ట్రాఫిక్, పోలీసులు అనగానే, ట్రాఫిక్ సిగ్నల్ జంప్, నిబంధనలను ఉల్లంఘన, చలాన్లు ఇవన్నీ గుర్తొస్తాయి కదా.. కానీ పెళ్లి, పెళ్లికూతురు, లడ్డూలు ఇలాంటివేమీ అస్సలు ఊహించం కదా. పంజాబ్‌లో ఇలాంటి అసాధారణ సంఘటన ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది.
పెళ్లి అంటేనూరేళ్ల పంట. ఆ అందమైనక్షణాలను కలకాలం గుర్తుండిపోయేలా పదిలపర్చుకోవాలని అందరూ భావిస్తారు. ప్రీవెడ్డింగ్ సెలబ్రేషన్స్ దగ్గర్నుంచి హనీమూన్ దాకా ప్రతీదీ స్పెషల్‌గా ప్లాన్ చేసుకుంటారు. ఇందులో చిన్న చిన్న సర్ప్రైజ్‌ల వరకూ ఉంటాయి. మరికొన్ని వివాహాలలో మాంసాహారం లేదనో, వండ లేదనీ, మర్యాదలు బాగా జరగలేదు లాంటి ఆవేశకావేశాలు, కోపతాపాలు కామన్‌గా ఉంటాయి. ఇన్‌స్టాగ్రామ్ ఇన్‌ఫ్లుయెన్సర్ ఆంచల్ అరోరాకు ఊహించని అనుభవం ఎదురైంది. పెళ్లి, హల్దీ వేడుక హడావిడిలో ట్రాఫిక్ సిగ్నల్‌ను జంప్ చేసేసింది. ఇది కాస్త పోలీసు (పంజాబీ) అధికారుల కంటబడింది. ఊరుకుంటారా మరి.. ట్రాఫిక్ ఉల్లంఘన అంటూ కారు ఆపారు. ఇక్కడే ఆసక్తికరమైన సంఘటన జరిగింది.
దీంతో హల్దీ వేడుక ముస్తాబులో ఉన్న ఆంచల్.. చిరునవ్వుతో అధికారులను పలకరిస్తూ, "మేరీ హల్దీ హై, జాన్ దో (ఇది నా హల్దీ వేడుక, దయచేసి నన్ను వెళ్లనివ్వండి.)" అని వేడుకుంది.
ఇది విన్న పోలీసుల మనసు కరిగింది. సరే పెళ్లి కదా అనుకొని ఆమెను వెళ్లనివ్వాలని ఎంచుకున్నారు. చలాన్ రద్దు చేయాలని కూడా నిర్ణయించుకున్నారు. అయితే పెళ్లి.. సరే.. కాస్త నోరు తీపి చేసి పోరాదా (ముహ్ మిథా కర్కే జానా”) అని అడిగారు సరదాగా. తప్పకుండా “లడ్డూ కా డబ్బా పక్కా” అని బదులిచ్చింది. దీంతో అక్కడున్న వారంతా నవ్వుల పువ్వులయ్యారు. షాదీ ముబారక్ చెప్పి ఆశీర్వాదాలు అందిస్తూ అక్కడినుంచి వెళ్లిపోయారు అధికారులు. దీనికి సంబంధించిన వీడియోను ప్రస్తుతం నెట్టింట తెగ సందడి చేస్తోంది.
అంతేకాదు అదే పెళ్లి కొడుకు అయితే పరిస్థితి వేరేలా ఉండేది అంటూ నెటిజన్లు కామెడీగా స్పందించారు. లడ్డూ లంచం అని ఒకరు వ్యాఖ్యానించారు. ‘‘అదే అబ్బాయైతే.. పొట్టు పొట్టు కొట్టేవాళ్లు..("అభి లడ్కా హోతా తో నంగా కర్కే మార్తా యూజ్") పెళ్లి కొడుకైతే చలానా పక్కా ఇచ్చేవాళ్లు అంటూకే కా బ్యా హోతా తో.. పక్కా చలాన్ థా.") అంటూ కమెంట్ చేయడంతో మరికొంతమంది కూడా హా .. అవును అంటూ స్పందించడం విశేషం.
Comments
Please login to add a commentAdd a comment