యూకే తెలుగు సంఘం వేడుకలకు పవన్ | pawan kalyan to attend ukta in london | Sakshi
Sakshi News home page

యూకే తెలుగు సంఘం వేడుకలకు పవన్

Published Thu, Jul 7 2016 1:15 PM | Last Updated on Fri, Mar 22 2019 5:33 PM

యూకే తెలుగు సంఘం వేడుకలకు పవన్ - Sakshi

యూకే తెలుగు సంఘం వేడుకలకు పవన్

సాధారణంగా సినీ వేడుకల్లో కూడా పెద్దగా కనిపించని పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సినిమాకు సంబంధం లేని ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు లండన్ వెళుతున్నారు. ఈ నెల 9న జరగనున్న యునైటెడ్ కింగ్ డమ్ తెలుగు సంఘం (యుక్తా) ఆరో వార్షికోత్సవాలలో ముఖ్యఅతిథిగా  పాల్గొననున్నారు. ఈస్ట్ లండన్లోని టాక్సీ థియేటర్లో అక్కడి తెలుగు వారు ఘనంగా ఈ వేడుకలను నిర్వహిస్తున్నారు.

సుమారు 2000లకు పైగా తెలుగు కుటుంబాలకు ఈ వేడుకలకు హాజరవుతారని భావిస్తున్నారు. ఈ వేడుకలకు హజరవుతున్న  ఆయనకు ఘనంగా స్వాగతం పలికేందుకు అభిమానులు రెడీ అవుతున్నారు. ఈ కార్యక్రమంలో పవన్ అభిమానులను ఉద్దేశించి ప్రసంగించనున్నారు.  ఈ మేరకు ఆయన కార్యాలయం నిన్న ఓ ప్రకటనలో తెలిపింది. అలాగే పవన్ పలువురు కళాకారులను సత్కరించనున్నారన్న టాక్ వినిపిస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement