కార్పొరేటర్లతో మేయర్ సమీక్ష
హైదరాబాద్: రానున్న వర్షాకాలం నేపథ్యంలో తీసుకోవాల్సిన చర్యలు, ఎస్ఆర్‌డీపీ, డబుల్ బెడ్ రూం, రోడ్ల వెడల్పు, ఎలివేటెడ్ కారిడార్ అంశాలపైన మేయర్ బొంతు రాంమోహన్ సమీక్ష సమావేశం చేపట్టారు. జీహెచ్ఎంసీ ఎల్ బీ నగర్, సరూర్‌నగర్, హయత్ నగర్ సర్కిళ్ల కార్పొరేటర్లు, వార్డు కమిటీ సభ్యులతో కొత్తపేట్‌లోని సాయి గార్డెన్‌లో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ..సరూర్ నగర్ కోదండరామ నగర్ లో డ్రైనేజి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపిస్తామన్నారు.
శారదానగర్ లో డ్రైనుల విస్తరణకు ప్రతిపాదనలు రూపొందించాలని ఆదేశాలిచ్చారు. వనస్థలిపురం రైతు బజార్ వద్దనున్న గుడిసెల స్థలాల్లో డబుల్ బెడ్ రూంల నిర్మాణాలకు వారం రోజుల్లో శంకుస్థాపన చేస్తామని తెలిపారు. హయత్ నగర్, బిఎన్ రెడ్డి డివిజన్లలోని శ్మశాన వాటికలను ఆధునికరణ చేస్తామన్నారు.