సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయంలో షార్ట్సరూ్క్యట్
– విలువైన డాక్యుమెంట్స్, పత్రాలు దగ్ధం
బనగానపల్లె: బనగానపల్లె సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయంలో షార్ట్సరూ్క్యట్ జరిగింది. ఈ ఘటనలో విలువైన డాక్యుమెంట్స్, రికార్డులు కాలిపోయాయి. సకాలంలో అగ్నిమాపక సిబ్బంది వచ్చి మంటలను అదుపు చేయడంతో భారీ ప్రమాదం తప్పింది.
శుక్రవారం ఉదయం 6 గంటల సమయంలో సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయం లోపలి భాగం నుంచి మంటలురేగి పొగ బయటకు వ్యాపించింది. ఇరుగుపొరుగువారు దీన్ని గమనించి వెంటనే కార్యాలయ సిబ్బందికి, ఫైర్‌స్టేషన్‌కు సమాచారమందించారు.వెంటనే అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకుని మంటలను అదుపుచేశారు.అయితే, అప్పటికే కార్యాలయంలోని డాక్యుమెంట్లు, చలానాలు, ఈసీలు, నకలు, అకౌంట్స్ ఏ,డీఫారాలతో పాటు కొన్ని విలువైన పత్రాలు కాలిబూడిదైనట్లు కార్యాలయ సబ్‌రిజిస్ట్రార్ ప్రసాద్ పేర్కొన్నారు. కార్యాలయ భవనం పురాతనమైనది కావడంతో పాటు అందులో విద్యుత్ వైరింగ్ సక్రమంగా లేకపోవడం ఈ ప్రమాదానికి కారణమని సిబ్బంది పేర్కొంటున్నారు. షార్ట్సరూ్క్యట్ విషయం తెలుసుకున్న జిల్లా సబ్‌రిజిస్ట్రార్ నీలకంఠం బనగానపల్లెకు చేరుకుని అగ్నికి ఆహుతైన వాటిని పరిశీలించారు.