Mahamud Ali
-
డబుల్ బెడ్రూం నిర్మాణాలపై కేటీఆర్ సమీక్ష
సాక్షి, హైదరాబాద్: డబుల్ బెడ్ రూం ఇళ్ల నిర్మాణాన్ని తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుందని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. హైదరాబాద్‌లో డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణ కార్యక్రమంపై బుధవారం ఆయన ప్రశాంత్‌రెడ్డిలు ఉన్నత స్థాయితో సమీక్ష సమావేశంచ నిర్వహించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. హైదరాబాద్ నగరంలో ఇప్పటికే చాలా చోట్ల 80 శాతానికిపైడా నిర్మాణాలు పుర్తయ్యాయని తెలిపారు. (ఆకలి తీర్చిన అన్నపూర్ణ: కేటీఆర్ ) కొన్ని చొట్ల లబ్ధిదారులకు డబుల్ బెడ్ రూం ఇళ్ల పంపిణీ చేయడం జరిగిందని చెప్పారు. త్వరలోనే మిగితా నిర్మాణాలను కూడా పూర్తి చేసి లబ్థిదారులకు అందించే ప్రయత్నం చేస్తామని ఆయన చెప్పారు. మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల కేంద్రంలో నిర్వహించిన ఈ సమావేశంలో పురపాలక శాఖ ఉన్నతాధికారులు, హౌసింగ్ శాఖ ఉన్నతాధికారులు, వర్కింగ్ ఏజెన్సీలతో పాటు మంత్రులు మంత్రులు మహముద్ అలీ, తలసాని శ్రీనివాస్ యాదవ్, మల్లారెడ్డి, నగరమేయర్ బోంతు రామ్మోహన్‌లు తదితరలు పాల్గొన్నారు. -
జహంగీర్ పీర్ దర్గా సందర్శించిన కేసీఆర్
సాక్షి, హైదరాబాద్ : శంషాబాద్ సమీపంలోని జహంగీర్ పీర్ దర్గాను తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ శుక్రవారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన దర్గాలో ప్రత్యేక ప్రార్థనలు చేసి, మొక్కు చెల్లించుకున్నారు. కాగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే దర్గాకు వచ్చి దర్గాను సందర్శించి, మొక్కు చెల్లించుకుంటానని కేసీఆర్ మొక్కుకున్నారు. ఈ మేరకు ఆయన ఇవాళ జహంగీర్ పీర్ దర్గాను సందర్శించారు. కేసీఆర్ వెంట డిప్యూటీ సీఎం మహముద్ అలీ ఉన్నారు. -
అమిత్ షా చెప్పినవన్నీ అబద్ధాలే
రాష్ట్ర ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ ధ్వజం కేంద్రం ఇచ్చింది ముష్టి రూ. 36 వేల కోట్లు రూ. 90 వేల కోట్లు ఇచ్చినట్లు తప్పుడు ప్రచారం సాక్షి, హైదరాబాద్: బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షాపై టీఆర్ఎస్ విరుచుకుపడింది. ఆయన అబద్ధాలను ప్రచారం చేస్తున్నారని ధ్వజమెత్తింది. తెలంగాణకు కేంద్రం ఈ రెండేళ్లలో ముష్టి రూ.36 వేల కోట్లు విదిల్చగా, రూ.90 వేల కోట్లు ఇచ్చినట్లు బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా తప్పుడు ప్రచారం చేస్తున్నారని రాష్ట్ర ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ మండిపడ్డారు. తెలంగాణకు చాలా సాయం చేస్తున్నామని, తామిచ్చిన డబ్బు ప్రజలకు చేరడం లేదని అమిత్ షా అబద్ధాలు చెబుతున్నారని ధ్వజమెత్తారు. డిప్యూటీ సీఎం మహమూద్ అలీ, ఎమ్మెల్యే రసమయి బాలకిషన్, ఎమ్మెల్సీ రాములునాయక్‌లతో కలసి ఆయన శనివారం టీఆర్ఎస్ఎల్పీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రాలు కేంద్రం వద్ద భిక్షమెత్తుకోవని, కేంద్ర ప్రభుత్వ ఆర్థికశక్తి ఆకాశం నుంచి ఊడిపడలేదని ధ్వజమెత్తారు. రాష్ట్రాలే వివిధ పన్నుల రూపంలో వేల కోట్ల రూపాయలను కేంద్రానికి చెల్లిస్తున్న విషయం మరిచిపోవద్దన్నారు. కేంద్రం నుంచి తెలంగాణకు 2014-15లో సీఎస్ఎస్ కింద రూ.5,028 కోట్లు, సెంట్రల్ ట్యాక్స్ కింద రూ. 8,189 కోట్లు, ఎన్డీఆర్ఎఫ్ కింద రూ.19 కోట్లు, ఫైనాన్స్ కమిషన్ ద్వారా రూ.2,110 కోట్లు మొత్తంగా రూ.15,345 కోట్లు వచ్చాయని, ఇవే పద్దుల కింద 2015-16లో రూ.19,944 కోట్లు విడుదల చేశారని మంత్రి చెప్పారు. ఈ రెండేళ్లలో రూ.35,289 కోట్లు మాత్రమే అందాయన్నారు. వాస్తవాలు ఇలా ఉండగా, అవాస్తవాలు మాట్లాడడం ఓ పార్టీ జాతీయ అధ్యక్షుడి స్థాయి నేతకు తగదని హితవు పలికారు. రెండేళ్లలో రాష్ట్రంలో బీజేపీ ఎక్కడా ఆదరణ పొందలేకపోయిందని, చివరకు జీహెచ్ఎంసీ పరిధిలో ఐదుగురు ఎమ్మెల్యేలు ఉన్నా కార్పొరేటర్లను గెలిపించుకోలేకపోయిందని ఎద్దేవా చేశారు. ఒకవైపు బీజేపీకి చెందిన కేంద్రమంత్రులు, ప్రధానమంత్రి తెలంగాణ ప్రభుత్వాన్ని, పథకాలను మెచ్చుకుంటుండగా, మరోవైపు ఆ పార్టీ అధ్యక్షుడు విమర్శలకు దిగడం ఆ పార్టీ రెండు నాల్కల ధోరణకి అద్దం పడుతోందన్నారు. భారీ మెజారిటీ తో కేంద్రంలో బీజేపీకి అధికారం అప్పగిస్తే చేసిందేమిటని ఈటల ప్రశ్నించారు. ప్రధాని విదేశాల్లో విహరించడం తప్ప దేశ ప్రజల మనసులు దోచుకునే విధంగా ఒక్క పథకాన్ని కూడా ప్రవేశపెట్టలేకపోయారని విమర్శించారు. అంగన్వాడీలకు యూపీఏ ప్రభుత్వ హయాంలో రూ.15,800 కోట్లు కేటాయిస్తే, ప్రస్తుత ఎన్డీయే ప్రభుత్వం కేవలం రూ.8 వేల కోట్లకు కుదించిన విషయం వాస్తవం కాదా అని నిలదీశారు. ఇలాంటి చర్యలతో తాము పేదల పక్షంకాదని, కార్పొరేట్ వర్గాల పక్షమని ఎన్డీయే సర్కారు నిరూపించుకుందన్నారు. ‘‘కేంద్రం సాయం చేయకున్నా ఫర్వాలేదు. మా కాళ్లలో కట్టె పెట్టే చర్యలు ఆపండి.’’ అని ఈటల పేర్కొన్నారు. బీజేపీవి ఉల్టా పల్టా మాటలు: మహమూద్ అలీ బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా సూర్యాపేట సభలో ఉల్టా పల్టా మాటలు మాట్లాడారని డిప్యూటీ సీఎం మహమూద్ అలీ విమర్శించారు. ఈ రెండేళ్లలో కేంద్రం తెలంగాణకు మద్దతుగా నిలవలేదన్నారు. కరువు సాయం కింద రూ.3 వేల కోట్లు ఇవ్వాలని రాష్ట్రం కోరితే కేంద్రం రూ.700 కోట్లు కూడా ఇవ్వలేదన్నారు. విదేశాల్లో తిరిగే ప్రధాని మోదీకి పేదల కష్టాలు ఏం తెలుసని ప్రశ్నించారు. తెలంగాణకు ఐఎఎస్ అధికారులను కేటాయించకుండా ఇబ్బందుల పాలు చేసింది కేంద్రం కాదా అని నిలదీశారు. -
ఇరాక్‌లో 600 మంది తెలంగాణవాసులు
ఢిల్లీ/హైదరాబాద్: ఇరాక్‌లో ఉన్న 600 మంది భారతీయుల యోగక్షేమాలను తెలుసుకోవడానికి భారత విదేశాంగ శాఖ ప్రయత్నాలు చేస్తోంది. ఇరాక్‌లో అంతర్యుద్ధం జరుగుతున్న సంగతి తెలిసిందే. చమురు సంపద పుష్కలంగా ఉన్న ఇరాక్‌లోని మోసుల్ నగరంలోని ఒక కన్స్ట్రక్షన్ ప్రాజెక్టులో పనిచేస్తున్న 40 మంది భారతీయులు జాడ తెలియడం లేదు. వారిని ఎఎస్ఐఎస్ తిరుగుబాటుదారులు తీసుకువెళ్లి ఉంటారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఐఎస్ఐఎస్కు, కుర్ద్‌లకు మధ్య జరుగుతున్న యుద్ధానికి మోసుల్ ప్రధాన కేంద్రం అయింది. ఇక్కడ నుంచి ప్రజలను ఖాళీ చేయించే సమయంలో చాలా మంది కార్మికులతో అధికారులకు సంబంధాలు తెగిపోయాయి. కుర్ద్‌ల ప్రాబల్యం ఉండే ఈ ప్రాంతాన్ని ఐఎస్ఐఎస్ ఆక్రమించింది. ఆ తరువాత భారత కార్మికుల జాడతెలియలేదు. అయితే భారత విదేశీ వ్యవహారాల శాఖ వద్ద ఎటువంటి సమాచారంలేదు. మోసూల్‌లో అభద్రత మధ్య 40 మంది భారతీయులు ఉన్నట్లు తెలుస్తోంది. వారి యోగక్షేమాలు తమకు తెలియదని విదేశాంగ శాఖ చెబుతోంది. భారత రాయబారి సురేష్‌రెడ్డి హుటాహుటిన ఇరాక్‌కు బయలుదేరారు. ఢిల్లీలో విదేశీవ్యవహారాల మంత్రి శాఖ కంట్రోల్ రూమ్ ఫోన్ నంబర్లు: +91 11 2301 2113 +91 11 2301 7905 +91 11 2301 4104 Email: controlroom@mea.gov.in బాగ్దాద్‌లోని భారత దౌత్య కార్యాలయం : +964 770 444 4899 +964 770 484 3247 తెలంగాణ వాసుల వివరాలు సేకరణ: డిప్యూటీ సిఎం అలీ హైదరాబాద్: ఇరాక్‌లో ఉన్న తెలంగాణ వాసుల వివరాలు సేకరిస్తున్నట్లు తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ చెప్పారు. ఇప్పటివరకు 600 మంది తెలంగాణ వాసులు ఇరాక్‌లో ఉన్నట్టు గుర్తించినట్లు తెలిపారు. ఇరాక్‌లో ఉన్నవారి కోసం ఎప్పటికప్పుడు ముఖ్యమంత్రి కెసిఆర్ ఎప్పటికప్పుడు కేంద్రంతో సంప్రదింపులు జరుపుతున్నట్లు అలీ చెప్పారు. తెలంగాణవారిని క్షేమంగా తీసుకువస్తాం: కెటిఆర్ కరీంనగర్: ఇరాక్‌లో ఉన్న తెలంగాణవారిని క్షేమంగా తీసుకొస్తామని మంత్రి కేటీఆర్ హామీ ఇచ్చారు. సిరిసిల్ల నియోజకవర్గంలోని ప్రతిగ్రామానికి శాశ్వత మంచినీటిని అందించడానికి కృషిచేస్తామని చెప్పారు. ఇసుక అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపాలని అధికారులను ఆదేశిస్తున్నట్లు తెలిపారు. సిరిసిల్లను పంచాయతీరాజ్ కేంద్రంగా మార్చాలని అధికారులకు సూచించామని కెటిఆర్ చెప్పారు.