subregistrar
-
సబ్‌రిజిస్ట్రార్ ఆఫీసులో ఏసీబీ దాడులు
కదిరి అర్బన్: పట్టణంలోని సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాన్ని శుక్రవారం సాయంత్రం అనంతపురం జిల్లా ఏసీబీ ఇన్చార్జ్ డీఎస్పీ జయరామరాజు ఆధ్వర్యంలో సిబ్బంది ఏకకాలంలో మూడు బృందాలుగా విడిపోయి ఆకస్మిక దాడులు నిర్వహించారు. సుమారు గంటన్నరపాటు కార్యాలయంలో, సబ్‌రిజిస్టార్ నాసిర్ ప్రైవేట్ రూం, సీనియర్ అసిస్టెంట్ ప్రైవేట్రూంలలో సోదాలు నిర్వహించారు. కార్యాలయంలో అనామతు కింద రూ.39,000,షరాఫ్నారాయణరావ్ వీధిలోని సబ్‌రిజిస్టార్ నాసిర్ ప్రైవేట్ రూంలో రూ.4,36,000, సీనియర్ అసిస్టెంట్ షామీర్‌బాషా ప్రైవేట్ రూంలో రూ.86,000 నగదును స్వాధీనం చేసుకున్నారు. తొలుత కార్యాలయంలో ఉన్న అన్ని విభాగాల్లో క్షుణ్ణంగా తనిఖీ చేశారు. ఈ క్రమంలో సిబ్బంది భయపడిపోయి తమ వద్ద అనామతుగా ఉన్న రూ.39,000 కార్యాలయం బయటపడేశారు. ఇది గమనించిన ఏసీబీ అధికారులు ఆ నగదునూ తీసుకొచ్చారు. ఇంకా విచారణ కొనసాగుతోందని పూర్తయ్యాక కేసులు నమోదు చేస్తామని ఏసీబీ అధికారులు తెలిపారు. -
ఒక్కటైన ప్రేమజంట
గూడూరు: కలిసి చదువుకున్నారు. ఒకరినొకరు ఇష్టపడ్డారు. పెళ్లి చేసుకోవడానికి పెద్దలు అడ్డు చెప్పడంతో పోలీసుల సాయంతో స్థానిక సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయంలో బుధవారం ఒక్కటయ్యారు. వివరాలు.. గూడూరుకు చెందిన ఉపాధ్యాయుడు ఏటీ తిమ్మన్న, మరియమ్మల కుమారుడు ఏటీ విజయచంద్, కర్నూలుకు చెందిన నాగమద్దిలేటి, శోభారాణి దంపతుల కుమార్తె జయశ్రీ ఇంటర్లో క్లాస్మేట్స్. అప్పటి నుంచే ప్రేమించుకుంటున్నారు. ఇంట ర్ అనంతరం అబ్బాయి బీటెక్‌కు, అమ్మాయి మెడిసిన్ వైపు వెళ్లారు. ప్రస్తుతం జయశ్రీ కర్నూలు జీజీహెచ్‌లో హౌస్ సర్జన్ పూర్తి చేసింది. ప్రేమ విషయం ఇరు కుటుంబాల పెద్దలకు వివరించగా కులాలు వేరు కావడంతో వారు అంగీకరించలేదు. దీంతో వారు గత నెల 30న బీచ్పల్లి రామాలయంలో పెళ్లి చేసుకున్నారు. మూడు రోజుల క్రితం కర్నూలులో పోలీసు ఉన్నతాధికారులను కలిసి తమకు రక్షణ కల్పించాలని విన్నవించుకున్నారు. ఎస్పీ ఆదేశాల మేరకు గూడూరు పోలీ సులు మంగళవారం ఇరు కుటుంబాల పెద్దలకు కౌన్సెలింగ్ ఇచ్చారు. అయితే అమ్మాయి తల్లి దండ్రులు అంగీకరించలేదు. అబ్బాయి తల్లిదండ్రులు అంగీకరించడంతో స్థానిక సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయంలో పెద్దల సమక్షంలో దండలు మార్చుకుని సబ్ రిజిస్ట్రార్ హరివర్మ నుంచి వివాహ ధ్రువపత్రం పొందారు. -
సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయంలో షార్ట్సరూ్క్యట్
– విలువైన డాక్యుమెంట్స్, పత్రాలు దగ్ధం బనగానపల్లె: బనగానపల్లె సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయంలో షార్ట్సరూ్క్యట్ జరిగింది. ఈ ఘటనలో విలువైన డాక్యుమెంట్స్, రికార్డులు కాలిపోయాయి. సకాలంలో అగ్నిమాపక సిబ్బంది వచ్చి మంటలను అదుపు చేయడంతో భారీ ప్రమాదం తప్పింది. శుక్రవారం ఉదయం 6 గంటల సమయంలో సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయం లోపలి భాగం నుంచి మంటలురేగి పొగ బయటకు వ్యాపించింది. ఇరుగుపొరుగువారు దీన్ని గమనించి వెంటనే కార్యాలయ సిబ్బందికి, ఫైర్‌స్టేషన్‌కు సమాచారమందించారు.వెంటనే అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకుని మంటలను అదుపుచేశారు.అయితే, అప్పటికే కార్యాలయంలోని డాక్యుమెంట్లు, చలానాలు, ఈసీలు, నకలు, అకౌంట్స్ ఏ,డీఫారాలతో పాటు కొన్ని విలువైన పత్రాలు కాలిబూడిదైనట్లు కార్యాలయ సబ్‌రిజిస్ట్రార్ ప్రసాద్ పేర్కొన్నారు. కార్యాలయ భవనం పురాతనమైనది కావడంతో పాటు అందులో విద్యుత్ వైరింగ్ సక్రమంగా లేకపోవడం ఈ ప్రమాదానికి కారణమని సిబ్బంది పేర్కొంటున్నారు. షార్ట్సరూ్క్యట్ విషయం తెలుసుకున్న జిల్లా సబ్‌రిజిస్ట్రార్ నీలకంఠం బనగానపల్లెకు చేరుకుని అగ్నికి ఆహుతైన వాటిని పరిశీలించారు.