
సాక్షి, హైదరాబాద్: నగరంలో ట్రాఫిక్, పార్కింగ్ సమస్యల పరిష్కారానికి మల్టీలెవల్ పార్కింగ్ కాంప్లెక్స్‌ల నిర్మాణాలు చేపట్టాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌కే జోషి తెలిపారు. బుధవారం సచివాలయంలో నగర మేయర్ బొంతురామ్మోహన్‌తో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎస్ మాట్లాడుతూ హైదరాబాద్‌లో ట్రాఫిక్ సమస్య పరిష్కారం కోసం, ప్రభుత్వ, ప్రైవేటు స్థలాల్లో మల్టీలెవల్ పార్కింగ్ కాంప్లెక్స్ నిర్మాణ ప్రతిపాదనలపై ట్రాఫిక్ నిపుణులతో అధ్యయనం చేయించాలన్నారు. 100–500 గజా ల్లోపు స్థలాల్లో చైన్ పార్కింగ్ ఏర్పాటు అంశాన్ని పరిశీలించాలని బొంతురామ్మోహన్ అన్నారు. çసమీక్షలో ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శి శివశంకర్, లా సెక్రటరీ నిరంజన్‌రావు, రంగారెడ్డి కలెక్టర్ రఘునందన్‌రావు తదితరులు పాల్గొన్నారు.