హర్దోయ్: కోల్‌కతా నుంచి అమృత్‌సర్ వెళ్తున్న దుర్గియానా ఎక్స్‌ప్రెస్ ఓహెచ్‌ఈ వైర్‌ను బలంగా తాకడంతో భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటన యూపీలోని హర్దోయ్‌లో చోటుచేసుకుంది. ఈ నేపధ్యంలో షార్ట్ సర్క్యూట్‌తో రైలును పేల్చేసేందుకు ఎవరో కుట్రపన్ని ఉంటారని రైల్వే అధికారులు అనుమానిస్తున్నారు.
ఈ రైలు బుధవారం తెల్లవారుజామున 3.30 గంటలకు యూపీలోని లక్నో నుంచి బయలుదేరింది. ఉదయం ఐదు గంటలకు ఉమర్తాలి స్టేషన్ దాటిన వెంటనే ట్రాక్‌పై వేలాడుతున్న ఓహెచ్‌ఈ వైర్‌ను బలంగా తాగింది. వెంటనే పేలుడు సంభవించింది. దీంతో పైలట్ రైలును ఆపి ఉమ్రతాలి, దలేల్‌నగర్ స్టేషన్‌లకు సమాచారం అందించాడు. దీంతో అధికారులు ఆ మార్గంలో నడిచే రైళ్లను నిలిపివేశారు. దాదాపు ఆరు గంటల తర్వాత దుర్గియానా ఎక్స్‌ప్రెస్ బయలుదేరేందుకు అనుమతినిచ్చారు. ఈ ఘటన నేపధ్యంలో రాజధాని, వందే భారత్‌లతో పాటు మరికొన్ని రైళ్లను మరో మార్గంలోకి మళ్లించారు. రెండు రైళ్లను రద్దు చేశారు.
ఈ ఘటన దరిమిలా దుర్గియానా ఎక్స్‌ప్రెస్ రైలు విద్యుత్ కేబుల్‌ను బలంగా తాకడమనేది సహజంగా జరిగినది కాదని రైల్వే అధికారులు భావిస్తున్నారు. సాంకేతిక లోపం కంటే ట్యాంపరింగ్‌కే ఎక్కువ అవకాశాలున్నాయని వారు అంటున్నారు. ఈ ఘటనపై రైల్వే శాఖ అన్ని కోణాల్లోనూ దర్యాప్తు చేస్తోంది.
ఇది కూడా చదవండి: దేశంలో భద్రత గుర్తింపు పొందిన తొలి కంపెనీ
Comments
Please login to add a commentAdd a comment