సాక్షి,హైదరాబాద్:సికింద్రాబాద్‌లో ట్రాఫిక్ కష్టాల నుంచి ప్రజలకు ఊరట కల్పించే ప్రయత్నాలను ప్రభుత్వం ప్రారంభించింది. ప్యారడైజ్ జంక్షన్ వద్ద ఎలివేటెడ్ కారిడార్ల నిర్మాణం కోసం భూ సేకరణ కోసం ప్రాథమిక నోటిఫికేషన్‌ను ప్రభుత్వం జారీ చేసింది.
ప్యారడైజ్ జంక్షన్ నుంచి శామీర్‌పేట్ ఓఆర్ఆర్ జంక్షన్ వరకు, ప్యారడైజ్ జంక్షన్ నుంచి డైరీఫామ్ వరకు ఎలివేటెడ్ కారిడార్లను ప్రభుత్వం నిర్మించనుంది. ఈ కారిడార్ల భూ సేకరణను ప్రభుత్వం ప్రారంభించనుంది. భూ సేకరణ విషయమై డిప్యూటీ కలెక్టర్లు, సబ్ రిజిస్ట్రార్లు, సర్వేయర్లతో కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి మంగళవారం(నవంబర్ 19) సమావేశమయ్యారు.
కాగా, ఈ ఎలివేటెడ్ కారిడార్ల నిర్మాణం కోసం కంటోన్మెంట్ భూములు అవసరమయ్యాయి.అయితే బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో భూములివ్వడానికి కేంద్రం అంగీకరించలేదు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కేంద్రం భూములిచ్చేందుకు అంగీకరించడంతో ఎలివేటెడ్ కారిడార్ల నిర్మాణానికి తెలంగాణ ప్రభుత్వం చర్యలు మొదలుపెట్టింది.
Comments
Please login to add a commentAdd a comment