి ఆశ్వయుజ మాసం 26 దసరా నవరాత్రుల ప్రారంభం అక్టోబర్ 2022 02 సరస్వతీ పూజ, దేవీ త్రిరాత్రవ్రతం 03 దుర్గాష్టమి 04 మహర్నవమి 05 విజయదశమి 06 మతత్రయ ఏకాదశి 07 గోద్వాదశీ, పద్మనాభ ద్వాదశి 12 అట్లతద్ది 21 మతత్రయ ఏకాదశి 22 గోవత్స ద్వాదశి 23 మాస శివరాత్రి 23 నరకచతుర్దశి 24 దీపావళి అమావాస్య 25 కేదార వ్రతం కార్తీక మాసం 26 అఖండదీప ప్రారంభం 27 యమపూజ, భగినీహస్త భోజనం 29 నాగుల చవితి నవంబర్ 2022 04 మతత్రయ ఏకాదశి 05 క్షీరాబ్ది ద్వాదశి, చిల్కు ద్వాదశి 07 జ్వాలాతోరణం 08 గ్రహణం, కార్తీకవ్రతోద్యాపనం 20 మతత్రయ ఏకాదశి 21 గోవత్స ద్వాదశి 22 మాస శివరాత్రి 23 సర్వేషాం అమావాస్య మార్గశిర మాసం 29 సుబ్రహ్మణ్య షష్ఠి 30 మిత్రసప్తమి డిసెంబర్ 2022 1 కాలభైరవాష్టమి 4 మతత్రయ ఏకాదశీ 4 గీతాజయంతి 5 హనుమద్వ్రతం 7 దత్తజయంతి 9 పరశురామజయంతి 22 మాస శివరాత్రి జనవరి 2023పుష్య మాసం 2 మతత్రతయ ఏకాదశి, ముక్కోటి ఏకాదశి 3 కూర్మ జయంతి 13 భోగి 14 మకర సంక్రాంతి 15 కనుమ 20 మాస శివరాత్రి మాఘమాసం 23 వాసవీ ఆత్మార్పణ 24 గుడలవణ దానం 26 శ్రీ పంచమి 28 రథసప్తమి 29 భీష్మాష్టమి ఫిబ్రవరి 2023 1 మతత్రయ భీష్మఏకాదశి 5 మహామాఘి 13 కుంభసంక్రమణం 18 మహాశివరాత్రి మార్చి 2023 ఫాల్గుణ మాసం 3 మత్రతయ ఏకాదశీ 4 నృసింహ ద్వాదశీ 5 కామదహనం అర్ధరాత్రి 6 హోళీ ప్రదోషం 8 వసంతోత్సవం 15 మీన సంక్రమణం 20 మాస శివరాత్రి 21 సర్వేషాం అమావాస్య 22 ఉగాది -
అందుకే దేశమంతటా ఒకే పంచాంగం లేదు
రాజమహేంద్రవరం(తూర్పుగోదావరి జిల్లా): దేశమంతటా ఒకే పంచాంగం లేకపోవడానికి ప్రజలు సూర్యమానం, చాంద్రమానం వేర్వేరుగా పాటించడమే కారణమని కంచి కామకోటి సర్వజ్ఞ పీఠ ఆస్థాన సిద్ధాంతి బ్రహ్మశ్రీ లక్కావఝుల సుబ్రహ్మణ్య సిద్ధాంతి పేర్కొన్నారు. తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం గోదావరి తీరాన సరస్వతి ఘాట్ వద్ద తెలుగు దృగ్గణిత పంచాంగకర్తల ఆత్మీయ సమ్మేళనం ఆదివారం జరిగింది. సుబ్రహ్మణ్య సిద్ధాంతి మాట్లాడుతూ.. దక్షిణాది రాష్ట్రాల్లో చాంద్రమానం ప్రకారం, ఉత్తరాదిన సూర్యమానం ప్రకారం గణించడం వల్ల వారికి, మనకు కొంత తేడాలు వస్తున్నాయని చెప్పారు. కొన్ని పంచాంగాల్లో గ్రహణాది ప్రత్యక్ష గోచరాలు కూడా తప్పిపోయి పొరపాట్లు దొర్లుతున్నాయన్నారు. సమ్మేళనంలో చింతా గోపీశర్మ సిద్ధాంతి మాట్లాడారు. వివిధ సిద్ధాంతులు రచించిన పంచాంగాలను ఆవిష్కరించారు. సంస్కృత పండితుడు చిర్రావూరి శ్రీరామశర్మను సత్కరించారు. -
అనారోగ్యం ‘మస్తు’
సాక్షి, హైదరాబాద్: ‘ప్రస్తుతం ప్రపంచాన్ని వణికిస్తున్న కోవిడ్ బారి నుంచి త్వరగా కోలుకునేందుకు ప్రజలు సమష్టిగా ముందడుగు వేయాలి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సూచనలను పాటిస్తే ఈ భయంకర సమస్య నుంచి బయటపడతాం. ప్రభుత్వ సూచనలే కాదు, పంచాంగం కూడా ఇదే విషయాన్ని చెబుతోంది. కొత్త ఏడాదిలో ప్రజలు జాగ్రత్తగా ఉండాలి. వికారి నామ సంవత్సరం పోతూపోతూ ‘కరోనా’ వికారాన్ని అంటగంటి వెళ్లింది. కొత్త ఏడాది మార్చి 30 నుంచి మే 4 వరకు మకరరాశిలో కుజుడు, శని, గురువు సంచారం ఉంది. ఒకే రాశిలో మూడు గ్రహాల సంచారం వల్ల ఘోర ఫలితాలు ఎదురుకావచ్చు’ అని ప్రముఖ పౌరాణికులు బాచంపల్లి సంతోష్‌కుమారశాస్త్రి అన్నారు. శ్రీ శార్వరి నామ సంవత్సరం కాలసర్పయోగంతో మొదలైందని, అటువంటి యోగాలు ఈ ఏడాదిలో 6 ఉన్నందున ప్రజలకు ఆరోగ్యపర ఇబ్బందులు తప్పవని హెచ్చరించారు. అయితే, జాగరూకతతో వ్యవహరిస్తే సమస్యల నుంచి బయటపడవచ్చన్నారు. శార్వరి నామ ఉగాది వేడుకలు బుధవారం ఉదయం దేవాదాయశాఖ కమిషనర్ కార్యాలయంలో ఘనంగా జరిగాయి. కోవిడ్ వ్యాప్తి నేపథ్యంలో ప్రభుత్వ ఆంక్షలు ఉండటంతో సాధారణ ప్రజలు, మీడియా ప్రతినిధుల హాజరు లేకుండా దేవాదాయశాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి, ప్రభుత్వ సలహాదారు రమణాచారి, దేవాదాయ శాఖ కమిషనర్ అనిల్‌కుమార్ సమక్షంలో అర్చకులు, ఇతర అధికారుల మధ్య వేడుకలు జరిగాయి. ఈ సందర్భంగా పంచాంగం ప్రకారం ఈ ఏడాది యోగఫలాల వివరాలు బాచంపల్లి మాటల్లోనే.. ఈ ఏడాది వానలే వానలు.. ఈ ఏడాది వానలు బాగా కురుస్తాయి. రైతాంగానికి మేలు కలుగుతుంది. సంవర్త పేరుతో మేఘాలు ఉన్నందున మూడు కుంచాల వాన కురుస్తుందని పంచాంగం చెబుతోంది. ఎరుపు నేలలు, ఎరుపు రంగు పంటలు లాభిస్తాయి. అరేబియా, హిందూ మహా సముద్రాల్లో అల్పపీడనాలు, ద్రోణులు ఏర్పడటంతో భారీ వర్షాలు, అడపాదడపా భూకంపాలు సంభవిస్తాయి. ఆషాఢంలోనూ ఈసారి వానలు కురుస్తాయి. ఆగస్టు, సెప్టెంబరుల్లో దక్షిణ భారతంతో పాటు మహారాష్ట్రలో భారీ వర్షాలు, వరదలు వస్తాయి. చెన్నైలో భారీ వానలు కురుస్తాయి. హైదరాబాద్‌లో మంచి వానలుంటాయి. కాళేశ్వరం ఫలితాలు రాష్ట్రమంతా అందే అవకాశం ఉంటుంది. నవంబరు 20 నుంచి డిసెంబరు 1 వరకు తుంగభద్ర నదీ పుష్కరాలు.. ఈయేడు ఐదు గ్రహణాలు ఏర్పడుతున్నా, దేశంలో రెండు మాత్రమే ప్రభావవంతంగా ఉంటాయి. అందులో జూన్ 21 ఆదివారం ఉదయం 10.15 నుంచి మధ్యాహ్నం 1.44 వరకు చూడామణి కంకణ సూర్యగ్రహణం ఉంటుంది. మాంద్యమున్నా రాష్ట్రం నెట్టుకొస్తుంది.. ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక మాంద్యం ప్రభావం ఉన్నా.. మన దేశం, మన రాష్ట్రం విజయవంతంగా నెట్టుకొస్తాయి. ఈ సంవత్సరం మన దేశ సర్వ ఆదాయం 105, సర్వ వ్యయం 96. మిగులు 9. దానితోనే కేంద్ర, రాష్ట్రాలు నెట్టుకురావాలి. ప్రణాళికాబద్ధ ఆర్థిక విధానంతో రాష్ట్ర ప్రభుత్వం ముందడుగు వేస్తుంది. ప్రజలకందే కొన్ని సబ్సిడీలు దూరమవుతాయి. ఆర్థిక మాం ద్యం దృష్ట్యా ప్రజలు పొదుపు మంత్రం పాటించాలి. ఆర్థిక క్రమశిక్షణతోనే మేలు కలుగుతుంది. తరచూ జాతీయస్థాయి విపత్తులు సంభవిస్తాయి. ధరలు పెరుగుతాయి. శని రసాధిపతిగా ఉన్నందున పెట్రోలు, డీజిల్ ధరలు తారస్థాయికి చేరుతాయి. బ్యాంకులపై ప్రజలకు నమ్మకం సడలుతుంది. ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావుకు ఈ సంవత్సరం కత్తిమీద సామే.. ప్రణాళికాబద్ధంగా ముందుకెళ్లాలి. విద్యారంగంలో సాధారణ ఫలితాలుం టాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అన్నదమ్ముల్లా ఇచ్చిపుచ్చుకునే ధోరణితో ఉండటం ప్రజలకు మేలు చేస్తుంది. క్రీడారంగం, మిలిటరీలో ఉత్సాహం అంతంతే. ఈ ఏడాది 384 రోజులు.. 13 నెలలు ఈయేడు నవ నాయకుల్లో నాలుగు శుభగ్రహాలకు, ఐదు పాపగ్రహాలకు ఆధిపత్యం వచ్చింది. ఉగాది బుధవారం వచ్చినందున బుధుడు రాజుగా ఉంటాడు. బుద్ధిమంతు డు, యుక్తాయుక్త వివేచన కలవాడు రాజుగా ఉండేం దుకు అవకాశం కలుగుతుంది. రియల్ఎస్టేట్ రంగం హైదరాబాద్‌లో కొత్తపుంతలు తొక్కుతుంది. శాంతిభద్రతలు బాగుంటాయి. సేనాధిపతి రవి అయినందున ప్రజలకు రక్షణ అందించేందుకు పోలీసు శాఖ బాగా పనిచేస్తుంది. మీడియా ఇబ్బందులు, ఆర్థికచిక్కులతో అతలాకుతలం కాక తప్పదు. సంక్షేమ శాఖలు, పరిశోధన రంగాల్లో మంచి ఫలితాలుంటాయి. ఓ ప్రఖ్యా త కళాకారుడు మృత్యువాత పడతారు. శార్వరి నామ సంవత్సరంలో 384 రోజులుంటాయి. ఆశ్వయుజ మాసం అధికమాసంగా వచ్చినందున 13 నెలలుంటా యి. ఈ సంవత్సరం దైవం భాస్కరుడు. ప్రజలు సూర్యోదయా న్ని, చంద్రోదయాన్ని చూడటం అలవాటు చేసుకోవాలి. ఆదివారం మాంసాహారాన్ని మానితే ఆరోగ్యానికి మేలు. మనో సంకల్పం నెరవేరుతుంది.. కేసీఆర్: కర్కాటకం ఆదాయం–11, వ్యయం–8 రాజపూజ్యం–5, అవమానం–4 గ్రహస్థితి రీత్యా మిశ్రమ ఫలితాలున్నా వ్యక్తిగత జాతకరీత్యా పరిస్థితి అనుకూలంగా మారుతుంది. ప్రస్తుతం రాహు మహాదశ కొనసాగుతోంది. సూర్యుడి స్థితి దాటుతున్నందున మనో సంకల్పం నెరవేరుతుంది. జూలై నుంచి అక్టోబరు వరకు ముఖ్య వ్యవహారాల్లో జాగ్రత్తగా ఉండాలి. భవిష్యత్తు ప్రణాళికలకు అనుకూల సంవత్సరం. గతంలో కంటే అనుకూల ఫలితాలు మోదీ: వృశ్చికం ఆదాయం–5, వ్యయం–5 రాజపూజ్యం–3, అవమానం–3 మిశ్రమ ఫలితాలుంటాయి. అయితే, శని బాగా యోగిస్తున్నాడు. గురువు కొద్దికాలం మాత్రమే యోగించటం, రాహుకేతువులు అనుకూలంగా లేనందున విజయం కోసం కష్టపడాలి. గతేడాది కంటే అనుకూల ఫలితాలు కనిపిస్తాయి. శని మూడో స్థానంలో ఉన్నందున చేపట్టిన పనిలో విజయం సా«ధించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. -
శ్రీ వికారినామ సంవత్సర పంచాగశ్రవణం
-
వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో ఉగాది పంచాంగ శ్రవణం
-
నవయుగాది
స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం ; న్యాయ్యేణ మార్గేణ మహీం మహీశాఃఅందరూ బాగుండాలి. కడుపు నిండా తినాలి. మంచి బట్టలు వేసుకోవాలి. చేతి నిండా పని ఉండాలి. ఆరోగ్యంగా ఉండాలి. పాలకులు నిస్వార్థంగా ఉండాలి. న్యాయంగా పాలించాలి. కష్టంలో ఓదార్చాలి ప్రజాభీష్టాన్ని మన్నించాలి. ఇదే ఉగాది ఆకాంక్ష... మనం ఏ శుభకార్యానికైనా సరే, సంకల్పం చెప్పుకునేటప్పుడు స్వస్తిశ్రీ చాంద్రమానేన.... నామ సంవత్సరే అని చెప్పుకుంటాం. అంటే ఉగాది మనకు అత్యంత కీలకమైన పండుగ అన్నమాట. ఇది చాంద్రమానాన్ని బట్టి అంటే చంద్రుడి గమనానికి అనుగుణంగా గణించే సంవత్సరం అన్నమాట. ఉగాది నుంచి తెలుగు వారికి కొత్త పంచాంగం ప్రారంభమవుతుంది. నిన్నటి వరకు ఉన్న సంవత్సరం విలంబి నామ సంవత్సరం కాగా నేటి నుంచి ‘వికారి’ నామ సంవత్సరంలోకి అడుగు పెడుతున్నాం. ఆరోగ్యాన్నిచ్చే అభ్యంగనం ఉగాది వంటి పర్వదినాలలో నువ్వులనూనెలో లక్ష్మి, జలంలో గంగాదేవి ఉంటారని శాస్త్రోక్తి. ఉగాదినాడు పొద్దున్నే అభ్యంగన స్నానం చేయాలి. అంటే ఒళ్లంతా నువ్వుల నూనె, సున్నిపిండి పట్టించి, కుంకుడురసం లేదా సీకాయపొడితో తలస్నానం చేయాలి. శుభ్రమైన దుస్తులు శుభప్రదం ఈరోజున చిరిగిన, మాసిన లేదా విడిచిన బట్టలు ధరించిన వారికి, తలస్నానం చేయని వారికి సంవత్సరమంతా రకరకాల వ్యాధులు, దారిద్య్రబాధలు సోకుతాయని శాస్త్రోక్తి. కాబట్టి ప్రతి ఒక్కరూ ఉగాదినాడు వీలయితే నూతన వస్త్రాలు లేదా చిరుగులు పడని, శుభ్రంగా ఉతికిన దుస్తులు ధరించడం శ్రేయోదాయకం. తెల్లటి దుస్తులు ధరించడం శుభప్రదÆ . ఉగాది సంప్రదాయం ఈ పర్వదినాన ఉదయమే ఇల్లు అలికి, ముగ్గుపెట్టి లేదా అటకలతో సహా అన్నిగదులలోనూ బూజు దులిపి ఊడ్చి, శుభ్రంగా కడుక్కుని, మామిడి లేదా వివిధ రకాల పుష్పాలతో తోరణాలు కట్టాలి. గడపలకు పసుపు, కుంకుమలు అలంకరించాలి. ఇంటిలో మనం పూజించే ఇష్టదేవతల విగ్రహాలను షోడశోపచారాలతో పూజించి, శుచిగా చేసిన పిండివంటలను, ఉగాది పచ్చడిని నివేదించాలి. పంచాంగం అంటే ... తిథి, వారం, నక్షత్రం, యోగం, కరణం అనే ఐదు భాగాలను కలిపి పంచాంగం అంటారు. తిథి వలన సంపద, నక్షత్రం వల్ల పాపపరిహారం, సరైన యోగంతో వ్యాధి నివృత్తి, కరణం ద్వారా కార్యానుకూలతను పొందవచ్చు. కాబట్టి చేసే పనులలో అనుకూలతను, జయాన్ని కాంక్షించేవారందరూ, కాలాన్ని తెలిసి కర్మలు చేసేవారందరూ తప్పక పంచాంగం చూడాలి. ఆరు రుచులు... అనంతమైన అర్థాలు ఉగాదికి సంకేతంగా చెప్పుకునే ఆరురుచుల కలయికలో అనంతమైన అర్థముంది. ప్రకృతి లేనిదే జీవి లేదు. జీవి లేని ప్రకృతి అసంపూర్ణం. కాబట్టి జీవునికి అంటే... మానవునికి, ప్రకృతికి గల అవినాభావ సంబంధాన్ని గుర్తుచేస్తుంది ఈ పండుగ. సరికొత్త ప్రకృతి అందించే తీపి, పులుపు, ఉప్పు, కారం, వగరు, చేదు రుచుల సమ్మేళనంతో తయారయ్చే ఉగాది పచ్చడి సేవనం ఆరోగ్యదాయకం. జీవితమంటే కేవలం కష్టాలు లేదా సుఖాలే కాదు, అన్ని విధాలైన అనుభవాలూ, అనుభూతులూ ఉంటాయి, ఉండాలి! అలా ఉన్నప్పుడే జీవితానికి అర్థం పరమార్థం. ఈసత్యాన్ని బోధిస్తూనే ఆరోగ్యాన్ని చేకూరుస్తుంది ఉగాది పచ్చడి. శుభారంభానికి ఉగాది బ్రహ్మదేవుడు సృష్టిని ప్రారంభించినదీ, ప్రజానురంజకంగా పాలించిన శ్రీరాముడికి పట్టాభిషేకం జరిగినదీ, వెయ్యేళ్లపాటు రాజ్యపాలన చేసిన విక్రమార్క చక్రవర్తి రాజ్యాన్ని చేపట్టినదీ, శకకారుడైన శాలివాహనుడు కిరీట ధారణ చేసినదీ, కౌరవ సంహారం అనంతరం ధర్మరాజు హస్తిన పీఠాన్నధిష్ఠించిందీ ఉగాదినా డేనని చారిత్రక, పౌరాణిక గ్రంథాలు చెబుతున్నాయి. కాబట్టి నూతనకార్యాలు ప్రారంభించడానికి ఉగాదిని మించిన శుభతరుణం మరొకటి లేదనే కదా అర్థం. వైవిధ్యభరితం ఉగాది పచ్చడిలో కొత్త చింతపండు బదులు నిమ్మరసం, మిరియాలకు మారుగా ఎండుకారం లేదా పచ్చిమిరప వాడుతున్నారు. కొందరు చెరకు ముక్కలు, అరటిపండు ముక్కలు, గసగసాలు, సోంపు... ఇలా ఎవరి అభిరుచి, అలవాటు లేదా ఆచారాన్ని బట్టి ఉగాది పచ్చడి తయారుచేస్తున్నారు. కొన్ని ప్రాంతాలలో దీనిని పచ్చడిలా గట్టిగా చేస్తున్నారు. ఇంకొన్ని ప్రాంతాలలో కొత్తకుండలో పోసి, ఇంటికి వచ్చిన బంధుమిత్రులకు, అతిథులకు ఇవ్వడం ఆనవాయితీ. ఈ రోజున ఉపవాసం ఉండి బ్రహ్మదేవుని పూజించిన వారికి సంవత్సరమంతా సుఖసంతోషాలు లభిస్తాయని శాస్త్రోక్తి. వర్షాలు బాగా కురవాలని కోరుతూ వ్యవయసాయదారులు ఈ వేళ ఇంద్రుణ్ణి పూజించడం కొన్ని ప్రాంతాలలో కనిపించే ఆచారం. పంచాంగ శ్రవణ ఫలమేమిటి? ఉగాదినాటి పంచాంగ శ్రవణం గంగాస్నాన ఫలంతో సమానమట. అదొక్కటే కాదు, పంచాంగ శ్రవణం చేయడం వలన భూమి, బంగారం, ఏనుగులు, గోవులతో కూడిన సర్వలక్షణ లక్షితమైన కన్యను వేదవిదుడైన బ్రాహ్మణునకు లేదా యోగ్యుడైన వరునకు దానం చేస్తే కలిగే ఫలంతో సమానమైన ఫలాన్నిస్తుందని శాస్త్రోక్తి. అంతేకాదు, సంవత్సరానికి అధిపతులైన రాజాది నవనాయకుల గ్రహఫలితాలను శాస్త్రోక్తంగా వినడం గ్రహదోషాలు తొలగి, వినేవారికి ఆరోగ్యాన్ని, యశస్సును, ఆయుష్షునూ వృద్ధి చేసి, సంపదతో కూడిన సకల శుభఫలాలనూ ఇస్తుందట. కాబట్టి ఉగాదినాడు పంచాంగ ఫలాలను తెలుసుకోవడం వల్ల భవిష్యత్ కార్యాచరణను చేపట్టడం సులభం అవుతుందని పెద్దల అనుభవం. – డి.వి.ఆర్. -
లండన్ కాలమాన తెలుగు క్యాలెండర్ ఆవిష్కరణ
లండన్ : లండన్ కాలమాన ప్రకారం గంటల పంచాంగంతో రూపొందించిన మొట్టమొదటి తెలుగు క్యాలెండర్‌ను తెలంగాణ ఎన్నారై ఫోరమ్(టీఈఎన్ఎఫ్) ఆవిష్కరించింది. దాదాపు 2 దశాబ్దాలుగా తెలుగువారు పండుగలు, గృహ ప్రవేశాలు వంటి శుభకార్యాలకు శుభ ఘడియలు, దుర్ముహుర్తాలు సరిగ్గా తెలియక ఎంతో శ్రమ పడేవారు. భారత కాలమాన ప్రకారం చేసుకోవడం లేదా పండితులకు ఫోన్ చేసి అడగడం, ఇలాంటి కష్టాలను దూరం చేయాలనే సంకల్పంతో తెలంగాణ ఎన్నారై ఫోరమ్ ముందడుగు వేసింది. యూకే తెలుగు బ్రాహ్మణ సంఘం సహకారంతో ప్రముఖ సిద్ధాంతి ములుగు రామలింగేశ్వర శర్మ ద్వారా లండన్ కాలమాన ప్రకారం పూర్తి స్థాయిలో తెలుగు పంచాంగ క్యాలెండర్ ను తయారు చేశారు. లండన్ ఎంపీ వీరేంద్ర శర్మ చేతలు మీదుగా ఈ కాలెండర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎంపీ వీరేంద్ర శర్మ మాట్లాడుతూ.. ఇంతటి గొప్ప కార్యక్రమం లో భాగస్వామ్యం అయినందుకు సంతోషంగా ఉందన్నారు. భారతీయ సంస్కృతి, సంప్రదాయాలు యావత్ ప్రపంచానికి ఆదర్శమని కొనియాడారు. తెలంగాణ ఎన్నారై ఫోరమ్ అధ్యక్షులు ప్రమోద్ అంతటి మాట్లాడుతూ.. యూకే కాలమాన ప్రకారం క్యాలండర్ తీసుకురావడంలో సంస్థ ఫౌండర్ చైర్మన్ గంప వేణుగోపాల్ ఎంతో శ్రమించారని కొనియాడారు. ఈ కాలెండర్ ప్రచురణలో సహకరించిన స్పాన్సర్లకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని, సంస్కృతి ప్రచారంలో భాగంగా సహకారంతో ఉచితంగా పంపిణి చేస్తున్నట్లు తెలిపారు. ఈ ఆవిష్కరణ కార్యక్రమంలో గంప వేణుగోపాల్, ప్రమోద్ అంతటి, రంగు వెంకట్, కూర రవికుమార్, రాజు కొయ్యడ , మీనాక్షి అంతటి, గంప జయశ్రీలు పాల్గొన్నారు. -
పంచాంగం సైన్సే
సాక్షి, హైదరాబాద్ : ‘‘దైవారాధన, పెద్దలు చెప్పిన మంచి విషయాలను అనుసరిస్తూ నిరంతరం మానవ ప్రయత్నం కొనసాగిస్తూ ముందుకు సాగాలి. ఇందుకు సంబంధించిన వివరాలు చెప్పే పంచాంగం.. జాతకం చెప్పటం లాంటిది కాదు. అది కచ్చితంగా సైన్స్..’’అని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు స్పష్టంచేశారు. ‘‘గ్రహాల గతి, గమనం, గ్రహణాల తీరు, వాటి వల్ల వచ్చే కాస్మిక్ ప్రభావంపై కచ్చితమైన సమాచారం ఉంటుంది. 50 ఏళ్ల తర్వాత వచ్చే గ్రహణాల పట్టు విడుపులపై ఘడియ, విఘడియలతో సహా కచ్చితమైన సమయాలను చెప్తుంది.టెలీస్కోప్ లాంటివి లేని సమయంలో కూడా ఈ కచ్చితత్వం వచ్చేలా మనకు అందించిన గొప్ప సనాతన పద్ధతి. అద్భుత శాస్త్ర పరిజ్ఞాన శక్తి పంచాంగ రచన’’అని కొనియాడారు. ఉగాది పండుగ రోజు స్వీకరించే పచ్చడిని తినే పదార్థంగా కాకుండా జీవిత పరమార్థంగా పరిగణించాలని, జీవితం ఒకే రకంగా ఉండదని, కొంచెం సుఖం, కొంచెం కష్టం, కొంత సంతోషం, కొంత దుఃఖం ఉంటుందని పేర్కొన్నారు. ఆదివారం ఉద యం ప్రగతి భవన్లో విళంబినామ సంవత్సర ఉగాది వేడుకలను ప్రభుత్వం తరఫున ఘనంగా నిర్వహించారు. ఇందులో శృంగేరి ఆస్థాన పండితులు బాచంపల్లి సంతోష్‌కుమార్ శాస్త్రి పంచాంగ పఠనం అనంతరం ముఖ్యమంత్రి ప్రసంగించారు. తెలంగాణ సిద్ధించిన తర్వాత అమలు చేస్తున్న పథకాలు దేశవ్యాప్తంగా ప్రశంసలు అందుకుంటున్నాయన్నారు. ఉద్యమ సమయంలో చెప్పిన మాటలు నూటికి నూరుపాళ్లు నిజమవుతున్నాయని చెప్పారు. తెలంగాణ గొప్ప దేవ భూమి అని, ఇక్కడ ఆలయాలు, చర్చిలు, మసీదుల్లో నిరంతరం ఆధ్యాత్మికత వెల్లివిరుస్తుందన్నారు. అర్చకులు, ఇమామ్‌లు, మౌజన్లకు వేతనాలిచ్చే పద్ధతి తెలంగాణలో తప్ప దేశంలో మరెక్కడా లేదని తెలిపారు. అన్ని వర్గాలను సమదృష్టితో ఆదరించే సంస్కారం తెలంగాణలో ఉందని, ఈరోజు ఉదయమే ఓ పెద్ద మనిషి తనతో అన్నట్టు పేర్కొన్నారు. చిరునవ్వులతో బతికే తెలంగాణ పరిఢవిల్లాలని, ప్రవర్ధమా నం కావాలని, అందుకు దేవుడు పంపిన కార్య కర్తల్లా అంతా కలసి కృషి చేయాలన్నారు. కచ్చితంగా మిగులు రాష్ట్రమే ‘‘భావి తెలంగాణపై ఉద్యమ సమయంలో ఎన్నో ఆకాంక్షించాం, ఆశించాం, వాదించాం. రాష్ట్రంగా అవతరించిన తర్వాత ఇప్పుడు రాష్ట్రం ఆ దిశగా ముందుకు సాగుతున్న నిజం కళ్ల ముందు కదలాడుతుంటే అంతకంటే సంతోషం ఏముంటుంది? స్వయం సమృద్ధంగా ఉంటూ కొన్ని రాష్ట్రాలకు సహాయ హస్తం కూడా అందిస్తున్నాం’’ అని సీఎం అన్నారు. సొంతంగా అభివృద్ధి చెందుతూ జాతి నిర్మాణంలో కీలక పాత్ర పోషిస్తున్నామని, ఇలాంటి రాష్ట్రాలు ఏడెనిమిదే ఉన్నాయని, అందులో తెలంగాణ కీలకమైందని చెప్పారు. ‘‘కేంద్రానికి మనం రూ.50 వేల కోట్ల వరకు ఇస్తాం. తిరిగి మనకు వచ్చేది రూ.24 వేల కోట్ల లోపే ఉంటుంది. ఇదే విషయాన్ని ఓ సందర్భంలో ప్రధానితో కూడా చెప్పా. ఇప్పుడు విళంబినామ సంవత్సర పంచాంగం కూడా ఇదే చెప్తోంది. కచ్చితంగా తెలంగాణ మిగులు రాష్ట్రమే. ఈ విషయం మళ్లీ రుజువైంది’’అని అన్నారు. రాష్ట్రానికి ఏం ఢోకా లేదని, కచ్చితంగా మిగులు రాష్ట్రంగానే పురోగమిస్తుందని పేర్కొన్నారు. ప్రజల్లో ఉంటే వాటంతట అవే టికెట్లు నేతలెవరైనా హైదరాబాద్‌లో ఉండకుండా ప్రజల్లో ఉంటే టికెట్లు వాటంతట అవే వస్తాయని సీఎం అన్నారు. పోలీసు, ఆరోగ్య శాఖ తీరు బాగుంటుందని పంచాంగ పఠనంలో చెప్పటంతో మంత్రులు నాయిని, లక్ష్మారెడ్డి, డీజీపీ మహేందర్‌రెడ్డి సంతోషంగా కనిపిస్తున్నారన్నారు. ‘‘ఎవరినీ కొట్టే పరిస్థితి ఉండదు. ఎవరినీ పట్టుకునే పరిస్థితి ఉండదు, దుర్మార్గుల ప్రకోపం తగ్గుతుందని చెప్పటం సంతోషం’’అని పేర్కొన్నారు. ‘‘తెలంగాణ రాశి నా రాశి కర్కాటకనే. నా సంగతి పక్కన పెడితే విళంబినామ సంవత్సరంలో ఈ రాశి ఆదాయం 8, వ్యయం 2, రాజపూజ్యం 7, అవమానం 3గా పంచాంగం చెబుతోంది. మిగులు రాష్ట్రానికి ఇది శుభసూచకమే. ఏతావాతా ఈ రాష్ట్రం వెలుగుజిలుగులు, సిరిసంపదలతో తులతూగుతుందని పంచాంగం చెప్పడం సంతోషం’’అని అన్నారు. ప్రసంగం చివర్లో సీఎం జై తెలంగాణ.. జై భారత్ అంటూ నినదించారు. -
ఉగాది రాశి
-
మలుగు వారి పంచాంగ శ్రవణం
-
పంచాంగం ఆవిష్కరించిన వైఎస్ జగన్
విజయవాడ : ఉగాది సందర్భంగా గుంటూరు బ్రాహ్మణ సంఘం ఆద్వర్యంలో రూపొందించిన నూతన తెలుగు పంచాంగంను వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆవిష్కరించారు. విజయవాడ ఆర్ అండ్ బి అతిథి గృహం వద్ద మంగళవారం ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా వేదపండితులు సంపెంగ మాలను జగన్ కు అందించి, వేదాశీర్వాదం ఇచ్చారు. అనంతరం సుమతీ శతకంతో కూడిన రజత ఫలకాన్ని జగన్‌కు అందచేశారు. నూతన తెలుగు సంవత్సరంలో జగన్ సేవలు ప్రజలకు మరింత చేరువకావాలని పండితులు ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో బ్రాహ్మణ సంఘం అధ్యక్షుడు పాశావజ్జుల పురుషోత్తమ శర్మ, యేలేశ్వరపు జగన్మోహన్ రాజు తదితరులు పాల్గొన్నారు. -
ఇదొక పంచాంగ శ్రవణం
అక్షర తూణీరం మన రైతు గొప్ప నష్ట జాతకుడు. రైతుని నిర్లక్ష్యం చేయ బట్టే గ్రామాలు పాడుబడ్డాయ్. ఆవుని, ఎద్దునీ మన పిల్లలు ఇక జంతు ప్రదర్శనశాలలో చూడాల్సిందే. ఉభయ తెలుగు రాష్ట్రాల్లోనూ వార్షిక బడ్జెట్ సమర్పించే మహత్తర కార్యక్రమం విజయవంతంగా ముగిసింది. అసలీ బడ్జెట్ సమర్పణకి ఇంత దృశ్యం ఎందుకు క్రియేట్ చేస్తారో తెలియదు. ఆర్థికమంత్రి ఆరోజు అభ్యంగన స్నానం చేసి, లెఖ్ఖా జమల బుల్లిపెట్టెతో సభకి రావడం ఒక ఆచారం. ఏదో పరమ రహస్యాలు ఆ ‘కవిలెకట్టలో’ ఉన్నట్టు దృశ్య నిర్మాణం జరుగుతుంది. అప్పుడప్పుడు బడ్జెట్ లీక్ అయ్యిందని గొడవ పడుతుంటారు కూడా! అసలందులో లీకవడానికి ఏమి రహస్యం ఉందని? ‘‘గడచిన యాభై ఏళ్ల బడ్జెట్ పద్దులో చూస్తే, వచ్చే ఏడాదికి మనం కూడా ఆ మాత్రం లెక్కలు సమర్పించగలం’’ అన్నాడొక యువ పాత్రికేయుడు. పైగా చెప్పిన పద్దుల ప్రకారం పనులు జరుగుతా యని నమ్మకం లేదు. చాలాసార్లు కేటాయించిన నిధులు ఖర్చుకాక మురిగిపోతూ ఉంటాయి. ప్రత్యేక శాఖలు, వాటికి మంత్రులు, బోలెడుమంది సెక్రటరీలు, కింది సెక్రటరీలు, కార్యాలయాలు– ఇవన్నీ ప్రజాధనంతో నడుస్తూ ఉంటాయి. నిధులు సద్వినియోగం చేయడానికి ప్రభుత్వానికి ఏమి అడ్డుపడతాయో తెలియదు. బడ్జెట్ రాగానే, పరమాద్భుతం.. ఇది పేదల బడ్జెట్, స్వాతంత్య్రం వచ్చాక ఇంత గొప్ప బడ్జెట్ రాలేదని ముఖ్యమంత్రి తెగ మురిసిపోతూ స్టేట్మెంట్ ఇస్తారు. బడ్జెట్ పద్దులు వినిపించేవేళ, ముఖ్యమంత్రి ఏమీ ఎరగ నట్టు, కొత్తగా వింటున్నట్టూ నటిస్తూ ఆర్థికమంత్రి పనిత నానికి ఆశ్చర్యపోవడం చూడముచ్చటగా ఉంటుంది. నిజానికి అందరూ కలిసే కదా ఈ అంకెల గారడీని చేసేది. అపోజీషన్ బెంచీలు అనాదిగా వినిపిస్తున్న పాత పాటే వినిపిస్తాయి. అసలు అందుకే తలపండిన వారేమంటారంటే– ఉగాది పంచాంగ శ్రవణానికి దీనికీ ఏం తేడా లేదు. పంచాంగంలో సంవత్సర ఫలితాలు ఉన్నట్టుగా జరగాలని ఎక్కడా లేదు. కందాయ ఫలాలు చీకట్లో రాళ్ల వంటివి. గురితప్పి ఒకటో అరో తగిల్తే, అది గణికుని దివ్యదృష్టిగా భావిస్తారు. ఈ మధ్యనే మన అత్యున్నత న్యాయస్థానం రైతుల ఆత్మహత్యలపై తీవ్రంగా స్పందించింది. వ్యవసాయ రంగంపై ఏ ప్రభుత్వాలకూ శ్రద్ధ లేదు. ‘మేక్ ఇన్ ఇండియా’ అంటూ స్లో–గన్స్ పేల్చే మోదీ సైతం గడచిన మూడు ఏరువాకల్లో రైతుకి చేసిందేమీ లేదు. చంద్రబాబుకి మొదట్నుంచీ వ్యవసాయంపై నిశ్చితాభిప్రా యాలున్నాయి. రాష్ట్ర విభజన తర్వాత చంద్రబాబు ప్రభుత్వం తీవ్రంగా శ్రమి స్తోంది భూసేకరణ కోసమే. క్యాపిటల్‌కి అరలక్ష ఎకరాలను ఎడారిగా మార్చారు. సముద్ర తీరాలన్నింటినీ కైంకర్యం చేసే ప్రయత్నంలో ఉన్నారు. నౌకాశ్రయాలు, విమానాశ్రయాలు కొన్ని లక్షల ఎకరాలను స్వాధీనం చేసుకోనున్నాయి. ప్రభుత్వా నికి హుటాహుటి ఫలించే పథకాలు కావాలి. సద్యోగర్భాలు మాత్రమే కావాలి. మన రైతు గొప్ప నష్ట జాతకుడు. పండితే ధర ఉండదు. లేదా ప్రకృతి తిరగబడు తుంది. నకిలీ విత్తనాలను ప్రభుత్వం అరికట్టలేకపోతోంది. రైతుని నిర్లక్ష్యం చేయ బట్టే గ్రామాలు పాడుబడ్డాయ్. ఆవుని, ఎద్దునీ మన పిల్లలు ఇక జంతు ప్రదర్శనశా లలో చూడాల్సిందే. గతంలో చంద్రబాబు ఏలికలో, రైతుల ఆత్మహత్యలని ‘మాస్ హిస్టీరియా’గా అభివర్ణించి అభాసుపాలైనారు. రైతు రుణమాఫీ వాగ్దానం ఎండ మావిలా చిక్కకుండా పరుగులు పెడుతోంది. సేద్యం చేస్తే ఏడాదికిగానీ ఫలితం తెలియదు. అసలు తెలుగుదేశం పుటకే కిలో రెండు రూపాయల బ్రహ్మాస్త్రంతో పుట్టింది. తర్వాత తెలుగుదేశం ప్రభుత్వం సారాయి అంగళ్ల మీద బతుకుతోంది. - శ్రీరమణ (వ్యాసకర్త ప్రముఖ కథకుడు) -
ఎవరి పంచాంగం వారిదే!
అక్షర తూణీరం అన్నీ ఉన్నట్టే పార్టీలకీ, నేతలకీ సొంత పంచాంగాలుంటాయి. పంచాంగవేత్తలు వేదికని బట్టి కందాయ ఫలాలని శ్రవణానందం చేస్తారు. అవి విని ఆనందించి ముగ్ధులైపోతారు. ఆ ఫలితాల స్క్రిప్ట్ మనం రాయించుకున్నదేనని మర్చిపోయి నాయక బృందం ఆనంద పారవశ్యంలో మునిగిపోతుంది. ఆత్మలోకంలో దివాలా! మన్మథ వేదిక దిగి చివరి మెట్టుపై నిలబడి ఉంది. దుర్ముఖి రంగ ప్రవేశం చేయడానికి పారాణి దిద్దుకుంటోంది. ఉగాది కోసం కొత్తచిగుళ్ల స్వాగత తోరణాలు, పూలు, బుక్కాలు సిద్ధంగా ఉన్నాయి. కోయిలలు వసంతగోష్టి కోసం గుట్టుగా రిహార్సల్స్ చేసుకుంటున్నాయి. పచ్చని చెట్టుకొమ్మలు కానరాక కరెంటు స్తంభాలను, సెల్టవర్స్ని ఆశ్రయిస్తున్నాయి. షడ్రుచుల ప్రసాదం దినుసులన్నీ కార్బైడ్ నిగారింపులతో నిలబడి ఉన్నాయి. మన్మథ మిగిల్చి వెళ్లిన మధుర జ్ఞాపకాలేవీ జుట్టు పీక్కున్నా గుర్తు రావడం లేదు. ఎటొచ్చీ గోదావరి పుష్కరాలు గొప్ప ఈవెంట్. ఇది మా ఘనతేనని చెప్పుకుంటే చేయగలిగిందేమీ లేదు. మనది చాంద్రమాన సంవత్సరాది. ఔను, రెండు తెలుగు రాష్ట్రాలకీ చంద్రమానమే వర్తిస్తుంది. చచ్చు శ్లేషలు ఇలాగే అఘోరిస్తాయి. మన్మథ మాటల సంవత్సరంగా కాలక్షేపం చేసి వెళ్లిపోయింది. పశువులకు మేతలు లేవు, సరికదా కడుపు నిండా నీళ్లు కూడా లేని దుస్థితి. మరో వైపు రాబోయే మిగులు జలాలపై గంటలకొద్దీ ముచ్చట్లు. ఏడాది పైగా అమరావతి వైభవాలు వినీ వినీ చెవులు దిబ్బెళ్లెత్తాయి. వేరే సరుకు లేనందున దుర్ముఖి కూడా గొప్పలే వినిపిస్తుంది. మనకు వినక తప్పదు. కొత్త క్యాపిటల్ మిగతా హంగులేవీ అమర్లేదు గాని పేరు మాత్రం జనం నోళ్లల్లో నానిపోతోంది. వెనకటికి ఓ మొగుడు గారెలు వండమని పెళ్లాన్ని ఆదేశించాడు. ఆవిడ వేలొక్కటి చూపి, మగడా, గారెలకు చిల్లు పెట్టడానికి ఈ వేలు మాత్రమే ఉంది. మిగతా దినుసులేవీ కొంపలో లేవని చెప్పిందట. వేలు కాదుగానీ వేల ఎకరాలు సేకరించి, విదేశీ కంపెనీలకు గాలం వేసి కూచున్నారు. యాభైవేల ఎకరాల సుక్షేత్రాలు పచ్చదనాన్నీ, మట్టి వాసననీ కోల్పోయాయి. ఆవులు మేసే గడ్డిపై బుల్డోజర్లు పొగలు కక్కుతున్నాయి. తమలపాకు తోటలని ఉక్కుపాదాలు కర్కశంగా తొక్కేయగా ఆ నేలంతా ఎర్రబారింది. అవిశి పువ్వులు ఇక కనిపించవు. గోరువంకల కువకువలు, గువ్వపిట్టల రిక్కలు ఇక వినిపించవు. లక్ష అరకలకు శాశ్వతంగా సెలవిచ్చి పుణ్యం కట్టుకున్నారు. సహజ ప్రకృతినీ, పంట పొలాలనీ సమాధి చేసి ఆకాశహర్మ్యాలకు పునాదులు వేస్తున్నారు. అవినీతి సాంద్రత తగ్గిన దాఖలాలు లేవు. ఆశ్రీత కులపక్షపాతాలు గుర్రపుడెక్కలా ఏపుగా విస్తరిస్తున్నాయి. స్వపరాగ, పరపరాగ సంపర్కాలతో అవకాశమున్న అన్ని వర్గాలు కరెన్సీని పండించుకుంటున్నాయి. నేతలకిప్పుడు సొంత మీడియా హౌసులున్నాయి. నేతల కోతలక్కడ పదే పదే ప్రతిధ్వనిస్తాయి. ఆకలితో వస్తున్న కడుపు నొప్పులకు అపెండిసైటిస్ ఆపరేషన్లు చేస్తున్నారు అధ్యక్షా! సొంత మీడియాతో బాటు, ఒక సొంత స్వామి నేతలకు బులెట్ ప్రూఫ్ వాహనంలా తప్పనిసరి అయింది. స్వచ్ఛభారత్ నినాదాన్ని లౌక్యంగా గాంధీతాత కళ్లజోడులోంచి చూపిస్తూ పెద్దాయన ఏడాది గడిపేశారు. స్వచ్ఛభారత్లోకి ఆ చెత్త నోట్లు దేనికని స్విస్ ఖాతాలు తెరవేలేదంటున్నారు. మిషన్ కాకతీయ కాదు, ‘కమీషన్ కాకతీయ’ అంటూ ప్రతిపక్షాలు చమత్కరిస్తున్నాయి. కొయ్యగుర్రం మీద ఊగుతూ ఆ విధంగా ముందుకు పోతావున్నామని రెండేళ్లుగా జనాన్ని నమ్మించే ప్రయత్నంలో ఉన్నారు చంద్రన్న. అన్నీ ఉన్నట్టే పార్టీలకీ, నేతలకీ సొంత పంచాంగాలుంటాయి. పంచాంగవేత్తలు వేదికని బట్టి కందాయ ఫలాలని శ్రవణానందం చేస్తారు. అవి విని ఆనందించి ముగ్ధులైపోతారు. ఆ ఫలితాల స్క్రిప్ట్ మనం రాయించుకున్నదేనని మర్చిపోయి నాయక బృందం ఆనంద పారవశ్యంలో మునిగిపోతుంది. ఆత్మలోకంలో దివాలా! (వ్యాసకర్త ప్రముఖ కథకుడు) శ్రీరమణ -
పంచాంగ శ్రవణంతో సకల శుభాలు
-
శ్రీ జయ నామ సంవత్సర రాశిఫలాలు
మేషం (ఆదాయం - 14, వ్యయం - 2, రాజపూజ్యం - 4, అవమానం - 5.) వీరికి జూన్ 19 నుంచి చతుర్ధంలో గురుడు ఉచ్ఛస్థితి సంచారం అన్ని విధాలా ఉపకరిస్తుంది. ప్రథమార్థంలో సామాన్యంగా ఉన్నా, క్రమేపీ పరిస్థితులు కొంత చక్కబడతాయి. నవంబర్ నుంచి అష్టమ శని ప్రారంభం. సప్తమ, అష్టమ రాశుల్లో శని సంచారం అంత అనుకూలం కాదు. మొత్తం మీద వీరికి మధ్యస్థంగా ఉంటుంది. కుటుంబ, ఆరోగ్య సమస్యలు కొంత చికాకు పరుస్తాయి. రావలసిన సొమ్ము ఆలస్యం కాగలదు. ఎంతగా శ్రమించినా తగిన గుర్తింపు రాక నిరాశ చెందుతారు. ఇతరులకు హామీల విషయంలో ఆచితూచి వ్యవహరించాలి. తొందరపాటు నిర్ణయాలు కాకుండా నిదానం పాటించడం సర్వదా శ్రేయస్కరం. జీవిత భాగస్వామితో వివాదాలు నెలకొంటాయి. తలచిన పనులు కొంత నెమ్మదిస్తాయి. అయితే జూలై నుంచి గురుని అనుకూలత వల్ల ఆర్థికంగా, సామాజికంగా ఉత్సాహవంతంగా ఉంటుంది. శ్రేయోభిలాషులు అన్నివిధాలా సహకరిస్తారు. ఎంతోకాలంగా వేధిస్తున్న ఒక సమస్య నుంచి బయటపడే అవకాశం. ద్వితీయార్థంలో వాహన, గృహయోగాలు. వ్యాపార సంస్థల వారికి సామాన్య లాభాలు దక్కుతాయి. ఉద్యోగులు విధుల్లో కొంత అప్రమత్తత పాటించాలి. ద్వితీయార్థంలో పదోన్నతులతో పాటు బదిలీలు ఉండవచ్చు. పారిశ్రామికరంగం వారికి కొంత ఉపశమనం లభిస్తుంది. వ్యవసాయదారులకు రెండవ పంట అనుకూలం. కళాకారులు, క్రీడాకారులకు అవకాశాలు దక్కినా అసంతృప్తి తప్పదు. రాజకీయవర్గాలకు మొదట్లో కొంత వ్యతిరేకత ఎదురైనా ద్వితీయార్థంలో పదవులు, సన్మానాలు. విద్యార్థులు శ్రమానంతరం ఫలితం పొందుతారు. తరచూ దూరప్రయాణాలు ఉండవచ్చు. సెప్టెంబర్, అక్టోబర్ మధ్య కుజుడు, నవంబర్ నుంచి శని అష్టమస్థితి కారణంగా వ్యవహారాలలో చిక్కులు. వ్యయప్రయాసలు. చర్మ, నరాల సంబంధిత రుగ్మతలు బాధించవచ్చు. వైద్య సలహాలు స్వీకరిస్తారు. ఈ కాలంలో స్థానచలనాలు కలిగే అవకాశం. జ్యేష్ఠం, శ్రావణం, మార్గశిరం, మాఘ మాసాలు అనుకూలం. వీరు సుబ్రహ్మణ్యాష్టకం పఠించడంతో పాటు, శనికి తైలాభిషేకం చేయించుకోవాలి. అదృష్ట సంఖ్య-9. వృషభం (ఆదాయం - 8, వ్యయం - 11, రాజపూజ్యం - 7, అవమానం -5.) వీరికి ప్రథమార్ధంలో గురు, శని, రాహువుల అనుకూల స్థితి ఉపకరిస్తుంది. వ్యయంలో కేతువు వల్ల మానసిక క్లేశాలు, వ్యయప్రయాసలు. ద్వితీయార్థంలో గురుడు తృతీయ రాశిలో సంచారం కలిగినా శుభస్థితి వల్ల మధ్యస్థంగా ఉంటుంది. జూలై నుంచి పంచమ రాహువు, లాభస్థితిలో కేతువు అన్ని విధాలా అనుకూలురు. ఈ రీత్యా చూస్తే వీరికి ప్రథమార్థంలో రాబడి బాగుంటుంది. దీర్ఘకాలిక రుణబాధలు తొలగుతాయి. ఆప్తులు, బంధువులు చేరువ కాగలరు. ఇతరులకు సలహాలు ఇవ్వడంలో చొరవ చూపుతారు. కొన్ని వివాదాల పరిష్కారంలో మధ్యవర్తిత్వం వహిస్తారు. అయితే తొందరపాటు మాటల కారణంగా ఇంటాబయటా వివాదాలు నెలకొనే అవకాశముంది, ఆచితూచి వ్యవహరించండి. గృహ నిర్మాణాలు, శుభకార్యాల నిర్వహణలో నిమగ్నమవుతారు. చేపట్టిన కార్యక్రమాలు దిగ్విజయంగా సాగుతాయి. తరచూ తీర్థయాత్రలు చేస్తారు. భూసంబంధిత వివాదాలు తీరి లబ్ధి పొందుతారు. ఆశయాల సాధన దిశగా ముందడుగు వేస్తారు. నిరుద్యోగులకు శుభవార్తలు. వ్యాపారులు అనుకున్న లాభాలు పొందుతారు. కొత్త పెట్టుబడులతో ఉత్సాహంగా సాగుతారు. ఉద్యోగస్తులకు పెండింగ్ బకాయిలు అందుతాయి. విధుల్లో ప్రశంసలు అందుతాయి. పారిశ్రామిక, వైద్యరంగాల వారికి మంచి గుర్తింపు రాగలదు. విద్యార్థుల కృషి ఫలిస్తుంది. కళాకారులు నైపుణ్యాన్ని చాటుకుని ముందుకు సాగుతారు. రాజకీయవర్గాల వారు కొత్త పదవులు చేపట్టే వీలుంది. ప్రజాదరణ పొందుతారు. వ్యవసాయదారులకు మొదటి పంట లాభదాయకం. సాంకేతిక వర్గాలవారికి గతం కంటే మెరుగ్గా ఉంటుంది. కొందరికి విదేశీయానం కూడా ఉండవచ్చు. అక్టోబర్ - నవంబర్ మధ్య అష్టమ కుజుడు, నవంబర్ నుంచి సప్తమ శని ప్రభావం వల్ల కొంత చికాకులు తప్పకపోవచ్చు. నరాలు, ఉదర సంబంధిత రుగ్మతలు బాధిస్తాయి. ఈ గ్రహాలకు పరిహారాలు చేయించుకుంటే మంచిది. ఆదిత్య హృదయం పఠించండి. ఆషాఢం, భాద్రపదం, పుష్యం, ఫాల్గుణ మాసాలు అనుకూలం. అదృష్ట సంఖ్య-6. మిథునం (ఆదాయం - 11, వ్యయం - 8, రాజపూజ్యం - 3, అవమానం - 1.) వీరికి జూన్ నుంచి గురుబలం విశేషం. ప్రథమార్థంలో శని, రాహుకేతువులు అనుకూలురు. జూలై నుంచి అర్థాష్టమ రాహువు ప్రభావం కలిగినా గురుబలం ఉపకరిస్తుంది. మొత్తం మీద వీరికి ద్వితీయార్థం అనుకూల కాలమని చెప్పాలి. స్వతంత్రభావాలు, నిర్ణయాల వల్ల కొన్ని చిక్కులు ఎదురైనా ఆత్మస్థైర్యంతో అధిగమిస్తారు. ఇతరుల అభిప్రాయాలను అంతగా పట్టించుకోకపోవడం వల్ల ఒక్కొక్కప్పుడు సమస్యలు ఎదురయ్యే అవకాశం. పనులు అనుకున్న విధంగా పూర్తి చేస్తారు. జీవిత భాగస్వామితో వివాదాలు సర్దుబాటు కాగలవు. స్థిరాస్తి విషయంలో నెలకొన్న వివాదాలు జూన్ తర్వాత పరిష్కారం. ఇంటి నిర్మాణయత్నాలు కార్యరూపం దాలుస్తాయి. ఇంటిలో శుభకార్యాలు నిర్వహిస్తారు. రాబడి ఆశాజనకంగా ఉంటుంది. కొన్ని రుణాలు సైతం తీరుస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలు, విలాసవంత జీవనానికి డబ్బు ఖర్చు చేస్తారు. వ్యాపారాలు క్రమేపీ పుంజుకుంటాయి. లాభాలదిశగా సాగుతాయి. ఉద్యోగస్తులకు ప్రమోషన్ అవకాశాలు. పారిశ్రామిక, సాంకేతికవర్గాలకు ఊహించని అవకాశాలు దక్కవచ్చు. శాస్త్ర, పరిశోధనారంగాల వారికి మంచి గుర్తింపు. విద్యార్థులు అనుకున్న ర్యాంకులు సాధిస్తారు. కళాకారులు చేజారిన అవకాశాలు సైతం తిరిగి దక్కించుకుని విజయాలు సాధిస్తారు. రాజకీయవేత్తలకు శుభసూచకాలే. పదవులు అప్రయత్నంగా దక్కుతాయి. వ్యవసాయదారులకు రెండు పంటలూ అనుకూలం. నవంబర్ - జనవరి మధ్య కుజుని అష్టమస్థితి సంచారం వల్ల ఈతిబాధలు, మానసిక అశాంతి. ఆరోగ్య సమస్యలు ఎదురుకావచ్చు. అయితే మకరరాశి కుజునికి ఉచ్ఛస్థితి కావడం వల్ల కొంత ఉపశమనం కలుగుతుంది. దుర్గాదేవికి కుంకుమార్చనలు, సుబ్రహ్మణ్యారాధన మంచిది. చైత్రం, శ్రావణం, ఆశ్వయుజం, మాఘమాసాలు అనుకూలం. అదృష్ట సంఖ్య-5. కర్కాటకం (ఆదాయం - 5, వ్యయం - 8, రాజపూజ్యం - 6, అవమానం - 1.) వీరికి జూన్ నుంచి గురుడు స్వక్షేత్ర సంచారమైనా ఉచ్ఛస్థితి వల్ల కొంత అనుకూలం. జూలై నుంచి అర్థాష్టమ రాహువు, నవంబర్ 1 వరకు అర్థాష్టమ శని ప్రభావం అధికం. మొత్తం మీద వీరికి ఆదాయానికి లోటు లేకున్నా వృథా ఖర్చులు ఎదురవుతుంటాయి. ఇంటాబయటా ఒత్తిళ్లు ఎదుర్కొంటారు. మంచికి వెళ్లినా అపవాదులు భరించాల్సిన పరిస్థితి. కార్యక్రమాలు నెమ్మదిగా సాగుతాయి. తరచూ ప్రయాణాలు ఉంటాయి. ద్వితీయార్థంలో శుభకార్యాల రీత్యా ఖర్చులు పెరుగుతాయి. గృహ నిర్మాణ యత్నాలు నవంబర్ నుంచి అనుకూలిస్తాయి. పట్టుదల, ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగితే కొన్ని విజయాలు సాధించే వీలుంది. దూరమైన బంధువులు తిరిగి దగ్గరకు చేరతారు. కొన్ని వివాదాల నుంచి ఎట్టకేలకు బయటపడే వీలుంది. అయితే, శని, రాహువుల ప్రభావంతో పాటు, జూలై -సెప్టెంబర్ మధ్య కుజుని అర్ధాష్టమ స్థితి వల్ల కుటుంబ సమస్యలు తప్పకపోవచ్చు. ఆర్థికంగా ఇబ్బందులు కలిగినా అవసరాలకు డబ్బు అందడం విశేషం. జనవరి - ఫిబ్రవరి మధ్య అష్టమ కుజుని ప్రభావం వల్ల చర్మ, ఉదర సంబంధిత రుగ్మత లు, తద్వారా ఔషధసేవనం. వ్యాపారులు స్వల్పలాభాలతో సరిపెట్టుకోవాలి. ఉద్యోగులు పైస్థాయి నుంచి ఒత్తిళ్లులు ఎదురైనా సమర్థతను చాటుకుంటారు. విద్యార్థులు అనుకున్న ఫలితాల కోసం మరింతగా శ్రమించాలి. వ్యవసాయదారులకు రెండవపంట అనుకూలం. పారిశ్రామిక, సాంకేతికరంగాల వారికి మిశ్రమ ఫలితాలు ఉంటాయి. కళాకారులు నైపుణ్యాన్ని చూపినా తగిన గుర్తింపు రావడం కష్టమే. రాజకీయవర్గాల వారు ద్వితీయార్థంలో కొంత అనుకూల ఫలితాలు సాధిస్తారు. వైశాఖం, భాద్రపదం, కార్తీకం, ఫాల్గుణమాసాలు అనుకూలం. శని, గురు, రాహువు, కుజులకు పరిహారాలు చేయించుకుంటే మంచిది. అదృష్ట సంఖ్య-2. సింహం (ఆదాయం - 8, వ్యయం - 2, రాజపూజ్యం - 2, అవమానం - 4.) వీరికి జూన్ వరకూ గురుడు యోగదాయకుడు. తదుపరి వ్యయస్థితి కలిగినా ఉచ్ఛస్థితి వల్ల శుభకార్యాల నిర్వహణకు ఖర్చు చేయాల్సివస్తుంది. జూలై వరకు రాహువు, నవంబర్ వరకూ శని యోగదాయకులు. మొత్తం మీద వీరికి మిశ్రమ ఫలితాలుఉంటాయి. ఆర్థిక లావాదేవీలు అనుకూలమే. దీర్ఘకాలిక రుణబాధలు తొలగుతాయి. స్థిరాస్తి వివాదాలు, కోర్టు వ్యవహారాలు సానుకూలంగా పరిష్కారం. గృహ నిర్మాణం, వాహనాల కొనుగోలు యత్నాలు ఫలిస్తాయి. ఆశయాల సాధనలో ముందడుగు వేస్తారు. మీ ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. తండ్రి తరఫు నుంచి ఆస్తి లేదా ధనలాభ సూచనలు. జీవిత భాగస్వామి సలహాల ద్వారా కొన్ని వ్యవహారాలు పూర్తి చేస్తారు. సంఘంలో గౌరవప్రతిష్ఠలకు లోటు ఉండదు. ద్వితీయార్థం నుంచి గురుబలం తగ్గడం వల్ల కార్యక్రమాలపై మరింత శ్రద్ధ చూపాలి. అనవసర వివాదాలకు దూరంగా ఉండడం మంచిది. వ్యాపారులకు కొత్త పెట్టుబడులు సమకూరతాయి. లాభాలు ఆశించిన విధంగా ఉంటాయి. ఉద్యోగస్తులు పదోన్నతులతో కూడిన బదిలీలు పొందుతారు. కళాకారులకు ఊహించని అవకాశాలు దగ్గరకు వస్తాయి. అవార్డులు సైతం దక్కవచ్చు. విద్యార్థుల శ్రమ వృథా కాదు. మంచి ఫలితాలు సాధిస్తారు. వ్యవసాయదారులకు రెండు పంటలూ లాభిస్తాయి. పారిశ్రామిక, వైద్యరంగాల వారు జారవిడుచుకున్న అవకాశాలను తిరిగి పొందుతారు. రాజకీయవర్గాలకు ప్రత్యర్థులు సైతం సహకరిస్తారు. పదవీయోగం, సన్మానాలు. క్రీడాకారులు నైపుణ్యాన్ని ప్రదర్శించి తమ సత్తా చాటుకుంటారు. నవంబర్ నుంచి శనికి అర్థాష్టమ స్థితి, సెప్టెంబర్ - అక్టోబర్ మధ్య అర్థాష్టమ కుజుని ప్రభావం వల్ల ఆరోగ్య సమస్యలు, ముఖ్యంగా నరాలు, ఉదరం, నేత్ర సంబంధిత రుగ్మతలు బాధిస్తాయి. ఈ కాలంలో శని, కుజులకు పరిహారాలు చేయించుకోవాలి. చైత్రం, జ్యేష్టం, ఆశ్వయుజం, మార్గశిర మాసాలు అనుకూలం. అదృష్ట సంఖ్య-1. కన్య (ఆదాయం - 11, వ్యయం - 8, రాజపూజ్యం - 5, అవమానం - 4.) వీరికి జూన్ నుంచి గురుడు లాభస్థితి విశేషమైనది. నవంబర్ వరకూ ఏల్నాటిశని ఉన్నా గురుబలం వల్ల ప్రభావం తగ్గుతుంది. నవంబర్ నుంచి ఏల్నాటి శని పూర్తికాగలదు. జన్మరాశిలో జూలై వరకూ కుజుని స్తంభన వల్ల కొంత ఆందోళన, మానసిక అశాంతి. ఒత్తిడులు ఎదుర్కొంటారు. మధ్యమధ్యలో కొంత అవరోధాలు కలిగినా దేవగురుడు మీకు అన్ని విధాలా అనుకూలించడం వల్ల అధిగమిస్తారు. ఆర్థికంగా బలం చేకూరుతుంది. రావలసిన బాకీలు అందుతాయి. దీర్ఘకాలిక సమస్యలు, రుణాలు తీరతాయి. పెండింగ్‌లోని కోర్టు కేసులు పరిష్కారమవుతాయ. స్థిరాస్తి వృద్ధి. జీవితాశయ సాధనలో కుటుంబసభ్యులు సహకరిస్తారు. ప్రత్యర్థులను సైతం చాకచక్యంగా మీ దారికి తెచ్చుకుంటారు. ఇంటిలో శుభకార్యాల నిర్వహణ. నేర్పుగా కార్యక్రమాలు పూర్తి చేస్తారు. పరిహసించిన వారే ప్రశంసిస్తారు. సంఘంలో విశేష గౌరవం పొందుతారు. ఇంటి నిర్మాణాలు, ఆస్తుల కొనుగోలు యత్నాలు అనుకూలిస్తాయి. వ్యాపారాలలో మొదట్లో కొంత వెనుకబడినా క్రమేపీ అనుకున్న లాభాలు తథ్యం. ఉద్యోగులు పనిభారం తగ్గి ఊపిరిపీల్చుకుంటారు. పారిశ్రామికవేత్తలకు విదేశీ పర్యటనలు సఫలమవుతాయి. కళాకారులకు ఊహించని అవకాశాలు దరిచేరి ఆశ్చర్యపరుస్తాయి. విద్యార్థులకు అనుకూల ఫలితాలు కనిపిస్తాయి. రాజకీయవర్గాలకు నూతనోత్సాహం, విశేష ప్రజాదరణ. వ్యవసాయదారులకు కొత్త ఆశలు చిగురిస్తాయి. క్రీడలు, శాస్త్ర, సాంకేతిక వర్గాలకు అరుదైన పురస్కారాలు అందుతాయి. విచిత్రమైన సంఘటనలు ఎదురవుతాయి. శని, రాహు, కుజులకు పరిహారాలు చేయించుకోవాలి. సుబ్రహ్మణ్యాష్టకం పఠించండి. వైశాఖం, ఆషాఢం, కార్తీకం, పుష్య మాసాలు అనుకూలం. అదృష్ట సంఖ్య-5. తుల (ఆదాయం - 8, వ్యయం - 11, రాజపూజ్యం - 1, అవమానం - 7) వీరికి జన్మరాశిలో శని, రాహువులు, జూలై వరకూ కుజుడు వ్యయంలోనూ, తదుపరి జన్మరాశిలో సంచారం అంత అనుకూలం కాదు. అయితే గురుని స్థితి కొంత అనుకూలం కావడం ఊరట కలిగించే విషయం. మొత్తం మీద వీరికి సామాన్యంగానే ఉంటుంది. ప్రతి పనిలోనూ నిరాసక్తత, జాప్యం. ఆర్థిక పరిస్థితి కొంత ఇబ్బందికరంగా ఉంటుంది. రుణబాధలు ఎదురవుతాయి. చేసే కార్యాలలో ఏకాగ్రత లోపించడం వల్ల కొత్త సమస్యలు ఎదురయ్యే అవకాశం. అందువల్ల నిర్ణయాలలోనూ ఆచితూచి అడుగు వేయడం సర్వదా శ్రేయస్కరం. బంధువులు, మిత్రుల నుంచి అపవాదులు, విమర్శలు సైతం ఎదుర్కొంటారు. గృహ నిర్మాణ యత్నాలు నెమ్మదిస్తాయి. వాహనాల విషయంలో నిర్లక్ష్యం వద్దు. ప్రధమార్థంలో గురుని భాగ్యస్థితి, తదుపరి దశమస్థితి వల్ల కొంత అనుకూలత ఉంటుంది. సంఘంలో గౌరవానికి లోటు ఉండదు. శుభకార్యాలకు విరివిగా ఖర్చు చేస్తారు. ఇతరులకు సైతం సహాయపడి దాతృత్వాన్ని చాటుకుంటారు. విలాసవంతంగా గడుపుతారు. వ్యాపారులు కొద్దిపాటి లాభాలతో సరిపెట్టుకోవాలి. ఉద్యోగులు విధుల్లో అప్రమత్తత పాటించాలి, పైస్థాయి నుంచి ఒత్తిడులు ఎదుర్కొంటారు. స్థానచలన సూచనలు ఉన్నాయి. కళాకారులకు ద్వితీయార్థంలో కార్యజయం, శుభవార్తలు. విద్యార్థులకు శ్రమానంతరం ఫలితం కనిపిస్తుంది. నిరుద్యోగుల యత్నాలు కొంత ఫలించే అవకాశం. వ్యవసాయదారులకు మొదటి పంట అనుకూలం. పారిశ్రామిక, సాంకేతిక రంగాల వారు కొంత నిదానంగా సాగడమే ఉత్తమం. రాజకీయవర్గాలకు ప్రత్యర్థుల నుంచి సమస్యలు ఎదురుకావొచ్చు, ముఖ్య నిర్ణయాలు వాయిదా వేయడం మంచిది. మొత్తం మీద వీరికి సామాన్యమనే చెప్పాలి. శని, రాహు, కేతువులు, కుజునికి పరిహారాలు చేయించుకుంటే మంచిది. ఆదిత్య హృదయం, హనుమాన్ చాలీసా పఠించండి. జ్యేష్టం, శ్రావణం, మార్గశిరం, మాఘ మాసాలు అనుకూలం. అదృష్టసంఖ్య-6. వృశ్చికం (ఆదాయం - 14, వ్యయం - 2, రాజపూజ్యం - 4, అవమానం - 7) వీరికి జూన్ 18వరకు అష్టమ గురుడు, వ్యయంలో శని, రాహువుల సంచారం అనుకూలం కాదు. జూన్ నుంచి గురుడు భాగ్యస్థానంలో ఉచ్ఛస్థితి వల్ల ఏల్నాటి శని ప్రభావం ఉన్నా జన్మరాశిపై గురుదృష్టి వల్ల కొంత ఉపశమనం కలుగుతుంది. పనుల్లో జాప్యం జరిగినా పూర్తి కాగలవు. ఆర్థిక లావాదేవీలు క్రమేపీ పుంజుకుంటాయి. ఎంతటి బాధ్యతనైనా పట్టుదలతో నెరవేరుస్తారు. ఆత్మీయులు, బంధువులతో వివాదాలు తీరతాయి. జూన్ వరకూ కొంత ఆదుర్దా, మానసిక అశాంతి. కార్యక్రమాలలో ఆవాంతరాలు, ఉదర, నరాల సంబంధిత రుగ్మతలు బాధిస్తాయి. కొన్ని విషయాలలో మౌనం మంచిది. కోపతాపాలకు దూరంగా ఉండండి. జూన్ నుంచి శుభకార్యాల నిర్వహణ. గృహం, వాహనాల కొనుగోలు యత్నాలు సఫలం. స్థిరాస్తి వృద్ధి. సమాజంలో మంచి గుర్తింపు. దూరమైన ఆప్తులు తిరిగి దగ్గరకు చేరుకుంటారు. విమర్శలు గుప్పించిన వారే ప్రశంసలు కురిపిస్తారు. జీవిత భాగస్వామి నుంచి ధన లేదా ఆస్తి లాభాలు ఉంటాయి. వ్యాపారులు సామాన్య లాభాలు అందుకుంటారు. ఉద్యోగులకు శ్రమ పెరిగినా తగిన గుర్తింపు రాగలదు. పారిశ్రామిక, శాస్త్ర, సాంకేతిక రంగాల వారి కృషి కొంతమేరకు సఫలమవుతుంది. విద్యార్థుల కష్టం కొంతమేరకు ఫలిస్తుంది. వ్యవసాయదారులకు రెండవ పంట అనుకూలిస్తుంది. కళాకారులకు ద్వితీయార్థంలో అనుకున్న అవకాశాలు దక్కుతాయి. జూలై నుంచి అక్టోబర్ వరకు, తిరిగి జనవరి - ఫిబ్రవరి మధ్య కుజ ప్రభావం వల్ల ఒత్తిడులు, అయినవారితో విభేదాలు. ప్రయాణాలలో ఆటంకాలు ఎదుర్కొంటారు. వీరు శని, రాహు, గురు, కుజులకు పరిహారాలు చేయించుకోవాలి. సుబ్రహ్మణ్యాష్టకం, ఆదిత్య హృదయం పఠించడం మంచిది. ఆషాఢం, భాద్రపదం, పుష్యం, ఫాల్గుణ మాసాలు అనుకూలం. అదృష్టసంఖ్య-9. ధనుస్సు (ఆదాయం - 2, వ్యయం - 11, రాజపూజ్యం - 7, అవమానం - 7) వీరికి జూన్ వరకు గురుడు సప్తమంలోనూ, తదుపరి అష్టమంలోనూ సంచరిస్తాడు. నవంబర్ వరకూ శని లాభస్థానంలో సంచారం. తదుపరి వ్యయస్థానంలో సంచరిస్తాడు. నవంబర్ నుంచి వీరికి ఏల్నాటిశని ప్రారంభం. అయితే గురుడు అష్టమంలో సంచారమైనా ఉచ్ఛస్థితి కావడం, వ్యయస్థితిలోని శనిని వీక్షించడం మంచిది. మొత్తం మీద శ్రమ కలిగినా కార్యక్రమాలు సజావుగా సాగుతాయి. ఆర్థికంగా కొంత ఇబ్బందులు కలిగినా అవసరాలకు తగినంత డబ్బు అందుతుంది. సమాజంలో మీకంటూ ప్రత్యేక గౌరవం పొందుతారు. బంధువులు, మిత్రులు పూర్తిగా సహకరిస్తారు. ప్రథమార్థంలో వాహనాలు, ఆభరణాలు, భూములు కొనుగోలు చేస్తారు. ఇంటి నిర్మాణయత్నాలు సానుకూలమవుతాయి. చిరకాల ప్రత్యర్థులు కూడా అనుకూలురుగా మారతారు. వ్యాపారులకు లాభాలు ఊరిస్తాయి. పెట్టుబడులు సమకూరతాయి. ఉద్యోగులు కోరుకున్న బదిలీలు పొందుతారు. విధుల్లో ప్రతిబంధకాలు అధిగమిస్తారు. పారిశ్రామిక, సాంకేతికవర్గాలకు శ్రమానంతరం ఫలితం కనిపిస్తుంది, తరచూ విదేశీ పర్యటనలు చేస్తారు. కళాకారులకు కొత్త అవకాశాలు లభిస్తాయి. అవార్డులు సైతం దక్కవచ్చు. రాజకీయ నాయకులకు ప్రథమార్థంలో పదవీయోగాలు, విశేష ప్రజాదరణ. విద్యార్థుల కృషి కొంతమేరకు ఫలిస్తుంది. వ్యవసాయదారులకు రెండవ పంట అనుకూలిస్తుంది. క్రీ డాకారులు, శాస్త్రవేత్తలకు తగిన గుర్తింపు, ప్రోత్సాహం లభిస్తాయి. నవంబర్ నుంచి ఏల్నాటిశని ప్రారంభం వల్ల కుటుంబంలో చికాకులు. మానసిక అశాంతి. చేసే పనిలో ఏకాగ్రత లోపించడం, ఆరోగ్య సమస్యలు ఎదురవుతాయి. ఈ కాలంలో వీరు శని, గురులకు జపాదులు నిర్వహించాలి. హనుమాన్ చాలీసా పఠనం ఉపకరిస్తుంది. చైత్ర, శ్రావణం, ఆశ్వయుజం, మాఘ మాసాలు అనుకూలం. అదృష్ట సంఖ్య-3. మకరం (ఆదాయం - 5, వ్యయం - 5, రాజపూజ్యం - 3, అవమానం - 3.) వీరికి జూన్ నుంచి గురుడు, నవంబర్ నుంచి శని విశేష యోగకారులై ఉంటారు. మొత్తం మీద వీరికి గతం కంటే మెరుగ్గా ఉంటుంది. తలచిన పనుల్లో విజయం. ఆప్తులు, శ్రేయోభిలాషుల నుంచి సహాయ సహకారాలు. జీవిత భాగస్వామి నుంచి ఆస్తిలాభ సూచనలు. పట్టుదలతో కార్యోన్ముఖులై ముందుకుసాగి విజయాలు సాధిస్తారు. వాహనాలు, భూములు కొంటారు. ఆర్థిక లావాదేవీలు ఉత్సాహంగా సాగుతాయి. దీర్ఘకాలిక సమస్య ఒకటి కొలిక్కి వస్తుంది. కోర్టు వివాదాలు సైతం పరిష్కారమవుతాయి. ద్వితీయార్థంలో ఇంటి నిర్మాణయత్నాలు కలిసివస్తాయి. సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకుని అందరి ప్రశంసలు అందుకుంటారు. వ్యాపారులు లాభాలు ఆర్జిస్తారు. కొత్త పెట్టుబడులకు తగిన సమయం. ఉద్యోగులు పదోన్నతులు, ఇంక్రిమెంట్లు పొందుతారు. రాజకీయవర్గాల వారికి చేజారిన పదవులు తిరిగి దక్కే అవకాశం. కళాకారులు ఊహించని రీతిలో అవకాశాలు దక్కించుకుంటారు, పురస్కారాలు వంటివి పొందుతారు. విద్యార్థుల శ్రమ ఫలించి ఉత్తమ ఫలితాలు సాధిస్తారు. వ్యవసాయదారులకు రెండవ పంట విశేషంగా లాభిస్తుంది. పారిశ్రామిక, వైద్యరంగాల వారు అనుకున్నది సాధిస్తారు. క్రీడాకారులు, శాస్త్రవేత్తలకు అవకాశాలు మెరుగుపడి ప్రోత్సాహకరంగా ఉంటుంది. ప్రథమార్థంలో షష్టమంలో గురుడు, అర్థాష్టమంలో కేతు సంచారం వల్ల మనోవ్యథ, ఆరోగ్యసమస్యలు, ప్రయాణాలలో అవరోధాలు వంటి చికాకులు ఎదురవుతాయి. వీరు గురు, కేతువులకు పరిహారాలు చేయించుకుంటే మంచిది. వైశాఖం, భాద్రపదం, కార్తీకం, ఫాల్గుణ మాసాలు అనుకూలం. అదృష్టసంఖ్య-8. కుంభం (ఆదాయం - 5, వ్యయం - 5, రాజపూజ్యం - 6, అవమానం - 3.) వీరికి జూన్ వరకూ గురుడు విశేష యోగకారకుడు. భాగ్యస్థానంలో శని, రాహువులు సామాన్యులు. ఈ రీత్యా చూస్తే వీరికి ప్రధమార్థంలో అనుకూలత ఎక్కువగా ఉంటుంది. యత్నకార్యసిద్ధి. కుటుంబంలో శుభకార్యాల నిర్వహణ. మిత్రులు, బంధువులతో ఉల్లాసంగా గడుపుతారు. స్థిరాస్తి వృద్ధి. గృహం, వాహనాల కొనుగోలు యత్నాలు సానుకూలం. విచిత్రమైన సంఘటనలు ఎదురవుతాయి. ప్రతిభాపాటవాలు వెలుగులోకి వస్తాయి. ఆశయాలు సాధిస్తారు. శత్రువిజయం. జీవిత భాగస్వామితో వివాదాలు సర్దుబాటు కాగలవు. రాబడితో పాటు ఖర్చులూ పెరుగుతాయి. మీరు తీసుకునే నిర్ణయాలు అందరి ఆమోదం పొందుతాయి. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. వ్యాపారాలు విస్తరిస్తారు, లాభాలు అందుతాయి. ఉద్యోగులకు పనిభారం పెరిగినా తగిన గుర్తింపు, ప్రోత్సాహం లభిస్తాయి. కళాకారులకు అనుకోని అవకాశాలు దక్కే సూచనలు. విద్యార్థులు మంచి ర్యాంకులు సాధిస్తారు. వ్యవసాయదారులకు నూతనోత్సాహం. పంటల దిగుబడి పెరిగి రుణభారాల నుంచి విముక్తి పొందుతారు. రాజకీయవర్గాలకు పద వులు దక్కవచ్చు. పారిశ్రామికవర్గాలు గతం కంటే మెరుగైన అభివృద్ధిని సాధిస్తారు. శాస్త్ర, సాంకేతిక, క్రీడారంగాల వారికి పూర్వవైభవం. అష్టమరాశిలో జూలై వరకూ కుజుడు, జూలై నుంచి రాహువు సంచారం అంత మంచిది కాదు. దీనివల్ల మానసిక ఆందోళన. చర్మ, ఉదర, నరాల సంబంధిత రుగ్మతలు. లేనిపోని వివాదాలు నెలకొంటాయి. ఈ గ్రహాలకు పరిహారం చేయించుకుంటే మంచిది. విష్ణుసహస్రనామ పారాయణం మంచిది. చైత్రం, జ్యేష్టం, ఆశ్వయుజం, మార్గశిర మాసాలు అనుకూలం. అదృష్టసంఖ్య-8. మీనం (ఆదాయం - 2, వ్యయం - 11, రాజపూజ్యం - 2, అవమానం - 6.) వీరికి జూన్ నుంచి గురుడు విశేష యోగప్రదుడు కావడంతో పాటు, స్వక్షేత్రాన్ని వీక్షించడం శుభదాయకం. అష్టమ శని, రాహు ప్రభావం ఉన్నా గురుబలం వీరికి కొండంత అండగా ఉండడం శుభసూచికం. మొత్తం మీద వీరికి అనుకూలమనే చెప్పాలి. ఆర్థికంగా కొంత పుంజుకుంటారు. పనుల్లో ఆటంకాలు ఎదురైనా అధిగమించి విజయాలు సాధిస్తారు. బంధువర్గం, జీవిత భాగస్వామి తరఫు వారితో నెలకొన్న విభేదాలు తొలగుతాయి. సమాజంలో మంచి గుర్తింపుతో పాటు, గౌరవం పొందుతారు. మీ ఆశయాలు నెరవేరతాయి. ఆత్మీయులు మరింత దగ్గరవుతారు. ఆస్తి వివాదాలు కొలిక్కి వస్తాయి. భూ, వాహనయోగాలు. చిరకాల ప్రత్యర్థులు సైతం అనుకూలురుగా మారతారు. తరచూ తీర్థయాత్రలు చేస్తారు. వ్యాపారులు ద్వితీయార్థంలో మరింతగా లాభాలు అందుకుంటారు. ఉద్యోగులకు అనుకూల మార్పులు ఉంటాయి. పనిభారం మాత్రం తప్పదు. విద్యార్థులు శ్రమానంతరం ఫలితం పొందుతారు. కళాకారులకు మిశ్రమంగా ఉంటుంది. పారిశ్రామికవర్గాల వారు జూన్ నుంచి అభివృద్ధి పథంలో సాగుతారు. వ్యవసాయదారులకు రెండవ పంట అనుకూలిస్తుంది. రాజకీయవర్గాలకు కొంత వ్యతిరేకత ఎదురైనా క్రమేపీ అనుకూల వాతావరణం నెలకొంటుంది. విజయాల కోసం శ్రమపడాలి. శాస్త్ర, న్యాయ, సాంకేతికరంగాల వారు గతం కంటే మెరుగైన ఫలితాలు చూస్తారు. క్రీడాకారులు ఉత్సాహంగా ముందుకు సాగి విజయాలు సొంతం చేసుకుంటారు. జూలై -సెప్టెంబర్ మధ్య అష్టమంలో కుజ, శని కలయిక వల్ల ఈతిబాధలు, మానసిక ఆందోళన. జీవిత భాగస్వామితో విభేదాలు. చర్మ, గొంతు, ఉదర సంబంధిత రుగ్మతలు బాధిస్తాయి. శనికి తైలాబిషేకం, సుబ్రహ్మణ్యాష్టకంతో పాటు దుర్గాదేవికి కుంకుమార్చనలు చేయించుకుంటే మేలు. వైశాఖం, ఆషాఢం, కార్తీకం, పుష్యమాసాలు అనుకూలం. అదృష్ట సంఖ్య-3. సర్వేజనా సుఖినోభవంతు... పుష్కరాలు... గురుడు ఒక్కొక్క రాశిలో ప్రవేశించినప్పుడు ఒక్కొక్క నదికి పుష్కరాలు వస్తాయి. గురుడు మేష రాశిలో ప్రవేశంతో గంగానది, వృషభం-నర్మద, మిథునం-సరస్వతీ, కర్కాటకం-యమున, సింహం-గోదావరి, కన్య-కృష్ణా, తుల-కావేరి, వృశ్చికం-తామ్రపర్ణీనది, ధనుస్సు-పుష్కర వాహిని, మకరం-తుంగభద్ర, కుంభం-సింధు నది, మీనం-ప్రణీతానదులకు పుష్కరాలు జరుగుతాయి. పుష్కరాలు 12 రోజులపాటు జరుగుతాయి. ఈ పన్నెండు రోజులు నదీస్నానాలు, దానధర్మాలు పుణ్యఫలాన్నిస్తాయి. శూన్యమాసాలు - నిర్ణయాలు సూర్యుడు మీనరాశిలో ఉండే చైత్రం, మిథున రాశిలో ఉండే ఆషాఢం, కన్య యందు భాద్రపదం, ధనుస్సులో ఉన్నప్పుడు పుష్య మాసం శూన్య మాసములని అంటారు. ఈ శూన్య మాసాల్లో శుభకార్యాలు నిర్వర్తించరు. ఆయనములు ఆయనములు రెండు. సూర్యుడు (రవి) మకర రాశిలో ప్రవేశంతో ఉత్తరాయణం, కర్కాటక రాశిలో ప్రవేశించునప్పుడు దక్షిణాయనం ప్రారంభమవుతుంది. ఒక్కొక్కటి ఆరు నెలల కాలం ఉంటుంది. ఉత్తరాయణం ఆరునెలల కాలం అత్యంత పవిత్రమైన దిగా భావిస్తారు. ఈ కాలంలో పుణ్యకార్యాలు శుభఫలితాలనిస్తాయి. అలాగే వివాహాది శుభకార్యాలకు కూడా ప్రశస్తమైనది.