short circuite
-
షార్ట్ సర్క్యూట్‌తో రైలును పేల్చేందుకు కుట్ర?
హర్దోయ్: కోల్‌కతా నుంచి అమృత్సర్ వెళ్తున్న దుర్గియానా ఎక్స్‌ప్రెస్ ఓహెచ్ఈ వైర్‌ను బలంగా తాకడంతో భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటన యూపీలోని హర్దోయ్‌లో చోటుచేసుకుంది. ఈ నేపధ్యంలో షార్ట్ సర్క్యూట్‌తో రైలును పేల్చేసేందుకు ఎవరో కుట్రపన్ని ఉంటారని రైల్వే అధికారులు అనుమానిస్తున్నారు.ఈ రైలు బుధవారం తెల్లవారుజామున 3.30 గంటలకు యూపీలోని లక్నో నుంచి బయలుదేరింది. ఉదయం ఐదు గంటలకు ఉమర్తాలి స్టేషన్ దాటిన వెంటనే ట్రాక్‌పై వేలాడుతున్న ఓహెచ్ఈ వైర్‌ను బలంగా తాగింది. వెంటనే పేలుడు సంభవించింది. దీంతో పైలట్ రైలును ఆపి ఉమ్రతాలి, దలేల్‌నగర్ స్టేషన్లకు సమాచారం అందించాడు. దీంతో అధికారులు ఆ మార్గంలో నడిచే రైళ్లను నిలిపివేశారు. దాదాపు ఆరు గంటల తర్వాత దుర్గియానా ఎక్స్‌ప్రెస్ బయలుదేరేందుకు అనుమతినిచ్చారు. ఈ ఘటన నేపధ్యంలో రాజధాని, వందే భారత్‌లతో పాటు మరికొన్ని రైళ్లను మరో మార్గంలోకి మళ్లించారు. రెండు రైళ్లను రద్దు చేశారు.ఈ ఘటన దరిమిలా దుర్గియానా ఎక్స్‌ప్రెస్ రైలు విద్యుత్ కేబుల్‌ను బలంగా తాకడమనేది సహజంగా జరిగినది కాదని రైల్వే అధికారులు భావిస్తున్నారు. సాంకేతిక లోపం కంటే ట్యాంపరింగ్‌కే ఎక్కువ అవకాశాలున్నాయని వారు అంటున్నారు. ఈ ఘటనపై రైల్వే శాఖ అన్ని కోణాల్లోనూ దర్యాప్తు చేస్తోంది. ఇది కూడా చదవండి: దేశంలో భద్రత గుర్తింపు పొందిన తొలి కంపెనీ -
నిప్పంటించుకుని వ్యక్తి ఆత్మహత్యాయత్నం
గోపాల్పేట: నిప్పంటించుకుని ఓ వ్యక్తి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. స్థానికులు తెలిపిన వివరాల మేరకు.. మండల కేంద్రానికి చెందిన బీసమ్మకు కూతురు, కుమారుడు ఉండగా ఇద్దరికీ వివాహాలు అయ్యాయి. కూతురు వారి అత్తారింటికి వెళ్లగా, కుమారుడు పరశురాములు భార్యతో కలిసి హైదరాబాద్‌లో ఉంటున్నాడు. మంగళవారం మండల కేంద్రంలో ప్రజాపాలనలో దరఖాస్తు ఇచ్చేందుకు పరశురాములు వచ్చాడు. సాయంత్రం స్థానికులతో చిన్నపాటి గొడవ అయ్యింది. దీంతో తెల్లవారుజామున 4గంటల ప్రాంతంలో ఇంటివద్ద ఉన్న పెట్రోల్ ఒంటి మీద పోసుకుని నిప్పంటించుకున్నాడు. అనంతరం నొప్పి తాళలేక కేకలు వేశాడు. నిద్రలేచిన తల్లి బీసమ్మ మంటలు ఆర్పి అంబులెన్స్‌లో వనపర్తి ఆస్పత్రికి తరలించారు. అక్కడి నుంచి మహబూబ్‌నగర్‌కు తరలించినట్లు తెలిసింది. ముఖ్య గమనిక: ఆత్మహత్య మీ సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్‌ను ఆశ్రయించి సాయం పొందండి. ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001 మెయిల్: roshnihelp@gmail.com బైక్‌పై నుంచి పడి వివాహిత దుర్మరణం కల్వకుర్తి టౌన్: సొంత పనులు ముగించుకొని ఇంటికి బైక్‌పై తిరిగి వెళ్తున్న భార్యభర్తలు ప్రమాదవాశత్తు కిందపడగా, భార్య మృతిచెందిన ఘటన బుధవారం చోటుచేసుకుంది. కుటుంబసభ్యులు, ఎస్ఐ రమేష్ తెలిపిన వివరాల ప్రకారం.. ఊర్కొండ మండలంలోని జకినాలపల్లి అమ్మాయిపల్లి తండాకు చెందిన దేవేందర్, ఆయన భార్య కవిత (28)తో కలిసి కల్వకుర్తికి సొంత పనుల నిమిత్తం వచ్చారు. పనులు ముగించుకుని ఇంటి వద్ద నీటి కోసం డ్రమ్మును తీసుకొని బైక్‌పై తిరుగు పయణమయ్యారు. పట్టణంలోని ఎల్ఐసీ ఆఫీస్ వద్దకు రాగానే బైక్‌పై గాలికి తోడు డ్రమ్ము ఖాళీగా ఉండటంతో డ్రమ్ముతో సహా కవిత జారి కిందపడిపోయింది. వెంటనే దేవేందర్ కల్వకుర్తి ప్రభుత్వాసుపత్రికి తరలించగా, తలకు తీవ్ర గాయం కావటంతో అప్పటికే మృతి చెందిందని వైద్యులు తెలిపారు. భర్త ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. మృతురాలికి కుమారుడు, కూతురు ఉన్నారు. చికిత్స పొందుతూ మహిళ మృతి బాలానగర్: బాలానగర్ మండలంలోని అప్పాజిపల్లికి చెందిన కొత్తూర్ శారద (32) చికిత్స పొందుతూ మృతి చెందినట్లు ఎస్ఐ శ్రీనివాస్ తెలిపారు. గత డిసెంబర్ 28న వ్యవసాయ పొలంలో పురుగు మందు తాగగా.. గమనించిన కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మంగళవారం రాత్రి మృతి చెందినట్లు ఎస్ఐ తెలిపారు. ఆమె ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదు. మృతురాలి తల్లి జంగమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు. షార్ట్‌సర్క్యూట్‌తో ఇంట్లోని సామగ్రి దగ్ధం ఉప్పునుంతల: మండలంలోని మర్రిపల్లిలో బుధవారం మధ్యాహ్నం బంటు సైదులుకు చెందిన ఇంట్లో విద్యుత్ షార్ట్ సర్క్యూట్‌తో మంటలు చెలరేగి ఇంట్లోని తిండి గింజలతో పాటు ఇతర వస్తువులు, సామగ్రి, దుస్తులు పూర్తిగా కాలిపోయాయి. రూ.50 వేల వరకు ఆస్తినష్టం వాటిల్లింది. ఆ సమయంలో సైదులు కుటుంబ సభ్యులు వరినాట్లు వేసేందుకు పొలం వద్దకు వెళ్లారు. ఇంట్లో నుంచి పొగలు రావడం గమనించిన ఇరుగుపొరుగు వారు నీళ్లు చల్లి మంటలు ఆర్పి వేశారు. ఆపాటికే ఇంట్లో ఉన్న బియ్యం, టీవీ, ఇతర వస్తువులు, దుస్తులు, పాలతిన్ కవర్లు పూర్తిగా దగ్ధమయ్యాయి. ప్రభుత్వం బాధిత కుటుంబానికి ఆర్థికసాయం అందించి ఆదుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు. -
గాంధీ ఆస్పత్రిలో అగ్ని ప్రమాదం
-
చిన్నారుల ప్రాణాలతో చెలగాటం
సాక్షి, హైదరాబాద్/నాగోలు: షైన్ (ఎల్బీనగర్) ఆస్పత్రి యాజ మాన్య నిర్లక్ష్యం చికిత్స పొందుతున్న చిన్నారుల ప్రాణాల మీదకు తెచ్చింది. సోమవారం తెల్లవారు జామున (2.45 గంటలకు) ఆస్పత్రి భవనం నాలుగో అంతస్తులోని ఐసీయూలో అగ్నిప్రమాదం జరిగింది. ఈ ఘటనలో నిమోనియాతో బాధపడుతూ ఇంక్యుబేటర్‌పై చికిత్స పొందుతున్న మూడు నెలల శిశువు మృతి చెందగా, మంటల్లో చిక్కుకుని మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. మంటలకు తోడు దట్టమైన పొగలతో ఊపిరాడక చిన్నారులు ఉక్కిరిబిక్కిరయ్యారు. ప్రస్తు తం ఇద్దరి శిశువుల పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. పలు ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న మరో 42 మందిని సమీప ఆస్పత్రులకు తరలించారు. ఎల్బీ నగర్ పోలీస్‌స్టేషన్ ఎదురుగా డాక్టర్ వి. సునీల్‌కుమార్‌రెడ్డి, డాక్టర్ సునీల్ పవార్ గత ఆరేళ్ల నుంచి షైన్ చిల్డ్రన్ ఆస్పత్రిని నిర్వహిస్తున్నారు. సునీల్‌కుమార్‌రెడ్డి మేనేజింగ్ డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నాడు. 2014లో రంగారెడ్డి జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ నుంచి 20 పడకలకు అనుమతి తీసుకున్నారు. ప్రస్తుతం జనరల్ వార్డులో 50 పడకలు ఏర్పాటు చేశారు. నెలలు నిండక ముందు తక్కువ బరువుతో జన్మించిన శిశువులతో పాటు, నిమోనియా, కామెర్లు ఇతర సమస్యలతో బాధపడుతున్న శిశువులను ఐసీయూలోని ఇంక్యుబేటర్లపై ఉంచి చికిత్స అందిస్తున్నారు. ఐసీయూలో మంటలు.. సోమవారం తెల్లవారుజామున 2.45 గంటలకు ఐసీయూలో ఒక్కసారిగా మం టలు ఎగిసిపడ్డాయి. అక్కడే ఉన్న ఇంక్యుబేటర్లు షార్ట్‌సర్క్యూట్‌కు గురై వాటి లైట్లు పేలిపోయాయి. ఈ ప్రమాదంలో సూర్యాపేట జిల్లా దూపాడ గ్రామానికి చెందిన డి.నరేష్, మానసల కుమారుడు (3 నెలలు) తీవ్రంగా గాయపడి మృతి చెందాడు. అలాగే నల్లగొండ జిల్లా శివన్నగూడెం గ్రామానికి చెందిన గిరి, మమతల కుమారుడు అవినాష్ (2 నెలలు)కి చాతి, కాళ్లు, చేతులపై గాయాలయ్యాయి. చిన్నారిని ఉప్పల్‌లోని శ్రీధ ఆస్పత్రికి తరలించారు. చంపాపేటకు చెందిన ముత్యాలు, సరితల 36 రోజుల శిశువును బంజారాహిల్స్‌లోని ఏవీఎస్ అంకుర ఆస్పత్రికి తరలించగా, పరిస్థితి విషమంగా ఉంది. నల్లగొండ జిల్లా ఉరుమడ్లకు చెందిన నాగరాజు, సుగుణల 13 నెలల శిశువును ఎల్బీ నగర్‌లోని దిశ ఆస్పత్రికి, అబ్దుల్లాపూర్‌మెట్‌కు చెందిన మరో శిశువును మలక్‌పేటలోని సేఫ్ ఆస్పత్రికి తరలించారు. ఓ చిన్నారిని మరో ఆస్పత్రికి తరలిస్తున్న కుటుంబ సభ్యులు ఊపిరాడక ఉక్కిరిబిక్కిరి... అగ్ని ప్రమాదంతో ఐసీయూ సహా సాధారణ వార్డుల్లోనూ దట్టమైన పొగ అలముకోవడంతో పిల్లలు ఊపిరాడక ఉక్కిరిబిక్కిరి అయ్యారు. పిల్లలకు సాయంగా వచ్చిన తల్లిదండ్రులు, బంధువులు, నర్సులు, ఇతర సిబ్బంది భయాందోళనలతో పరుగులు తీశారు. పిల్లల ఏడుపులు, సిబ్బంది ఉరుకులు పరుగులతో ఆస్పత్రిలో ఏం జరుగుతుందో అర్థం కాక తల్లిదండ్రులు ఆందోళన గురయ్యారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ప్రధాన రహదారి వైపుగా ఉన్న అద్దాలను ధ్వంసం చేసి నిచ్చెన సాయంతో పిల్లలను సురక్షితంగా కిందికి దించారు. కాగా, ప్రమాదం జరిగిన సమయంలో ఆస్పత్రిలో 42 మంది చిన్నారులు చికిత్స పొందుతున్నారు. వీరందరినీ ఒకే ఆస్పత్రికి తరలిస్తే ఇబ్బందులు వస్తాయని భావించిన యాజమాన్యం పలు ఆస్పత్రులకు తరలించింది. మృతి చెందిన, ఆందోనకరంగా ఉన్న ఇద్దరు పిల్లల మినహా మిగతా చిన్నారులు క్షేమంగా ఉన్నట్లు సమాచారం. ఘటన సమయంలో పిల్లల వైద్య ఖర్చలన్నీ తామే భరిస్తామని చెప్పిన షైన్ యాజమాన్యం ఆ తర్వాత వారిని గాలికొదిలేయడంతో వారి తల్లిదండ్రులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. మూడు రోజుల క్రితమే ప్రమాదం... మూడు రోజుల క్రితం ఆసుపత్రిలోని ఐసీయూలో స్వల్ప అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. దీనిపై రోగుల బంధువులు ఆస్పత్రి సిబ్బందికి ఫిర్యాదు చేశారు. నిర్వహకులు మాత్రం తాత్కాలిక మరమ్మతులు చేసి చేతులు దులుపుకున్నారు. పక్కా మరమ్మతులు చేసింటే ఈ పరిస్థితి ఉండేది కాదని పలువురు అభిప్రాయం వ్యక్తం చేశారు. అనుమతి ఎలా ఇచ్చారు.. 200 గజాల స్థలంలో సెల్లార్ సహా జీ+3 అంతస్థుల్లో ఆస్పత్రి భవనాన్ని నిర్మించారు. పార్కింగ్, సెట్‌బ్యాక్ లేకుండా నిర్మించిన ఈ భవనానికి జీహెచ్ఎంసీ ఎలాంటి అనుమతులివ్వలేదు. ఏదైనా విపత్తులు సంభవిస్తే బయటికి వచ్చేందుకు సరైన దారి కూడా లేదు. అగ్ని ప్రమాదాలు జరిగినప్పుడు మంటలను ఆర్పేందుకు ఆస్పత్రిలో ఫైర్ సేఫ్టీ పరికరాలు లేవు. పార్కింగ్ కూడా లేని ఈ భవనానికి రంగారెడ్డి జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారులు స్పెషాలిటీ హాస్పిటల్, డయాగ్నోస్టిక్స్ నిర్వహణకు అనుమతి ఎలా ఇచ్చారన్నది ప్రశ్నార్థకం. సామర్థ్యానికి మించి పడకలు ఏర్పాటు చేసినా పట్టించుకున్న నాథుడే లేడు. పార్కింగ్, ఇతర సమస్యలపై స్థానికులు జీహెచ్ఎంసీలో ఫిర్యాదు చేసినా పట్టించుకున్న వారే లేరు. ఎండీపై కేసు నమోదు... ప్రమాద ఘటన తరువాత పోలీసులు ఆసుపత్రికి తాళాలు వేశారు. మృతి చెందిన చిన్నారి కుటుంబ సభ్యులు ఆసుపత్రి ముందు ధర్నా నిర్వహించారు. ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి, ఎమ్మెల్సీ రాంచందర్‌రావు, మున్సిపల్, రెవెన్యూ అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని బాధితులను పరామర్శించి, అండగా ఉంటామని హామీ ఇచ్చారు. షైన్ ఆసుపత్రి ఎండీ డాక్టర్ సునీల్‌రెడ్డిపై కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నట్లు ఇన్స్పెక్టర్ అశోక్‌రెడ్డి తెలిపారు. -
శ్రీశాంత్ ఇంట్లో భారీ అగ్ని ప్రమాదం
కొచ్చి: భారత క్రికెటర్ శ్రీశాంత్ ఇంట్లో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. శనివారం తెల్లవారుజామున కొచ్చిలోని శ్రీశాంత్ నివాసంలో ఒక్కసారిగా మంటలు వ్యాపించడంతో కలకలం రేగింది. తొలుత గ్రౌండ్ ఫ్లోర్ వ్యాపించిన మంటలు.. బెడ్ రూమ్ వరకూ వ్యాపించాయి. ఈ ఘటనలో బెడ్ రూమ్ పూర్తిగా దగ్థమైనట్లు తెలుస్తోంది. కాగా, ఈ ఘటనలో ఎవరకూ గాయపడలేదు. శ్రీశాంత్ భార్యా పిల్లలు సురక్షితంగా బయటకు వచ్చారు. స్థానికుల సాయంతో అగ్ని ప్రమాదం సమాచారం అందుకున్న అగ్ని మాపక సిబ్బంది హుటాహుటీనా అక్కడకు చేరుకుని మంటలను అదుపు చేశారు. శ్రీశాంత్ భార్యా పిల్లలు ఫస్ట్ ఫ్లోర్ చిక్కుకుపోవడంతో గ్లాస్‌ను బద్దలు కొట్టి వారిని సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. ఆ సమయంలో శ్రీశాంత్ ఇంట్లో లేడు. షార్ట్ సర్క్యూట్ కారణంగానే అగ్ని ప్రమాదం జరిగిందని ప్రాథమిక సమాచారం. కొన్ని రోజుల క్రితం శ్రీశాంత్‌పై ఉన్న జీవిత కాల నిషేధాన్ని బీసీసీఐ అంబుడ్స్‌మన్ డీకే ఏడేళ్లకు కుదించిన సంగతి తెలిసిందే. మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలుప ఇప్పటికే ఆరేళ్లుగా శిక్ష అనుభవిస్తున్న శ్రీశాంత్ ఇంకా ఏడాది పాటు నిషేధం ఎదుర్కోనున్నాడు. ఈ క్రమంలోనే డీకే జైన్ ఎదుట హాజరైన శ్రీశాంత్ ఫిక్సింగ్ ఆరోపణలతో తన కెరీర్ నాశనమైందని మొరపెట్టుకున్నాడు. భారత టెస్టు జట్టులోకి పునరాగమనం చేయడమే తన అంతిమ లక్ష్యమని, తన కెరీర్ ముగిసే సరికి కనీనం వంద వికెట్లు తీయాలనుకుంటున్నట్లు పేర్కొన్నాడు. -
ఢిల్లీ హోటల్లో మంటలు
న్యూఢిల్లీ: రాజధాని ఢిల్లీలోని ఓ హోటల్లో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. షార్ట్ సర్క్యూటే కారణమని భావిస్తున్న ఈ దుర్ఘటనలో 17 మంది చనిపోయారు. అందులో ఇద్దరు ప్రాణాలు కాపాడుకునేందుకు హోటల్ భవంతి నుంచి దూకి మృతిచెందారు. మృతుల్లో ఓ చిన్నారితో పాటు విశాఖపట్నం హెచ్‌పీసీఎల్ రిఫైనరీ ఉద్యోగి కూడా ఉన్నారు. మరో 35 మందికి గాయాలపాలయ్యారు. సెంట్రల్ ఢిల్లీ కరోల్‌బాగ్‌లోని నాలుగంతస్తుల అర్పిత్ ప్యాలెస్ హోటల్లో మంగళవారం వేకువజామున 3.30 గంటలకు ఈ ప్రమాదం జరిగింది. ఆ సమయంలో హోటల్లో 53 మంది ఉన్నట్లు అధికారులు తెలిపారు. అందరూ గాఢ నిద్రలో ఉండటంతో మంటల నుంచి తప్పించుకోవడం కష్టమైందని, అత్యవసర ద్వారం బయటి నుంచి మూసేసి ఉందన్నారు. హోటల్లో కర్రతో చేసిన ఫర్నీచర్ ఎక్కువ ఉండటంతో మంటలు వేగంగా వ్యాపించినట్లు భావిస్తున్నారు. హోటల్ జనరల్ మేనేజర్‌తో పాటు మరో ఉద్యోగిని పోలీసులు అరెస్ట్ చేశారు. మృతుల కుటుంబాలకు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ రూ.5 లక్షల చొప్పున పరిహారం ప్రకటించారు. ఈ దుర్ఘటనపై మెజిస్టీరియల్ విచారణకు ఆదేశించారు. ఈ ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ, కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ విచారం వ్యక్తం చేశారు. అగ్ని ప్రమాదం నేపథ్యంలో ఆప్ సర్కారు తన నాలుగో వార్షికోత్సవాన్ని రద్దుచేసుకుంది. ఊపిరాడకే ఎక్కువ ప్రాణనష్టం.. అర్పిత్ ప్యాలెస్ హోటల్ మొదటి అంతస్తులో మొదలైన మంటలు వేగంగా పైకి ఎగబాకాయి. షార్ట్ సర్క్యూటే నిప్పును రాజేసిందని ప్రాథమిక విచారణలో తేలింది. మంటలు వేగంగా విస్తరించడంతో నిద్రలో ఉన్న అతిథులు తప్పించుకోవడం కష్టమైంది. ఎక్కువ మంది ఊపిరాడక ప్రాణాలు కోల్పోగా, మిగిలిన వారు కాలిన గాయాలతో చనిపోయినట్లు అధికారులు తెలిపారు. హోటల్ గదుల్లో వాడిపడేసిన కార్బన్ డయాక్సై డ్ సిలిండర్లు కనిపించాయి. దీనినిబట్టి మంటలను ఆర్పడానికి వారు ప్రయత్నించినట్లు తెలుస్తోంది. హోటల్ పైకప్పు నుంచి దట్టమైన పొగ వెలువడుతున్నట్లు ప్రత్యక్ష సాక్షి ఒకరు తీసిన వీడియోలో కనిపించింది. ప్రమాదం జరిగిన సుమారు గంట తరువాత అంటే ఉదయం 4.35 గంటలకు అగ్నిమాపక శాఖకు సమాచారం అందింది. దీంతో హుటాహుటిన ప్రమాదస్థలికి 24 ఫైరింజన్లు చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి. ఈ ప్రమాదంలో మరణించిన 17 మందిలో 10 మందిని గుర్తించారు. అందులో ముగ్గురు కేరళ, ఒకరు గుజరాత్, ఇద్దరు మయన్మార్ నుంచి వచ్చినట్లు అధికారులు ధ్రువీకరించారు. మిగిలిన నలుగురిని గుర్తించినా, వారు ఏ ప్రాంతానికి చెందినవారో తెలియరాలేదు. ఒక వ్యక్తి జాడ గల్లంతైనట్లు డీసీపీ మాధుర్ వర్మ తెలిపారు. ఒకే కుటుంబంలో ముగ్గురు మరణం.. కేరళలోని ఎర్నాకులం నుంచి వచ్చిన ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ఈ ప్రమాదంలో మృతిచెందారు. 57 ఏళ్ల సోమశేఖర్ అనే వ్యక్తి తన తల్లి (84), అన్న(59), చెల్లెలు (53)తో కలసి ఘజియాబాద్‌లో బంధువు వివాహానికి హాజరయ్యేందుకు వచ్చి ఈ హోటల్లో బస చేశారు. వీరిలో సోమశేఖర్ ఒక్కరే ప్రాణాలతో బయటపడ్డారు. విశాఖ రిఫైనరీ ఉద్యోగి మృతి మల్కాపురం(విశాఖ): ఢిల్లీ హోటల్ అగ్నిప్రమాదంలో హెచ్‌పీసీఎల్ (విశాఖ రిఫై నరీ)ఉద్యోగి చలపతిరావు(55) మృతి చెందారు. హెచ్పీసీఎల్లో అసిస్టెంట్ మేనేజర్ (ఆపరేషన్స్)గా పనిచేస్తున్న చలపతిరావు సోమవారం ఢిల్లీలో జరిగిన పెట్రోటెక్ కాన్ఫరెన్స్‌లో పాల్గొనేందుకు వెళ్లి అర్పిత్ హోటల్లో బస చేశారు. మంగళవారం ఉదయం తిరిగి విశాఖపట్నానికి తిరిగిరావల్సి ఉండగా, ఇంతలోనే ప్రమాదం ఆయన్ని బలితీసుకుంది. ఆయన మృత దేహం బుధవారం ఉదయంకల్లా ఇక్కడికి చేరుకునే అవకాశాలున్నాయి. చలపతిరావు భార్య, పిల్లలతో విశాఖలోని ఎండాడ వద్ద నివాసముంటున్నారు. మార్చురీ వద్ద రోదిస్తూ బంధువులకు సమాచారం చేరవేస్తున్న బాధితురాలు -
కారు కలకలం
గజ్వేల్ : మండలంలోని రిమ్మనగూడ వద్ద రాజీవ్ రహదారిపై శుక్రవారం రాత్రి కారులో మంటలు చెలరేగి వ్యక్తి సజీవ దహనమైన ఘటన కలకలం రేపుతోంది. ఇదే గ్రామంలో ఎనిమిది రోజుల క్రితం 14మంది మృత్యువాతకు గురైన ఘటనాస్థలికి సమీపంలో ఇది జరగడం కలవరపరుస్తోంది. కారులో మంటలు చెలరేగి వ్యక్తి దుర్మరణం పాలైన ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మృతుడు రంగారెడ్డి జిల్లా మచ్చబొల్లారానికి చెందిన దుగ్యాల భూమారావు(55)గా గుర్తించారు. ఈయన ఓ ప్రముఖ కుటుంబానికి బంధువని పోలీసులు చెబుతున్నారు. ఆయన శుక్రవారం రాత్రి కొమురవెళ్లి పుణ్యక్షేత్రంలో నిద్రించి తెల్లవారు జామున ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ఇంటికి తిరిగి రావాలనే ఆలోచనతో(ఏపీ 11పీ 8686)తన ఆల్టో కారులో ఒంటరిగా బయల్దేరాడు. రాత్రి 10:30గంటల ప్రాంతంలో మార్గమధ్యంలోని గజ్వేల్ మండలం రిమ్మనగూడ వద్దకు చేరుకోగానే కారులో అనూహ్యంగా మంటలు చెలరేగి సజీవ దహనమయ్యాడు. మంటల ధాటికి అతడి శరీరం బూడిదైపోయింది. ఎముకలు మాత్రమే మిగిలిపోయాయి. ఈ సమాచారం అందుకున్న సీఐ ప్రసాద్, ఎస్ఐ మధుసూదన్‌రెడ్డిలు చేరుకొని పరిశీలన జరిపారు. అసలేం జరిగింది..? కారులో మంటలు చెలరేగి భూమారావు సజీవ దహనమైన ఘటనపై గజ్వేల్ పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేపట్టారు. ఇప్పటి వరకు ఉన్న ప్రాథమిక సమాచారం ప్రకారం... కారు రిమ్మనగూడ వద్దకు చేరుకోగానే షార్ట్ సర్క్యూట్ జరిగి మంటలు చెలరేగినట్లు నిర్ధారించారు. మంటలు క్షణాల్లో ఉధృతంగా మారడం.. ఇదే క్రమంలో కారు ఆటో లాక్ ఉండడం వల్ల అతను బయటకు వెళ్లలేక అందులోనే పూర్తిగా కాలిపోయి ఎముకలు మాత్రమే మిగిలాయని చెబుతున్నారు. కారు ముందు భాగంలో చెలరేగిన మంటలు ఒక్కసారిగా ఇంజిన్ మొత్తం ఆక్రమించి.. ఆ తర్వాత పెట్రోల్ ట్యాంక్‌ను తాకడం, ఇదే క్రమంలో టైర్లను అంటుకోవడంతో వాటిని ఆర్పడం అసాధ్యంగా మారింది. మంటలు చెలరేగిన తర్వాత కొద్ది సేపటికి రిమ్మనగూడ గ్రామానికి చెందిన యువకులు పలువురు వచ్చి కాపాడటానికి చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. అప్పటికే భూమారావు పూర్తిగా కాలి మాడి మసైపోయాడు. పోలీసులు వచ్చిన తర్వాత అగ్నిమాపక యంత్రాన్ని రప్పించి మంటలను పూర్తిగా ఆర్పేశారు. ఆ తర్వాత కార్లో పూర్తిగా దగ్ధం కాగా మిగిలిపోయిన ఎముకలు బయటకు తీసి పోస్టుమార్టం చేయించారు. అనంతరం బంధువులకు అప్పగించారు. వాహనదారుల్లో వణుకు.. కారు దగ్ధమైన ఘటన వాహనదారుల్లో వణుకు పుట్టిస్తోంది. ప్రత్యేకించి ఇబ్బడిముబ్బడిగా వాహనాలతో ఎప్పుడూ రద్దీగా ఉండే రాజీవ్ రహదారిపై ఈ ఘటన అందరి నోళ్లల్లో నానుతోంది. కార్లలో షార్ట్ సర్క్యూట్ సంభవించడానికి కారణాలేంటి..? ఇలాంటి ప్రమాదాలు రాకుండా ఏ విధంగా జాగ్రత్తపడాలనే అంశంపై చర్చ మొదలైంది. శుక్రవారం రాత్రి కాలిపోయిన కారు 2005 మోడల్‌గా స్పష్టమవుతోంది. కార్లు, ఇతర వాహనాలు సక్రమంగా పనిచేస్తున్నాయా..? వైరింగ్ సక్రమంగా ఉందా..? సర్విసింగ్ సకాలంలో చేయిస్తూ, ఆయిల్ మెయింటనెన్స్ సరిగా ఉందా..? అనే అంశాలను సైతం పరిశీలించుకోవాల్సిన ఆవశ్యకతను ఈ ఘటన చాటి చెబుతోందని పలువురు మెకానిక్‌లు, వాహనదారులు అభిప్రాయపడుతున్నారు. మొత్తానికి కారు దగ్ధం ‘కలకలం’ మిగిల్చిందని చెప్పక తప్పదు. -
వ్యక్తి సజీవ దహనం
నారాయణపేట రూరల్: గాఢనిద్రలో ఉన్న సమయంలో జరిగిన అగ్నిప్రమాదంలో ఓ వ్యక్తి సజీవ దహనమయ్యాడు. ఈ సంఘటన శనివారం రాత్రి పేటలో చోటుచేసుకుంది. ఎస్ఐ కృష్ణయ్య కథనం ప్రకారం.. గుజరాత్ రాష్ట్రానికి చెందిన లాడారాం పటేల్ దాదాపు 50 ఏళ్ల క్రితం బతుకుదెరువు కోసం నారాయణపేటకు వలస వచ్చి స్థానిక శాతవాహన కాలనీలో నివాసం ఉండేవాడు. సొంతంగా యాద్గీర్ రోడ్లో సామిల్ పెట్టుకుని జీవనం గడుపుతుండగా అదే వ్యాపారాన్ని ఆయన కుమారుడు నంజీలాల్ పటేల్(62) కొనసాగించారు. ఈయనకు ముగ్గురు కుమార్తెలు ఉండగా వారిలో ఇద్దరికి వివాహం చేయగా చిన్న కూతురుకు గత నెలలో నిశ్చితార్థం చేసి వచ్చే నెలలో పెళ్లి పెట్టుకున్నారు. ఇక ముగ్గురు కుమారులు పెద్ద వారు కావడంతో మారుతున్న కాలానికి అనుగుణంగా సామిల్‌ను మార్చి గత పదేళ్ల క్రితం హరిఓం ఫ్లైవుడ్ సెంటర్ ఏర్పాటు చేశారు. అయితే ఇటీవల కాలంలో కుటుంబంలో నెలకొన్న సమస్యలతో నంజీలాల్ పటేల్ ప్రతిరోజు రాత్రి ఒంటరిగా వచ్చి దుకాణంలో పడుకునేవాడు. ఈ క్రమంలో శనివారం రాత్రి సైతం భోజనం చేసి వచ్చి నిద్రిస్తుండగా అర్ధరాత్రి దాటిన తర్వాత దుకాణంలో షార్ట్‌సర్క్యూట్ జరిగింది. గాఢ నిద్రలో ఉన్న నంజీలాల్ పటేల్‌కు ఒక్కసారిగా పొగ చుట్టుకోవడంతో ఊపిరి తట్టుకోలేక గుండెపోటు వచ్చింది. ఇక లేవలేని స్థితిలో అక్కడే పడి ఉండగా.. మంటలు వ్యాపించి దుకాణం పూర్తిగా దగ్ధమైంది. ఈ క్రమంలో ఆయన దుకాణంలోనే సజీవ దహనమయ్యాడు. తెల్లవారిన తర్వాత అటుగా వెళ్తున్న వ్యక్తులు గమనించి కుటుంబ సభ్యులకు సమాచారం ఇవ్వడంతో వెంటనే వచ్చి దుకాణం తెరిచి చూడగా శరీరమంతా కాలి బూడిద కాగా మృతుడి బొక్కలు మాత్రమే మిగిలి ఉన్నాయి. పోలీసులకు, ఫైర్ సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో వారు వచ్చి పంచనామా నిర్వహించారు. సుమారు రూ.6 లక్షల ఆస్తినష్టం జరిగినట్లు ప్రాథమికంగా నిర్ధారించారు. విషయం తెలుసుకున్న బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు నాగురావు నామాజీ, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ రఘురామయ్యగౌడ్ కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఘటనపై నంజీలాల్ పటేల్ కుమారుడు కపిల్ పటేల్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. -
సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయంలో షార్ట్సరూ్క్యట్
– విలువైన డాక్యుమెంట్స్, పత్రాలు దగ్ధం బనగానపల్లె: బనగానపల్లె సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయంలో షార్ట్సరూ్క్యట్ జరిగింది. ఈ ఘటనలో విలువైన డాక్యుమెంట్స్, రికార్డులు కాలిపోయాయి. సకాలంలో అగ్నిమాపక సిబ్బంది వచ్చి మంటలను అదుపు చేయడంతో భారీ ప్రమాదం తప్పింది. శుక్రవారం ఉదయం 6 గంటల సమయంలో సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయం లోపలి భాగం నుంచి మంటలురేగి పొగ బయటకు వ్యాపించింది. ఇరుగుపొరుగువారు దీన్ని గమనించి వెంటనే కార్యాలయ సిబ్బందికి, ఫైర్‌స్టేషన్‌కు సమాచారమందించారు.వెంటనే అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకుని మంటలను అదుపుచేశారు.అయితే, అప్పటికే కార్యాలయంలోని డాక్యుమెంట్లు, చలానాలు, ఈసీలు, నకలు, అకౌంట్స్ ఏ,డీఫారాలతో పాటు కొన్ని విలువైన పత్రాలు కాలిబూడిదైనట్లు కార్యాలయ సబ్‌రిజిస్ట్రార్ ప్రసాద్ పేర్కొన్నారు. కార్యాలయ భవనం పురాతనమైనది కావడంతో పాటు అందులో విద్యుత్ వైరింగ్ సక్రమంగా లేకపోవడం ఈ ప్రమాదానికి కారణమని సిబ్బంది పేర్కొంటున్నారు. షార్ట్సరూ్క్యట్ విషయం తెలుసుకున్న జిల్లా సబ్‌రిజిస్ట్రార్ నీలకంఠం బనగానపల్లెకు చేరుకుని అగ్నికి ఆహుతైన వాటిని పరిశీలించారు.