మెట్‌పల్లిరూరల్(జగిత్యాల జిల్లా): దుబాయ్‌లో పరిచయమైన తెలంగాణ అబ్బాయి.. కేరళ అమ్మాయి పెళ్లితో ఒక్కట య్యారు. వివరాల్లోకి వెళ్తే.. మెట్‌పల్లి మండలం అ ల్లూరి సీతారామరాజు తండాకు చెందిన గుగ్లావత్ అజయ్ నాలుగేళ్ల క్రితం దుబాయ్ వెళ్లాడు. అక్కడ తాను పని చేస్తున్న కంపెనీలో కేరళకు చెందిన అజితతో పరిచయం ఏర్పడింది. తర్వాత అది ప్రేమగా మారింది. వివాహం చేసుకోవాలని నిశ్చయించుకొని, తమ పెద్దలను ఒప్పించారు. ఆదివారం కేరళలో అక్క డి సంప్రదాయం ప్రకా రం పెళ్లి చేసుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment