పెదబాబూ ఇదేం పని.. పిలిచి అందలమెక్కించిన పార్టీకి వెన్నుపోటా
నేడు టీడీపీలో మేయర్ నూర్జహాన్, పెదబాబు దంపతుల చేరిక
ఆర్థిక ప్రయోజనాలు, మేయర్ పదవి కొనసాగింపు కోసమే..
టీడీపీలో చేరిక కోసం మూడు నెలలుగా వెయిటింగ్
అదే బాటలో ఇడా మాజీ చైర్మన్ బొద్దాని, ఏఎంసీ మాజీ చైర్మన్ మంచెం మైబాబు
మేయర్ తీరుపై నగరంలో సర్వత్రా మండిపాటు
వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో పదవులు అనుభవించిన నేతలు
పదేళ్ల రాజకీయ జీవితం.. ముచ్చటగా మూడు పారీ్టలు.. తెలుగుదేశం పార్టీలో కార్పొరేటర్‌గా గెలిచి మేయర్‌గా ఎన్నిక.. మూడేళ్లకే అప్పటి ఎమ్మెల్యేతో విభేదాలు.. 2019 ఎన్నికలకు ముందు వైఎస్సార్ సీపీలో చేరిక.. వైఎస్సార్ సీపీలోనూ కార్పొరేటర్‌గా గెలిచి మేయర్‌గా ఎన్నిక.. నాలుగేళ్లకు అప్పటి ఎమ్మెల్యేతో విబేధాలు.. మళ్లీ తెలుగుదేశం పారీ్టలో మంగళవారం చేరడం.. ఇదీ ఏలూరు నగర మేయర్ షేక్ నూర్జహాన్ పెదబాబు పొలిటికల్ ప్రొఫైల్. పదవుల కోసం పారీ్టలో చేరడం, మళ్లీ పారీ్టకి వెన్నుపోటు పొడవటం, మళ్లీ ఇంకో పారీ్టలో చేరడం.. షాడో మేయర్ పెదబాబుకు వెన్నతో పెట్టిన విద్యలా మారింది. తాజాగా మంగళవారం ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సమక్షంలో రెండోసారి టీడీపీలో చేరుతున్నారు.
సాక్షి ప్రతినిధి, ఏలూరు: ఏలూరు నగర రాజకీయ సమీకరణాలు మారిపోతున్నాయి. 2019లో హైకోర్టు కేసులతో ఏలూరు కార్పొరేషన్ ఎన్నిక వాయిదా పడి, 2021లో జరిగింది. మొత్తం 50 డివిజన్లకుగాను 47 డివిజన్లలో అప్పటి వైఎస్సార్ సీపీ విజయం సాధించింది. ఎన్నికలకు ముందు టీడీపీని వీడి మేయర్ నూర్జహాన్ దంపతులు వైఎస్సార్ సీపీలో చేరారు. అప్పటి ఎమ్మెల్యే బడేటి బుజ్జితో ఇబ్బందులు, అవమానాలు ఎక్కువగా ఉన్నాయని, టీడీపీలో వేధింపులు బాగా ఉన్నాయని చంద్రబాబునాయుడుకు చెప్పినా పట్టించుకోలేదని, ఇలా రకరకాల కారణాలు చెప్పి పార్టీని వీడి వైఎస్సార్ సీపీలో చేరారు.
బీసీ వర్గానికి చెందిన మహిళ కావడం, రాజకీయంగా నూర్‌బాషా సామాజికవర్గానికి మంచి ప్రాధాన్యం ఇవ్వాలని యోచనతో వైఎస్సార్ సీపీ కార్పొరేటర్‌గా అవకాశం ఇచ్చి రెండో పర్యాయం మేయర్‌గా ఎంపిక చేశారు. వైఎస్సార్ సీపీ అధికారంలో ఉన్నన్ని రోజులూ అంతా బాగానే నడిచింది. ఎన్నికలకు కొద్ది నెలల ముందు నుంచి ఏలూరు మాజీ ఎమ్మెల్యే ఆళ్ల నానితో విబేధాలు ఉన్నాయని అందరికీ చెబుతూ నిత్యం ఆయనతోనే సమావేశాల్లో పాల్గొంటూ ఉండేవారు. కట్ చేస్తే.. ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ ఓటమిపాలు కావడంతో పదవి కోసం తెలుగుదేశం బాట పట్టారు. దీనిపై నగరంలో తీవ్ర చర్చ సాగుతోంది. పదేళ్ల ప్రస్ధానంలో మూడు పారీ్టలు మూడోసారి పార్టీ మారుతున్న లీడర్లు అంటూ ప్రచారం జరుగుతోంది.
కార్పొరేటర్లతో రహస్య భేటీ
‘మంగళవారం టీడీపీలో చేరుతున్నాను.. మీరందరూ కూడా టీడీపీలోకి వస్తే మనకు ఉన్న రెండేళ్ల పదవీకాలం బాగా వాడుకోవచ్చు, అన్ని విధాలుగా ఉపయోగకరంగా ఉంటుంది. లేకపోతే నష్టపోతారు.. వచ్చేవాళ్లు రండి.. తరువాత జరిగే పరిణామాలకు నేనేమి బాధ్యుడిని కాదు’ అంటూ రెండు రోజుల క్రితం తన నివాసంలో కార్పొరేటర్లతో భేటీ నిర్వహించి తన రాజకీయ భవిష్యత్‌ను ప్రకటించడంతో పాటు కార్పొరేటర్లను పరోక్షంగా హెచ్చరించారు. ఇక వైఎస్సార్ సీపీ అధికారంలో ఉండగా రెండు పర్యాయాలు ఏలూరు మార్కెట్ కమిటీ చైర్మన్‌గా మంచెం మైబాబుకు అవకాశం ఇచ్చారు.
అలాగే రాజకీయంగానూ పార్టీ అధిక ప్రాధాన్యం ఇచ్చింది. అధికారం కోల్పోగానే జంపింగ్ నేతల జాబితాలో చేరారు. ఇక మరో నేత ఏలూరు నగర వైఎస్సార్ సీపీ అధ్యక్షులు బొద్దాని శ్రీనివాస్ కుమార్తెకు పార్టీ అధికారంలోకి రాగానే కార్పొరేటర్‌గా అవకాశం ఇవ్వడం, అలాగే స్మార్ట్ సిటీ చైర్మన్‌గా నియమించారు. సాంకేతిక కారణాలతో స్మార్ట్ సిటీ రద్దయిన క్రమంలో ఇడా చైర్మన్‌గా బొద్దాని శ్రీనివాస్‌కు అవకాశం కలి ్పంచారు. నామినేట్ పదవితో పాటు ఐదేళ్ల పాటు నగర పార్టీ అధ్యక్షుడిగా ప్రాధాన్యం ఇచ్చినా ఆర్థిక ప్రయోజనాల కోసం టీడీపీ బాటపట్టారు. మంగళవారం మేయర్ దంపతులతో పాటు బొద్దాని శ్రీనివాస్, మంచెం మైబాబులు టీడీపీలో చేరనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment