
ప్రతీకాత్మక చిత్రం
సాక్షి, బంజారాహిల్స్ : బంజారాహిల్స్‌లో మంగళవారం దారుణం చోటుచేసుకుంది. స్థానికంగా పోలీస్ స్టేషన్ పరిధిలో ఇద్దరు వ్యక్తులు పరస్పరం కత్తులతో దాడి చేసుకున్నారు. కాగా రవీందర్(22), నవాజ్(20) కత్తులతో పరస్పరం దాడి చేసుక్నునట్లు తెలిసింది. అయితే ఎందుకు కత్తులతో దాడి చేసుకున్నారనేది ఇంకా తెలియాల్సి ఉంది. గతంలోనే వీరిద్దరిపై కేసులు ఉన్నట్లు పోలీసులు స్పష్టం చేశారు. దాడిలో తీవ్రంగా గాయపడిన రవీందర్‌కు తీవ్ర గాయాలు కావడంతో స్థానికంగా ఉన్న అపోలో ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసిన బంజారాహిల్స్ పోలీసులు నవాజ్‌ను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment