పోలీసుల కళ్లెదుటే నడిరోడ్డుమీద మహిళపై కత్తులతో దాడి | Four Men Attack Woman Punjab Viral Video | Sakshi
Sakshi News home page

పోలీసుల కళ్లెదుటే నడిరోడ్డుమీద మహిళపై కత్తులతో దాడి.. వీడియో వైరల్‌..

Feb 21 2023 2:33 PM | Updated on Feb 21 2023 3:04 PM

Four Men Attack Woman Punjab Viral Video - Sakshi

చండీగఢ్‌: పంజాబ్‌ ఫిరోజ్‌పుర్‌లోని బజ్ చౌక్‌లో అత్యంత దారుణ ఘటన వెలుగుచూసింది. 50 ఏళ్ల మహిళపై నలుగురు వ్యక్తులు కత్తులతో దాడి చేశారు. బైక్‌పై వచ్చి పట్టపగలే నడిరోడ్డుపై ఈ కిరాతక చర్యకు పాల్పడ్డారు. పోలీసులు అక్కడే ఉన్నా ఏమీ చేయలేక భయంతో పారిపోయారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.

దుండగుల దాడిలో తీవ్రంగా గాయపడిన మహిళ రోడ్డుపైనే కుప్పకూలింది. స్థానికులు ఆమెను ఆస్పత్రికి తరలించారు. అయితే ఈమె  ఓ హత్య కేసుకు సంబంధించి కోర్టులో వాంగ్మూలం ఇచ్చి ఇంటికి తిరిగివస్తున్నట్లు తెలుస్తోంది. ఈక్రమంలోనే నలుగురు వ్యక్తులు కత్తులతో బైక్‌పై వెళ్లి వెనకాల నుంచి దాడి చేశారు. ఈ ఘటనకు సంబంధించి ఓ నిందితుడ్ని పోలీసులు అరెస్టు చేశారు.

పారిపోయిన పోలీసులు..
మహిళపై దాడి జరిగిప్పుడు ఇద్దరు పోలీసులు అక్కడే ఉన్నారని, కానీ కత్తులు చూసి భయంతో వారు వాహనంలో పారిపోయారని ప్రత్యక్షసాక్షులు తెలిపారు. విధి నిర్వహణలో నిర్లక్ష‍్యంగా వ్యవహరించిన వీరిపై చర్యలు తీసుకోవాలని బాధితురాలి కుటుంబసభ్యులు డిమాండ్ చేశారు.
చదవండి: ఒక్క రూపాయి చిల్లర ఇవ్వని కండక్టర్.. కోర్టుకెళ్లిన ప్రయాణికుడు.. ఎంత పరిహారం వచ్చిందంటే?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement