
షార్ట్ సర్క్యూట్ తో హార్డ్‌వేర్ షాప్ దగ్ధం
శంషాబాద్ రూరల్: మండలంలోని నర్కూడలో ఉన్న ఓ హార్డ్‌వేర్ షాపులో ప్రమాదవశాత్తు మం టలు చెలరేగి మెటీరియల్ దగ్ధవైుంది. శుక్రవారం రాత్రి గ్రామంలోని జై భవాని హార్డ్‌వేర్ అండ్ ఎలక్ట్రికల్ షాపులో షార్ట్ సర్క్యూట్ తో హార్డ్‌వేర్ షాప్ దగ్ధం తో మంటలు చెలరేగాయి.
దుకాణంలో ప్లాస్టిక్ మెటీరియల్ ఎక్కువగా ఉండడంతో మంటల తీవ్రత పెరిగిం ది. స్థానికులు మంటలార్పేందుకు విఫలయత్నం చేశారు. ఘటన జరిగిన గంట తర్వాత చేరుకున్న ఫైర్ ఇంజిన్ తో చాలా సేపటికి మంటలు అదుపులోకి తీసుకొచ్చారు. రూ.40లక్షల వరకు నష్టం వాటిల్లినట్లు దుకాణం నిర్వాహకుడు తెలిపారు.