రాజమహేంద్రవరం(తూర్పుగోదావరి జిల్లా): దేశమంతటా ఒకే పంచాంగం లేకపోవడానికి ప్రజలు సూర్యమానం, చాంద్రమానం వేర్వేరుగా పాటించడమే కారణమని కంచి కామకోటి సర్వజ్ఞ పీఠ ఆస్థాన సిద్ధాంతి బ్రహ్మశ్రీ లక్కావఝుల సుబ్రహ్మణ్య సిద్ధాంతి పేర్కొన్నారు. తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం గోదావరి తీరాన సరస్వతి ఘాట్ వద్ద తెలుగు దృగ్గణిత పంచాంగకర్తల ఆత్మీయ సమ్మేళనం ఆదివారం జరిగింది.
సుబ్రహ్మణ్య సిద్ధాంతి మాట్లాడుతూ.. దక్షిణాది రాష్ట్రాల్లో చాంద్రమానం ప్రకారం, ఉత్తరాదిన సూర్యమానం ప్రకారం గణించడం వల్ల వారికి, మనకు కొంత తేడాలు వస్తున్నాయని చెప్పారు. కొన్ని పంచాంగాల్లో గ్రహణాది ప్రత్యక్ష గోచరాలు కూడా తప్పిపోయి పొరపాట్లు దొర్లుతున్నాయన్నారు. సమ్మేళనంలో చింతా గోపీశర్మ సిద్ధాంతి మాట్లాడారు. వివిధ సిద్ధాంతులు రచించిన పంచాంగాలను ఆవిష్కరించారు. సంస్కృత పండితుడు చిర్రావూరి శ్రీరామశర్మను సత్కరించారు.
Comments
Please login to add a commentAdd a comment