చండీగడ్ : హరియాణాలో దారుణం చోటుచేసుకుంది. ఓ వివాహితపై యాసిడ్‌దాడి జరిగింది. ఈ ఘటన అంబాలాలోని సెక్టార్ 7లో గురువారం సాయంత్రం చోటుచేసుకుంది. వివరాలు.. లేబర్ డిపార్ట్‌మెంట్‌లో ఉద్యోగం చేస్తున్న కవిత (31) ఆఫీస్ నుంచి ఇంటికి వెళ్తుండగా.. బైక్‌పై వచ్చిన ఇద్దరు దుండగులు ఆమెపై యాసిడ్ విసిరారు. ఈ దాడిలో కవిత ముఖం, కుడి కన్ను, ఉదర భాగంపై తీవ్ర గాయాలయ్యాయని పోలీసులు తెలిపారు. బాధితురాలికి 60 శాతం కాలిన గాయాలయ్యాయనీ, ఆమె పరిస్థితి విషమంగా ఉందని సివిల్ ఆస్పత్రి డాక్టర్ సంజయ్ తెలిపారు. మెరుగైన చికిత్స కోసం ఆమెను చంఢీగడ్‌లోని జీఎంసీహెచ్ ఆస్పత్రికి తరలించారు.
దృశ్యాలున్నాయి.. కానీ
దాడికి సంబంధించిన దృశ్యాలు సీసీటీవీలో నమోదయ్యాయని పోలీసులు తెలిపారు. కానీ కెమెరా క్వాలిటీ సరిగా లేనందున దృశ్యాలు అస్పష్టంగా నమోదయ్యాయనీ వెల్లడించారు. నిందితులిద్దరూ హెల్మెట్ ధరించారనీ, బైక్‌పై వెనక కూర్చున్న వ్యక్తి మహిళపై యాసిడ్ విసిరాడని తెలిపారు. దాడికి సంబంధించిన కారణాలు తెలియాల్సి ఉంది. దాడి జరిగిన సమయంలో కవిత భర్త లడఖ్‌లో ఉన్నారు. ఆయన డాక్టర్‌గా సేవలందిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment