రంగారెడ్డి: హైదరాబాద్ శివార్లలో దారుణం జరిగింది. మేడిపల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలోని బోడుప్పల్‌లో ఓ గుడిసెకు ప్రమాదవశాత్తు నిప్పు అంటుకుని ఆనందం(65) అనే వృద్ధుడు సజీవదహనయ్యాడు.
నిద్రమత్తులో ఉన్న సమయంలో మంటలు వ్యాపించడంతో అతను తప్పించుకోవడానికి కూడా అస్కారం లేకుండా పోయింది. మంటల్లో వృద్ధుడు పూర్తిగా కాలిపోవడంతో నిద్రలోనే ప్రాణాలు కోల్పోయాడు. గమనించిన స్థానికులు ఫైర్ సిబ్బందికు, పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. గుడిసెకు మంటలు ఎలా అంటుకున్నాయి అనే దానిపై వివరాలు తెలియాల్సి ఉంది.