United Kingdom Telugu Association
-
లండన్‌లో ఉగాది ఉత్సవాలు
లండన్ : యునైటెడ్ కింగ్డం ప్రవాస తెలుగు సంఘం నిర్వహించిన ఉగాది వేడుకలు ఘనంగా జరిగాయి. తూర్పు లండన్‌లో జరిగిన ఈ వేడుకల్లో వెయ్యి మందికిపైగా ప్రవాస తెలుగు కుటుంబాలు పాల్గోన్నాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అథిదిగా ఎయిర్ ఇండియా యూకే హెడ్ తార నాయుడు, ఈస్ట్ హోం పార్లమెంట్ సభ్యుడు స్టీఫెన్ టిమ్మిస్ పాల్గోన్నారు. ఆ సంధర్బంగా జరిగిన పలు సంప్రదాయ కార్యక్రమాలు, పంచాంగ శ్రవణం, చిన్నారులచే సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. వివిధ విభాగాల్లో ప్రతిభ చూపించిన చిన్నారులను, సామాజిక సేవకు శ్రీకారం చుట్టిన తెలుగు ప్రముఖలను సత్కరించారు. హిల్ సొసైటి ఫౌండర్, బ్రిటిష్ రాణి అవార్డు గ్రహిత సత్యప్రసాద్ కోనేరు, డాక్టర్. రామకృష్ణ మదీనాలు గౌరవ పురస్కారాలు పొందారు. ఈ సందర్భంగా వైస్ ప్రెసిడెంట్ రాజ్ ఖుర్బూ మాట్లాడుతూ.. ఆంధ్ర, తెలంగాణ ప్రవాసులను ఏకతాటిపైకి తీసుకురావాలన్న లక్ష్యంతోనే ఉగాది వేడుకలను నిర్వహిస్తున్నామని అన్నారు. ఈకార్యక్రమానికి కళ్యాణి గాదెల వ్యాఖ్యాతగా వ్యవహరించారు. యుక్తా ట్రస్ట్ శ్రీమతి డా. అనితరావు, డా.వెంకట పద్మ కిల్లి, ఉపాధ్యక్షుడు రాజ్ కుర్బా, ప్రధాన కార్యదర్శి సత్యప్రసాద్ మద్దసాని, కోశాధికారి నరేంద్ర మున్నలూరి, మీడియా కార్యదర్శి రుద్రవర్మ, ప్రజా సంబంధాల కార్యదర్శి బలరాం విష్ణుబొట్ల, సాంస్కృతిక కార్యదర్శి పూర్ణిమ చల్లా, కృష్ణ సనపల, సమాచార ఐటి ప్రతినిధులు అమర్నాధ్ రెడ్డి, కార్తిక్ రెడ్డిలు ఈ కార్యక్రమంలో పాల్గోన్నారు. -
లండన్‌లో ఘనంగా ముగిసిన స్వాతంత్ర్య వేడుకలు
లండన్ : యునైటెడ్ కింగ్డమ్ తెలుగు అసోసియేషన్ (యుక్త) ఆధ్వర్యంలో శనివారం లండన్ లోని వాలెంటైన్స్ హై స్కూల్ లో భారతదేశ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు, ఫ్యామిలీ స్పోర్ట్స్ డే ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా భారతదేశానికి స్వాతంత్రం తెచ్చిన మహనీయులను ఆదర్శంగా తీసుకొని ముందుకు సాగాలని ముఖ్య అథితిగా హాజరైన ప్రభాకర్ కాజా అన్నారు. ఈ కార్యక్రమంలో చిన్నారులతో పాటు పెద్దలకు పలు ఆటలపోటీలు నిర్వహించి బహుమతులను అందజేశారు. సాంస్కృతిక కార్యక్రమాలలో శిల్ప పరుచూరి, సువర్చల నృత్యప్రదర్శన అందరినీ ఆకట్టుకుంది. సుమారు 300 మంది ఎన్నారైలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. యుక్త ట్రస్టీ డాక్టర్ అనిత రావు, ప్రెసిడెంట్ ప్రసాద్ మంత్రాల, కమిటీ సభ్యులు రాజ్ ఖుర్భా, నరేంద్ర మున్నలూరి, సుధీర్ వర్మ, కృష్ణ సనపల, ఉదయ్ ఆరేటి, బలరాం విష్ణుబొట్ల, పూర్ణిమ చల్ల, రుద్రవర్మ బట్ట, ఆదిత్య అల్లాడి, అమర్ రెడ్డి ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించి జయప్రదం చేశారు. -
'యుక్త' ఆధ్వర్యంలో ఘనంగా ఉగాది వేడుకలు
లండన్: యునైటెడ్ కింగ్డమ్ తెలుగు సంఘం (యుక్త) నిర్వహించిన ఉగాది వేడుకలు ఘనంగా జరిగాయి. స్థానిక తూర్పు లండన్‌లోని బీకాన్ట్రీలో నిర్వహించిన ఈ వేడుకల్లో వెయ్యిమందికి పైగా ప్రవాస తెలుగు కుటుంబాలు పాల్గొన్నాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా భారతీయ విద్యా భవన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డా. నందకుమార, ప్రత్యేక అతిథిగా ఈస్ట్ హాం పార్లమెంట్ సభ్యుడు స్టీఫెన్ టిమ్మిన్స్ పాల్గొన్నారు. విశేష అతిథులుగా లాంబెత్ మేయర్, ప్రవాస తెలుగు మహిళ సాలేహ జాఫర్, పంజాబ్ నేషనల్ బ్యాంకు యు కె అధ్యక్షుడు నాయక్ పాల్గొన్నారు. ప్రతి ఉగాది పండుగ ఒక యుగాదికి నాంది అని, ఉక్త అంటే సరస్వతీ వాక్కు, యుక్త అంటే పవిత్రమైనదని నందకుమార అన్నారు. సూర్యగమనాన్ని అనుసరించి ఋతువులు ఏర్పడటం, వాటి ద్వారా పండుగలు జరుపుకోవటం ఒక్క భారతదేశంలో మాత్రమే ఉంటుందని, అదే మన సంస్కృతికి నాంది అని తెలిపారు. పార్లమెంట్ సభ్యుడు స్టీఫెన్ టిమ్మిన్స్ మాట్లాడుతూ బ్రెక్సిట్ అధ్యయన కమిటీలో తాను సభ్యుడని, భారతదేశంతో మైత్రి, సత్సంబంధాల ద్వారా మాత్రమే అనూహ్యమైన పరిణామాలను ఎదుర్కునే మనోబలాన్ని బ్రిటన్ పొందగలదని ఆశాభావం వ్యక్తం చేశారు. తెలుగువారితో తనకున్న అనుబంధం విడదీయలేనిదని అభిప్రాయపడ్డారు. అనంతరం సంప్రదాయ రీతిలో పంచాంగ శ్రవణం, చిన్నారులచే సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ అలరించాయి. హేవిళంబి నామ సంవత్సరాన్ని పురస్కరించుకుని వివిధ విభాగాల్లో ప్రతిభ చూపించిన చిన్నారులకు, అనేక రంగాల్లో సుస్థిర స్థానాన్ని ఏర్పరుచుకుని సామాజిక సేవకు శ్రీకారం చుట్టిన ప్రవాస తెలుగు ప్రముఖులను ఈ సందర్భంగా సత్కరించారు. ఎయిర్ ఇండియా యు కె ప్రాంతీయ అధికారిణి తారా నాయుడు, పెళ్లిచూపులు చిత్ర నిర్మాత యష్ రంగినేని ఉగాది పురస్కారాలు పొందిన వారిలో ఉన్నారు. తెలుగు సంఘాలను అనుసంధానం చేస్తూ పండుగల ద్వారా ఆంధ్ర, తెలంగాణా రాష్ట్ర ప్రవాసులను ఏక త్రాటి మీదకు తీసుకురావాలన్న ధ్యేయాన్ని యుక్తా ఈ ఉగాది వేడుకల ద్వారా శ్రీకారం చుడుతోందని అధ్యక్షుడు ప్రసాద్ మంత్రాల పేర్కొన్నారు. తెలంగాణా ఎన్ఆర్ఐ ఫోరమ్ తో కలిసి తెలంగాణా చేనేత కార్మికుల సహాయార్ధం పోచంపల్లి, గద్వాల్ వస్త్ర శ్రేణి ఫ్యాషన్ షో నిర్వహించారు. అనంతరం యుక్తా నూతన వెబ్ సైట్ ఆవిష్కరించారు. ఆహూతులందరికీ ఉగాది పచ్చడి, కమ్మని తెలుగు భోజనం వడ్డించారు. శ్రీమతి రమ్య, సుజాత తలాడి వ్యాఖ్యాతలుగా వ్యవహరించిన ఈ కార్యక్రమంలో యుక్తా ట్రస్టీ లు శ్రీమతి గీత మోర్ల, డా. వెంకట పద్మ కిల్లి, ఉపాధ్యక్షుడు రాజ్ కుర్బా, ప్రధాన కార్యదర్శి సత్యప్రసాద్ మద్దసాని, కోశాధికారి నరేంద్ర మున్నలూరి, ఐటి కార్యదర్శి క్రిష్ణ యలమంచిలి, మీడియా కార్యదర్శి రుద్ర వర్మ, ప్రజా సంబంధాల కార్యదర్శి బలరాం విష్ణుభొట్ల, మానవ వనరుల అభివృద్ధి కార్యదర్శి ఉదయ్ అర్యన్ ఆరేటి, సాంస్కృతిక కార్యదర్శి పూర్ణిమ చల్లా, క్రీడలు కార్యదర్శి సుధీర్ కొండూరు, కృష్ణ సనపల, సమాచార మరియు ఐటి ఆదిత్యవర్దన్ అల్లాడి , అమరనాద్ రెడ్డి, కార్తిక్‌లు పాల్గొన్నారు. -
యూకే తెలుగు సంఘం వేడుకలకు పవన్
సాధారణంగా సినీ వేడుకల్లో కూడా పెద్దగా కనిపించని పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సినిమాకు సంబంధం లేని ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు లండన్ వెళుతున్నారు. ఈ నెల 9న జరగనున్న యునైటెడ్ కింగ్ డమ్ తెలుగు సంఘం (యుక్తా) ఆరో వార్షికోత్సవాలలో ముఖ్యఅతిథిగా పాల్గొననున్నారు. ఈస్ట్ లండన్‌లోని టాక్సీ థియేటర్లో అక్కడి తెలుగు వారు ఘనంగా ఈ వేడుకలను నిర్వహిస్తున్నారు. సుమారు 2000లకు పైగా తెలుగు కుటుంబాలకు ఈ వేడుకలకు హాజరవుతారని భావిస్తున్నారు. ఈ వేడుకలకు హజరవుతున్న ఆయనకు ఘనంగా స్వాగతం పలికేందుకు అభిమానులు రెడీ అవుతున్నారు. ఈ కార్యక్రమంలో పవన్ అభిమానులను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. ఈ మేరకు ఆయన కార్యాలయం నిన్న ఓ ప్రకటనలో తెలిపింది. అలాగే పవన్ పలువురు కళాకారులను సత్కరించనున్నారన్న టాక్ వినిపిస్తోంది.