burned
-
యూపీకి వెళ్తున్న తెలంగాణ బస్సులో మంటలు
-
ఇద్దరు చిన్నారులును కాపాడేందుకు ..ఆ నలుగురు మహిళలు..!
అగ్ని ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన చిన్నారులను కాపాడటం కోసం ఆ నలుగురు అత్తలు చేసిన పని వింటే షాక్‌కి గురవ్వుతారు. ఈ రోజుల్లో కూడా ఇలాంటి అత్తలు ఉన్నారా? అనిపిస్తుంది. చెప్పాలంటే.. కుంటంబ బంధాలకు ఇచ్చిన ప్రాముఖ్యత తోపాటు, బాధలో ఉంటే మన అనుకునే వాళ్లకు ఎలా అండగా ఉండాలనేది చాటి చెబుతోంది ఈ కథ. ఈ ఘటన ఎక్కడ జరిగిందంటే.. తూర్పు చైనాలోని షాన్డాంగ్ ప్రావిన్స్‌లో ఫిబ్రవరి 20న పెద్ద అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఆరేళ్ల బాలిక కేకే, నాలుగేళ్ల చిన్నారి దండన్లు తీవ్రంగా గాయపడ్డారు. దాదాపు ఐదు రోజులు కోమాలో ఉన్నారు. శ్వాసకోశ మంట, అవయవ వైఫల్యంతో ప్రాణాలతో పోరాడుతున్నారు. ఆ చిన్నారుల తల్లి మిన్ ఈ విషయాన్ని తన కుంటుంబు సభ్యులకు తెలియజేసింది . పిలల్లను ప్రాణాలు దక్కాలంటే చర్మం, జుట్టు దానం చేయాలని పేర్కొంది. వెంటనే అందుకు ఆమె నలుగురు ఆడపడుచులు ముందుకు రావడమే గాక చర్మాన్ని, జుట్టుని దానం చేశారు. ఆ ప్రమాదంలో చిన్నారుల చర్మం తీవ్రంగా కాలిపోవడంతో ఆ ప్రదేశంలో ఆ మహిళలు దానం చేసిన చర్మన్ని అతికించి సర్జరీ చేస్తారు వైద్యులు. ఈ మేరకు ఆ చిన్నారి తల్లి మాట్లాడుతూ..ఈ విషయం గురించి తన ఆడపడుచులకు చెప్పగానే..వారు ముందుకు వచ్చి సాయం చేశారని సంతోషంగా చెప్పింది. ఇక ఆ ప్రమాదం ఎలా జరిగిందో వివరించింది. తన పిల్లల గదిలో ఎయిర్ కండీషనర్‌ను ఆన్ చేయగానే అకస్మాత్తుగా అది విరిగిపోయి ఈ ప్రమాదం చోటు చేసుకుందని చెప్పుకొచ్చింది ఆ చిన్నారుల తల్లి మిన్. ఆ మహిళల తోపాటు ఆ చిన్నారుల తల్లి కూడా చర్మాన్ని, జుట్టుని దానం చేసింది. కాగా, ఆ చిన్నారులకు వెంటనే శస్త్ర చికిత్స చేసి ప్రాణాలు కాపాడారు వైద్యులు.ఈ మేరకు ఆ నలుగురు మహిళలు మాట్లాడుతూ.."మేము నలుగురం ఇలా ఒకేసారి గుండు గీయించుకుంటామని కలలో కూడా అనుకోలేదు. అయినా తమ మేనకోడలు, మేనల్లుడి ప్రాణాలు రక్షించడం కోసం ఏం చేసేందుకైనా తాము సిద్దం అని చెబుతున్నారు." ఆ నలుగురు మహిళలు. ఈ ఐదుగురు మహిళలు ఆస్పత్రి బెడ్‌పై ఆ చిన్నారులను ఒడిలో ఉంచుకుని దిగిన ఫోటోల తోపాటు ఈ విషయం చైనా సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యింది. దీంతో నెటిజన్లు వండర్ విమెన్ అని ఒకరూ, ఈ ఏడాది అత్యంత అందమైన ఆంటీలు వీరే అంటూ కామెంట్ చేస్తూ పోస్టులు పెట్టారు. (చదవండి: నటి ఒలివియాకి బ్రెస్ట్ కేన్సర్! ఏకంగా నాలుగు సర్జరీలు..!) -
Shocking: పట్టపగలు ఇంట్లో ప్రవేశించి.. మహిళను..
సాక్షి, బనశంకరి(కర్ణాటక): పట్టపగలు ఇంట్లోకి చొరబడిన దుండగుడు ఒంటరి మహిళను కత్తెరతో పొడిచి చంపాడు. ఈ ఘటన బనశంకరిపోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. యారబ్నగర 16 వ క్రాస్ నివాసి టైలరింగ్ చేస్తున్న అఫ్రినా ఖానం (28) హతురాలు. భర్త లాలూఖాన్ తో జీవిస్తోంది. ఆమెకు ఐదు, మూడేళ్లు వయసు గల ఇద్దరు పిల్లలు ఉండగా వీరిని తమ పుట్టింటికి పంపించింది. భార్య ప్రవర్తనపై అనుమానం వచ్చిన భర్త గొడవపడేవాడు. ఇతడు ఒక టింబర్డిపోలో పనిచేసేవాడు. మంగళవారం సైతం గలాటా జరిగింది. భర్త పనికి వెళ్లిపోయిన కొంతసేపటికి ఒక వ్యక్తి వచ్చి అఫ్రినాతో గొడవకు దిగాడు. కొంతసేపటికి అక్కడే ఉన్న కత్తెర తీసుకుని ఆమె పొడవడంతో తీవ్రగాయాలతో చనిపోయింది. దుండగుడు ఆమె మృతదేహంపై బట్టలు కుప్పగా వేసి నిప్పంటించి వెళ్లిపోయాడు. మంగళవారం సాయంత్రం ఇంట్లో నుంచి పొగలు వస్తుండగా స్థానికులు చూసి ఆమె సోదరికి, భర్తకు ఫోన్ చేశారు. వారు వచ్చి తలుపులు పగులగొట్టి ఇంట్లోకి వెళ్లగా పరుపు, మృతదేహంపై బట్టలు కాలిపోయాయి. బనశంకరి పోలీసులు చేరుకుని పరిశీలించారు. హంతకుని ఆచూకీ లభించిందని త్వరలోనే అరెస్ట్‌చేస్తామని దక్షిణ డీసీపీ హరీశ్ పాండే తెలిపారు. -
సూపర్ లగ్జరీ బస్సు దగ్ధం
స్టేషన్ ఘన్పూర్: హన్మకొండ నుంచి ఉప్పల్‌కు వెళ్తున్న వరంగల్–1 డిపోకు చెందిన సూపర్ లగ్జరీ బస్సులో మంటలు చెలరేగి పూర్తిగా దగ్ధమైంది. అదృష్టవశాత్తు ప్రయాణికులందరూ క్షేమంగా బయటపడ్డారు. జనగామ జిల్లా స్టేషన్‌ఘన్‌పూర్ బస్టాండ్ సమీపంలో జాతీయ రహదారిపై శుక్రవారం సాయంత్రం ఈ ఘటన చోటు చేసుకుంది. సూపర్ లగ్జరీ బస్సు హన్మకొండ నుంచి ఉప్పల్‌కు మధ్యాహ్నం 3 గంటలకు బయల్దేరింది. స్టేషన్‌ఘన్‌పూర్ ఫ్లైఓవర్ ఎక్కిన బస్సు నెమ్మదిగా వెళ్తుంటే డ్రైవర్‌కు అనుమానం వచ్చింది. అప్పటికే బస్సు వెనుక వైపు ఉండే ఇంజన్లో షార్ట్ సర్క్యూట్ వల్ల పొగలు వస్తున్నాయి. వెనుక సీట్లలో కూర్చున్న ప్రయాణికులకు పొగ వాసన రావడంతో డ్రైవర్‌కు ఈ విషయాన్ని చెప్పారు. వెంటనే డ్రైవర్ బస్సును పక్కకు ఆపి ప్రయాణికులందరినీ కిందికి దించాడు. అప్పటికే బస్సులో మంటలు వ్యాపించాయి. అందరూ చూస్తుండగానే బస్సు పూర్తిగా కాలిపోయింది. వాటర్ ట్యాంకర్ తెప్పించి స్థానికులు మంటలు ఆర్పే ప్రయత్నం చేసినా అప్పటికే క్యాబిన్, సీట్లు, ఇంజన్ పూర్తిగా కాలిపోయాయి. అదే సమయంలో రాఘవాపూర్‌కు చెందిన తోట శ్రీకాంత్ బైక్ బస్సు పక్కనే ఉండటంతో పాక్షికంగా దగ్ధమైంది. కాగా, అగ్ని ప్రమాదం జరిగిన దాదాపు గంట తర్వాత పాలకుర్తి ఫైర్ ఇంజన్ ప్రమాదస్థలానికి చేరుకుంది. అనంతరం జనగామ నుంచి మరో ఫైర్ ఇంజన్ వచ్చింది. ఫైర్ ఇంజన్లు, వాటర్ ట్యాంకర్ల సహాయంతో మంటలను పూర్తిగా ఆర్పివేశారు. -
కరోనా ఎఫెక్ట్: నడిరోడ్డుపై కరెన్సీ నోట్ల కాల్చివేత
సాక్షి, శివాజీనగర: రోడ్డుపై నోటు పడిందంటే దేవునికి దండాలు పెట్టుకుని తీసుకుంటారెవరైనా. కానీ కరోనా వైరస్ ధనాశను కూడా చంపేస్తోంది. రోడ్డుపై పడిన నోట్లను ప్రజలు కాల్చివేసిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయింది. కల్బుర్గి జిల్లా ఆళంద తాలూకా సుంటనురు గ్రామంలో ఈ సంఘటన చోటు చేసుకుంది. ఎవరో ఉమ్మివేసి నోటు రోడ్డుపై పారవేసినట్లు అనుమానంతో నోట్లను ముట్టకుండా కట్టెతో పేర్చి ప్రజలు కాల్చివేశారు. ముఖానికి మాస్క్ వేసుకొని వచ్చిన అపరిచితులైన ముగ్గురు వ్యక్తులు కొంతసేపు మొబైల్లో మాట్లాడి, ఆ తరువాత నోటు పారవేసి వెళ్లినట్లు స్థానిక మహిళలు చెబుతున్నారు. నోటు పారవేసి వెల్లినవారిని తెలుసుకొని తక్షణమే గ్రామ మహిళలు నోటును పిల్లలు ముట్టకుండా మట్టితో మూయించి ఆ తరువాత గ్రామస్థులకు సమాచారం అందించారు. ఆ తరువాత గ్రామస్థులు నోట్లను తీసి కాల్చివేసినట్లు తెలిపారు. చదవండి: తల్లి మందుల కోసం టిక్‌టాక్; స్పందించిన సీఎం -
షార్ట్ సర్క్యూట్‌తో కాలిన టీవీలు, ఫ్రిజ్‌లు
మెదక్ మున్సిపాలిటీ : షార్ట్ సర్క్యూట్ ఏర్పడి సుమారు నాలుగు టీవీలు, రెండు ఫ్రిజ్‌లు కాలిపోయిన సంఘటన మెదక్ పట్టణంలోని బ్రహ్మణ వీధిలో శుక్రవారం సాయంత్రం జరిగింది. పట్టణంలో సాయంత్రం ఈదురు గాలులతో కూడిన వర్షం పడింది. ఇదే సమయంలో కరెంట్ షార్ట్ సర్క్యూట్ ఏర్పడటంతో పలు ఇళ్లలో నాలుగు టీవీలు, రెండు ఫ్రిజ్‌లు, సెటప్‌బాక్స్‌లు, ఫ్యాన్లు, ఫోన్లు, ట్యూబ్‌లైట్లు తదితర వస్తువులు కాలిపోయాయి. ప్రజలు భయబ్రాంతులకు గురయ్యారు. -
వికాస్ స్కూల్లో విధ్వంసం
కోవెలకుంట్ల : పట్టణ శివారులోని గుంజలపాడు రహదారిలో ఉన్న వికాస్ స్కూల్లో గుర్తు తెలియని దుండగులు మంగళవారం అర్ధరాత్రి విధ్వంసం సృష్టించారు. వచ్చే నెలలో పాఠశాలలు పున: ప్రారంభం కానుండటంతో రెండు రోజుల క్రితం నర్సరీ నుంచి పదో తరగతి వరకు రూ. 15 లక్షల విలువ చేసే టెస్ట్, నోట్ పుస్తకాలను తీసుకొచ్చి కంప్యూటర్ ల్యాబ్‌లో భద్రపరిచారు. గుర్తు తెలియని వ్యక్తులు అర్ధరాత్రి స్కూల్లోకి ప్రవేశించి ల్యాబ్ తాళాలు పగలగొట్టి పెట్రోలో పోసి పుస్తకాలు, కంప్యూటర్లకు నిప్పు పెట్టారు. స్కూల్ ఆవరణలో ఉన్న బస్సుల అద్దాలను ధ్వంసం చేసి పరారయ్యారు. బుధవారం ఉదయం ఈ రహదారిలో వాకింగ్‌కు వెళుతున్న వ్యక్తులు తరగతి గదిలో పొగ రావడాన్ని గమనించి స్కూల్ యాజమాన్యానికి సమాచారమిచ్చారు. పాఠశాల కరస్పాండెంట్ వినోద్‌కుమార్ స్కూల్‌కు చేరుకుని జరిగిన విధ్వంసంపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ సంఘటనలో రూ. 20 లక్షల మేర నష్టం వాటిల్లినట్లు తెలుస్తోంది. ఎస్ఐ మోహన్‌రెడ్డి సంఘటన స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. -
భార్యపై కోపంతో వాహనానికి నిప్పు
దేవరుప్పుల, వరంగల్ : భార్యపై కోపంతో ఓ వ్యక్తి తన వాహనానికి నిప్పంటించాడు. వివరాలిలా ఉన్నాయి. మండలంలోని ధర్మాపురం గ్రామానికి చెందిన బోడ రవికి ఆయన భార్యకు ఇటీవల ఓ విషయంలో వివాదం చోటుచేసుకుంది. అయితే తీవ్ర మనస్తాపాని కి గురైన రవి దేవరుప్పుల అంగడి సమీపంలోని వ్యవసాయ క్షేత్రాల్లోకి తన ద్విచక్ర వాహనాన్ని తీసుకెళ్లి నిప్పంటించారు. దీంతో దుర్గామాత ఉత్సవాల్లో ఏదైనా ప్రమాదం జరిగిందా అని స్థానికులు భయాందోళనకు గురయ్యారు. ఈ విషయమై స్థానిక ఎస్సై గడ్డం నరేందర్‌రెడ్డి మాట్లాడుతూ జరిగిన సంఘటనపై దర్యాప్తు చేస్తున్నామన్నారు. -
ఫాస్ట్‌ఫుడ్ సెంటర్‌కు నిప్పుపెట్టిన దుండగులు
మైలార్‌దేవ్‌పల్లి: గుర్తుతెలియని ముగ్గురు దుండగులు గురువారం తెల్లవారుజామున రెండు గంటల ప్రాంతంలో ఫాస్ట్‌ఫుడ్ సెంటర్‌ను తగులబెట్టిన ఘటన మైలార్‌దేవ్‌పల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఫాస్ట్‌ఫుడ్ సెంటర్ నిర్వాహకుడు జి.నవీన్‌కుమార్, లక్ష్మీనర్సింహస్వామి మొబైల్ రిపేరింగ్ సెంటర్ యజమాని సందీప్‌కుమార్, స్థానికుడు సూర్యకిరణ్ కథనం ప్రకారం వివరాలు... గత నాలుగు సంవత్సరాలుగా నవీన్‌కుమార్ పద్మశాలిపురంలో ఉంటూ మధుబన్ కాలనీలో ఓ ఫాస్ట్‌ఫుడ్ సెంటర్‌ను నిర్వహిస్తున్నాడు. పద్మశాలిపురానికి చెందిన సందీప్‌కుమార్ ఫాస్ట్‌ఫుడ్ సెంటర్ సమీపంలోనే మొబైల్ రిపేరింగ్ సెంటర్‌ను ఏర్పాటు చేసుకున్నాడు. ఫాస్ట్‌ఫుడ్ సెంటర్ కాలిన ఘటనలో సిలిండర్ పేలడంతో ఒక్కసారిగా మంటలు పక్కనే ఉన్న మొబైల్ రిపేరింగ్ సెంటర్, మెకానిక్ గ్యారేజీలు తగులబడ్డాయి. వెంటనే అప్రమత్తమైన నిర్వాహకులు స్థానికుల సహకారంతో అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ఫాస్ట్‌ఫుడ్ సెంటర్ పూర్తిగా కాలిపోగా, మొబైల్ సెంటర్లోని రెండు ల్యాప్టాప్స్, ఒక కంప్యూటర్ ప్రింటర్, ఫర్నీచర్ దగ్ధమయ్యాయి. మొబైల్ షాపులో సుమారు రూ. 25 వేల నగదు కాలిపోయిందని సందీప్‌కుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. గత కొన్ని సంవత్సరాలుగా ఫాస్ట్‌ఫుడ్ సెంటర్ మంచిగా నడుస్తుందని తాను లాభాల బాటలో ఉండటం తట్టుకోలేక గిట్టని వారు ఈ ప్రమాదానికి పాల్పడి ఉంటారని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో బాధితులు పేర్కొన్నారు. గురువారం తెల్లవారుజామున రెండు గంటల ప్రాంతంలో ముగ్గురు గుర్తుతెలియని దుండగులు వచ్చి ఫాస్ట్‌ఫుడ్ సెంటర్‌పై పెట్రోల్ పోసి నిప్పటించారన్నారు. రాత్రి డ్యూటీలో ఉన్న రాజేంద్రనగర్ ట్రాఫిక్ ఏసీపీతో పాటు మైలార్‌దేవ్‌పల్లి పోలీసులు, రాజేంద్రనగర్ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
ఆహుతైన యువతి
రాయగడ : రాయగడ జిల్లా మునిగుడ పోలీస్‌స్టేషన్ పరిధిలోని హటొమునిగుడ గ్రామానికి చెందిన సుస్మితమహనందియా(17) అనే యువతి గ్రామానికి దగ్గరలోని బురిజిగుడ అడవిలో సగం కాలిపోయి పడి ఉంది. సగం కాలి ఉన్న యువతి మృతదేహాన్ని పోలీసులు గురువారం గుర్తించారు. వివరాలిలా ఉన్నాయి. హటొమునిగుడకు చెందిన సుస్మిత మహనందియా ఈనెల 24వతేదీ నుంచి కనిపించడం లేదు. దీంతో ఆమె కుటుంబసభ్యులు, బంధువులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు మేరకు గాలిస్తున్న పోలీసులకు బురిజిగుడ అడవి ప్రాంతంలో కాలిపోయి పడి ఉన్న సుస్మిత మృతదేహం కనిపించింది. ఆమె సగం కాలిపోయి మృతిచెంది శరీరం కుళ్లిపోయి ఉంది. పోలీసులు వెంటనే ఆమె కుటుంబసభ్యులకు సమాచారం అందించగా వారంతా సంఘటనా స్థలానికి వచ్చి భోరున రోదించారు. సుస్మితమహనందియాకు ఎటువంటి ప్రేమ, ఇతర వ్యవహారాలు లేకపోయినప్పటికీ ఆమె మృతికి గల కారణాలు తెలియరాలేదు. గుర్తుతెలియని దుండగులు ఆమెపై లైంగికదాడికి పాల్పడి అనంతరం హత్య చేసి కాల్చివేశారా? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. లేదంటే ఇతర కారణాలేమైనా ఉన్నాయా? కుటుంబసభ్యులు ఎవరైనా ఈ పని చేశారా అన్నది విచారణలో తెలియాల్సి ఉంది. -
మద్యం మత్తులో కారుపై పెట్రోల్ పోసి దగ్ధం
జైపూర్(చెన్నూర్): జైపూర్ మండల కేంద్రంలోని సింగరేణి థర్మల్ పవర్ ప్లాంటు ప్రహరీ గోడ సమీపంలో పెద్దపల్లి జిల్లా గోదావరిఖనికి చెందిన ఇమ్రాన్ అనే వ్యక్తి తన ఎర్టీగా కారును మద్యం మత్తులో గురువారం రాత్రి 1గంట సమయంలో పెట్రోల్ పోసి కాలబెట్టాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం టీఎస్08ఈయూ7243 అనే ఎర్టీగా కారు ఖమ్మం జిల్లాకు చెందినది కాగా పెద్దపల్లి జిల్లా గోదావరిఖనికి చెందిన ఇమ్రాన్ కొనుగోలు చేశాడు. కుటుంబ కలహాల నేపథ్యంలో తన భార్య పుట్టింకి వెళ్లింది. ఈ క్రమంలో గురువారం జైపూర్ మండల కేంద్రానికి వచ్చిన ఇమ్రాన్ నిర్మానుష్యంగా ఉన్న ప్రాంతానికి వెళ్లి మద్యం మత్తులో తన ఎర్టీగా కారును తానే కాలబెట్టుకున్నాడు. కాగా అర్ధరాత్రికి రాత్రి కారు ఇక్కడకి తెచ్చి కాలబెట్టడంపై స్థానికులు ఆందోళనకు గురయ్యారు. పోలీసులు విచారించగా తానే మద్యం మత్తులో కారును తగులబెట్టిన్నట్లు ఇమ్రాన్ చెప్పినట్లు స్థానిక ఎస్సై ఆంజనేయులు తెలిపారు. -
వందలాది ఫోన్లను తగలబెట్టేశారు!
