లండన్‌లో ఘనంగా ముగిసిన స్వాతంత్ర్య వేడుకలు | UKTA celebrates Independence day of India | Sakshi
Sakshi News home page

లండన్‌లో ఘనంగా ముగిసిన స్వాతంత్ర్య వేడుకలు

Published Tue, Aug 22 2017 2:25 AM | Last Updated on Tue, Sep 12 2017 12:41 AM

UKTA celebrates Independence day of India

లండన్ : యునైటెడ్ కింగ్డమ్ తెలుగు అసోసియేషన్ (యుక్త) ఆధ్వర్యంలో శనివారం లండన్ లోని వాలెంటైన్స్ హై స్కూల్ లో భారతదేశ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు, ఫ్యామిలీ స్పోర్ట్స్ డే ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా భారతదేశానికి స్వాతంత్రం తెచ్చిన మహనీయులను ఆదర్శంగా తీసుకొని ముందుకు సాగాలని ముఖ్య అథితిగా హాజరైన ప్రభాకర్ కాజా అన్నారు. ఈ కార్యక్రమంలో చిన్నారులతో పాటు పెద్దలకు పలు ఆటలపోటీలు నిర్వహించి బహుమతులను అందజేశారు.

సాంస్కృతిక కార్యక్రమాలలో శిల్ప పరుచూరి, సువర్చల నృత్యప్రదర్శన అందరినీ ఆకట్టుకుంది. సుమారు 300 మంది ఎన్నారైలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. యుక్త ట్రస్టీ డాక్టర్ అనిత రావు, ప్రెసిడెంట్ ప్రసాద్ మంత్రాల, కమిటీ సభ్యులు రాజ్ ఖుర్భా, నరేంద్ర మున్నలూరి, సుధీర్ వర్మ, కృష్ణ సనపల, ఉదయ్ ఆరేటి, బలరాం విష్ణుబొట్ల, పూర్ణిమ చల్ల, రుద్రవర్మ బట్ట, ఆదిత్య అల్లాడి, అమర్ రెడ్డి ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించి జయప్రదం చేశారు.





 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement