Traffic Problems
-
మేళా కిటకిట
ప్రయాగ్‌రాజ్ (యూపీ): మహా కుంభమేళాకు వేదికైన ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ కనీవినీ ఎరగనంతగా వచ్చి పడుతున్న జనసందోహంతో కిటకిటలాడుతోంది. దాంతో కొద్ది రోజులుగా నగరానికి నాలుగు వైపులా ఎటు చూసినా పదుల కొద్దీ కిలోమీటర్లు ట్రాఫిక్ ఎక్కడికక్కడ నిలిచిపోతోంది. జనం తాకిడిని తట్టుకోలేక ప్రయాగ్‌రాజ్ రైల్వే స్టేషన్‌ను ఇప్పటికే మూసేశారు. ప్రయాగ్‌రాజ్, లక్నో మధ్య 30 కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి! వాహనదారులు గంటలపాటు పడిగాపులు కాస్తున్నారు. షాహీ స్నానాల వంటి విశేషమైన ప్రత్యేకత ఏదీ లేకున్నా ఆదివారం భక్తులు త్రివేణి సంగమానికి పోటెత్తారు. సాయంత్రం 6 గంటలకే 1.42 కోట్ల మందికి పైగా పుణ్యస్నానాలు ఆచరించారు. దీంతో కుంభమేళాలో ఇప్పటిదాకా పుణ్య స్నానాలు ఆచరించిన వారి సంఖ్య 42 కోట్లు దాటినట్టు అధికార యంత్రాంగం తెలిపింది. ఇంతటి రద్దీని ఇప్పటిదాకా ఏ కుంభ మేళాలోనూ చూడలేదని అధికారులే విస్తుపోతున్నారు. ‘‘షాహీ స్నాన్, పర్వదినాలు మినహాయిస్తే ఇతర రోజుల్లో భక్తుల రద్దీ తక్కువగానే ఉండేది. ఈసారి సాధారణ రోజుల్లోనూ విపరీతంగా వస్తున్నారు’’ అని చెబుతున్నారు. రద్దీని తట్టుకునేందుకు ప్రయాగ్‌రాజ్ స్టేషన్లో సింగిల్ డైరెక్షన్ ట్రాఫిక్ సిస్టమ్‌ను అమల్లోకి తెచ్చారు. -
Mahakumbh-2025: యూపీ, బీహార్ సరిహద్దుల్లో భారీ ట్రాఫిక్ జామ్.. 70 కి.మీ. పొడవునా..
ప్రయాగ్‌రాజ్: నేడు (బుధవారం) మౌని అమావాస్య. ఈ సందర్భంగా కుంభమేళాలో స్నానం చేసేందుకు భక్తులు పోటెత్తుతున్నారు. ఈ నేపధ్యంలో కుంభమేళాకు దారితీసే మార్గాల్లో ఎన్నడూ లేని విధంగా భారీ ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.యూపీ-బీహార్ సరిహద్దు అయిన కర్మనాషా నుంచి బీహార్‌లోని రోహ్తాస్లోని శివసాగర్ ఖుర్మాబాద్ వరకు 70 కి.మీ మేరకు భారీ ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. మంగళవారం ఉదయం నుంచే జీటీ రోడ్డులోని రెండు లేన్లు పూర్తిగా జామ్ అయ్యాయి. దీని కారణంగా ద్విచక్రవాహనాలు వెళ్ళడం కూడా కష్టంగా మారింది.భారీ ట్రాఫిక్ జామ్ దృష్ట్యా ఉత్తరప్రదేశ్‌లోకి భారీ వాహనాల ప్రవేశంపై విధించిన నిషేధాన్ని అధికారులు సడలించారు. దీంతో భారీ ట్రాఫిక్ జామ్ క్రమంగా తగ్గడం ప్రారంభమైంది. మరోవైపు ఢిల్లీ నుండి కోల్‌కతాకు వెళ్లే ప్రయాణికులకు ఆధారమైన జీటీ రోడ్డు గత 12 గంటలుగా స్తంభించిపోయింది. కుద్ర, మోహానియా, కైమూర్ జిల్లాలోని టోల్ ప్లాజాల వద్ద విపరీతమైన ట్రాఫిక్ జామ్ నెలకొంది. కోల్‌కతా, జార్ఖండ్‌తో పాటు ఇతర ప్రాంతాల నుండి ప్రయాగ్‌రాజ్‌కు వెళుతున్న భక్తుల వాహనాలు జాతీయ రహదారి- 19లో చిక్కుకుపోయాయి. భక్తులతో వెళ్తున్న ఒక బస్సు రాత్రంతా రద్దీలో చిక్కుకుపోయింది.ఇది కూడా చదవండి: Mahakumbh-2025: నాలుగు నిముషాలకు ఒక రైలు.. మౌని అమావాస్యకు ప్రత్యేక ఏర్పాట్లు -
HYD: ప్యారడైజ్ వద్ద ట్రాఫిక్ కష్టాలకు త్వరలో చెక్..!
సాక్షి,హైదరాబాద్:సికింద్రాబాద్‌లో ట్రాఫిక్ కష్టాల నుంచి ప్రజలకు ఊరట కల్పించే ప్రయత్నాలను ప్రభుత్వం ప్రారంభించింది. ప్యారడైజ్ జంక్షన్ వద్ద ఎలివేటెడ్ కారిడార్ల నిర్మాణం కోసం భూ సేకరణ కోసం ప్రాథమిక నోటిఫికేషన్‌ను ప్రభుత్వం జారీ చేసింది.ప్యారడైజ్ జంక్షన్ నుంచి శామీర్‌పేట్ ఓఆర్ఆర్ జంక్షన్ వరకు, ప్యారడైజ్ జంక్షన్ నుంచి డైరీఫామ్ వరకు ఎలివేటెడ్ కారిడార్లను ప్రభుత్వం నిర్మించనుంది. ఈ కారిడార్ల భూ సేకరణను ప్రభుత్వం ప్రారంభించనుంది. భూ సేకరణ విషయమై డిప్యూటీ కలెక్టర్లు, సబ్ రిజిస్ట్రార్లు, సర్వేయర్లతో కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి మంగళవారం(నవంబర్ 19) సమావేశమయ్యారు. కాగా, ఈ ఎలివేటెడ్ కారిడార్ల నిర్మాణం కోసం కంటోన్మెంట్ భూములు అవసరమయ్యాయి.అయితే బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో భూములివ్వడానికి కేంద్రం అంగీకరించలేదు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కేంద్రం భూములిచ్చేందుకు అంగీకరించడంతో ఎలివేటెడ్ కారిడార్ల నిర్మాణానికి తెలంగాణ ప్రభుత్వం చర్యలు మొదలుపెట్టింది. -
Meetho Sakshi: మేడ్చల్ రోడ్లపై నరకం..
-
టోల్ ప్లాజాల ‘లైవ్ ట్రాక్’
టోల్ ప్లాజాల వద్ద నెలకొనే రద్దీని లైవ్‌గా ట్రాక్ చేయడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. అందులో భాగంగా దేశంలోని సుమారు 100 టోల్ ప్లాజాలను గుర్తించింది. జీఐఎస్ ఆధారిత సాఫ్ట్‌వేర్‌తో ఆయా టోల్ గేట్ల వద్ద నెలకొనే ట్రాఫిక్‌ను ట్రాక్ చేస్తూ అందుకు అనువుగా హెచ్చరికలు, సలహాలు జారీ చేయనున్నట్లు ప్రభుత్వం తెలిపింది.సెలవులు, వారాంతాలు, పండగలు..వంటి ప్రత్యేక రోజుల్లో టోల్ గేట్ల వద్ద భారీగా వాహనాలు నిలుస్తుండడం గమనిస్తాం. దాదాపు కిలోమీటర్ల మేర వాహనాలు నిలుస్తుంటాయి. టోల్ గేట్ల నిర్వహణ సరళీకృతం చేయడంలో భాగంగా కేంద్రం ఫాస్టాక్ వంటి విధానాలు తీసుకొచ్చింది. అయినా చాలాచోట్ల వాహనాల రద్దీ తగ్గడంలేదు. అలాంటి సమయాల్లో వారికి సరైన మార్గదర్శకాలు, సలహాలు, సూచనలులేక వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అలాంటి పరిస్థితులను అదుపు చేయడానికి నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా(ఎన్హెచ్ఏఐ) టోల్ ప్లాజాలను లైవ్‌గా ట్రాక్ చేయాలని నిర్ణయించింది. అందుకోసం టోల్గేట్ టోల్ ఫ్రీ నంబర్ 1033కు వచ్చిన ఫిర్యాదుల ఆదారంగా దేశవ్యాప్తంగా దాదాపు 100 టోల్‌ప్లాజాలను ఎంచుకుంది.ఇదీ చదవండి: ప్రకృతి బీభత్సం.. ఆర్థిక నష్టం..!ప్రత్యేకంగా జీఐఎస్ ఆధారిత సాఫ్ట్‌వేర్‌తో ఈ టోల్గేట్లను ట్రాక్ చేయనున్నారు. టోల్ ప్లాజా వద్ద వాహనాల క్యూ నిర్దేశిత పరిమితి కంటే ఎక్కువగా ఉన్నప్పుడు హెచ్చరికలు, సూచనలు అందించనున్నారు. దాంతోపాటు ట్రాఫిక్‌కు అనుగుణంగా సిబ్బందికి లేన్ల పంపిణీపై సలహాలు ఇస్తారు. ఈ జీఐఎస్ ఆధారిత సాఫ్ట్‌వేర్‌ను ఎన్హెచ్ఏఐ ఆధ్వర్యంలోని ఇండియన్ హైవేస్ మేనేజ్మెంట్ కంపెనీ లిమిటెడ్ (ఐహెచ్ఎంసీఎల్) అభివృద్ధి చేసింది. -
అర్ధరాత్రి పోలీసులపై టీడీపీ గుండాల దాడి..
-
గరుడ ప్రసాదం.. పోటెత్తిన జనం.. ట్రాఫిక్ నరకం
మొయినాబాద్, బండ్లగూడ: చిలుకూరు బాలాజీ బ్రహ్మోత్సవాల్లో భాగంగా గరుత్మంతుడికి నైవేద్యంగా పెట్టే ప్రసాదాన్ని స్వీకరిస్తే సంతానం లేని మహిళలకు పిల్లలు కలుగుతారని సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం చేయడంతో శుక్రవారం అనూహ్యంగా భక్తులు పోటెత్తారు. ప్రసాదం కోసం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌తోపాటు ఢిల్లీ, కర్ణాటక, ఇతర రాష్ట్రాల నుంచి లక్షలాదిగా తరలివచ్చారు. ఇందుకు తగిన ఏర్పాట్లు చేయకపోవడంతో ఒక్కసారిగా గందరగోళం నెలకొంది. వేకువ జామున 4 గంటల నుంచే వాహనాలు భారీ సంఖ్యలో రావడంతో కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అయ్యింది. మూడు నాలుగు గంటల పాటు ట్రాఫిక్‌లో ఇరుక్కుని, ఎండలో కాలినడకన ఆలయానికి చేరుకున్న భక్తులకు క్యూలైన్లు ఎక్కడ ఉన్నాయో..? ప్రసాదం ఎక్కడ పంపిణీ చేస్తున్నారో తెలియని అయోమయ పరిస్థితి నెలకొంది. ఆలయ ప్రాంగణంలోనికి మహిళలను మాత్రమే అనుమతించడంతో పురుషులు బయటే ఉండిపోయారు. చేతులెత్తేసిన పోలీసులు ప్రసాదం కోసం పోటెత్తిన మహిళలను నియంత్రించడంలో ఆలయ సిబ్బంది, పోలీసులు చేతులెత్తేశారు. క్యూలైన్లలో తోపులాటలు జరగడంతో పలువురు సొమ్మసిల్లి పడిపోయారు. వీరిని అంబులెన్స్‌లో ఆసుపత్రికి తరలించారు. ఉదయం 8.30 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు గరుడ ప్రసాదాన్ని పంపిణీ చేశారు. కానీ వచ్చిన వారిలో సగం మందికి కూడా అందలేదు. దీంతో కొంత మంది మహిళలు నిరసన చేపట్టారు. గరుడ ప్రసాదం కొరతపై భక్తుల నుంచి తీవ్ర ఆందోళన వ్యక్తమైన నేపథ్యంలో బ్రహ్మోత్సవాలు జరిగే వారం రోజుల పాటు ప్రసాదం ఇస్తామని, వారం రోజుల్లో ఎప్పుడైనా వచ్చి తీసుకోవచ్చని ఆలయ అర్చకులు తెలిపారు. గరుడ ప్రసాదం కోసం ఏటా సుమారు నాలుగు నుంచి ఐదు వేల మంది వచ్చేవారు. ఈసారి రెండింతలు వస్తారని భావించాం.. కానీ ఇంతమంది వస్తారని ఊహించలేదని ఆలయ అర్చకులు రంగరాజన్ తెలిపారు. కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్.. వేలాది వాహనాలు ఒక్కసారిగా రావడంతో సుమారు 25 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ సమస్య నెలకొంది. మెహిదీపట్నం నుంచి నానల్ నగర్, లంగర్‌హౌస్, టిప్ఖాన్పూల్ బ్రిడ్జ్, సన్‌సిటీ, కాళీమందిర్, టీఎస్పీఏ చౌరస్తా మీదుగా చిలుకూరు ఆలయం వరకు పూర్తిగా ట్రాఫిక్‌తో రోడ్డంతా స్తంభించిపోయింది. -
Hyderabad: సిటీలో నేటి నుండి కొత్త ట్రాఫిక్ విధానం
-
Traffic Effect: నదిలో దూసుకెళ్లిన కారు
సిమ్లా: హిమాచల్‌ప్రదేశ్‌లో ఒక వింత ఘటన జరిగింది. ఓ వ్యక్తి ట్రాఫిక్‌ను తప్పించుకోవడం కోసం రోడ్డు దిగి తన ఎస్యూవీ కార్‌ను ఏకంగా నదిలో పరుగులు పెట్టించాడు. ఈ ప్రమాదకర ప్రయణానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీంతో నదిలో వాహనం నడిపిన వ్యక్తిపై పోలీసులు కేసు నమోదు చేశారు. నీటిలో కారును పరుగులు పెట్టించిన ఘటన హిమాచల్‌ప్రదేశ్‌లోని లాహోల్ స్పితి జిల్లాలో జరిగింది. కారు వెళ్లిన చంద్రా నదిలో ప్రస్తుతం నీళ్ల లోతు పెద్దగా లేదు. దీంతో ఎస్యూవీ ఈజీగా నదిని దాటేసింది. ఈ ప్రమాదకర చర్యకు పాల్పడ్డ వాహనదారునికి మోటార్ వెహికిల్ చట్టం కింద భారీ జరిమానా విధించినట్లు ఎస్పీ మయాంక్ చౌదరి తెలిపారు. క్రిస్మస్, కొత్త సంవత్సరం సెలవులు రావడంతో హిమాచల్‌కు టూరిస్టుల తాకిడి పెరిగింది. దీంతో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో విపరీతమైన ట్రాఫిక్ సమస్యలు తలెత్తి వాహనాలు రోడ్లపై ఎక్కడికక్కడే నిలిచిపోతున్నాయి. డ్రోన్లతో పోలీసులు ట్రాఫిక్ పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. #WATCH | Himachal Pradesh: Challan issued after a video of driving a Thar in Chandra River of Lahaul and Spiti went viral on social media. SP Mayank Chaudhry said, "Recently, a video went viral in which a Thar is crossing the river Chandra in District Lahaul Spiti. The said… pic.twitter.com/V0a4J1sgxv — ANI (@ANI) December 25, 2023 ఇదీచదవండి..పదుగురు స్వామీజీలు.. 2023లో అందరినీ ఆకర్షించి.. -
ప్రజాభవన్ ముందు భారీగా ట్రాఫిక్.. వాహనదారుల ఇబ్బందులు
హైదరాబాద్: సమస్యలను ఏకరువు పెట్టుకునేందుకు నగరంలోని ప్రజా భవన్‌కు రాష్ట్రం నలుమూలల నుంచి అర్జీదారులు బారులు తీరుతున్నారు. శుక్రవారం ప్రజావాణిలో దరఖాస్తులనుసమర్పించేందుకు ప్రజలు వేలాదిగా తరలిరావడంతో ప్రజాభవన్ సమీపంలోని రహదారిపై వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఉదయం నుంచే క్యూలైన్లు కిక్కిరిసిపోయాయి. కొందరు క్యూలైన్లోనే అల్పాహారం తీసుకున్నారు. సందట్లో సడేమియా వలే ఇక్కడ దరఖాస్తులను రాసేందుకు కొందరు తెల్ల కాగితాలను సైతం విక్రయించారు. మొత్తానికి శుక్రవారం గ్రీన్‌హిల్స్‌లోని ప్రజాభవన్ వేలాది మంది అర్జీదారులతో కిటకిటలాడుతూ కనిపించింది. -
నా కోసం ట్రాఫిక్ ఆపొద్దు: సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశాలు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి శుక్రవారం ఓ కీలక నిర్ణయం తీసుకున్నారు. తన కోసం, తన కాన్వాయ్ కోసం ట్రాఫిక్‌ను ఆపొద్దని, వాహనదారులకు ఇబ్బంది కలిగించొద్దని పోలీసులకు మౌఖిక ఆదేశాలు జారీ చేశారు. అలాగే సాధారణ ట్రాఫిక్‌లోనే తన కాన్వాయ్నూ అనుమతించాలని ఆదేశించారు. ప్రజలతో పాటే తన కాన్వాయ్ ఉండేలా చూడాలని సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయించుకున్నారు. ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండానే తన కాన్వాయ్‌ను తీసుకెళ్లేలా ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ విషయంలో సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తామని ఈ సందర్భంగా అధికారులు ఆయనతో చెప్పినట్లు తెలుస్తోంది. సీఎంతో పాటు మంత్రులు, ఇతర రాజకీయ ప్రముఖుల పర్యటన సమయంలో ట్రాఫిక్ నిలిపివేత గురించి తెలిసిందే. ప్రత్యేకించి హైదరాబాద్‌లో అది మరీ నరకంగా ఉంటోంది. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్‌రెడ్డి తీసుకున్న తాజా నిర్ణయంపై ప్రజల నుంచి హర్షాతిరేకాలు వ్యక్తం అయ్యే అవకాశం కనిపిస్తోంది. కొత్త కాన్వాయ్ వద్దు! కాన్వాయ్ విషయంలోనూ ఆయన మరో నిర్ణయం తీసుకున్నారు. కొత్త కార్లు కొనుగోలు చేయకుండా.. తన కాన్వాయ్‌లో వాహనాల సంఖ్యను 15 నుంచి 9కి కుదించాలని ఆదేశించారు. అలాగే కాన్వాయ్‌లోనే ఉన్న అన్ని తెల్ల రంగు కార్లకు నల్ల రంగు వేయాలని అధికారుల్ని ఆదేశించారు. ప్రభుత్వం లోటు బడ్జెట్లో ఉన్న నేపథ్యంలోనే ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారని అధికార వర్గాలు చెబుతున్నాయి. -
జోరుగా ప్రచారం.. హైదరాబాద్‌లో స్తంభించిన ట్రాఫిక్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఎన్నికల ప్రచారం చివరి దశకు వచ్చింది. దీంతో రాజధాని హైదరాబాద్‌లో పార్టీల అగ్రనేతల ప్రచారం ఊపందుకుంది. ఒక్కసారిగా సభలు, రోడ్‌షోలు, కార్నర్ మీటింగ్‌లు పెరిగిపోవడంతో నగరంలో సామాన్య జనాలకు ట్రాఫిక్ కష్టాలు తప్పడం లేదు. సోమవారం సాయంత్రం నగరంలో వీఐపీల ప్రచార టూర్లు ఎక్కువగా ఉండడంతో నగరంలో ట్రాఫిక్ పూర్తిగా స్తంభించింది. సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 9 గంటలవరకు హైదరాబాద్‌లోని ప్రధాన రూట్లలో ట్రాఫిక్ ఎక్కడికక్కడే నిలిచిపోయింది. అమీర్‌పేట్, సికింద్రాబాద్ నుంచి బేగంపేట, సికింద్రాబాద్ వైపు వెళ్లే రోడ్డు, సికింద్రాబాద్ నుంచి కోఠి వైపు వెళ్లే రోడ్లపై పూర్తిగా ట్రాఫిక్ జామ్ అయింది. ఒక కిలో మీటర్ దూరం వెళ్లడానికి సుమారు గంట సమయంపైగా పట్టడంతో విసుగు చెందిన నగర వాసులు ఆగ్రహం వ్యక్తం చేశారు. వీఐపీలు సాధారణంగా జెడ్ ప్లస్ లేదా ఆ పై స్థాయి సెక్యూరిటీ భద్రతలో ఉంటారు. సెక్యూరిటీ ప్రోటోకాల్ ప్రకారం వారి కాన్వాయ్ వెళ్లేందుకు రోడ్లపై ట్రాఫిక్ క్లియర్ చేయాల్సి ఉంటుంది. దీంతో పోలీసులు నగరంలో పీక్ అవర్స్ ఉన్నప్పటికీ ట్రాఫిక్‌ను ఆపేయాల్సిన పరిస్థితి పోలీసులకు ఎదురవుతోంది. పీక్ అవర్స్‌లో ట్రాఫిక్ ఆపడం కారణంగా కిలోమీటర్ల కొద్దీ ట్రాఫిక్ నిలిచిపోయి వాహనదారులు చాలా ఇబ్బందులెదుర్కొంటున్నారు. గత కొద్దిరోజులుగా హైదరాబాద్‌లో వీఐపీల పర్యటనలతో ట్రాఫిక్ ఇబ్బందులు ఎదుర్కొన్న నగరవాసులకు ఎన్నికల ప్రచారం మంగళవారం సాయంత్రం 5 గంటలతో ముగియనుండడంతో ఉపశమనం లభించనుంది. గురువారం(నవంబర్ 30) న పోలింగ్ ఉండడంతో ఎన్నికల సంఘం నిబంధనల మేరకు 48 గంటల ముందే పచారం ఆపాల్సి ఉంటుంది. దీంతో మంగళవారం సాయంత్రం 5 గంటలకు మైకులన్నీ మూతపడనున్నాయి. -
సాయంత్రం 5 దాటితే కష్టాలే.. ఆ నగరాల్లో దారుణమైన ట్రాఫిక్!
నగరాల్లో ట్రాఫిక్ కష్టాలు రోజురోజుకు పెరుగుతున్నాయి. ఎన్ని పైవంతెనలు వచ్చినా, కూడళ్లను మూసేసినా, యూటర్న్లు ఏర్పాటు చేసినా వాహనదారుల కష్టాలు మాత్రం తీరట్లేదు. ఉదయాన్నే ఆఫీసులకు బయల్దేరే ఉద్యోగులు సహా పాఠశాలలు, కళాశాలల విద్యార్థులు సమయానికి చేరుకోలేకపోతున్నారు. బస్‌స్టేషన్, రైల్వేస్టేషన్లకు వెళ్లేవారు ప్రయాణ సమయానికి గంట ముందు, విమానాశ్రయానికి వెళ్లేవారు దాదాపు మూడు గంటల ముందే బయల్దేరాల్సి వస్తోంది. సాయంత్రం ఐదు దాటిందంటే నగరంలో ట్రాఫిక్ క్రమంగా పెరుగుతూ ఉంటుంది. రాత్రి పది తర్వాతే రోడ్లపై కొంచెం ఒత్తిడి తగ్గినట్లు కనిపిస్తోంది. ప్రధాన నగరాల్లో ఈ తిప్పలు తప్పించేందుకు ఎన్నో ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ కష్టాలు చాలవన్నట్లు వర్షాకాలంలో డ్రైనేజీలు పొంగిపొర్లి వాహనదారులకు చుక్కలు చూపిస్తున్నాయి. గమ్యం చేరే వరకు గంటల కొద్దీ అలా ప్రయాణం సాగించాల్సిందే. ఇదీ చదవండి: ప్రపంచంలో అక్కడే నిరుద్యోగులు ఎక్కువ..! కేంద్రం అమలు చేస్తున్న నిబంధనల ప్రకారం.. దాదాపు 15 ఏళ్లు దాటిన వాహనాలను తుక్కుగా మార్చాలి. అయినా రోజురోజుకు వాహనాల సంఖ్య పెరుగుతోంది. ఆటోమొబైల్ కంపెనీలు ప్రతి త్రైమాసికంలో వాటి సేల్స్డేటా పెరుగుతోందని ప్రకటిస్తున్నాయి. దాంతో రోజూ రోడ్లపై చేరే వాహనాల సంఖ్య పెరుగుతోంది. రోడ్ల వెడల్పు నిర్ణీత ప్రదేశం వరకే విస్తరించే అవకాశం ఉంది. దానికి ప్రత్యామ్నాయంగా ఫ్లైఓర్లు వేసి కొంత కట్టడి చేస్తున్నారు. అయినా చాలా నగరాల్లో ట్రాఫిక్ తిప్పలు తప్పడంలేదు. ఇదీ చదవండి: ఈ రోజు బంగారం ధరల కోసం క్లిక్ చేయండి ప్రపంచంలో అత్యధికంగా నైజీరియా దేశంలోని లాగోస్ నగరంలో ప్రజలు ట్రాఫిక్ వల్ల తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్లు కొన్ని సర్వేలు తెలుపుతున్నాయి. లాగోస్ విస్తీరణం 999 చదరపు కిలోమీటర్లు. అక్కడ ఒక కిలోమీటర్‌కు దాదాపు 227 వాహనాలు ప్రయాణిస్తున్నాయి. నగరంలోని 9100 రోడ్లపై రోజు దాదాపు 50లక్షల వాహనాలు ప్రయాణిస్తున్నట్లు సమాచారం. దేశంలో అధికంగా ట్రాఫిక్ ఉండే నగరాల్లో దిల్లీ మొదటిస్థానంలో ఉంది. ప్రపంచవ్యాప్తంగా ఐదో స్థానంలో ఉంది. దిల్లీ సుమారు 1484 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం కలిగి ఉంది. 2020 లెక్కల ప్రకారం దాదాపు 1.2 కోట్లు వాహనాలు దిల్లీలో ఉన్నాయి. దిల్లీ తర్వాత కోల్‌కతా, ముంబయి నగరాల్లో అధికంగా ట్రాఫిక్ ఉన్నట్లు నివేదికల ద్వారా తెలుస్తుంది. Top 10 cities with the worst traffic in the world pic.twitter.com/bn4XPT21w0 — Global Ranking (@Top1Rating) November 23, 2023 -
జంక్షన్ జామ్స్‌పై నజర్!
హైదరాబాద్: నగర రహదారుల్లోని అనేక జంక్షన్లు ట్రాఫిక్ జామ్స్‌కు కేరాఫ్ అడ్రస్‌గా ఉన్నాయి. మిగిలిన ప్రాంతాల్లో సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నా...వీటి వద్ద ఇబ్బందులు తప్పట్లేదు. ఈ అంశంపై దృష్టి పెట్టిన సిటీ ట్రాఫిక్ చీఫ్ జి.సుధీర్‌బాబు కొన్నింటి వద్ద ఇంజినీరింగ్ లోపాలకు బదులు సమన్వయ లేమి ఉన్నట్లు గుర్తించారు. ఈ నేపథ్యంలోనే తొలి దశలో మూడు కీలక జంక్షన్లకు సంబంధించిన పరిధులు మారుస్తూ నిర్ణయం తీసుకున్నారు. పీక్ అవర్స్‌గా పిలిచే రద్దీ వేళల్లో ట్రాఫిక్ జామ్స్ చోటు చేసుకుంటున్న వాటికే ప్రాధాన్యం ఇస్తున్నారు. మాసబ్‌ట్యాంక్ రోడ్డు సీన్ మార్చేలా... లక్డీకాపూల్ వంతెనకు, మహావీర్ ఆస్పత్రికి మధ్య ఉన్న పీటీఐ జంక్షన్ సెంట్రల్ జోన్‌లోని సైఫాబాద్ ట్రాఫిక్ పీఎస్‌లో ఉండేది. రద్దీ వేళల్లో లక్డీకాపూల్ వైపు నుంచి బంజారాహిల్స్, మెహిదీపట్నం వైపు వెళ్లే వాహనాలు ఈ మార్గాన్నే అనుసరిస్తాయి. ఈ జంక్షన్‌్ తర్వాత ఉన్న మాసబ్‌ట్యాంక్ చౌరస్తా సౌత్ వెస్ట్ జోనన్‌లోని ఆసిఫ్‌నగర్ ట్రాఫిక్ ఠాణాలో ఉంది. దీంతో ఈ పోలీసులు మాసబ్‌ట్యాంక్ చౌరస్తా కేంద్రంగా తమ ఏరియాల్లో ఉన్న వాహనాలనే బయటకు పంపడానికి ప్రాధాన్యం ఇచ్చే వాళ్ళు. పీటీఐ జంక్షనన్ వైపు నుంచి వచ్చే ట్రాఫిక్ కన్నా మల్లేపల్లి, మెహదీపట్నం, బంజారాహిల్స్ వైపుల నుంచి వచ్చే వాటిపై దృష్టి పెడుతూ ఎన్ఎండీసీ, మెహదీపట్నం రూట్లలో ట్రాఫిక్ క్లియర్ చేసుకునే వాళ్ళు. ఫలితంగా మాసబ్‌ట్యాంక్ చౌరస్తా–పీటీఐ చౌరస్తా మధ్య మార్గంలో భారీ ట్రాఫిక్ జామ్స్ ఏర్పడి ఆ ప్రభావం లక్డీకాపూల్ బ్రిడ్జ్ వరకు ఉండేది. ఈ కారణంగా నిలోఫర్, ఎంఎన్‌జే కేన్సర్ ఆస్పత్రులకు వెళ్లే రోగులకు సైతం ఇబ్బందులు తప్పేవి కాదు. దీన్ని గమనించిన ట్రాఫిక్ పోలీసుల పీటీఐ చౌరస్తాను సైతం ఆసిఫ్‌నగర్ ఠాణాలో కలుపుతూ నిర్ణయం తీసుకున్నారు. అక్కడ ఉండే ట్రాఫిక్ సిబ్బందికి అటు సైఫాబాద్, ఇటు ఆసిఫ్‌నగర్ చానల్స్‌లో ఉన్న రెండు మ్యానన్‌్ ప్యాక్స్ అందజేశారు. మాసబ్‌ట్యాంక్ చౌరస్తాలోనూ రాంగ్ రూట్ తదితర ఉల్లంఘనలకు అవకాశం లేకుండా అనేక మార్పుచేర్పులు చేశారు. కొత్తగా బారికేడ్లు, బొల్లార్డ్స్ తదితరాలు ఏర్పాటు చేశారు. ఈ రెండింటి పరిధి మార్చారు... బంజారాహిల్స్ రోడ్ నెం.1లో ఉన్న కీలక చౌరస్తాల్లో 1/12 జంక్షన్ ఒకటి. ఇది ఒకప్పుడు ఆసిఫ్‌నగర్ ట్రాఫిక్ ఠాణా పరిధిలో ఉండేది. దీంతో ఈ అధికారులు బంజారాహిల్స్ వైపు నుంచి వచ్చే ట్రాఫిక్‌ను తక్కువగా, మాసబ్‌ట్యాంక్ వైపు నుంచి వచ్చే ట్రాఫిక్‌ను ఎక్కువగా తీసుకునే వారు. దీని ప్రభావం బంజారాహిల్స్ రోడ్ నెం.1 మొత్తం మీద ఉండేది. ఒక్కోసారి తాజ్ కృష్ణ, జీవీకే, ఎన్ఎఫ్సీ చౌరస్తాల వరకు ట్రాఫిక్ జామ్స్ ఉండేది. దీంతో ఉన్నతాధికారులు ఆసిఫ్‌నగర్ ట్రాఫిక్ పోలీసుల నుంచి ఈ చౌరస్తాను బంజారాహిల్స్ ఠాణాలో కలిపారు. అలాగే విశ్వేశ్వరాయ విగ్రహం ఉన్న ఖైరతాబాద్ జంక్షనన్‌్ పంజగుట్ట ఠాణాలో ఉండేది. పంజగుట్ట ట్రాఫిక్ పోలీసులు తమ ప్రాంతంలో ఉన్న ట్రాఫిక్‌ను బయటకు పంపడానికి ఇచ్చే ప్రాధాన్యం సైఫాబాద్, ఖైరతాబాద్ ఫ్లైఓవర్ల వైపు నుంచి వచ్చే ట్రాఫిక్‌ను తీసుకోవడానికి ఇచ్చేవారు కాదు. దీంతో నిరంకారి, షాదాన్ కాలేజ్ సహా అనేక చోట్ల ట్రాఫిక్ జామ్స్ ఉండేవి. ఇది గమనించిన అధికారులు ఈ జంక్షనన్‌ను సైఫాబాద్ ఠాణాకు అప్పగించడంతో సమస్య కొంత వరకు పరిష్కారమైంది. ఖైరతాబాద్ ఫ్లైఓవర్ మధ్యలో ఓ కానిస్టేబుల్ ఉండి ట్రాఫిక్‌పై జంక్షన్‌లోని వారికి సమాచారం ఇచ్చేలా చర్యలు తీసుకున్నారు. అలాగే బేగంపేట ప్రాంతం వెస్ట్‌జోన్ పరిధిలో ఉండగా...దీన్ని పూర్తిగా నార్త్‌జోన్ లోకి కలిపారు. -
బాబోయ్... ట్రాఫిక్ పద్మవ్యూహం
సాక్షి బెంగళూరు: పద్మవ్యూహంలో చిక్కుకుని బయటపడొచ్చు, కానీ బెంగళూరు ట్రాఫిక్ రద్దీలో చిక్కుకుంటే బయటపడడం అంత సులభం కాదని ఐటీ నగర వాసులు చెప్పుకుంటారు. నిదానంగా సాగే వాహనాలు ఒకపక్క, రోడ్డు దాటేందుకు శ్రమించే సామాన్య ప్రజలు, అలాగే కిలోమీటర్ల కొద్ధీ నిలిచిపోయే వాహనాలు.. ఇది గత సంవత్సర కాలంలో బెంగళూరు ఔటర్ రింగ్‌రోడ్డులోని పరిస్థితి. వందలాది ఐటీబీటీ కంపెనీలు ఈ ఔటర్ రింగ్‌రోడ్డుకు సమీపంగా ఉండడంతో ఆయా కంపెనీల్లో పని చేసే ఉద్యోగులు నిత్యం నగర రోడ్లపై ట్రాఫిక్‌లో చిక్కుకుని నరకయాతన పడుతున్నారు. మరోవైపు మెట్రో రైల్వే నిర్మాణ పనులు కూడా జరుగుతుండడం ట్రాఫిక్‌కు అంతరాయం కలిగిస్తోంది. సోమవారం కాగానే షురూ సోమవారం ఉదయం 8 గంటలకు వాహనాల రద్దీ మొదలవుతుంది. మధ్యాహ్నం వరకు ఈ ట్రాఫిక్ ఒత్తిడి కొనసాగుతోంది. మంగళవారం, బుధవారం, గురువారాల్లో లక్షలాది వాహనాలతో కూడిన వాహన గజిబిజిని నియంత్రించడం ట్రాఫిక్ పోలీసులకు కష్టంగా మారుతోంది. వీకెండ్ మొదలయ్యే శుక్ర, శని, ఆదివారాల్లో కొంత రద్దీ తగ్గి ఉపశమనం కలుగుతుంది. మెట్రో బ్లూ మార్గం రావాలి 2025 నాటికి మెట్రో బ్లూ మార్గం పనులు పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. మెట్రో రైల్వే ఈ మార్గంలో ప్రారంభం అయితే 50 శాతం ట్రాఫిక్ తగ్గుముఖం పట్టొచ్చని అధికారులు భావిస్తున్నారు. మారతహళ్లి వంతెన వద్ద ఎదురయ్యే ట్రాఫిక్ రద్దీ వల్ల చుట్టుపక్కల రోడ్లపై వాహనాలు బారులు తీరుతున్నాయి. ఈ వంతెనకు ఒకవైపు మాత్రమే ఫుట్ఓవర్ బ్రిడ్జి ఉంది. మరోవైపు లేకపోవడంతో బారులు తీరిన ఆ వాహనాల మధ్య ప్రజలు రోడ్డు దాటేందుకు ఇబ్బందులు పడుతున్నారు. బస్టాపుల వద్ద ఇబ్బంది అలాగే సిటీ బస్సులు ఆయా బస్టాప్‌ల వద్ద ప్రయాణికులను ఎక్కించుకుని, దించుకునే కొద్ది సమయం వల్ల కూడా వెనుక వచ్చే వాహనాలు రద్దీలో చిక్కుకుంటున్నాయి. టిన్ ఫ్యాక్టరీ వద్ద బీఎంటీసీ బస్సులు రోడ్డు నుంచి కొంచెం ఎడంగా వచ్చి నిలిచేలా బస్‌బేలను నిర్మించారు. అదేవిధంగా మారతహళ్లితో ఇతర ఔటర్ రింగ్‌రోడ్డు మార్గంపై కూడా బస్‌బేలను నిర్మిస్తే రద్దీ గొడవ తగ్గుతుందని డిమాండ్లు ఉన్నాయి. బెంగళూరు నగరం లోపలకి ట్రాక్టర్లకు అనుమతి లేదు, అయితే కొన్ని ప్రభుత్వ శాఖల ట్రాక్టర్లు బయట నుంచి నగరంలోకి వస్తుండడం కూడా ట్రాఫిక్ సమస్యకు కారణమవుతోంది. అలాగే నిషేధం ఉన్నా పగటి వేళ లారీలు తిరగడం గమనార్హం. ట్రాఫిక్ రద్దీకి కొన్ని కారణాలు ఐటీబీటీ కంపెనీల ఉద్యోగులు వర్క్‌ఫ్రం హోంను వదిలేసి ఆఫీసులకు రాకపోకలు సాగిస్తున్నారు. నమ్మ మెట్రో రైల్వే నిర్మాణ పనులు జరుగుతున్నాయి. దీంతో నిర్మాణ పనులు జరిగే రోడ్లను అక్కడక్కడ మూసివేయడం లేదా పాక్షికంగా కొద్ది భాగం మూసివేశారు. నగర రోడ్లపై అక్కడక్కడ ట్రాఫిక్ సిగ్నల్స్ సరిగ్గా పని చేయడం లేదు. దీంతో వాహనదారులు ఇష్టానురీతిగా వాహనాలను నడుపుతుంటారు పార్కింగ్ వసతి లేదని పలు రద్దీ రోడ్లలో వాహనాలను రోడ్లపైనే పార్క్ చేస్తున్నారు. -
Hyderabad : వర్షం దెబ్బకు హైదరాబాద్ ఏమయిందంటే.?
హైదరాబాద్ : జంట నగరాల్లో వానలు దంచికొడుతున్నాయి. సోమవారం రాత్రి నుంచి కురిస్తున్న భారీ వర్షాల కారణంగా జనజీవనం అస్తవ్యస్తమైంది. లోతట్టు ప్రాంతాలు జలమయం కావడంతో జనం బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. కొన్ని పాంత్రాల్లో కరెంట్ లేకపోవడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇక, మంగళవారం ఉదయం నుంచి కుండపోత వర్షంతో హైదరాబాద్‌లో భారీగా ట్రాఫిక్‌జామ్‌లు ఏర్పడ్డాయి. తెల్లవారుజాము నుంచే భారీ వర్షం కురవడంతో.. రోడ్లు, లోతట్టు నీట మునిగాయి. అక్కడక్కడా పిడుగులు పడటంతో ప్రజలు వణికిపోయారు. షేక్ పేటలో పరిస్థితిని ఓ సిటిజన్ ఇలా వీడియోతో రిపోర్ట్ చేశాడు. Shaikpet 😦 #HyderabadRains @Director_EVDM pic.twitter.com/TTO7wP1Quv — @Coreena Enet Suares (@CoreenaSuares2) September 5, 2023 భూపాలపల్లి జిల్లాలో పిడుగుల బీభత్సం నెలకొంది. పిడుగుపాటుకు ముగ్గురు మృతి చెందగా, మరో ఇద్దరికి గాయాలయ్యాయి. కాటారం మండలం దామెరకుంటలో పిడుగుపడి రైతు గూడూరు రాజేశ్వర్ రావు (46) మృతి చెందారు. పొలంలో కలుపు తీస్తుండగా రైతు పిడుగుపాటుకు గురయ్యారు. చిట్యాల మండలం శాంతినగర్‌లో మిరప నారు నాటుతుండగా పిడుగుపడి ఇద్దరు మహిళా కూలీలు చెలివేరు సరిత(30), నెరిపటి మమత(32) మరణించారు. మరో ఇద్దరు మహిళలు అరెపల్లి కొమురమ్మ, మైదం ఉమకు గాయాలయ్యాయి. వారిని చిట్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతిచెందిన ఇద్దరు మహిళల స్వగ్రామం చిట్యాలగా గుర్తించారు. ఇక పిడుగుల వర్షంతో గ్రామీణ ప్రజలు భయాందోళన చెందుతున్నారు. చాలా చోట్ల అడుగు తీసి అడుగు వేయలేనంతగా వాహనాలు నిలిచిపోవడంతో ప్రయాణీకులు ఇబ్బందులకు గురయ్యారు. దీంతో రంగంలోకి దిగిన ట్రాఫిక్ పోలీసుల ఎక్కడికక్కడ నిలిచిపోయిన ట్రాఫిక్‌ను క్లియర్ చేసే పనిలో పడ్డారు. లోతట్టు ప్రాంతాలు జలదిగ్బంధంలో చిక్కుకోగా...మ్యాన్‌హోల్స్, నాలాలు పొంగిపోర్లుతున్నాయి. టోలిచౌకిలో దాదాపు కాలనీ అంతా నీళ్లు చేరాయి. This is Tolichowki a regular spot for floods from years. KTR as a minister what change have you brought to control this rain water on to roads. You have been Minister from 9 years and the situation is same from last 9 years. #HyderabadRains pic.twitter.com/0cME1UuEL2 — 𝐒𝐚𝐠𝐚𝐫 𝐆𝐨𝐮𝐝 (@Sagar4BJP) September 5, 2023 ట్రాఫిక్.. నరకయాతన కుండపోత వర్షంతో నగరమంతా ట్రాఫిక్ జామ్ అయింది. గంటల కొద్దీ రాకపోకలు నిలిచిపోవడంతో వాహనదారులు నరకయాతన అనుభవించారు. ట్రాఫిక్ పోలీసులు వీలైనంత వరకు వాహనదారుల్ని అలర్ట్ చేస్తూ కనిపించారు. #HYDTPinfo Commuters are requested to drive carefully in #Rain.@HYDTP officers for your assistance at all Junctions.#Rainfall #HyderabadRains @AddlCPTrfHyd pic.twitter.com/giuKMi269d — Hyderabad Traffic Police (@HYDTP) September 5, 2023 ప్రధానంగా పంజగుట్ట నిమ్స్, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ చెక్‌పోస్ట్, కేబీఆర్ పార్క్, జూబ్లీహిల్స్, పెద్దమ్మతల్లి రోడ్డు, అపోలో హాస్పిటల్ రోడ్, ఎల్బీనగర్, దిల్సుఖ్నగర్, మలక్‌పేట, చాదర్‌ఘాట్, అబిడ్స్, నాంపల్లి, అసెంబ్లీ, ఖైరతాబాద్, అమీర్‌పేట తదితర ప్రాంతాల్లో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. దీంతో పోలీసులు వాహనదారులను ప్రత్యామ్నాయ మార్గాలకు మళ్లించారు. ఆఫీసులకు వెళ్లే టైంలో భారీవర్షం కురవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ప్రశాంత్ నగర్ లో రోడ్డంతా నీళ్లతో నిండిపోయింది. At prashanth nagar Going to exam Jntuh ( St Mary's College) Jntuh oka boat isthe Easy ga reach avtham center ki#HyderabadRains #Hyderabad @examupdt @balaji25_t pic.twitter.com/mPotVP3HC7 — venky (@venky46799918) September 5, 2023 క్షేత్రస్థాయిలో అధికారులు నగరంలో వర్షం కురుస్తున్నందున మాన్సూన్ ఎమర్జెన్సీ బృందాలు, డీఆర్ఎఫ్ టీమ్స్‌తో పాటు జీహెచ్ఎంసీ అధికారులంతా క్షేత్రస్థాయిలో ఉండి పరిస్థితి చక్కదిద్దుతున్నారని GHMC తెలిపింది. అత్తాపూర్ పిల్లర్ నెంబర్ 191 వద్ద పరిస్థితి ఇలా ఉంది. Heavy rainfall in several places of #Hyderabad today. Situation at the favourite place of #Waterlogging , at the pillar no.191, under PVNR Expressway at #Upperpally near Attapur area, traffic interrupts. GHMC at work.#HyderabadRains #HeavyRains pic.twitter.com/DZDOpQFlBx — Surya Reddy (@jsuryareddy) September 5, 2023 బీ అలర్ట్ భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జీహెచ్ఎంసీ సూచించింది. అత్యవసరమైతే తప్ప ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావద్దని పేర్కొంది. ప్రయాణాలు ఉంటే వాయిదా వేసుకోవాలని కోరింది. తప్పనిసరి పరిస్థితుల్లో బయటకు వచ్చిన ప్రజలకు చుక్కలు కనిపించాయి. #TrafficAlert : Today's situation at the Moosapet area in Hyderabad, traffic moves at snail's pace, as roads were marooned after heavy rains. The IMD issued an #OrangeAlert warning for Hyderabad, today.#HyderabadRains #TrafficJam #Hyderabad #Moosapet pic.twitter.com/kokSpgWlm9 — Surya Reddy (@jsuryareddy) September 5, 2023 వరద నష్టం వరద ఒక్కసారిగా పోటెత్తడంతో భారీ ఆస్తినష్టం జరిగిందని పలువురు సిటిజన్లు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. కొందరి వాహనాలు కొట్టుకుపోతే.. మరికొందరి వాహనాలు నీట మునిగాయి. ఇంకొందరి ఇళ్లలో నీళ్లు చేరాయి. #HyderabadRains vs Two-Wheelers pic.twitter.com/tX7kxjcAUr — Donita Jose (@DonitaJose) September 5, 2023 వర్షాల వల్ల తలెత్తే పరిస్థితుల్ని ఎదుర్కొనేందుకు DRF టీమ్స్ అప్రమత్తంగా ఉన్నాయని తెలిపింది. వరదలు, చెట్లు కూలడం తదితర సమస్యల నుంచి రక్షణకు ప్రజలు 040–21111111 లేదా 9000113667 నెంబర్లకు ఫోన్ చేయవచ్చునని పేర్కొంది. 👉ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో@metcentrehyd శాఖ ఆరెంజ్ అలర్ట్ ప్రకటించింది.#HyderabadRains #rains #Hyderabad pic.twitter.com/XRhxtD0JTL — DD News Telangana | తెలంగాణ న్యూస్ (@ddyadagirinews) September 5, 2023 -
31 కిలోమీటర్ల రోడ్డుకు రూ.1,297 కోట్లా..!
సాక్షి, హైదరాబాద్: ఆరు వరుసలకు విస్తరిస్తున్న రోడ్డది.. నిడివి 31 కి.మీ. మాత్రమే. కానీ దాని నిర్మాణానికి మాత్రం ఏకంగా రూ. 1,297 కోట్లు ఖర్చు కానుంది! అంటే ఒక కిలోమీటర్‌కు దాదాపు రూ. 42 కోట్ల వ్యయం అన్నమాట. దీన్ని మరోలా చెప్పాలంటే ఎనిమిది వరుసలు, 158 కి.మీ. నిడివితో రూపుదిద్దుకున్న ఔటర్ రింగురోడ్డు నిర్మాణంలో ప్రతి కిలోమీటర్‌కు అయిన ఖర్చు స్థాయికి దాదాపు సమానమన్నమాట! ఈ కాస్త దూరానికే అంత ఖర్చు ఎందుకు అనుకుంటున్నారా? ఇందులో నిర్మించేది ప్రధాన రోడ్డొక్కటే కాదు.. సరీ్వసు రోడ్లు, క్రాష్ బ్యారియర్లు, ఎలివేటెడ్ కారిడార్లు, జంక్షన్ల వద్ద వంతెనలు, అండర్‌పాస్‌లు, కల్వర్టులు.. ఒకటేమిటి ఎక్స్‌ప్రెస్ వే అంటే ఇలా ఉండాలనే రీతిలో ఇది రూపుదిద్దుకోబోతోంది. ఓ రకంగా చెప్పాలంటే మోడల్ ఎక్స్‌ప్రెస్ వేగా నిలవబోతోంది. హైదరాబాద్–పుణే జాతీయ రహదారిపై మియాపూర్–సంగారెడ్డి మధ్య ఉన్న ఈ మార్గం ఎక్స్‌ప్రెస్ వే తరహాలో ముస్తాబుకానుంది. అందుకే ఖర్చు సైతం భారీగా ఉంది. ట్రాఫిక్ చిక్కులకు తెరదించేలా... తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్రల్లో విస్తరించి ఉన్న 65వ నంబర్ జాతీయ రహదారిపై కొన్నేళ్లుగా ట్రాఫిక్ విపరీతంగా పెరిగిపోయింది. దీంతో దాన్ని విస్తరించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా హైదరాబాద్ శివార్లలో ఆ మార్గాన్ని యుద్ధప్రాతిపదికన 6 వరుసలకు విస్తరించనుంది. ఇందులో హయత్‌నగర్ దాటాక విజయవాడ రోడ్డులో జాతీయ రహదారుల అభివృద్ధి ప్రాథికార సంస్థ (ఎన్హెచ్ఏఐ) రోడ్డు విస్తరణను చేపట్టనుండగా ముంబై రహదారిలో మియాపూర్ సమీపంలోని మదీనాగూడ నుంచి సంగారెడ్డి వరకు రాష్ట్ర పీడబ్ల్యూడీ విభాగం అభివృద్ధి చేయనుంది. తాజాగా మదీనాగూడ–సంగారెడ్డి మధ్య 6 వరుసల విస్తరణ పనులకు సంబంధించిన డీపీఆర్‌కు కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల శాఖ అ«దీనంలోని స్టాండింగ్ ఫైనాన్స్ కమిటీ ఆమోదించింది. దీంతో ఇక టెండర్లు పిలిచేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. అవి ఖరారయ్యాక రెండున్నరేళ్లలో ప్రాజెక్టును పూర్తి చేయనున్నారు. రోజుకు సగటున లక్ష వాహనాలు.. నగరం నుంచి సంగారెడ్డి రోడ్డు అత్యంత బిజీగా మారిపోయింది. డీపీఆర్ తయారీలో భాగంగా గత ఆగస్టులో ఇస్నాపూర్, పటాన్చెరు మధ్య వెళ్తున్న వాహనాల సంఖ్యపై జాతీయ రహదారుల విభాగం సర్వే నిర్వహించగా ఒక రోజులో సగటున లక్ష వాహనాలు ప్రయాణిస్తున్నట్లు తేలింది. పటాన్చెరు వద్ద రోజుకు 30,683 కార్లు, 12,353 త్రిచక్ర వాహనాలు, 34,437 ద్విచక్ర వాహనాలు, 5,551 బస్సులు, 9 వేల ట్రక్కులు... ఇలా అన్నీ కలిపి రోజుకు లక్ష వరకు తిరుగుతున్నాయి. ఇక మదీనాగూడ ప్రాంతంలో ఆ సంఖ్య అంతకు రెట్టింపుగా ఉంటోంది. ఈ రోడ్డును విస్తరిస్తే ట్రాఫిక్ సమస్య పరిష్కారమవుతుందని అధికారులు పేర్కొంటున్నారు. ఇప్పుడేం చేస్తారు..? మదీనాగూడ నుంచి సంగారెడ్డి వరకు 31 కి.మీ.మేర రోడ్డును 6 వరుసలకు విస్తరించనున్నారు. మూడు వరుసల సరీ్వసు రోడ్డు, ఫుట్‌పాత్, వరద నీటి డ్రెయిన్‌తో 11.66 కి.మీ., మిగతా నిడివిలో రెండు వరుసల సరీ్వసు రోడ్డు ఉండేలా నిర్మించనున్నారు. రుద్రారం వద్ద 1,020 మీటర్ల మేర, గంగారం వద్ద 840 మీటర్ల మేర రెండు ఎలివేటెడ్ కారిడార్లతోపాటు కొత్తగా 11 చిన్న వంతెనలు నిర్మించనున్నారు. ఏడు మేజర్, 19 మైనర్ జంక్షన్లను విస్తరించనున్నారు. ఏడు ప్రాంతాల్లో అండర్‌పాస్‌లు, ఆరు చోట్ల కల్వర్టులను కట్టనున్నారు. ఐదు ప్రాంతాల్లో లిఫ్టు వసతి ఉండే ఫుట్ ఓవర్ బ్రిడ్జీలు, రోడ్డుకు రెండు వైపులా క్రాష్ బ్యారియర్లను ఏర్పాటు చేయనున్నారు. వెరసి ప్రధాన క్యారేజ్ వే మీదకు చుట్టుపక్కల నుంచి ఇతర వాహనాలు, మనుషులు, జంతువులు వచ్చే వీలుండదు. ప్రధాన క్యారేజ్ వే మీదుగా వెళ్లే వాహనాలకు, దీన్ని దాటుతూ అటూఇటూ పోయే వాహనాలకు పరస్పరం ఆటంకం లేని విధంగా డిజైన్ చేశారు. ఇందుకు వీలుగా అదనంగా కావాల్సిన భూమి కోసం రూ. 166 కోట్లు వెచి్చస్తున్నారు. అన్నీ కలిపి నిర్మాణానికి రూ. 1,297 కోట్లు ఖర్చు కానున్నట్టు డీపీఆర్‌లో పేర్కొనగా దానికి తాజాగా కేంద్రం ఆమోదముద్ర వేసింది. బీహెచ్ఈఎల్ వంతెన కాకుండా.. ఈ రోడ్డు విస్తరణలో భాగంగా బీహెచ్ఈఎల్ కూడలి వద్ద 131 కోట్లతో భారీ వంతెన నిర్మిస్తున్నారు. 60 మీటర్ల వెడల్పుతో అది ఉండనుంది. దాన్ని ఈ రోడ్డు విస్తరణ ప్రాజెక్టులో కాకుండా విడిగా చూపారు. దానికి సంబంధించి ఎన్హెచ్ఏఐ రూపొందించిన నమూనా ప్రకారం పనులు సాధ్యం కాదంటూ రాష్ట్ర ప్రభుత్వ అ«దీనంలోని ఎన్‌హెచ్ విభాగం ఇటీవల ప్రతిపాదించింది. దీనిపై ఇరు విభాగాల మధ్య విభేదాలు తలెత్తడంతో పనుల్లో జాప్యం జరుగుతోంది. ఇందుకు కారణం మీరంటే మీరంటూ ఇరు విభాగాలు లేఖలు రాసుకోవడం వివాదాస్పదంగా మారింది. చదవండి: డేటా దేశం దాటిందా? -
ఇంటికీ ట్రాఫిక్ ‘సిగ్నల్’ పడాల్సిందే!
ఏదో చిన్న రోడ్డులో భారీ అపార్ట్మెంట్ల సముదాయమో, షాపింగ్ మాల్‌నో నిర్మించారు.. వచ్చీ పోయే వాహనాలు, రోడ్డు పక్కనే పార్క్ చేసే వాహనాలు, జనంతో ట్రాఫిక్ సమస్య మొదలవుతుంది. ఆ రోడ్డులో వెళ్లే వాహనాలూ నిలిచిపోతాయి. మెయిన్ రోడ్డుపైనా ప్రభావం చూపిస్తుంది.. కానీ ఇకపై ఈ సమస్యకు చెక్ పడనుంది. కొత్తగా భారీ భవనాలు, సముదాయాలు నిర్మించాలంటే.. ఆ ప్రాంతంలో అవసరమైన స్థాయిలో రోడ్డు, ట్రాఫిక్ రద్దీ నియంత్రణ సదుపాయాలు ఉండాల్సిందే. లేకుంటే రోడ్డు విస్తరణ, పార్కింగ్ కోసం అవసరమైన ఏర్పాట్లకు సదరు నిర్మాణదారు బాధ్యత వహించాల్సిందే. ఇప్పటివరకు రోడ్ల వెడల్పును పరిగణనలోకి తీసుకొని పర్మిషన్లు మంజూరు చేసే స్థానిక సంస్థలు.. త్వరలోనే ట్రాఫిక్ రద్దీని కూడా అంచనా వేసి, దానికి అనుగుణంగా అనుమతులు మంజూరు చేయనున్నాయి. చాలా చోట్ల రోడ్ల వెడల్పుతో సంబంధం లేకుండా, పార్కింగ్ స్థలం లేకున్నా.. ఎత్తయిన భవనాలను, వాణిజ్య సముదాయాలను నిర్మిస్తున్నారు. ఫలితంగా ఆయా ప్రాంతాల్లో ట్రాఫిక్ రద్దీ విపరీతంగా ఉంటోంది. ఈ క్రమంలో ఇటీవల హైదరాబాద్‌లో ట్రాఫిక్ జామ్‌లను నివారించడం, కూడళ్లపై ఒత్తిడిని తగ్గించడంపై ట్రాఫిక్ పోలీసు విభాగం క్షేత్రస్థాయి పరిశీలన జరిపి.. ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించింది. భవన నిర్మాణ అనుమతుల సమయంలోనే సదరు ప్రాంతంలో ట్రాఫిక్ రద్దీ నివారణ, క్రమబద్ధీకరణకు వీలుగా ‘ట్రాఫిక్ ఇంపాక్ట్ అసెస్మెంట్ (టీఐఏ)’ను కూడా సమర్పించేలా నిబంధన తేవాలని ప్రతిపాదించింది. దీనికి సంబంధించి జీహెచ్ఎంసీ, ట్రాఫిక్ విభాగం కలిసి ప్రత్యేక మార్గదర్శకాలను రూపొందించినట్టు తెలిసింది. దీని ప్రకారం ఇకపై నిర్మాణ అనుమతులు జారీ చేసే ముందే.. భవన నిర్మాణ ప్లానింగ్‌లో సెట్‌బ్యాక్, పార్కింగ్ స్థలం, గ్రీనరీ, వర్షపు నీటి గుంతల ఏర్పాటుతో పాటు ‘టీఐఏ’నివేదికనూ పరిగణనలోకి తీసుకోనున్నారు. ఇది అమల్లోకి వస్తే.. దేశంలో టీఐఏ ఆధారంగా నిర్మాణ అనుమతులు జారీచేసే తొలి కార్పొరేషన్‌గా హైదరాబాద్ నిలవనుంది. ప్రస్తుతం జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ పరిధిలో రోడ్డు వెడల్పు.. మాస్టర్‌ప్లాన్‌లోని ప్రతిపాదిత రోడ్డు వెడల్పులను పరిగణనలోకి తీసుకొని ప్రణాళిక విభాగం నిర్మాణ అనుమతులు మంజూరు చేస్తుంది. నిర్మాణ ప్రాంతాన్ని బట్టి ప్రస్తుతం అగ్నిమాపకశాఖ, జలమండలి, పర్యావరణం, వాల్టా, నీటి పారుదల శాఖ, విమానాశ్రయం, డిఫెన్స్, రైల్వే విభాగాల నుంచి నిరభ్యంతర ధ్రువీకరణ పత్రాల (ఎన్ఓసీ)ను జత చేయాల్సి ఉంటుంది. కొత్త విధానంలో ఇలా.. ఇక ముందు ప్రస్తుత పత్రాలకు అదనంగా నిర్మాణదారులు టీఐఏను సమర్పించాల్సి ఉంటుంది. ఈ నివేదిక కోసం ‘ఎంప్యానల్డ్ ట్రాఫిక్ కన్సల్టెంట్’ద్వారా అవసరమైన పత్రాలు జత చేస్తూ దరఖాస్తు సమరి్పంచాలి. ఒకవేళ రోడ్డు చిన్నగా ఉంటే.. భవిష్యత్తు అవసరాలను దృష్టిలో సదరు ప్రాంతంలో రోడ్డు వెడల్పు కోసం భవన యజమాని అదనపు స్థలాన్ని కేటాయించాలి. లేదా లింక్ రోడ్ల నిర్మాణానికి అయ్యే వ్యయంలో కొంత వాటా భరించాల్సి ఉంటుంది. అయితే ఈ అంశంపై మరింత స్పష్టత రావాల్సిన అవసరం ఉందని ఓ అధికారి తెలిపారు. తొలి దశలో 100 అడుగుల నుంచి 250 అడుగుల వెడల్పు ఉండే రహదారులను ఆనుకొని నిర్మించే భవనాలు/ సముదాయాలకు ‘టీఐఏ’నిబంధనలను వర్తింపజేయనున్నారు. కార్యాలయాలు, షాపింగ్ మాల్స్, మల్టీప్లెక్స్‌లు, ఆస్పత్రులు, విద్యా సంస్థల భవనాల స్వరూపం, వ్యాపార కార్యకలాపాలను బట్టి టీఐఏను సమరి్పంచాల్సి ఉంటుంది. తర్వాత భారీ నివాస భవనాలకూ వర్తింపజేయాలని నిర్ణయించినట్టు తెలిసింది. ట్రాఫిక్ సమస్యను నివారించేందుకు.. ప్రస్తుతం పార్కింగ్ స్థలం లేకున్నా వాణిజ్య భవనాలకు ఎన్ఓసీలను మంజూరు చేస్తున్నారు. ఫలితంగా ఆ భవనాల నుంచి వచ్చే వాహనా లు, బయట పార్క్ చేసేవాటితో ట్రాఫిక్ సమస్య వస్తోంది.అందువల్ల ట్రాఫిక్ పోలీసుల అనుమతి ఉంటేనే ఎన్ఓసీలు జారీ చేయాలి. 45, 60 అడుగులకుపైన వెడల్పుండే రోడ్ల మీద కట్టేవాటికి, 25 అంతస్తులపైన ఉండే అన్ని భవనాలకు ఈ విధానాన్ని అమ లు చేయడం ఉత్తమం. – కె.నారాయణ్ నాయక్, జాయింట్ సీపీ, సైబరాబాద్ ట్రాఫిక్ మరో ఎన్వోసీతో మరింత జాప్యం ఇప్పటికే హైరైజ్ భవనాలకు నిర్మాణ ఫీజులతోపాటు ఎక్స్టర్నల్ బెటర్మెంట్ చార్జీలు, ఇంపాక్ట్ ఫీజులు వసూలు చేస్తున్నారు. ఆ సొమ్మును సదరు ప్రాంతంలో డ్రైనేజీ, వాటర్, విద్యుత్, రోడ్ల వంటి మౌలిక వసతుల కల్పన కోసం మాత్రమే వినియోగించాలి. కానీ ప్రభుత్వం సొమ్మును ఇతర అవసరాలకు మళ్లిస్తోంది. ఇప్పుడు కొత్తగా ట్రాíఫిక్ ఎన్ఓసీ పేరుతో అదనపు చార్జీలు వసూలు చేయడం సరికాదు. ఇప్పుడు పదుల సంఖ్యలో ప్రభుత్వ విభాగాల ఎన్ఓసీల కోసమే నెలల కొద్దీ సమయం పడుతోంది. కొత్తగా మరోటి అంటే జాప్యం ఇంకా పెరుగుతుంది. – సి.శేఖర్‌రెడ్డి, మాజీ జాతీయ అధ్యక్షుడు, క్రెడాయ్ -
ట్రాఫిక్ దిగ్బంధంలో విరించి చౌరస్తా.. అదే సమస్యకు పరిష్కారం..
సాక్షి, బంజారాహిల్స్: అవసరమైన చోట్ల ఫ్లై ఓవర్లు నిర్మించరు... పాదచారులు రోడ్డు దాటేందుకు వంతెనలు ఉండవు.. ఇష్టానుసారంగా కూడళ్లలో రాకపోకలు... ఫలితంగా వాహనదారులు నిత్యం నరకాన్ని చూస్తున్నారు. గంటల తరబడి కూడళ్లలో సిగ్నళ్ల వద్ద వేచి ఉండాల్సి వస్తోంది. ప్రతిరోజూ వేలాది మంది వాహనదారులు రాకపోకలు సాగించే బంజారాహిల్స్ రోడ్ నెం. 1/12 విరించి ఆస్పత్రి చౌరస్తాలో గడిచిన నాలుగు దశాబ్ధాలుగా ట్రాఫిక్ ఇక్కట్ల నుంచి స్థానికులకు విముక్తి లభించడం లేదు. అదే రోడ్డు.. అదే చౌరస్తా... ఏ మాత్రం విస్తరణకు నోచుకోని ఈ కూడలిలో వాహనదారులే కాదు రోడ్డు దాటేందుకు పాదచారులు అవస్థలు పడుతున్నారు. మాసబ్ ట్యాంకు వైపు నుంచి పోలీస్ మెస్ చౌరస్తా, 1/12 విరించి ఆస్పత్రి చౌరస్తా దాటి బంజారాహిల్స్ రోడ్ నెం. 12 వైపు, కేర్ ఆస్పత్రి వైపు వెళ్లే వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఇక్కడ ఇరుకైన రోడ్డుతో పాటు అడుగడుగునా పాదచారులు రోడ్డుదాటుతుండటంతో వాహనాల రాకపోకలు ముందుకు సాగడం లేదు. కేర్ ఆస్పత్రి వైపు నుంచి మాసబ్‌ట్యాంక్, బంజారాహిల్స్ రోడ్ నెం. 12, రోడ్ నెం. 13 వైపు వెళ్లే వాహనదారులు గంటల తరబడి రోడ్లపైనే గడపాల్సి వస్తుంది. వాహనాలు కేర్ ఆస్పత్రి నుంచి మొదలుకొని 1/12 చౌరస్తా వరకు స్తంభించిపోయి మాసబ్‌ట్యాంకు వైపు వెళ్ళడమే గగనంగా మారుతోంది. పరిష్కారమిదీ... బంజారాహిల్స్ రోడ్ నెం. 1/12 విరించి చౌరస్తాలో ఫ్లై ఓవర్ నిర్మాణం చేపట్టాల్సి ఉంది. అయితే అందుకు జీహెచ్ఎంసీ అధికారులు, ప్రజాప్రతినిధులు చొరవ చూపడం లేదు. ఈ చౌరస్తాలో తప్పనిసరిగా ఫ్లై ఓవర్ నిర్మాణంతో పాటు పాదచారుల వంతెన కూడా అవసరం. పింఛన్ ఆఫీస్ వైపు నుంచి దారి మూసివేత... మాసబ్‌ట్యాంకు వైపు నుంచి బంజారాహిల్స్ రోడ్ నెం. 12 వైపు వెళ్లే మలుపు వద్ద శ్రీ వెంకటేశ్వరస్వామి దేవస్థానం ఉండగా ఈ ఆలయం వెనుక నుంచి పింఛన్ ఆఫీస్ గేటు లోపల గతంలో ఓ రోడ్డు ఏర్పాటు చేశారు. అయితే ఈ రోడ్డు అందుబాటులోకి వస్తుందనుకునేలోగా కొందరు అడ్డుపడటంతో ఈ దారిని బండరాళ్లు వేసి మూసివేశారు. గత పదేళ్లుగా ఈ సమస్యను పట్టించుకునే వారే లేరు. గుడి వెనుక దారి ఏర్పాటు చేస్తే మాసబ్ ట్యాంక్ వైపు నుంచి బంజారాహిల్స్ రోడ్ నెం. 12 వైపు వెళ్లేవారు తేలికగా ఫ్రీ లెఫ్ట్‌లో ముందుకు సాగుతారు. దీని వల్ల చాలా వరకు ఈ కూడలిపై ట్రాఫిక్ భారం తగ్గుతుంది. ప్రణాళికలేవీ..? మాసబ్ ట్యాంకు వైపు నుంచి పోలీస్ మెస్ చౌరస్తా, 1/12 చౌరస్తాల మీదుగా కేర్ ఆస్పత్రి దాకా ఓ ఫ్లై ఓవర్ నిర్మించాలనే ప్రతిపాదనలు అమలుకు నోచుకోవడం లేదు. ఇక్కడ రోడ్డు విస్తరణ కూడా చేపట్టాల్సిన అవసరం ఉంది. ఫుట్‌పాత్‌లు కూడా అందుబాటులో లేవు. గజిబిజి ట్రాఫిక్ మధ్య అక్రమ పార్కింగ్లు పెద్ద సమస్యగా మారాయి. జీహెచ్ఎంసీ, ట్రాఫిక్ అధికారులు ఈ ప్రాంతంలో పర్యటించి సమస్య పరిష్కారానికి చొరవ చూపాల్సిన అవసరం ఉంది. -
చాంతాడంతా చలానాలు పెండింగ్..మూడు రోజుల్లో రూ. 25 కోట్లు వసూళ్లు
సాక్షి, బనశంకరి: ఈనెల 11 లోపు ట్రాఫిక్ బకాయిలు చెల్లిస్తే 50 శాతం రాయితీ ఇస్తామని ప్రభుత్వం ప్రకటించడంతో ఊహించని విధంగా చెల్లింపులు జరుగుతున్నాయి. ఈనెల 3న రాయితీ అమల్లోకి రావడంతో మొదటి రోజే రూ. 5.61 కోట్లు, రెండో రోజు రూ. 6.80 కోట్లు, మూడో రోజు ఆదివారం రూ. 6.31 కోట్లకు పైగా వసూలైంది. సోమవారం కూడా భారీగా జరిమానాలు చెల్లించారు. సాయంత్రానికి మొత్తంగా రూ. 25 కోట్లు వసూలైంది. నగరంలోని ట్రాఫిక్ పోలీస్స్టేషన్లలోనే కాకుండా ఇన్ఫ్యాంట్రీ రోడ్డులోని ట్రాఫిక్ నిర్వహణ కేంద్రంలో కౌంటర్ తెరిచి జరిమానా చెల్లించడానికి అవకాశం కల్పించారు. హైకోర్టు న్యాయమూర్తి, రాష్ట్ర న్యాయసేవల ప్రాధికార అధ్యక్షుడు న్యాయమూర్తి బీ.వీరప్ప అధ్యక్షతన గత నెల 27న నిర్వహించిన సమావేశంలో రాష్ట్ర రవాణాశాఖ అధికారులతో చర్చించి జరిమానా బకాయిలపై రాయితీ ఇవ్వాలని నిర్ణయించారు. దీనికి రాష్ట్ర రవాణా రోడ్డు భద్రతా కమిషనర్ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారు. (చదవండి: వాట్సాప్‌తో ఫుడ్ ఆర్డర్ చేయొచ్చు) -
Hyderabad: రోజుకో రోడ్డు క్లోజ్!.. వాహనదారులకు చుక్కలు
జూబ్లీహిల్స్ రోడ్ నెం. 45లో ట్రాఫిక్ రద్దీని నియంత్రించేందుకు వారం క్రితం ట్రాఫిక్ పోలీసులు ప్రయోగాత్మకంగా చేపట్టిన ట్రాఫిక్ డైవర్షన్ విమర్శలకు దారి తీస్తోంది. రోజుకొక కొత్త నిర్ణయాన్ని తీసుకొస్తున్న ట్రాఫిక్ పోలీసులు వాహనదారులకు చుక్కలు చూపిస్తున్నారు. ఈ రోజు వెళ్లిన మార్గం తెల్లారేసరికి మూసేస్తున్నారు. ఆ తెల్లవారి అటు నుంచి వెళ్దామనుకుంటే మళ్లీ ‘వన్‌వే’గా మారుస్తున్నారు. సాక్షి, బంజారాహిల్స్: ఇలా ఇష్టానుసారంగా రోడ్లను మూసేస్తుండటం, వన్‌వేలో ఏర్పాటు చేస్తుండటాన్ని కేవలం వాహనదారులే కాకుండా జూబ్లీహిల్స్ కాలనీవాసులు కూడా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. నిన్న మొన్నటి దాకా జూబ్లీహిల్స్ రోడ్ నెం. 36 నుంచి జూబ్లీహిల్స్ రోడ్ నెం. 54 చట్నీస్, ఫర్జీ మీదుగా వాహనాలు రాకపోకలు సాగించాయి. ►గురువారం తెల్లవారుజామున చట్నీస్ ముందు నుంచి రోడ్ నెం. 54 వైపు వాహనాలు అనుమతించకుండా కేవలం రోడ్ నెం. 54 నుంచి రోడ్ నెం. 36 వైపు మాత్రమే వన్‌వేగా మార్చారు. దీంతో ఇటువైపు వెళ్లే వాహనదారులు చుట్టూ తిప్పుకొని రావాల్సిన పరిస్థితులు తలెత్తాయి. ►ఇంకోవైపు సీవీఆర్ న్యూస్ చౌరస్తా నుంచి జర్నలిస్టు కాలనీ, బాలకృష్ణ నివాసం చౌరస్తా మీదుగా అటు రోడ్ నెం45 వెళ్లాలన్నా, ఇటు జూబ్లీహిల్స్ చెక్‌పోస్టుకు వెళ్లాలన్నా గతంలో మాదిరిగానే ట్రాఫిక్ జామ్ అవుతున్నది. రోడ్ నెం. 45 ఫ్లై ఓవర్ కింద యధాప్రకారం ట్రాఫిక్ స్తంభించిపోతూ వాహనదారులను ప్రత్యక్ష నరకానికి గురి చేస్తున్నది. ►రోడ్ నెం. 45 నుంచి ఫినిక్స్ పక్కన ఉన్న రోడ్డు నుంచి, అల్లు అర్జున్ ఇంటి వైపు రోడ్డు నుంచి వాహనాలను అనుమతించకుండా రోడ్ క్లోజ్ చేశారు. దీంతో ఇక్కడ వాహనాలన్నీ బాలకృష్ణ చౌరస్తా నుంచి జూబ్లీహిల్స్ చౌరస్తాకు వెళ్లాల్సి రావడంతో ఇక్కడ రోడ్డు ఎత్తుగా ఉండటం, ఇరుకుగా ఉండటం, పుట్‌పాత్ లేకపోవడంతో అటు పెట్రోల్ బంక్ మరో అడ్డంకిగా మారి ఉదయం నుంచి అర్ధరాత్రి దాకా వాహనాలు స్తంభించిపోతున్నాయి. జూబ్లీహిల్స్ రోడ్ నెం. 36లో స్తంభించిన ట్రాఫిక్ ►ట్రాఫిక్ ఉన్నతాధికారులు మాత్రం రోజుకొకరు చొప్పున ఈ రోడ్డును పరిశీలించడం, స్థానిక పోలీసులకు సూచనలు జారీ చేయడంతోనే సరిపెట్టుకుంటున్నారు. ►ఇప్పటిదాకా ట్రాఫిక్ డైవర్షన్ చేపట్టిన రోడ్లలో జీహెచ్ఎంసీ ఇంజనీర్లు గుంతలను పూడ్చలేదు. రోడ్డు మరమ్మతులు చేపట్టలేదు. దెబ్బతిన్న ఫుట్‌పాత్‌లను బాగు చేయలేదు. ►విద్యుత్ అధికారులు రోడ్డుకు అడ్డుగా ఉన్న కరెంటు స్తంభాలను, హైటెన్షన్ వైర్ స్తంభాలను తొలగించిన పాపాన పోలేదు. రోడ్లపక్కనే కేబుల్ వైర్లు జారిపడుతూ వాహనదారులకు నరకాన్ని చూపిస్తున్నాయి. గతంలో సీవీఆర్ న్యూస్ చౌరస్తా నుంచి జూబ్లీహిల్స్ చెక్‌పోస్టు వెళ్లడానికి పది నిమిషాల సమయం పడితే ప్రస్తుతం డైవర్షన్ చేపట్టిన తర్వాత 15 నిమిషాలు పడుతున్నదని వాహనదారులే స్వయంగా ట్రాఫిక్ పోలీసులకు ఫిర్యాదు చేస్తున్నారు. ఇక సోషల్ మీడియాలో ఈ ట్రాఫిక్ డైవర్షన్‌పై వాహనదారులు తమ అసంతృప్తిని వెళ్లగక్కుతున్నారు. ప్రయోగాత్మకం పేరుతో తమను జూబ్లీహిల్స్ వీధులన్నీ తిప్పిస్తున్నారంటూ ట్రాఫిక్ పోలీసుల తీరును ఎండగడుతున్నారు. ►ట్విట్టర్లో ఇప్పటికే వందలాది మంది వాహనదారులు ట్రాఫిక్ డైవర్షన్ పట్ల అసంతృప్తి వ్యక్తం చేస్తూ నగర పోలీస్ కమిషనర్‌కు, నగర ట్రాఫిక్ అదనపు కమిషనర్‌కు తమ బహిరంగ అసంతృప్తిని వ్యక్తం చేస్తూ ఈ ప్రయోగం విఫలమైందంటూ ఘాటుగా చెబుతున్నారు. రోడ్లను విస్తరించకుండా... దెబ్బతిన్న రోడ్లకు మరమ్మతులు చేపట్టకుండా... ఫుట్‌పాత్‌లను అందుబాటులోకి తీసుకురాకుండా ట్రాఫిక్ డైవర్షన్ నిర్ణయాలు తీసుకొని వాహనదారుల నెత్తిన రుద్దారని ఆరోపణలు గుప్పుమంటున్నాయి. ►ఇదిలా ఉండగా జూబ్లీహిల్స్ రోడ్ నెం. 45లో చేపట్టిన ట్రాఫిక్ డైవర్షన్లు జూబ్లీహిల్స్‌లోని మిగతా రహదారులపై తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నాయి. రెసిడెన్షియల్ ఏరియాల్లో వాహనాలు స్తంభించిపోతూ అటు శబ్ధ కాలుష్యం, ఇటు వాయు కాలుష్యంతో పాటు తమకు నరకాన్ని చూపిస్తున్నాయంటూ కాలనీవాసులు గగ్గోలు పెడుతున్నారు. -
ట్రాఫిక్ ట్రయల్ రన్ తో వాహనదారులకు కొత్త చిక్కులు
-
శ్రీశైలానికి పోటెత్తిన భక్తులు.. భారీగా ట్రాఫిక్ జామ్
-
30 వాహనాలు..రూ.68.57 లక్షలు..!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర వ్యాప్తంగా ట్రాఫిక్ ఉల్లంఘనలకు పాల్పడి జరిమానా చెల్లించిన ‘టాప్ టెన్’ వాహనాల జాబితాను మూడు కేటగిరీలుగా ట్రాఫిక్ విభాగం అధికారులు రూపొందించారు. డీసీఎం వంటివి, ఆటోలు, ద్విచక్ర వాహనాలు.. ఈ మూడు విభాగాల్లోనూ టాప్ టెన్ చొప్పున మొత్తం 30 వాహనాలు ఐదేళ్ల కాలంలో ఏకంగా రూ.68,57,230 చెల్లించినట్లు తేలింది. వీటిపైనే ట్రాఫిక్ విభాగం 24,510 చలాన్లు జారీ చేసింది. జరిమానాగా చెల్లించిన టాప్ టెన్ వాహనాల్లో కమర్షియల్, సరుకు రవాణా కేటగిరీవే ఎక్కువగా ఉన్నాయి. కేవలం పౌరసరఫరాల శాఖతో పాటు అత్యవసర సేవలకు సంబంధించిన రవాణా వాహనాలకే నగరంలో 24 గంటలూ సంచరించే ఆస్కారం ఉంది. మిగిలిన వాణిజ్య వాహనాలు, లారీలను రాత్రి వేళల్లో మాత్రమే సిటీలోకి అనుమతిస్తారు. అయితే నగరంలో నిత్యం శీతల పానీయాల సరఫరా, తినుబండారాలు, సరుకులు డెలివరీ చేసే అనే వాహనాలు సంచరిస్తుంటాయి. ఇవి ఆయా దుకాణాల పని వేళల్లోనే తిరగాల్సి ఉండటంతో నగరంలోకి ప్రవేశించడం అనివార్యం. ఇలా వచ్చిన వాహనాలకు ట్రాఫిక్ పోలీసుల గరిష్టంగా రూ.1000 వరకు జరిమానా విధిస్తుంటారు. నిబంధనల ప్రకారం ఒకసారి జరిమానా విధించిన తర్వాత మళ్లీ 24 గంటల దాటే వరకు మరో జరిమానా విధించడానికి ఆస్కారం లేదు. దీన్ని ఆసరాగా చేసుకుంటున్న అనేక వాణిజ్య, సరుకు రవాణా వాహనాలు నగరంలో సంచరిస్తున్నాయి. తమ వ్యాపారంలో వచ్చే లాభం కంటే చెల్లించే జరిమానా అతితక్కువ కావడంతో ఈ పని చేస్తున్నాయి. ఈ తరహాకు చెందిన 10 వాహనాలు ఐదేళ్ల కాలంలో రూ.56,43,700 జరిమానాగా చెల్లించాయి. ఇలాంటి వాహనాలు అనుమతి లేని వేళల్లో తిరిగితే ట్రాఫిక్ ఇబ్బందులు వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఇకపై 24 గంటలకు ఒక చలాన్ కాకుండా ప్రతి ప్రాంతంలోనూ ఓ చలాన్ విధించడానికి ఉన్న అవకాశాన్ని అధికారులు పరిశీలిస్తున్నారు. కమర్షియల్ వాహనాల విషయం ఇలా ఉంటే.. ద్విచక్ర వాహనచోదకులూ ‘రికార్డులు’ సృష్టిస్తున్నారు. టూ వీలర్ నడిపే వ్యక్తి కచ్చితంగా హెల్మెట్ ధరించాలన్న నిబంధన ఉంది. ఇలా చేయని వారికి ట్రాఫిక్ పోలీసులు చలాన్ విధిస్తుంటారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు చెందిన పది ద్విచక్ర వాహనాలపైనే ఐదేళ్లల్లో 2,236 ‘హెల్మెట్’ జరిమానాలు పడ్డాయి. ఇతర ఉల్లంఘనలతో కలిపి మొత్తం 2,818 చలాన్లకు సంబంధించి ఇవి చెల్లించిన జరిమానా మొత్తం రూ.4,01,370గా ఉంది. ఫైన్లను ఈ వాహనచోదకులు పట్టించుకోకపోవడంతోనే ఈ పరిస్థితి నెలకొంది. ఇక గూడ్స్, సాధారణ ఆటోలు చేసే ఉల్లంఘనల్లో అత్య«ధికం ఓవర్ లోడింగ్, రాంగ్ పార్కింగ్‌లకు సంబంధించినవే ఉంటున్నాయి. ఈ కేటగిరీలో ‘టాప్ టెన్’ వాహనాలపై ఐదేళ్లల్లో 6,516 చలాన్లు జారీ కాగా వీటిలో అత్యధికంగా 2,847 సరుకు ఓవర్ లోడింగ్వే ఉన్నాయి. ఆ తర్వాతి స్థానంలో ప్రయాణికులను ఎక్కువగా ఎక్కించుకోవడంపై 2,659, రాంగ్ పార్కింగ్‌పై 574 జారీ అయ్యాయి. వీటితో సహా పది వాహనాలు ఐదేళ్లల్లో రూ.8,12,160 జరిమానా చెల్లించాయి. (చదవండి: ఫార్ములా- ఈ పనులు రయ్ ..రయ్) -
ట్రాఫిక్ని బట్టి సెట్ చేసుకునే డివైడర్: వీడియో వైరల్
మహానగరాల్లో ట్రాఫిక్ కష్టాలు గురించి అందరికి తెలిసిందే. ఏదైన పండుగలకు లేదా ప్రత్యేకమైన రోజుల్లో సరదాగా గడిపేందుకు బయటకు వెళ్లామా! అంతే ట్రాఫిక్‌లో చిక్కుకుపోతాం. అసలు ఆ ట్రాఫిక్ నుంచి బయటపడితే ఏదో సాధించనంత ఫీలింగ్ వస్తుంది. ఐతే ఆ సమస్యలన్నింటికి చెక్‌పెడుతూ చైనా ఒక కొత్త టెక్నాలజీని తీసుకువచ్చింది. చైనీయులు ఈ ట్రాఫిక్ సమస్యను నివారించేందుకు ఒక సరికొత్త విధానాన్ని కూడా అనుసరిస్తున్నారు. ఈ విషయాలన్నింటిని వినియోగదారులతో పంచుకుంటూ... ఒక వీడియోను పోస్ట్ చేశారు చైనా విదేశాంగ మంత్రిత్వశాఖ ప్రతినిధి హువాచున్యింగ్. ఆ వీడియోలో ట్రాఫిక్ ఎక్కువగా ఉన్నప్పుడూ క్లియర్ చేసేందుకు ఒక రివర్సబుల్ లేన్ పని తీరు చూపిస్తుంది. ఇది ఏంటంటే...రోడ్డు మధ్యలో ఉండే డివైడర్ వెడల్పును కావల్సినట్లుగా ఎడ్జెస్ట్ చేసుకుంటూ ట్రాఫిక్ని తగ్గించడం. చైనా వాసులు ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా ఉండేందుకు ఉదయం ఒక దిశలోనూ సాయంత్రం సమయాల్లో వ్యతిరేక దిశలో వెళ్తారు. అందుకోసం ఆయా దిశల్లో వెళ్లేలా డివైడర్ లైన్‌ని సెట్ చేసేకునే సరికొత్త టెక్నాలజీని అభివృద్ధి చేసింది. ఈ మేరకు ఆ వీడియోలో ఆ డివైడర్ లైన్‌ని ట్రాఫిక్ కోసం జిప్ మాదిరిగా రెండు వాహనాల సాయంతో దగ్గరగా చేయడం కనిపిస్తుంది. వీటిని రివర్సబుల్ ట్రాఫిక్ లైన్లు అంటారు. ఇవి ట్రాఫిక్ రద్దీని తగ్గించడానికి ఉపకరిస్తాయి. ఐతే నెటిజన్లు దీన్ని సరికొత్త సాంకేతిక ఆవిష్కరణగా ప్రశంసిస్తూ ట్వీట్ చేశారు. అయితే ఇదేమీ కొత్త ఆవిష్కరణ కాదని అమెరికా 1960లలోనే ఈ మౌలిక సదుపాయాల ఆవిష్కరణను ప్రవేశపెట్టినట్లు సమాచారం. #ChinaInfrastructure: How does Beijing relieve traffic jams? By changing the direction of traffic. Here's how they do it. The traffic authority selects a lane to go one direction in the morning and the opposite direction in the evening to release peak pressure. pic.twitter.com/OaaxycwDJQ — Hua Chunying 华春莹 (@SpokespersonCHN) August 31, 2022 (చదవండి: స్నేహితుడి కోసం ఎంతలా తపించిందో ఆ కంగారు: వీడియో వైరల్) -
దంచికొట్టిన వాన
ఉపరితల ఆవర్తనం, ద్రోణి ప్రభావంతో నగరంలో శుక్రవారం ఉదయం నుంచి రాత్రి వరకు కుండపోత వర్షం కురిసింది. సాధారణ జనజీవనం స్తంభించింది. రాత్రి 10 గంటల వరకు అత్యధికంగా హఫీజ్‌పేట్‌లో 11.1 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. విద్యార్థులు, ఉద్యోగులు, వ్యాపారులు వర్షం ధాటికి విలవిల్లాడారు. వర్షబీభత్సానికి సుమారు 200కు పైగా బస్తీలు నీటమునిగాయి. ఇళ్లలోకి చేరిన వరదనీటితో పలు బస్తీలవాసులు నరకయాతన అనుభవించారు. ప్రధాన రహదారులు, లోతట్టు ప్రాంతాలు చెరువులను తలపించాయి. వర్షపునీటిలో వాహనాలు భారంగా ముందుకు కదిలాయి. ఉదయం, సాయంత్రం వేళ కురిసిన వర్షంతో ప్రధాన రహదారులపై వంద కూడళ్లలో ఎక్కడికక్కడ ట్రాఫిక్ స్తంభించింది. నగరంలోని పలు చెరువులు, కుంటలు ఉప్పొంగాయి. వీటికి ఆనుకొని ఉన్న బస్తీల వాసులు బిక్కు బిక్కుమంటూ గడిపారు. జంటజలాశయాలకు ఎగువ ప్రాంతాల నుంచి భారీగా వరదనీరు చేరడంతో గండిపేట్ జలాశయానికి ఉన్న గేట్లలో రెండు గేట్లు, హిమాయత్‌సాగర్ ఒక గేటు తెరచి వరదనీటిని మూసీలోకి వదిలారు. రాగల 24 గంటల్లో నగరంలో పలు చోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నట్లు బేగంపేట్‌లోని వాతావరణ శాఖ తెలిపింది. కాగా ఈ నెల 8 నుంచి 22 వరకు భారీగా వర్షపునీరు నిలిచిన ఘటనలపై బల్దియా కాల్ సెంటర్‌కు 1456 ఫిర్యాదులందినట్లు జీహెచ్ఎంసీ వర్గాలు తెలిపాయి. ఉప్పొంగే మురుగు సమస్యలపై గురువారం జలమండలికి 500కు పైగా ఫిర్యాదులందాయి. అత్యవసర బృందాలు రంగంలోకి దిగి సహాయక చర్యలు చేపట్టాయి. సాక్షి, హైదరాబాద్: భారీ వర్షాలతో నగరంలో జనజీవనం అస్తవ్యస్థంగా మారింది. గత వారం వరుసగా ఐదారు రోజులు వర్షాలు కురవడంతో ఎన్నో ఇబ్బందులు ఎదురయ్యాయి. మధ్యలో రెండు మూడు రోజులు తెరిపివ్వగా..శుక్రవారం వాన దంచికొట్టింది. దీంతో మళ్లీ వాన కష్టాలు యథావిధిగా నగరవాసిని దెబ్బతీశాయి. నీటమునిగిన కాలనీలు, బస్తీలు కుత్బుల్లాపూర్ నియోజకవర్గ పరిధిలోని పలు ప్రాంతాల్లో కాలనీలు, బస్తీలు నీటమునిగాయి. సూరారం శ్రీరాంనగర్ ప్రాంతం చెరువును తలపించింది. జీడిమెట్ల డివిజన్ మీనాక్షి కాలనీ ప్రాంతంలో నాలా పనులు నిలిచి పోవడంతో ఎగువ ప్రాంతం నుంచి వచ్చే వర్షపు నీరు అంగడిపేట్, స్ప్రింగ్ ఫీల్డ్ కాలనీ, జీడిమెట్ల గ్రామం మీదుగా వెళ్లకుండా కాలనీలోనే నిల్వ ఉండటంతో ప్రజలు అడుగుతీసి అడుగు వేయలేని పరిస్థితి నెలకొంది. నిజాంపేట బండారి లేఔట్ ప్రాంతంలో పలు అపార్ట్మెంట్ల సెల్లార్లలో వరద నీరు చేరడంతో కాలనీ వాసులు ఇబ్బందులు పడ్డారు. అయోధ్యనగర్‌లో నాలా పరివాహక ప్రాంతం ఉండడంతో వెంకటేశ్వరనగర్, గణేశ్‌నగర్, పాపయ్యయాదవ్ నగర్, కాకతీయ నగర్ కూరగాయల మార్కెట్, శ్రీనివాస్‌నగర్ ప్రాంతాల్లో రోడ్లపై మోకాలు లోతు వరదనీరు చేరింది. లోతట్టు ప్రాంతాల్లోని పలు ఇళ్లల్లోకి వర్షపునీరు చేరడంతో స్థానికులు అవస్థలు పడ్డారు. పలు ప్రాంతాల్లో వర్షబీభత్సం ఇలా.. బేగంపేట్‌లోని బ్రాహ్మణవాడి బస్తీలో నడుములోతున వరదనీరు పోటెత్తింది. నిజాంపేట్‌లో వరదనీటిలో కార్లు, ద్విచక్రవాహనాలు సహా పలు వాహనాలు నీటమునిగాయి. అపార్ట్మెంట్ల సెల్లార్లు చెరువులను తలపించాయి. చింతల్ కాకతీయ నగర్లోనూ భారీ వర్షం బీభత్సం సృష్టించింది. ఇళ్లు, దుకాణ సముదాయాల్లోకి భారీగా వరదనీరు చేరింది. బోయిన్పల్లి, మారేడ్‌పల్లి, చిలకలగూడ, ప్యాట్నీ, ప్యారడైజ్, బేగంపేట్, అల్వాల్, రసూల్ పురా తదితర ప్రాంతాల్లో ట్రాఫిక్ స్తంభించింది. సికింద్రాబాద్ రైల్వేస్టేషన్, మారేడ్‌పల్లి, ప్యారడైజ్, బేగంపేట్ ప్రాంతాల్లో వరదనీటిలో ట్రాఫిక్ భారంగా ముందుకు కదలింది. కోఠి, బేగంబజార్, సుల్తాన్‌బజార్, ఆబిడ్స్, ట్రూప్‌బజార్, బషీర్‌భాగ్, లక్డీకాపూల్, నారాయణగూడ, హిమాయత్‌నగర్ ప్రాంతాల్లో జోరు వానకు మోకాళ్ల లోతున వరదనీరు పోటెత్తింది. కోఠిలోని పలు దుకాణాల్లోకి చేరిన వరదనీటిని తేడేందుకు వ్యాపారులు అవస్థలు పడ్డారు. భారీగా వర్షపునీరు నిలిచే రహదారులపై ట్రాఫిక్ పోలీసులను మోహరించారు. జీహెచ్ఎంసీ అత్యవసర సిబ్బంది మోటార్లతో నీటిని తోడారు. మ్యాన్‌హోళ్లను తెరచి వరదనీటిని వేగంగా కిందకు పంపించారు. వరదనీటిలో ఘనవ్యర్థాలు చేరకుండా జాగ్రత్తలు తీసుకున్నారు బాటసింగారం పండ్లమార్కెట్లో వర్షంధాటికి దుకాణాలన్నీ నీటమునిగాయి. బత్తాయి సహా పలు రకాల పండ్లు వరదనీటిలో కొట్టుకుపోయాయి. నీటిలో మునిగినవాటిని కాపాడుకునేందుకు వ్యాపారులు అవస్థలు పడ్డారు. వర్ష విలయానికి మక్కామసీదు ఆవరణలో ఓ పాత భవనం నేలకూలింది. ఎల్బీనగర్ పరిధిలోని సహారాస్టేట్స్ కాలనీలో ఓ భవనం ప్రహరీ కూలి పక్కనే ఉన్న నాలాలో పడిపోయింది. ట్రాఫిక్ పోలీసుల హై అలర్ట్.. భారీ వర్షాల నేపథ్యంలో ట్రాఫిక్ పోలీసులు హై అలర్ట్ ప్రకటించారు. సిటీజన్లకు పలు సూచనలు చేశారు. వర్షం ఆగిన వెంటనే రహదారులపైకి రావద్దని సూచించారు. కార్యాలయాలు, వ్యాపార, వాణిజ్య సముదాయాలు, పాఠశాలలు, కళాశాలలకు వెళ్లే వారు అప్రమత్తంగా ఉండాలని కోరారు. వర్షం నిలిచిన గంట తర్వాత బయటకు రావాలని సూచించారు. ఈ సూచనలను పాటించని పక్షంలో ట్రాఫిక్ ఇక్కట్లు తప్పవని స్పష్టంచేశారు. నిండుకుండల్లా జంటజలాశయాలు.. నగరానికి ఆనుకొని ఉన్న జంట జలాశయాలు ఉస్మాన్‌సాగర్, హిమాయత్‌సాగర్‌లు నిండుకుండలను తలపిస్తున్నాయి. శుక్రవారం సాయంత్రం 6 గంటల వరకు గండిపేట్ జలాశయంలోకి 200 క్యూసెక్కుల వరదనీరు చేరగా రెండు గేట్లను ఒక అడుగు మేర తెరచి 208 క్యూసెక్కుల నీటిని దిగువనకు వదిలారు. హిమాయత్‌సాగర్‌లోకి 100 క్యూసెక్కుల నీరు చేరగా..ఒక గేటును 0.6 ఫీట్ల మేర తెరచి 330 క్యూసెక్కుల నీటిని మూసీలోకి వదిలిపెట్టినట్లు జలమండలి వర్గాలు తెలిపాయి. కూలినచెట్లు 400 పైనే.. ఈ నెలలో ఇప్పటి వరకు కురిసిన వర్షాల వల్ల నగరంలో 419 చెట్లు కూలిన ఫిర్యాదులందినట్లు జీహెచ్ఎంసీ పేర్కొంది. ప్రజలకు ఇబ్బందులు లేకుండా వాటిని తొలగించినట్లు ఒక పత్రికా ప్రకటనలో తెలిపింది. జూలై 1వ తేదీ నుండి 20వ తేదీ వరకు 419 కూలిన చెట్లను తొలగించినట్లు పేర్కొంది. కూకట్పల్లి నాలా నుంచి వస్తున్న నీటితో హుస్సేన్ సాగర్‌కు వరద నీరు వచ్చి చేరుతోంది. సాగర్ పూర్తిస్థాయి నీటిమట్టం 513.41 మీటర్లు కాగా..513.43కు చేరింది. -
తీరనున్న ట్రాఫిక్ తిప్పలు.. పూర్తయిన రసూల్‌పురా నాలా, బ్రిడ్జి పనులు
-
ముందుగా రండి.. రైలెక్కండి!
సాక్షి, హైదరాబాద్: పరేడ్ గ్రౌండ్లో ఆదివారం సాయంత్రం జరగనున్న బీజేపీ బహిరంగ సభ నేపథ్యంలో హైదరాబాద్ పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ప్రధాని నరేంద్ర మోదీతో పాటు పలువురు బీజేపీ అగ్రనేతలు ఈ సభకు హాజరుకానున్నారు. పలు రహదారులు నిర్బంధం, మళ్లింపుల కారణంగా రద్దీ ఎక్కువగా ఉంటుందని, దీంతో ఇతర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌కు ముందుగా చేరుకోవాలని సూచించారు. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ చుట్టూ 3 కి.మీ. పరిధిలో అన్ని రహదారులు, జంక్షన్లు రద్దీగా ఉంటాయని, తదనుగుణంగా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు. సికింద్రాబాద్ ప్లాట్ ఫారమ్ నంబర్ 1 వైపు నుంచి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌కు చేరుకునేటప్పుడు ట్రాఫిక్ రద్దీ ఉంటుంది కాబట్టి ప్రయాణికులు చిలకలగూడ వైపు నుంచి ప్లాట్‌ఫాం 10 నుంచి స్టేషన్‌కు చేరుకోవాలని తెలిపారు. పంజాగుట్ట నుంచి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌కు వచ్చే ప్రయాణికులు పంజాగుట్ట, వీవీ విగ్రహం, ఐమ్యాక్స్ రోటరీ, తెలుగు తల్లి ఫ్లైఓవర్, లోయర్ ట్యాంక్ బండ్, ఆర్టీసీ క్రాస్ రోడ్, ముషీరాబాద్ క్రాస్ రోడ్, గాంధీ హాస్పిటల్, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌కు చేరుకోవాలి. తిరిగి ఇదే మార్గం గుండా పంజగుట్టకు చేరుకోవాలి. ఉప్పల్, తార్నాక, ఆలుగడ్డబావి, చిల్కలగూడ క్రాస్ రోడ్ నుంచి స్టేషన్‌కు చేరుకోవాలి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి ప్యాట్నీ, ప్యారడైజ్ జంక్షన్, బేగంపేట, పంజాగుట్ట వరకు రద్దీగా ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఆయా మార్గాలను వినియోగించకూడదు. (చదవండి: తెలంగాణలో రాబోయేది బీజేపీ ప్రభుత్వమే) -
ఇక సాఫీ జర్నీ
సాక్షి, హైదరాబాద్: కైతలాపూర్ ఆర్ఓబీని మంత్రి కేటీఆర్ మంగళవారం ప్రారంభించనున్నట్లు జీహెచ్ఎంసీ పేర్కొంది. హైటెక్ సిటీ– బోరబండ స్టేషన్ల మధ్య నిర్మించిన ఆర్ఓబీతో కూకట్పల్లి, హైటెక్ సిటీల మధ్య సాఫీ ప్రయాణం సాధ్యం కానుంది. జేఎన్టీయూ జంక్షన్, మలేషియన్ టౌన్షిప్ జంక్షన్, హైటెక్‌సిటీ ఫ్లై ఓవర్, సైబర్‌టవర్ జంక్షన్ల వద్ద ట్రాఫిక్ చిక్కులు తగ్గుతాయని అధికారులు పేర్కొన్నారు. సనత్‌నగర్, బాలానగర్, సికింద్రాబాద్‌ల నుంచి వచ్చేవారు మూసాపేట వద్ద డైవర్ట్ అయి కైతలాపూర్ మీదుగా మాదాపూర్ మెయిన్‌రోడ్ చేరుకోవచ్చు. తద్వారా 3.5 కి.మీ దూరం తగ్గడంతోపాటు గంట ప్రయాణ సమయం కలిసి వస్తుంది. ఎస్సార్డీపీలో భాగంగా చేపట్టిన ఈ ప్రాజెక్ట్ అంచనా వ్యయం రూ.86 కోట్లు. ఎస్సార్డీపీ ద్వారా చేపట్టిన 41 పనుల్లో ఇప్పటి వరకు 29 పూర్తయినట్లు అధికారులు పేర్కొన్నారు. వాటిలో ఏడు ఆర్ఓబీ/ఆర్‌యూబీలున్నాయన్నారు. (చదవండి: సిటీలో డీడీసీ... మాదకద్రవ్యాలపై స్పెషల్ డ్రైవ్) -
Hyderabad: సొంత బండి సో బెటర్!
సాక్షి, హైదరాబాద్: సాధారణంగా పెరుగుతున్న జనాభా అవసరాలకు అనుగుణంగా మౌలిక, రవాణా సదుపాయాలు విస్తరిస్తాయి. కానీ గ్రేటర్లో అందుకు విరుద్ధమైన పరిస్థితి నెలకొంది. ఏటేటా జనాభా పెరుగుతోంది. నలువైపులా నగరం విస్తరిస్తోంది. కానీ ప్రజారవాణా సదుపాయాలు మాత్రం పరిమితంగానే విస్తరించాయి. కొత్తగా మెట్రో రైలు సదుపాయం మినహా అదనంగా ప్రజారవాణా ఏ మాత్రం మెరుగుపడకపోవడం గమనార్హం. అదే సమయంలో వ్యక్తిగత వాహనాలు భారీగా రోడ్డెక్కాయి. నగర జనాభా ప్రస్తుతం ఇంచుమించు కోటిన్నరకు చేరుకుంది. పెరుగుతున్న జనాభాకు తగ్గట్లుగానే వాహనాల సంఖ్య 70 లక్షలు దాటింది. ఈ పదేళ్లలో ప్రజారవాణా విస్తరణకు నోచకపోవడం వల్లనే వ్యక్తిగత వాహనాల సంఖ్య భారీగా పెరిగినట్లు రవాణా రంగానికి చెందిన నిపుణులు అంచనా వేస్తున్నారు. బెంగళూరు వంటి మెట్రోపాలిటన్ నగరాల్లో ప్రజా రవాణా గణనీయంగా అభివృద్ధి చెందితే హైదరాబాద్‌లో మాత్రం తగ్గుముఖం పట్టడం గమనార్హం. కిక్కిరిసిపోతున్న రహదారులు.. గ్రేటర్లో ఏటా సుమారు 2.5 లక్షల వాహనాలు కొత్తగా వచ్చి చేరుతున్నాయి. వీటిలో మూడొంతులకు పైగా వ్యక్తిగత వాహనాలే. ప్రజారవాణా వాహనాల విస్తరణ కనీసం 15 శాతం కూడా లేకపోవడం గమనార్హం. కోటిన్నర జనాభా ఉన్న నగరంలో వాహనాల సంఖ్య ప్రస్తుతం 71 లక్షలు దాటింది. రోజు రోజుకు వేల సంఖ్యలో రోడ్డెక్కుతున్న వాహనాలతో రహదారులు కిక్కిరిసిపోతున్నాయి. కోవిడ్ దృష్ట్యా వ్యక్తిగత వాహనాల వినియోగం భారీగా పెరిగింది. ఈ రెండేళ్లలోనే 5 లక్షలకు పైగా కొత్త వాహనాలు రోడ్డుపైకి వచ్చాయి. 2020లో 65 లక్షల వాహనాలు ఉంటే ఇప్పుడు 71 లక్షలు దాటాయి. యువతలో 80 శాతం మందికి బైక్ తప్పనిసరిగా మారింది. చదువు, ఉద్యోగ,వ్యాపార అవసరాలతో నిమిత్తం లేకుండా ఒక వయస్సుకు రాగానే పిల్లలకు బండి కొనివ్వడాన్ని తల్లిదండ్రులు గొప్పగా భావిస్తున్నారు. రవాణాశాఖలో నమోదైన 71 లక్షల వాహనాల్లో సుమారు 47 లక్షల వరకు బైక్‌లే కావడం గమనార్హం. మరో 20 లక్షల వరకు కార్లు ఉన్నాయి. మిగతా 5 లక్షల వాహనాల్లో ఆటోరిక్షాలు, క్యాబ్‌లు, సరుకు రవాణా వాహనాలు, స్కూల్ బస్సులు, ఆర్టీసీ, ప్రైవేట్ బస్సులు తదితర కేటగిరీలకు చెందిన వాహనాలు ఉన్నాయి. పదేళ్లలో రెట్టింపు... పదేళ్లలో జనాభా పెరిగింది. 2011 నాటి లెక్కల ప్రకారం 75 లక్షలు ఉంటే ఇప్పుడు కోటిన్నరకు చేరింది. సొంత వాహనాలు సైతం ఇంచుమించు జనాభాకు సమాంతరంగా పెరిగాయి. కానీ ప్రజారవాణా సదుపాయాలు మాత్రం ఈ పదేళ్లలో చాలా వరకు తగ్గుముఖం పట్టాయి. 2012 నాటి లెక్కల ప్రకారం నగరంలోని 28 డిపోల పరిధిలో 3850 సిటీ బస్సులు ఉండేవి. ప్రతిరోజు సుమారు 32 లక్షల మంది ప్రయాణికులు ఈ బస్సుల్లో రాకపోకలు సాగించారు. మరో 8 లక్షల మంది ఆటోలను వినియోగించుకున్నారు. లక్ష మంది ఎంఎంటీఎస్ రైళ్లలో ప్రయాణం చేశారు. అంటే 75 లక్షల జనాభాలో కనీసం సగం మందికి ప్రజా రవాణా అందుబాటులో ఉంది. ఆర్టీఏ లెక్కల ప్రకారం పదేళ్ల క్రితం నగరంలో వ్యక్తిగత 33 లక్షల వరకు ఉంటే ఇప్పుడు వాటి సంఖ్య 71 లక్షలు దాటింది. ఇప్పు‘ఢీ’లా... రోజుకు 3.5 లక్షల మంది ప్రయాణికులకు రవాణా సదుపాయాన్ని అందజేసే మెట్రో రైలు తప్ప ఈ పదేళ్లలో ఇతర రవాణా సదుపాయాలు ఏ మాత్రం మెరుగుపడలేదు. సిటీ బస్సుల సంఖ్య ఇంచుమించు సగానికి పడిపోయింది. 2550 బస్సులు ప్రస్తుతం అందుబాటులో ఉన్నాయి. 16 లక్షల మంది మాత్రమే ప్రయాణం చేస్తున్నారు. కోవిడ్ దృష్ట్యా ఆటోలు, క్యాబ్‌ల వినియోగం బాగా తగ్గింది. ప్రస్తుతం ఈ రెండు కేటగిరీ వాహనాల్లో ప్రతిరోజు 5 లక్షల మంది మాత్రమే ప్రయాణం చేస్తున్నట్లు అంచనా. కోవిడ్‌తో ఎంఎంటీఎస్‌ల వినియోగం దారుణంగా పడిపోయింది. గతంలో రోజుకు 121 సర్వీసులు నడిస్తే ఇప్పుడు 75 మాత్రమే ఉన్నాయి. అప్పుడు లక్ష మంది ప్రయాణం చేశారు. ఇప్పుడు 25 వేల నుంచి 30 వేల మంది మాత్రమే ఎంఎంటీఎస్‌లను వినియోగించుకుంటున్నారు. ప్రభుత్వ,ప్రైవేట్ రంగాలకు చెందిన ఉద్యోగులు, ఐటీ నిపుణులు, విద్యార్ధులు తదితర అన్ని వర్గాలకు మెట్రో రైలును ఏకైక పరిష్కారంగా భావించారు. కానీ ఈ ఐదేళ్లలో మెట్రో ప్రయాణికుల సంఖ్య ఏ మాత్రం మెరుగుపడలేదు. (చదవండి: టాఫిక్ సిగ్నల్.. ఇక ఆటోమేటిక్!) -
టాఫిక్ సిగ్నల్.. ఇక ఆటోమేటిక్!
సాక్షి, హైదరాబాద్: సాధారణంగా ప్రతి ట్రాఫిక్ జంక్షన్‌లోనూ నాలుగు రోడ్లు ఉంటాయి... ఒక్కో రోడ్‌కు నిర్ణీత సమయం గ్రీన్ లైట్, రెడ్ లైట్ వెలుగుతూ “సిగ్నల్స్ సైకిల్’ నడుస్తుంది. అన్ని రోడ్లలోనూ, అన్ని వేళల్లో వాహనాల రద్దీ ఒకేలా ఉండదు... అయినప్పటికీ ట్రాఫిక్ సిగ్నల్స్ సైకిల్లో మాత్రం మార్పు ఉండట్లేదు. ఫలితంగా గ్రీన్ లైన్ పడిన రహదారులు ఖాళీగా ఉంటుండగా, రెడ్‌లైన్ ఉన్న రోడ్లు కిక్కిరిసిపోతున్నాయి. ఈ ప్రభావం ఆ జంక్షన్‌తో పాటు చుట్టుపక్కల ప్రాంతాలపై ఉంటోంది. దీంతో అనేక చౌరస్తాల్లో సిబ్బంది మాన్యువల్‌గా ఆపరేట్ చేయాల్సి వస్తోంది. ఈ సమస్యకు పరిష్కారంగా ట్రాఫిక్ విభాగం అధికారులు అడాప్టివ్ ట్రాఫిక్ కంట్రోలింగ్ సిస్టం (ఏటీసీఎస్) అమలులోకి తీసుకువస్తున్నారు. దీనికి సంబంధించి ట్రాఫిక్ చీఫ్ ఏవీ రంగనాథ్ శుక్రవారం తన కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. ట్రాఫిక్ సిగ్నల్స్ అనుసంధానించి ఉండే సర్వర్‌కు ఏ జంక్షన్‌లోని, ఏ రహదారిలో, ఎంత ట్రాఫిక్ ఉంది? అనేది సాంకేతికంగా తెలుసుకుని సిగ్నల్స్ సైకిల్లోనూ మార్పు తీసుకురానున్నారు. దీనికోసం ఇంటిగ్రేటెడ్ ట్రాఫిక్ మేనేజ్మెంట్ సిస్టంలో(ఐటీఎంఎస్) అడాప్టివ్ ట్రాఫిక్ కంట్రోలింగ్ సిస్టం(ఏటీసీఎస్) విధానాన్ని అమలు చేస్తున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే గూగుల్ సంస్థతో పోలీసు విభాగానికి ఒప్పందం కుదిరింది. ఓలా, ఉబర్, ర్యాపిడో తదితర సంస్థలతోనూ సమన్వయం ఏర్పాటు చేసుకోనున్నారు. ఏటీసీఎస్ విధానంలో ఓ మార్గంలో ఉన్న నాలుగైదు జంక్షన్లు అనుసంధానం అవుతాయి. ఆయా చౌరస్తాల్లో ఎటు నుంచి ఎంత ట్రాఫిక్ వస్తోందనేది లెక్కించడానికి అవసరమైన పరిజ్ఞానం ట్రాఫిక్ కెమెరాల్లో ఉంది. ఇవన్నీ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్‌తో అనుసంధానించి ఉంటాయి. అక్కడి సర్వర్‌లో ఉండే సాఫ్ట్వేర్ ఈ వాహనాల సంఖ్య ఆధారంగా ఏఏ మార్గాల్లో ట్రాఫిక్ ఎక్కువగా ఉంటే ఆ రూట్లకు ఎక్కువ సేపు గ్రీన్ లైట్ పడేలా చేస్తుంది. అయితే గరిష్టంగా 100 సెకన్లు మాత్రమే ఇది ఉంటుంది. ఆపై రోటేషన్‌పై సిగ్నల్ సైకిల్ మొదలవుతుంది. ఇప్పటికే గూగుల్ మ్యాప్స్‌లో ఆయా మార్గాల్లో ఉన్న రద్దీ కనిపిస్తూ ఉంటుంది. ఈ డేటాతో పాటు వివిధ బైక్ ట్యాక్సీ, క్యాబ్ సేవలను అందిస్తున్న సంస్థలతోనూ ట్రాఫిక్ పోలీసులు అవగాహన కుదుర్చుకోనున్నారు. వీరి నుంచి నగరంలోని వివిధ మార్గాల్లో ఉన్న వాహనాల రద్దీ వివరాలు అప్డేట్ చేసుకుంటారు. ఇవన్నీ ట్రాఫిక్ పోలీసు విభాగానికి చెందిన సర్వర్ అప్లికేషన్ ఇంటర్ఫేస్ (ఏపీఐ) ద్వారా అనుసంధానిస్తారు. ఇలా ఆయా రహదారుల్లో ట్రాఫిక్ రద్దీ ఎప్పటికప్పుడు ట్రాఫిక్ సర్వర్‌కు చేరుతుంది. దీన్ని ఆటోమేటిక్‌గా గుర్తించే ఆ సర్వర్ సిగ్నల్స్ సైకిల్‌ను మారుస్తుంది. ఈ ఏటీసీఎస్ ద్వారా ట్రాఫిక్ జామ్స్ తగ్గడంతో పాటు వాహనచోదకుల సమయం సైతం ఆదా అవుతుంది. ప్రస్తుతం ట్రాఫిక్ సిగ్నల్స్‌ను ఐబీఐ గ్రూపు నిర్వహిస్తోంది. శుక్రవారం ఈ సంస్థ ప్రతినిధులతో సమీక్ష నిర్వహించిన ట్రాఫిక్ చీఫ్ ఏవీ రంగనాథ్ జూలై ఆఖరు నాటికి ఏర్పాటు పూర్తి చేయాలని ఆదేశించారు. ఆపై మరో వారం పాటు ట్రయల్ రన్ చేసి, ఆగస్టు మొదటి వారం నాటికి ఆటోమేటిక్ సిగ్నల్స్‌ను అందుబాటులోకి తీసుకురావాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నారు. (చదవండి: తెలివిగా బుల్లెట్ వాహనాన్ని కొట్టేశారు...అమ్మేందుకు యత్నిస్తుంటే...) -
Photo Feature: ట్రాఫిక్ చక్రబంధనం...
సాక్షి, హైదరాబాద్: ఓ వైపు చిరుజల్లులు... మరోవైపు ఆఫీసుల నుంచి ఉద్యోగులు, సిబ్బంది ఇళ్లకు చేరే సమయం కావడంతో నగరంలో బుధవారం ట్రాఫిక్ సమస్య ఎదురైంది. మెహిదీపట్నం, పంజగుట్ట, బంజారాహిల్స్, బేగంపేట, మాసాబ్‌ట్యాంకు, లక్డీకాపూల్ తదితర ప్రాంతాల్లో సాయంత్రం ఏడు గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు రోడ్లపై వాహనాలు బారులుదీరి కన్పించాయి. -
Hyderabad: ట్రాఫిక్ ఆంక్షలు... వాహనాలు మళ్లింపు
సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రి కేసీఆర్ ఎల్బీ స్టేడియంలో శుక్రవారం ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు. జమాతుల్ విదాగా పిలిచే రంజాన్ మాసంలో ఆఖరి శుక్రవారం కావడంతో పాతబస్తీలోని మక్కా మసీదులో ప్రత్యేక ప్రార్థనలు జరగనున్నాయి. ఈ రెండు కార్యక్రమాల నేపథ్యంలో ఆయా ప్రాంతాల్లో, నిర్ణీత సమయాల్లో ట్రాఫిక్ ఆంక్షలు, మళ్లింపులు విధిస్తూ ట్రాఫిక్ చీఫ్ ఏవీ రంగనాథ్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. వాహనచోదకులు వీటిని దృష్టిలో పెట్టుకుని తమకు సహకరించాల్సిందిగా ఆయన కోరారు. ఎల్బీ స్టేడియంలో జరిగే ఇఫ్తార్ విందుకు ప్రముఖులు, ఆహూతులు భారీ సంఖ్యలో హాజరుకానున్న నేపథ్యంలో శుక్రవారం సాయంత్రం 5 నుంచి రాత్రి 9 గంటల మధ్య ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు అమలుకానున్నాయి. ఆయా సమయాల్లో సాధారణ వాహనచోదకులను ఏఆర్ పెట్రోల్ పంప్–బీజేఆర్ విగ్రహం–బషీర్‌బాగ్ మార్గాల్లోకి అనుమతించరు. చాపెల్ రోడ్, నాంపల్లి వైపు నుంచి బీజేఆర్ స్టాట్యూ వైపు వచ్చే వాహనాలను ఏఆర్ పెట్రోల్ పంప్ నుంచి మళ్లిస్తారు. వీటిని కంట్రోల్ రూమ్ వైపు అనుమతించరు. గన్‌ఫౌండ్రీ ఎస్బీఐ నుంచి బషీర్‌బాగ్ ఫ్లైఓవర్ వైపు వచ్చే వాహనాలను చాపెల్ రోడ్ మీదుగా, రవీంద్రభారతి, హిల్‌ఫోర్ట్ రోడ్ వైపు నుంచి బీజేఆర్ స్టాట్యూ వైపు వచ్చే వాహనాలను సుజాత హైస్కూల్ మీదుగా, బషీర్‌బాగ్ ఫ్లైఓవర్ వైపు నుంచి వచ్చే వాహనాలను చాపెల్ రోడ్ మీదుగా మళ్లిస్తారు. నారాయణగూడ సిమెట్రీ వైపు నుంచి బషీర్‌బాగ్ వైపు వచ్చే వాహనాలను ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్ వద్ద, కింగ్ కోఠి, బొగ్గులకుంట వైపు నుంచి భారతీయ విద్యా భవన్స్ మీదుగా వచ్చే వాహనాలను కింగ్ కోఠి చౌరస్తా నుంచి తాజ్ మహల్ హోటల్ మీదుగా మళ్లిస్తారు. బషీర్‌బాగ్ నుంచి కంట్రోల్ రూమ్ వైపు వచ్చే వాటిని లిబర్టీ మీదుగా పంపిస్తారు. జమాతుల్ విదా ప్రార్థనల నేపథ్యంలో... శుక్రవారం ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు చార్మినార్–మదీన, చార్మినార్–ముర్గీ చౌక్, రాజేష్ మెడికల్ హాల్–శాలిబండ మధ్య ఎలాంటి వాహనాలను అనుమతించరు. వీటిని మదీన జంక్షన్, హిమ్మత్‌పుర, చౌక్ మైదాన్ ఖాన్, మోతీగల్లీ, ఈదీ బజార్ చౌక్, షేర్ బాటిల్ కమాన్, ఓల్డ్ కమిషనర్ కార్యాలయం చౌరస్తాల నుంచి అవసరాన్ని బట్టి మళ్లిస్తారు. ప్రార్థనలకు హాజరయ్యే వారి కోసం గుల్జార్ ఫంక్షన్ హాల్, ముఫీదుల్ అమాన్ గ్రౌండ్స్, చార్మినార్ బస్ టెర్మినల్, ఆయుర్వేదిక్ యునానీ హాస్పిటల్, ఖిల్వత్ గ్రౌండ్స్, చౌమొహల్లా ప్యాలెస్ ఎదురుగా ఉన్న ఓల్డ్ పెన్షన్ ఆఫీస్, సర్దార్ మహల్‌ల్లో (ఇక్కడ కేవలం విధుల్లో ఉన్న అధికారుల వాహనాలు) పార్కింగ్ సదుపాయం కల్పించారు. సికింద్రాబాద్ ప్రాంతంలో జరిగే ప్రార్థనల నేపథ్యంలో మహంకాళి పోలీసుస్టేషన్ నుంచి రామ్‌గోపాల్ పేట్ రోడ్ జంక్షన్ మధ్య మార్గాన్ని ఉదయం 9 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు మూసేస్తారు. బాటా చౌరస్తా నుంచి సుభాష్ రోడ్ వైపు వచ్చే ట్రాఫిక్‌ను లాలా టెంపుల్ మీదుగా పంపిస్తారు. ఈ మళ్లింపులు ఆర్టీసీ బస్సులకు సైతం వర్తిస్తాయని అధికారులు స్పష్టం చేశారు. (చదవండి: ట్విట్టర్లో పెట్రో వార్ !) -
గగనతలం నుంచి గస్తీ...రహదారులపై డ్రోన్ కన్ను
సాక్షి, హైదరాబాద్: నగర ట్రాఫిక్ విభాగంలోనూ అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం, ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ వినియోగానికి అడుగులు వేస్తున్నారు. ఇందులో భాగంగా డ్రోన్లు సమీకరించుకుని వాటి సహాయంతో గస్తీ నిర్వహించాలని ట్రాఫిక్ చీఫ్ ఏవీ రంగనాథ్ నిర్ణయించారు. నగర పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్ అనుమతితో ఇప్పటికే చేపట్టిన ప్రయోగాత్మక పరిశీలన సంతృప్తికర ఫలితాలు ఇచ్చింది. దీంతో త్వరలో తొలి దఫా మూడింటిని సమీకరించుకోనున్నారు. రాష్ట్ర ప్రభుత్వ గుర్తింపు పొందిన స్టార్టప్ సంస్థ నుంచి వీటిని ఖరీదు చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఆ ప్రాంతాల్లో.. తిప్పలెన్నో.. సిటీలోని రోడ్లపై ట్రాఫిక్ ఎప్పుడూ ఒకేలా ఉండదు. ఉదయం–సాయంత్రం పీక్ అవర్స్‌గా పిలిచే రద్దీ వేళల్లో భారీ రద్దీ ఉంటుంది. ఈ సమయాల్లో అనేక ప్రాంతాల్లో ట్రాఫిక్ జామ్స్ కూడా ఏర్పడుతుంటాయి. వ్యాపార, వాణిజ్య, విద్యా సంస్థలు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో ఇవి మరింత ఎక్కువ. ఆయా చోట్ల ఉండే అక్రమ పార్కింగ్, ఫుట్‌పాత్‌ల ఆక్రమణలు, బాటిల్ నెక్స్ కారణంగా ఈ ఇబ్బందులు మరింత పెరుగుతుంటాయి. వీటిని నిరోధించడానికి ప్రస్తుతం స్థానిక ట్రాఫిక్ పోలీసులు ద్విచక్ర వాహనాలతో పాటు తేలికపాటి వాహనాల పైనా గస్తీ నిర్వహిస్తుంటారు. ట్రాఫిక్‌కు అడ్డంకులు సృష్టించే వాటిని గుర్తించి సరి చేస్తుంటారు. దీనికోసం పెద్ద సంఖ్యలో ట్రాఫిక్ పోలీసులు, హోంగార్డులను వినియోగించాల్సి వస్తోంది. ప్రముఖుల పర్యటనల నేపథ్యంలోనూ.. నగరంలో అనునిత్యం ప్రముఖుల పర్యటనలు సాగుతుంటాయి. రాష్ట్రంలో ఉన్న వీవీఐపీలతో పాటు ఇతర రాష్ట్రాలు, దేశాల నుంచి ఏటా వందల సంఖ్యలో ముఖ్యులు వస్తుంటారు. వీరి రాకపోకల నేపథ్యంలో ట్రాఫిక్ ఇబ్బందులు రాకుండా ట్రాఫిక్ పోలీసులు ఆయా మార్గాల్లో మళ్లింపులు విధించడంతో పాటు గస్తీ నిర్వహించడం పరిపాటి. కీలక సభలు, సమావేశాలతో పాటు గణేష్, బోనాలు వంటి పండగలు, ఉత్సవాల సమయంలోనూ రహదారులపై ట్రాఫిక్ పోలీసుల కదలికలు ఎక్కువగా ఉంటేనే సామాన్యులకు ట్రాఫిక్ ఇబ్బందులు రాకుండా ఉంటాయి. ప్రస్తుతం ఈ విధులను స్థానిక ట్రాఫిక్ ఠాణాలకు చెందిన సిబ్బంది రోడ్లపై సంచరిస్తూ నిర్వర్తిస్తున్నారు. టీసీసీసీతో అనుసంధాని వినియోగం... ఈ డ్రోన్లను బషీర్‌బాగ్‌లోని ట్రాఫిక్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్‌తో (టీసీసీసీ) అనుసంధానించనున్నారు. డ్రోన్ కెమెరాల్లో కనిపించే దృశ్యాలను ఇక్కడి సిబ్బంది అనునిత్యం పరిశీలిస్తూ ఉంటారు. వీళ్లు గమనించిన అంశాల ఆధారంగా రహదారిపై అవసరమైన ప్రాంతానికి క్షేత్రస్థాయి సిబ్బందిని పంపిస్తారు. డ్రోన్ కెమెరా అందించిన విజువల్స్ ఆధారంగా ఇతర విభాగాలను అప్రమత్తం చేయనున్నారు. ప్రస్తుతం సిటీలో ఉన్న సీసీ కెమెరాలు సైతం ఈ సెంటర్‌తోనే అనుసంధానించి ఉన్నాయి. ఇప్పుడు డ్రోన్ కెమెరాలను అనుసంధానిస్తే మెరుగైన ఫలితాలు ఉంటాయని ఉన్నతాధికారులు చెబుతున్నారు. గరిష్టంగా రెండు నెలల్లో నగర ట్రాఫిక్ విభాగంలో మూడు డ్రోన్లు సేవలు అందించనున్నాయి. తిరుమలగిరి ప్రాంతంలో ప్రయోగాత్మకంగా.. ఇలా రహదారులపై పెట్రోలింగ్ చేయడంలో ట్రాఫిక్ పోలీసులకు కొన్ని ఇబ్బందులు వస్తున్నాయి. ఒక్కో బృందం ఒక సమయంలో కేవలం ఓ రహదారిపై మాత్రమే పని చేయగలుగుతోంది. దాన్ని క్లియర్ చేసిన పోలీసులు మరో చోటుకు వెళ్లేసరికి ఇక్కడ మళ్లీ అడ్డంకులు వచ్చిపడుతున్నాయి. దీనికి పరిష్కారంగా డ్రోన్ల సాయంతో గగనతల గస్తీ నిర్వహణకు ట్రాఫిక్ పోలీసులు డ్రోన్లు ఖరీదు చేస్తున్నారు. రహదారులపై రోడ్డు ప్రమాదాలు జరిగినప్పుడు, అనుకోకుండా తలెత్తే నిరసనల సందర్భంలోనూ వీటిని వినియోగించనున్నారు. రాష్ట్రానికి చెందిన స్టార్టప్స్‌ను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ఉన్న ట్రాఫిక్ పోలీసులు ఈ డ్రోన్లను ప్రభుత్వ గుర్తింపు పొందిన దాని నుంచి ఖరీదు చేయాలని నిర్ణయించారు. ఇప్పటికే తిరుమలగిరి ప్రాంతంలో ప్రయోగాత్మకంగా రెండుసార్లు డ్రోన్లను వాడి చూశారు. ఇవి సత్ఫలితాలను ఇవ్వడంతో ముందుకు వెళ్లడానికి సన్నాహాలు చేస్తున్నారు. (చదవండి: అంతా ఆ తాను ముక్కలే!) -
పోలీస్‌స్టేషన్‌కు యూకేజీ పిల్లోడు.. ‘మీరంతా వచ్చి ట్రాఫిక్ క్లియర్ చేయండి’
పలమనేరు: తమ పాఠశాల వద్ద జేసీబీ, ఇతర వాహనాలను అడ్డుగా నిలపడంతో స్కూల్ బస్సులు ఆపాలన్నా, బడికి వెళ్లాలన్నా ట్రాఫిక్ వల్ల ఇబ్బందిగా ఉందని ఓ యూకేజీ పిల్లోడు నేరుగా పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశాడు. చిత్తూరు జిల్లా పలమనేరు పట్టణంలోని ఆదర్శ పాఠశాలలో యూకేజీ చదువుతున్న కార్తికేయ (06) నిత్యం బడి వద్ద ట్రాఫిక్ సమస్య తలెత్తడాన్ని గమనించాడు. ఈ సమస్య తీరాలంటే ఎవరితో చెప్పాలని తన తండ్రిని అడగ్గా పోలీసులకు చెప్పాలంటూ సమాధానం ఇచ్చాడు. దీంతో శనివారం ఉదయం కార్తికేయ పోలీస్‌స్టేషన్‌కు వెళ్దాం నాన్నా.. అంటూ మారాం చేయడంతో తండ్రి స్టేషన్ వద్దకు తీసుకెళ్లాడు. వెంటనే లోనికెళ్లిన బుడతడు సీఐ భాస్కర్ వద్దకెళ్లి.. వెంటనే మీరంతా వచ్చి ట్రాఫిక్‌ను క్లియర్ చేయండి అంటూ బుడిబుడిమాటలతో ధైర్యంగా అడిగాడు. ఓ కానిస్టేబుల్‌ను పంపుతామని సీఐ చెప్పడంతో వద్దు సార్.. మీరే రావాలని పట్టుబట్టాడు. ఆ పిల్లాడి ధైర్యానికి సంబరపడిపోయిన సీఐ ఓ మిఠాయి తినిపించి అభినందించాడు. ఏ ప్రాబ్లమ్ వచ్చినా నాకు ఫోన్ చేయమంటూ సీఐ మాటవరసకు చెప్పగా.. ఆ బుడతడు వెంటనే ‘ఫోన్ నంబర్ ఇస్తే కదా’ అనడంతో ఆశ్చర్యపోవడం పోలీసుల వంతైంది. తర్వాత సీఐ ఓ పేపర్‌పై తన సెల్ నెంబరు రాసిచ్చి పంపాడు. అనంతరం ఓ కానిస్టేబుల్‌ను పంపి స్కూల్ వద్ద ట్రాఫిక్ విధుల్లో ఉంచారు. దీన్నంతా సెల్ఫోన్లో రికార్డు చేసి సోషల్ మీడియాలో పెట్టడంతో ఇప్పుడా వీడియో నెట్టింట హల్చల్ సృష్టిస్తోంది. -
వరుడికి ట్రాఫిక్ కష్టాలు... కాలినడకన వెళ్లిన తాళి కట్టాడు
కర్ణాటక(యశవంతపుర): ఓ వైపు ముహూర్తం దగ్గర పడుతోంది... రోడ్డంతా ట్రాఫిక్ జామ్... కల్యాణ మంటపం చేరుకోవడానికి పెళ్లి కుమారుడితో బయలుదేరిన బంధువులు ట్రాఫిక్‌లో ఇరుక్కుపోయారు. ఇక లాభం లేదనుకున్న పెళ్లి కుమారుడు కాలినడకన కల్యాణ మంటపానికి వెళ్లి వధువు మెడలో మూడుముళ్లు వేశారు. చామరాజనగరకు చెందిన వధువుకు, తమిళనాడులోని సత్యమంగళకు చెందిన వరుడికి వివాహం నిశ్చయమైంది. సత్యమంగల సమీపంలోని బన్నారి ఆలయంలో శుక్రవారం ఉదయం వివాహం జరగాల్సి ఉంది. గురువారం రాత్రి కర్ణాటక, తమిళనాడు సరిహద్దులో సత్యమంగలం అటవీ ప్రాంతం వద్ద రాత్రి సమయంలో వాహన సంచారాన్ని నిషేధించారు. దీంతో మరుసటిరోజు ఉదయం రోడ్డు పొడవునా వందల సంఖ్యలో వాహనాలు బారులు తీరాయి. ఇదే సమయంలో ఓ పెళ్లి కుమారుడు, బంధువులు కారులో వచ్చారు. ట్రాఫిక్ పునరుద్ధరణకు గంటల కొద్ది సమయం పడుతుందని తెలియడంతో పెళ్లి కుమారుడు కాలినడకన మంటపానికి బయలుదేరాడు. సకాలంలో అక్కడికి చేరుకుని వధువు మెడలో తాళికట్టాడు. ఈ ఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. -
‘ట్రాఫిక్ కారణంగా విడాకులు తీసుకుంటున్నారు’
ట్రాఫిక్ కారణంగానే ముంబైలో మూడు శాతం మంది విడాకులు తీసుకుంటున్నారని మహారాష్ట్ర మాజీ మంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ భార్య అమృత ఫడ్నవీస్ అన్నారు. ఆర్థిక రాజధానిలో రోడ్ల పరిస్థితిని గురించి మీడియాతో మాట్లాడుతూ.. ఈ విధంగా విచిత్రమైన వాదనను వినిపించారు. అంతేకాదు తాను దేవేంద్ర ఫడ్నవీస్ భార్య అనే విషయం మరచిపోండి. ఒక మహిళగా మీతో మాట్లాడుతున్నాను. గుంతలు, ట్రాఫిక్‌తో తాను వ్యక్తిగతంగా చాలా ఇబ్బంది పడ్డానని చెప్పుకొచ్చారు. పైగా ఈ ట్రాఫిక్ కారణంగానే కుటుంబంతో గడిపే సమయం లేకపోవడంతో చాలామంది విడాకులు తీసుకుంటున్నారని ఒక విచిత్రమైన లాజిక్‌ని చెప్పారు. దీంతో శివసేన నాయకురాలు ప్రియాంక చతుర్వేది ఆమె పేరు ఎత్తకుండానే సోషల్ మీడియా వేదికగా ఆమె స్టేట్మెంట్పై విరుచుకుపడ్డారు. అంతేకాదు ట్రాఫిక్ కారణంగా విడాకులు తీసుకుంటున్నారన్న మహిళకు ది బెస్ట్ లాజిక్ ఆఫ్ ది డే అవార్డును అందజేయాలంటూ వ్యంగ్యంగా కౌంటరిచ్చారు. అంతేకాదు బెంగుళూరు కుటుంబాలు ఈ స్టేట్మెంట్ని క్లైయిమ్ చేసుకుంటారే ఏమో! జాగ్రత్తా అంటూ ప్రియాంక చతుర్వేది చమత్కరించారు. పైగా విడాకులు తీసుకోవడంపై దృష్టి సారించకుండా కుటుంబంతో గడిపేందుకు హాలీడే బ్రేక్ తీసుకోండి అన్నారు. అంతేకాదు దయచేసి ఈ విచిత్రమైన స్టేట్మెంట్ని అనుకరించకండి మీ వివాహబంధానికి ప్రాణాంతకం కావచ్చు అంటూ నవ్వుతూ ఉన్న ఎమోజీలతో విమర్శిస్తూ ప్రియాంక చతుర్వేది ట్వీట్ చేశారు. #WATCH: BJP leader Devendra Fadnavis' wife Amruta Fadnavis says, "I'm saying this as common citizen. Once I go out I see several issues incl potholes,traffic. Due to traffic,people are unable to give time to their families & 3% divorces in Mumbai are happening due to it." (04.02) pic.twitter.com/p5Nne5gaV5 — ANI (@ANI) February 5, 2022 Best (il)logic of the day award goes to the lady who claims 3% Mumbaikars are divorcing due to traffic on roads. Please take a holiday break rather than having a mind on brake.. Bengaluru families please avoid reading this , can prove fatal for your marriages 😂 — Priyanka Chaturvedi🇮🇳 (@priyankac19) February 5, 2022 (చదవండి: నామినేషన్ దాఖలు చేసేందుకు పరుగులు పెట్టిన యూపీ క్రీడా మంత్రి) -
హైదరాబాద్‌లో 90 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు, ఎందుకంటే?
సాక్షి, హైదరాబాద్: నగరంలోని పాతబస్తీ బహదూర్‌పురా జంక్షన్లో మల్టీ లెవల్ ఫ్లై ఓవర్ గ్రేడ్ సపరేటర్ నిర్మాణ పనుల కారణంగా ట్రాఫిక్ దారి మళ్లింపు కొనసాగుతుందని సంబందిత ట్రాఫిక్ పోలీసులతో పాటు జీహెచ్‌యంసీ ప్రాజెక్ట్ విభాగం ఇంజినీరింగ్ అధికారులు అంటున్నారు. ఈ మేరకు ఇప్పటికే హైదరాబాద్ పోలీసు కమిషనరేట్ పరిధిలోని ట్రాఫిక్ డీసీపీ ట్రాఫిక్ ఆంక్షలపై ఆదేశాలు జారీ చేయగా..ప్రస్తుతం సైబరాబాద్ ట్రాఫిక్ డీసీపీ సైతం ఆదేశాలు జారీ చేశారు. గతకొంత కాలంగా బహదూర్‌పురా జంక్షన్లో మల్టీ లెవల్ ఫ్లై ఓవర్ నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. ►అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ మల్టీ లెవల్ ఫ్లై ఓవర్ పనుల్లో భాగంగా గ్రేడ్ సపరేటర్ నిర్మాణ పనులు చివరి దశకు చేరుకున్నాయి. ►ఈ నేపథ్యంలో ఈ రోడ్డు ద్వారా రాకపోకలు సాగించే భారీ వాహనాలపై 90 రోజుల పాటు ఆంక్షలు విధించనున్నారు. ►ఈ నెల 15 నుంచి వచ్చే ఏడాది (2022) ఫిబ్రవరి 15వ తేదీ వరకు ఈ ఆంక్షలు అమలులో ఉంటాయి. ►తొంబై రోజుల పాటు వాహనాల దారి మళ్లింపు కొనసాగుతుంది. ►కేవలం భారీ వాహనాలను మాత్రమే అనుమతించడం లేదని...లైట్ మోటార్ వెహికిల్స్‌ను యధావిధిగా అనుమతించనున్నామని పోలీసు అధికారులు తెలిపారు. ►ఆరాంఘర్ చౌరస్తా నుంచి బహదూర్‌పురా ద్వారా పురానాపూల్ చేరుకునే భారీ వాహనాలను దారి మళ్లించనున్నారు. ►బెంగుళూర్ హై వే కావడంతో ఈ రోడ్డులో టీఎస్ఆర్టీసీ బస్సులతో పాటు ఏపీఎస్ఆర్టీసీ, కేఎస్ ఆర్టీసీ బస్సులు రాకపోకలు సాగిస్తుంటాయి. ►వీటికి తోడు ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు, లారీలు ఇతర భారీ వాహనాలు నడుస్తుంటాయి. ►భారీ వాహనాలు బహదూర్‌పురా చౌరస్తా మీదుగా కాకుండా మైలార్‌దేవ్‌పల్లి, బండ్లగూడ, మహబూబ్‌నగర్ క్రాస్ రోడ్డు, చాంద్రాయణగుట్ట, డీఎంఆర్ఎల్, మిధాని, ఐ.ఎస్.సదన్, సైదాబాద్, చంచల్‌గూడ ద్వారా నల్గొండ క్రాస్ రోడ్డుకు చేరుకునేలా సంబంధిత అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. చదవండి: (తిరుమల శ్రీవారి భక్తులకు శుభవార్త..) ►కార్లు, ఆటోలు, ద్విచక్ర వాహనాలు ఎప్పటి లాగే పురానాపూల్ నుంచి ఆరాంఘర్ చేరుకోవచ్చు. ►పాతబస్తీలో పాటు నగరంలోని ఇతర ప్రాంతాల నుంచి భారీ వాహనాలు ఆరాంఘర్ వెళ్లడానికి రెండు ప్రత్యామ్నాయ మార్గాలను సూచిస్తున్నారు. ►ఆయా వాహనాలు దారుషిపా, పురానీహవేలీ, బీబీబజార్ చౌరస్తా,షంషీర్గంజ్,ఫలక్‌నుమా రైల్వే ఓవర్ బ్రిడ్జి,చాంద్రాయణగుట్ట చౌరస్తా ద్వారా ఆరాంఘర్ చేరుకోవడానికి వీలుంటుందన్నారు. ►మరో మార్గమైన నల్లొండ క్రాస్ రోడ్డు ద్వారా ఆరాంఘర్ వెళ్లాల్సి ఉంటుందంటున్నారు. ►90 రోజుల పాటు వాహనదారులు సహకరించాలని ట్రాఫిక్ పోలీసులు కోరారు. ►ఇప్పటికే హైదరాబాద్ పోలీసు కమిషనరేట్ పరిధిలోని పురానాపూల్ నుంచి ఆరాంఘర్ వరకు భారీ వాహనాల రాకపోకలపై ఆంక్షలను విధిస్తూ ఆదేశాలు జారీ చేశారు. ►బహదూర్‌పురా చౌరస్తా వద్ద జరిగే మల్టీ లెవల్ ఫ్లై ఓవర్ గ్రేడ్ సెపరేటర్ నిర్మాణ పనుల సందర్భంగా అటు సైబరాబాద్ కమిషనరేట్ పరిధి లోని ట్రాఫిక్ డీసీపీ... ఇటు హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలోని ట్రాఫిక్ డీసీపీ భారీ వాహనాలపై ట్రాఫిక్ ఆంక్షలను కొనసాగించనున్నారు. -
ఇకపై ట్రాఫిక్ ఆపొద్దు.. ప్రజల వాహనాలతో కలిసే..
సాక్షి, చెన్నై: సీఎం ఎంకే స్టాలిన్ కాన్వాయ్‌లో వాహనాల సంఖ్యను తగ్గించారు. ప్రజలకు ఇబ్బంది కలగకుండా, ట్రాఫిక్ ఎక్కడా ఆపకుండా ఆయన వాహనాలు పయనించే రీతిలో చర్యలు తీసుకున్నారు. ఆయన కాన్వాయ్‌లో పదికి పైగా వాహనాలు ఉంటాయి. అయితే, అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజాహితాన్ని కాంక్షించే విధంగా స్టాలిన్ పయనం సాగుతోంది. నగరాల్లో ట్రాఫిక్ రద్దీని గుర్తించిన స్టాలిన్ తన కాన్వాయ్ వాహనాల సంఖ్య సగానికి సగం తగ్గించేశారు. ఇక ఆయన పయనించే మార్గాల్లో ట్రాఫిక్‌ను నిలపరు. ప్రజల వాహనాలతో కలిసి ఆయన కాన్వాయ్ సాగే విధంగా ఆదివారం నుంచి చర్యలు తీసుకోనున్నారు. చదవండి: (ఖుష్బూకు ‘ప్రత్యేక’ పదవి) దివ్యాంగులకు సాయం సచివాలయంలో శనివారం జరిగిన కార్యక్రమంలో పలువురు దివ్యాంగులకు సీఎం వీల్చైర్లు, స్కూటర్లను పంపిణీ చేశారు. అదేవిధంగా స్కూటర్ల మరమ్మతుల నిమిత్తం రూ. 1,500 సాయంకు శ్రీకారం చుట్టారు. అలాగే, దివ్యాంగుల రిజర్వేషన్ కింద ప్రభుత్వ ఉద్యోగాలు దక్కించుకున్న వారికి నియామక ఉత్తర్వులను అందజేశారు. -
మున్సిపల్ శాఖ మంత్రిగా అందరూ నన్నే ట్రోల్ చేస్తారు: కేటీఆర్
-
ఈ నగరానికేమైంది.. జంక్షన్ జామాయే.. కోట్లేమాయే
హైదరాబాద్: ఉమ్మడి రాష్ట్రంలో ఉండగా 2011లో రూ.10 కోట్లు. ఏడాదికే హైదరాబాద్ ట్రాఫిక్ ఇంటిగ్రేడెట్ మేనేజ్మెంట్ సిస్టం (హెచ్–ట్రిమ్స్) పేరుతో మరో రూ.66.5 కోట్లు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత 2015 నుంచి రూ.100 కోట్లకు పైగా కేటాయింపు...రాజధానిలో గడిచిన 11 ఏళ్లలో ట్రాఫిక్ సిగ్నల్స్‌తో పాటు ఆ వ్యవస్థ ఆధునీకరణ కోసం వెచ్చించిన మొత్తాలివి. ఇలా కోట్లు కుమ్మరిస్తున్నా నగర వాసికి ట్రాఫిక్ కష్టాలు మాత్రం తప్పట్లేదు. ‘ప్రాజెక్ట్ 100 డేస్’ కింద పదేళ్ల క్రితం రూ.10 కోట్లు కేటా యించినా, తెలంగాణ ఏర్పడిన తర్వాత రూ.100 కోట్లకు పైగా మంజూరు చేసినా పరిస్థితిలో పెద్దగా మార్పులేదు. చాలాచోట్ల ట్రాఫిక్ సిగ్నల్స్ లేకపోవడం, ఏర్పాటు చేసినవి ప్రారంభించకపోవడం, కీలక జంక్షన్లలో సైతం రోజుల తరబడి సిగ్నల్స్ పనిచేయకుండా పోవడం వంటి కారణాలతో నగరంలో వాహన ప్రయాణం నరకయాతనను తలపిస్తోందంటే అతిశయోక్తి కాదు. ‘వంద రోజులు’ ఓ ఫ్లాప్ ప్రాజెక్ట్ ఉమ్మడి రాష్ట్రానికి కిరణ్‌కుమార్‌రెడ్డి సీఎంగా ఉం డగా ‘ప్రాజెక్ట్ 100 డేస్’తో ఓ పథకం ప్రకటిం చారు. నగర రూపురేఖల్ని 100 రోజుల్లో మార్చాలనే లక్ష్యంతో దీన్ని రూపొందించారు. ఇందులో భాగంగా ట్రాఫిక్ విభాగానికి రూ.10 కోట్లు మంజూరు చేస్తూ వీటిని సిగ్నలింగ్ వ్యవస్థ ఆధునీకరించడానికి వెచ్చించేలా ఆదేశాలు జారీ చేశారు. దీనికోసం ట్రాఫిక్, జీహెచ్ఎంసీ, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ విభాగాల అధికారులతో ఓ కమిటీని ఏర్పాటు చేశారు. అప్పట్లో నగర వ్యాప్తంగా ఉన్న 150 జంక్షన్లలోని సిగ్నలింగ్ వ్యవస్థను అప్‌గ్రేడ్ చేయడానికి రూ.7.5 కోట్లు, 30 చోట్ల కొత్త సిగ్నల్స్ ఏర్పాటు చేయడానికి మరో రూ.2.5 కోట్లు వెచ్చించారు. ఈ నిధుల్ని గరిష్టంగా మూడు నెలల్లోనే ఖర్చు చేసినప్పటికీ ఆశించిన ఫలితాలు మాత్రం రాలేదు. హెచ్–ట్రిమ్స్తోనూ ఒరిగింది లేదు..తర్వాత హైదరాబాద్ ట్రాఫిక్ ఇంటిగ్రేటెడ్ మేనేజ్మెంట్ సిస్టం (హెచ్–ట్రిమ్స్) అందుబాటులోకి తీసుకురావాలని 2012లో నిర్ణయించారు. ఇలాంటి వ్యవస్థ దేశంలోనే తొలిసారి కావడం గమనార్హం. కాగా అప్పటికి సిటీలో ఉన్న 168 జంక్షన్లలోని సిగ్నల్స్ హైటెక్ హంగులు సంతరించుకోవడంతో పాటు 53 జంక్షన్లలో కొత్త సిగ్నల్స్ ఏర్పాటు లక్ష్యంగా ముందుకు వెళ్లారు. ఈ ప్రాజెక్ట్ కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.66.5 కోట్లను కేటాయించింది. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) సహకారం, అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా (యాస్కీ) ప్రణాళికలతో అమలైన ఈ ప్రాజెక్ట్‌కు ఆంధ్రప్రదేశ్ టెక్నాలజీ సర్వీసెస్ (ఏపీటీఎస్) సాంకేతిక సహకారం అందించింది. సిగ్నల్స్ ఏర్పాటులో ప్రముఖ సంస్థగా పేరున్న బెంగళూరుకు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (బెల్) ఈ ప్రాజెక్ట్ నిర్మాణ కాంట్రాక్టును దక్కించుకుంది. 2012 ఆగస్టు 18న హైదరాబాద్ నగర పోలీసు కమిషనర్ కార్యాలయంలో జీహెచ్ఎంసీ, హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులతో బెల్ ఒప్పందం కుదుర్చుకుంది. గరిష్టంగా ఏడాది కాలంలో ఈ ప్రాజెక్ట్ పూర్తి చేయాలని అప్పట్లో గడువు నిర్దేశించారు. అప్పటి ఒప్పందం ప్రకారం ఏడాదిలోపు బెల్ ఈ కాంట్రాక్ట్ పూర్తి చేయకుంటే పెనాల్టీ చెల్లించాల్సి ఉండగా... తొమ్మిది నెలల్లోనే పూర్తి చేస్తే ప్రాజెక్ట్ వ్యయంలో 3 శాతం అధికంగా చెల్లించేలా నిర్ణయించారు. అత్యాధునిక సౌకర్యాలు, నిఘా వ్యవస్థలతో కూడిన ఈ ప్రాజెక్ట్ పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తే నగరంలో ప్రయాణ వేగంలో 50 శాతం పెరుగుదల , రోడ్ నెట్వర్క్ ఆలస్యంలో 35 శాతం, ఇంధన వినియోగంలో 22 శాతం తగ్గుదల వస్తుందని యాస్కీ అంచనా వేసింది. దాదాపు రెండేళ్లకు పైగా సాగిన ఈ ప్రాజెక్టు వల్ల ప్రత్యేకంగా నగరానికి ఒరిగిందంటూ ఏమీ కనిపించక పోగా ట్రాఫిక్ కష్టాలు యధావిధిగానే కొనసాగడం గమనార్హం. ఐదేళ్లుగా ఐటీఎంఎస్ ట్రయల్ రన్! ‘ఉల్లంఘనుల్లో’ క్రమశిక్షణ పెంచడం, స్వైర‘విహారం’ చేసేవారికి చెక్ చెప్పడం, వాహనచోదకులు గమ్యం చేసుకునే సమయాన్ని గణనీయంగా తగ్గించడం, ట్రాఫిక్ జామ్లనేవి లేకుండా చేయడం... లక్ష్యాలుగా అత్యాధునిక ఐటీఎంఎస్ (ఇంటెలిజెంట్ అండ్ ఇంటిగ్రేటెడ్ ట్రాఫిక్ మేనేజ్మెంట్ సిస్టం)కు శ్రీకారం చుట్టారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత 2015లో దాదాపు రూ.100 కోట్ల వ్యయంతో తొలి దశలో నగరంలోని మూడు పోలీసు కమిషనరేట్లలో ఉన్న 250 జంక్షన్లలో ఈ వ్యవస్థ అమలు చేయాలని భావించారు. ఇది అందుబాటులోకి వస్తే ట్రాఫిక్ నిర్వహణ, పరిశీలన మొత్తం కమిషనరేట్ కేంద్రంగా పని చేసే ట్రాఫిక్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ (టీ–సీసీసీ) నుంచే ఉంటుందని ప్రకటించారు. రాత్రి వేళల్లోనూ పనిచేసే, 16 మెగా పిక్సెల్ కెమెరాలతో దేశంలోనే తొలిసారిగా హైదరాబాద్‌లో అందుబాటులోకి వచ్చిన ఈ ఐటీఎంఎస్ ఇంకా పూర్తి స్థాయిలో ఫలితాలు ఇవ్వట్లేదు. దాదాపు ఐదేళ్లుగా ట్రయల్ రన్లకు మాత్రమే ఇది పరిమితమైంది. ఆటోమేటిక్ నంబర్ ప్లేట్ రీడింగ్ సిస్టం (ఏఎన్పీఆర్), డైనమిక్ బస్ ప్లాట్‌ఫాం అసైన్మెంట్ (డీబీపీఏ), ఇన్సిడెంట్ మేనేజ్మెంట్ సిస్టం (ఐఎంఎస్), వేరియబుల్ మెసేజ్ సైన్ బోర్డులుగా (వీఎంఎస్) పిలిచే డిజిటల్ బోర్డులు, ఎమర్జెన్సీ కాల్ బాక్స్‌లు (ఈసీబీ)... ఇలా ఉండాల్సిన హంగులు, ఆర్భాటాల్లో ఇప్పటివరకు కేవలం సగమే పని చేస్తుండటం శోచనీయం. తాజాగా మరో రూ.60 కోట్లు .. ఇప్పటివరకు రూ.170 కోట్లకు పైగా ఖర్చు పెట్టినా రోడ్డు మధ్యలో నిల్చుని, అటూ ఇటూ తిరుగుతూ, నోటిలో ఉన్న ఈల ఊదుతూ, చేత్తోనో లేదా చేతిలో ఉన్న పనిచేయని కర్ర (ఎలక్ట్రానిక్) తోనో వాహనాలకు దారి చూపించాల్సిన పరిస్థితి ట్రాఫిక్ పోలీసులకు.. ఏ మాత్రం అదుపు తప్పినా గంటల తరబడి ట్రాఫిక్‌లో ఇరుక్కుపోవాల్సిన దుస్థితి నగరవాసులకు తప్పట్లేదు. గతంలో ఈ సిగ్నల్స్ నిర్వహణ కాంట్రాక్టును దక్కించుకున్న ‘బెల్’ ఆ బాధ్యతల నుంచి తప్పుకోవడం, కొత్తగా టెండర్ దక్కించుకున్న ఐబీఐ సంస్థ పూర్తిస్థాయిలో రంగంలోకి దిగకపోవడమే దీనికి కారణమని అధికారులు చెబుతున్నారు. తాజాగా సిగ్నల్స్ ఆధునీకరణ కోసం ఐబీఐ–ఉస్మానియూ యూనివర్శిటీ కలసి పని చేసేలా జీహెచ్ఎంసీ ఒప్పందం కుదుర్చుకుంది. సోమవారం ఈ ఒప్పందాలపై సంతకాలు కూడా పూర్తయ్యాయి. మూడేళ్లల్లో పూర్తి చేయాల్సిన ఈ ప్రాజెక్టుకు రూ.60 కోట్లు కేటాయిస్తున్నట్లు జీహెచ్ఎంసీ ప్రకటించింది. నగరంలో ఎక్కడా ట్రాఫిక్ రద్దీ లేకుండా చూడటం, సిగ్నల్స్ ఆధునీకరణ, సాఫీగా ప్రయాణం సాగేలా చేయడం వంటి పాత లక్ష్యాలతోనే కూడిన ఈ ప్రాజెక్టు అమలుకు ఓయూ ఈఈఈ విభాగం సహకరిస్తుందని జీహెచ్ఎంసీ ప్రకటించింది. ఇక ఈ ప్రాజెక్టు ఏ మేరకు ఫలితాలు ఇస్తుందో వేచి చూడాల్సిందే. మా పరిస్థితి దారుణంగా ఉంటోంది ఇప్పటికే వేసవి తాపం కనిపిస్తోంది. ఈ వాతావరణంలో ట్రాఫిక్ పోస్టులో కూర్చుని పని చేయడమే కష్టమే. అలాంటిది కొన్ని సిగ్నల్స్ పని చేయకపోవడంతో అదనపు డ్యూటీలు చేయాల్సి వస్తోంది. రోడ్డుపై, రహదారికి మధ్యలో, సిగ్నల్స్ వద్ద నిల్చుని స్వయంగా వాహనాలను నియంత్రించాల్సి వస్తోంది. ఫలితంగా విధులు ముగిసే సమయానికి మా పరిస్థితి దారుణంగా తయారవుతోంది. – పశ్చిమ మండలానికి చెందిన ఓ కానిస్టేబుల్ -
ట్రాఫిక్ కష్టాలకు ఆనంద్ మహీంద్రా పరిష్కారం..
ముంబై : దేశ ఆర్థిక రాజధాని ముంబైలో ట్రాఫిక్ కష్టాలకు పారిశ్రామిక దిగ్గజం ఆనంద్ మహీంద్ర సరికొత్త పరిష్కారం చూపారు. అయితే ఆయన చూపిన పరిష్కారం చట్టపరంగా ఆమోదయోగ్యమైనది కాకపోవడం గమనార్హం. తన కంపెనీ ప్రత్యేకంగా ఐక్యరాజ్యసమితి కోసం డిజైన్ చేసి రూపొందించిన వాహనం ఫోటోలను ఆనంద్ మహీంద్ర మంగళవారం ట్విటర్లో షేర్ చేస్తూ ముంబై ట్రాఫిక్‌కు ఈ వాహనాలు సరిగ్గా సరిపోతాయని వ్యాఖ్యానించారు. ఐక్యరాజ్యసమితి శాంతి సేనలకు ఉపకరించేలా ప్రత్యేకంగా అభివృద్ధి చేసిన ఈ వాహనాలు ఐఈడీ వంటి పేలుడు పదార్ధాలను పసిగట్టి ఏరివేసేలా వీటిని మహీంద్రా అండ్ మహీంద్రా అభివృద్ధి చేసింది. ఈ వాహనాన్ని మీన్ మెషీన్‌గా ఆనంద్ మహీంద్రా అభివర్ణిస్తూ మహీంద్రాడిఫెన్స్ స్ఫూర్తిని ఇది ప్రతిబింబిస్తుందని ట్వీట్ చేశారు. ఆపై ముంబై ట్రాఫిక్‌కు ఇది సరిగ్గా సరిపోతుందని వ్యంగ్య ధోరణిలో పేర్కొన్నారు. వీధుల్లో ప్రయాణించేందుకు అనుమతిస్తే ఇది ముంబై ట్రాఫిక్ కష్టాలకు సరైన పరిష్కారమని చమత్కరించారు. ఆనంద్ మహీంద్రా ట్వీట్‌కు 9000కు పైగా లైక్‌లు రాగా, పలువురు ఈ వాహనాన్ని ప్రశంసిస్తూ కామెంట్లు చేశారు. ముంబైకు ఈ వాహనం సరిగ్గా సరిపోతుందని మహీంద్రా వ్యంగ్యంగా వ్యాఖ్యానించినా ముంబైకర్లకు ట్రాఫిక్ కష్టాలు చుక్కలు చూపుతాయి. ముంబై వాసులు ఏడాదిలో సగటున 11 రోజులు ట్రాఫిక్‌లో చిక్కుకుపోతారని ఓ నివేదిక పేర్కొంది. చదవండి : కరోనా స్పెషల్ ఆటో చూడండి -
హారన్‌పై చెయ్యి పడిందో.. ఇక అంతే..!
సాక్షి, హైదరాబాద్ : జల, వాయు, శబ్ద, నేల కాలుష్యానికి కేరాఫ్‌గా మారిన ముంబైలో ట్రాఫిక్ ఇబ్బందులకు కొదవే ఉండదు. లక్షలాది వాహనాలు, ఫ్యాక్టరీల నుంచి వెలువడే పొగ పర్యావరణానికి తూట్లు పొడుస్తుండగా.. అదేపనిగా మోగించే వాహనాల హారన్లు శబ్ద కాలుష్యానికి కారణమవుతున్నాయి. ముఖ్యంగా కూడళ్ల వద్ద రెడ్ సిగ్నల్ పడినా కూడా కొందరు హారన్లతో హోరెత్తిస్తుంటారు. దాంతో అక్కడ పనిచేసే ట్రాఫిక్ సిబ్బందికి చెవిపోటు ఖాయం. అందుకే దీనికో పరిష్కారం కనుగొన్నారు ముంబై పోలీసులు. కొన్ని భారీ కూడళ్ల వద్ద డెసిబెల్స్ మెషీన్లతో సిగ్నలింగ్ వ్యవస్థను అనుసంధానం చేశారు. వాహనదారుల హారన్ మోతలకు కళ్లెం వేశారు. హారన్ శబ్దాలు డెసిబెల్స్ మీటర్లో 85 కంటే ఎక్కువ నమోదైందంటే మళ్లీ రెడ్ సిగ్నల్ పడుతుంది. దాంతో కథ మళ్లీ మొదటికొస్తుంది. ఎవరిదారిన వారు.. సైలెంట్‌గా వెళ్లి పోతే సమస్యే లేదు. కాదూ కూడదు అని.. హారన్‌పై చెయ్యి పడిందో ఇక అంతే..! గ్రీన్ సిగ్నల్ పడినా వెంటనే రెడ్ సిగ్నల్‌కు జంప్ అవుతుంది. ఈ ప్రయోగం ముంబైలో సత్ఫలితాలనిస్తోంది. దీనిపట్ల తెలంగాణ ఐటీశాఖ మంత్రి కేటీఆర్ ఆసక్తి కనబరిచారు. మన రాష్ట్రంలో కూడా ఇలాంటి విధానాన్ని తీసుకొద్దామని ట్విటర్లో వెల్లడించారు. -
మీరే పౌర పోలీస్!
సాక్షి, అమరావతిబ్యూరో: ‘ముగ్గురు యువకులు ఒకే ద్విచక్రవాహనంపై అడ్డదిడ్డంగా నడుపుతూ ఇతరులకు అంతరాయం కలిగిస్తున్నారు. ఆ యువకుల దుడుకు ప్రవర్తనను అడ్డుకోవాలని మీ మనసులో ఉన్నా.. గొడవ జరుగుతుందేమోననే ఆందోళన మిమ్మల్ని ముందుకు వెళ్లనీయడంలేదు. అయితే మీ చేతికి మట్టి అంటుకోకుండా మీ కోరిక నెరవేర్చుకునే అవకాశం కల్పిస్తూ రవాణాశాఖ ప్రత్యేక వాట్సాప్ నెంబరు 9542800800 అందుబాటులోకి తెచ్చింది. ఉల్లంఘన దారులపై మీరు తీసిన ఫొటోను ఈ వాట్సాప్‌కు జతచేస్తే వారికి జరిమానాలు పడతాయి. కృష్ణా జిల్లా విజయవాడకు చెందిన రాజేష్ (పేరు మార్చాం) ఓ ప్రభుత్వ ఉద్యోగి. నిత్యం గొల్లపూడి నుంచి పటమటకు రాకపోకలు సాగిస్తుంటారు. తాను వెళ్లే మార్గంలో తరచూ ట్రాఫిక్ ఉల్లంఘనలు కనిపిస్తుండటంతో ఓ రోజు తన సెల్ఫోన్లో చిత్రీకరించి, విజయవాడ రవాణాశాఖ అధికారులకు వాట్సప్ ద్వారా పంపించారు. ఉల్లంఘన జరిగిందని రవాణాశాఖ నిర్ధారణకు వచ్చాక ఈ–వెహికల్ చెక్ రిపోర్ట్‌లో ఆ వివరాలను నమోదు చేయగా, ఉల్లంఘనదారుడికి ఈ–చలానా జారీ అయింది. రోజూ సగటున 27 వరకు.. విశాఖపట్నం, శ్రీకాకుళం, కృష్ణా, తూర్పుగోదావరి, గుంటూరు, విజయనగర తదితర జిల్లాల్లో ట్రాఫిక్ ఉల్లంఘనలపై తరచూ పోలీసులకు ఫిర్యాదులు అందుతున్నాయి. రవాణాశాఖ ఈ వాట్సాప్ నెంబరును ఆగస్టు 27 నుంచి అమల్లోకి తీసుకురాగా.. ఈ నెల 11వ తేదీ వరకు మొత్తం 2,731 ఫిర్యాదులు వచ్చాయి. ఇందులో అత్యధికంగా విశాఖపట్నం నుంచి 1,444, శ్రీకాకుళం నుంచి 540, కృష్ణా జిల్లాలో 240, గుంటూరు నుంచి 114 ఫిర్యాదులు అందగా.. అనంతపురం జిల్లా నుంచి అత్యల్పంగా 9 ఫిర్యాదులే అందాయి. చాలా జిల్లాల్లో పౌరులు దీనిని ఓ సామాజిక స్పృహగా భావించాలని ఫిర్యాదు చేయడానికి నడుంకట్టారు. పోలీసు వాహనాలైనా.. పోలీసులు ఇతర ప్రభుత్వ శాఖల వాహనాలు ఉల్లంఘనలకు పాల్పడితే జరిమానా విధించరనే ప్రచారం ఉంది. అయితే ప్రభుత్వ వాహనాలపైనా ఫిర్యాదు చేయవచ్చని, తప్పకుండా చర్యలు తీసుకుంటామని రవాణాశాఖ అధికారులు చెబుతున్నారు. ప్రజల్ని ప్రోత్సహిస్తున్నాం నిబంధనల ఉల్లంఘన జరిగితే సాధారణ ప్రజలెవరైనా రవాణాశాఖ దృష్టికి తీసుకురావచ్చు. అందుకే ప్రజల్లో జవాబుదారీతనం పెంచేందుకు ఈ తరహా ఫిర్యాదుల్ని ప్రోత్సహిస్తున్నాం. ఉల్లంఘన జరిగిందని తేలితే ఈ–చలాన్ విధిస్తున్నాం. – ఎస్.వెంకటేశ్వరరావు, డీటీసీ, విజయవాడ ట్రాఫిక్ ఉల్లంఘనలపై ఫిర్యాదు చేసేవారు వాట్సప్, ట్విట్టర్, ఫేస్బుక్ తదితర సామాజిక మాధ్యమాల్ని వినియోగించుకోవచ్చు. ఉల్లంఘన జరిగిన ప్రాంతం, వాహన రిజిస్ట్రేషన్ నెంబరు, తేదీ, సమయం.. తదితర వివరాల్ని పొందుపర్చాల్సి ఉంటుంది. ఫిర్యాదుదారులు తీసే ఫొటోపై ఆ సమాచారం ఉంటే మరీ మంచిది. -
అడుగడుగునా ట్రాఫిక్ గండం!
ఆరోగ్య సమస్యలు.. ప్రమాదాలు జరిగినప్పుడు ఫోన్ చేస్తే పరుగెత్తుకొచ్చే 108 వాహనాలకు కురుస్తున్న వర్షాలకు తోడు ట్రాఫిక్ చిక్కులు తప్పడం లేదు. పురిటినొప్పులతో బాధపడుతున్న బడంగ్‌పేటకు చెందిన ఓ గర్భిణిని ప్రసవం కోసం రెండు రోజుల క్రితం 108లో ఆస్పత్రికి తరలిస్తుండగా, నల్లగొండ క్రాస్ రోడ్డు వద్ద ట్రాఫిక్ రద్దీలో ఆ వాహనం చిక్కుకుంది. గత్యంతరం లేని పరిస్థితిలో సిబ్బంది వాహనాన్ని పక్కకు నిలిపేశారు. బాధితురాలు అంబులెన్స్‌లోనే బిడ్డను ప్రసవించింది. అత్యవసర పరిస్థితుల్లో ఉన్న బాధితులను ట్రాఫిక్ రద్దీ ప్రాణాలు తీస్తోందని సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతుంది. సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ మహానగరం ఏడు జిల్లాల పరిధిలో దాదాపు 7,200 చదరపు కిలోమీటర్ల మేర విస్తరించి ఉంది. ఔటర్ రింగ్ రోడ్డుతో పాటు రాష్ట్ర, జాతీయ రహదారులు వీటికి ఆనుకొని ఉన్నాయి. ఈ పరిధిలో ఏటా జరుగుతున్న సుమారు రెండు వేలకుపైగా రోడ్డు ప్రమాదాల్లో 200 నుంచి 300 మంది వరకు ప్రాణాలు కోల్పోతున్నారు. వేలాది మంది క్షతగాత్రులవుతున్నారు. ప్రస్తుతం హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో 43 వరకు 108 వాహనాలు సేవలు అందిస్తున్నాయి. గ్రేటర్లో సగటున 56 ప్రమాదాలు జరుగుతుంటే.. గాయపడిన వారిని కాపాడేందుకు సకాలంలో 108 వాహనాలు ఘటనా స్థలికి చేరుకోవడం లేదు. అవి వచ్చేందుకు సగటున 30 నుంచి 45 నిమిషాల సమయం పడుతోంది. ప్రధాన నగరంలో ప్రతి ఐదు కిలోమీటర్ల పరిధిలో ఓ వాహనం ఉంది. అయితే శివార్లలో ప్రతి 25 నుంచి 30 కిలోమీటర్లకు ఒక 108 వాహనం సేవలు అందిస్తోంది. దీంతో సంఘటన జరిగిందన్న సమాచారం అందుకొన్నా స్థలానికి వెళ్లేసరికి గంటన్నరకు పైనే సమయం పడుతోంది. ఫలితంగా కొన్నిసార్లు క్షతగాత్రులను ఆస్పత్రులకు తరలించినా ప్రాణాలు పోతున్నాయి. గోల్డెన్ అవర్స్‌లో వచ్చే కేసులు తక్కువే.. సాధారణంగా రోడ్డు ప్రమాదాలు జరినప్పుడు 70 శాతం మందిలో తల, వెన్నుముకకు గాయాలవుతున్నాయి. ఈ సందర్భాల్లో తొలి గంటను ‘గోల్డెన్ అవర్’గా పిలుస్తారు. ఆ సమయంలో ఆస్పత్రికి తీసుకెళితే ప్రాణాలు నిలిచే అవకాశాలు ఎక్కువ. ఆలస్యమయ్యే కొద్దీ కోలుకోవడం కష్టం. గతంలో నిమ్స్‌లో జరిగిన సర్వేలో తొలి గంటలో 23 కేసులకు మించి రావడం లేదు. ఆరేడు గంటల తర్వాతే చాలామందిని ఆస్పత్రిలో చేరుస్తున్నారు. దీంతో తలకు, వెన్నుముకకు బలమైన గాయాలు తగిలి, రక్తస్రావం జరిగి మృత్యువాత పడుతున్నారు. ఒకవేళ బతికినా శాశ్వతంగా వికలాంగులుగా మారుతున్నారు. 108 వాహనాలు సకాలంలో చేరుకొని 2 నుంచి 3 గంటల్లో తీసుకురాగలిగితే 30 నుంచి 40 శాతం కోలుకునే అవకాశం ఉందని వైద్యులు చెబుతున్నారు. నగరంలో సంఘటన స్థలానికి వాహనం చేరి క్షతగాత్రులను సమీప ఆస్పత్రులకు తరలించే సమయానికి చాలా ఆలస్యమవుతోంది. శివార్లలో ఒకటి రెండు చోట్ల ఏరియా ప్రభుత్వ ఆసుపత్రులు లేవు. ఎక్కువ శాతం మంది ఉస్మానియా, గాంధీలపై ఆధార పడుతున్నారు. శివార్ల నుంచి ఇక్కడకు చేరే సరికి సమయం మించిపోతోంది. అలాకాకుండా నగరం చుట్టూ ప్రతి 30 కిలోమీటర్ల పరిధిలో ట్రామాకేర్‌తో కూడిన ఏరియా ఆస్పత్రుల ఏర్పాటు ఎంతో అవసరమని సూచిస్తున్నారు. ఇక్కడ ప్రాథమిక వైద్యం అందించిన తర్వాత అవసరమైతే ఇతర ఆస్పత్రులకు తరలించవచ్చునని నిపుణులు సూచిస్తున్నారు. ఇవీ ప్రధాన సమస్యలు.. నగరంలో రెండు, మూడు కిలోమీటర్ల ప్రయాణం చేయాలన్నా ట్రాఫిక్ ఇబ్బందులతో వాహనం ముందుకు కదలడం లేదు. కొన్ని చోట్ల సుదూరంగా ముందుకు వెళ్లి యూటర్న్ తీసుకోవాల్సి వస్తోంది. ఇంతలో ట్రాఫిక్ రద్దీ తప్పడం లేదు. చిన్న వర్షానికే నగరంలో అనేక ప్రాంతాల్లోని రోడ్లు నీట మునుగుతున్నాయి. ఆ సమయంలో ఏదైనా ప్రమాదం జరిగితే 108 వాహనం చేరుకోవడానికి 2 నుంచి 3 గంటల సమయం పడుతోంది. ప్రస్తుతం హైదరాబాద్, రంగారెడ్డి పరిధిలో ఉన్న వాహనాల్లో 2 అధికారిక పర్యటనలకు వచ్చే వీవీఐపీలకు కేటాయిస్తున్నారు. మిగతా వాహనాలు మాత్రమే అత్యవసర సేవలు అందిస్తున్నాయి. హైదరాబాద్, మేడ్చల్, మెదక్, రంగారెడ్డి పరిధిలో సేవలు అందించేందుకు మరో 70 నుంచి 80 వాహనాలు అవసరముంది. ఇందుకు 2016లో కుటుంబ సంక్షేమ, వైద్య ఆరోగ్యశాఖకు ప్రతిపాదనలు పంపారు. ఇంతవరకు కార్యాచరణ చేపట్టలేదు. శివార్లలో ఉండే ప్రాంతీయ ఆస్పత్రుల నుంచి తరచూ రిఫరల్ కేసులను ఉస్మానియా, గాంధీలకు తరలించడానికే ఎక్కువ 108 వాహనాలు వినియోగిస్తున్నారు. దీంతో సైకిల్ టైం భారీగా పెరుగుతోంది. 108 వాహనాలకే కాకుండా మరో 30 వరకు బైక్ అంబులెన్సులు అందుబాటులో ఉన్నాయి. వాహనాలు చేరేలోపు ఈ బైక్ అంబులెన్సుల సేవలను సమర్థంగా వినియోగించుకునేలా అధికారులు ప్రణాళికలు రూపొందించడం వల్ల చాలా వరకు క్షతగాత్రులకు భరోసా అందించవచ్చు. అయితే, అనుకున్నంత సమర్థంగా ఈ సేవలు వినియోగించుకోవడం లేదు. -
రోడ్డు భద్రత, ట్రాఫిక్ మెరుగుదలపై సమీక్ష
సాక్షి, హైదరాబాద్: ఖైరతాబాద్‌లోని ‘ది ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ భవన్’లో సోమవారం రోడ్డు భద్రత, ట్రాఫిక్ మెరుగుదలపై ఒక రోజు సమీక్ష జరిగింది. ఈ సమావేశంలో ‘రోడ్ సేఫ్టీ ఆడిట్ ఫర్ ఇంప్రూవ్ మెంట్ ఆఫ్ ట్రాఫిక్ సేఫ్టీ’ అనే అంశంపై సమావేశం నిర్వహించారు. ప్రస్తుతం నగరం ఎదుర్కొంటున్న అతి పెద్ద సమస్యల్లో ట్రాఫిక్ ఒకటి. రోజురోజుకు పెరిగిపోతున్న వాహనాలకు తగ్గట్లు రహదారులు పెరగకపోవడం, చాలాచోట్ల రోడ్లపై అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగడంతో నగరవాసులకు రద్దీ ప్రాంతాల్లో ప్రయాణం నరకప్రాయంగా మారింది. దీంతో ట్రాఫిక్ కట్టడితో పాటు ప్రమాదాలకు చెక్ పెట్టడానికి అధికారులు సమావేశమయ్యారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రోడ్లు రవాణా భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి హాజరయ్యారు. అంతేకాక విద్యాశాఖ కార్యదర్శి జనార్దన్ రెడ్డి, ఆర్అండ్బీ ఇంజనీర్ ఇన్ చీఫ్ గణపతి రెడ్డి, రోడ్ సేఫ్టీ అథారిటీ చైర్మన్, డీజీపీ కృష్ణ ప్రసాద్, పలువురు ఉన్నతాధికారులు సమావేశంలో పాల్గొన్నారు. -
ప్రమాదం.. ఆగ్రహం
సాక్షి, చేగుంట(తూప్రాన్): గుర్తుతెలియని వాహనం ఢీకొని వ్యక్తి మృతి చెందిన సంఘటన చేగుంట శివారులోని రెడ్డిపల్లి బైపాస్ చౌరస్తా వద్ద ఆదివారం చోటు చేసుకుంది. స్థానికులు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రెడ్డిపల్లి గ్రామానికి చెందిన కర్రెపల్లి లాలం (60) (లాలయ్య) రెడ్డిపల్లి నుంచి సైకిల్‌పై వస్తున్నాడు. రెడ్డిపల్లి రోడ్డు నుంచి జాతీయ రహదారిపైకి వచ్చిన లాలయ్యను వెనుక నుంచి వేగంగా వస్తున్న వాహనం ఢీకొనడంతో ఎగిరిపడి అక్కడికక్కడే మృతి చెందాడు. దీంతో ప్రమాద విషయం తెలుసుకున్న లాలం కుటుంబ సభ్యులు, గ్రామస్తులు సంఘటనా స్థలానికి చేరుకుని ఆందోళన చేశారు. గ్రామస్తులు పలువురు ఇదే తరహాలో మృతి చెందుతున్నారని ఆగ్రహించి రోడ్డుపైనే బైఠాయించారు. బైపాస్ చౌరస్తా వద్ద ప్రమాదాల నివారణకు బ్రిడ్జి ఏర్పాటు చేయాలని కోరినా అధికారులు పట్టించుకోకపోవడంతో ప్రమాదాలు జరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ట్రాఫిక్‌లో ఎమ్మెల్యే బాజిరెడ్డి.. గ్రామస్తులు ఆందోళన చేస్తుండటంతో పోలీసులు వారిని సముదాయించారు. అయినా వినకుండా ప్రమాదాలు జరగకుండా బ్రిడ్జి ఎందుకు నిర్మించలేదో అధికారులు తెలిపే వరకు రాస్తారోకో విరమించేది లేదని పట్టుబట్టి కూర్చున్నారు. ఒంటి గంట నుంచి దాదాపు 3 గంటల వరకు రాస్తారోకో నిర్వహించడంతో ఎక్కడి వాహనాలు అక్కడే ఆగిపోయాయి. బస్సుల్లో ఇతర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ట్రాఫిక్ ఇబ్బందులు కలిగించకూడదని పోలీసులు సముదాయించినా గ్రామస్తులు వినలేదు. టీఆర్ఎస్ మండల శాఖ అధ్యక్షుడు వెంగళ్‌రావుతో పాటు పలువురు గ్రామ నాయకులు ఎమ్మెల్యే రామలింగారెడ్డి, ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డితో ఫోన్లో మాట్లాడించారు. బ్రిడ్జి నిర్మాణం కోసం చర్యలు తీసుకోవడంతో పాటు బాధిత కుటుంబాన్ని ప్రభుత్వం తరపున ఆదుకునేలా చర్యలు తీసుకుంటామని ఎంపీ, ఎమ్మెల్యే హామీ ఇవ్వడంతో గ్రామస్తులు శాంతించారు. నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్దన్ సైతం ట్రాఫిక్‌లో చిక్కుకోగా రాస్తారోకో విరమించిన అనంతరం వెళ్లిపోయారు. ఈ మేరకు కేసు నమోదుచేసి శవాన్ని పోస్టుమార్టం నిమిత్తం మెదక్ ఏరియా ఆస్పత్రికి తరలించినట్లు ఎస్ఐ సత్యనారాయణ తెలిపారు. లాలయ్యను ఢీకొట్టిన వాహనం కోసం విచారణ జరుపుతున్నామని ఎస్ఐ పేర్కొన్నారు. -
ట్రాఫిక్ చిక్కులు.. తీర్చే దిక్కులు!
సాక్షి, హైదరాబాద్: కోటి జనాభా దాటిన మహా నగరంలో ‘ట్రాఫిక్’తీర్చలేని ప్రధాన సమస్య. 10 కిలోమీటర్ల ప్రయాణానికి 30 నుంచి 45 నిమిషాలు సమయం వెచ్చించాల్సిందే. రద్దీ సమయాల్లో గంట కంటే ఎక్కువే పడుతుంది. దీన్ని తగ్గించడం కోసం హైదరాబాద్ మహానగరాభి వృద్ధి సంస్థ (హెచ్ఎండీఏ) పలు కార్యక్రమాలు చేపడు తూనే ఉంది. ఇందులో భాగంగా వచ్చిన ఆలో చనే.. వస్తు నిల్వ కేంద్రాలు (లాజిస్టిక్ హబ్స్). నగరంలోకి భారీ వాహనాలు రాకుండా శివారు ప్రాంతాల్లోని హబ్స్‌లోనే ఆపేసి, వస్తువులను అక్కడే నిల్వ చేస్తారు. చిన్న వాహనాల్లో నగరంలోకి తీసుకొస్తారు. ఇలా మహా నగరం నలువైపులా నయా హబ్స్ రానున్నాయి. మంగల్‌పల్లి, బాటసిం గారం ప్రాంతాల్లో లాజిస్టిక్ హబ్స్ పనుల్లో వేగిరం పెరగగా... పటాన్చెరులో భూమిని చదును చేసి పనులు చేస్తున్నారు. అలాగే మహాత్మాగాంధీ బస్ స్టేషన్‌పై పడుతున్న ఒత్తిడిని తగ్గించేందుకు మియాపూర్‌లో ఇంటర్సిటీ బస్‌టెర్మినల్ (ఐసీబీటీ) పనులపై కూడా హెచ్ఎండీఏ దృష్టి సారించింది. ఈ నాలుగు అందుబాటులోకొస్తే నగ రంపై పడే సగం ట్రాఫిక్ తగ్గడంతో పాటు రోడ్డు ప్రమాదాలు తగ్గే అవకాశముందని హెచ్ఎండీఏ అధికారులు చెబుతున్నారు. ఇవేకాక పెద్దఅం బర్‌పేటలో ఐసీబీటీ, శంషాబాద్‌లో మల్టీ మోడల్ ట్రాన్స్‌పోర్టు సాధ్యాసాధ్యాలపైనా దృష్టిసారిం చారు. శంషాబాద్, మనోహరాబాద్, పటాన్చెరు, శామీర్‌పేటలోనూ లాజిస్టిక్ హబ్‌లపై అధ్యయనం చేసి అందుకయ్యే వ్యయాన్ని అంచనా వేసే పనిలో హెచ్ఎండీఏ అధికారులు నిమగ్నమయ్యారు. ప్రభుత్వ ప్రైవేట్భాగస్వామ్యంతో చేపడితే 200 కోట్ల వరకు వ్యయమవుతుందని అంచనా. ప్రయోజనాలు ఇవి.... బాటసింగారం, మంగల్పల్లిల్లోని లాజిస్టిక్ హబ్‌ల్లో అన్ని రకాల వస్తువులను నిల్వ చేయొచ్చు. పెద్దెత్తున సరుకులు తీసుకొచ్చిన భారీ వాహనాలు ఇక్కడే ఆగిపోతాయి. అక్కడి నుంచి నగర వ్యాపారులకు కావల్సినప్పుడు చిన్న వాహనాల్లో తీసుకెళ్లవచ్చు. తద్వారా కొంత వరకు రవాణా చార్జీలు తగ్గి సరుకుల ధరలూ తగ్గుతాయి. మినీ ట్రక్కులు, ఆటోలు, చిన్న వాహనాలకు గిరాకీ పెరుగుతుంది. భారీ వాహనాలు రాక ఆగడంతో ట్రాఫిక్ ఇబ్బందులు, ప్రమాదాలు తప్పుతాయి. ఐసీబీటీ ప్రత్యేకతలు ఇవి... - మంగల్‌పల్లి, బాటసింగారంలో ఒకేసారి 500 ట్రక్కులు పార్క్ చేయవచ్చు. - 2 లక్షల చ.అ. గోదాములు, 10 వేల టన్నుల సామర్థ్యంతో కోల్డ్ స్టోరేజ్. - ఆటోమొబైల్ సర్వీస్కేంద్రం, పరికరాల నిల్వకు 10 వేల టన్నుల సామర్థ్యంతో గోదాములు. - 100 మంది ఉండటానికి వీలుగా డార్మిటరీ, 5 వేల చ.అ. విస్తీర్ణంలో రెస్టారెంట్, 2,500 చ.అ.ల్లో పరిపాలన కార్యాలయం. 2011లోనే ఆలోచన... ఇతర రాష్ట్రాలు, జిల్లాల నుంచి నగరానికి వస్తున్న వందలాది ఆర్టీసీ, ప్రైవేట్ బస్సులతో ఎంజీ బీ ఎస్పై రద్దీ పెరిగింది. దీన్ని నియంత్రిం చేందుకు మియాపూర్‌లో భారీ బస్టాండ్‌ను నిర్మిం చాలని 2011లో అప్పటి ప్రభుత్వం ఆలోచించిం ది. రాష్ట్రాలు, జిల్లాల నుంచి ఐసీబీటీకి వచ్చివెళ్లే ప్రజలు నగరంలోకి వెళ్లేందుకు, తిరిగి వచ్చేందుకు మెట్రో సర్వీసులు కూడా ఉండేలా చూసుకున్నారు. మంగల్‌పల్లి(లాజిస్టిక్ హబ్) ప్రాంతం: నాగార్జునసాగర్ హైవేపై ఓఆర్ఆర్ బొంగళూరు జంక్షన్ నుంచి 500 మీటర్ల దూరంలోని రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలంలోని మంగల్‌పల్లి. విధానం: పబ్లిక్ ప్రేవేట్ భాగస్వామ్యం, విస్తీర్ణం: 22 ఎకరాలు, వ్యయం: రూ.20 కోట్లు, ప్రారంభం: 2017, ప్రస్తుత స్థితి: 40 శాతం పూర్తి మరో మూడు నెలలు పట్టే అవకాశం బాటసింగారం(లాజిస్టిక్ హబ్) ప్రాంతం: విజయవాడ హైవేపై ఓఆర్ఆర్కి 7కి.మీ. దూరంలోని హయత్‌నగర్ మండలం బాటసింగారం. విధానం: పబ్లిక్ ప్రేవేట్ భాగస్వామ్యం విస్తీర్ణం:40 ఎకరాలు వ్యయం:రూ.35 కోట్లు ప్రారంభం:2017 ప్రస్తుత స్థితి:70 శాతం పూర్తి కమర్షియల్ ఆపరేషన్‌కు గ్రీన్‌సిగ్నల్ పటాన్చెరు(లాజిస్టిక్ హబ్) విధానం: పబ్లిక్ ప్రేవేట్ భాగస్వామ్యం, విస్తీర్ణం: 17 ఎకరాలు ప్రస్తుత స్థితి: 5 ఎకరాల్లో పార్కింగ్ పనులు పూర్తి, చేసిన ఖర్చు: రూ.5 కోట్లు -
ఐటీ కారిడార్‌లో ట్రాఫిక్ సమస్యపై సమన్వయ సమావేశం
-
తాగి నడిపితే ఇక అంతే..
సాక్షి, సిటీబ్యూరో: ఔటర్ రింగ్ రోడ్డు (ఓఆర్ఆర్)లో వాహన చోదకుల సురక్షిత ప్రయాణమే లక్ష్యంగా సైబరాబాద్, రాచకొండ ట్రాఫిక్ పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు. గత మూడు నెలల గణాంకాలు తీసుకుంటే దాదాపు 700 వరకు డ్రంకన్ డ్రైవ్ కేసులు నమోదు చేశారు. ఒకవైపు ఎన్నికల బందోబస్తు చేస్తూనే మరోవైపు వీలుచిక్కినప్పుడల్లా ట్రాఫిక్ పోలీసులు ప్రత్యేక డ్రైవ్‌లు చేపట్టి మందుబాబుల ఆట కట్టించారు. అయితే ఓఆర్ఆర్లో నెలకు ఐదు నుంచి పదిసార్లు సమయంతో నిమిత్తం లేకుండా డ్రంకన్ డ్రైవ్ నిర్వహించి ప్రమాదరహిత రహదారిగా మార్చాలని ఇరు కమిషనరేట్ల అధికారులు నిర్ణయించారు. మద్యం తాగి ఓఆర్ఆర్పై వాహనంతో నడిపితే తప్పనిసరిగా దొరికిపోయేలా పక్కా వ్యూహన్ని అమలుచేయనున్నారు. ప్రస్తుతం రెండు కమిషనరేట్ల పరిధిలో నేరాలను నియంత్రించడంలో భాగంగా అనుమానిత ప్రాంతాల్లో కార్టన్‌సెర్చ్ నిర్వహిస్తూ నేరగాళ్ల గుండెల్లో వణుకు పుట్టిస్తూ నేర నియంత్రణ చేస్తున్న పోలీసులు అదే వ్యూహంతో ఓఆర్ఆర్పై డ్రంకన్ డ్రై వ్ తనిఖీలతో రోడ్డు ప్రమాదాలకు చెక్ పెట్టాలని యోచిస్తున్నారు. రెండు కమిషనరేట్ల పరిధిలోని 158 కిలోమీటర్ల పరధిలో ని ఓఆర్‌ఆర్‌పైనా గత మూడేళ్లలో 358 రోడ్డు ప్రమాదాలు జరిగి 110మంది మృతిచెందారు. వందలమంది క్షతగాత్రులయ్యారు. వేగం తగ్గించినా మారని తీరు గంటకు 120 కిలోమీటర్ల వేగపరిమితి ప్రమాణాలతో నిర్మించిన ఓఆర్ఆర్లో చాలా రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నట్టుగా గుర్తించిన పోలీసులు ఆ వేగాన్ని 100 కిలోమీటర్లకు తగ్గిస్తూ రెండేళ్ల క్రితం నోటిఫికేషన్ జారీచేశారు. అయినా వాహనదారుల్లో ఏమాత్రం స్పీడ్ జోష్ తగ్గలేదు. అతివేగం, నిర్లక్ష్యపు డ్రైవింగ్ వల్లే ఎక్కువ రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని ఢిల్లీకి చెందిన సెంట్రల్ రోడ్డు రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అధ్యయనంలో తేలినా వాహనదారులు గమ్యానికి చేరుకునే క్రమంలో తమ ప్రాణాల కంటే వేగానికే ఎక్కువ ప్రాధాన్యతనిస్తున్నారు. ఈ క్రమంలోనే రోడ్డు ప్రమాదాల బారిన పడి అసువులు బాస్తున్నారు. ఈ అతి వేగం ఉన్న సమయంలో సేఫ్టీ మేజర్స్ కూడా పనిచేయడం లేదు. ఓఆర్ఆర్ నిర్వహణను చూస్తున్న హెచ్ఎండీఏ అధికారులు కూడా కొన్ని ప్రాంతాల్లో సరైన భద్రతా చర్యలు తీసుకోకపోవడం కూడా వాహనచోదకులు అక్కడికక్కడే దుర్మరణం చెందడానికి కారణమవుతోంది. అతివేగం వల్ల జరుగుతున్న ఈ రోడ్డు ప్రమాదాల్లో మృతుల శరీరభాగాల చెల్లాచెదరుగా పడి ఉండటంతో గుర్తు పట్టడం కూడా ఒకానొక సమయంలో పోలీసులకు కష్టమవుతోంది. ఈ అతివేగానికి చెక్ పెట్టడానికి స్లో స్పీడ్ లేజర్ గన్ కెమెరాలను అందుబాటులోకి తీసుకొచ్చినా వాహనదారులు మాత్రం చలాన్లు కడుతున్నారు గానీ వేగాన్ని మాత్రం తగ్గించుకోవడం లేదు. ఈ అతివేగానికి కారణం కొన్ని సందర్భాల్లో మద్యం సేవించి వాహనం నడపడమేనని పోలీసుల విచారణలో తేలింది. దీన్ని తీవ్రంగా పరిగణించిన సైబరాబాద్, రాచకొండ ట్రాఫిక్ పోలీసులు గత మూడునెలల్లో 700 డ్రంకన్ డ్రైవ్ కేసులు నమోదుచేశారు. సైబరాబాద్‌లో 642 డ్రంకన్ డ్రైవ్ కేసులు, రాచకొండలో 58 కేసుల వరకు నమోదుచేశారు. అయితే రాచకొండ ట్రాఫిక్ పోలీసులు ఎక్కువగా ఎన్నికల బందోబస్తు, ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్‌ల బందోబస్తుతో అనుకున్న స్థాయిలో ఓఆర్ఆర్లో డ్రంకన్ డ్రైవ్ తనిఖీలు చేపట్టలేదని చెబుతున్నారు. అదే సమయంలో మద్యం తాగి వాహనాలు నడిపే వారి సంఖ్య తగ్గిందని అంటున్నారు -
ట్రాఫిక్ చక్రబంధం
ఒంగోలు నగరం రోజురోజుకూ ట్రాఫిక్ చక్రబంధంలో చిక్కుకుపోతోంది. గ్రామ పంచాయతీ నుంచి నగర పంచాయతీగా.. నగర పంచాయతీ నుంచి మున్సిపాలిటీగా.. మున్సిపాలిటీ నుంచి కార్పొరేషన్‌గా.. ఇలా ఒంగోలు నగరం విస్తరిస్తూ పోతోంది. కానీ ఇప్పటికీ అవే రోడ్లు... అదే ఇరుకు సందులు... సాంకేతిక పరిజ్ఞానంతోపాటే అంతేవేగంగా మోటారు వాహనాల సంఖ్య కూడా పెరిగిపోతోంది. కానీ, దీనికి తగ్గట్టు నగరంలో ప్రధాన రహదారుల విస్తరణ మాత్రం జరగటం లేదు. రోడ్లు విస్తరణ చేస్తామంటూ రాజకీయ నాయకులు, అధికారులు చేసిన ప్రకటనలు నీటిమీద రాతలుగానే మిగిలి పోయాయి. దీంతో నగరంలో ట్రాఫిక్ సమస్య జటిలమవుతోంది. అటు పాదచారులు, ఇటు వాహనదారులు సతమతమవుతున్నారు. ప్రజలు రోడ్లపైకి రావటానికి జంకుతున్నారు. రోడ్డు దాటాలంటే పెద్ద సాహసమే అవుతోంది. ఒంగోలు వన్‌టౌన్: ఒంగోలు నగరం రోజురోజుకు విస్తరిస్తోంది. గ్రామల్లో నివశించే ప్రజల్లో అనేక అవాసరాల రీత్యా నగరంలోకి వలసలు వచ్చి ఆవాసాలు ఏర్పాటు చేసుకొని స్థిరపడిపోతున్నారు. ఇప్పటికే నగర శివారు ప్రాంతాలు విస్తరిస్తున్నాయి. మరోపక్క కార్పొరేట్ సంస్థలు ఒంగోలు నగరంలో తమ కార్యకలాపాలను విస్తరించుకుంటూ ఇప్పటికే అనేక సంస్థలు వెలిశాయి. ఒంగోలు నగర జనాభా మాత్రం 2011 జానాభా లెక్కల ప్రకారం 2.53 లక్షలు. ప్రస్తుతం ఆ సంఖ్య 3 లక్షల వరకూ ఉంటుందని అంచనా. ఇప్పటికి నగరంలో సుమారు 60 వేలకు పైగా గృహాలు 400 వరకు అపార్టుమెంట్లు వెలిశాయి. నిత్యం నగరంలో లక్షకు పైగా వాహనాలు çరోడ్ల మీద పరుగులు తీస్తున్నాయి. 8 వేలకు పైగా ఆటోలు, 200కు పైగా స్కూల్ బస్సులు 50 వేలకు పైగా ద్విచక్ర వాహనాలు, వేల సంఖ్యల్లో అనేక ట్రాన్స్‌పోర్టు వాహనాలు నగరంలో నిత్యం తిరుగుతున్నాయి. నగరం ఎటు చూసినా 3 లేక 4 కిలో మీటర్లు పెరిగిపోయింది. గమ్య స్థానానికి చేరాలంటే గంటల వ్యవధి పడుతోంది. కార్ల జోరు.. నగరవాసులు సైకిల్ నుంచి మోటారు సైకిల్, మోటారు సైకిల్ నుంచి కారు... ఇలా ప్రతి మనిషి వేగాన్ని పెంచుకొని అభివృద్ధి వైపు దూసుకుపోతున్నాడు. నేడు ద్విచక్రవాహనం లేని ఇల్లు లేదంటే అతి శయోక్తి కాదు. ఒక్కో ఇంట్లో రెండు, మూడు ద్విచక్ర వాహనాలు కూడా ఉన్నాయి. ఇక కార్ల సంఖ్యా తక్కువేమీ కాదు. వీటికి తోడుగా ఆటోల జోరు అంతా ఇంతా కాదు. నగరవాసులతోపాటు, ఇక జిల్లా నలుమూలల నుంచి ఒంగోలు నగరానికి వచ్చే వారి సంఖ్య తక్కువేమీ కాదు. ప్రతి రోజూ వేల సంఖ్యలో నగరానికి వస్తుంటారు. ప్రభుత్వ కార్యాలయాలకు పనుల నిమిత్తం వచ్చేవారు.. ఒంగోలులోని కాలేజీల్లో చదువుకునే వారి కోసం వచ్చే తల్లిదండ్రులు ఇలా ఎందరో..! ఇరుకు రోడ్లు.... జిల్లా కేంద్రం ఒంగోలు నగరంలోని ప్రధాన వ్యాపార కూడలి ట్రంకు రోడ్డు, గాంధీ రోడ్డు. ఈ రెండు రోడ్లలో మనుషులు నడవటానికే ఖాళీ ఉండదు. ఇక వాహనాలు వేసుకొని వస్తే షాపింగ్ చేసుకొని తిరిగి ఇంటికి వెళ్ళాలంటే గంటల కొద్దీ సమయం పడుతుందని ప్రజలు వాపోతున్నారు. గాంధీ రోడ్డు, పత్తి వారి వీధి, పప్పు బజారు, తూర్పు బజారు, పశ్చిమ బజారు, బండ్లమిట్ట, మిరియాలపాలెం సెంటర్, కోర్టు సెంటర్, లాయర్‌పేట సాయిబాబా గుడి, అంజయ్య రోడ్డు, మంగుమూరు రోడ్డు, కర్నూలు రోడ్డు నెల్లూరు బస్టాండ్ సెంటర్లు నిత్యం రద్దీగా ఉంటాయి. ఇదిలా ఉంటే పాత మార్కెట్ సెంటర్ నుంచి దర్గా సెంటర్ మొదలుకొని కొత్తపట్నం బస్టాండ్ సెంటర్ వరకు రోడ్దు వన్‌వే అయినా పెద్ద వాహనాలు ముందు పోతుంటే కనీసం ద్విచక్ర వాహనం కూడా దానిని దాటుకొని పోవాలంటే సాధ్యం అయ్యే పరిస్థితి లేదు. పార్కింగ్ సమస్య... పెరుగుతున్న వాహనాలతో పార్కింగ్ వాహనదారులకు పెద్ద సమస్యగా మారింది. ఏది కొనుగోలు చేయాలన్నా వాహనాలను ఎక్కడ పార్కింగ్ చేయాలో అర్ధంకాక వాహనదారులు సతమతమవుతున్నారు. అధికారికంగా ఎక్కడా పార్కింగ్ ప్రదేశాలు లేవు. దీంతో వాహనదారులు నానా అవస్థలు పడుతున్నారు. దీనికి తోడు ట్రాఫిక్ పోలీసుల వేధింపులు అంతా ఇంతా కాదు. రోడ్దు మీద పార్కింగ్ చేసిన వాహనాలను ట్రాఫిక్ పోలీసులు హైడ్రాలిక్ ద్వారా లారీలో ఎక్కించుకొని తీసుకుపోతున్నారు. షాపింగ్ చేసుకొని వాహనం పెట్టిన చోటుకు వచ్చి చూస్తే అక్కడ వాహనం ఉండదు. తీరా అక్కడ షాపుల వాళ్ళను విచారిస్తే ట్రాఫిక్ పోలీసులు తీసుకుపోయారన్న సమాధానం వస్తుంది. దీంతో వెంట తీసుకొచ్చిన కుటుంబ సభ్యులను వదిలేసి ట్రాఫిక్ పోలీసుల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి. వందల మంది ప్రజలు ఇప్పటి వరకు పడిన, పడుతున్న ట్రాఫిక్ అవస్థలు ఇంతా ఇంతా కాదు. ట్రాఫిక్ పోలీసులు మాత్రం పార్కింగ్‌కు స్థలాలను చూపించకపోగా అడ్డాదిడ్డంగా చాలనాలు రాస్తూ వాహనదారులను దోచుకుంటున్నారు. వాహనదారులకు చలానాలు అదనపు భారంగా మారుతున్నాయి. -
ఓట్ల పండుగకు.. పయనం..
సాక్షి, చౌటుప్పల్ (మునుగోడు): హైదరాబాద్–విజయవాడ 65వ నంబర్ జాతీయ రహదారి బుధవారం జనజాతరను తలపించింది. ఎన్నికల్లో ఓటు హక్కును వినియోగించుకునేందుకు హైదరాబాద్‌లో స్థిరపడిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ప్రజానీకం పెద్దఎత్తున తమ స్వగ్రామాలకు తరలివెళ్తోంది. దీంతో హైవేపై వాహనాల రద్దీ ఏర్పడింది. రాత్రికి అనూహ్యంగా రెండింతలకు పెరిగింది. టోల్‌ప్లాజా నుంచి కిలోమీటరున్నర దూరంలో ఉన్న జిల్లేడుచెలుక గ్రామం వరకు వాహనాలు స్తంభించాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని రాయలసీమ మినహా.. మిగతా 9 జిల్లాల ప్రజానీకం ఈ రహదారి మీదుగానే వెళ్తుంటారు. వేలాది వాహనాలు ఒక్కసారిగా వస్తుండడంతో చౌటుప్పల్ వద్ద జాతీయ రహదారిపై విజయవాడ మార్గంలో ఎక్కడ చూసినా వాహనాలే కనిపించాయి. హైదరాబాద్–విజయవాడ జాతీయ రహదారికి అనుసం«ధానంగా నార్కట్‌పల్లి–అద్దంకి రహదారి సైతం ఉండడంతో రద్దీ భారీగా ఏర్పడింది. పంతంగి టోల్‌ప్లాజా పరిసరాలు వాహనాలతో కిక్కిరిసాయి. ఇరువైపులా 16ద్వారాలు ఉండగా విజయవాడ వైపు 11 గేట్లు తెరిచా రు. వాహనాలు ఎక్కువసేపు నిలిచి ఉండడంతో.. వాహనదారులు, టోల్ సిబ్బంది నడుమ ఘర్షణ తలెత్తింది. పోలీసులు జోక్యం చేసుకోవడంతో సద్దుమనిగింది. సంక్రాంతి పండగ సందర్భంగా ఏర్పడే రద్దీతో పోలిస్తే ప్రస్తుతం ఏర్పడిన రద్దీ ఎక్కువే అని చెప్పవచ్చు. హైవేపై వాహనాల రద్దీ కేతేపల్లి (నకిరేకల్) : తెలుగు రాష్ట్రాల్లో సార్వత్రిక ఎన్నికల్లో ఓటుహక్కు వినియోగించుకునేందుకు స్వస్థలాలకు వెళ్లవారి వాహనాలతో 65 నంబరు జాతీయ రహదారిపై బుధవారం రద్దీ కొనసాగింది. జాతీయ రహదారిపై బుధవారం సాయంత్రం ప్రారంభమైన వాహనాల రద్దీ రాత్రికి పెరిగింది. కొర్లపహాడ్ టోల్‌ప్లాజా వద్ద ఫీజు చెల్లించేందుకు వాహనాలు బారులుదీరాయి. వాహనాల రద్దీకి అనుగుణంగా టోల్‌ప్లాజా నిర్వహకులు విజయవాడ వైపు కౌంటర్లు పెంచారు. దీంతో టోల్‌ప్లాజా వద్ద ఎలాంటి ట్రాఫిక్‌జామ్‌కు ఆస్కారం లేకుండా వాహనాలు సాఫీగా వెళ్లాయి. మాడ్గులపల్లి వద్ద ట్రాఫిక్ జామ్ మాడుగులపల్లి (నల్లగొండ) : ఈనెల 11న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగే ఎన్నికలకు హైదరబాద్‌లో నివాసవుంటున్న ఆంధ్ర ప్రజలు బుధవారం సొంతూళ్లకు ప్రయాణా కావడంతో.. అద్దంకి–నార్కట్‌పల్లి రహదారిపై మాడ్గులపల్లి టోల్‌ప్లాజా వద్ద భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. సుమారు కిలో మీటరు మేర వాహనాలు నిలిచిపోయాయి. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. -
మీరిచ్చే భరోసా ఇదేనా?
సాక్షి, కైకలూరు : కిరణ్ : ఏరా.. త్రినాథ్.. జిల్లా రాజకీయాలు ఎలా ఉన్నాయిరా.. ఈ సారి ఏవరెవరి మధ్య ప్రధాన పోటీ ఉంటుందంటావు.. త్రినాథ్ : అరే మూడు పార్టీల మ«ధ్యనే కదరా.. కిరణ్ : అరే.. చదువుకున్నోళ్లుగా మనం.. కొద్దిసేపు నిజాలు మాట్లాడుకుందాం.. త్రినాథ్.. నిజం చెప్పు.. మన మచిలీపట్నం పోర్టు నిర్మాణానికి కావల్సింది 4,000 ఎకరాలు.. ప్రభుత్వం అనుబంధ పరిశ్రమల పేరుతో ఏకంగా 30,000 ఎకరాలు సేకరించింది.. పాపం 25 గ్రామాల ప్రజలు బాధపడుతున్నారా.. లేదా.. త్రినాథ్ : అరే.. మొన్నే కదరా.. పోర్టుకు శంకుస్థాపన మాపార్టీ వాళ్లు చేశారు.. టీవీ, పేపర్లో చూడలేదా? కిరణ్ : త్రినాథ్.. మరి అంత అడ్డగోలుగా.. మాట్లాడకురా.. నాలుగున్నరేళ్లు తర్వాత ఎన్నికలు కొన్ని నెలల్లో ఉండగా శంకుస్థాపన చేస్తారా.. ఏమిటీ రాజకీయం.. రాజేష్ : (కూర్చున్న పిట్ట గోడ నుంచి దిగుతూ) అరే.. కిరణ్.. నేను కూడా ఓ ప్రశ్న వేస్తానురా.. అదేంటంటే... మన విజయవాడలో దుర్గగుడి ఫ్లైఓవర్ నిర్మాణాన్ని పూర్తి చేస్తామన్నారు.. పనులతీరుపై పలువురు ఆందోళన చేశారు. మనకేమో ట్రాఫిక్ సమస్యలు తప్పడం లేదు.. వినోద్ : ఈ ప్రశ్నకు నేను సమాధానం చెబు తా నురా.. అరే విజయవాడ తాత్కాలిక రాజధాని అయిన తర్వాత ఈ ప్రభుత్వం ప్రథమ ప్రాధాన్యత ఈ ప్రాంతానికే ఇస్తున్నార్రా.. పనులు కాస్త ఆలస్యం అవుతున్నాయంతే.. రాజేష్ : ఏరా.. నువ్వే చెబుతున్నావుగా.. తాత్కాలిక రాజధాని అని, రోజురోజుకూ ట్రాఫిక్ పెరిగిపోతుంటే ఇంకెçప్పుడురా ఫ్లైఓవర్ కట్టేది.. త్రినాథ్ : ఏంట్రా.. మరీ అలా మాట్లాడుతారు.. టీడీపీ రైతులకు ఎంతో సాయం చేసింది తెలుసా.. మీరు లోపాలనే ఎత్తి చూపుతున్నారేంట్రా... కిరణ్: ఓరే.. త్రినాథ్.. ఏంట్రా రైతులకు ఒరి గింది.. కొద్దిసేపు వరి పక్కన పెడదాం.. 2015లో సుబాబుల్‌కు రూ.4,200, జామాయిల్‌కు రూ.4,500 గిట్టుబాట ధరగా అందిస్తామని మీ ప్రభుత్వం చెప్పింది. ఇప్పుడెమో.. సుబాబుల్‌కు రూ.2,200, జామాయిల్‌కు రూ.2,600 అందిస్తున్నారు. రైతు టన్నుకు రూ.15,00 నష్టపోతున్నాడు.. ఇదేనా రైతులకు మీరేచ్చే భరోసా.. నువ్వే ఆలోచించు.. మహేష్: (కూర్చున్న వాడు ఆవేశంతో పైకి లేస్తూ) ఆరే ఏంట్రా.. మా పార్టీని అందరూ ఆడిపోసుకుంటారు.. ఏ రాష్ట్రంలోనైనా ఉచిత ఇసుక ఎక్కడైనా ఇచ్చారా.. దీనికి సమాధానం చెప్పండి.. కైలాష్ : అరే.. నీ ప్రశ్నకు మా వాళ్ల తరుపున నేను సమాధానం చెబుతాను.. విను.. ఏరా మన జిల్లాలో గన్నవరం వద్ద బ్రహ్మలింగయ్య చెరువు ఎలా ఉండేది.. అక్కడ కూడా ఇసుకను కొల్లగొట్టారు.. ఇక జగ్గయ్యపేట, మైలవరం, నూజివీడు, కైకలూరులలో అక్రమ ఇసుక దందాలకు అదుపే లేదు.. ఇదేనా మీ ఉచిత ఇసుక పథకం.. వినోద్ : ఒరే.. రాష్ట్రంలో మా ప్రభుత్వం నాలుగున్నరేళ్లలో ఏకంగా 18,500 టెంపరరీ ఉద్యోగాలు అందించింది.. ఇంతకన్నా ఏం కావాలి.. రాజేష్: ఉద్యోగాలు ఇచ్చింది.. ఇచ్చిందే కాకుండా.. తీసేసినవి కూడా చూడు.. మరి.. మొత్తం మీద ఏమైనా 23,500 ఉద్యోగాలు తీసేశారు.. నోటిఫికేషన్ విషయం తీసుకుంటే.. ఒకరు నోటిపికేషన్ ఇస్తారు.. మరొకరు తీసేస్తా్తరు.. ఏంటిరా.. ఈ పద్ధతి.. త్రినాథ్ : అరే ఇవన్నీ పక్కన పెట్టండిరా.. మా పాలనలో మహిళా సాధికారత సాధిస్తున్నాం.. కిరణ్ : అబ్బో.. బాగా చెప్పావురా.. మహిళలకు గౌరవమంటే.. తహసీల్దారుని జుట్టు పట్టుకు లాగడమా.. అంతెందుకురా.. కాల్‌మనీ కేసులో ఇక్కడ మహిళలకు ఏం న్యాయం జరిగిందో.. అందరికీ తెలుసురా.. మహేష్: అరే .. ఇది మాత్రం మా పార్టీకి అనుకూలంగా ఉంటుందిరా.. ఆస్పత్రులలో పేదలకు అనేక సేవలు అందిస్తున్నాం.. దీనిని ఎవరూ కాదనలేరు.. కైలాష్ : ఏంట్రా ఆస్పత్రుల్లో అభివృద్ధి.. మన విజయవాడ పాత ఆస్పత్రిని సూపర్ స్పెషాలిటి ఆస్పత్రిగా 1000 పడకలు అన్ని చెప్పారు. అక్కడ వైద్య సేవలు ఎలా ఉన్నాయో సామాన్య ప్రజలను అడగండి చెబుతారు.. అయినా మీ పాలనలో ఆస్పత్రిలో శిశువులను ఎలకలు కొరికిన సంఘటనలను.. జనాలు మర్చిపోయారనుకుంటున్నారా.. వినోద్ : అరే.. ఊరుకోండిరా.. ఎండ ఎక్కువ అవుతోంది.. పోదాం పదండి ఇళ్లకు.. -
ఎవరొచ్చినా ‘స్టాండ్’ అయ్యేనా?
ఖమ్మంమామిళ్లగూడెం: ఎన్నికలు పూర్తయ్యాయి. ఈవీఎంలలో అభ్యర్థుల భవితవ్యం నిక్షిప్తమై ఉంది. రెండు రోజుల్లో ఫలితాలు కూడా రానున్నా యి. అయితే, ఎవరొచ్చినా, ఏ అభ్యర్థి గెలిచినా ఖమ్మంలో ప్రధానంగా బస్టాండ్‌ను పూర్తి చేస్తారా? అని పలువురు అంటున్నారు. పాత బస్టాండ్ సరిపోకపోవడం, కొత్త బస్టాండ్ పనులు ప్రారంభించారు కానీ, పూర్తిస్థాయిలో నిర్మించకపోవడంతో కనీసం ఎన్నికల ఫలితాల తర్వాతనైనా బస్టాండ్ నిర్మిస్తారోని ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నా రు. ఖమ్మం నగరం రోజురోజుకూ అభివృద్ధి చెం దుతుండటంతో.. నగరానికి వచ్చే ప్రజల సంఖ్య ఎక్కువ అవుతోంది. అయితే గతంలో ఎప్పుడో నిర్మించిన బస్టాండ్ ప్రస్తుతం సరిపోకపోవడంతో మరో బస్టాండ్ నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. కానీ, ఈ నిర్మాణ పనులు మాత్రం నత్తనడకన సాగుతున్నాయి. బస్టాండ్ నిర్మాణానికి శం కుస్థాపనచేసి ఏడాది దాటిపోయినా నిర్మాణ పను ల్లో పురోగతి అంతగా లేదు. ఈ బస్టాండ్ ప్రజ లకు అందుబాటులోకి రావాలంటే ఎంత కాలం పడుతుందో తెలియడం లేదు. నగరంలోని ఎన్ఎస్టీరోడ్లో నూతనంగా నిర్మిస్తున్న బస్టాండ్ పను లు 7ఎకరాల 13కుంటల స్థలంలో, రూ.25 కోట్ల తో కొనసాగుతున్నాయి. అత్యాధునిక సౌకర్యాలతో, ఆధునిక హంగులతో చేపడతామని అప్పటి సీఎం కేసీఆర్ తెలిపారు. అయితే నూతన బస్టాండ్‌కు స్థలం కేటాయించిన తర్వాత చాలా రోజులకు శంకుస్థాపన చేసి నిర్మాణ పనులు చేపట్టారు. నిర్మాణ పనులు ప్రారంభించి సంవత్సరం కాలం కావస్తున్నా ఇంకా నత్తనడకనే సాగుతున్నాయి. నిధులు విడుదల చేసినా.. ఎన్నో ఏళ్ల కిందట జిల్లా కేంద్రంలో నిర్మించిన ఖమ్మం బస్టాండ్ ప్రస్తుతం ఉన్న బస్సులకు సరిపడడం లేదనే ఉద్దేశంతో నూతన బస్టాండ్ నిర్మాణం చేసేందుకు ప్రభుత్వం ముందుకు వచ్చింది. దీంతో రెవెన్యూ అధికారులను స్థలం కేటాయించాలని ఆదేశించి, నిధులను సైతం విడుదల చేసింది. అయితే నిర్మాణ పనులు మాత్రం అడుగు వేయడానికి ఆరు మాసాలు అన్నచందంగా సాగుతున్నాయి. గత సంవత్సరం జూన్ నెలలో పనులు ప్రారంభించినా ఇప్పటి వరకు కనీసం పిల్లర్లు కూడా పైకి లేవలేదు. బస్టాండ్ నిర్మాణ పనులు చూసిన వారంతా ఇలా పనులు జరిగితే ఇంకా పది సంవత్సరాలు అయినా పూర్తికాదని చర్చించుకుంటున్నారు. పని ప్రదేశాల్లో కనీసం పనికి అవసరమైన మిషన్లు, సామగ్రి, కూలీలను ఏర్పాటు చేసుకోకపోవడం కూడా పనులు ఆలస్యంగా జరుగుతున్నాయని స్థానికులు మారోపిస్తున్నారు. బస్టాండ్ నిర్మాణ పనులు ప్రారంభమై నెలలు గడుస్తున్నా కనీసం సంబంధిత అధికారులు పనులను పరిశీలించిన దాఖలాలు కూడా లేవు. పాత బస్టాండ్‌లో ఇక్కట్లు నూతన బస్‌స్టాండ్ నిర్మాణం త్వరగా పూర్తవుతుందని భావిస్తే అదికాస్తా జాప్యం అవుతుండటంతో పాత బస్‌స్టాండ్‌కు ఇక్కట్లు తప్పడంలేదు. ప్రతిరోజు జిల్లా కేంద్రమైన ఖమ్మం బస్టాండ్‌కు దాదాపు 1,250 బస్సులు నిత్యం ఇతర జిల్లాలు, రాష్ట్రాల ద్వారా వస్తూ పోతుంటాయి. వేల మంది ప్రయాణికులు ఖమ్మం బస్టాండ్ నుంచి వారివారి గమ్య స్థానాలకు ప్రయాణిస్తుంటారు. ప్రయాణికులకు, బస్సుల సంఖ్యకు అనుగుణంగా బస్టాండ్ లేక పోవడంతో బస్సులు బస్టాండ్‌లో తిరగటానికి ఇబ్బంది కరంగా మారింది. వర్షాకాలంతో ప్రయాణికులకు అనుకూలంగా లేని బస్టాండ్‌లో ఆరుబ యట తడవక తప్పడంలేదు. బస్సు లోనికి రావాలన్నా,బయటకు వెళ్లాలన్నా నరకమే కనిపిస్తోంది. ఇక బస్టాండ్ బయట ఆటోలు, తోపుడు బండ్లతో బస్సులులోనికి రావడానికి ఎక్కువ సమయం పడుతోందని ప్రయాణికులు చెబుతున్నారు. ట్రాఫిక్‌తో సమస్య నగరంలో రోజురోజుకూ పెరుగుతున్న వాహనాలతో ట్రాఫిక్ సమస్య ఇబ్బందికరంగా ఉంది. వాహనాలకు అనుగుణంగా రోడ్ల విస్తీర్ణం లేకపోవడంతో ఇక్కట్లు తప్పడంలేదు. సమస్యలను ఎవ రూ పట్టించుకోక పోవడంతో స్థానిక ప్రజలకు ఇ బ్బందులు తప్పడంలేదు. ఈసారి ఎన్నికల్లో గెలిచే ప్రజాతినిధులు పట్టించుకొని బస్టాండ్ నిర్మాణాన్ని పూర్తి చేయాలని ప్రజలు కోరుతున్నారు. కాగా, నగరం లో ప్రయాణికులకు అనుగుణంగా మినీబస్సులు తిప్పాలని ఆర్టీసీ అధికారులు భావిస్తున్నప్పటికీ రోడ్లు అనుకూలంగా లేకపోవడంతో మినీబస్సులు జాడలేకుండా పోయాయి. -
ఒక్క రోజే 5వేల పెళ్లిళ్లు!
న్యూఢిల్లీ: మంచి ముహూర్తాలు ఉండటంతో దేశ రాజధానిలో సోమవారం ఒక్క రోజే 5వేల వరకు పెళ్లిళ్లు అయ్యాయి. అయితే, అక్కడక్కడా ట్రాఫిక్ నిలిచిపోవడంతో వాహనదారులకు ఇబ్బందులు తప్పలేదు. పెళ్లిళ్ల నేపథ్యంలోనే పోలీసు శాఖ అదనంగా వెయ్యి మందికి పైగా సిబ్బందిని విధుల్లో ఉంచింది. ట్విట్టర్ ద్వారా ఎప్పటికప్పుడు ఆయా రూట్లలో ఉన్న రద్దీని వాహనదారులకు తెలియజేస్తూ సూచనలిచ్చింది. సిబ్బంది మోటారు సైకిళ్లపై తిరుగుతూ రాకపోకలను క్రమబద్ధీకరించారు. అక్రమంగా పార్క్ చేసిన వాహనాలను తొలగించారు. కొన్ని ప్రాంతాల్లో క్రేన్లను కూడా అందుబాటులో ఉంచారు. -
బండెక్కితే బాదుడే..!
ఖమ్మంక్రైం: సిగ్నల్స్ వద్ద మార్కింగ్ లేకపోవడం.. దుకాణాల ఎదుట వాహనాలు నిలిపేందుకు స్థలం లేకపోవడం.. వాహనదారులు, ప్రయాణికులు ఎవరు ఎటు వెళ్తున్నారో తెలియని గందరగోళం. నిత్యం వేలాది వాహనాలు నగరంలోకి వచ్చిపోతుండడంతో ట్రాఫిక్ వ్యవస్థ పద్మవ్యూహాన్ని తలపిస్తోంది. ప్రధాన కూడళ్లలో మరీ దారుణంగా మారిందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. దీనికితోడు ట్రాఫిక్ పోలీసులు కొత్తగా ప్రవేశపెట్టిన ఈ–చలానా విధానంతో వాహనదారులు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. వారి తీరుతో జేబులు గుల్ల చేసుకుంటున్నారు. నగరంలో అస్తవ్యస్తంగా మారిన ట్రాఫిక్‌ను నియంత్రించేందుకు పోలీసులు ఐదు సెక్టార్లుగా విభజించారు. ఒకటో సెక్టార్ గాంధీ చౌక్ నుంచి త్రీటౌన్ ప్రాంతం, రెండో సెక్టార్ వన్‌టౌన్ పరిధిలోని స్టేషన్ రోడ్ నుంచి, మూడో సెక్టార్ వైరారోడ్ నుంచి జెడ్పీసెంటర్ వరకు, నాలుగో సెక్టార్ జెడ్పీసెంటర్ నుంచి శ్రీశ్రీ విగ్రహం వరకు, ఐదో సెక్టార్ ఎన్టీఆర్ విగ్రహం నుంచి బైపాస్ రోడ్డు వరకు విభజించారు. వీటిలో ప్రధాన కూడళ్లు అయిన గాంధీచౌక్, కాల్వొడ్డు, వైరా రోడ్, కిన్నెర పాయింట్, మయూరి సెంటర్ ప్రాంతాల్లో నిత్యం వాహనదారులు, పాదచారులు నరకం చూడాల్సిందే. ట్రాఫిక్ పోలీస్‌స్టేషన్‌కు కూతవేటు దూరంలో ఉన్న కూరగాయల మార్కెట్ వద్ద ట్రాఫిక్ సమస్య ఉన్నా పట్టించుకునేవారు కరువయ్యారు. కస్బాబజార్‌లో పలు వస్త్ర దుకాణాల వద్ద, అజీజ్ గల్లీ ప్రాంతంలో సైతం ఇదే సమస్య. ముఖ్యంగా అత్యంత రద్దీ ప్రాంతమైన కిన్నెర పాయింట్, కమల మెడికల్ ప్రాంతంలో సాయంత్రం 5 గంటల తర్వాత అక్కడి పాయింట్లో విధులు నిర్వర్తించాల్సిన కానిస్టేబుళ్లు ఉండడం లేదని, దీంతో ట్రాఫిక్ సమస్య ఆ ప్రాంతంలో మరింత తీవ్రంగా మారిందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. వాస్తవానికి పాయింట్ల వద్ద ఉదయం 8 నుంచి రాత్రి 9 గంటల వరకు సిబ్బంది విధులు నిర్వర్తించాలి. కానీ.. ప్రధాన పాయింట్ల వద్ద సిబ్బంది సరిగా విధులు నిర్వర్తించడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం 60 మంది ట్రాఫిక్ సిబ్బంది ఉండగా.. అందులో 20 మంది వరకు ఇతర విధులు నిర్వర్తిస్తున్నారు. దీనిపై ఉన్నతాధికారుల పర్యవేక్షణ సైతం కొరవడిందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. భయభ్రాంతులకు గురిచేస్తున్న సిబ్బంది ఇటీవల కాలంలో ఈ–చలానా, క్యాష్‌లెస్ లావాదేవీల పేరుతో హైదరాబాద్ స్థాయిలో ట్రాఫిక్ పోలీసులు జరిమానా విధానాన్ని ప్రవేశపెట్టారు. వారు చేపట్టిన కార్యక్రమం మంచిదే అయినప్పటికీ ఖమ్మం వంటి నగరంలో దీనిపై 90 శాతం మంది వాహనదారులకు అవగాహన లేదు. ఈ విధానాన్ని ఇక్కడ ప్రారంభించిన మొదటి రోజు పత్రికల్లో వార్తలు వచ్చాయి తప్ప దీనిపై వాహనదారులకు ట్రాఫిక్ పోలీసులు ఎటువంటి అవగాహన కల్పించిన దాఖలాలు లేవు. కొందరు సిబ్బందికి డిజిటల్ కెమెరాలు ఇచ్చి విధి నిర్వహణకు పంపిస్తుండడం.. వారు ఒక్కసారిగా రోడ్లపై వెళ్తున్న ద్విచక్ర వాహనదారుల ఫొటోలు తీయడంతో ఏమీ అర్థంకాక వాహనదారులు భయభ్రాంతులకు గురవుతున్నారు. ముఖ్యంగా అసలు ఫొటోలు తీస్తున్న సిబ్బందికి కూడా ఈ ఫొటోలు ఎందుకు తీయాలి.. ఈ–చలానా అంటే ఏమిటో కూడా సరిగా తెలియదనే విమర్శలు వినిపిస్తున్నాయి. కాగా.. ట్రాఫిక్ సిగ్నల్స్‌ను అతిక్రమించడం, హెల్మెట్ ధరించకపోవడం, సెల్‌ఫోన్ మాట్లాడుతూ వాహనం నడపడం వంటి వాటిని ట్రాఫిక్ పోలీసులు ఫొటోలు తీసి.. నేరుగా వాహనదారుడి సెల్‌కు జరిమానా ఎంత కట్టాలి అనే దానిపై మెసేజ్ పంపిస్తారు. పార్కింగ్ ఏర్పాటు గాలికి.. హైదరాబాద్ స్థాయిలో ఈ–చలానా ప్రవేశపెట్టిన పోలీసులు.. హైదరాబాద్ స్థాయిలో కాకుండా కనీసం ఖమ్మం కమిషనరేట్ స్థాయిలో వాహనాల పార్కింగ్ కోసం ఏళ్లు గడిచినా సరైన స్థలం చూపించలేదు. నిత్యం నగరానికి సుమారు 1.50 లక్షల వాహనాలు వచ్చి పోతుంటాయి. వీటిలో 20వేలకు పైగా ఆటోలు ఉండగా.. మిగతావి ఇతర వాహనాలు ఉన్నాయి. ఆటోలకు అడ్డాలు లేకపోవడంతో నిత్యం రోడ్లపైనే వాటిని నిలుపుతుండడంతో ట్రాఫిక్ సమస్య ఎదురవుతోంది. ఆస్పత్రికి.. వ్యాపార సముదాయాలకు వెళ్లాలనుకున్నా.. తమ వాహనాలను ఎక్కడ పార్కింగ్ చేయాలో తెలియక సతమతమవు తున్నారు. ఇంత జరుగుతున్నా పార్కింగ్ స్థలాల గురిం చి ట్రాఫిక్ పోలీసులు పట్టించుకోకపోవడం గమనార్హం. వాహనదారులకు వివరించాలి.. అలాగే ఈ–చలానాపై వాహనదారులకు అవగాహన కల్పించడం ఎంతోముఖ్యం. ఈ–చలానా అంటే ఏమి టి? ఎందుకు ఈ–చలానా ద్వారా జరిమానాలు విధిస్తారు? అనే దానిపై తమకు కూడా అవగాహన కల్పించాలని పలువురు వాహనదారులు కోరుతున్నారు. ఆ తర్వాతే దీనిని పూర్తిస్థాయిలో అమలుచేస్తే బాగుం టుందని వాహనదారులు, ప్రజలు చెబుతున్నారు. -
అష్ట దిగ్బంధంలో సైబరాబాద్!
సాక్షి,సిటీబ్యూరో: ఐటీ కారిడార్ వాహనదారులకు నరకం చూపిస్తోంది. ఉదయం 9 నుంచి 12 గంటల వరకు.. తిరిగి సాయంత్రం 5 నుంచి రాత్రి 9 వరకు ట్రాఫిక్‌తో సైబరాబాద్ అష్ట దిగ్బంధం (గ్రిడ్లాక్)లో చిక్కుకుంటోంది. ఐదు కిలోమీటర్ల దూరం కదలలాంటే గంటకు పైగా సమయం పడుతోంది. ఇక వీకెండ్ సాయంత్రాలు, చిరు జల్లుల కురిసిన సమయాల్లోనైతే హడలెత్తిస్తోంది. కూకట్పల్లి నుంచి సైబర్ టవర్ రోడ్, మొహిదీపట్నం నుంచి బయోడైవర్సిటీ జంక్షన్ మీదుగా మాదాపూర్ రోడ్, ఆల్విన్ కాలనీ నుంచి కొత్తగూడ, శేరిలింగంపల్లి నుంచి ట్రిపుల్ ఐటీ రోడ్లు అత్యంత రద్దీతో నిండిపోతున్నాయి. సైబరాబాద్‌లో సుమారు మూడున్నర లక్షల మంది ఐటీ ఉద్యోగులకు తోడు వ్యాపార, వాణిజ్య సంస్థల కార్యకలాపాలన్నీ రోజుకు రోజుకు పెరుగుతున్నాయి. దీంతో వాహన విస్పోటనానికి దారి తీస్తోంది. దీంతో ఐటీ కారిడార్‌లో వాహన వేగం ఘోరంగా పడిపోయి బయటకు వెళ్లాలంటనే హడలెత్తిపోయే పరిస్థితి కనిపిస్తోంది. జీహెచ్ఎంసీ ఓ ప్రైవేట్ ఎజెన్సీతో రెండేళ్ల క్రితం నిర్వహించిన సర్వేలో మైండ్ స్పేస్ జంక్షన్లో రోజుకు 1.64 లక్షల వాహనాలు, బయోడైవర్సిటీ జంక్షన్లో 1.38 లక్షల వాహనాలు, రాజీవ్ గాంధీ జంక్షన్లో 1.17 లక్షల వాహనాలు, గచ్చిబౌలి కూడలిలో 1,13,970 వాహనాలు రాకపోకలు సాగుస్తున్నాయని తేలింది. ఇటీవల చేసిన తాజా సర్వేలో వాటి సంఖ్య మరో 30 శాతానికి పెరిగినట్టు అంచనా. దీంతో పీక్ అవర్స్‌లో వాహన వేగం గంటకు 10 కిలోమీటర్లకు పడిపోయింది. మున్ముందు మరింత రద్దీ ఇప్పటికే వాహనాల ట్రాఫిక్‌తో దిగ్బంధం కావడం, ఎస్సార్డీపీ పనులు మొత్తం పూర్తి కాకపోవడంతో ఐడీ కారిడార్‌లో మున్ముందు మరింత రద్దీ పెరిగనున్నట్టు నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇప్పటికి 500 ఐటీ పరిశ్రమలకు తోడు మాల్స్, అస్పత్రులు, విద్యా సంస్థలకు తోడు కొత్తగూడ జంక్షన్లో 20 లక్షల చదరపు అడుగులకు పైగా విస్తీర్ణంలో శరత్ కాపిటల్ మాల్, నానక్‌రాంగూడ ఫైనాన్షియల్ డిస్ట్రిక్టŠట్లో అమెజాన్, అమెరికన్ కాన్సులేట్, రాయదుర్గం సర్వే నెంబర్ 83లోని నాలెడ్జి సిటీలో అరబిందో, మెట్రో, మైహోమ్, ఆర్ఎంజెడ్, ఎస్బీహెచ్, ఎల్అండ్టీ మాల్ తదితర కంపెనీలు రానున్నాయి. నగరానికి నలువైపులా అభివృద్ధి వికేంద్రీకరణ చేస్తామన్న ప్రస్తుత ప్రభుత్వ హామీకి భిన్నంగా ఐటీ కారిడార్ కిక్కిరిసి పోతోంది. వాస్తవానికి ఈస్ట్ హైదరాబాద్‌లో పోచారం, ఆదిభట్ల ప్రాంతాల్లో ఐటీ ఆశించిన స్థాయిలో విస్తరించకపోవడం వల్ల సైబరాబాద్‌కు ఇబ్బందులు తెస్తోందన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఆకాశ వంతెనలతో ఉపశమనం సైబరాబాద్.. డెవలప్మెంట్ అథారిటీ డిజైన్ చేసిందాని కంటే అధికంగా వాహనాలు, జనాలతో కిక్కిరిసి పోతుండడంతో ట్రాఫిక్‌తో పాటు ఇతర మౌలిక సదుపాయాలకు ఇబ్బందులు తప్పేలాలేవు. ట్రాఫిక్‌కు సంబంధించి రద్దీ (ప్యాసింజర్ ఫర్ యూనిట్–పీసీయూ)ఇలా ఉంది. అయ్యప్పసొసైటీ అండర్ పాస్ పీసీయూ 8656గా ఉండగా రోజుకు 1,01,245 గా ఉంది. మైండ్‌స్పేస్ జంక్షన్లో గంటకు 14,393, రోజుకు 1,64,084 బయోడైవర్సిటీ జంక్షన్లో 14,001 ఉండగా, రోజుకు 1,38,069 రాజీవ్ గాంధీ జంక్షన్లో 14,073 ఉండగా, రోజుకు 1,17,891 బొటానికల్ గార్డెన్ 6,617 ఉండగా, రోజుకు 74,133 గా ఉంది. కొత్తగూడ జంక్షన్లో 8,540, రోజుకు 1,13,970 కొండాపూర్ జంక్షన్లో 5,017 ఉండగా, రోజుకు 53,655 గచ్చిబౌలి జంక్షన్లో గంటకు 9,806 ఉండగా, రోజుకు 1,16,560 ఉన్నట్టు గుర్తించారు. బొటానికల్ గార్డెన్ జంక్షన్ దాటాలంటే 107 నుంచి 131 సెకన్లు, కొత్తగూడ జంక్షన్లో 140 నుంచి 250 సెకన్లు పడుతుంది. కొండాపూర్ జంక్షన్లో 110 సెకన్ల నుంచి 138 సెకన్ల సమయం పడుతోంది. గచ్చిబౌలి జంక్షన్ దాటేందుకు 220 సెకన్ల సమయం పడుతుంది. బైక్‌లు, కార్లు 75 శాతం నుంచి 85 శాతం ట్రాఫిక్ కారణమవుతున్నాయి. ప్రస్తుతం ఐటీ కారిడార్‌లో వాహనాల స్పీడ్ గంటకు 25 కిలోమీటర్లు ఉన్నట్లుగా జీహెచ్ఎంసీ సర్వేలో చెబుతున్నప్పటికీ గంటకు 14 కిలోమీటర్లు ఉంటుందని పోలీసులు చెబుతున్నారు. ఎస్ఆర్డీపీ ప్రణాళిక రూపొందించారు. వాస్తవానికి పీక్ అవర్‌లో గంటకు 10 కి.మీ మాత్రమే ఉంటుందని నిపుణులు పేర్కొంటున్నారు. కొనసాగుతున్న ఎస్సార్డీపీ పనులు మాదాపూర్‌లోని అయ్యప్ప సొసైటీ అండర్ పాస్, మైండ్ స్పేస్ అండర్ పాస్ అందుబాటులోకి వచ్చాయి. మైండ్ స్పేస్ జంక్షన్లో ఫ్లైఓవర్ కొద్ది రోజుల్లో అందుబాటులోకి రానుంది. బయోడైవర్సిటీ జంక్షన్‌లోని ఫ్లైఓవర్ వచ్చే మార్చి నాటికి సిద్ధం కానుంది. కూకట్పల్లి పరిధిలోని రాజీవ్ గాంధీ సర్కిల్ ఫ్లైఓవర్ ఈ డిసెంబర్ నాటికి పూర్తి చేయాల్సి ఉంది. రూ.184 కోట్లతో చేపడుతున్న దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి 2019 మార్చి నాటికి పూర్తి చేయనున్నారు. రూ.263.09 కోట్ల వ్యయంతో కొత్తగూడ జంక్షన్లో గ్రేటర్ సెపరేటర్స్ 2019 డిసెంబర్ నాటికి పూర్తి చేయా ల్సి ఉంది. రూ.225 కోట్లతో సైబర్‌టవర్ ఎలివేటెడ్ రోటరీ ఏజెన్సీ అప్రూవ్డ్ చేయాల్సి ఉంది. రూ.330 కోట్లతో శిల్పా లేవుట్ నుంచి గచ్చిబౌలి అవుటర్ జంక్షన్ వరకు ఫ్లైఓవర్ టెండర్ దశలో ఉంది. రూ.875 కోట్లతో ఖాజాగూడ టన్నెల్, ఎలివేటెడ్ కారిడార్‌కు అనుమతులు రావాలి. ప్రస్తుతం నగరంలో చేపడుతున్న ఎస్సార్డీపీ పనులన్నీ 2035 నాటికి ట్రాఫిక్ రద్దీకి అనుగుణంగా రోడ్లను అభివృద్ధి చేస్తున్నా.. సైబరాబాద్‌లో వాహనాలు, జనాలు పెరుగుతున్న తీరు మాత్రం ఆందోళన కలిగిస్తోంది. -
ఒక్క కారు ఎంత పని చేసిందో..
అసలే బేగంపేట్– పంజగుట్ట మార్గం.. ఆపై పీక్ అవర్స్.. ఇంకేముంది వాహనదారులు చుక్కలు చూశారు. సోమవారం ఓ వ్యక్తి నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేయడంతో బేగంపేట్ ఫ్లైఓవర్‌పై కారు డివైడర్‌ను ఢీకొట్టి.. దాని మధ్యలో ఆగిపోయింది. దీంతో కిలోమీటర్ల మేర ట్రాఫిక్ స్తంభించింది. దాదాపు మూడు గంటలైనా పరిస్థితి అదుపులోకి రాలేదు. సాక్షి, సిటీబ్యూరో/సనత్‌నగర్: ఓ వ్యక్తి నిర్లక్ష్యపు డ్రైవింగ్ వేల మందిని ఇబ్బందుల పాలు చేసింది. అతడి కారు ఫ్లైఓవర్‌పై డివైడర్ ఎక్కడంతో గంటల తరబడి ట్రాఫిక్ నిలిచిపోయింది. బేగంపేటలో సోమవారం ఉదయం ఈ ఉదంతం చోటు చేసుకుంది. ట్రాఫిక్‌ను క్రమబద్దీకరించడానికి ట్రాఫిక్ పోలీసులు అష్టకష్టాలు పడాల్సి వచ్చింది. పోలీసులు సదరు వాహనచోదకుడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. గత నెల 18న చోటు చేసుకున్న ‘జీహెచ్ఎంసీ లారీ బ్రేక్‌డౌన్ పరేషాన్’ను పూర్తిగా మరువక ముందే మరో ‘జామ్’జాటం చోటు చేసుకుంది. నగరంలోని రహదారుల్లో బేగంపేట–పంజగుట్ట మార్గం అత్యంత కీలకమైంది. దీనికి సరైన ప్రత్యామ్నాయం లేకపోవడంతో పాటు సైబరాబాద్‌లోని ఐటీ సెక్టార్‌కు వెళ్లి వచ్చే వాహనాలతో సాధారణ రోజుల్లోనే ట్రాఫిక్ భారీగా ఉంటుంది. వారంలో తొలి పనిదినమైన సోమవారం ఈ ఇబ్బందులు మరీ ఎక్కువ. ప్రస్తుతం కొన్ని మెట్రో స్టేషన్స్ వద్ద పనులు జరుగుతుండటంతో మరికొంత ఇబ్బంది కలుగుతోంది. సోమవారం ఓ వ్యక్తి నిర్లక్ష్యం వాహనచోదకుల నరకానికి కారణమైంది. జనప్రియ లేక్ ప్రాంతానికి చెందిన దివ్యాన్ష కోహిల్ సోమవారం ఉదయం బేగంపేట నుంచి పంజగుట్ట వైపు వెళుతుండగా అతడి ఐ–20 కారు బేగంపేట ఫ్లైఓవర్‌పై వరుణ్ మోటార్స్ వద్ద అదుపు తప్పడంతో సిమెంట్ దిమ్మెలతో కూడిన కొలాబ్సబుల్ డివైడర్‌ను ఢీ కొట్టింది. అప్పటికే వేగంగా ఉన్న కారు దిమ్మెలు తప్పుకోవడంతో ఆ మధ్య నుంచి డివైడర్ పైకి ఎక్కి ఆగిపోయింది. ట్రాఫిక్ పోలీసులు స్పందించి ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ ముత్తుకు సమాచారం అందించారు. హుటాహుటిన అక్కడకు చేరుకున్న ఆయన ట్రాఫిక్ క్రమబద్దీకరించడానికి ప్రయత్నించారు. ఫ్లైఓవర్‌పై పంజగుట్ట వైపునకు వెళ్లే ట్రాఫిక్ ఆగిపోగా... రెండో వైపు నుంచి వెళ్తున్న వాహనచోదకులు కారును చూసేందుకు వెహికిల్స్ ఆపుతూ/నెమ్మదిగా పోనివ్వడంతో ఆ వైపు సైతం ట్రాఫిక్ ఆగిపోయింది. దీంతో ఇన్స్పెక్టర్ ట్రాఫిక్ క్రేన్‌ను రప్పించి వాహనాన్ని దూరంగా తరలించారు. ఈ విషయమై దివ్యాన్ష్‌ను ప్రశ్నించగా... తనకు ఆ సమయంలో కళ్లు తిరిగాయని, అందుకే కారు అదుపు తప్పిందని చెప్పుకొచ్చాడు. నిర్లక్ష్యంగా వాహనం నడపటంతో పాటు తీవ్ర ట్రాఫిక్ ఇబ్బందులకు కారణమైన అతడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు బేగంపేట ఇన్స్పెక్టర్ అశోక్‌రెడ్డి తెలిపారు. ‘కారు–డివైడర్’ ఘటనతో బేగంపేట మార్గంలో భారీగా ట్రాఫిక్ జాం ఏర్పడింది. అటు సికింద్రాబాద్... ఇటు పంజగుట్ట రూట్లో ఎక్కడి వాహనాలు అక్కడే నిలిచిపోయాయి. దాదాపు మూడు గంటల పాటు వాహనదారులు ట్రాఫిక్‌లో చిక్కుకున్నారు. ప్రధాన రహదారిని విడిచి గల్లీల నుంచి వెళ్లాలని పలువురు భావించడంతో ఒక్కసారిగా రద్దీ పెరిగి వాటిలోనూ ట్రాఫిక్ ఆగిపోయింది. కొన్నిచోట్ల శాంతిభద్రతల విభాగానికి చెందిన పోలీసులు ట్రాఫిక్ క్రమబద్ధీకరణకు శ్రమించారు. ఛిద్రమైన రోడ్లు, ఆగిపోయిన ట్రాఫిక్ కారణంగా వాహనాల మైలేజ్ కూడా ఘోరంగా పడిపోయింది. -
దేశ రాజధానిలో భారీ వర్షాలు
సాక్షి, న్యూఢిల్లీ : దేశ రాజధానిలో ఎడతెరిపి లేకుండా భారీ వర్షాలు కురుస్తున్నాయి. గురువారం ఉదయం నుంచి కురుస్తున్న భారీ వర్షాల కారణంగా పలు లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. ఢిల్లీతో పాటు నోయిడాలోని ప్రధాన రహదారులపై నిలిచిన వర్షపు నీటితో రాకపోకలకు అంతరాయం కలుగుతోంది. వర్షాల కారణంగా ప్రజలు సైతం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో అధికారులు విద్యుత్ సరఫరాను నిలిపివేశారు. వర్షపు నీరు ఎక్కువగా నిలిచిపోవటం వల్ల ఘాజీపూర్ ముర్గా మండీ, ఖజిర్ చౌక్, మోదీ మిల్ ఫ్లైఓవర్ తదితర ప్రాంతాల్లో ట్రాఫిక్ స్థంభించి పోయిందని అధికారులు తెలిపారు. నీటి నిల్వలు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. -
పారదర్శకంగా అభివృద్ధి పనులు
నగరంలో ట్రాఫిక్ సమస్యలు తగ్గాలంటే ప్రజారవాణా వ్యవస్థ వినియోగం పెరగాలని మంత్రి కేటీఆర్ అన్నారు. ముంబైలో 70 శాతం మంది ప్రజా రవాణాను వినియోగించుకుంటే, హైదరాబాద్‌లో 34 శాతం మంది మాత్రమే ఉపయోగించుకుంటున్నారన్నారు. శుక్రవారం కొండాపూర్‌లో మల్టీలెవెల్ ఫ్లైఓవర్ నిర్మాణ పనులకు మంత్రి మహేందర్ రెడ్డి, మేయర్ రామ్మోహన్, ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీతో కలిసిశంకుస్థాపన చేశారు. సాక్షి, సిటీబ్యూరో/గచ్చిబౌలి: నగరంలో ట్రాఫిక్ సమస్యలు తగ్గాలంటే ప్రజారవాణా వ్యవస్థ వినియోగం పెరగాల్సి ఉందని మునిసిపల్ మంత్రి కె. తారకరామారావు అన్నారు. నగరంలో ఎస్ఆర్డీపీ పథకంలో భాగంగా పారదర్శకంగా అభివృద్ధి జరుగుతోందన్నారు. శుక్రవారం కొండాపూర్‌లో మల్టీలెవెల్ ఫ్లైఓవర్ నిర్మాణ పనులకు రవాణా శాఖ మంత్రి మహేందర్ రెడ్డి, మేయర్ బొంతురామ్మోహన్, ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీతో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, ముంబైలో 70 శాతం మంది ప్రజారవాణాను వినియోగించుకుంటుండగా, హైదరాబాద్‌లో 34 శాతం మంది మాత్రమే ప్రజారవాణాపై అధారపడుతున్నారన్నారు. ఈ సమస్య పరిష్కారానికి ఫ్లై ఓవర్లు తదితర నిర్మాణాలు చేపడుతున్నట్లు తెలిపారు. వ్యూహత్మకంగా రోడ్ల అభివృద్ధిని చేస్తున్నామన్నారు. హైదరాబాద్ వేగంగా అభివృద్ధి చెందుతుండగా, శేరిలింగంపల్లి శరవేగంగా అభివృద్ధి చెందుతోందన్నారు. ట్రాఫిక్‌కు అనుగుణంగా మౌలిక వసతులు కల్పన, ప్రజల జీవన ప్రమాణాలు పెంపొందించేందుకు ముఖ్యమంత్రి చర్యలు తీసుకుంటున్నారన్నారు. నగరంలో రూ. 23 వేల కోట్లతో 54 జంక్షన్ల అభివృద్ధి, 111 కిలోమీటర్ల ఎలివేటెడ్ కారిడార్లను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ప్రస్తుతం 3వేల కోట్ల పనులు పురోగతిలో ఉన్నాయని, మరో రూ. 2,351 వేల కోట్ల పనులు టెండర్ దశలో, రూ. 2,686 కోట్ల మేర మంజూరు దశలో ఉన్నట్లు తెలిపారు. సమస్యల శాశ్వత పరిష్కారానికి తాత్కాలిక ఇబ్బందులను భరించాలని ప్రజలకు సూచించారు. సోషల్ మీడియాలో పలువురు రోడ్ల దుస్థితిపై విమర్శలు చేస్తున్నారని, ఫ్లై ఓవర్ల నిర్మాణం, తాగునీటి పైప్లైన్లు, రహదారుల మరమ్మతులు జరుగుతున్నందున ఇబ్బందులు తప్పవన్నారు. జీహెచ్ఎంసీ పరిధిలో 9 వేల కిలోమీటర్ల రోడ్లు ఉండగా ఇంటింటికి మంచి నీరు అందించాలనే లక్ష్యంతో పైపులైన్ ఏర్పాటు కోసం 3 వేల కిలోమీటర్ల రోడ్లను తవ్వినట్లు తెలిపారు. వీలైనంత త్వరగా రోడ్లను పునరుద్ధరించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. 18 నెలల్లోగా ఫ్లై ఓవర్ అందుబాటులోకి.. కొండాపూర్, కొత్తగూడలో రూ. 263 కోట్లతో మూడు కిలోమీటర్ల పొడవున నిర్మించనున్న ఫ్లై ఓవర్ 18 నెలల్లో అందుబాటులోకి వస్తుందన్నారు. ఇంకా ముందే పూర్తిచేసేందుకు కృషి చేస్తున్నామని, రాష్ట్ర ప్రభుత్వం, జీహెచ్ఎంసీ అధికారులు జవాబుదారీ తనంతో పనిచేస్తున్నారన్నారు. నవంబర్‌లో మెట్రో మూడో దశ.. ప్రజారవాణా వ్యవస్థను మెరుగు పరచడంలో భాగంగా మెట్రో రెండోదశ ఎల్బీనగర్– అమీర్‌పేట ఆగస్టులో అందుబాటులోకి తెచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. మూడో దశలో హైటెక్‌సిటీ వరకు నవంబర్ నాటికి మెట్రో రైలు అందుబాటులోకి వస్తుందన్నారు. ప్రస్తుతం మెట్రోలో రోజుకు 80 నుంచి 85 వేల మంది ప్రయాణిస్తున్నారని, అన్ని దశలు పూర్తయితే రోజుకు 12 నుంచి 14 లక్షల మంది ప్రయాణం చేసే అవకాశం ఉందన్నారు. మెట్రోస్టేషన్ల నుంచి ప్రజారవాణా వ్యవస్థను అందుబాటులోకి తెచ్చే ప్రయత్నం చేస్తున్నామన్నారు. వాహన కాలుష్యాన్ని తగ్గించేందుకు ఆర్టీసీ తొలిదశలో 500 ఎలక్ట్రిక్ బస్సులను అందుబాటులోకి తెస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో జీహెచ్ఎంసీ కమిషనర్ డాక్టర్ బి.జనార్దన్ రెడ్డి, జోనల్ కమిషనర్ హరిచందన, జీహెచ్ఎంసీ సీఈ శ్రీధర్ పాల్గొన్నారు. టెండరు దశలో.. రూ.426 కోట్లతో ఇందిరాపార్క్ నుంచి వీఎస్టీ వరకు ఎలివేటెడ్ కారిడార్, రూ.225 కోట్లతో సైబర్ టవర్ ఎలివేటెడ్ రోటరీ, రూ.175 కోట్లతో రేతిబౌలి, నానల్‌నగర్ ఫ్లైఓవర్, రూ.330 కోట్లతో శిల్పా లేవుట్ నుంచి గచ్చిబౌలి ఫ్లైఓవర్, రూ.523 కోట్లతో నల్గొండ ఎక్స్ రోడ్డు నుంచి ఒవైసీ హాస్పిటల్ ఎలివేటెడ్ కారిడార్, రూ.636 కోట్లతో జూపార్క్ నుంచి ఆరాంఘర్ ఎలివేటెడ్ కారిడార్ , రూ.37 కోట్లతో చాంద్రాయణగుట్ట ఫ్లైఓవర్ ఎక్స్టెన్షన్ పనులు టెండర్ దశలో ఉన్నట్లు తెలిపారు. రూ.875 కోట్లతో ఖాజాగూడ టన్నెల్ ఎలివేటెడ్ కారిడార్ మంజూరు దశలో ఉందన్నారు. నేషనల్ హైవే మీద మూడు ఎలివేటెడ్కారిడార్ల పనులు రూ. 1500 కోట్లతో చేపట్టామన్నారు. టైం బౌండ్‌తో పనిచేస్తున్నాం.. శేరిలింగంపల్లిలో ఇప్పటికే అయ్యప్పసొసైటీ, మైండ్ స్పేస్ జంక్షన్లలలో అండర్ పాస్‌లను ప్రారంభించినట్లు మంత్రి కేటీఆర్ తెలిపారు. 2018 జూలైలో కామినేని ఎడమ వైపు ఫ్లైఓవర్, ఆగస్టులో మైండ్ స్పేస్ ఫ్లైఓవర్, సెప్టెంబర్‌లో ఎల్బీనగర్లో ఎడమవైపు ఫ్లైఓవర్, డిసెంబర్లో కూకట్పల్లి రాజీవ్ గాంధీ విగ్రహం ఫ్లైఓవర్, ఎల్బీనగర్ ఎడమ వైపు అండర్ పాస్, 2019 మార్చిలో దుర్గంచెరువు కేబుల్ బ్రిడ్జి, బయోడైవర్సిటీ, బైరామల్‌గూడ, కామినేని హాస్పిటల్ కుడివైపు ఫ్లైఓవర్లు, సెప్టెంబర్‌లో జూబ్లీహిల్స్ రోడ్డు నెంబర్ 45 ఫ్లై ఓవర్, ఒవైసీ హాస్పిటల్ ఫ్లైఓవర్, బాలానగర్ గ్రేడ్ సెపరేటర్, డిసెంబర్లో షేక్‌పేట్ ఎలివేటెడ్ కారిడార్, కొత్తగూడ గ్రేడ్ సెపరేటర్, మల్టీ లెవల్ ఫ్లై ఓవర్లు అందుబాటులోకి రానున్నాయని తెలిపారు. -
బెంగళూరు వాసులు.. కొత్త కార్లు కొనొద్దు
బెంగళూరు : రోజు రోజుకూ పెరిగిపోతున్న ట్రాఫిక్ సమస్యలతో ఐటీ నగరంగా పేరుగాంచిన బెంగళూరు వాసులు సతమతమవుతున్నారు. ప్రజల ట్రాఫిక్ కష్టాలను తీర్చేందుకు ఆ రాష్ట్ర రవాణా శాఖ మంత్రి డీసీ తమ్మన్న కొత్త ఆలోచనతో వచ్చారు. పార్కింగ్ స్పేస్ లేకపోతే కార్లను కొనుగోలు చేయొద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. పార్కింగ్ స్పేస్ లేనివారికి కార్లను అమ్మకుండా చేయడం వల్ల ట్రాఫిక్ కష్టాలను నివారించడానికి అవకాశం ఉంటుందని చెప్పారు. సొంత వాహనాలకు బదులుగా పబ్లిక్ ట్రాన్స్‌పోర్టును వినియోగించాడాన్ని కూడా ప్రోత్సహిస్తామని తెలిపారు. డీజిల్ వాహనాలకు ఫుల్స్టాప్ పెట్టాలనే యోచనలో ఉన్నట్లు కూడా వెల్లడించారు. ఉచితంగా బస్ పాస్‌లు ఇస్తామన్న కాంగ్రెస్ ఎన్నికల హామీపై మాట్లాడుతూ ఈ విషయంపై అతి త్వరలోనే ప్రకటన వెలువడుతుందని పేర్కొన్నారు. దాదాపు 19.6 లక్షల మంది విద్యార్థులకు ఉచిత బస్‌పాస్‌లు ఇవ్వనున్నారు. బెంగుళూరు ట్రాపిక్ జాంల కారణంగా ఏటా రూ. 38 వేల కోట్లు నష్టం వాటిల్లుతోందని ఓ ప్రైవేటు ఏజెన్సీ రిపోర్టును వెలువరించింది. -
ఛీ.. జీవితం! ఏంది భయ్యా ఇది..
బెంగళూరు: ‘‘ఉద్యోగవేటలో భాగంగా ఎనిమిదేళ్ల కిందట సిటీకి వచ్చాను. మంచి ఉద్యోగమైతే దొరికిందిగానీ, జీవితం నానాటికీ నరకప్రాయంగా తయారైంది. అందుకు మొదటి కారణం ట్రాఫిక్ ఇబ్బందులైతే, రెండోది సాఫ్ట్వేర్ రంగంలో సాగుతోన్న శ్రమదోపిడి. చాలా విసుగెత్తిపోయా. ఏందీ జీవితం? అనిపించేది. అందుకే నిరసనగా గుర్రం మీద ఆఫీసుకొచ్చా. లైఫ్‌లో ఇంకెప్పుడూ మల్టీనేషన్ కంపెనీలో పనిచేయను...’’ అంటోన్న ఈ టెకీ.. తన వెరైటీ నిరసనతో సోషల్ మీడియా నయా సంచలనంగా మారాడు. పేరు రూపేశ్ కుమార్ వర్మ. బెంగళూరులో ఓ పేరుమోసిన కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజనీర్. ట్రాఫిక్ రద్దీని నిరసిస్తూ ఇలా గుర్రం మీద ఆఫీసుకొచ్చాడు. మరి సంస్థ ఊరుకుందా? గుర్రానికి పార్కింగ్ ప్లేస్ కల్పించిందా? అని అడగొద్దు! లాస్ట్ వర్కింగ్ డే కాబట్టి మనోడిలా వెరైటీ చర్యకుదిగాడు. బెంగళూరు నగరంలో ట్రాఫిక్ ఇబ్బందులు నానాటికీ పెరిగిపోతున్నాయని, పరాష్కార మార్గాలను వెదకడంలో వెనుకబడ్డామని ఆవేదన చెందుతోన్న రూపేశ్.. తానీ పనిచేసింది సెన్సెషన్ కోసం కాదని, అయినాసరే పాపులర్ అయిపోవడంతో థ్రిల్ అయ్యానని చెప్పాడు. అతి త్వరలోనే సొంత కంపెనీని ప్రారంభించబోతున్నట్లు తెలిపాడు. తద్వారా దేశంలో నెలకొన్ని సమస్యలు కొన్నింటికైనా పరిష్కారాలు చూపగలననే దీమా వ్యక్తంచేశాడు. ఆటోడ్రైవర్లు, ట్రక్కుడ్రైవర్లకు సైతం యూనియన్లు ఉండగా, సాఫ్ట్వేర్ ఉద్యోగులు మాత్రం సంఘటితం కాకపోవడం శోచనీయమని, ఎంఎన్సీల్లో పనిచేసే భారత టెకీలు.. లైక్‌మైండెడ్ ఫ్రెండ్స్‌తో కలిసి స్టార్టప్స్ ప్రారంభిస్తే బాగుంటుందని అభిప్రాయపడ్డాడు. ఇలా ఉద్యోగం చివరిరోజు అశ్వంపై వచ్చిన రూపేశ్ సొంతకంపెనీ పెట్టి పేరు సాధించకముందే సెలబ్రిటీ అయిపోయాడు! -
ట్రాఫిక్ సమస్యల పరిష్కారానికి కృషి: సీఎస్
సాక్షి, హైదరాబాద్: నగరంలో ట్రాఫిక్, పార్కింగ్ సమస్యల పరిష్కారానికి మల్టీలెవల్ పార్కింగ్ కాంప్లెక్స్‌ల నిర్మాణాలు చేపట్టాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్కే జోషి తెలిపారు. బుధవారం సచివాలయంలో నగర మేయర్ బొంతురామ్మోహన్‌తో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎస్ మాట్లాడుతూ హైదరాబాద్‌లో ట్రాఫిక్ సమస్య పరిష్కారం కోసం, ప్రభుత్వ, ప్రైవేటు స్థలాల్లో మల్టీలెవల్ పార్కింగ్ కాంప్లెక్స్ నిర్మాణ ప్రతిపాదనలపై ట్రాఫిక్ నిపుణులతో అధ్యయనం చేయించాలన్నారు. 100–500 గజా ల్లోపు స్థలాల్లో చైన్ పార్కింగ్ ఏర్పాటు అంశాన్ని పరిశీలించాలని బొంతురామ్మోహన్ అన్నారు. çసమీక్షలో ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శి శివశంకర్, లా సెక్రటరీ నిరంజన్‌రావు, రంగారెడ్డి కలెక్టర్ రఘునందన్‌రావు తదితరులు పాల్గొన్నారు. -
ట్రాఫిక్ రద్దీతో ఏటా 2,200 కోట్ల డాలర్ల నష్టం
సాక్షి, న్యూఢిల్లీ : భారత దేశంలో ట్రాఫిక్ రద్దీ పెరగడం వల్ల ఏటా 2,200 కోట్ల డాలర్ల ఆదాయాన్ని కోల్పోతున్నాం. ట్రాఫిక్ ఎక్కువగా ఉన్న సమయంలో తోటి ఆసియా నగరాల కన్నా ఢిల్లీ, ముంబై, బెంగళూరు, కోల్‌కతా మెట్రో నగరవాసులు గంటన్నర సేపు ఎక్కువ సమయాన్ని ట్రాఫిక్ రద్దీలో గడుపుతున్నట్లు ఉబర్ టాక్సీ సర్వీసు సంస్థ ఏర్పాటు చేసిన బాస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ వెల్లడించింది. నగర వాసులు ఒక చోటు నుంచి గమ్యస్థానానికి వెళ్లాలంటే పట్టే సరాసరి సగటు సమయం కన్నా ఆసియా నగరాల్లో 67 శాతం పడుతుంటే భారత్ మెట్రోపాలిటిన్ నగరాల్లో 149 శాతం ఎక్కువ పడుతుంది. ట్రాఫిక్ రద్దీ కారణంగా కూడా దేశానికి ఏటా 2,200 కోట్ల డాలర్ల నష్ట వాటిల్లుతోందని ఆ సంస్థ తెలియజేసింది. ట్రాఫిక్‌లో అదనపు సమయానికి అయ్యే ఇంధనం ఖర్చు, ఆ సమయానికి మ్యాన్ పవర్‌కు అయ్యే ఖర్చు, కాలుష్యం, ప్రమాదాలకు ఖర్చు తదితర అన్ని అంశాలను పరిగణలోకి తీసుకుని ఏడాదికి అయ్యే ఖర్చును అంచనావేసి ఈ లెక్క తేల్చినట్లు సంస్థ వెల్లడించింది. 1980 సంవత్సరంతో పోలిస్తే భారత దేశంలో ట్రాఫిక్ అవసరాలు ఎనిమిదింతలు పెరిగాయి. దేశం ఆర్థికంగా ఎంతో పురోభివద్ధి చెందడం, ప్రజల్లో ఎక్కవ మంది సొంత కారులు కొనుగోలు చేయడంతో ఈ పరిస్థితి ఏర్పడింది. దేశంలో జనాభా పెరగడం, జన సాంద్రత ఎక్కువగా ఉండడం, మెట్రో రైళ్ల లాంటి ప్రభుత్వ రవాణా వ్యవస్థ ఆశించిన మేరకు విస్తరించకపోవడమే కారణమని ఆ సంస్థ పేర్కొంది. గత కొన్ని సంవత్సరాలుగా దేశంలోని ఇతర నగరాలకన్నా ముంబై , ఢిల్లీ నగరాల్లో ట్రాఫిక్ పరిస్థితి కాస్త మెరగుపడినప్పటికీ ఇంకా ఎంతో మెరుగుపడాల్సి ఉంది. బెంగుళూరు, కోల్‌కతా నగరాల్లోనైతే పరిస్థితి మరీ దారుణంగా ఉంది. -
మహిళను చిదిమేసిన లారీ
గజ్వేల్‌రూరల్: లారీ ఢీకొని ఓ మహిళ మృతి చెందగా బాధిత కుటుంబ సభ్యులు రోడ్డుపై బైఠాయించి ధర్నా చేపట్టిన సంఘటన మున్సిపల్ పరిధిలోని ప్రజ్ఞాపూర్ చౌరస్తా జగదేవ్‌పూర్ వెళ్లే మార్గంలో సోమవారం ఉదయం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే... ప్రజ్ఞాపూర్‌కు చెందిన ఎర్ర కలమ్మ(46) కూలీ పనులు చేస్తుంది. సోమవారం ఉదయం ప్రజ్ఞాపూర్ చౌరస్తా వద్ద జగదేవ్‌పూర్ మార్గంలో రాజీవ్ రహదారిని దాటుతుండగా గజ్వేల్ నుంచి భువనగిరి వైపు వెళ్తున్న హరియాణకు చెందిన లారీ (హెచ్ఆర్ 55క్యూ 7034) ఆమెను ఢీకొని వెళ్లిపోయింది. ఈ ప్రమాదంలో కలమ్మ కాలు తెగిపడి అక్కడికక్కడే మృతి చెందింది. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు, స్థానికులు పెద్ద ఎత్తున సంఘటనా స్థలానికి చేరుకొని న్యాయం చేయాలంటూ రోడ్డుపై బైఠాయించారు. దీంతో రాజీవ్ రహదారిపై రోడ్లకు ఇరువైపులా భారీగా వాహనాలు నిలిచిపోయాయి. గజ్వేల్ సీఐ ప్రసాద్, ట్రాఫిక్ సీఐ నర్సింగరావులు సంఘటన స్థలానికి చేరుకొని రాస్తారోకో చేస్తున్న వారికి నచ్చజెప్పే ప్రయత్నం చేయగా తమకు న్యాయం జరిగే వరకు ఇక్కడి నుంచి కదిలేది లేదని రోడ్డుపైనే బైఠాయించారు. మున్సిపల్ చైర్మన్ గాడిపల్లి భాస్కర్ రోడ్డుపై «రాస్తారోకో చేస్తున్న వారికి నచ్చజెప్పి ప్రభుత్వ పరంగా అన్ని విధాలా ఆదుకుంటామని హామీ ఇవ్వడంతో వారు ధర్నా విరమించారు. మృతురాలు కలమ్మకు కొడుకు, కూతురు ఉన్నారు. బాధిత కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం గజ్వేల్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. బాధిత కుటుంబ సభ్యులకు మున్సిపల్ చైర్మన్ గాడిపల్లి భాస్కర్ రూ. 10 వేలు ఆర్థిక సాయం చేశారు. టీడీపీ రైతు విభాగం రాష్ట్ర అధ్యక్షుడు బూరుగుపల్లి ప్రతాపరెడ్డి బాధిత కుటుంబీకులను పరామర్శించారు. -
ట్రాఫిక్ ‘లాక్’.. పబ్లిక్ ‘లాస్’..!
‘‘వీల్ లాక్.. దీనిని ట్రాఫిక్ పోలీసులు ఇటీవల తీసుకొచ్చారట. మా పనిలో మేముండగానే, మా కారు వీల్‌కు లాక్ వేసి వెళుతున్నారు. అది తీయాలంటే వేయి రూపాయలు ఫైన్ కట్టాలట. ట్రాఫిక్ ‘లాక్’తో పబ్లిక్ ‘లాస్’ అవుతున్నారు’’.. నగరంలోని నాలుగు చక్రాల వాహన చోదకులు/యజమానుల నుంచి వినిపిస్తున్న మాట ఇది. ఈ ‘లాక్’–‘లాస్’ ఏమిటో అర్థమవాలంటే.. ఇటీవల ఖమ్మంలో కారు యజమాని ఒకరికి ఎదురైన అనుభవాన్ని తెలుసుకోవాల్సిందే. ఖమ్మంక్రైం: మధిరకు చెందిన అతని పేరు సంతోష్‌కుమార్. పెళ్లి బట్టలు కొనేందుకని ఇటీవల ఒక రోజు రాత్రి 10 గంటల సమయంలో తన కుటుంబీకులతో కలిసి కారులో ఖమ్మం వచ్చారు. కస్పాబజార్లోని వస్త్ర దుకాణం సమీపంలో దానిని పార్కింగ్ చేసి లోపలికి వెళ్లారు. బయటకొచ్చేసరికి 11 గంటలైంది. అందరూ కారులో కూర్చున్నారు. అది ముందుకు కదల్లేదు. ఏమైందో తెలియదు. అందరూ దిగి చూశారు. ముందు టైరుకు ఏదో వస్తువుతో లాక్ చేసి ఉంది. వారు ఆశ్చర్యపోయారు. అటూ ఇటూ చూశారు. ఇంతలో ఎవరో వచ్చి, ‘‘కొద్దిసేపటి కిందట ట్రాఫిక్ పోలీసులొచ్చారు. మీ కారుకు వీల్ లాక్ వేశారు’’ అని చెప్పారు. ఏం చేయాలో సంతోష్‌కుమార్‌కు అర్థమవలేదు. తను అప్పటివరకూ షాపింగ్ చేసిన దుకాణంలోకి వెళ్లాడు. ‘‘సర్, మా కారుకు ట్రాఫిక్ పోలీసులు వీల్ లాక్ వేశారు. కాస్త, తీయమని చెప్పగలరా.. ప్లీజ్’’’ రిక్వెస్ట్ చేశాడు. షాపు యజమాని కాస్త అసహనంగా కదులుతూ, మొహమంతా చిరాగ్గా పెట్టి.. ‘‘మాకు సంబంధం లేద్సార్. మీరే మాట్లాడుకోండి’’ అంటూ సీట్లోంచి లేచి, ‘మీరిక దయచేయొచ్చు’ అన్నట్టుగా లైట్లు ఆర్పేయసాగాడు. తమ వద్ద దాదాపుగా లక్ష రూపాయల విలువైన దుస్తులు తీసుకున్న సంతోష్‌కుమార్‌ను అప్పటివరకూ ఎంతో మర్యాదగా, గౌరవంగా చూసిన ఆ షాపు యజమాని, కేవలం రెండు నిముషాల తర్వాత ఇలా మారిపోవడాన్ని చూసిన సంతోష్‌కుమార్‌కు నవ్వాలో, ఏడ్వాలో తెలియలేదు. వీరు బయట ఉండగానే, ఆ షాపు యజమాని వెళ్లిపోయాడు. ఆ వెంటనే షట్టర్‌ను సిబ్బంది మూసివేసి వెళ్లారు. ఆ వీల్ లాక్‌పై ఫోన్ నెంబర్లు ఉన్నాయి. వాటికి ఫోన్ చేశాడు. అరగంట తరువాత ట్రాఫిక్ పోలీసులు వచ్చారు. ‘‘ట్రాఫిక్ రూల్స్‌కు విరుద్ధంగా రోడ్డుపై కారు పెట్టారు. అందుకే వీల్ లాక్ వేశాం. వెయ్యి రూపాయలు ఫైన్ కడితే తీస్తాం’’ అని చెప్పారు. ఆ కారు యజమాని ఇచ్చిన నగదును తీసుకుని వీల్ లాక్ తీశారు. ‘‘ఈసారి ఖమ్మానికి ఎట్టి పరిస్థితుల్లోనూ కారులో రాను. బస్సులోనో, రైల్లోనో వస్తాను. కారులో వచ్చి ఇలా ‘లాస్’ చేసుకునేబదులు అదే బెటర్’’ అనుకుంటూ మధిరకు తిరుగు పయనమయ్యారు. ఇది, ఒక్క సంతోష్ సమస్యే కాదు. ఖమ్మంలోని అనేకమంది అనుభవాలు కూడా ఇలాంటివే. ‘‘అమ్మ పెట్టదు.. అడుక్కోనివ్వదు... ...అనేది సామెత. మున్సిపాలిటీ నుంచి నగర కార్పొరేషన్ వరక ఎదిగిన ఖమ్మంలోని మెయిన్ సెంటర్లలో ఎక్కడా కూడా కార్లు నిలిపేందుకు పార్కింగ్ స్థలమంటూ లేదు. రోడ్డు పక్కన కాకుండా ఎక్కడ పెట్టుకోవాలి? ఫలానా చోట పెట్టమంటే అక్కడే పెడతాం. అది చెప్పరు. ఎక్కడో ఒకచోట అనువైన ప్రదేశంలో మేం పార్కింగ్ చేస్తే.. ఎందుకిక్కడ నిలిపావని ప్రశ్నిస్తారు. ఇంకెక్కడ పెట్టాలి..? అసలు కారులోనే రావద్దా..? ట్రాఫిక్ పోలీసులు ఉద్దేశ్యమేమిటి..? ఇదెక్కడి చోద్యం..?’’ అని ప్రశ్నిస్తున్నారు నున్నా శ్రీకాంత్. వీల్ లాక్ బాధితులు అనేకమందిలో ఈయన ఒకరు. లాక్.. షాక్.. వీక్..! ‘‘ట్రాఫిక్ నియంత్రణకు వీల్ లాక్ వేస్తున్నామని ట్రాఫిక్ పోలీసులు చెబుతున్నారు. మంచిదే..! ఎవరు మాత్రం కాదంటారు..?! కానీ, అదెప్పుడు..? పార్కింగ్‌కు నిర్ణీత ప్రదేశం ఉండాలి. వాటిని సూచిస్తూ బోర్డులు పెట్టాలి. ప్రధాన సెంటర్లలో/రోడ్లలో టూవీలర్ పార్కింగ్‌కు నిర్ణీత స్థలం (కొన్నిచోట్ల పార్కింగ్ ప్లేస్, ఇంకొన్నిచోట్ల రోడ్డుకు ఒక పక్కన) చూపిస్తున్నారు. మరి, కార్లకు కూడా అలా చూపించాలి కదా! ఇదేమీ చేయకుండా ట్రాఫికోళ్లు తమ ఇష్టానుసారంగా ఇలా చక్కాలకు తాళాలేసి వెళితే.. వాహన చోదకుల్లో వ్యతిరేకత క్రమేణా పెరుగుతుంది. ఇదంతా చూస్తుంటే.. ‘జబ్బొకటి.. మందొకటి..’ అన్నట్టుగా ఉంది. ఈ వీల్ ’లాక్‘.. మాకు ‘షాక్’లాగా తగులుతోంది. నీరసాన్ని, నిస్సత్తువను (‘వీక్’.. వీక్నెస్) తెప్పిస్తోంది. ఆస్పత్రి పనికో, ఇంకేదైనా అత్యవసర పనికో వచ్చినవారి పరిస్థితేమిటి? ఇవేవీ ఆలోచించరా..?!’’ అని, నిరసన స్వరం వినిపించారు ఫోర్ వీలర్ యజమానులైన అనిల్, గుడా సంజీవ్‌రెడ్డి. -
‘ప్రీకాస్ట్’ అద్భుతం
సాక్షి, సిటీబ్యూరో: మెట్రో నిర్మాణంలో ఉపయోగించిన పలు సెగ్మెంట్లు, రెక్కలు, సైడ్‌వాల్స్, వయాడక్ట్‌లను నిర్మాణ ప్రాంతంలో కాకుండా ప్రత్యేక యార్డుల్లో (ప్రీకాస్ట్ యార్డులు) తయారు చేశారు. వీటిని రహదారి మధ్యలో నిర్మించిన ఎత్తైన పిల్లర్లపైన అమర్చారు. మత్తమ్మీద మెట్రో నిర్మాణంలో ప్రీకాస్ట్ సాంకేతికత ఇంజినీరింగ్ అద్భుతం అని చెప్పొచ్చు. ప్రధాన రహదారులపై మెట్రో నిర్మాణం చేపట్టిన కారణంగా రాకపోకలకు ఇబ్బంది లేకుండా కుత్భుల్లాపూర్, ఉప్పల్ కాస్టింగ్ యార్డుల్లో సెగ్మెంట్లను రూపొందించారు. ఒక్కో సెగ్మెంట్ బరువు 40 టన్నులమేర ఉంటుంది. పనులు జరిగే ప్రాంతంలో పిల్లర్ల ఎత్తు, రోడ్డు విస్తీర్ణాన్ని బట్టి వీటి సైజులుంటాయి. వీటి పరిమాణాన్ని హైడ్రాలిక్ జాక్‌లతో సర్దుబాటు చేసుకునేందుకు ప్రత్యేకంగా డిజైన్‌చేశారు. మొత్తం 31 రకాల సెగ్మెంట్లను తయారుచేశారు. వేర్వేరు రకాల సెగ్మెంట్లకు పలు రకాల గ్రేడ్ల సిమెంట్‌ను వినియోగించారు. కొన్నింట్లో రసాయనాలను మిలితం చేశారు. ఇందుకోసం ప్రత్యేక ప్రయోగశాలను కూడా నిర్మించడం విశేషం. మెట్రో ప్రీకాస్ట్లో తయారుచేసిన విడిభాగాలివే.. పిల్లర్ల మధ్యన ఏర్పాటుచేసిన సెగ్మెంట్లు,స్టేషన్‌కు పక్షిఆకృతిలో ఏర్పాటుచేసిన రెక్కలు,సైడ్‌వాల్స్,ప్లాట్‌ఫాం పై ఉన్న వయాడక్ట్‌లు. వీటి తయారీ అనంతరం 10 మంది నిపుణుల బృందం తనిఖీచేసిన తరవాతనే పిల్లర్లపై వీటిని అమర్చారు. కాస్టింగ్ యార్డులూ ప్రత్యేకం.. దేశంలోనే అతిపెద్ద కాస్టింగ్యార్డును ఉప్పల్‌లో 72 ఎకరాల్లో ఏర్పాటుచేశారు. ఇక కుత్బుల్లాపూర్‌లో 64 ఎకరాల హెచ్ఎంటీ స్థలాన్ని లీజుకు తీసుకొని ఈ యార్డును ఏర్పాటుచేయడం విశేషం. మొత్తం మెట్రో ప్రాజెక్టులో 28వేల సెగ్మెంట్లను నిర్మించారు.. మెట్రో ట్రాక్.. పిల్లర్లపై ఏర్పాటుచేసిన వయాడక్ట్ సెగ్మెంట్లపై మెట్రో పట్టాలు పరిచారు. ఈ సెగ్మెంట్లు చూడ్డానికి చిన్నవిగానే కనిపించినా..మెట్రో రూట్లో సుమారు 33 అడుగుల విశాలంగా వంతెన ఏర్పాటుచేసి వాటిపై రెండువరుసల పట్టాలు (డబుల్ట్రాక్) ఏర్పాటుచేశారు. ఆపత్కాలంలో ఏదేనా రైలు పట్టాలపై నిలిచినా రైలు దిగి సమీప స్టేషన్‌కు నడుచుకుంటూ వెళ్లేందుకు మధ్యలో రెండు పట్టాల మద్యన ఖాళీస్థలం కూడా ఉంది. ఇక పంజగుట్ట, బేగంపేట్ పబ్లిక్‌స్కూల్ వద్ద మూడు వరుసల ట్రాక్‌ను నిర్మించారు. ఏదేని రైలు పట్టాలపై అత్యవసరంగా నిలిచిపోతే ఈ ట్రాక్ మీద రైలును నిలుపుతారు. అక్కడి నుంచి అర్థరాత్రి డిపోకు తరలిస్తారు. పిల్లర్లపై భారం ఇలా.. ♦ ఒక్కోరైలులో వెయ్యి మంది ప్రయాణికులు ప్రయాణిస్తే పిల్లర్‌పై పడే భారం 200 టన్నులు ♦ ఒకదాని వెనక మరో రైలు వెళితే 400 టన్నులు ప్రీకాస్ట్తో మేడ్ మెట్రో ఇలా.. ♦ ప్రీకాస్ట్ విధానంలో 85 శాతం మెట్రో పనులు పూర్తిచేశారు. ♦ రహదారులపై ఇసుక, కంకర, సిమెంటు,స్టీలు వంటి నిర్మాణ వ్యర్థాల కాలుష్యం లేకుండా చూడగలిగారు. ♦ ఈ నిర్మాణాలు నాణ్యత, మన్నిక పరంగానూ అత్యున్నతమైనవి. మియాపూర్‌లో హెలికాప్టర్ ట్రయల్ రన్ మియాపూర్: ప్రధాని నరేంద్రమోదీ పర్యటన నేపథ్యంలో మియాపూర్ మెట్రో స్టేషన్ వద్ద ప్రత్యేక హెలిపాడ్ ఏర్పాటు చేశారు. ఈమేరకు ఆదివారం ఇక్కడ హెలికాప్టర్ ట్రయల్ రన్ నిర్వహించారు. మూడు హెలికాప్టర్లు ల్యాండ్ చేయడం కోసం డిపో ప్రాంగణంలోనే విశాలమైన ప్రదేశంలో మూడు హెలిప్యాడ్లు నిర్మించారు. హెలిప్యాడ్ స్థలాన్ని పరిశీలించడానికి శంషాబాద్ ఎయిర్‌పోర్టు నుండి ఒక హెలికాప్టర్ ద్వారా ట్రయల్ రన్ నిర్వహించారు. ఎయిర్పోర్ట్ అధికారులు హెలిప్యాడ్ స్థలాన్ని పరిశీలించారు. నత్తనడకన పనులు మియాపూర్: మెట్రో ప్రారంభోత్సవానికి అధికారులు ఉరుకులు పరుగులు పెడుతున్నా పనులు పూర్తి స్థాయిలో ముందుకు సాగడం లేదు. మెట్రో స్టేషన్లో గ్రీనరీ, పుట్‌పాత్, పార్కింగ్ ఏరియా పనులు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ప్రారంభోత్సవానికి ఒక రోజే సమయం ఉంది. స్టేషన్ల వద్ద పనులు పూర్తి కాకపోవడంతో ప్రయాణికులకు ఇబ్బందులు తప్పేలా లేవు. మెట్రో రైల్లో ప్రయాణించాలని చాలా మంది ఆసక్తిగా ఉన్నారు. కాబట్టి ఈ నెల 29న తొలిరోజు నుంచి వారం పది రోజులపాటు స్టేషన్ వద్ద భారీ రద్దీ నెలకొనే అవకాశం ఉంది. రద్దీకి తగినట్లు ఏర్పాట్లు పూర్తి కావాల్సి ఉంది. అధికారుల తనిఖీలు మియాపూర్: మియాపూర్ మెట్రో స్టేషన్, హెలిప్యాడ్ పరిసర ప్రాంతాల్లో, డిపో వద్ద పోలీస్ అధికారులు భద్రత చర్యలు కట్టుదిట్టం చేశారు. ఈ మేరకు ఆదివారం ఐఎస్‌డబ్ల్యూ, ఎస్పీజీ అధికారులు విస్త్రృతంగా తనిఖీలు నిర్వహించారు. ఐఎస్‌డబ్ల్యూ అధికారి శ్రీనివాస్ ఆధ్వర్యంలో డాగ్ స్క్వాడ్, ఇతర ఆధునిక స్కానర్లతో తనిఖీ చేశారు. మెట్రో స్టేషన్ సందర్శించిన ఉన్నతాధికారులు మియాపూర్‌లో అధికారులు ఎప్పటికప్పుడు పనులు, భద్రత ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. ఆదివారం రాచకొండ అడిషనల్ డీసీపీ ప్రకాష్‌రెడ్డి, మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి, మెట్రో అధికారులతో కలిసి హెలిప్యాడ్, మెట్రో ఆవిష్కరణకు సిద్ధంగా ఉన్న పైలాన్, మెట్రో స్టేషన్‌ను పరిశీలించారు. 28న ట్రాఫిక్ ఆంక్షలు సాక్షి, సిటీబ్యూరో: మెట్రో రైలు ప్రారంభించనున్న మంగళవారం (ఈ నెల 28న) సైబరాబాద్ పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. మధ్యాహ్నం మూడు నుంచి 4.30 గంటల ప్రాంతంలో ఇవి అమల్లో ఉంటాయని సైబరాబాద్ పోలీసు కమిషనర్ సందీప్ శాండిల్యా ఆదివారం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. మియాపూర్ నుంచి కొండాపూర్, కొత్తగూడ వెళ్లే వాహనాలను చందానగర్, నల్లగండ్ల ఫ్లైఓవర్, గుల్మోహర్ పార్క్ జంక్షన్, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ నుంచి వయా గచ్చిబౌలి మీదుగా అనుమతించనున్నారు. మియాపూర్ నుంచి రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి వెళ్లే వాహనాలను మియాపూర్ వద్ద దారి మళ్లించి చందానగర్, పటాన్చెరు, ఓఆర్ఆర్ మీదుగా ఎయిర్‌పోర్టుకు అనుమతించనున్నారు. మాతృశ్రీ నగర్ నుంచి వచ్చే వాహనాలను షీలా పార్క్ ప్రైడ్ వద్ద దారి మళ్లించి మంజీరా రోడ్డువైపు అనుమతించనున్నారు. పటాన్చెరు, ఇక్రిశాట్, బీరంగూడ, ఆర్సీపురం, అశోక్‌నగర్, బీహెచ్ఈఎల్ నుంచి కూకట్పల్లి, హైదరాబాద్ వెళ్లే వాహనాలను బీహెచ్ఈఎల్ రోటరీ వద్ద మళ్లించి నల్లగండ్ల ఫ్లైఓవర్, గుల్మొహర్ పార్క్ జంక్షన్, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ, మెహదీపట్నం మీదుగా హైదరాబాద్‌కు అనుమతివ్వనున్నారు. జహీరాబాద్, నారాయణ్‌ఖేడ్, సంగారెడ్డి నుంచి కూకట్పల్లి, హైదరాబాద్ వెళ్లే వాహనాలను ఓఆర్ఆర్ ముత్తంగి వద్ద దారి మళ్లించనున్నారు. సాయంత్రం 6–8 గంటల సమయంలో... మాదాపూర్‌లోని హెచ్ఐసీసీలో ప్రపంచ పారిశ్రామికవేత్తల సదస్సు ప్రారంభానికి హాజరై అతిథులంతా రాత్రి ఏడు గంటల ప్రాంతంలో తిరిగి వెళ్లనుండటంతో ఆ సమయంలో హెచ్ఐసీసీ నుంచి కొత్తగూడ, బొటానికల్ గార్డెన్, గచ్చిబౌలి, ఓఆర్ఆర్ మార్గంలో వెళ్లే వాహనదారులు 6–8 గంటల ప్రాంతంలో ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాలని సందీప్ శాండిల్య సూచించారు. యథావిధిగానే గచ్చిబౌలి ఫ్లైఓవర్ వాహనదారులకు అందుబాటులో ఉంటుంది. వీవీఐపీ రాకను బట్టి అత్యవసర పరిస్థితుల్లో ట్రాఫిక్ నిలిపివేస్తామని తెలిపారు. ఐటీ కారిడార్‌లో పనిచేసే ఉద్యోగులు మంగళవారం ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాలని సూచించారు. -
బాలకృష్ణ జై ‘హింస’...
పూరీ జగన్నాథ్ మార్కు డైలాగులా చెప్పాలంటే.. అభిమానులను తనదైన శైలిలో ‘లవ్’ చేసే సినీనటుడు నందమూరి బాలకృష్ణ ఇప్పుడు తన తాజా చిత్రం జైసింహ షూటింగ్‌తో విశాఖ ప్రజలనూ ‘లవ్’ చేస్తున్నారు..! సహజ అందాల నగరి విశాఖలో షూటింగ్ అంటే.. అది కూడా బీచ్ రోడ్లో అంటే పర్మిషన్లు తీసుకోవడం.. ఆ మేరకు పోలీసు అధికారులు ప్రజలకు ముందస్తు సమాచారం ఇవ్వడం షరామామూలు. కానీ ఇక్కడ సీఎం చంద్రబాబు బావమరిది, మంత్రి లోకేష్ మామ, అధికార టీడీపీ శాసనసభ్యుడు, బాక్సాఫీస్ బొనాంజా.. నటసింహం.. ఇలా ఎన్నో విశేషణాలు, ప్రత్యేకతలు కలిగిన బాలకృష్ణ సినిమా షూటింగుకు.. అటువంటి నిబంధనలేమీ అక్కర్లేదు.. మహా అయితే షూటింగ్‌కు అనుమతి కోరుతూ ఓ లెటర్ పడేసుంటారు.. అంతే ఇక నిబంధనలన్నీ బఖాతర్.. బీచ్‌రోడ్డు సమీప ప్రాంతాల ప్రజల కష్టాలు, వ్యాపారుల ఇబ్బందులు, ట్రాఫిక్ సమస్యలూ బలాదూర్. స్థానిక ప్రజలతోపాటు పెద్ద సంఖ్యలో వచ్చే పర్యాటకులు, సందర్శకులతో అత్యంత రద్దీగా ఉండే బీచ్ రోడ్డులో ఎన్టీఆర్ విగ్రహం వద్ద ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఏకబిగిన షూటింగ్..అందుకోసం.. అటు కిలోమీటరు.. ఇటు కిలోమీటరు పొడవునా అంతసేపూ ట్రాఫిక్ ఆంక్షలు. షూటింగ్ చేసే సినిమా యూనిట్, పోలీసులు తప్ప.. ఒక్క పిట్ట కూడా రోడ్డుపై నడవడానికి వీల్లేని..కర్ఫ్యూను తలపించే భయానక పరిస్థితి కల్పించేశారు మన పోలీసోళ్లు.. ఫలితం ఆ ప్రాంత ప్రజలకు రోజంతా ప్రత్యక్ష నరకం. ఇతర ప్రాంతాలపై ట్రాఫిక్ భారం.. వివరాల్లోకి వెళితే... సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: ప్రముఖహీరో, టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ 102వ చిత్రం జైసింహ షూటింగ్ కోసం శుక్రవారం బీచ్‌రోడ్డు పరిసర ప్రాంతాల్లో ఎక్కడికక్కడ ట్రాఫిక్‌ను ఇష్టానుసారం మార్చేశారు. ఎటువంటి సమాచారం లేకుండా టాఫిక్ ఆంక్షలు పెట్టడంతో వాహనదారులు నానా ఇబ్బందులకు గురయ్యారు. ఆర్కే బీచ్ ఎన్టీఆర్ విగ్రహం పరిసరాల్లో షూటింగ్ జరుగుతుండగా... అటు కురుసురా సబ్‌మెరైన్.. ఇటు కోస్టల్ బ్యాటరీ వరకు రోడ్డు బ్లాక్ చేసేశారు. సినిమా షూటింగ్‌కు సంబంధించిన వాహనాలు మినహా మరే ఇతర వాహనాన్నీ పోలీసులు అనుమతించలేదు. సినీ సన్నివేశం.. రాజకీయ పార్టీ కార్యకర్తలు ర్యాలీగా వచ్చి ధర్నా చేయడం.. మానవహారంగా నిలబడటం... ఆ తర్వాత రోడ్డుకు అడ్డంగా పడుకుని ట్రాఫిక్‌కు ఇబ్బంది కలిగించడం... దీంతో ఓ యాంగ్రీ పోలీస్ ఆఫీసర్ రంగప్రవేశం చేసి.. ప్రజలకు ట్రాఫిక్ ఇబ్బందులు కలిగిస్తున్న వారిపై ఆగ్రహం వ్యక్తం చేయడం.. అందరినీ చెల్లాచెదురు చేయడం. ఇదీ శుక్రవారం ఉదయం బీచ్‌రోడ్డులోని ఎన్టీఆర్ విగ్రహం వద్ద బాలయ్య బాబు తాజా సినిమా జై సింహ షూటింగ్ సన్నివేశం.. వాస్తవ దృశ్యం.. కట్ చేసి.. వాస్తవంలోకి వస్తే.. సరిగ్గా హీరో ఏ ట్రాఫిక్ ఇక్కట్లపై ఆగ్రహం వ్యక్తం చేశారో.. అదే సీన్ షూటింగ్ వల్ల ఏర్పడిన ట్రాఫిక్ ఇక్కడట్లో నగర ప్రజలు ప్రత్యక్షనరకం చూశారు. ట్రాఫిక్ అస్తవ్యస్తం కావడంతో నానా అగచాట్లు పడ్డారు. అప్పుడలా.. ఇప్పుడిలా.. సహజంగా బీచ్‌రోడ్‌లో సినిమా షూటింగ్‌లు ఎక్కువగానే జరుగుతుంటాయి. అయితే ట్రాఫిక్‌కు ఇబ్బంది లేకుండా ఉదయం వేళల్లో షూటింగ్‌లకు అనుమతిస్తుంటారు. ఇటీవల సూర్య సినిమా సింగం–3కి కూడా ఇదే మాదిరి యాక్షన్ సన్నివేశాలతో బీచ్‌రోడ్‌లో షూటింగ్ చేశారు. అంతెందుకు గతంలో బాలయ్య నటించిన చాలా సినిమాల షూటింగ్‌లు కూడా బీచ్‌రోడ్‌లో చేశారు. లెజెండ్ సినిమాలోని హై వోల్టేజ్ యాక్షన్ సీన్లు ఇక్కడే షూట్ చేశారు. అప్పుడు ఒకవైపు రోడ్డు మాత్రమే బ్లాక్ చేసి షూటింగ్ నిర్వహించారు. కానీ జై సింహ షూటింగ్ విషయానికి వస్తే మునుపెన్నడూ లేని విధంగా ఇష్టానుసారం వ్యవహరించారు, ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఏకబిగిన షూటింగ్ నిర్వహించేశారు. అంతవరకు ఒక్క పిట్టను కూడా ఆ రోడ్డులోకి అనుమతించలేదంటే అతిశయోక్తి కాదు. దీంతో ఉదయం, సాయంత్రం వేళల్లో స్కూళ్లు, కాలేజీలకు వెళ్లే విద్యార్థులు నానా అవస్థలు పడ్డారు. వాస్తవానికి అంబులెన్సులు, అత్యవసర సర్వీసుల వాహనదారులు సిటీలో ఎక్కువ ట్రాఫిక్ ఉంటుందనే ఉద్దేశంతో త్వరగా గమ్యాలకు చేరుకోవడానికి బీచ్‌రోడ్‌ను ఎన్నుకుంటారు. కానీ ముందుగా ఎటువంటి సమాచారం ఇవ్వకుండా పూర్తిగా బీచ్‌రోడ్‌ను బ్లాక్ చేయడంతో తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఇక బీచ్‌రోడ్‌లో అపార్టుమెంట్లలో నివసించేవారు తమ ఇళ్లకు చేరుకోవడానికి చుట్టూ తిరిగి రావాల్సిన పరిస్థితి ఏర్పడింది. కొందరు అపార్టుమెంట్స్ వాసులు తమ కార్లు ఎక్కడ పార్కు చేసుకోవాలో తెలియని పరిస్థితి నెలకొంది. బీచ్‌వైపు వచ్చే వాహనాలను దసపల్లా రోడ్ మార్గం ద్వారా మళ్లించారు. అయితే ఆ రోడ్డు చాలా చిన్నది కావడంతో విపరీతంగా ట్రాఫిక్ జామ్ అయింది. ఇక బీచ్‌కు వచ్చే సందర్శకుల పరిస్థితి దయనీయంగా మారింది. రోడ్డంతా బ్లాక్ చేయడం, వాహనాలు ఎక్కడ పార్క్ చేయాలో తెలియని స్థితిలో ఉదయం నుంచి సాయంత్రం వరకు బీచ్ సందర్శకులు లేక వెలవెలబోయింది. ఖాకీలను మించిన బౌన్సర్ల యాక్షన్ ఇక పోలీసులకు మించి సినిమా నిర్వాహకులు ఏర్పాటు చేసుకున్న బౌన్సర్లు చేసిన ఓవరాక్షన్ విమర్శలపాలైంది. ఉదయం 8.20 గంటల సమయంలో నోవోటెల్ సమీపంలో విద్యార్థుల తల్లిదండ్రులు ఆ మార్గంలో వెళ్లడానికి అనుమతి ఇవ్వాలని కోరగా, బౌన్సర్లు వారిపై దురుసుగా ప్రవర్తించారు. ఓ దశలో వారిపై దాడి చేసేందుకు కూడా ప్రయత్నించారు. అయితే పరిస్థితి అదుపు తప్పకుండా అక్కడున్న పోలీసులు కలగజేసుకోవడంతో సద్దుమణిగింది. మునుపెన్నడూ లేని విధంగా.. గతంలో ప్రధానమంత్రులు, రాష్ట్రపతులు వచ్చినప్పుడు కూడా బీచ్ రోడ్డును ఈ విధంగా బ్లాక్ చేసిన దాఖలాల్లేవు. అత్యంత ప్రతిష్టాత్మక ఐఎఫ్ఆర్ నిర్వహణ కోసం కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసినా ఇలా బీచ్‌ను దిగ్బంధించిన పరిస్థితి లేదు. కానీ కేవలం బాలకృష్ణ సినిమా షూటింగ్ కోసం పోలీసులు ఇలా సాగిలపడటం విమర్శలపాలవుతోంది. రెండు రోజులు షూటింగ్: ఏడీసీపీ మహేంద్రపాత్రుడు కాగా, రెండు రోజులు(శుక్ర, శనివారం) బీచ్‌రోడ్డులోనే జైసింహ షూటింగ్‌కు అనుమతినిచ్చామని నగర ట్రాఫిక్ అదనపు పోలీస్ కమిషనర్ మహేంద్రపాత్రుడు వెల్లడించారు. ముందస్తు సమాచారం ఇవ్వకపోవడంతో ప్రజలు నానా ఇబ్బందులకు గురవుతున్నారని ప్రస్తావించగా.. వాస్తవమే... ఇబ్బంది పడ్డాం.. శుక్రవారం నాటి పరిస్థితి ఉత్పన్నం కాకుండా పకడ్బందీ చర్యలు చేపడతామని చెప్పారు. -
ట్రాఫిక్ కష్టాలు పట్టవా?: జగ్గారెడ్డి
సాక్షి, హైదరాబాద్: నిధులు లేక జీహెచ్ఎంసీలో అభివృద్ధి కుంటుపడిందని కాంగ్రెస్ నేత, మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఆరోపించారు. వర్షాలు, ట్రాఫిక్‌తో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, హైదరాబాద్‌లో ట్రాఫిక్ కష్టాలు ప్రభుత్వానికి ఏ మాత్రం పట్టడం లేదని మండిపడ్డారు. గాంధీభవన్‌లో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ హైదరాబాద్‌లో ట్రాఫిక్ కష్టాలను తెలుసుకునేందుకు సీఎం కేసీఆర్ మారువేషంలో పర్యటిస్తే, జనం ఇబ్బందులు తెలుస్తాయన్నారు. జీహెచ్ఎంసీ నిధులు మిషన్ భగీరథకు మళ్లించడం వల్లే జీహెచ్ఎంసీ ఏమీ చేయలేకపోతోందని పేర్కొన్నారు. వర్షాల సమయంలో జనం కష్టాలను తీర్చేందుకు ప్రత్యేకంగా రెయిన్ ట్రాఫిక్ పోలీస్ వ్యవస్థను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. -
ట్రాఫిక్ సమస్య తీరేదెట్టా ?
సాక్షి, ముంబై : నగరంలో ట్రాఫిక్ సమస్య తీవ్రమవుతోంది. రోజురోజుకూ ప్రైవేట్ వాహనాల సంఖ్య అధికమవుతుండడంతో ఈ సమస్యలు తలెత్తుతున్నాయి. దీన్ని అధిగమించేందుకు బస్సుల కోసం ప్రత్యేకంగా లేన్లను కేటాయించాలనే అంశం కొత్తేమీ కాదు. అహ్మదాబాద్, ఢిల్లీ లాంటి నగరాలలో బస్ రాపిడ్ ట్రాన్సిట్ సిస్టమ్ (బీఆర్టీఎస్) వ్యవస్థ అమల్లో ఉంది. కానీ ఈ వ్యవస్థను అమల్లోకి తీసుకురావడంలో ముంబై విఫలమైంది. నగరవాసులకు ట్రాఫిక్ అవస్థలు తప్పడం లేదు. ఈ సమస్యల నుంచి విముక్తి పొందడానికి నగర వాసులు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంది. మరింత మెరుగైన సౌకర్యాలతో రవాణా వ్యవస్థను తీర్చి దిద్దాల్సి ఉంటుంది. నిపుణుల సూచనలు నగర వాసుల ప్రయాణ సమయం మరింత ఆదా చేసే విధంగా ప్రత్యేక బస్ లేన్లను ఏర్పాటు చేయాలి. ఇందుకు చిన్న ఏసీ బస్సులను ప్రవేశపెడితే ట్రాఫిక్ సమస్య కొంత మేర తీరుతుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ప్రజలు ప్రైవేట్ వాహనాలు ఉపయోగించకపోవడంతో రోడ్లపై కొంత మేర రద్దీ తగ్గి ట్రాఫిక్ సులభతరం అవుతోంది. ప్రత్యేక లేన్ కేటాయిండం ద్వారా వీటి మీద నుంచి వెళ్లే బస్సులకు ఆధరణ పెరిగి వాహనదారులు కూడా బస్సుల్లోనే వెళ్లేందుకు ఇష్టపడతారు. రోడ్లపై ప్రైవేట్ వాహనాల రద్దీ తగ్గుతోందని రవాణా శాఖ నిపుణులు అశోక్ దాతర్ అభిప్రాయపడ్డారు. చిన్న ఏసీ బస్సులను రద్దీ సమయంలో ప్రవేశపెట్టాలన్నారు. బస్సులు, రైళ్లు ప్రైవేట్ వాహనాల ద్వారా వెళ్లడంతో ప్రయాణ సమయం పెరుగుతోందని చెబుతున్నారు. తమ ప్రైవేట్ కార్లకు స్వస్తి చెప్పి పబ్లిక్ రవాణాను ఉపయోగించాలని ప్రజలకు సూచిస్తున్నారు. లేన్ల ఏర్పాటుపై అధ్యయనం ఇందుకు సంబంధించిన నివేదికను ముంబై ట్రాన్స్పోర్ట్ ఫోరం... బృహన్ముంబై ఎలక్ట్రిసిటీ అండ్ ట్రాన్స్పోర్ట్ (బెస్ట్)కు ప్రతిపాదన పంపించారు. బెస్ట్ ఈ బస్సులను బాంద్రా-కుర్లా కాంప్లెక్స్ (బీకేసీ), బాంద్రా స్టేషన్ల మధ్య నడపడానికి ప్రతిపాదించారు. బీకేసీతో పాటు మరే ఇతర ప్రాంతాలలో ఈ ప్రత్యేక లేన్లను ఏర్పాటు చేయాలనే అంశంపై అధ్యయనం నిర్వహించామని ట్రాఫిక్ పోలీసులు పేర్కొన్నారు. ఏఏ ప్రాంతాలలో ఎంత ట్రాఫిక్ ఉంటుందో తదితర అంశాలను కూడా అధ్యయనం చేశామని అడిషినల్ కమిషనర్ ఆఫ్ పోలీస్ (ట్రాఫిక్) క్వైజర్ ఖాలిద్ పేర్కొన్నారు. గతంలో ప్రవేశపెట్టాలనుకున్న బీఆర్టీఎస్, ప్రత్యేక లేన్లకు ట్యాక్సీ డ్రైవర్లు, వాహన చోదకుల నుంచి తీవ్ర నిరసన వ్యక్తమవుతోంది. దీంతో ఈ ప్లాన్ ప్రారంభంలోనే క్లిష్టంగా మారింది. ట్రాఫిక్‌ను నియంత్రించేందుకు మరింత పటిష్టమైన చర్యలు చేపట్టాలని నిర్ణయించామని అధికారి తెలిపారు. మినీ బస్సుల ఏర్పాటుకు నిర్ణయం నగర వాసుల ప్రయాణాన్ని మరింత సౌకర్యవంతంగా చేసేందుకు ఐదేళ్ల క్రితం బెస్ట్ సంస్థ ఏసీ బస్సులను నడిపించింది. కారు వినియోగ దారులు కూడా దీనికి ఆకర్షితులవుతారని భావించింది. కానీ బస్సు ప్రయాణం కార్లు, ద్విచక్రవాహనాల కంటే ఎక్కువ సమయం పడుతుండడంతో ప్రయాణించే సమయం ఎక్కువైంది. ఆశించిన ఫలితం దక్కలేదు. కొత్తగా మినీ ఏసీ బస్సులను నడిపేందుకు అధికారులు నిర్ణయించారు. ఈ బస్సుల్లో 20 నుంచి 25 మంది వరకు ప్రయాణికులు కూర్చునే వీలు ఉంటుంది. అంతేకాకుండా ఈ మినీ బస్సుల ద్వారా రోడ్లపై త్వరగా రద్దీ కూడా తగ్గుతోంది. ఈ బస్సుల ద్వారా ప్రయాణ సమయం కూడా ఆదా అవుతుంది. నగర వాసులకు సౌకర్యవంతమైన రవాణా అంటే ఇంటి దగ్గరే బస్సులను నిలపాలి. అలా చేస్తే ఇక వారు కార్లను ఉపయోగించరని దాతర్ అభిప్రాయపడ్డారు. ప్రైవేట్ వ్యక్తులు కూడా ఈ మినీ బస్సులను నిర్వహించవచ్చన్నారు.