swords attack
-
పోలీసుల కళ్లెదుటే నడిరోడ్డుమీద మహిళపై కత్తులతో దాడి
చండీగఢ్: పంజాబ్ ఫిరోజ్‌పుర్‌లోని బజ్ చౌక్‌లో అత్యంత దారుణ ఘటన వెలుగుచూసింది. 50 ఏళ్ల మహిళపై నలుగురు వ్యక్తులు కత్తులతో దాడి చేశారు. బైక్‌పై వచ్చి పట్టపగలే నడిరోడ్డుపై ఈ కిరాతక చర్యకు పాల్పడ్డారు. పోలీసులు అక్కడే ఉన్నా ఏమీ చేయలేక భయంతో పారిపోయారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. దుండగుల దాడిలో తీవ్రంగా గాయపడిన మహిళ రోడ్డుపైనే కుప్పకూలింది. స్థానికులు ఆమెను ఆస్పత్రికి తరలించారు. అయితే ఈమె ఓ హత్య కేసుకు సంబంధించి కోర్టులో వాంగ్మూలం ఇచ్చి ఇంటికి తిరిగివస్తున్నట్లు తెలుస్తోంది. ఈక్రమంలోనే నలుగురు వ్యక్తులు కత్తులతో బైక్‌పై వెళ్లి వెనకాల నుంచి దాడి చేశారు. ఈ ఘటనకు సంబంధించి ఓ నిందితుడ్ని పోలీసులు అరెస్టు చేశారు. పారిపోయిన పోలీసులు.. మహిళపై దాడి జరిగిప్పుడు ఇద్దరు పోలీసులు అక్కడే ఉన్నారని, కానీ కత్తులు చూసి భయంతో వారు వాహనంలో పారిపోయారని ప్రత్యక్షసాక్షులు తెలిపారు. విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన వీరిపై చర్యలు తీసుకోవాలని బాధితురాలి కుటుంబసభ్యులు డిమాండ్ చేశారు. చదవండి: ఒక్క రూపాయి చిల్లర ఇవ్వని కండక్టర్.. కోర్టుకెళ్లిన ప్రయాణికుడు.. ఎంత పరిహారం వచ్చిందంటే? -
టీఆర్ఎస్ నాయకుల డిష్యుం.. డిష్యుం
సాక్షి, ఖమ్మం : ఉసిరికాయలపల్లి టీఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షుడు జాల సాంబపై అదేపార్టీకి చెందిన వారు కత్తులతో దాడి చేసి హత్యాయత్నానికి పాల్పడిన ఘటన బుధవారం చోటు చేసుకుంది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..సాంబకు ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించిన గ్రాడ్యుయేషన్ ఓట్లకు రూ.36వేలు పార్టీ అధిష్టానం ఇచ్చిందని, ఈ మొత్తాన్ని పంపిణీ చేయలేదని అదే గ్రామానికి చెందిన టీఆర్ఎస్ మరో వర్గ నాయకుడు పచ్చిపాల వెంకట్ వాట్సాప్ గ్రూపులో ఆరోపిస్తూ పోస్టు చేశాడు. దీనికి సాంబ సైతం ఘాటుగా సమాధానం ఇచ్చాడు. ఆ తర్వాత ఇష్టానుసారంగా పోస్టులు చేసుకున్నారు. ఈ క్రమంలో జాల సాంబ అదే గ్రామంలో పొడుగు సర్వయ్య అనే వ్యక్తికి ఆరోగ్యం బాగాలేక పోవడంతో పరామర్శించేందుకు వెళ్లగా, అప్పటికే కోపోద్రిక్తుడైన పచ్చిపాల వెంకట్‌తో పాటు, మరో ముగ్గురు వ్యక్తులు వెంట తెచ్చుకున్న కత్తితో దాడి చేసి గాయపరిచారు. గమనించిన స్థానికులు కేకలు వేయడంతో పారిపోయారు. ఏఎస్ఐ నాగరాజు సంఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. గాయపడిన జాల సాంబాను 108 అంబులెన్స్‌లో ఖమ్మం ఆస్పత్రికి తరలించి చికిత్స నిర్వహిస్తున్నారు. వాట్సాప్ గ్రూపు అడ్మిన్లు కఠినంగా వ్యవహరించక, పోలీసులు దృష్టి సారించక..చిలికిచిలికి ఘర్షణకు దారితీస్తోందనే విమర్శలొస్తున్నాయి. చదవండి: ఎమ్మెల్సీ ఫలితాలు: ఏం జరుగుతుందో? -
కత్తులతో ఇద్దరు వ్యక్తుల పరస్పరం దాడి
సాక్షి, బంజారాహిల్స్ : బంజారాహిల్స్‌లో మంగళవారం దారుణం చోటుచేసుకుంది. స్థానికంగా పోలీస్ స్టేషన్ పరిధిలో ఇద్దరు వ్యక్తులు పరస్పరం కత్తులతో దాడి చేసుకున్నారు. కాగా రవీందర్(22), నవాజ్(20) కత్తులతో పరస్పరం దాడి చేసుక్నునట్లు తెలిసింది. అయితే ఎందుకు కత్తులతో దాడి చేసుకున్నారనేది ఇంకా తెలియాల్సి ఉంది. గతంలోనే వీరిద్దరిపై కేసులు ఉన్నట్లు పోలీసులు స్పష్టం చేశారు. దాడిలో తీవ్రంగా గాయపడిన రవీందర్‌కు తీవ్ర గాయాలు కావడంతో స్థానికంగా ఉన్న అపోలో ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసిన బంజారాహిల్స్ పోలీసులు నవాజ్‌ను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. -
పోలీసులు X టెంపో డ్రైవర్
న్యూఢిల్లీ: పోలీసులు చుట్టుముట్టి లాఠీలతో కొడుతుంటే మూడు చక్రాల టెంపో డ్రైవర్ కత్తి బయటకు తీసిన వైనానికి సంబంధించిన వీడియో ఢిల్లీలో సంచలనం సృష్టించింది. ఢిల్లీలోని ముఖర్జీనగర్‌లో ఆదివారం ఈ ఘటన జరిగింది. పోలీసుల వాహనం, టెంపో ఢీకొనడంతో ఘర్షణ జరిగినట్లు తెలుస్తోంది. తమ సహోద్యోగుల్లో ఒకరి కాలిపైకి టెంపో (గ్రామీణ సేవ) చక్రం ఎక్కడంతో పోలీసులు డ్రైవర్‌తో ఘర్షణకు దిగారు. ఆటోలో ఉన్న అతని కొడుకుని బయటకు లాగి కొట్టారు. దీనితో టెంపో డ్రైవర్ కత్తి బయటకు తీసి వారి వెంటపడ్డాడు. డ్రైవర్ కుటుంబాన్ని ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ సోమవారం పరామర్శించారు. ఈ కేసులో నిందితుడికి తగిన న్యాయం జరిగేలా అమిత్ షా చర్యలు తీసుకోవాలని పంజాబ్ సీఎం అమరీందర్ కోరారు. శిరోమణి అకాలీదళ్ (ఎస్ఏడీ) అధ్యక్షుడు సుఖ్బీర్ సింగ్ బాదల్ఈ ఘటనను ఖండించారు. ముగ్గురు పోలీసుల సస్పెన్షన్ కాగా వీడియోలో ఉన్నట్టుగా గుర్తించిన ఇద్దరు సబ్ ఇన్స్పెక్టర్లు, ఒక కానిస్టేబుల్‌ను సస్పెండ్ చేసినట్లు ఢిల్లీ పోలీసు ప్రతినిధి అనిల్ మిట్టల్ చెప్పారు. కాగా ఈ ఘటనపై కేంద్ర హోం శాఖ ఢిల్లీ పోలీసుల నుంచి వివరణ కోరింది. -
యువకుడిపై కత్తులతో దాడి, మృతి
జగిత్యాలరూరల్(కరీంనగర్): వైన్స్ షాపు ముందు మద్యం కొనుగోలు చేస్తున్న యువకుడిపై గుర్తుతెలియని దుండగులు కత్తులతో దాడి చేశారు. ఈ ఘటనలో యువకుడికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన కరీంనగర్ జిల్లా జగిత్యాల మండలం చనిగల్ గ్రామంలో బుధవారం జరిగింది. మండలంలోని గోవిందపల్లి గ్రామానికి చెందిన రాకేష్(20) వైన్స్ వద్ద మద్యం కొనుగోలు చేస్తుండగా.. కారులో వచ్చిన నలుగురు దుండగులు కత్తులతో అతనిపై దాడి చేసి పరారయ్యారు. ఇది గుర్తించిన స్థానికులు అతన్ని ఆస్పత్రికి తరలించి పోలీసులకు సమాచారం అందించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ యువకుడు మృతిచెందినట్టు సమాచారం.