సోమశేఖర్ మృతదేహాన్ని కాల్చివేసిన దృశ్యం
– మృతదేహాన్ని కాల్చివేసిన దుండగులు
– ఆలస్యంగా వెలుగులోకి
– స్నేహితులే చంపేశారని సోదరుల ఫిర్యాదు
గుర్రంకొండ: మండలంలోని చిట్టిబోయనపల్లె వద్ద ట్రాన్స్‌కో ఉద్యోగిని దారుణంగా హత్యచేసి మృతదేహాన్ని కాల్చివేసిన విషయం ఆలస్యంగా మంగళవారం వెలుగులోకి వచ్చింది. మృతుడు కురబలకోట మండలానికి చెందిన వ్యక్తిగా పోలీసులు నిర్ధారించారు. పోలీసుల కథనం మేరకు... కురబలకోట వుండలం కనసానివారిపల్లెకు చెందిన ఆర్.రంగనాథం కుమారుడు ఆర్.సోవుశేఖర్(24) అదే మండలంలోని కంటేవారిపల్లె విద్యుత్ సబ్‌స్టేషన్‌లో డ్యూటీ ఆపరేటర్‌గా పనిచేస్తున్నాడు. ఈ నెల 2న స్నేహితులతో కలిసి బయటకు వెళ్లాడు. తర్వాత ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు, బంధువ#లు అతని కోసం గాలించారు. మంగళవారం గుర్రంకొండ పంచాయతీ చిట్టిబోయనపల్లె సమీపంలోని బుట్టాయచెరువు వద్ద పొదల్లో గుర్తుతెలియని మృతదేహాన్ని కాల్చివేసినట్టు స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. వాల్మీకిపురం సీఐ శ్రీధర్‌నాయుడు, గుర్రంకొండ ఎస్‌ఐ రామకృష్ణ అక్కడికి చేరుకుని పరిశీలించారు. సమీపంలో మృతుడి చెప్పులు, వాచితోపాటు ఖాళీ మద్యం సీసాలు, ఎర్రగడ్డలు, పచ్చళ్లు పడి ఉన్నాయి. బాగా వుద్యం తాగించి హత్యచేసి పెట్రోలు పోసి కాల్చివేసినట్లు గుర్తించారు. ఈ విషయాన్ని కురబలకోట పోలీసులు అదృశ్యమైన సోవుశేఖర్ కుటుంబ సభ్యులకు తెలిపారు. వారు గుర్రంకొండకు చేరుకొని మృతదేహం వద్ద పడి ఉన్న వాచి, చెప్పులను బట్టి వుృతుడు సోవుశేఖర్ అని గుర్తించారు. సోవుశేఖర్‌ను స్నేహితులే హత్యచేశారని సోదరులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎస్‌ఐ రావుకృష్ణ కేసు దర్యాప్తు చేస్తున్నారు.