సబ్‌రిజిస్ట్రార్ నుంచి వివాహ ధ్రువపత్రం అందుకుంటున్న దృశ్యం
గూడూరు: కలిసి చదువుకున్నారు. ఒకరినొకరు ఇష్టపడ్డారు. పెళ్లి చేసుకోవడానికి పెద్దలు అడ్డు చెప్పడంతో పోలీసుల సాయంతో స్థానిక సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయంలో బుధవారం ఒక్కటయ్యారు. వివరాలు.. గూడూరుకు చెందిన ఉపాధ్యాయుడు ఏటీ తిమ్మన్న, మరియమ్మల కుమారుడు ఏటీ విజయచంద్, కర్నూలుకు చెందిన నాగమద్దిలేటి, శోభారాణి దంపతుల కుమార్తె జయశ్రీ ఇంటర్‌లో క్లాస్‌మేట్స్. అప్పటి నుంచే ప్రేమించుకుంటున్నారు. ఇంట ర్ అనంతరం అబ్బాయి బీటెక్‌కు, అమ్మాయి మెడిసిన్ వైపు వెళ్లారు. ప్రస్తుతం జయశ్రీ కర్నూలు జీజీహెచ్‌లో హౌస్ సర్జన్ పూర్తి చేసింది.
ప్రేమ విషయం ఇరు కుటుంబాల పెద్దలకు వివరించగా కులాలు వేరు కావడంతో వారు అంగీకరించలేదు. దీంతో వారు గత నెల 30న బీచ్‌పల్లి రామాలయంలో పెళ్లి చేసుకున్నారు. మూడు రోజుల క్రితం కర్నూలులో పోలీసు ఉన్నతాధికారులను కలిసి తమకు రక్షణ కల్పించాలని విన్నవించుకున్నారు. ఎస్పీ ఆదేశాల మేరకు గూడూరు పోలీ సులు మంగళవారం ఇరు కుటుంబాల పెద్దలకు కౌన్సెలింగ్ ఇచ్చారు. అయితే అమ్మాయి తల్లి దండ్రులు అంగీకరించలేదు. అబ్బాయి తల్లిదండ్రులు అంగీకరించడంతో స్థానిక సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయంలో పెద్దల సమక్షంలో దండలు మార్చుకుని సబ్ రిజిస్ట్రార్ హరివర్మ నుంచి వివాహ ధ్రువపత్రం పొందారు.
Comments
Please login to add a commentAdd a comment