
సాక్షి,హైదరాబాద్: బిర్యానీకి పాపులర్ అయిన సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ సమీపంలోని ప్యారడైజ్ హోటల్‌లో శుక్రవారం(ఆగస్టు23) మంటలు కలకలకం రేపాయి. హోటల్‌లో షార్ట్ సర్క్యూట్ కారణంగా స్వల్పంగా మంటలు చెలరేగాయి.
వెంటనే అప్రమత్తమైన హోటల్ సిబ్బంది కొద్ది సేపటికే మంటలను ఆర్పివేశారు. దీంతో పెద్ద ప్రమాదం తప్పినట్లయింది. ఘటన అనంతరం హోటల్ సిబ్బంది అగ్నిమాపక శాఖ అధికారులకు సమాచారమిచ్చారు. అగ్నిమాపక శాఖ అధికారులు హోటల్‌కు వచ్చి ప్రమాదం ఎలా జరిగిందనేదానిని పరిశీలించారు.
Comments
Please login to add a commentAdd a comment