
సాక్షి, హైదరాబాద్: డబుల్ బెడ్ రూం ఇళ్ల నిర్మాణాన్ని తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుందని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. హైదరాబాద్‌లో డబుల్ బెడ్‌రూం ఇళ్ల నిర్మాణ కార్యక్రమంపై బుధవారం ఆయన ప్రశాంత్‌రెడ్డిలు ఉన్నత స్థాయితో సమీక్ష సమావేశంచ నిర్వహించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. హైదరాబాద్ నగరంలో ఇప్పటికే చాలా చోట్ల 80 శాతానికిపైడా నిర్మాణాలు పుర్తయ్యాయని తెలిపారు. (ఆకలి తీర్చిన అన్నపూర్ణ: కేటీఆర్ )
కొన్ని చొట్ల లబ్ధిదారులకు డబుల్ బెడ్ రూం ఇళ్ల పంపిణీ చేయడం జరిగిందని చెప్పారు. త్వరలోనే మిగితా నిర్మాణాలను కూడా పూర్తి చేసి లబ్థిదారులకు అందించే ప్రయత్నం చేస్తామని ఆయన చెప్పారు. మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల కేంద్రంలో నిర్వహించిన ఈ సమావేశంలో పురపాలక శాఖ ఉన్నతాధికారులు, హౌసింగ్ శాఖ ఉన్నతాధికారులు, వర్కింగ్ ఏజెన్సీలతో పాటు మంత్రులు మంత్రులు మహముద్ అలీ, తలసాని శ్రీనివాస్ యాదవ్, మల్లారెడ్డి, నగరమేయర్ బోంతు రామ్మోహన్‌లు తదితరలు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment