
టాలీవుడ్ హీరో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ లండన్‌లో బిజీబిజీగా వున్నారు. బ్రిటన్‌లోని హౌజ్ ఆఫ్ లార్డ్స్ సమావేశంలో ఇండో- యూరోపియన్ బిజినెస్ ఫోరం గ్లోబల్ ఎక్సలెన్స్ అవార్డుని అందుకునేందుకు ఆయన లండన్ చేరుకున్నారు. ఉద్దానం కిడ్నీ బాధితుల సమస్య పరిష్కారానికి పవన్ చేసిన కృషికి గుర్తింపుగా శుక్రవారం ఈ అవార్డు దక్కనుంది.
కళలు, రాజకీయాలు, సామాజిక కార్యక్రమాల్లో విశేష కృషిగాను హౌస్ ఆఫ్ లార్డ్స్‌లో ప్రఖ్యాత ఇండో-యూరోపియన్ బిజినెస్ ఫోరమ్ ఈ అవార్డును పవన్‌కు ప్రదానం చేయనుంది. ఇందులో భాగంగానే యూరప్‌లో షూటింగ్ ముగించుకున్న పవన్ లండన్ చేరుకున్నారు. దీంతో అభిమానులు పవన్‌కు ఘన స్వాగతం పలికారు. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్‌మీడియాలో షేర్ అవుతున్నాయి. రెండు రోజుల లండన్ పర్యటనలో పవన్ పలు కార్యక్రమాల్లో పాల్గొననున్నారు.
కాగా ఈ అవార్డను పవన్ కళ్యాణ్‌కు ఐఏబిఎఫ్ ఫోరం గతంలో ప్రకటించిన సంగతి తెలిసిందే.


Comments
Please login to add a commentAdd a comment