ఢాకా: ఫోన్ల వినియోగం ఈ రోజుల్లో సాధారణమైపోయింది. అవి లేకుండా రోజు గడిచే పరిస్థితి లేదు. అయితే రెసిడెన్షియల్ పాఠశాలల్లో ఉంటున్న విద్యార్థులకు మాత్రం ఫోన్ వినియోగించడంపై నిషేధం ఉంటుందనే విషయం తెలిసిందే. ఇలాగే బంగ్లాదేశ్‌లోని ఢాకాలోగల హథాజారీ బర్హా మదర్సాలో రెసిడెంట్ విద్యార్థులుగా చదువుతున్నవారు కూడా ఫోన్ వాడొద్దనే నిబంధన ఉంది. అయితే కొందరు విద్యార్థులు దొంగచాటుగా ఫోన్లు వాడుతున్నారని, మ్యూజిక్ వింటున్నారని, వీడియోలు చూస్తున్నారని తెలుసుకున్నారు. దీనిపై స్పందించిన యాజమాన్యం వారి నుంచి వందలాది ఫోన్లను స్వాధీనం చేసుకుంది. వాటన్నింటిని ఒకచోట వేసి తగులబెట్టేసింది. -
విద్యుదాఘాతంతో భారీ అగ్ని ప్రమాదం
శీతనపల్లి (కైకలూరు): విద్యుదాఘాతంతో మండలంలోని శీతనపల్లి గ్రామంలో సోమవారం మూడు తాటాకు ఇళ్లు పూర్తిగా దగ్ధమయ్యాయి. బాధితులు కట్టుబట్టలతో రోడ్డున పడ్డారు. సుమారు రూ.10 లక్షల మేరకు ఆస్తి నష్టం వాటిల్లిందని అంచనా వేశారు. బొర్రా పేర్రాజు, బొర్రా నాగమల్లేశ్వరీ, గోకనబోయిన చక్రవర్తి కుటుంబాలు పక్కపక్కనే తాటాకు ఇళ్లలో నివసిస్తున్నారు. విశ్రాంత ఉపాధ్యాయుడు పేర్రాజు ఆయన భార్య సామ్రాజ్యంతో నివసిస్తున్నారు. భర్త మరణించడంతో నాగమల్లేశ్వరి ఒంటరిగా ఉంటుంది. చక్రవర్తి పొలం పనులు చేస్తుండగా, భార్య మంగమ్మ పాఠశాలలో ఆయాగా పనిచేస్తుంది. విద్యుత్ షార్టు సర్కూట్ వల్ల ముందుగా చక్రవర్తి ఇంట్లో మంటలు రేగాయి. వృద్ధుడైన పేర్రాజును అతికష్టం మీద బయటకు తీసుకొచ్చారు. అదే విధంగా నాగమల్లేశ్వరి మంటలు చూసి బయటకు పరుగులు తీసింది. చక్రవర్తి గొడ్లసావిడ వద్ద రెండు పాడి గేదెలు, ఒక పడ్డా అగ్నికీలకల్లో చిక్కుకున్నాయి. గ్రామస్తులు వాటి కట్లు విప్పారు. అప్పటికే వాటి శరీరం భారీగా కాలింది. సమీపంలోని కొబ్బరిచెట్లు ఆకులు మండలకు కాలిపోయాయి. రెండు గ్యాస్ సిలిండర్లు భారీ శబ్ధంతో పేలాయి. అగ్నిమాపక సిబ్బంది ఒక సిలిండరును పేలకుండా అదుపు చేశారు. అగ్నికీలలు పెరగడంతో బొర్రా మురళీ, నీలపాల రామచంద్రరావు ఇళ్ల అద్దాలు పగిలాయి. కైకలూరు అగ్నిమాపక అధికారి జీవీ రామారావు ఆధ్వర్యంలో సిబ్బంది మంటలు అదుపు చేశారు. సర్పంచ్ కట్టా శ్రీనివాసరావు, వార్డు సభ్యులు పరమేశ్వరరావు, గ్రామ పెద్దలు బాధితులను పరామర్శించారు. గ్రామ ప్రత్యేకాధికారి అరుణ్‌కుమార్ వివరాలు సేకరించారు. పంచాయతీ, రెవెన్యూ అధికారులు బాధితుల వివరాలు తెలుసుకున్నారు. ప్రభుత్వం బాధితులను అదుకోవాలన్నారు. -
విజయవాడలో అగ్ని ప్రమాదం ఆరు ఇళ్లు దగ్ధం
-
రహదారిపై ఉల్లిగడ్డల లారీ దగ్ధం
-
దొంగతనానికి వచ్చి సజీవ దహనం!
- అగ్నికి ఆహుతైన టీ కొట్టు డబ్బా - మంటలు ఆర్పిన తర్వాత బయటపడిన మృతదేహం కొత్తూరు: దొంగతనానికి వచ్చిన ఓ వ్యక్తి మంటల్లో చిక్కి సజీవదహనం అయ్యాడు. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా కొత్తూరు మండల కేంద్రంలో బుధవారం తెల్లవారుజామున జరిగింది. కొత్తూరులోని పోలీస్‌స్టేషన్ వెళ్లే రోడ్డులో దొండిరామ్‌కు చెందిన టీ కొట్టులోంచి మంటలు రావడం గమనించిన స్థానికులు పోలీసులు, అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చారు. వారు మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. అనంతరం పరిశీలించగా టీకొట్టు డబ్బాలో సగం కాలిన వ్యక్తి మృతదేహం కనిపించింది. ఈ విషయమై రూరల్ సీఐ మధుసూదన్‌ను వివరణ కోరగా.. టీకొట్టులో చోరీకి వచ్చిన దొంగ.. డబ్బాపై ఉన్న రేకులు తొలగించి లోపలికి ప్రవేశించినట్లు తెలిపారు. అదే సమయంలో టీకొట్టులో అమ్మకానికి పెట్టిన పెట్రోల్, కిరోసిన్ డబ్బాలపైన దొంగ పడ్డాడు. చీకటిగా ఉండడంతో వెలుతురు కోసం అగ్గిపుల్లను వెలిగించాడు. దీంతో మంటలు వ్యాపించి సజీవ దహనమైనట్లు అనుమానం వ్యక్తం చేశారు. మరో కోణంలోనూ విచారణ చేస్తున్నట్లు పేర్కొన్నారు. కేసు దర్యాప్తులో ఉంది. -
రంగుల పండుగలో విషాదం
-
షార్ట్ సర్క్యూట్ తో హార్డ్‌వేర్ షాప్ దగ్ధం
శంషాబాద్ రూరల్: మండలంలోని నర్కూడలో ఉన్న ఓ హార్డ్‌వేర్ షాపులో ప్రమాదవశాత్తు మం టలు చెలరేగి మెటీరియల్ దగ్ధవైుంది. శుక్రవారం రాత్రి గ్రామంలోని జై భవాని హార్డ్‌వేర్ అండ్ ఎలక్ట్రికల్ షాపులో షార్ట్ సర్క్యూట్ తో హార్డ్‌వేర్ షాప్ దగ్ధం తో మంటలు చెలరేగాయి. దుకాణంలో ప్లాస్టిక్ మెటీరియల్ ఎక్కువగా ఉండడంతో మంటల తీవ్రత పెరిగిం ది. స్థానికులు మంటలార్పేందుకు విఫలయత్నం చేశారు. ఘటన జరిగిన గంట తర్వాత చేరుకున్న ఫైర్ ఇంజిన్ తో చాలా సేపటికి మంటలు అదుపులోకి తీసుకొచ్చారు. రూ.40లక్షల వరకు నష్టం వాటిల్లినట్లు దుకాణం నిర్వాహకుడు తెలిపారు. -
అగ్నిప్రమాదంలో చిన్నారుల సజీవదహనం
-
చంద్రన్న బీమా జీవో కాపీలు దహనం
ప్రభుత్వ ఆదేశాలపై భగ్గుమన్న భవన నిర్మాణ కార్మికులు పెద్దాపురంలో నిరసన ప్రదర్శన పెద్దాపురం : భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డును చంద్రన్న బీమా పథకంలో విలీనం చేస్తూ ప్రభుత్వం జీవో విడుదల చేయడంపై పెద్దాపురం అర్బన్, రూరల్ ప్రాంతాల భవన నిర్మాణ కార్మికులు మండిపడుతున్నారు.ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ భవన నిర్మాణ కార్మికుల సంఘం ఆధ్వర్యంలో సోమవారం కార్మికులంతా రోడెక్కారు. స్థానిక యాసలపు సూర్యారావు భవనం నుంచి శోభా థియేటర్, నువ్వులగుంట వీధి, పాత ఆసుపత్రి మీదుగా మెయిన్ రోడ్డు వరకూ వారు భారీ ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా భవన నిర్మాణ కార్మిక సంఘం మండల అధ్యక్షుడు గడిగట్ట సత్తిబాబు, సీపీఎం పట్టణ కార్యదర్శి నీలపాల సూరిబాబు, ఎలక్ట్రికల్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షుడు చింతల సత్యనారాయణ మాట్లాడుతూ భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డును ఎత్తివేసేందుకే ప్రభుత్వం ఈ జీవో విడుదల చేసిందన్నారు. సంక్షేమ బోర్డును చంద్రన్న బీమాలో కలిపితే భవన నిర్మాణ కార్మికుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారుతుందన్నారు.ప్రభుత్వం విడుదల చేసిన జీవో కాపీలను వారు దహనం చేశారు. కార్యక్రమంలో సీపీఎం కౌన్సిలర్ కూనిరెడ్డి అరుణ, కంచుమర్తి కాటంరాజు, మాగాపు నాగు, రాజమహేంద్రపు రామారావు, సిద్ధాంతపు వెంకటరమణ, పాలిపర్తి భద్రరావు, కర్రి వీరశివ, ముమ్మన శ్రీను, బల్ల రాంబాబు, బుడత రవీంద్ర, గంగాధర్ పాల్గొన్నారు. -
అనంతలో బిస్కెట్ల లోడ్ లారీ దగ్ధం
-
కాలేజీలో స్టూడెంట్స్ బైకులు దగ్ధం
-
ట్రాన్స్‌కో ఉద్యోగి దారుణ హత్య
– మృతదేహాన్ని కాల్చివేసిన దుండగులు – ఆలస్యంగా వెలుగులోకి – స్నేహితులే చంపేశారని సోదరుల ఫిర్యాదు గుర్రంకొండ: మండలంలోని చిట్టిబోయనపల్లె వద్ద ట్రాన్స్‌కో ఉద్యోగిని దారుణంగా హత్యచేసి మృతదేహాన్ని కాల్చివేసిన విషయం ఆలస్యంగా మంగళవారం వెలుగులోకి వచ్చింది. మృతుడు కురబలకోట మండలానికి చెందిన వ్యక్తిగా పోలీసులు నిర్ధారించారు. పోలీసుల కథనం మేరకు... కురబలకోట వుండలం కనసానివారిపల్లెకు చెందిన ఆర్.రంగనాథం కుమారుడు ఆర్.సోవుశేఖర్(24) అదే మండలంలోని కంటేవారిపల్లె విద్యుత్ సబ్‌స్టేషన్‌లో డ్యూటీ ఆపరేటర్‌గా పనిచేస్తున్నాడు. ఈ నెల 2న స్నేహితులతో కలిసి బయటకు వెళ్లాడు. తర్వాత ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు, బంధువ#లు అతని కోసం గాలించారు. మంగళవారం గుర్రంకొండ పంచాయతీ చిట్టిబోయనపల్లె సమీపంలోని బుట్టాయచెరువు వద్ద పొదల్లో గుర్తుతెలియని మృతదేహాన్ని కాల్చివేసినట్టు స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. వాల్మీకిపురం సీఐ శ్రీధర్‌నాయుడు, గుర్రంకొండ ఎస్ఐ రామకృష్ణ అక్కడికి చేరుకుని పరిశీలించారు. సమీపంలో మృతుడి చెప్పులు, వాచితోపాటు ఖాళీ మద్యం సీసాలు, ఎర్రగడ్డలు, పచ్చళ్లు పడి ఉన్నాయి. బాగా వుద్యం తాగించి హత్యచేసి పెట్రోలు పోసి కాల్చివేసినట్లు గుర్తించారు. ఈ విషయాన్ని కురబలకోట పోలీసులు అదృశ్యమైన సోవుశేఖర్ కుటుంబ సభ్యులకు తెలిపారు. వారు గుర్రంకొండకు చేరుకొని మృతదేహం వద్ద పడి ఉన్న వాచి, చెప్పులను బట్టి వుృతుడు సోవుశేఖర్ అని గుర్తించారు. సోవుశేఖర్‌ను స్నేహితులే హత్యచేశారని సోదరులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎస్ఐ రావుకృష్ణ కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
జాతీయ రహదారిపై వ్యాన్ దగ్ధం
సురక్షితంగా బయటపడిన డ్రైవర్ రావులపాలెం: జాతీయ రహదారిపై వెళుతున్న వ్యాన్‌లో గ్యాస్ ట్యాంకర్ నుంచి గ్యాస్ లీక్ అవడంతో మంటలు వ్యాపించి క్షణాల్లో కారు కాలి పోయింది. నరేంద్రపురానికి చెందిన డ్రైవర్ నక్కా శరత్‌బాబు మారుతి వ్యాన్‌లో రావులపాలెం వైపు నుంచి తణుకు వైపు వెళుతున్నాడు. స్థానిక వీస్కే్వర్ థియేటర్ సమీపంలోకి వచ్చేసరికి కారులో గ్యాస్ లీక్ అయి మంటలు వ్యాపించాయి. డ్రైవర్ శరత్‌బాబు కారు నుంచి బయటకు దూకేయడంతో ప్రాణాపాయం తప్పింది. క్షణాల్లో మంటలు వ్యాపించి వ్యాన్ పూర్తిగా దగ్ధం అయ్యింది. ఇరువైపులా సుమారు అరకిలోమీటరు దూరంలో ట్రాఫిక్ నిలిచిపోయింది. సీఐ పీవీ రమణ అక్కడకు చేరుకుని కొత్తపేట అగ్నిమాపక అధికారికి సమాచారం ఇచ్చారు. ఫైర్ ఇంజన్ వచ్చేలోగా సీఐ స్థానికుల సాయంతో ఫోమ్ ఉపయోగించి మంటలను అదుపు చేసే ప్రయత్నం చేశారు. ఇన్చార్జి ఫైర్ ఆఫీసర్ వై.శ్రీరాములు అగ్నిమాపక సిబ్బందితో అక్కడకు చేరుకొని మంటలు అదుపు చేశారు. ఆ వ్యాన్‌లో రెండు గృహ వినియోగానికి ఉపయోగించే గ్యాస్ సిలిండర్లను పోలీసులు గుర్తించారు. హైవే రెండో లైన్‌పై ట్రాఫిక్‌ను మళ్లించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఏఎస్సై ఆర్‌వీరెడ్డి తెలిపారు. -
24 గంటల్లోనే చేదించారు
- ఇద్దరు నిందితులు అరెస్ట్ హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా కీసర శివారులో ఆదివారం జరిగిన న్యాయవాది ఉదయ్ కుమార్ హత్యకేసును పోలీసులు చేధించారు. భూవివాదమే హత్యకు దారితీసినట్టు పోలీసులు తేల్చారు. రాష్ట్రంలో సంచలనం సృష్టించిన అడ్డకేట్ ఉదయ్‌కుమార్ హత్యకేసును సవాల్‌గా స్వీకరించిన పోలీసులు 24 గంటల్లోనే చేదించారు. ఈ మేరకు సోమవారం సాయంత్రం కీసరపోలీస్స్టేషన్లో మల్కాజ్గిరి డీసీపీ రాంచంద్రారెడ్డి, ఏసీఫీ రఫిక్, కీసర సి.ఐ గురువారెడ్డిలు నిందితుల వివరాలను ,హత్యజరిగిన తీరును వివరించారు. వివరాల్లోకి వెళ్లితే కాప్రా ఆఫీసర్స్‌కాలనీలో నివాసం ఉండే ఉదయ్‌కుమార్ మల్కాజ్గిరి కోర్టులో జూనియర్న్యాయవాదిగా పనిచేస్తుండేవాడు. ఉదయ్‌కుమార్ తండ్రి నకులుడు ఆర్మిరిటైర్డ్ ఆఫిసర్. ఆర్మీలోపనిచేసిన సమయంలో నకలుడికి ఆర్మి వెల్పేర్అసోషియేషన్ నుండి 1975 లో జవహార్‌నగర్ పంచాయతీపరిధిలోని చెన్నాపూర్ గ్రామంలో సర్వేనెంబ 700 లో సుమారు 5 ఎకరాల స్థలాన్ని కేటాయించింది.కాగా జహహార్నగర్ ఆర్మివెల్పేర్అసోషియేషన్స్థలాలకు , ప్రభుత్వానికి మద్య ఈ భూములకు సంబందించి కోర్టులో కేసు నడుస్తున్నందునా నకులుడికి పట్టా సర్టిపికేటు రాలేదు.నకులుడికి వేల్పేర్ అసోషియేషన్ నుండి వచ్చిన 5 ఎకరాల్లో గత కొన్నేళ్ల గా జవహర్‌నగర్‌కు చెందిన ఆంజనేయులు అనే వ్యక్తికి నకులుడివద్ద నుండి లీజ్‌కు తీసుకొని వ్యవసాయం చేస్తున్నాడు. ఇటీవల కాలంలో ఆంజనేయులు ఈస్థలాన్ని కారుచౌకగా కొట్టేయలని పథకం వేసి అల్లుడైన లోకేష్(గుంటూరువాసి)చే ఏప్రిల్ 2016లో నకులుడికి రూ 25 లక్షల నగదు చెల్లించి సదరు భూమిని నోటరీ చేయించుకున్నాడు. ఈ విషయం తెలుసుకున్న నకులుడు కుమారుడైన అడ్వకేట్ జవహర్‌నగర్‌లో గల వ్యవసాయ పొలం వద్దకు వెళ్లి తనకు తెలియకుండా కారుచౌకగా తమ తండ్రి వద్ద నుండి ఏవిధంగా భూమిని కొనుగోళు చేసుకుంటారని లోకే ష్‌తో వాదనకుదిగాడు. ఇచ్చిన డబ్బులను తిరిగి తీసుకొని తమ భూమిని తమకు ఇవ్వాలని లోకేష్ పై ఉదయ్‌కుమార్ గతరెండు మాసాలుగా ఒత్తిడి తీసుకువచ్చాడు. ఈనేపద్యంలోనే ఉదయ్‌కుమార్ అడ్డును తొలగించుకోవాలని లోకేష్ పన్నాగం పన్నాడు. శనివారం మద్యాహ్న ం 1 గంట సమయంలో జవహర్నగర్లోగ ల తమ తండ్రికి చెందిన వ్యవసాయభూమి వద్దకు వెళ్లిన ఉదయ్‌కుమార్‌ను చూసిన లోకేష్ అతడితో గొడవకు దిగాడు. తాను కొనుగోళు చేసిన భూమి వద్దకు మళ్లి ఎందుకువచ్చావని వెంటతెచ్చుకున్న పదునాటి కత్తితో ఉదయ్‌కుమార్ మెడమీద కొట్టడంతో ఉదయ్‌కుమార్ ఒక్కసారిగా క్రిందపడిపోయాడని దీంతో నిందితుడు లోకేష్ మరో రెండు మూడుసార్లు క్రింద పడిపోయిన ఉదయ్‌కుమార్ మెడపై కత్తితోదాడి చేయడంతో ఉదయ్‌కుమార్ అక్కడికక్కడే మృతిచెందాడు. మృతదేహాన్ని అక్కడి నుండి తరలించేందుకు లోకేష్ పక్కనే వ్యవసాయం చేస్తున్న సుమన్‌రెడ్డి సహయం కోరగా అంగికరించిన సుమన్ మృతిచెందిన ఉదయ్‌కుమార్ మృతదేహాన్ని లోకేష్, సుమన్‌రెడ్డిలు ఇద్దరు కలిసి ఉదయ్‌కుమార్ కారు వెనక సీట్లో పెట్టి అక్కడినుండి సుమన్‌రెడ్డి వెళ్లిపోయాడు. అనంతరం లోకేష్ తన ద్వీచక్రవాహానం పై జవహర్నగర్లోగల పెట్రోల్‌బంక్ వద్దకు వెళ్లి రూ 500 ల పెట్రోల్‌ను ఒక డబ్బాలో కొనుగోళు చేసుకొని సంఘటనాస్థలానికి చేరుకొని రాత్రి 7 గంటల సమయంలో మారుతికారును నడుపుకుంటూ కీసరదాయర గ్రామశీవారుకు తీసుకువచ్చి మృతదేహాంతోపాటు, కారు మీద పెట్రోల్ పోసి నిప్పటించాడు. కారుకు నిప్పటించే సమయంలో హఠాత్తుగా నింధితుడి లోకేష్ కుడా మంటలు అట్టుకోవడంతో అతడు కుడా గాయపడ్డాడు. తన షర్ట్‌ను అక్కడే విప్పి కాలీనగాయాలతో లోకేష్ కీసరదాయర గ్రామం మీదుగా రాత్రి 9 గంటల ప్రాంతంలో ఈసిఐఎల్‌కు చేరుకున్నాడని అక్కడి నుండి చికిత్సనమిత్తం గాంధి ఆసుపత్రికి చేరుకున్నాడన్నారు. లోకేష్కుడా 45 శాతం మేర కాలిందని అతడి పరిస్థితికుడా కొంత మేర విషమంగా ఉందని దీంతో అతడిని అరెస్టుచేయలేదని , మృతదేహాన్ని తరలించేందుకు సహకరించిన నిందితుడు సుమన్న్రెడ్డిని అదుపులోకి తీసుకొని కోర్టుకు హజరుపరడచం జరిగిందన్నారు. కాగా ఎలాంటి ఆధారాలు లేకుండా పూర్తిగా కారుతో సహాకాలిపోయి వెముకలు మాత్రమే మిగిలిన అడ్వకేట్ ఉదయ్‌కుమార్ హత్యకేసును గ్యాస్సీలిండర్నెంబర్ ఆధారంగా కేవలం 24 గంటలోపే చేధించిన కీసర సి.ఐ గురువారెడ్డి, ఎస్.ఐ అనంతచారి, విష్ణువర్థన్‌రెడ్డి, సిబ్బంది డీసీపీ,ఏసీపీ రఫిక్‌లు అభినందించారు.కాగా నింధితుడి ద్వీచక్రవాహనాన్ని స్వాధీనం చేసుకోవడం జరిగిందని హత్యకు ఉపయోగించిన కత్తిని నిందితుడు రహాస్యప్రాంతంలో దాచిపెట్టడాన్ని నిందుతుడు ఆసుపత్రిలో కోలుకోగానే హత్యకుఉపయోగించిన కత్తిని కుడా స్వాధీనం చేసుకుంటామని పోలీసులుతెలిపారు. నింధితులను కఠినంగా శిక్షించాలి: కాగా అడ్వకేట్ ఉదయ్‌కుమార్‌ను దారుణంగాహత్యచేసిని నింధులను కఠినంగా శిక్షించాలని మల్కాజ్గిరి బార్‌అసోషియేషన్‌సభ్యులు డీమాండ్చేశారు. ఈమేరకు కీసరపోలీస్స్టేషన్ కు చేరుకున్న బార్‌అసోషియేషన్‌సభ్యులు డీసీపీ రాంచంద్రారెడ్డికి వినతిపత్రాన్ని అందజేశారు. ఉదయ్కుమార్హత్యకేసులో భూమాఫియా ఉన్నదని పెద్ద వ్యక్తులు తప్పించుకునే ప్రయత్నంచేస్తున్నారని నిందితులు ఎంత పెద్ద వారైన పోలీసులు వారందరిని కుడా అరేస్టుచేయాలని డీమాండ్చేశారు. ఈ మేరకు సీపీ నికుడా త్వరలోకలిసి తాము ఫిర్యాదుచే స్తామన్నారు. -
భూవివాదమే ప్రాణం తీసిందా..?
ఆయనో న్యాయవాది.. పేరు ఉదయ్‌కుమార్. ఆయన తండ్రి ఆర్మీలో పనిచేసి ఉద్యోగ విరమణ చేశాడు. దీంతో ఆయనకు ప్రభుత్వం శామీర్‌పేట మండలం జవహర్‌నగర్ పంచాయతీ పరిధిలోని చెన్నాపూర్ సర్వేనెంబర్ 700లో ఐదెకరాల స్థలాన్ని కేటాయించింది. ఈ భూమి విషయంలో కొంతమందితో అతడికి వివాదం నెలకొంది. ఈ నేపథ్యంలో న్యాయవాదిని గుర్తు తెలియని వ్యక్తులు కీసర మండలం కీసరదాయర శివారులో చంపేసి కారులో మృతదేహాన్ని ఉంచి దహనం చేశారు. శనివారం అతనికి భార్య అనేకసార్లు ఫోన్ చేసినా లిఫ్ట్ చేయలేదు. చివరకు ఆదివారం ఉదయం కారులో అతడిని దహనం చేసిన విషయం బయట పడింది - కీసర * న్యాయవాదిని దారుణంగా హత్య చేసిన దుండగులు * తన తండ్రి మాజీ సైనికుడి పొలం విషయమై గొడవలు * కీసరదాయర శివారులో ఘటన * వివరాలు సేకరించిన డీసీపీ, ఏపీసీ * కలకలం సృష్టించిన ఉదయ్‌కుమార్ హత్య కీసర: న్యాయవాది ఉదయ్‌కుమార్(45) హత్య జిల్లాలో ఆదివారం కలకలం రేపింది. మండల పరిధిలోని కీసరదాయర శివారులో దుండగులు ఆయనను చంపేసి కారులో మృతదేహం ఉంచి కాల్చేశారు. సంఘటనా స్థలాన్ని మల్కాజిగిరి డీసీపీ రాంచంద్రారెడ్డి, పేట్ బషీరాబాద్ ఏసీపీ రఫీక్ తదితరులు పరిశీలించారు. పోలీసులు జాగిలాలతో వివరాలు సేకరించారు. జాగిలం ఘటనా స్థలం నుంచి కీసర రహదారిలో ఉన్న ఓ నీళ్లసంపు వద్దకు వెళ్లింది. కాప్రా శ్రీనివాస ఆఫీసర్స్ కాలనీకి చెందిన ఉదయ్‌కుమార్, జగదీశ్వరి దంపతులు. ఉదయ్‌కుమార్ ఈసీఐఎల్‌లోని ఓ సీనియర్ న్యాయవాది వద్ద పనిచేస్తున్నాడు. ఇదిలా ఉండగా, శని వారం మధ్యాహ్నం తన మారుతీ కారులో వెళ్లిన ఉదయ్‌కుమార్ తిరిగి రాలేదు. కుటుంబీకులు ఆయన ఫోన్ కాల్ చేసినా లిఫ్ట్ చేయలేదు. ఆదివారం ఉదయం కీసరదాయర గ్రామ శివారులో ఓ కారులో వ్యక్తి మృతదేహం కాలిపోయి ఉంది. ఘటనా స్థలంలో ఓ చెప్పుల జత, సగం చినిగిపోయిన దుండగుడిదిగా భావిస్తున్న చొక్కా, అగ్గిపెట్టె, కారులో కాలిపోయిన మృతుడికి సంబంధించిన సెల్‌ఫోన్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. రహదారి గొడవే కారణమా..? భూవివాదమే న్యాయవాది ఉదయ్‌కుమార్ హత్యకు దారి తీసి ఉంటుందని కుటుంబీకులు, పోలీసులు అనుమానిస్తున్నారు. ఉదయ్‌కుమార్ తండ్రి నకులుడు ఆర్మీలో పనిచేసి రిటైర్డ్ అయ్యారు. ఆయనకు సర్కార్ శామీర్‌పేట మండలం జవహర్‌నగర్ పంచాయతీ పరిధిలోని చెన్నాపూర్ సర్వేనెంబర్ 700లో ఐదెకరాల స్థలాన్ని కేటాయించింది. ఇటీవల సదరు భూమిలోకి వెళ్లే రహదారి విషయంలో కొందరితో వివాదం నెలకొందని కుటుం బీకులు తెలి పారు. 5 నెలల క్రితం ఉదయ్‌కుమార్ తండ్రి నకులుడిపై కొందరు దాడిచేసి గాయపర్చారని.. ఈ నేపథ్యంలో ఉదయ్‌కుమార్ హత్య జరిగిందా అనే అనుమానాలు వ్యక్తమయ్యాయి. దేశసేవ చేస్తే పుత్రశోకం మిగిలింది కుమారుడి హత్యతో నకులుడు షాక్‌కు గురయ్యాడు. ఘటనా స్థలంలో ఆయన గుండెలుబాదుకుంటూ రోదించాడు. దేశసేవ చేసిన తనకు పుత్ర శోకం మిగిల్చారని ఆయన రోదించిన తీరు అక్కడున్న వారికి కంటతడి తెప్పించింది. మాంసపు ముద్దగా మారిన తన భర్త ఉదయ్‌కుమార్‌ను చూసి మృతుడి భార్య జగదీశ్వరి గుండెలుబాదుకుంటూ రోదించింది. అయితే, ఇటీవల ఉదయ్‌కుమార్ ఓ కేసు విషయంలో కీసర ఠాణాకు వచ్చినట్లు పోలీసులు తెలిపారు. అయితే, ఉదయ్‌కుమార్, జగదీశ్వరి దంపతులకు సంతానం లేదు. మల్కాజిగిరి బార్ అసోసియేషన్ సభ్యులు ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు తెలుసుకున్నారు. నిందితులను కఠినంగా శిక్షించాలని ఈ సందర్భంగా వారు పోలీసులను డిమాండ్ చేశారు. కేసును అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ గురువారెడ్డి తెలిపారు. -
'ఆ నిందితులను త్వరలోనే పట్టుకుంటాం'
హైదరాబాద్: కీసరలోని మల్లన్నగుడి వద్ద కారుతో సహా ఓ వ్యక్తి దహనమైన కేసులో నిందితులను త్వరలోనే పట్టుకుంటామని డీసీపీ రామచంద్రారెడ్డి వెల్లడించారు. కీసర ఘటనాస్థలిలోనే పోస్టుమార్టం నిర్వహిస్తున్నట్టు పోలీసులు తెలిపారు. ఆదివారం సంఘనా స్థలాన్ని ఇంఛార్జ్ డీసీపీ రామచంద్రారెడ్డి పరిశీలించారు. క్లూస్ టీమ్స్, ఫోరెన్సిక్, డాగ్ స్క్వాడ్ అధికారుల నుంచి సమాచారం సేకరించినట్టు చెప్పారు. సీసీటీవీ ఫుటేజ్, కాల్ డేటా ఆధారంగా దర్యాప్తు చేపడుతున్నామని డీసీపీ తెలిపారు. కాగా, రంగారెడ్డి జిల్లాలోని కీసరలో కారుతో సహా ఓ వ్యక్తిని గుర్తుతెలియని దుండగులు పెట్రోల్ పోసి తగలబెట్టారు. కీసరలోని మల్లన్నగుడి వద్ద శనివారం అర్ధరాత్రి దాటాక ఈ సంఘటన జరిగింది. మృతుడిని నగరానికి చెందిన అడ్వకేట్ ఉదయ్ కుమార్‌గా పోలీసులు గుర్తించారు. శనివారం ఉదయం ఇంటి నుంచి బయటకు వెళ్లిన ఉదయ్ తిరిగిరాలేదు. దాంతో కంగారుపడిన కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు. వారి ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన పోలీసులు కేసును దర్యాప్తు చేస్తున్నారు. ఇదిలా ఉండగా, కీసర ఘటనా స్ధలానికి చేరుకున్న ఉదయ్ భార్య జగదీశ్వరి.. కారు తమదేనని, అయితే మృతుని ఒంటిపై ఉన్న దుస్తులు, చెప్పులు మాత్రం తన భర్తవి కావని చెబుతున్నారు. భూ వివాదమే హత్యకు కారణమైంటుందని ఉదయ్ తండ్రి తెలిపారు. (చదవండి: కారు మాదే కానీ, దుస్తులు మా వారివి కావంటున్న కుటుంబ సభ్యులు) -
'కారు మాదే కానీ, దుస్తులు మా వారివి కావు'
కీసర: రంగారెడ్డి జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. కారుతో సహా ఓ వ్యక్తిని గుర్తుతెలియని దుండగులు పెట్రోల్ పోసి తగలబెట్టారు. కీసరలోని మల్లన్నగుడి వద్ద శనివారం అర్ధరాత్రి దాటాక ఈ సంఘటన జరిగింది. మృతుడిని నగరానికి చెందిన అడ్వకేట్ ఉదయ్ కుమార్‌గా పోలీసులు గుర్తించారు. శనివారం ఉదయం ఇంటి నుంచి బయటకు వెళ్లిన ఉదయ్, ఆ తర్వాత నుంచి ఫోన్ స్విచ్ ఆఫ్ వచ్చినట్లు కుటుంబసభ్యులు చెప్పుతున్నారు. ఘటనా స్ధలానికి చేరుకున్న ఉదయ్ భార్య జగదీశ్వరి కారు తమదేనని, మృతుని ఒంటిపై ఉన్న దుస్తులు, చెప్పులు తన భర్తవి కావని చెబుతున్నారు. భూ వివాదమే హత్యకు కారణమైంటుందని ఉదయ్ తండ్రి తెలిపారు. పోలీసులు క్లూస్ టీమ్‌ను రంగంలోకి దింపి కేసును దర్యాప్తు చేస్తున్నారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
ప్రేమపెళ్లి చేసుకుందని.. పెట్రోల్ పోసి చంపిన తల్లి
లహోర్: కోరుకున్న వ్యక్తిని పెళ్లి చేసుకుందని ఓ తల్లి, సోదరుడు ఆ అమ్మాయి మీద పెట్రోల్ పోసి నిప్పంటించి సజీవ దహనం చేసిన దారుణమైన ఘటన బుధవారం పాకిస్థాన్‌లో జరిగింది. బాధితురాలు జీనత్ (18) అక్కడిక్కడే ప్రాణాలు వదిలింది. తన కూతురు దిద్దుకోలేని తప్పు చేసిందని, ఒక అబ్బాయితో లేచిపోయి పెళ్లి చేసుకుందని తల్లి పర్వీన్ పోలీసులకు తెలిపినట్లు తెలిసింది. కాగా, పరువు హత్యల పేరుతో పాకిస్థాన్ లో ఇలాంటి దారుణాలు మామూలయ్యాయి. పర్వీన్ నేరాన్ని ఒప్పుకొందని, ఆమె కొడుకుకు ఈ నేరంలో ఎలాంటి సంబంధం లేదని తెలిపిందని పోలీసులు చెప్పారు. తమ ఇంటి సమీపంలోనే ఉండే హసన్ అనే వ్యక్తిని జీనత్ ప్రేమించింది. వాళ్ల పెళ్లికి పర్వీన్ ఒప్పుకోలేదు. దాంతో హసన్‌తో పారిపోయిన జీనత్.. కోర్టులో అతన్ని వివాహం చేసుకుంది. కొద్దిరోజుల కిందట జీనత్ తన వద్దకు వెళ్లి ఇష్టానికి వ్యతిరేకంగా పెళ్లి చేసుకున్నందుకు క్షమించమని కోరింది. ఆమెను కుటుంబసభ్యులందరూ క్షమించారని చెప్పిన తల్లి, ఆశీర్వాదం తీసుకోవడానికి మరలా రావాలని చెప్పింది. తల్లి మాటలు నమ్మిన జీనత్ ఇంటికి వెళ్లగా.. తల్లి, సోదరుడు వేధించి తర్వాత పెట్రోల్ పోసి నిప్పంటించినట్లు వివరించారు. పర్వీన్, ఇతర కుటుంబసభ్యులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు. -
పొలాల్లో ఎముకల దహనం
ఎడపల్లి: నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలం జాన్కంపేట్ శివారులో కొంతమంది పశువుల ఎముకలను ఆరబెట్టడంతో ఆదివారం స్థానిక యువకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎముకలపై కిరోసిన్, డీజిల్ పోసి నిప్పంటిచారు. కొంత కాలంగా పంట పొలాల్లో పశువుల ఎముకలను ఆరబెట్టడంతో తీవ్ర దుర్గంధం వస్తోందని రైతులు, యువకులు ఆభ్యంతరం తెలిపారు. అయినా తొలగించకపోవడంతో యువకులు ఎముకలు ఆరబెడుతున్న స్థలానికి వెళ్లి అక్కడి వారితో వాగ్వాదానానికి దిగారు. ఇరువురి మధ్య మాట-మాట పెరిగి ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది.సమాచారం అందుకున్న ఎడపల్లి ఎస్సై ఆసిఫ్ ఘటనా స్థలానికి చేరుకుని ఇరువర్గాలను శాంతింపచేశారు. ఆరబెడుతున్న ఎముకలను తొలగించాలని సూచించారు. లేని పక్షంలో కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. -
బోడుప్పల్లో వృద్ధుడి సజీవ దహనం
రంగారెడ్డి: హైదరాబాద్ శివార్లలో దారుణం జరిగింది. మేడిపల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలోని బోడుప్పల్లో ఓ గుడిసెకు ప్రమాదవశాత్తు నిప్పు అంటుకుని ఆనందం(65) అనే వృద్ధుడు సజీవదహనయ్యాడు. నిద్రమత్తులో ఉన్న సమయంలో మంటలు వ్యాపించడంతో అతను తప్పించుకోవడానికి కూడా అస్కారం లేకుండా పోయింది. మంటల్లో వృద్ధుడు పూర్తిగా కాలిపోవడంతో నిద్రలోనే ప్రాణాలు కోల్పోయాడు. గమనించిన స్థానికులు ఫైర్ సిబ్బందికు, పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. గుడిసెకు మంటలు ఎలా అంటుకున్నాయి అనే దానిపై వివరాలు తెలియాల్సి ఉంది. -
రెక్కల కష్టం బూడిదపాలు
మొక్కజొన్న పంటను దహనం చేసిన గుర్తుతెలియని వ్యక్తులు రూ. 3 లక్షల ఆస్తినష్టం పరిగి: ఆరుగాలం రెక్కలుముక్కలు చేసుకొని సాగుచేసిన పంట బూడిద పాలైంది. గుర్తుతెలియని వ్యక్తులు నిప్పంటించడంతో రూ. 3 లక్షల విలువైన మొక్కజొన్న పంట కాలిపోయింది. ఈ సంఘటన పరిగి మండల పరిధిలోని నారాయణ్‌పూర్‌లో బుధవారం తెల్లవారుజామున చోటు చేసుకుంది. బాధితుడి కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన రైతు సత్యనారాయణ్‌రెడ్డి తనకున్న మూడెకరాల పొలంలో పత్తిసాగుచేశాడు. స్థానికంగా మరో ఎనిమిది ఎకరాల పొలం కౌలుకు తీసుకొని మొక్కజొన్న పంట వేశాడు. రూ.2 లక్షలకు పైగా పెట్టుబడి పెట్టి సాగుచేయగా పంట బాగా వచ్చింది. పంట కోతకు రావటంతో వారం రోజులుగా కూలీలతో మొక్కజొన్న కంకులు సేకరించి కల్లంలో వేసి నూర్పిడికి సిద్ధంగా ఉంచాడు. మంగళవారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు మొక్కజొన్న కంకులకు నిప్పు పెట్టారు. బుధవారం తెల్లవారు జామున నారాయణ్‌రెడ్డి పొలానికి వెళ్లి చూడగా పంట కాలిపోతూ కనిపించింది. తోటి రైతుల సాయంతో మంటలు ఆర్పే యత్నం చేసినా ఫలితం లేకపోయింది. సమాచారం అందుకున ్న ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటలను పూర్తిగా అదుపు చేశారు. అప్పటికే రూ. 3 లక్షలకు పైగా నష్టం జరిగిందని బాధిత రైతు తెలిపాడు. నారాయణ్‌రెడ్డి కొందరిపై అనుమానం వ్యక్తం చేస్తూ పరిగి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు దర్యాప్తులో ఉంది. 80 క్వింటాళ్ల పత్తి దగ్ధం రూ. 4.2 లక్షల ఆస్తినష్టం ధారూరు: పొలంలో నిల్వ ఉంచిన దాదాపు 80 క్వింటాళ్ల పత్తి ప్రమాదవశాత్తు కాలిపోయింది. దీంతో రూ. 4.2 లక్షల నష్టం జరిగింది. ఈ సంఘటన మండల పరిధిలోని నాగసమందర్‌లో బుధవారం సాయంత్రం చోటుచేసుకుంది. బాధితుడి కథనం ప్రకారం.. నాగసమందర్ గ్రామానికి చెందిన వరద మల్లికార్జున్‌కు చె ందిన 42 ఎకరాల పొలాన్ని ఆంధ్రప్రదేశ్ గుంటూరు జిల్లాకు చెందిన సుబ్బారావు కౌలుకు తీసుకుని ఖరీఫ్ సీజన్లో పత్తి పంటను సాగుచేశాడు. 20 రోజుల నుంచి పత్తిని సేకరించారు. 175 క్వింటాళ్లు ఓ దగ్గర, 250 క్వింటాళ్లు మరో దగ్గర పత్తిని రెండు కుప్పలుగా నిల్వ చేశాడు. బుధవారం సాయంత్రం 175 క్వింటాళ్ల పత్తికుప్పకు ప్రమాదవశాత్తు నిప్పంటుకుంది. మంటలు ఒక్కసారిగా చెలరేగడంతో రైతు సుబ్బారావు స్థానికులతో కలిసి ట్యాంకర్ల ద్వారా మంటలను ఆర్పే యత్నం చేశారు. అనంతరం వికారాబాద్ నుంచి వచ్చిన ఫైర్ ఇంజిన్ మంటలను ఆర్పేసింది. అప్పటిలోగా 80 క్వింటాళ్ల పత్తి పూర్తిగా కాలిపోయింది. మిగిలిన 95 క్వింటాళ్ల పత్తి ఫైర్ ఇంజిన్నీటితో పాడైంది. దీనిని కొనుగోలు చేసేందుకు వ్యాపారులు ఆసక్తి చూపరని బాధితుడు కన్నీటిపర్యంతమయ్యాడు. ఆరుగాలం రెక్కలుముక్కలు చేసుకొని కుటుంబీకులమంతా కష్టపడ్డామని, ప్రమావశాత్తు పంట కాలిపోవడంతో రూ. 4.2 లక్షల ఆస్తినష్టం జరిగిందని సుబ్బారావు ఆవేదన వ్యక్తం చేశారు. -
ఇంటి ముందు పార్క్ చేసిన బైక్ దగ్ధం
యాలాల(రంగారెడ్డి): రాత్రి ఇంటి ముందు పార్క్ చేసిన బైక్ తెల్లారి లేచి చూసేసరికి కాలి బూడిదైంది. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా యాలాల మండలం అచ్యుతాపురం గ్రామంలో శనివారం చోటుచేసుకుంది. వివరాలు.. గ్రామానికి చెందిన గొళ్ల అంజిలయ్య శుక్రవారం రాత్రి యాలాలకు వెళ్లి తిరిగి వచ్చి హీరోహోండా బైక్‌ను ఇంటి ముందు ఉన్న పాకలో పార్క్ చేసి పడుకున్నాడు. ఉదయం లేచి చూసేసరికి బైక్‌తో సహా పాక పూర్తిగా కాలిపోయింది. దీంతో అంజిలయ్య పోలీసులకు ఫిర్యాదు చేశాడు. -
విశాఖలో యువతి సజీవదహనం
విశాఖపట్నం: విశాఖ జిల్లాలో ఓ విద్యార్థినిపై గుర్తుతెలియని వ్యక్తులు పెట్రోలు పోసి సజీవదహనం చేశారు. ఈ సంఘటన జిల్లాలోని గొలిగొండ మండలం అప్పన్నపాలెంలోమంగళవారం రాత్రి చోటు చేసుకుంది. ఇల్లు ఊరికి చివర ఉండటంతో ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాలు.. గ్రామానికి చెందిన దివ్య అనే యువతి తల్లిదండ్రులు ఊరి చివరన ఉన్నజీడిమామిడి తోటలో ఇల్లు కట్టుకుని అక్కడే ఉంటున్నారు. తల్లి దండ్రులు సొంతపనుల నిమిత్తం నర్సీపట్నం వెళ్లారు. పనులు ముగించుకుని ఇంటికి వచ్చేసరికి దివ్య(18) సజీవ దహనమై కనిపించింది. ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి యువతిపై దుండగులు అఘాయిత్యానికి పాల్పడి ఉంటారని, ఆ తర్వాల పెట్రోలు పోసి నిప్పంటించి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. -
పార్క్ చేసిన బైక్ దహనం
కుషాయిగూడ (హైదరాబాద్) : ఇంటి ముందు పార్క్ చేసిన ఓ బైక్‌కు గుర్తు తెలియని దుండగులు నిప్పంటించిన ఘటన సోమవారం కుషాయిగూడ పోలీస్‌స్టేషన్ పరిధిలో వెలుగుచూసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కుషాయిగూడ ఏపీఐఐసీ కాలనీకి చెందిన కటారి ముఖేష్ అనే యువకుడు వ్యాపారం చేస్తుంటాడు. రోజులానే ఆదివారం రాత్రి బైక్‌ను ఇంటి ఎదుట పార్క్ చేశాడు. రాత్రి 12 గంటల సమయంలో ఇంటి ఎదుట ఉన్న టీఎస్:08,సీజీ:9962 నెంబరు గల అపాచీ బైక్‌కు మంటలు అంటుకున్నాయి. మంటలు వ్యాపించడంతో అప్రమత్తమైన చుట్టు ప్రక్కలవారు కేకలు వేయడంతో ఇంట్లో పడుకొని ఉన్న వాహన యజమాని ముఖేష్ బయటకు వచ్చి చూడగా అప్పటికే బైక్ మంటల్లో కాలిపోతుంది. అంతా కలిసి మంటలార్పినా ఫలితం లేకుండా పోయింది. బాధితుని ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. కాగా బైక్‌కు నిప్పంటించిన ఘటనలో ముగ్గురు పాల్గొన్నట్లు సమీపంలోని సీసీ కెమెరాల్లో పోలీసులు గుర్తించారు. బైక్‌పై వచ్చిన దుండగులు నిప్పంటించి అక్కడ నుంచి వెళ్లినట్లు తెలిసింది. పోలీసులు అనుమానితులను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లు తెలిసింది. -
చెత్త తగలబెడుతూ సజీవ దహనం
కరీంనగర్ : పొలంలోని చెత్తను తగలబెడుతూ ప్రమాదవశాత్తూ మంటలు అంటుకుని ఓ రైతు సజీవ దహనమయ్యాడు. ఈ ఘటన శనివారం కరీంనగర్ జిల్లా వీణవంక మండలంలో చోటుచేసుకుంది. మండలంలోని చల్లూరు గ్రామానికి చెందిన అశీర్వాదం(60) పొలంలో చెత్తను తగలబెడుతుండగా నిప్పుంటుకుని అక్కడికక్కడే సజీవ దహన మయ్యాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. (వీణవంక) -
కేబుల్ కార్యాలయంలో ఆగ్నిప్రమాదం
-
కేబుల్ ఆఫీస్ దగ్ధం
హన్మకొండ : వరంగల్ జిల్లా హన్మకొండ పట్టణంలోని పోలీస్ హెడ్ క్వార్టర్స్ ఎదురుగా ఉన్న డీజీ కేబుల్ ఆఫీస్ విద్యుద్ఘాతంతో పూర్తిగా దగ్ధమయింది. ఈ ప్రమాదం గురువారం ఉదయం 3 గంటలకు జరిగింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలికి చేరుకునే సరికి జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఈ ప్రమాదంతో సుమారు రూ.3 కోట్ల ఆస్తి నష్టం వాటిల్లింది. ఈ ప్రమాదం నేపథ్యంలో డీజీ కేబుల్ ప్రసారాలు పూర్తిగా నిలిచిపోయాయి. -
రెండు పూరి గుడిసెలు దగ్ధం
రేపల్లె: గుంటూరు జిల్లా రేపల్లె మండలం పెనుమూడి గ్రామంలో అగ్ని ప్రమాదం సంభవించి రెండు పూరిళ్లు దగ్ధం అయ్యాయి. ఈ ఘటన ఆదివారం తెల్లవారు జామున చోటుచేసుకుంది. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు లేచి ఈ ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది. స్థానికుల సమాచారంతో రేపల్లె అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పివేశారు. సుమారు రూ.4 లక్షల మేర ఆస్తి నష్టం జరిగినట్టు సమాచారం. -
విద్యుత్ తీగ తెగిపడి చెరకు తోట దగ్ధం
మురమండ (కడియం), న్యూస్‌లైన్ : చెరకు తోటపై విద్యుత్ తీగ తెగిపడ్డ సంఘటనలో సుమారు రూ.మూడు లక్షల నష్టం వాటిల్లింది. స్థానిక కల్యాణ మండపం సమీపంలోని పుంత రోడ్డులో మంగళవారం ఈ సంఘటన జరిగింది. స్థానికుల కథనం ప్రకారం.. ఈ ప్రమాదంలో గారపాటి సత్తిబాబుకు చెందిన సుమారు ఐదెకరాల చెరకు తోట పూర్తిగా కాలిపోయింది. తెగిపడిన తీగ మిగిలిన వాటిని తాకుతూ కిందపడింది. దీంతో రెండు స్తంభాల మధ్యనున్న తీగల వెంబడి పెద్దఎత్తున మంటలు చెలరేగాయి. క్షణాల్లో తోటంతా మంటలు వ్యాపించాయి. విద్యుత్ సిబ్బంది నిర్లక్ష్యం కారణంగానే తీగలు తెగిపడుతున్నాయని రైతులు ఆరోపిస్తున్నారు. ప్రమాద సమయంలో సమీపంలోనే చెరకు తోటలు కొట్టే కూలీలు ఉన్నారు. వారు కొంతమేర చెరకును నరికివేయడంతో మంటలు పక్కనున్న తోటలకు వ్యాపించలేదు. చేతికొచ్చిన తోట ఇలా కాలిపోవడంతో రైతు సత్తిబాబు ఆవేదన వ్యక్తం చేశాడు. దిగుబడులు అంతంత మాత్రంగా ఉన్నాయని, ప్రమాదం కారణంగా కనీసం పెట్టుబడి కూడా రాదని చెప్పాడు. మండపేటకు చెందిన అగ్నిమాపక సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకుని, మంటలను అదుపుచేశారు. -
హోండా సర్వీసింగ్ పాయింట్ దగ్ధం
నల్లగొండ రూరల్, న్యూస్‌లైన్: జిల్లా కేంద్రం లోని హైదరాబాద్ రోడ్డులో ఉన్న విఘ్నేశ్వర హోండా షోరూమ్ సర్వీసింగ్ పాయింట్ ఆది వారం దగ్ధమైంది. సాయంత్రం 3 గంటల సమయంలో షోరూమ్ వెనుకభాగంలో ఉన్న సర్వీసింగ్ పాయింట్లో దట్టమైన పోగలు రావడంతో వెనుకభాగంలో ఉన్న ఇళ్లలోని ప్రజలు గమనించి షోరూమ్ నిర్వాహకులకు సమాచారం అందించారు. అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు హూటాహుటిన చేరుకొని మం టలను ఆర్పేశారు. అప్పటికే లక్షల్లో ఆస్తినష్టం జరిగినప్పటికీ ఎలాంటి ప్రాణ నష్టం వాటిల్ల లేదు. అయితే ఈ ఘటనపై ఎన్నెన్నో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రూ 40 లక్షల స్పేర్‌పార్ట్స్ అగ్నికి ఆహుతి సర్వీసింగ్ పాయింట్లో ఉన్న రూ 40 లక్షల విలువైన స్పేర్‌పార్ట్స్ అగ్గికి ఆహుతయ్యాయి. సర్వీసింగ్ పాయింట్లోనే స్పేర్‌పార్ట్స్ విభాగాన్ని నిర్వహిస్తున్నారు. ప్రధాన రహదారికి ముందుభాగంలో షోరూమ్ ఉంది. ఘటన సమయంలో షోరూమ్ సిబ్బంది పూజలో ఉన్నారు. కాలిపోయిన 20 బైక్‌లు సర్వీసింగ్ కోసం ఇచ్చిన సుమారు 20 బైక్‌లు పూర్తిగా కాలిపోయాయి. వీటి విలువ సుమారు రూ 6 లక్షలు ఉండవచ్చని అంచనా వేస్తున్నారు. కార్తీకపౌర్ణమితో పాటు ఆదివారం సెలవు కావడంతో వర్కర్లు సర్వీసింగ్ పాయింట్లోకి రాలేదని షోరూమ్ నిర్వాహకులు చెబుతున్నారు. దట్టమైన పొగలు వ్యాపించగానే సర్వీసింగ్ పాయింట్ ముందుభాగంలో ఉన్న మరో 20 కొత్త బైక్‌లను పక్కకు పెట్టారు. ఘటనపై పలు అనుమానాలు.. సర్వీసింగ్ పాయింట్లో అగ్ని ప్రమాదం జర గడం పట్ల పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కార్తీకపౌర్ణమి సందర్భంగా దేవుడి దగ్గర ఉన్న దీపం ప్రమాదవశాత్తు ఆయిల్‌కు అంటుకొని, విద్యుత్ షార్ట్‌సర్క్యూట్, లేక ఉద్దేశపూర్వకంగా జరిగిందా అనే కోణాల్లో అధికారులు విచారణ జరుపుతున్నారు. ఉలిక్కిపడిన పరిసరాల ప్రజలు సర్వీసింగ్ పాయింట్ దగ్ధమై మంటలు ఎగిసి పడుతుండడంతో పరిసరాల ప్రజలు ఒక్కసారి గా ఉలిక్కిపడ్డారు. అగ్నికీలలు ఎటువైపు వ్యాపిస్తాయేనని భయాందోళనకు గురయ్యారు. సమీపంలోనే ఉన్న పాఠశాల నిర్వాహకులు వెంటనే అప్రమత్తమయ్యారు. మంటలను అదుపులోకి తెచ్చేందుకు నల్లగొండతో పాటు నకిరేకల్, మిర్యాలగూడ నుంచి అగ్నిమాపక శకటాలు తెప్పించారు. రెండు గంటలలోపు మం టలను పూర్తిగా అదుపులోకి తెచ్చారు. ఆర్డీఓ పరిశీలన ఘటన స్థలాన్ని నల్లగొండ ఆర్డీఓ జహీర్, సీఐ మనోహర్‌రెడ్డి పరిశీలించారు. మంటలు ఎలా వ్యాపించాయనే విషయమై సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు.