
24 గంటల్లోనే చేదించారు
- ఇద్దరు నిందితులు అరెస్ట్
హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా కీసర శివారులో ఆదివారం జరిగిన న్యాయవాది ఉదయ్ కుమార్ హత్యకేసును పోలీసులు చేధించారు. భూవివాదమే హత్యకు దారితీసినట్టు పోలీసులు తేల్చారు. రాష్ట్రంలో సంచలనం సృష్టించిన అడ్డకేట్ ఉదయ్‌కుమార్ హత్యకేసును సవాల్‌గా స్వీకరించిన పోలీసులు 24 గంటల్లోనే చేదించారు. ఈ మేరకు సోమవారం సాయంత్రం కీసరపోలీస్‌స్టేషన్‌లో మల్కాజ్‌గిరి డీసీపీ రాంచంద్రారెడ్డి, ఏసీఫీ రఫిక్, కీసర సి.ఐ గురువారెడ్డిలు నిందితుల వివరాలను ,హత్యజరిగిన తీరును వివరించారు.
వివరాల్లోకి వెళ్లితే కాప్రా ఆఫీసర్స్‌కాలనీలో నివాసం ఉండే ఉదయ్‌కుమార్ మల్కాజ్‌గిరి కోర్టులో జూనియర్‌న్యాయవాదిగా పనిచేస్తుండేవాడు. ఉదయ్‌కుమార్ తండ్రి నకులుడు ఆర్మిరిటైర్డ్ ఆఫిసర్. ఆర్మీలోపనిచేసిన సమయంలో నకలుడికి ఆర్మి వెల్పేర్‌అసోషియేషన్ నుండి 1975 లో జవహార్‌నగర్ పంచాయతీపరిధిలోని చెన్నాపూర్ గ్రామంలో సర్వేనెంబ 700 లో సుమారు 5 ఎకరాల స్థలాన్ని కేటాయించింది.కాగా జహహార్‌నగర్ ఆర్మివెల్పేర్‌అసోషియేషన్‌స్థలాలకు , ప్రభుత్వానికి మద్య ఈ భూములకు సంబందించి కోర్టులో కేసు నడుస్తున్నందునా నకులుడికి పట్టా సర్టిపికేటు రాలేదు.నకులుడికి వేల్పేర్ అసోషియేషన్ నుండి వచ్చిన 5 ఎకరాల్లో గత కొన్నేళ్ల గా జవహర్‌నగర్‌కు చెందిన ఆంజనేయులు అనే వ్యక్తికి నకులుడివద్ద నుండి లీజ్‌కు తీసుకొని వ్యవసాయం చేస్తున్నాడు.
ఇటీవల కాలంలో ఆంజనేయులు ఈస్థలాన్ని కారుచౌకగా కొట్టేయలని పథకం వేసి అల్లుడైన లోకేష్(గుంటూరువాసి)చే ఏప్రిల్ 2016లో నకులుడికి రూ 25 లక్షల నగదు చెల్లించి సదరు భూమిని నోటరీ చేయించుకున్నాడు. ఈ విషయం తెలుసుకున్న నకులుడు కుమారుడైన అడ్వకేట్ జవహర్‌నగర్‌లో గల వ్యవసాయ పొలం వద్దకు వెళ్లి తనకు తెలియకుండా కారుచౌకగా తమ తండ్రి వద్ద నుండి ఏవిధంగా భూమిని కొనుగోళు చేసుకుంటారని లోకే ష్‌తో వాదనకుదిగాడు. ఇచ్చిన డబ్బులను తిరిగి తీసుకొని తమ భూమిని తమకు ఇవ్వాలని లోకేష్ పై ఉదయ్‌కుమార్ గతరెండు మాసాలుగా ఒత్తిడి తీసుకువచ్చాడు.
ఈనేపద్యంలోనే ఉదయ్‌కుమార్ అడ్డును తొలగించుకోవాలని లోకేష్ పన్నాగం పన్నాడు. శనివారం మద్యాహ్న ం 1 గంట సమయంలో జవహర్‌నగర్‌లోగ ల తమ తండ్రికి చెందిన వ్యవసాయభూమి వద్దకు వెళ్లిన ఉదయ్‌కుమార్‌ను చూసిన లోకేష్ అతడితో గొడవకు దిగాడు. తాను కొనుగోళు చేసిన భూమి వద్దకు మళ్లి ఎందుకువచ్చావని వెంటతెచ్చుకున్న పదునాటి కత్తితో ఉదయ్‌కుమార్ మెడమీద కొట్టడంతో ఉదయ్‌కుమార్ ఒక్కసారిగా క్రిందపడిపోయాడని దీంతో నిందితుడు లోకేష్ మరో రెండు మూడుసార్లు క్రింద పడిపోయిన ఉదయ్‌కుమార్ మెడపై కత్తితోదాడి చేయడంతో ఉదయ్‌కుమార్ అక్కడికక్కడే మృతిచెందాడు. మృతదేహాన్ని అక్కడి నుండి తరలించేందుకు లోకేష్ పక్కనే వ్యవసాయం చేస్తున్న సుమన్‌రెడ్డి సహయం కోరగా అంగికరించిన సుమన్ మృతిచెందిన ఉదయ్‌కుమార్ మృతదేహాన్ని లోకేష్, సుమన్‌రెడ్డిలు ఇద్దరు కలిసి ఉదయ్‌కుమార్ కారు వెనక సీట్లో పెట్టి అక్కడినుండి సుమన్‌రెడ్డి వెళ్లిపోయాడు.
అనంతరం లోకేష్ తన ద్వీచక్రవాహానం పై జవహర్‌నగర్‌లోగల పెట్రోల్‌బంక్ వద్దకు వెళ్లి రూ 500 ల పెట్రోల్‌ను ఒక డబ్బాలో కొనుగోళు చేసుకొని సంఘటనాస్థలానికి చేరుకొని రాత్రి 7 గంటల సమయంలో మారుతికారును నడుపుకుంటూ కీసరదాయర గ్రామశీవారుకు తీసుకువచ్చి మృతదేహాంతోపాటు, కారు మీద పెట్రోల్ పోసి నిప్పటించాడు. కారుకు నిప్పటించే సమయంలో హఠాత్తుగా నింధితుడి లోకేష్ కుడా మంటలు అట్టుకోవడంతో అతడు కుడా గాయపడ్డాడు. తన షర్ట్‌ను అక్కడే విప్పి కాలీనగాయాలతో లోకేష్ కీసరదాయర గ్రామం మీదుగా రాత్రి 9 గంటల ప్రాంతంలో ఈసిఐఎల్‌కు చేరుకున్నాడని అక్కడి నుండి చికిత్సనమిత్తం గాంధి ఆసుపత్రికి చేరుకున్నాడన్నారు. లోకేష్‌కుడా 45 శాతం మేర కాలిందని అతడి పరిస్థితికుడా కొంత మేర విషమంగా ఉందని దీంతో అతడిని అరెస్టుచేయలేదని , మృతదేహాన్ని తరలించేందుకు సహకరించిన నిందితుడు సుమన్‌న్‌రెడ్డిని అదుపులోకి తీసుకొని కోర్టుకు హజరుపరడచం జరిగిందన్నారు.
కాగా ఎలాంటి ఆధారాలు లేకుండా పూర్తిగా కారుతో సహాకాలిపోయి వెముకలు మాత్రమే మిగిలిన అడ్వకేట్ ఉదయ్‌కుమార్ హత్యకేసును గ్యాస్‌సీలిండర్‌నెంబర్ ఆధారంగా కేవలం 24 గంటలోపే చేధించిన కీసర సి.ఐ గురువారెడ్డి, ఎస్.ఐ అనంతచారి, విష్ణువర్థన్‌రెడ్డి, సిబ్బంది డీసీపీ,ఏసీపీ రఫిక్‌లు అభినందించారు.కాగా నింధితుడి ద్వీచక్రవాహనాన్ని స్వాధీనం చేసుకోవడం జరిగిందని హత్యకు ఉపయోగించిన కత్తిని నిందితుడు రహాస్యప్రాంతంలో దాచిపెట్టడాన్ని నిందుతుడు ఆసుపత్రిలో కోలుకోగానే హత్యకుఉపయోగించిన కత్తిని కుడా స్వాధీనం చేసుకుంటామని పోలీసులుతెలిపారు.
నింధితులను కఠినంగా శిక్షించాలి:
కాగా అడ్వకేట్ ఉదయ్‌కుమార్‌ను దారుణంగాహత్యచేసిని నింధులను కఠినంగా శిక్షించాలని మల్కాజ్‌గిరి బార్‌అసోషియేషన్‌సభ్యులు డీమాండ్‌చేశారు. ఈమేరకు కీసరపోలీస్‌స్టేషన్ కు చేరుకున్న బార్‌అసోషియేషన్‌సభ్యులు డీసీపీ రాంచంద్రారెడ్డికి వినతిపత్రాన్ని అందజేశారు. ఉదయ్‌కుమార్‌హత్యకేసులో భూమాఫియా ఉన్నదని పెద్ద వ్యక్తులు తప్పించుకునే ప్రయత్నంచేస్తున్నారని నిందితులు ఎంత పెద్ద వారైన పోలీసులు వారందరిని కుడా అరేస్టుచేయాలని డీమాండ్‌చేశారు. ఈ మేరకు సీపీ నికుడా త్వరలోకలిసి తాము ఫిర్యాదుచే స్తామన్నారు.