
సాక్షి, బనశంకరి(కర్ణాటక): పట్టపగలు ఇంట్లోకి చొరబడిన దుండగుడు ఒంటరి మహిళను కత్తెరతో పొడిచి చంపాడు. ఈ ఘటన బనశంకరిపోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. యారబ్‌నగర 16 వ క్రాస్ నివాసి టైలరింగ్ చేస్తున్న అఫ్రినా ఖానం (28) హతురాలు. భర్త లాలూఖాన్ తో జీవిస్తోంది. ఆమెకు ఐదు, మూడేళ్లు వయసు గల ఇద్దరు పిల్లలు ఉండగా వీరిని తమ పుట్టింటికి పంపించింది. భార్య ప్రవర్తనపై అనుమానం వచ్చిన భర్త గొడవపడేవాడు. ఇతడు ఒక టింబర్‌డిపోలో పనిచేసేవాడు. మంగళవారం సైతం గలాటా జరిగింది. భర్త పనికి వెళ్లిపోయిన కొంతసేపటికి ఒక వ్యక్తి వచ్చి అఫ్రినాతో గొడవకు దిగాడు.
కొంతసేపటికి అక్కడే ఉన్న కత్తెర తీసుకుని ఆమె పొడవడంతో తీవ్రగాయాలతో చనిపోయింది. దుండగుడు ఆమె మృతదేహంపై బట్టలు కుప్పగా వేసి నిప్పంటించి వెళ్లిపోయాడు. మంగళవారం సాయంత్రం ఇంట్లో నుంచి పొగలు వస్తుండగా స్థానికులు చూసి ఆమె సోదరికి, భర్తకు ఫోన్ చేశారు. వారు వచ్చి తలుపులు పగులగొట్టి ఇంట్లోకి వెళ్లగా పరుపు, మృతదేహంపై బట్టలు కాలిపోయాయి. బనశంకరి పోలీసులు చేరుకుని పరిశీలించారు. హంతకుని ఆచూకీ లభించిందని త్వరలోనే అరెస్ట్‌చేస్తామని దక్షిణ డీసీపీ హరీశ్ పాండే తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment