లండన్ : యునైటెడ్ కింగ్‌డం ప్రవాస తెలుగు సంఘం నిర్వహించిన ఉగాది వేడుకలు ఘనంగా జరిగాయి. తూర్పు లండన్‌లో జరిగిన ఈ వేడుకల్లో వెయ్యి మందికిపైగా ప్రవాస తెలుగు కుటుంబాలు పాల్గోన్నాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అథిదిగా ఎయిర్ ఇండియా యూకే హెడ్ తార నాయుడు, ఈస్ట్ హోం పార్లమెంట్ సభ్యుడు స్టీఫెన్ టిమ్మిస్ పాల్గోన్నారు. ఆ సంధర్బంగా జరిగిన పలు సంప్రదాయ కార్యక్రమాలు, పంచాంగ శ్రవణం, చిన్నారులచే సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు.
వివిధ విభాగాల్లో ప్రతిభ చూపించిన చిన్నారులను, సామాజిక సేవకు శ్రీకారం చుట్టిన తెలుగు ప్రముఖలను సత్కరించారు. హిల్ సొసైటి ఫౌండర్, బ్రిటిష్ రాణి అవార్డు గ్రహిత సత్యప్రసాద్ కోనేరు, డాక్టర్. రామకృష్ణ మదీనాలు గౌరవ పురస్కారాలు పొందారు. ఈ సందర్భంగా వైస్ ప్రెసిడెంట్ రాజ్ ఖుర్బూ మాట్లాడుతూ.. ఆంధ్ర, తెలంగాణ ప్రవాసులను ఏకతాటిపైకి తీసుకురావాలన్న లక్ష్యంతోనే ఉగాది వేడుకలను నిర్వహిస్తున్నామని అన్నారు.
ఈకార్యక్రమానికి కళ్యాణి గాదెల వ్యాఖ్యాతగా వ్యవహరించారు. యుక్తా ట్రస్ట్ శ్రీమతి డా. అనితరావు, డా.వెంకట పద్మ కిల్లి, ఉపాధ్యక్షుడు రాజ్ కుర్బా, ప్రధాన కార్యదర్శి సత్యప్రసాద్ మద్దసాని, కోశాధికారి నరేంద్ర మున్నలూరి, మీడియా కార్యదర్శి రుద్రవర్మ, ప్రజా సంబంధాల కార్యదర్శి బలరాం విష్ణుబొట్ల, సాంస్కృతిక కార్యదర్శి పూర్ణిమ చల్లా, కృష్ణ సనపల, సమాచార ఐటి ప్రతినిధులు అమర్నాధ్ రెడ్డి, కార్తిక్ రెడ్డిలు ఈ కార్యక్రమంలో పాల్గోన్నారు.
Comments
Please login to add a commentAdd a comment