bonthu ram mohan
-
పట్టభద్రుల కోటా.. పకడ్బందీగా పావులు
సాక్షి, హైదరాబాద్ : పట్టభద్రుల ఎన్నికపై టీఆర్ఎస్ సీరియస్‌గానే దృష్టి సారించింది. హైదరాబాద్, వరంగల్ స్థానాలు కైవసం చేసుకునేందుకు పకడ్బందీగా పావులు కదుపుతోంది. శాసన మండలి పట్టభద్రుల కోటా ఎమ్మెల్సీలు పల్లా రాజేశ్వర్‌రెడ్డి (టీఆర్ఎస్), రామచంద్రరావు (బీజేపీ) పదవీ కాలపరిమితి మార్చి 29న ముగియనుంది. ఈ నెల 18న ‘వరంగల్– ఖమ్మం– నల్లగొండ’, 22న ‘హైదరాబాద్– రంగారెడ్డి– మహబూబ్‌నగర్’ పట్టభద్రుల నియోజకవర్గం ఓటరు తుది జాబితా వెలువడనుంది. ముసాయిదా ఓటరు జాబితా ప్రకారం ‘హైదరాబాద్’ పట్టభద్రుల నియోజకవర్గంలో 4.48లక్షలు, ‘వరంగల్’లో 5లక్షలకు పైగా పట్టభద్రులు ఓటర్లుగా నమోదయ్యారు. ఓటరు జాబితాలో కనీసం మూడింట ఒక వంతు మంది పట్టభద్రులు తమ పార్టీ యంత్రాంగం చొరవతోనే ఓటర్లుగా నమోదైనట్లు టీఆర్ఎస్ వర్గాలు వెల్లడించాయి. కాగా జనవరి మూడో వారంలో ఉమ్మడి ఆరు జిల్లాల పరిధిలోని టీఆర్ఎస్ కీలక నేతలతో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమావేశం కానున్నారు. ‘వరంగల్’నుంచి మళ్లీ ‘పల్లా’! వరంగల్– ఖమ్మం– నల్లగొండ పట్టభద్రుల నియోజకవర్గం నుంచి సిట్టింగ్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి మరోమారు పోటీ చేస్తారని టీఆర్ఎస్ ఇప్పటికే సంకేతాలు ఇచ్చింది. ఓటరు తుది జాబితా వెలువడిన తర్వాత అభ్యర్థుల జాబితాను పార్టీ అధినేత కేసీఆర్ ప్రకటించే అవకాశం ఉంది.కాగా, రాజేశ్వర్‌రెడ్డి గతేడాది అక్టోబర్ నుంచే జిల్లాల వారీగా వివిధ సంఘాలు, వర్గాలతో భేటీలు నిర్వహిస్తున్నారు. టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాం, ఇంటి పార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్, రాణిరుద్రమ, జయసారధిరెడ్డి, తీన్మార్ మల్లన్న, రాములు నాయక్ తదితరులు ఇదే నియోజకవర్గం నుంచి పోటీ చేసేందుకు సన్నద్ధం అవుతుండటంతో టీఆర్ఎస్ సిట్టింగ్ స్థానాన్ని నిలబెట్టుకునేందుకు సర్వశక్తులూ ఒడ్డాలని నిర్ణయించుకుంది. ‘హైదరాబాద్’ బరిలో ఔత్సాహికులు ‘హైదరాబాద్– రంగారెడ్డి– మహబూబ్‌నగర్’పట్టభద్రుల నియోజకవర్గానికి 2007, 2009, 2015లో మూడు పర్యాయాలు ఎన్నికలు జరిగినా ఇప్పటి వరకు టీఆర్ఎస్ అభ్యర్థులు గెలుపొందలేదు. దీంతో ఈసారి టీఆర్ఎస్ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ రాజకీయ కార్యదర్శి, ఎమ్మెల్సీ శేరి సుభాష్‌రెడ్డికి ఈ నియోజకవర్గం పరిధిలో గ్రాడ్యుయేట్ ఓటర్ల సభ్యత్వ నమోదు పర్యవేక్షణ బాధ్యత అప్పగించారు. హైదరాబాద్ నియోజకవర్గం నుంచి పోటీ చేసేందుకు పలువురు ఔత్సాహికులు ఆసక్తి చూపుతున్నారు. జీహెచ్ఎంసీ మేయర్ బొంతు రామ్మోహన్, తెలంగాణ విద్యా సంక్షేమ మౌలిక వసతుల కల్పన అభివృద్ధి సంస్థ చైర్మన్ నాగేందర్‌గౌడ్ (రంగారెడ్డి) పీఎల్ శ్రీనివాస్ (హైదరాబాద్), శుభప్రద్ పటేల్ (వికారాబాద్), వర్కటం జగన్నాథ్‌రెడ్డి (మహబూబ్‌నగర్) టీఆర్ఎస్ నుంచి పోటీ చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. పట్టభద్రుల కోటా ఎన్నికపై కేటీఆర్ దిశానిర్దేశం సాక్షి, హైదరాబాద్: ‘వరంగల్– నల్లగొండ– ఖమ్మం’శాసనమండలి పట్టభద్రుల నియోజకవర్గం ఎన్నికలో అనుసరించాల్సిన వ్యూహంపై టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కె.తారకరామారావు కీలకభేటీ నిర్వహించారు. నియోజకవర్గాలవారీగా కార్యకర్తలతో సమావేశాలు ఏర్పాటు చేయాలని సూచించారు. శనివారం ప్రగతిభవన్‌లో జరిగిన ఈ సమావేశంలో మంత్రి జగదీశ్‌రెడ్డితోపాటు ఉమ్మడి నల్లగొండ జిల్లాకు చెందిన టీఆర్ఎస్ ఎమ్మెల్సీలు, ఎమ్మె ల్యేలు, కార్పొరేషన్ చైర్మన్లు, మాజీ ఎమ్మెల్సీలు, కీలక నేతలు పాల్గొన్నారు. పట్టభద్రుల ఓటరు నమోదు కార్యక్రమం పూర్తవడంతో పార్టీపరంగా జరిగిన ఓటరు నమోదు గురించి ఆరా తీసి సంతృప్తి వ్యక్తం చేశారు. నియోజకవర్గాలవారీగా ప్రతి 50 మంది ఓటర్లకు ఒక ఇన్చార్జిని నియమించాలని ఆదేశించారు. బూత్ కమిటీల ఏర్పాటు, పార్టీ నేతల సమన్వయం, ప్రచారవ్యూహంపై పలు సూచనలు చేశారు. ఉద్యోగులు, యువతపై నజర్ పార్టీ అభ్యర్థిగా సిట్టింగ్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డిని అనధికారికంగా ప్రకటించిన నేపథ్యంలో ఆయనతో సమన్వయం చేసుకుని సమావేశాలు ఏర్పాటు చేయాల్సిందిగా కేటీఆర్ సూచించారు. ఎన్నికల షెడ్యూల్ వెలువడిన తర్వాత ప్రచార వ్యూహంపై దిశా నిర్దేశం చేస్తామని, ఆలోగా పార్టీ యంత్రాంగాన్ని ఎన్నికలకు సన్నద్ధం చేయాలని సూచించారు. ఉద్యోగులు, యువత కోసం ప్రభుత్వం చేసిన అభివృద్ధి, ఇతర అంశా ల గురించి సన్నాహక సమావేశాల్లో వివరించా లని కేటీఆర్ సూచించారు. ఈ ఎన్నికలో కీలకమైన ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగులు, యువతను లక్ష్యంగా చేసుకుని ప్రచారం సాగించాలని దిశానిర్దేశం చేశారు. గతంతో పోలిస్తే ఓటర్ల సంఖ్య రెండింతలు పెరిగినందున వీలైనంత ఎక్కువ మందిని చేరుకునేలా కార్యాచరణ ఉండాలన్నారు. నియోజకవర్గస్థాయిలో స్థానిక ఎమ్మెల్యే పార్టీ యంత్రాంగాన్ని సమన్వయం చేయాలని పేర్కొన్నారు. -
బొంతు రామ్మోహన్‌తో స్ట్రైయిట్ టాక్
-
మొదలైన రాజకీయ వేడి.. నేతలతో కేసీఆర్ భేటీ
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణలో మరో మినీ ఎన్నికల సందడి మొదలైంది. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషనతో పాటు పట్టభద్రుల కోటాలో రెండు ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వంతో పాటు ఎన్నికల సంఘం కసరత్తులు చేస్తోంది. మరోవైపు ఎన్నికల్లో పోటీకి ఆశావాహులు సిద్ధంగా ఉండగా.. గెలుపు గుర్రాలను అన్వేషించే పనిలో ప్రధాన పార్టీలు పడ్డాయి. ముఖ్యంగా జీహెచ్ఎంసీ ఎన్నికలపై అధికార టీఆర్ఎస్ పార్టీ దృష్టిసారించింది. టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా మంత్రి కేటీఆర్ పార్టీ బాధ్యతలు స్వీకరించిన అనంతరం జరుగుతున్న తొలి ఎన్నికలు కావడంతో పార్టీ నాయకత్వం ఈ ఎన్నికలను ఎంతో ప్రతిష్టాత్మకంగా భావిస్తోంది. దీనిలో భాగంగానే ఇప్పటికే రంగంలోకి దిగిన కేటీఆర్ గ్రేటర్ పరిధిలోని పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులతో విడతల వారిగా సమీక్షలు నిర్వహించారు. ఎన్నికలకు సమయం ఆసన్నమవుతున్న తరుణంలో పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేయాలని, డబుల్ బెడ్రూంల పంపిణీని వేగవంతం చేయాలని ఆదేశాలు జారీచేశారు. ఈ క్రమంలోనే ముఖ్యమంత్రి కేసీఆర్ గురువారం పార్టీ ఎమ్మెల్యేలు, మేయర్లతో సమావేశం నిర్వహించారు. (అంతుపట్టని రహస్యం: కేసీఆర్ వ్యూహమేంటి?) మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ఎమ్మెల్యేలు, మేయర్లతో ప్రగతిభవన్‌లో భేటీ అయ్యారు. ఎన్నికల వ్యూహాలతో పాటు అభ్యర్థల ఎంపికలపై తీసుకువాల్సిన జాగ్రత్తలపై సూచనలు, సలహాలు ఇవ్వనున్నారు. అలాగే పట్టభద్రుల కోటాలో అభ్యర్థుల ఎంపికపై కూడా ఈ సమావేశంలో చర్చించే అవకాశం ఉంది. హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్ స్థానం నుంచి మేయర్ బొంత రామ్మోహన్‌ను బరిలో నిలిపేందుకు పార్టీ అధిష్టానం ప్రయత్నం చేస్తున్నట్లు రాజకీయ వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చసాగుతోంది. పట్టభద్రుల కోటా ఎన్నికలో తీవ్ర పోటీ ఉండటం, ప్రభుత్వంపై వ్యతిరేకత, ఉద్యోగుల్లో నిరాశ విపక్షాలకు లబ్ధి చేకూర్చే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఉద్యమ కాలంలో ఉస్మానియా యూనివర్సిటీతో సత్సంబంధాలు, స్థానిక యువతలో మంచి ఫాలోయింగ్ ఉన్న రామ్మోహన్‌ను బరిలో నిలిపితే అనుకూల ఫలితాలు వచ్చే అవకాశం ఉందని కేసీఆర్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. నేటి భేటీలో ఈ అంశం కూడా ప్రధానంగా చర్చకు వచ్చే అవకాశం ఉంది. మరోవైపు దుబ్బాక ఉప ఎన్నికపై కూడా సీఎం పార్టీ నేతలతో చర్చించనున్నారు. (‘మండలి’ స్థానంపై.. పార్టీల గురి!) -
గుండె నిబ్బరంతో కోవిడ్‌ను జయించగలం
సాక్షి, సిటీబ్యూరో: కరోనా మహమ్మారికి ఎవరూ ఆందోళన చెందాల్సిందేమీ లేదని జీహెచ్ఎంసీ మేయర్ బొంతు రామ్మోహన్ పేర్కొన్నారు. ఈ మేరకు ట్విట్టర్లో వీడియో క్లిప్‌ను ఉంచారు. ఇదిలా ఉండగా జీహెచ్ఎంసీలో ఇప్పటి వరకు పలువురు అధికారులు, క్షేత్రస్థాయిలో పనులు చేసే వివిధ విభాగాల సిబ్బందికి కోవిడ్ సోకగా, తాజాగా ప్రథమ పౌరుడైన మేయర్‌కు కూడా కరోనా నిర్ధారణ కావడంతో జీహెచ్ఎంసీ అధికారులు, సిబ్బందిలో ఆందోళనలు మరింత పెరిగాయి. జీహెచ్ఎంసీలో ఇప్పటికే ఎంతోమందికి పాజిటివ్ వచ్చినప్పటికీ అధికారులు కచ్చితమైన లెక్కలు వెల్లడించలేదు. పారిశుద్ధ్యం, ఎంటమాలజీ కార్మికుల నుంచి కార్యాలయాల్లోని ఉద్యోగులు, డిప్యూటీ కమిషనర్ల నుంచి జోనల్ కమిషనర్ వరకు పాజిటివ్ రావడం తెలిసిందే. నగరంలో కరోనా కేసులు మొదలైనప్పటి నుంచి కూడా మేయర్ బొంతు రామ్మోహన్ విస్తృతంగా పర్యటనలు చేస్తున్నారు. లాక్డౌన్ సమయంలోనూ రోజూ ఏదో ఒక క్షేత్రస్థాయి పర్యటన చేసి, అభివృద్ధి పనుల పురోగతిని పరిశీలించారు. తన కార్యాలయంలో అధికారులతో తరచు సమీక్షలు నిర్వహించారు. ఇటీవల మంత్రి కేటీఆర్ పుట్టినరోజున నిర్వహించిన పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ప్రగతి భవన్‌కు వెళ్లి ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. నల్లగొండ క్రాస్‌రోడ్–ఒవైసీ జంక్షన్ వరకు ఎలివేటెడ్ కారిడార్, ఎల్బీనగర్ జోన్లో పది ఎకరాల్లో యాదాద్రి మోడల్లో ప్లాంటేషన్, తదితర కార్యక్రమాలకు హాజరయ్యారు. ఆయా కార్యక్రమాల్లో మంత్రులు కేటీఆర్, మహమూద్‌అలీ, తలసాని శ్రీనివాస్‌యాదవ్, సబితాఇంద్రారెడ్డి, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ తదితరులు పాల్గొన్న విషయం తెలిసిందే. వీడియోలో ఏమన్నారంటే.. ‘మిత్రులు.. నగర ప్రజలకు అందరికీ.. నాకు కరోనా వచ్చిందని ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. నేను కరోనా వచ్చినా ఎలాంటి లక్షణాలు లేకుండా చాలా ఆరోగ్యంగా ఉన్నాను. తగుజాగ్రత్తలు తీసకుంటూ, ఎవరినీ దగ్గరకు రానీయకుండా ప్రత్యేక గదిలో ఉంటూ కోవిడ్ ప్రొటోకాల్స్ పాటిస్తూ, మందులు తీసుకుంటూ ఉన్నా. ఎవరూ కరోనాకు భయపడి ఏదో అవుతుందని చెప్పి భయాందోళనలు చెందాల్సిన అవసరం లేదు. కరోనా వచ్చినా ఎదుర్కొనగలమనే మనోధైర్యంతో ముందుకు వెళ్తే.. మనల్ని ఏమీ చేయలేదు. మనోధైర్యాన్ని మించింది ఏమీ లేదు. ఈ కరోనా సమయంలో కూడా మునిసిపల్ మంత్రి ఆదేశాలతో నగరంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నందున ఎప్పటికప్పుడు ఫోన్, వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షలు నిర్వహిస్తా. అదరక బెదరక గుండె నిబ్బరంతో ముందుకు వెళ్తే విజయవంతంగా జయించగలుగుతాం. మంచికోరే మిత్రులందరికీ.. నగర ప్రజలందరికీ ధన్యవాదాలతో.. – మీ బొంతు రామ్మోహన్’అని మేయర్ సందేశం ఇచ్చారు. -
డబుల్ బెడ్రూం నిర్మాణాలపై కేటీఆర్ సమీక్ష
సాక్షి, హైదరాబాద్: డబుల్ బెడ్ రూం ఇళ్ల నిర్మాణాన్ని తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుందని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. హైదరాబాద్‌లో డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణ కార్యక్రమంపై బుధవారం ఆయన ప్రశాంత్‌రెడ్డిలు ఉన్నత స్థాయితో సమీక్ష సమావేశంచ నిర్వహించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. హైదరాబాద్ నగరంలో ఇప్పటికే చాలా చోట్ల 80 శాతానికిపైడా నిర్మాణాలు పుర్తయ్యాయని తెలిపారు. (ఆకలి తీర్చిన అన్నపూర్ణ: కేటీఆర్ ) కొన్ని చొట్ల లబ్ధిదారులకు డబుల్ బెడ్ రూం ఇళ్ల పంపిణీ చేయడం జరిగిందని చెప్పారు. త్వరలోనే మిగితా నిర్మాణాలను కూడా పూర్తి చేసి లబ్థిదారులకు అందించే ప్రయత్నం చేస్తామని ఆయన చెప్పారు. మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల కేంద్రంలో నిర్వహించిన ఈ సమావేశంలో పురపాలక శాఖ ఉన్నతాధికారులు, హౌసింగ్ శాఖ ఉన్నతాధికారులు, వర్కింగ్ ఏజెన్సీలతో పాటు మంత్రులు మంత్రులు మహముద్ అలీ, తలసాని శ్రీనివాస్ యాదవ్, మల్లారెడ్డి, నగరమేయర్ బోంతు రామ్మోహన్‌లు తదితరలు పాల్గొన్నారు. -
కరోనా ఓడాలి.. మనం గెలవాలి..
సాక్షి, సిటీబ్యూరో: ‘చారిత్రక, వారసత్వ సంపదతోపాటు ఐటీ నగరిగానూ ఎంతో విశిష్టతలు కలిగిన ఈ భాగ్యనగరాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనదే. కరోనా వైరస్ కారణంగా ప్రపంచమంతా అల్లాడుతున్న ప్రస్తుత తరుణంలో వ్యాధి కట్టడికి ప్రభుత్వం ఎన్నో చర్యలు చేపడుతోంది. ప్రభుత్వాలు ఎంత చేసినా మనం స్వీయ నియంత్రణ పాటించకపోతే ప్రయోజనం ఉండదు. ఇన్ని రోజులుగా పాటిస్తున్న లాక్డౌన్ వృథా అవుతుంది. మే నెలాఖరు వరకు వ్యాధి పెరగకుండా అనుకూల వాతావరణమని నిపుణులు చెబుతున్నారు. అంతకంటే ముందే చైన్‌ను పూర్తిగా తెగ్గొట్టాలి. ఆ కార్యం నిర్వహించేందుకు లాక్డౌన్ నిబంధనలతోపాటు కంటైన్మెంట్ జోన్లలోని ప్రజలంతా కచ్చితంగా నిబంధనలు పాటించాలి. మన హైదరాబాద్ నగరాన్ని మనమే కాపాడుకోవాలి.’ అంటూ నగర మేయర్ బొంతు రామ్మోహన్ ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా శుక్రవారంవిలేకరులతో చిట్‌చాట్‌లోపలు అంశాలను వివరించారు.. కరోనా పాజిటివ్ ఉన్న వ్యక్తితో ఎక్కడైనా కాంటాక్ట్ అయి ఉంటే స్వచ్ఛందంగా తెలియజేయండి చాలు. ప్రభుత్వమే అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటుందని అన్నారు. కరోనా పాజిటివ్ కేసులున్న వారి ఇళ్ల పరిసరాల్లో ఏర్పాటు చేసిన కంటైన్మెంట్ జోన్లలోని వారు బయటకు వెళ్లకుండా అన్నీ ప్రభుత్వమే సమకూరుస్తుందన్నారు. వైరస్ వ్యాప్తిని ఎక్కడికక్కడ తెగ్గొట్టకపోతే ఎంతో మందికి వ్యాపించే ప్రమాదం ఉందన్నారు. వైరస్ ఎలా విస్తరిస్తుందో అంతుబట్టడం లేదంటూ, పాజిటివ్ వ్యక్తులను కలిసినట్లు అనుమానాలున్న వారు వివరాలను అందించాలని కోరారు. తాను పర్యటించిన కంటైన్మెంట్ జోన్లలోని కొన్ని సంఘటనల్ని ప్రస్తావిస్తూ చాలామంది జోన్ దాటి వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారన్నారు. ఓ బ్యాంక్ ఉన్నతాధికారి ఒకరు తాను కచ్చితంగా కార్యాలయానికి వెళ్లాలని, పనులు స్తంభిస్తాయని తెలపగా ఆయన పైఅధికారులను తాము సంప్రదించగా, అన్ని విధాలా ప్రభుత్వ చర్యలకు సహకరిస్తామని చెప్పారన్నారు. వ్యాధి ఎలా పొంచి ఉందో తెలియదు కనుక.. అందరూ నిబంధనలు పాటించినప్పుడే మన నగరాన్ని కాపాడుకోగలమన్నారు. ఈనెల 20 తర్వాత నిబంధనలు సడలిస్తారనగానే ఇప్పటికే రోడ్లపై వాహనాల సంఖ్య భారీగా పెరిగిందంటూ ఈ ధోరణి సరికాదన్నారు. హైదరాబాద్ వంటి మహానగరానికి కొన్ని మినహాయింపులు ఇచ్చినా కష్టమని వివిధ వర్గాలు అభిప్రాయపడుతున్నాయన్నారు. క్లోజ్ కాంటాక్ట్ అనుమానాలతో క్వారంటైన్‌లోని 14 రోజులే కాకుండా ఆ తర్వాత మరో 14 రోజులు కూడా బఫర్ పీరియడ్‌గా పాటిచాలన్నారు. నకిలీ పాసులుంటే క్రిమినల్ కేసులు.. ఎమర్జెన్సీ సేవల పాసులను కొందరు దుర్వినియోగం చేస్తున్నట్లు, నకిలీ పాసులు సృష్టిస్తున్నట్లు ఫిర్యాదులు అందుతున్నాయని, పోలీసు అధికారులతో మాట్లాడి అలాంటి వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేసేలా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సూపర్మార్కెట్లు, కిరాణా దుకాణాల వారు సామాజిక దూరం పాటించే చర్యలు తీసుకోకుంటే సీజ్ చేస్తామన్నారు. ఈ మేరకు ఇప్పటికే వారికి నోటీసులు జారీ చేసినట్లు తెలిపారు. ఇలాంటి వాటిపై ప్రజలు కూడా ఫొటో, వీడియో షేర్ చేస్తూ జీహెచ్ఎంసీకి ఫిర్యాదు చేయవచ్చన్నారు. ధరలు పెరిగాయంటూ హాస్టళ్ల యజమానులు హాస్టళ్లలోని వారిని ఫీజుల కోసం ఒత్తిడి చేస్తున్నట్లు దృష్టికొచ్చిందన్నారు. ప్రభుత్వ శాఖల ద్వారా చౌక ధరలకు అవసరమైన సరుకులందే ఏర్పాట్లు చేస్తామని, ఫీజుల కోసం ఇబ్బంది పెట్టొద్దన్నారు. ఇళ్ల యజమానులు అద్దెలకు ఉంటున్నవారి పరిస్థితిని అర్థం చేసుకొని సహకరించాలని సూచించారు. సహాయం అందని వలస కార్మికులకు అందించే చర్యలు ప్రారంభంఅయ్యాయన్నారు. -
కన్నుల పండువగా కైట్ ఫెస్టివల్
-
హైదరాబాద్ మేయర్‌కు ఆశాభంగం
సాక్షి, హైదరాబాద్: జీహెచ్ఎంసీ మేయర్ బొంతు రామ్మోహన్ అసెంబ్లీలో అడుగు పెట్టాలని ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. కోటిమంది జనాభా అవసరాలు తీర్చే జీహెచ్ఎంసీకి చర్లపల్లి డివిజన్ నుంచి కార్పొరేటర్‌గా ఎన్నికైన ఆయనను మేయర్ పదవి వరించడం తెలిసిందే. జీహెచ్ఎంసీ పాలక మండలి గడువు ఐదేళ్లు ఉన్నప్పటికీ, ఎప్పుడు అసెంబ్లీ ఎన్నికలు జరిగినా, పోటీ చేసి అసెంబ్లీలో ప్రవేశించాలనేది ఆయన కోరిక. ఈ క్రమంలో ఉప్పల్ నియోజకవర్గంపై ఆశలు పెట్టుకున్నారు. ఏ అభివృద్ధి కార్యక్రమం చేపట్టినా ఆ నియోజకవర్గంలో అమలయ్యేలా చూసేవారు. భారీ ఫ్లై ఓవర్లు రానున్న నేపథ్యంలో ట్రాఫిక్ చిక్కులు లేకుండా ఉండేందుకు ప్రత్యామ్నాయ రహదారుల నిర్మాణానికి సైతం ఇటీవలే అధికారులతో కలిసి క్షేత్రస్థాయిలో పర్యటించారు. చెరువుల సుందరీకరణ నుంచి శ్మశానవాటికల అభివృద్ధి తదితర పనులపై దృష్టి సారించారు. నియోజకవర్గంలో ఎక్కువ అభివృద్ధి పనులు చేపట్టడం ద్వారా, ప్రజల మన్ననతో ఎమ్మెల్యేగా ఎన్నికై.. అన్నీ అనుకూలించి, అదృష్టం కలిసివస్తే మంత్రి కూడా కావచ్చని రాజకీయ వర్గాల్లోను ప్రచారం జరిగింది. మున్సిపల్ మంత్రి కేటీఆర్‌తో ఉన్న సాన్నిహిత్యం కూడా అందుకు ఉపకరిస్తుందని పలువురు భావించారు. ఉప్పల్ నియోజకవర్గంపై ఆయన చూపెట్టిన శ్రద్ధను చూసి రాజకీయ వర్గాల్లోనే కాదు.. సర్కిల్లో పనిచేసిన జీహెచ్ఎంసీ అధికారులు సైతం ఆయనకు ఎమ్మెల్యే టిక్కెట్ ఖాయమని భావించారు. కానీ.. గురువారం ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించిన జాబితాలో ఉప్పల్ అభ్యర్థిగా హబ్సిగూడ డివిజన్ కార్పొరేటర్ బేతి స్వప్నారెడ్డి భర్త సుభాష్‌రెడ్డి ఉన్నారు. ఆయన ఆ నియోజకవర్గ టీఆర్ఎస్ ఇన్చార్జిగా ఉండటం తెలిసిందే. దీంతో మేయర్ ఆశలు ఆవిరయ్యాయి. -
బల్దియాకు బహుమానం
సాక్షి, హైదరాబాద్: జీహెచ్ఎంసీలో చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాల కోసం బాండ్ల జారీ ద్వారా రూ.200 కోట్లు సేకరించినందుకు ప్రోత్సాహకంగా రూ.26 కోట్ల చెక్కును ప్రధాని మోదీ.. మేయర్ బొంతు రామ్మోహన్, కమిషనర్ బి.జనార్దన్‌రెడ్డికి అందజేశారు. లక్నోలో శనివారం 2 రోజుల ‘ట్రాన్స్ఫార్మింగ్ అర్బన్ ల్యాండ్ స్కేపింగ్’ సదస్సు ముగింపు సందర్భంగా అమృత్ పథకం కింద ఈ బహుమతిని, ప్రత్యేక ప్రశంసాపత్రాన్ని అందజేశారు. మేయర్, కమిషనర్.. ప్రధానికి స్వచ్ఛ నమ స్కారం అంటూ గౌరవిస్తూ ప్రత్యేకత చూపారు. యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్, కేంద్ర మం త్రులు రాజ్‌నాథ్ సింగ్, హరిదీప్‌సింగ్, గవర్నర్ రాంలాల్ ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ‘సింగం చెరువు’ లబ్ధిదారుతో ప్రధాని భేటీ హైదరాబాద్‌లోని సింగం చెరువు తండా డబుల్ బెడ్రూం ఇళ్ల కాలనీలో ఇల్లు పొందిన గిరిజన మహిళ జ్యోతితో ప్రధాని సమావేశమయ్యారు. కూలి చేసుకునే తమకు రాష్ట్ర ప్రభుత్వం డబుల్ బెడ్రూం ఇంటిని నిర్మించి ఉచితంగా ఇచ్చిందని తెలిపింది. గుడిసెలో ఉన్నప్పుడు ఎండ, వానలకు ఇబ్బందులను ఎదుర్కొనేవారమని.. ఇప్పుడు తమ కుటుంబం సంతోషంగా ఉందని చెప్పింది. సూచన పాటించారు.. బహుమతి పొందారు స్థానిక సంస్థలు.. ముఖ్యంగా మునిసిపల్ కార్పొరేషన్లు స్వయం సమృద్ధికి బాండ్ల జారీ ద్వారా నిధు లు సమీకరించుకోవాలని, దీనికి తెలంగాణ ప్రభు త్వం చొరవ చూపాలని మెట్రోరైలు ప్రారంభోత్స వానికి నగరానికి వచ్చిన ప్రధాని.. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్‌కు సూచించారు. దీంతో మంత్రి బాండ్ల ద్వారా నిధులు సేకరించాలని జీహెచ్ఎంసీ ని ఆదేశించారు. నగరంలో చేపట్టనున్న ఎస్సార్డీపీ, డబుల్ బెడ్రూమ్ ఇళ్ల కోసం వెయ్యి కోట్లు సేకరించాలనే లక్ష్యంతో కృషి చేసి సఫలమయ్యారు. పుణే తర్వాత జీహెచ్ఎంసీ మాత్రమే బాండ్ల ద్వారా నిధులు సేకరించాయి. జీహెచ్ఎంసీలోని ఆర్థిక క్రమశిక్షణ, ఆస్తులు, వనరులు తదితరమైన వాటిని పరిగణనలోకి తీసుకున్న పలు సంస్థలు వెయ్యి కోట్లకు పైగా నిధులిచ్చేందుకు ముంబై స్టాక్ ఎక్సే్ఛంజ్‌లో పోటీలు పడ్డాయి. తొలిదశలో ఎస్సార్డీపీ పనులకు రూ.200 కోట్లు సేకరించారు. సొంతంగా నిధులు సేకరించే స్థానిక సంస్థలకు ప్రోత్సాహకంగా బాండ్ల ద్వారా తీసుకున్న మొత్తానికి వడ్డీని కేంద్రమే అందజేయాలని కేటీఆర్ కోరారు. ఈ మేరకు సీఎస్ ఎస్కే జోషి కేంద్రానికి ప్రతిపాదనలు సమర్పించారు. సుముఖత వ్యక్తం చేసిన కేంద్రం జీహెచ్ఎంసీని ఇందుకు ఎంపిక చేసింది. ప్రజోపయోగానికి రూ. 26 కోట్లు... జీహెచ్ఎంసీ బాండ్ల రూపంలో నిధులను సేకరించినందున కేంద్రం ప్రోత్సాహకంగా అందజేసిన రూ.26 కోట్లను వినూత్న కార్యక్రమాలకు ఉపయోగించాలని కేటీఆర్ సూచించారు. దీంతో ప్రత్యేక ప్రజోపయోగ కార్యక్రమానికి ఈ నిధులు వినియోగించాలని, దీనికి ప్రజాభిప్రాయాన్నీ సేకరించనున్నట్లు కమిషనర్ జనార్దన్‌రెడ్డి పేర్కొన్నారు. -
కాంగ్రెస్ నేతలు దద్దమ్మలు: మేయర్ రామ్మోహన్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ హక్కులకోసం మాట్లాడలేని కాంగ్రెస్ నేతలు దద్దమ్మలని నగర మేయర్ బొంతు రామ్మోహన్, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు విమర్శించారు. సోమవారం వారు ఇక్కడ విలేకరులతో మాట్లాడుతూ, ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ కమిటీ తీసుకున్న నిర్ణయంతో రాష్ట్రంలో పరిశ్రమల ఏర్పాటుకు ఇబ్బందులు వస్తాయన్నారు. ఏపీకి హోదా, పరిశ్రమలకు రాయితీలు ఇస్తే తెలంగాణ పరిస్థితి ఏమిటని ప్రశ్నిం చారు. మంత్రి కేటీఆర్‌పై రూపొందించిన పాటల సీడీని వారు ఆవిష్కరించారు. -
ట్రాఫిక్ సమస్యల పరిష్కారానికి కృషి: సీఎస్
సాక్షి, హైదరాబాద్: నగరంలో ట్రాఫిక్, పార్కింగ్ సమస్యల పరిష్కారానికి మల్టీలెవల్ పార్కింగ్ కాంప్లెక్స్‌ల నిర్మాణాలు చేపట్టాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్కే జోషి తెలిపారు. బుధవారం సచివాలయంలో నగర మేయర్ బొంతురామ్మోహన్‌తో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎస్ మాట్లాడుతూ హైదరాబాద్‌లో ట్రాఫిక్ సమస్య పరిష్కారం కోసం, ప్రభుత్వ, ప్రైవేటు స్థలాల్లో మల్టీలెవల్ పార్కింగ్ కాంప్లెక్స్ నిర్మాణ ప్రతిపాదనలపై ట్రాఫిక్ నిపుణులతో అధ్యయనం చేయించాలన్నారు. 100–500 గజా ల్లోపు స్థలాల్లో చైన్ పార్కింగ్ ఏర్పాటు అంశాన్ని పరిశీలించాలని బొంతురామ్మోహన్ అన్నారు. çసమీక్షలో ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శి శివశంకర్, లా సెక్రటరీ నిరంజన్‌రావు, రంగారెడ్డి కలెక్టర్ రఘునందన్‌రావు తదితరులు పాల్గొన్నారు. -
కార్పొరేషన్లకు నిధులు విడుదల చేయాలి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని కార్పొరేషన్లకు నిధులను విడుదల చేయాలని మేయ ర్లు రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. సోమవారం హరిత ప్లాజాలో రాష్ట్ర ఆర్థిక సంఘం అధ్యక్షు డు జి.రాజేశంగౌడ్ ఆధ్వర్యంలో కార్పొరేషన్ల మేయర్లు, కమిషనర్ల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా పలువురు మేయర్లు మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వ యాజమాన్యాలు, ఫ్యాక్టరీలు, తదితర సంస్థల నుంచి నూరు శాతం ఆస్తి పన్ను వసూలుకు ప్రభుత్వం కార్పొరేషన్లకు అనుమతివ్వాలని కోరారు. పట్టణ స్థానిక సంస్థలు తమ నివేదికల్ని రాష్ట్ర ఆర్థిక కమిషన్‌కు పంపించాలని, అందుకనుగుణంగా ప్రభుత్వానికి సిఫారసు చేస్తామని రాజేశంగౌడ్ చెప్పారు. కార్యక్రమంలో జీహెచ్ఎంసీ మేయర్ బొంతు రామ్మోహన్, వరంగల్, కరీంనగర్, రామగుండం, నిజామాబాద్, ఖమ్మం కార్పొరేషన్ల మేయర్లు ఎన్.నరేందర్, సర్దార్ రవీందర్‌సింగ్, లక్ష్మీనారాయణ, సుజాత శ్రీశైలం, డాక్టర్ పాపాలాల్, మునిసిపల్ పరిపాలన డైరెక్టర్ టీకే శ్రీదేవి, జీహెచ్ఎంసీ అడిషనల్ కమిషనర్(ఫైనాన్స్) జయరాజ్ కెన్నెడి, ఆ కార్పొరేషన్ల కమిషనర్లు వీపీ గౌతమ్, కె.శశాంక, డి.జాన్ శాంసన్, సందీప్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
కార్పొరేటర్లతో మేయర్ సమీక్ష
హైదరాబాద్: రానున్న వర్షాకాలం నేపథ్యంలో తీసుకోవాల్సిన చర్యలు, ఎస్ఆర్డీపీ, డబుల్ బెడ్ రూం, రోడ్ల వెడల్పు, ఎలివేటెడ్ కారిడార్ అంశాలపైన మేయర్ బొంతు రాంమోహన్ సమీక్ష సమావేశం చేపట్టారు. జీహెచ్ఎంసీ ఎల్ బీ నగర్, సరూర్‌నగర్, హయత్ నగర్ సర్కిళ్ల కార్పొరేటర్లు, వార్డు కమిటీ సభ్యులతో కొత్తపేట్‌లోని సాయి గార్డెన్లో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ..సరూర్ నగర్ కోదండరామ నగర్ లో డ్రైనేజి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపిస్తామన్నారు. శారదానగర్ లో డ్రైనుల విస్తరణకు ప్రతిపాదనలు రూపొందించాలని ఆదేశాలిచ్చారు. వనస్థలిపురం రైతు బజార్ వద్దనున్న గుడిసెల స్థలాల్లో డబుల్ బెడ్ రూంల నిర్మాణాలకు వారం రోజుల్లో శంకుస్థాపన చేస్తామని తెలిపారు. హయత్ నగర్, బిఎన్ రెడ్డి డివిజన్లలోని శ్మశాన వాటికలను ఆధునికరణ చేస్తామన్నారు. -
జీహెచ్ఎంసీ బడ్జెట్ రూ.5,643 కోట్లు
- ఆమోదించిన స్టాండింగ్ కమిటీ - డబుల్ బెడ్రూం ఇళ్లకు రూ.400 కోట్లు సాక్షి, హైదరాబాద్: వచ్చే ఆర్థిక సంవత్సరం 2017-18కి సంబంధించి రూ.5,643 కోట్ల బడ్జెట్‌కు జీహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీ ఆమోదం తెలిపింది. శుక్రవారం మేయర్ బొంతు రామ్మోహన్ అధ్యక్షతన జరిగిన కమిటీ సమావేశంలో విస్తృత చర్చల అనంతరం ముసాయిదా బడ్జెట్‌ను యథాతథంగా ఆమోదిస్తూ, జనరల్బాడీకి పంపించాలని తీర్మానించారు. అనంతరం ప్రభుత్వ ఆమోదం లాంఛనప్రాయమే. ఈసారి ఆదాయం, ఖర్చుల అమలు తీరెలా ఉన్నప్పటికీ భారీ బడ్జెట్‌ను ఆమోదించారు. ప్రస్తుతం నడుస్తున్న ఈ ఆర్థిక సంవత్సర బడ్జెట్ సైతం రూ.5,600 కోట్లతో భారీగా ఉన్నప్పటికీ ఇంతవరకు ఇందులో రూ.1,500 కోట్లు కూడా ఖర్చు చేయలేకపోయారు. ఈ ఆర్థిక సంవత్సరానికి ప్రభుత్వం నుంచి రావాల్సిన గ్రాంట్లు తదితరమైనవి రాకున్నా వచ్చే ఆర్థిక సంవత్సరానికి సైతం భారీగానే ప్రతిపాదించారు. వాటి ని బడ్జెట్లో ఉంచడం సాంకేతిక అంశమని, అవి ఎలాగూ రావాల్సిన నిధులేనని, తప్పనిసరిగా వస్తాయని మేయర్ తెలిపారు. రాబోయే బడ్జెట్లోని రెవెన్యూ ఆదాయంలో అత్యధిక భాగం 29 శాతం రూ.1,611.45కోట్లు నగరంలో అధ్వాన్నంగా ఉన్న రోడ్లకు కేటారుుంచారు. రూ.400కోట్లు పేదల డబుల్ బెడ్రూం ఇళ్లకు, డ్రైనేజీలకి రూ.249.8 కోట్లు కేటారుుంచారు. ఆస్తిపన్ను తదితర ట్యాక్సుల ద్వారా ఆదాయం పెంచుకునేందుకు అన్ని మార్గాలనూ వినియోగించుకుంటామని కమిషనర్ జనార్దన్‌రెడ్డి చెప్పారు. -
రోడ్ల పనులను పరిశీలించిన మేయర్
-
నగరవాసులు అప్రమత్తంగా ఉండాలి
-
నేడే మహా నిమజ్జనపర్వం..
-
నకిలీ బిచ్చగాళ్లపై క్రిమినల్ కేసులు
- నగర మేయర్ బొంతు రామ్మోహన్ చిక్కడపల్లి: నకిలీ బిచ్చగాళ్లపై క్రిమినల్ కేసులు పెట్టేందుకు వెనుకాడేదిలేదని నగర మేయర్ బొంతు రామ్మోహన్ హెచ్చరించారు. ఫెడరేషన్ ఆఫ్ ఎన్జీవోస్ ఫర్ బెగ్గర్ ఫ్రీ సొసైటీ ఆధ్వర్యంలో ఆదివారం ఆర్టీసీ క్రాస్ రోడ్డులో యాచకులు లేని నగరంగా హైదరాబాద్‌ను చీర్చిదిద్దాలని ఫ్లకార్డు, బ్యానర్లు పట్టుకొని ప్రచారం నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న మేయర్ బొంతు రామ్మోహన్ మాట్లాడుతూ నిజమైన యాచకులకు ఉపాధి కల్పించి, వారి జీవన స్థితిగతులను మెరుగు పర్చేందుకు కృషిచేస్తామని తెలిపారు. నగరంలో 10వేల మంది బిచ్చగాళ్లు ఉండగా కేవలం 400మంది మాత్రమే నిజమైన యాచకులుగా సర్వేలో తేలిందని, నకిలీలంతా నగరాన్ని వదిలిపెట్టి వెళ్లకపోతే కేసులు తప్పవన్నారు. కార్యక్రమంలో స్థానిక గాంధీనగర్, హిమాయత్‌నగర్ కార్పొరేటర్లు ముఠా పద్మ, హేమలత, టీఆర్ఎస్ నాయకులు, కార్యక్రమ నిర్వాహక సంస్థ వ్యవస్థాపకులు శంకర్‌నారాయణ, చైర్మన్ జి.రామయ్య, నిర్వాహక కార్యదర్శి రాములు తదితరులు పాల్గొన్నారు. -
'ఫొటో షూట్ కోసమే హెల్మెట్ తీశారు'
హైదరాబాద్: నగరంలోని పారిశుద్ధ్య కార్యకలాపాలను ఆకస్మిక పర్యటనల ద్వారా పరిశీలిస్తున్న నగర ప్రథమ పౌరుడు బొంతు రామ్మోహన్ బుధవారం రాత్రి హెల్మెట్ లేకుండా వాహనం నడిపారంటూ కొన్ని మీడియాలతో పాటు సోషల్‌మీడియాలోనూ హల్చల్ జరిగింది. అందుకు సంబంధించిన ఫొటో సైతం ప్రత్యక్షమైంది. వీటిని పరిగణలోకి తీసుకున్న నగర ట్రాఫిక్ విభాగం అధికారులు హెల్మెట్ లేకుండా వాహనం నడిపినందుకు మేయర్‌కు ఈ-చలాన్ ద్వారా రూ.100 జరిమానా విధించడానికి సిద్ధమయ్యారు. అయితే గురువారం మధ్యాహ్నం ఈ అంశంపై ట్రాఫిక్ పోలీసులకు వివరణ ఇచ్చిన మేయర్ కార్యాలయం రామ్మోహన్ హెల్మెట్ పెట్టుకునే వాహనం నడిపారని పేర్కొంది. కేవలం ఫొటో షూట్ కోసమే ఆయన హెల్మెట్ తీశారంటూ అందుకు సంబంధిచిన ఫొటోలను ట్రాఫిక్ పోలీసులకు అందించింది. కొందరు పాత్రికేయులు చేసిన విజ్ఞప్తి మేరకు కేవలం ఫొటో కోసమే తాను తాత్కాలికంగా హెల్మెట్‌ను తీసినట్లు తెలిపారు. వీటిని పరిగణలోకి తీసుకున్న నేపథ్యంలో మేయర్‌కు పంపాలని భావించిన ఈ-చలాన్‌ను రద్దు చేసినట్లు ట్రాఫిక్ విభాగం డీసీపీ-2 ఏవీ రంగనాథ్ ‘సాక్షి’కి తెలిపారు. -
ఆస్తి పన్నుపై వడ్డీ మాఫీ
జీహెచ్ఎంసీ మేయర్ బొంతు రామ్మోహన్ వెల్లడి 6.24 లక్షల కుటుంబాలకు ఊరట రూ. 532.57 కోట్ల మేర లబ్ధి సాక్షి, హైదరాబాద్: గ్రేటర్‌వాసులకు శుభవార్త! ఆస్తి పన్నుపై వడ్డీని మాఫీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఫలితం గా నగరంలోని 6.24లక్షల కుటుంబాలకు ఊరట లభించనుంది. తద్వారా రూ.532.57 కోట్ల మేర లబ్ధి చేకూరనుంది. నగర మేయర్ బొంతు రామ్మోహన్ సోమవారం జీహెచ్ఎంసీలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు. జీెహ చ్ఎం సీ ప్రధాన ఆదాయ మార్గాల్లో ఆస్తి పన్ను ముఖ్యమైనప్పటికీ ప్రజలకు మేలు కలిగించేందుకు ప్రభుత్వం ఈ నెల 20న ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. మొత్తం మీద జీహెచ్ఎంసీకి రూ.2,078 కోట్ల ఆస్తిపన్ను రావాల్సి ఉందన్నారు. అందులో రూ.619.39కోట్ల బకాయిలకు రూ.474.33 కోట్లు, ప్రస్తుతం రావాల్సిన రూ.1,029.28 కోట్ల ఆస్తి పన్నులో రూ.58.24 కోట్ల వడ్డీ మాఫీ అయిందన్నారు. ఈ ఆర్థిక సంవత్సరం ఎవరైనా తమ ఆస్తిపన్ను వడ్డీతో సహా చెల్లిస్తే ఆ వడ్డీని వచ్చే పన్నులో మినహాయిస్తామన్నారు. జీహెచ్ఎంసీకి ప్రభుత్వ శాఖలు సుమారు రూ.170 కోట్లు బకాయి పడ్డాయని, వాటి వసూలు కోసం ఆయా శాఖల ఉన్నతాధికారులతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేస్తామన్నారు. ఏపీ సచివాలయం, ఇతర ప్రభుత్వ భవనాల ఆస్తి పన్నుకు సంబంధించిన రాష్ట్ర చీఫ్ సెక్రటరీ, సంబంధిత కార్యదర్శులతో సమావేశం నిర్వహిస్తామన్నారు. నగరాభివృద్ధికి సహకరించండి నగర అభివృద్ధి ప్రజల భాగస్వామ్యంతోనే సాధ్యమని, సకాలంలో పన్నులు చెల్లించి అందుకు సహకరించాలని మేయర్ కోరారు. వడ్డీ మాఫీ చేసినందున బకాయిదారులు వెంటనే ఆస్తి పన్ను చెల్లించి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. జీహెచ్ఎంసీ సర్కిల్ కార్యాలయాల్లో ఆదివారం నిర్వహించిన ప్రాపర్టీ ట్యాక్స్ పరిష్కారంలో సుమారు 707 ఫిర్యాదులు రాగా అందులో 64 అక్కడిక్కడే పరిష్కరించామన్నారు. జీహెచ్ఎంసీ కమిషనర్ బి.జనార్థన్‌రెడ్డి, అడిషనల్ కమిషనర్ శంకరయ్య పాల్గొన్నారు. ఇతర పురపాలికల్లోనూ... గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ)తో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, నగర పంచాయతీల్లో ఆస్తిపన్నులపై ఉన్న వడ్డీని మాఫీ చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఈ నెల 20న రాష్ట్ర పురపాలన, పట్టణాభివృద్ధి శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్వి ఎంజీ గోపాల్ ఉత్తర్వులు జారీ చేశారు. 2015-16 ఆర్థిక సంవత్సరం ముగింపు వరకు ( ఈ మార్చి 31 దాకా) ఉన్న ఆస్తిపన్నుల అసలు చెల్లిస్తేనే ఈ వడ్డీ మాఫీ వర్తిస్తుందని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఇప్పటికే ఎవరైనా ఆస్తిపన్ను, వడ్డీ చెల్లించి ఉంటే ఆ వడ్డీ మొత్తాన్ని వచ్చే ఆర్థిక సంవత్సరంలో చెల్లించాల్సిన పన్నుల్లో సర్దుబాటు చేయనున్నారు. -
ఎన్నిక ఏకగ్రీవం
* జీహెచ్ఎంసీ మేయర్‌గా బొంతు రామ్మోహన్ * డిప్యూటీ మేయర్‌గా ఫసియుద్దీన్ సాక్షి, హైదరాబాద్: జీహెచ్ఎంసీ మేయర్‌గా బొంతు రామ్మోహన్, డిప్యూటీ మేయర్‌గా బాబా ఫసియుద్దీన్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. గురువారం ఉదయం కొత్తగా ఎన్నికైన కార్పొరేటర్ల ప్రమాణ స్వీకార కార్యక్రమం.. ఆ వెంటనే మేయర్, డిప్యూటీ మేయర్ల ఎన్నిక నిర్వహించారు. మేయర్, డిప్యూటీ మేయర్‌కు వీరిద్దరు తప్ప వేరెవరూ పోటీలో లేకపోవడంతో ఎన్నిక ఏకగ్రీవమైనట్టు ప్రిసైడింగ్ అధికారిగా వ్యవహరించిన హైదరాబాద్ కలెక్టర్ రాహుల్ బొజ్జా ప్రకటించారు. వారిద్దరికీ ఎంఐఎం కూడా మద్దతు ప్రకటించింది. దాన్ని కూడా అధికారులు రికార్డు చేశారు. కొత్త కార్పొరేటర్ల ప్రమాణ స్వీకారం, మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నిక కార్యక్రమం అరగంట లోపే పూర్తయింది. తొలుత ప్రమాణం.. తర్వాత ఎన్నిక ఉదయం 11 గంటలకు జీహెచ్ఎంసీ కౌన్సిల్ హాల్లో ఈ కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. 