
సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయంలో పట్టుకున్న నగదును లెక్కిస్తున్న ఏసీబీ అధికారులు
కదిరి అర్బన్: పట్టణంలోని సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాన్ని శుక్రవారం సాయంత్రం అనంతపురం జిల్లా ఏసీబీ ఇన్‌చార్జ్ డీఎస్పీ జయరామరాజు ఆధ్వర్యంలో సిబ్బంది ఏకకాలంలో మూడు బృందాలుగా విడిపోయి ఆకస్మిక దాడులు నిర్వహించారు. సుమారు గంటన్నరపాటు కార్యాలయంలో, సబ్‌రిజిస్టార్ నాసిర్ ప్రైవేట్ రూం, సీనియర్ అసిస్టెంట్ ప్రైవేట్‌రూంలలో సోదాలు నిర్వహించారు. కార్యాలయంలో అనామతు కింద రూ.39,000,షరాఫ్‌నారాయణరావ్ వీధిలోని సబ్‌రిజిస్టార్ నాసిర్ ప్రైవేట్ రూంలో రూ.4,36,000, సీనియర్ అసిస్టెంట్ షామీర్‌బాషా ప్రైవేట్ రూంలో రూ.86,000 నగదును స్వాధీనం చేసుకున్నారు. తొలుత కార్యాలయంలో ఉన్న అన్ని విభాగాల్లో క్షుణ్ణంగా తనిఖీ చేశారు. ఈ క్రమంలో సిబ్బంది భయపడిపోయి తమ వద్ద అనామతుగా ఉన్న రూ.39,000 కార్యాలయం బయటపడేశారు. ఇది గమనించిన ఏసీబీ అధికారులు ఆ నగదునూ తీసుకొచ్చారు. ఇంకా విచారణ కొనసాగుతోందని పూర్తయ్యాక కేసులు నమోదు చేస్తామని ఏసీబీ అధికారులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment