
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ హక్కులకోసం మాట్లాడలేని కాంగ్రెస్ నేతలు దద్దమ్మలని నగర మేయర్ బొంతు రామ్మోహన్, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు విమర్శించారు. సోమవారం వారు ఇక్కడ విలేకరులతో మాట్లాడుతూ, ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ కమిటీ తీసుకున్న నిర్ణయంతో రాష్ట్రంలో పరిశ్రమల ఏర్పాటుకు ఇబ్బందులు వస్తాయన్నారు.
ఏపీకి హోదా, పరిశ్రమలకు రాయితీలు ఇస్తే తెలంగాణ పరిస్థితి ఏమిటని ప్రశ్నిం చారు. మంత్రి కేటీఆర్‌పై రూపొందించిన పాటల సీడీని వారు ఆవిష్కరించారు.
Comments
Please login to add a commentAdd a comment