
జులై 12న అనంత్ అంబానీ, రాధిక మర్చెంట్ వివాహం ముంబైలో ఎంతో వైభవంగా జరిగింది. అంబానీ ఇంట జరిగిన ఈ వేడుకలకు ప్రముఖ సెలబ్రిటీలు, పారిశ్రామిక దిగ్గజాలు, ఇతర దేశాల ప్రముఖులు హాజరయ్యారు. వీరి పెళ్ళికి సుమారు ఐదు వేలకోట్ల రూపాయలు ఖర్చు అయినట్లు సమాచారం.
అనంత్, రాధికల వివాహానంతరం లండన్‌కు వెళ్లనున్నట్లు పలు మీడియా సంస్థలు ఇటీవల నివేదించాయి. అయితే వారు అక్కడ ఉండటానికి ప్రముఖ 7 స్టార్ లగ్జరీ హోటల్ & గోల్ఫింగ్ ఎస్టేట్ స్టోక్ పార్క్‌ను రెండు నెలలకు బుక్ చేసుకున్నట్లు పుకార్లు వచ్చాయి. కానీ ఇందులో ఎటువంటి నిజం లేదని స్టోక్ పార్క్ తన సోషల్ మీడియా ఖాతాలో అధికారికంగా వెల్లడించింది.
సాధారణంగా మేము ప్రైవేట్ విషయాలపై స్పందించము. కానీ ఇటీవల వస్తున్న పుకార్లలో ఎటువంటి నిజం లేదని మీడియాలలో వస్తున్న పుకార్లలో నైజం లేదని స్టోక్ పార్క్ వెల్లడించింది. మొత్తానికి అంబానీ లండన్‌లో స్టోక్ పార్క్ బుక్ చేయలేదని స్పష్టమైపోయింది.
Comments
Please login to add a commentAdd a comment