11.10 నిమిషాలకు సమావేశానికి సరపడా కోరం ఉన్నట్లు ప్రకటించిన ప్రిసైడింగ్ అధికారి.. కొత్తగా ఎన్నికైన కార్పొరేటర్లతో ప్రమాణ స్వీకారం చేయించారు. మొత్తం నాలుగు భాషల్లో ఈ కార్యక్రమం నిర్వహించారు. తొలుత తెలుగులో అనంతరం ఉర్దూ, హిందీ, ఇంగ్లిషుల్లో ప్రమాణం చేయాలనుకున్న వారితో ప్రమాణం చేయించారు. కార్పొరేటర్లు, ఎక్స్అఫీషియో సభ్యులు మొత్తం 217 మంది ఉండగా, 109 మందికి పైగా ఉన్నట్లు నిర్ధారించుకున్నాక కోరం ఉన్నట్లు ప్రకటించారు. ప్రమాణ స్వీకారం ముగిశాక తొలుత మేయర్ ఎన్నిక నిర్వహించారు. మేయర్‌గా చర్లపల్లి డివిజన్ కార్పొరేటర్ బొంతు రామ్మోహన్ పేరును వెంకటేశ్వర కాలనీ డివిజన్ కార్పొరేటర్ మన్నె కవితారెడ్డి ప్రతిపాదించగా, మీర్‌పేట హెచ్‌బీకాలనీ డివిజన్ కార్పొరేటర్ గొల్లూరి అంజయ్య బలపరిచారు. మేయర్ పదవికి ఇంకెవరూ పోటీలో లేకపోవడంతో రామ్మోహ న్ ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ప్రకటించారు. తర్వాత డిప్యూటీ మేయర్‌గా బోరబండ డివిజన్ కార్పొరేటర్ బాబా ఫసియుద్దీన్ పేరును అమీర్‌పేట కార్పొరేటర్ శేషుకుమారి ప్రతిపాదించగా, రామ్‌నగర్ డివిజన్ కార్పొరేటర్ శ్రీనివాస్‌రెడ్డి బలపరిచారు. ఇంకెవరూ పోటీలో లేకపోవడంతో ఆయన ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ప్రిసైడింగ్ అధికారి ప్రకటించారు. వెంటనే అహ్మద్‌నగర్ కార్పొరేటర్ అయేషా రూబినా(ఎంఐఎం) లేచి.. మేయర్, డిప్యూటీ మేయర్లకు తమ పార్టీ మద్దతిస్తున్నట్లు ప్రకటించారు. ఆమె లేవగానే తొలుత పోటీకి వేరే పేరు ప్రతిపాదిస్తారేమోనని కొందరు భావించారు. కానీ తాము కూడా మద్దతిస్తున్నట్లు చెప్పడంతో అధికారులు దాన్ని రికార్డు చేశారు. మేయర్, డిప్యూటీ మేయర్లుగా ఎన్నికైన రామ్మోహన్, ఫసియుద్దీన్లకు ప్రిసైడింగ్ అధికారి ధ్రువీకరణ పత్రాలు అందజేశారు.44 మంది ఎక్స్ అఫీషియోలు హాజరు మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నిక కార్యక్రమానికి మొత్తం 150 మంది కార్పొరేటర్లు హాజరుకాగా 67 మంది ఎక్స్అఫీషియో సభ్యులకుగాను 44 మంది మాత్రమే హాజరయ్యారు. లోక్‌సభ ఎంపీల్లో కొత్త ప్రభాకర్‌రెడ్డి ఒక్కరే హాజరయ్యారు. రాజ్యసభ సభ్యులెవరూ రాలేదు. 26 మంది ఎమ్మెల్సీలు, 17 మంది ఎమ్మెల్యేలు హాజరయ్యారు. టీడీపీ, కాంగ్రెస్‌లకు చెందిన ఎక్స్ అఫీషియో సభ్యులెవరూ రాలేదు. ఎక్స్ అఫీషియో సభ్యులుగా ఉన్న డిప్యూటీ సీఎం మహమూద్ అలీ, మంత్రులు నాయిని నరసింహారెడ్డి, పద్మారావు, తలసాని తదితరులు హాజరయ్యారు. ఎన్నికల పరిశీలకులు అశోక్‌కుమార్, జీహెచ్ఎంసీ కమిషనర్ బి.జనార్దన్‌రెడ్డి, అదనపు కమిషనర్ (ఎన్నికలు) సురేంద్రమోహన్ ఇతర అధికారులు హాజరయ్యారు. కొత్తగా ఎన్నికైన మేయర్, డిప్యూటీ మేయర్‌ను కార్పొరేటర్లు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, మంత్రులు అభినందించారు. కొత్తగా ఎన్నికైన కార్పొరేటర్లు జీహెచ్ఎంసీ కమిషనర్ జనార్దన్‌రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. మేయర్ ప్రొఫైల్ పేరు: బొంతు రామ్మోహన్ (42) తండ్రి: బొంతు వెంకటయ్య భార్య: శ్రీదేవి; కుమార్తెలు: కుజిత, ఉషశ్రీ విద్యార్హతలు: ఎంఏ, ఎల్ఎల్బీ రాజకీయ అరంగేట్రం: 2001, టీఆర్ఎస్ ఆవిర్భావం నుంచి.. నిర్వహించిన పదవులు, నేపథ్యం: టీఆర్ఎస్ విద్యార్థి, యువజన విభాగం రాష్ట్రశాఖ అధ్యక్షుడిగా పనిచేశారు. ఓయూ విద్యార్థి సంఘం నాయకుడిగా గుర్తింపు. ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావులకు సన్నిహితుడిగా పేరుంది. డిప్యూటీ మేయర్ ప్రొఫైల్ పేరు: బాబా ఫసియుద్దీన్(34) విద్య: బీకాం భార్య: హబీబా సుల్తానా పిల్లలు: కుమార్తె, కుమారుడు తండ్రి: బాబా షరీఫుద్దీన్ తల్లి: రజియా ఫాతిమా రాజకీయ అనుభవం: 2001లో టీఆర్ఎస్లో చేరిన బాబా పార్టీ విద్యార్థి విభాగం గ్రేటర్ ప్రధాన కార్యదర్శిగా పనిచేసి, ప్రస్తుతం అధ్యక్షుడిగా ఉన్నారు. తెలంగాణ ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్నారు. -
నగర ప్రథమ పౌరుడు మనోడే
మేయర్‌గా చర్లపల్లి కార్పొరేటర్ బొంతు రామ్మోహన్ సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: గ్రేటర్ మేయర్ పదవి మన జిల్లాకే దక్కింది. జిల్లాలోని చర్లపల్లి డివిజన్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న బొంతు రామ్మోహన్ నగర ప్రథమపౌరుడిగా గురువారం బాధ్యతలు దక్కించుకున్నారు. గతంలో మేయర్‌గా వ్యవహరించిన తీగల కృష్ణారెడ్డిది సరూర్‌నగర్ మండలం మీర్‌పేట స్వగ్రామం కాగా, బొంతు రామ్మోహన్‌ది వరంగల్ జిల్లా. అయితే, ఎన్నికలకు ముందు ఆయన చర్లపల్లికి మకాం మార్చారు. ఈ క్రమంలోనే మేయర్ పదవిని కట్టబెట్టాలని భావించిన టీఆర్ఎస్ నాయకత్వం ఆయనకు కార్పొరేటర్ టికెట్ కేటాయించింది. ఈ ఎన్నికల్లో ఆయన విజయ బావుటా ఎగురవేశారు. టీఆర్ఎస్ విశ్లేషకుల ఊహలకందని స్థాయిలో సీట్లను చేజిక్కించుకుంది. ఈ క్రమంలో మేయర్ కుర్చీ ఆయనకు లభించింది. విద్యార్థి నాయకుడిగా తెలంగాణ ఉద్యమంలో బొంతు కీలక భూమిక పోషించారు. యువతకు పెద్దపీట వేయాలని భావించిన సీఎం కేసీఆర్.. యువనేతగా రాణించిన రామ్మోహన్‌కు నగర పాలనాపగ్గాలు అప్పజెప్పారు. -
ఉద్యమ నేతలకు మహా కిరీటం
మేయర్‌గా బొంతు రామ్మోహన్ డిప్యూటీ మేయర్‌గా బాబా ఫసియుద్దీన్ కొలువుదీరిన కొత్త పాలక మండలి తెలంగాణ ఉద్యమాన్ని కదం తొక్కించిన ఇద్దరు నేతలకు ‘మహా’ అవకాశం. ఒకరికి మేయర్‌గా... మరొకరికి డిప్యూటీ మేయర్‌గా పట్టాభిషేకం. ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన అపూర్వ బహుమానం.మేయర్ బొంతు రామ్మోహన్... డిప్యూటీ మేయర్ బాబా ఫసియుద్దీన్... ఇద్దరిదీ ఉద్యమ నేపథ్యమే. టీఆర్ఎస్ విద్యార్థి, యువజన విభాగం రాష్ట్ర శాఖ అధ్యక్షునిగా రామ్మోహన్ పని చేశారు. ఓయూ విద్యార్థి సంఘ నాయకుడిగా గుర్తింపు పొందారు. ఇక ఫసియుద్దీన్ గతంలో టీఆర్ఎస్ విద్యార్థి విభాగం గ్రేటర్ ప్రధాన కార్యదర్శిగా పని చేశారు. ప్రస్తుతం అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్నారు. సిటీబ్యూరో: జీహెచ్ఎంసీ 25వ మేయర్‌గా బొంతు రామ్మోహన్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.తెలంగాణ రాష్ట్రంలో తొలి మేయర్‌గా ఆయన గుర్తింపు పొందారు. 26వ డిప్యూటీ మేయర్‌గా బాబా ఫసియుద్దీన్ కూడా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. గురువారం నిర్వహించిన ఎన్నికల్లో ఇతర పార్టీల నుంచి కానీ, ఇతర అభ్యర్థుల నుంచి కానీ నామినేషన్లు రాకపోవడంతో వీరు ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ఎన్నికల ప్రిసైడింగ్ అధికారి, హైదరాబాద్ జిల్లా కలెక్టర్ రాహుల్ బొజ్జా ప్రకటించారు. తెలంగాణ ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్న ఇద్దరు యువకులు.. రాష్ట్ర ఆవిర్భావం తరువాత జరిగిన తొలి ఎన్నికల్లో కార్పొరేటర్లుగా గెలుపొంది... ఏకగ్రీవంగా మేయర్, డిప్యూటీ మేయర్లుగా ఎన్నిక వడం విశేషం. వీరి ఎన్నికపై టీఆర్ఎస్ పార్టీలోనూ అభ్యంతరాలు రాకపోవడమే కాక... నిజమైన ఉద్యమ వీరులకు సముచిత స్థానం లభించిందని పలువురు అభివర్ణించారు. నేడు బాధ్యతల స్వీకరణ జీహెచ్ఎంసీ నూతన మేయర్ బొంతు రామ్మోహన్ శుక్రవారం మధ్యాహ్నం 12.40 గంటలకు బాధ్యతలు స్వీకరించనున్నారు. ఉదయం 11 గంటలకు డిప్యూటీ మేయర్ బాబా ఫసియుద్దీన్ బాధ్యతలు చేపడతారు. ముగిసిన స్పెషలాఫీసర్ పాలన.. జీహెచ్ఎంసీలో స్పెషలాఫీసర్ పాలన ముగిసింది. గత పాలక మండలి గడువు 2014 డిసెంబర్ 3తో ముగియగా...ఆ మరుసటి రోజు (4న) నుంచి స్పెషలాఫీసర్ పాలన అమల్లోకి వచ్చింది. స్పెషలాఫీసర్‌గా బాధ్యతలు చేపట్టిన అప్పటి కమిషనర్ సోమేశ్‌కుమార్ గత అక్టోబర్ 30న బదిలీ అయ్యారు. అక్టోబర్ 31న బాధ్యతలు చేపట్టిన డా.బి.జనార్దన్‌రెడ్డి కమిషనర్‌గా, స్పెషలాఫీసర్‌గా కొనసాగుతున్నారు. కొత్త పాలకమండలి రావడంతో ఇకపై ఆయన కమిషనర్‌గానే కొనసాగనున్నారు. -
కొత్త మేయర్ నేపథ్యం ఇదీ
హైదరాబాద్: గ్రేటర్ మేయర్‌గా పదవి చేపట్టిన బొంతు రామ్మోహన్ సాధారణ కుటుంబంలో జన్నించి అంచెలంచెలుగా ఎదిగారు. వరంగల్ జిల్లా కురవి మండలం నేరడకు చెందిన బొంతు వెంకటయ్య, కమలమ్మ దంపతులకు ఇద్దరు కుమార్తెలు ఉండగా, ఏకైక కుమారుడు రామ్మోహన్. ఒకటి నుంచి ఐదో తరగతి వరకు ఆమనగల్లో చదువుకున్న ఆయన ఆరు నుంచి ఎనిమిదో తరగతి వరకు కురవి మండలం నేరడలో పూర్తి చేశారు. ఆ తర్వాత మానుకోటలోని కంకరబోడ్ హైస్కూల్లో 9వ తరగతి, ఎస్సెస్సీ, జూనియర్ కళాశాలలో ఇంటర్ పూర్తి చేశారు. ఇక జిల్లా కేంద్రంలోని ఆదర్శ కళాశాలలో డిగ్రీ, ఎల్ఎల్బీ చదివిన రామ్మోహన్, ఎంఏ, ఎల్ఎల్ఎం హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీలో చేశారు. హైదరాబాద్ అమీర్‌పేటకు చెందిన జంగాల శ్రీదేవిని వివాహం చేసుకున్న రామ్మోహన్‌కు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. తొలుత ఏబీవీపీలో.. తొలుత ఏబీవీపీలో పనిచేసిన బొంతు రామ్మోహన్ 2002లో టీఆర్ఎస్ యువజన విభాగం రాష్ర్ట అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టారు. ఇక అప్పటి నుంచి టీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌కు నమ్మకస్తుడిగా, పార్టీకి విధేయుడిగా ఉన్న ఆయన క్రియాశీలక నేతగా ఎదిగారు. ప్రస్తుతం జీహెచ్ఎంసీ ఎన్నికల్లో చర్లపల్లి డివిజన్ నుంచి ఆయన కార్పొరేటర్‌గా ఎన్నిక కాగా, పార్టీకి చేసిన సేవలను గుర్తించి మేయర్ అభ్యర్థిగా సీఎం కేసీఆర్ ఎంపిక చేశారు. ఈ విషయం తెలియగానే అటు కురవి, ఇటు మానుకోట మండలాలతో పాటు జిల్లావ్యాప్తంగా పలువురు హర్షం వ్యక్తం చేశారు. ఆయనతో పాటు చదువుకున్న వారు, టీఆర్ఎస్ నాయకులు పలువురు రామ్మోహన్ ఎంపికపై హర్షించారు. మహబూబాబాద్ సబ్ రిజిస్ట్రార్ హరికోట్ల రవి మాట్లాడుతూ రామ్మోహన్‌తో కలిసి తాను ఉస్మానియాలో పీజీ చదువుకున్నానని గుర్తు చేశారు. చదువుకునే సమయంలో విద్యార్థుల సమస్యలపై ఎప్పటికప్పుడు స్పందించేవారని తెలిపారు. -
హైదరాబాద్ మేయర్‌గా రామ్మోహన్
హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ కొత్త మేయర్‌గా బొంతు రామ్మోహన్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. గురువారం గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ సమావేశంలో మేయర్‌గా రామ్మోహన్‌ను, డిప్యూటీ మేయర్‌గా బాబా ఫసియుద్దీన్లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో భారీ మెజార్టీ సాధించిన టీఆర్ఎస్ మేయర్, డిప్యూటీ మేయర్ పదవులు రెండింటినీ కైవసం చేసుకుంది. జీహెచ్ఎంసీలోని మొత్తం 150 డివిజన్లలో టీఆర్ఎస్ 99 సీట్లు గెలుచుకున్న సంగతి తెలిసిందే. ఈ రోజు ఉదయం జీహెచ్ఎంసీ సమావేశం ప్రారంభమైన తర్వాత ప్రిసైడింగ్ అధికారి రాహుల్ బొజ్జా కొత్తగా ఎన్నికైన కార్పొరేటర్ల చేత ప్రమాణ స్వీకారం చేయించారు. కార్పొరేటర్లు నాలుగు భాషల్లో ప్రమాణం చేశారు. అనంతరం మేయర్, డిప్యూటీ మేయర్లను ఎన్నుకున్నారు. మేయర్‌గా చర్లపల్లి కార్పొరేటర్ బొంతు రామ్మోహన్ పేరును వెంకటేశ్వర కాలనీ కార్పొరేటర్ మన్నె కవిత ప్రతిపాదించగా, మీర్ పేట్ కార్పొరేటర్ అంజయ్య బలపరిచారు. మేయర్ పదవికి ఇతరులెవరూ పోటీపడకపోవడంతో రామ్మోహన్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఇక డిప్యూటీ మేయర్‌గా బోరబొండ కార్పొరేటర్ బాబా ఫసియుద్దీన్ పేరును అమీర్ పేట్ కార్పొరేటర్ శేషుకుమారి ప్రతిపాదించగా, రాంనగర్ కార్పొరేటర్ శ్రీనివాసరెడ్డి బలపరిచారు. మేయర్, డిప్యూటీ మేయర్ అభ్యర్థులకు ఎంఐఎం మద్దతు ప్రకటించింది. -
'గ్రేటర్' మేయర్‌గా బొంతు రామ్మోహన్
హైదరాబాద్: జీహెచ్ఎంసీ మేయర్‌గా బొంతు రామ్మోహన్, డిప్యూటీ మేయర్‌గా బాబా ఫసియుద్దీన్ లకు పట్టం కట్టడం ఖాయమైంది. జీహెచ్ఎంసీలోని మొత్తం 150 డివిజన్లలో టీఆర్ఎస్ ఏకంగా 99 స్థానాలు గెలుచుకున్న నేపథ్యంలో... మేయర్, డిప్యూటీ మేయర్ పదవులు రెండూ ఆ పార్టీకే దక్కాయి. చర్లపల్లి డివిజన్ నుంచి కార్పొరేటర్‌గా బొంతు రామ్మోహన్, బోరబండ కార్పొరేటర్ గా ఫసియుద్దీన్ గెలుపొందారు. కార్పొరేటర్లతో కేటీఆర్ ప్రత్యేక భేటీ మున్సిపల్, పట్టణాభివృద్ధి శాఖల బాధ్యతలు కూడా తీసుకున్న మంత్రి కేటీఆర్... టీఆర్ఎస్ కార్పొరేటర్లతో గురువారం ఉదయం 8 గంటలకు తెలంగాణ భవన్లో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పార్టీ ప్రచార బాధ్యతలను భుజాన వేసుకుని అన్నీ తానై వ్యవహరించిన కేటీఆరే మేయర్ ఎన్నికల బాధ్యతను కూడా చూసుకున్నారు. సీఎం కేసీఆర్ మేయర్, డిప్యూటీ మేయర్ పదవులకు పేర్లను ఖరారు చేయగా కార్పొరేటర్ల సమావేశంలో కేటీఆర్ వారి పేర్లను ప్రకటించారు. గ్రేటర్ మేయర్‌గా రామ్మోహన్, డిప్యూటీ మేయర్‌గా బాబా ఫసియుద్దీన్ పేర్లను మంత్రి జగదీష్ రెడ్డి ప్రతిపాదించగా, కార్పొరేటర్లు ఏకగ్రీవంగా ఆమోదం తెలిపారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. ' ౩ నెలల్లో స్టాండింగ్ కమిటీలు ఏర్పాటు చేస్తాం. వచ్చే 3 నెలల్లో జీహెచ్ఎంసీలో పదవులు అన్నీ భర్తీ చేస్తాం. ప్రజలు చారిత్రాత్మక తీర్పునిచ్చారు. ప్రజల సమస్యల పరిష్కారానికి కార్పొరేటర్లు ముందుండాలి' అని అన్నారు. భేటీ తర్వాత కార్పొరేటర్లంతా జీహెచ్ఎంసీ కార్యాలయానికి చేరుకున్నారు. -
‘గ్రేటర్’ మేయర్ బొంతు రామ్మోహన్ ?
- డిప్యూటీ మేయర్‌గా బాబా ఫసియుద్దీన్! - టీఆర్ఎస్ కార్పొరేటర్లతో నేడు మంత్రి కేటీఆర్ ప్రత్యేక భేటీ - ఉదయం 11 గం.కు మేయర్, డిప్యూటీ మేయర్ల ఎన్నిక - ఎక్స్అఫీషియో సహా మొత్తం ఓట్లు 217... - ఇందులో టీఆర్ఎస్కు ఉన్నవి 134 సాక్షి, హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ)పై గులాబీ జెండా గురువారం అధికారికంగా ఎగరనుంది. జీహెచ్ఎంసీ మేయర్, డిప్యూటీ మేయర్ల ఎన్నికకు అధికారులు అన్ని ఏర్పాట్లు సిద్ధం చేశారు. జీహెచ్ఎంసీలోని మొత్తం 150 డివిజన్లలో టీఆర్ఎస్ ఏకంగా 99 స్థానాలు గెలుచుకున్న నేపథ్యంలో... మేయర్, డిప్యూటీ మేయర్ పదవులు రెండూ ఆ పార్టీ చేతుల్లోనే ఉండనున్నాయి. ఈ పదవులు ఎవరిని వరించనున్నాయన్న దానిపై అధికారికంగా ఎలాంటి ప్రకటనా వె లువడలేదు. అయితే పార్టీ వర్గాల సమాచారం మేరకు... చర్లపల్లి డివిజన్ నుంచి కార్పొరేటర్‌గా గెలిచిన బొంతు రామ్మోహన్‌ను మేయర్ పదవికి, బోరబండ కార్పొరేటర్ బాబా ఫసియుద్దీన్‌ను డిప్యూటీ మేయర్ పదవికి దాదాపు ఖరారు చేసినట్లు తెలుస్తోంది. ఈ ఇద్దరి పేర్లను పార్టీ అధ్యక్షుడు అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. గురువారం మేయర్, డిప్యూటీ మేయర్ల ఎన్నిక జరుగనుంది. అంతకంటే ముందు కొత్తగా ఎన్నికైన కార్పొరేటర్లతో ప్రమాణ స్వీకారం చేయిస్తారు. ఉదయం 11 గంటల నుంచి ఈ కార్యక్రమాలు ప్రారంభం కానున్నట్లు హైదరాబాద్ జిల్లా కలెక్టర్ రాహుల్ బొజ్జా తెలిపారు. నేడు కార్పొరేటర్లతో కేటీఆర్ ప్రత్యేక భేటీ మున్సిపల్, పట్టణాభివృద్ధి శాఖల బాధ్యతలు కూడా తీసుకున్న మంత్రి కేటీఆర్... టీఆర్ఎస్ కార్పొరేటర్లతో గురువారం ఉదయం 8 గంటలకు తెలంగాణ భవన్లో ప్రత్యేకంగా భేటీ కానున్నారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పార్టీ ప్రచార బాధ్యతలను భుజాన వేసుకుని అన్నీ తానై వ్యవహరించిన కేటీఆరే మేయర్ ఎన్నికల బాధ్యతను కూడా చూస్తున్నారు. మరోవైపు పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ ఇప్పటికే మేయర్, డిప్యూటీ మేయర్ పదవులకు పేర్లను ఖరారు చేశారని చెబుతున్నారు. గురువారం ఉదయం జరిగే కార్పొరేటర్ల సమావేశంలో వారి పేర్లను ప్రకటించే అవకాశముంది. ఈ భేటీ తర్వాత కార్పొరేటర్లంతా జీహెచ్ఎంసీ కార్యాలయానికి చేరుకుంటారు. పదకొండు గంటలకు జరిగే మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికల్లో పాల్గొంటారు. ఈ ఎన్నికకు సంబంధించి కొత్తగా ఎన్నికైన కార్పొరేటర్లకు టీఆర్ఎస్ బుధవారం విప్ జారీ చేసింది. ఏకగ్రీవమే నూటా యాభై డివిజన్లు ఉన్న జీహెచ్ఎంసీలో సగానికిపైగా అంటే 76 డివిజ న్లను గెలుచుకున్న పార్టీ మేయర్ స్థానానికి సరిపడా మెజారిటీ సాధించినట్లు లెక్క. టీఆర్ఎస్ ఏకంగా 99 డివిజన్లలో గెలుపొందింది. టీడీపీ ఒక స్థానంలో, కాంగ్రెస్ రెండు, బీజేపీ నాలుగు, ఎంఐఎం 44 స్థా నాల్లో గెలుపొందాయి. అంటే టీఆర్ఎస్ మినహా ఏ ఇతర పార్టీ పోటీపడే అవకాశం లేకపోవడంతో మేయర్, డిప్యూటీ మేయర్ పదవులు ఏకగ్రీవమయ్యే అవకాశముంది. ఈ ఎన్నికలో జీహెచ్ఎంసీలో ఎక్స్‌అఫీషి యో సభ్యులుగా ఓట్లున్న ఎమ్మెల్యేలు, ఎం పీలు, రాజ్యసభ సభ్యులు, ఎమ్మెల్సీల ఓట్లు అవసరం ఉండడం లేదు కూడా. అయితే జీహెచ్ఎంసీ పరిధిలో 67 ఎక్స్అఫీషియో సభ్యుల ఓట్లున్నాయి. వారి ఓట్లనూ పరిగణనలోకి తీసుకుంటే మొత్తం 217 ఓట్లు అవుతున్నాయి. టీఆర్ఎస్కే అత్యధికంగా 35 మంది ఎక్స్అఫీషియో సభ్యులున్నారు. వీరినీ కలుపుకొంటే టీఆర్ ఎస్ ఏకంగా 134 ఓట్లతో ఇతర పార్టీలకు అందనంత దూరంలో ఉంది. దీంతో మేయర్, డిప్యూటీ మేయర్ల ఎన్నిక లాంఛనప్రాయమే . -
నేరడ టు జీహెచ్ఎంసీ
హైదరాబాద్ మేయర్‌గా కురవి మండల వాసి రామ్మోహన్ ఎంపికపై జిల్లాలో హర్షాతిరేకాలు మహబూబాబాద్ : ఎందరో ఉద్యమకారులకు జన్మనిచ్చిన వరంగల్ జిల్లా గడ్డపై పుట్టిన మరొకరు ఉన్నత పదవి చేపట్టనున్నారు. జిల్లాలోని కురవి మండలం నేరడలో జన్మించిన బొంతు రామ్మోహన్ గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్(జీహెచ్ఎంసీ) మేయర్‌గా ఎంపికయ్యారు. ఇటీవల జీహెచ్ఎంసీ ఎన్నికలు పూర్తి కాగా, బుధవారం హైదరాబాద్‌లో జరిగిన సమావేశంలో చర్లపల్లి కార్పొరేటర్‌గా గెలిచిన బొంతు రామ్మోహన్‌ను మేయర్‌గా ఎంపిక చేశారు. రాష్ర్ట రాజధాని అయిన హైదరాబాద్ కార్పొరేషన్ మేయర్‌గా జిల్లా వాసి ఎంపిక కావడంపై కురవి, మహబూబాబాద్ మండలాలతో పాటు జిల్లాలో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. కాగా, బొంతు రామ్మోహన్ కార్పొరేటర్‌గా పోటీ చేసిన చర్లపల్లి డివిజన్లో వరంగల్ జెడ్పీ చైర్పర్సన్ గద్దల పద్మ - నర్సింగరావుతో పాటు టీఆర్ఎస్ సీనియర్ నేత పెద్ది సుదర్శన్‌రెడ్డి ప్రచారం చేయడం విశేషం. ఇదీ నేపథ్యం.. కురవి మండలం నేరడకు చెందిన వెంకటయ్య, కమలమ్మ దంపతులకు ఇద్దరు కుమార్తెలు ఉండగా, ఏకైక కుమారుడు రామ్మోహన్. ఒకటి నుంచి ఐదో తరగతి వరకు ఆమనగల్లో చదువుకున్న ఆయన ఆరు నుంచి ఎనిమిదో తరగతి వరకు కురవి మండలం నేరడలో పూర్తి చేశారు. ఆ తర్వాత మానుకోటలోని కంకరబోడ్ హైస్కూల్లో 9వ తరగతి, ఎస్సెస్సీ, జూనియర్ కళాశాలలో ఇంటర్ పూర్తి చేశారు. ఇక జిల్లా కేంద్రంలోని ఆదర్శ కళాశాలలో డిగ్రీ, ఎల్ఎల్బీ చదివిన రామ్మోహన్, ఎంఏ, ఎల్ఎల్ఎం హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీలో చేశారు. హైదరాబాద్ అమీర్‌పేటకు చెందిన జంగాల శ్రీదేవిని వివాహం చేసుకున్న రామ్మోహన్‌కు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. తొలుత ఏబీవీపీలో.. తొలుత ఏబీవీపీలో పనిచేసిన బొంతు రామ్మోహన్ 2002లో టీఆర్ఎస్ యువజన విభాగం రాష్ర్ట అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టారు. ఇక అప్పటి నుంచి టీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌కు నమ్మకస్తుడిగా, పార్టీకి విధేయుడిగా ఉన్న ఆయన క్రియాశీలక నేతగా ఎదిగారు. ప్రస్తుతం జీహెచ్ఎంసీ ఎన్నికల్లో చర్లపల్లి డివిజన్ నుంచి ఆయన కార్పొరేటర్‌గా ఎన్నిక కాగా, పార్టీకి చేసిన సేవలను గుర్తించి మేయర్ అభ్యర్థిగా సీఎం కేసీఆర్ ఎంపిక చేశారు. ఈ విషయం తెలియగానే అటు కురవి, ఇటు మానుకోట మండలాలతో పాటు జిల్లావ్యాప్తంగా పలువురు హర్షం వ్యక్తం చేశారు. ఆయనతో పాటు చదువుకున్న వారు, టీఆర్ఎస్ నాయకులు పలువురు రామ్మోహన్ ఎంపికపై హర్షించారు. మహబూబాబాద్ సబ్ రిజిస్ట్రార్ హరికోట్ల రవి మాట్లాడుతూ రామ్మోహన్‌తో కలిసి తాను ఉస్మానియాలో పీజీ చదువుకున్నానని గుర్తు చేశారు. చదువుకునే సమయంలో విద్యార్థుల సమస్యలపై ఎప్పటికప్పుడు స్పందించేవారని తెలిపారు. టీఆర్ఎస్ పార్టీ పట్టణ కార్యదర్శి గడ్డం అశోక్, నాయకులు భూక్యా ప్రవీణ్, మార్నేని కిరణ్, తదితరులు కూడా ఆయన నియామకం పట్ల హర్షం వ్యక్తం చేశారు. కాగా, మానుకోట పట్టణంలో గురువారం సంబరాలు జరుపుకునేందుకు భారీగా ఏర్పాట్లు చేస్తున్నట్లు నాయకులు తెలిపారు. -
టీఆర్ఎస్ జాబితా మతలబేంటి
హైదరాబాద్ : గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికల్లో ఏ పార్టీకి మెజారిటీ స్థానాలు వస్తాయి. మెజారిటీ వస్తే ఎవరు మేయర్ పీఠాన్ని చేపడుతారు. ఇలాంటి విషయాలపై ఇటు రాజకీయవర్గాల్లో అటు ప్రజల్లో రకరకాల చర్చలు జరుగుతున్నాయి. ఈ చర్చల విషయం ఎలా ఉన్నా టీఆర్ఎస్ తరఫున విడుదల చేసిన జాబితాలపై ఇప్పుడు అన్ని వర్గాల్లో ఆసక్తికరమైన చర్చ దారితీసింది. టీఆర్ఎస్ జాబితాల్లోని ఇద్దరు పేర్లు మేయర్ అభ్యర్థులుగా ప్రచారం జరుగుతోంది. ఈ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల జాబితాను మొదట టీఆర్ఎస్ విడుదల చేసింది. వరుస పరంపరగా అభ్యర్థుల జాబితాలను రిలీజ్ చేయగా.... అలా విడుదల చేసిన జాబితానే తీవ్ర ఆసక్తిని రేకెత్తిస్తోంది. టీఆర్ఎస్ విడుదల చేసిన జాబితాలోని అభ్యర్థులందరి సామాజిక నేపథ్యం గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు. కానీ ఇద్దరు అభ్యర్థుల విషయంలో పార్టీ విడుదల చేసిన జాబితాలో వారి సామాజిక నేపథ్యమేమిటన్నది పొందుపరచలేదు. అదే అంశం ఇప్పుడు కీలక చర్చకు ఆస్కారమిచ్చింది. దీనిపైనే ఇప్పుడు రకరకాల ఊహాగానాలకు తెరలేపింది. చివరి రోజున చెర్లపల్లి డివిజన్ నుంచి అట్టహాసంగా నామినేషన్ దాఖలు చేసిన బొంతు రామ్మోహన్, బంజారాహిల్స్ డివిజన్ నుంచి నామినేషన్ వేసిన గద్వాల్ విజయలక్ష్మి పేరు చివరన బీసీ అని పేర్కొన్నారే గానీ వారి సామాజిక నేపథ్యం వివరించలేదు. అన్ని జాబితాల్లో అభ్యర్థుల సామాజిక నేపథ్యం మొత్తం వివరించి ఈ రెండు పేర్ల విషయంలో ఎందుకు వివరాలివ్వలేదన్నది ప్రశ్న. అలా ఇవ్వకపోవడంతో వారిద్దరిలో ఒకరు మేయర్ అభ్యర్థి అవుతారని, ఆ కారణంగానే సామాజిక నేపథ్యం పొందుపరచలేదన్న ప్రచారం షికార్లు చేస్తోంది. బొంతు రామ్మోహన్ మొదటి నుంచి టీఆర్ఎస్లో కొనసాగుతుండగా, విజయలక్ష్మి టీఆర్ఎస్ నేత, రాజ్యసభ సభ్యుడు కే కేశవరావు కుమార్తె.