లండన్: టీమిండియా యువ సంచలనం సూర్యకుమార్ యాదవ్ దాదాపు 65 రోజుల తర్వాత తన సతీమణి దేవిషా శెట్టిని కలుసుకున్నాడు. దీంతో సూర్య ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. దాదాపు రెండు నెలల తర్వాత భార్యాభర్తలు కలుసుకోవడంతో ఇద్దరూ డ్యాన్స్ చేస్తూ పరస్పరం తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఆ వీడియోను సూర్య తన ఇన్‌స్టాగ్రామ్ రీల్స్‌లో పోస్ట్ చేశాడు. ప్రస్తుతం సూర్యకుమార్ ఇంగ్లండ్ పర్యటనలో ఉన్న విషయం తెలిసిందే. దీంతో ఐపీఎల్ స్టార్ తన భార్యతో కలిసి లండన్ వీధుల్లో చక్కర్లు కొడుతున్నాడు.
చదవండి:IPL 2021: పంజాబ్ కింగ్స్‌లోకి ఆసీస్ యువ పేసర్
ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియోలో తెగవైరల్ అవుతోంది. కాగా సూర్యకుమార్ యాదవ్ గత నెలలో జరిగిన శ్రీలంకతో వన్డే, టి20 సిరీస్‌కు ముందు బయోబబుల్ కోసం తన ఫ్యామిలీని వదిలి వచ్చాడు. అనంతరం అక్కడ నుంచి మళ్ళీ ఇంగ్లాండ్ పర్యటనకు వెళ్తూ 10 రోజులు మళ్ళీ క్వారంటైన్లో ఉన్నాడు. ఈ క్రమంలోనే దేవిషాకు రెండు నెలల పాటు దూరంగా ఉన్నాడు.అయితే, ఇప్పుడు ఆమె కూడా లండన్‌కు చేరుకోని, తన క్వారంటైన్ గడువును పూర్తి చేసుకుంది. తాజాగా తన భర్తను కలుసుకుంది. దీంతో ఈ జంట లండన్ వీధుల్లో తెగ ఎంజాయ్ చేస్తుంది.
చదవండి:Mohammed Siraj: సిరాజ్ ఎంపిక, విజయంలో ఆయన పాత్రే కీలకం!
Comments
Please login to add a commentAdd a comment