
'కారు మాదే కానీ, దుస్తులు మా వారివి కావు'
కీసర: రంగారెడ్డి జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. కారుతో సహా ఓ వ్యక్తిని గుర్తుతెలియని దుండగులు పెట్రోల్ పోసి తగలబెట్టారు. కీసరలోని మల్లన్నగుడి వద్ద శనివారం అర్ధరాత్రి దాటాక ఈ సంఘటన జరిగింది. మృతుడిని నగరానికి చెందిన అడ్వకేట్ ఉదయ్ కుమార్గా పోలీసులు గుర్తించారు.
శనివారం ఉదయం ఇంటి నుంచి బయటకు వెళ్లిన ఉదయ్, ఆ తర్వాత నుంచి ఫోన్ స్విచ్ ఆఫ్ వచ్చినట్లు కుటుంబసభ్యులు చెప్పుతున్నారు. ఘటనా స్ధలానికి చేరుకున్న ఉదయ్ భార్య జగదీశ్వరి కారు తమదేనని, మృతుని ఒంటిపై ఉన్న దుస్తులు, చెప్పులు తన భర్తవి కావని చెబుతున్నారు. భూ వివాదమే హత్యకు కారణమైంటుందని ఉదయ్ తండ్రి తెలిపారు. పోలీసులు క్లూస్ టీమ్ను రంగంలోకి దింపి కేసును దర్యాప్తు చేస్తున్నారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.