లండన్: తనను ఒక వెనుకబడిన మైనారీటి వర్గానికి చెందిన మహిళగా గుర్తించడం నచ్చట్లేదని, అది ప్రజలను కించపరిచడమేనని బ్రిటిష్ మాజీ కేంద్ర మంత్రి, భారత సంతతి మహిళ ప్రీతి పాటిల్ అసహనం వ్యక్తం చేశారు. కన్జర్వేటివ్ పార్టీ తరఫున బ్రిటిష్ కేబినెట్‌లో చోటుదక్కించుకున్న మొదటి భారతీయ మైనారీటి మహిళగా గుర్తింపు పొందిన ప్రీతి పాటిల్ తనను ఒక వర్గానికి పరిమితం చేసి మాట్లాడటం.. ఆ వర్గాన్ని అవమానించే విధంగా ఉందని, అది ప్రజలను మోసం చేసి లబ్ధి పొందేవిధంగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు.
‘నేను బ్రిటిష్‌లోనే పుట్టి పెరిగాను, నన్ను మొదట బ్రిటిష్ మహిళగా గుర్తించండి’ అని ఆమె కోరారు. బ్రిటిష్ కేబినెట్‌లో ఇంటర్నేషనల్ డెవలప్‌మెంట్ మినిస్ట్రీ పదవిలో ఆమె సేవలందించారు. గత ఏడారి నవంబర్‌లో తన మీద వచ్చిన ఆరోపణలకు బాధ్యత వహిస్తూ ఆమె రాజీనామా చేశారు. తనను అలా చూడడం ఏంతో ఉద్వేగానికి గురిచేసిందని, సహచర కేబినెట్ మంత్రులకు, పార్టీ ఎంపీలందరికీ తనని మొదట బ్రిటిష్ మహిళగానే చూడాలని, తనను ఒక వర్గానికి పరిమితం చేసి వేరుగా చూడొద్దని ఆమె విజ్ఞప్తి చేశారు.
Comments
Please login to add a commentAdd a comment