సాక్షి, హైదరాబాద్: ప్రేమించలేదని సంధ్యారాణిపై పెట్రోల్ పోసి సజీవ దహనం చేసిన నిందితుడు కార్తీక్‌పై తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. సంధ్యారాణి ప్రాణాలను పొట్టనబెట్టుకున్న కిరాతకుడు కార్తీక్‌ను కఠినంగా శిక్షించాలని సంధ్యారాణి కుటుంబసభ్యులు డిమాండ్ చేస్తున్నారు. అతన్ని కూడా పెట్రోల్ పోసి తగలబెట్టాలని గట్టిగా కోరుతున్నారు. సంధ్యారాణి సజీవ దహనం నేపథ్యంలో నగరంలో మహిళల భద్రతపైనా ఆందోళన వ్యక్తమవుతోంది. పోలీసులు మాత్రం దీనిని ప్రత్యేక ఘటనగా చూడాలని, నగరంలో మహిళల భద్రతకు ఇది ముడిపెట్టకూడదని అంటున్నారు.
ప్రేమోన్మాది కార్తీక్ నిప్పంటించడంతో తీవ్రంగా గాయపడిన బాధితురాలు సంధ్యారాణి తుదిశ్వాస విడిచిన సంగతి తెలిసిందే. గురువారం జరిగిన దాడి తర్వాత 80 శాతం కాలిన గాయాలతో గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆమె పరిస్థితి విషమించడంతో శుక్రవారం ఉదయం 7.20 గంటల ప్రాంతంలో కన్నుమూసింది. దీంతో హత్యాయత్నం కేసును హత్య కేసుగా మార్చిన లాలాపేట్ పోలీసులు నిందితుడు కార్తీక్‌ను అరెస్టు చేశారు. ఈ కేసులో ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక చట్టంలోని వాటితోపాటు మరికొన్ని సెక్షన్లు జోడించారు.
Comments
Please login to add a commentAdd a comment